India womens team
-
భారత హాకీ జట్లకు మిశ్రమ ఫలితాలు
భువనేశ్వర్: అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్‌ల్లో భారత జట్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ముందుగా భారత మహిళల జట్టు ‘షూటౌట్’లో 1–2తో ఇంగ్లండ్ జట్టు చేతిలో ఓడిపోగా... అనంతరం భారత పురుషుల జట్టు 2–0 గోల్స్ తేడాతో స్పెయిన్ జట్టుపై విజయం సాధించింది. భారత జట్టు తరఫున మన్దీప్ సింగ్ (32వ నిమిషంలో), దిల్‌ప్రీత్ సింగ్ (39వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు. ఇంగ్లండ్–భారత్ మహిళల జట్ల మధ్య మ్యాచ్‌లో నిర్ణీత సమయం ముగిశాక రెండు జట్లు 2–2తో సమంగా నిలిచాయి. భారత్ తరఫున నవ్‌నీత్ కౌర్ (53వ నిమిషంలో), రుతుజా (57వ నిమిషంలో)... ఇంగ్లండ్ తరఫున పెయిజ్ గిలోట్ (40వ నిమిషంలో), టెసా హొవార్డ్ (56వ నిమిషంలో) ఒక్కో గోల్ నమోదు చేశారు. విజేతను నిర్ణయించేందుకు ‘షూటౌట్’ నిర్వహించారు. తొలి ఐదు షాట్లు ముగిశాక రెండు జట్లు 1–1తో సమంగా నిలిచాయి. ఆ తర్వాత ఆరో షాట్లో రెండు జట్ల క్రీడాకారిణులు విఫలమయ్యారు. ఏడో షాట్లో భారత ప్లేయర్ లాల్రెమ్సియామి గురి తప్పగా... ఇంగ్లండ్ ప్లేయర్ సోఫీ హామిల్టన్ బంతిని లక్ష్యానికి చేర్చడంతో భారత్‌కు ఓటమి ఖరారైంది. -
వన్డే సమరం!
భారత్, ఐర్లాండ్ మహిళా క్రికెట్ జట్ల మధ్య 1993 నుంచి ఇప్పటి వరకు 12 వన్డేలు జరిగాయి. వీటన్నింటిలోనూ భారతే గెలవగా, ఐర్లాండ్‌కు ఒక్క గెలుపు కూడా దక్కలేదు. ఈ మ్యాచ్‌లన్నీ ఐసీసీ టోర్నీల్లో భాగంగానే నిర్వహించారు ఒక్కసారి కూడా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగలేదు. ఇప్పుడు 32 ఏళ్ల తర్వాత మూడు మ్యాచ్‌ల సిరీస్‌తో ద్వైపాక్షిక పోరుకు రంగం సిద్ధమైంది. అద్భుత ఫామ్‌లో ఉన్న భారత జట్టు సొంతగడ్డపై మరో సిరీస్‌ను గెలుచుకోవాలని పట్టుదలగా ఉండగా... ఐర్లాండ్ ఏమాత్రం పోటీనిస్తుందనేది ఆసక్తికరం. రాజ్‌కోట్: స్వదేశంలో ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్ సన్నాహాల్లో భాగంగా భారత మహిళల జట్టు దేశంలోని వేర్వేరు వేదికలపై సిరీస్‌లు ఆడుతోంది. దక్షిణాఫ్రికాతో బెంగళూరులో, న్యూజిలాండ్‌తో అహ్మదాబాద్‌లో, వెస్టిండీస్‌తో వడోదరలో ఆడిన జట్టు ఇప్పుడు మరో కొత్త వేదిక రాజ్‌కోట్‌లో ఐర్లాండ్‌తో తలపడుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు జరిగే తొలి వన్డేలో ఐర్లాండ్‌తో భారత మహిళల జట్టు ఆడనుంది. ప్రస్తుతం ఇరు జట్ల బలబలాలు చూస్తే భారత్ సంపూర్ణ ఆధిక్యంలో కనిపిస్తోంది. తొలి మ్యాచ్ గెలిచి సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లాలని జట్టు పట్టుదలగా ఉంది. కొత్త ప్లేయర్లకు అవకాశం... రెగ్యులర్ కెపె్టన్ హర్మన్‌ప్రీత్‌కు విశ్రాంతినివ్వడంతో స్మృతి మంధాన నాయకత్వంలో భారత జట్టు బరిలోకి దిగుతోంది. స్మృతి వన్డేల్లో గతంలో ఒకే ఒక మ్యాచ్‌లో కెపె్టన్‌గా వ్యవహరించింది. టాప్ పేసర్ రేణుకా సింగ్ లేకపోవడంతో కాస్త అనుభవం తక్కువ ఉన్న ప్లేయర్లతోనే ఆమె ఫలితాలు రాబట్టాల్సి ఉంది. అయితే కొత్త ప్లేయర్లను మరింతగా పరీక్షించేందుకు ఈ సిరీస్ ఉపయోగపడనుంది. హర్మన్ స్థానంలో రాఘ్వీ బిస్త్ వన్డేల్లో అరంగేట్రం చేయనుంది. మహిళల దేశవాళీ వన్డే టోర్నీలో ఉత్తరాఖండ్ ఫైనల్ చేరడంలో కీలకపాత్ర పోషించిన రాఘ్వీ భారత్ ‘ఎ’ తరఫున ఆసీస్ ‘ఎ’ తో జరిగిన మూడు వన్డేల్లో వరుసగా మూడు అర్ధ సెంచరీలు చేసింది. రేణుక, పూజ వస్త్రకర్తో పాటు అరుంధతి రెడ్డి కూడా జట్టులో లేకపోవడంతో టిటాస్ సాధు, సైమా ఠాకూర్లపై పేస్ బౌలింగ్ భారం ఉంది. ఆల్‌రౌండర్ కావాలంటే సయాలీ సత్ఘరే అందుబాటులో ఉండగా... దీప్తి శర్మ, ప్రియా మిశ్రాకు తోడుగా తుది జట్టులో మరో స్పిన్నర్ కావాలంటే తనూజ కన్వర్‌కు అవకాశం దక్కవచ్చు. అయితే సైమా, సాధు, ప్రియా కలిపి మొత్తం 20 వన్డేలు కూడా ఆడలేదు. ఓపెనర్‌గా తన స్థానం సుస్ధిరం చేసుకునేందుకు ప్రతీక రావల్‌కు ఇది మంచి అవకాశం. ఎందుకంటే జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత షఫాలీ వర్మ మరోవైపు దేశవాళీ క్రికెట్లో చెలరేగిపోతోంది. సీనియర్ వన్డే ట్రోఫీలో 527 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన ఆమె వన్డే చాలెంజర్ ట్రోఫీలో కూడా ఇప్పటికే ఆడిన రెండు మ్యాచ్‌లలో మెరుపు వేగంతో రెండు అర్ధసెంచరీలు సాధించింది. ఈ నేపథ్యంలో ప్రతీక ఆ స్థాయి దూకుడును చూపించాల్సి ఉంది. మరో ఓపెనర్‌గా స్మృతి సూపర్ ఫామ్‌లో ఉండటం భారత్‌కు సానుకూలాంశం. హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్‌లపై భారత బ్యాటింగ్ బలం ఆధారపడి ఉంది. ఆల్‌రౌండర్లే బలం... గాబీ లూయిస్ సారథ్యంలో ఐర్లాండ్ ఈ సిరీస్‌కు సన్నద్ధమైంది. ఈ టీమ్‌లో కూడా కొందరు అనుభవజు్ఞలతో పాటు ఎక్కువ మంది యువ ప్లేయర్లు ఉన్నారు. 2024లో జింబాబ్వే, శ్రీలంకలపై వన్డే సిరీస్‌లు నెగ్గిన ఐర్లాండ్... ఇంగ్లండ్, బంగ్లాదేశ్ చేతిలో సిరీస్‌లు కోల్పోయింది. అయితే ఇంగ్లండ్‌పై 23 ఏళ్ల తర్వాత తొలిసారి ఒక వన్డే మ్యాచ్‌లో గెలవగలిగింది. ఐర్లాండ్ టీమ్‌లో ఒర్లా ప్రెండర్ఘాస్ట్ కీలక ప్లేయర్‌గా ఎదిగింది. ఆల్‌రౌండర్‌గా గత ఏడాది జట్టు తరఫున అత్యధిక పరుగులు చేయడంతో పాటు 9 వికెట్లు పడగొట్టింది. శ్రీలంకపై చేసిన సెంచరీ ఆమె సత్తాను చూపించింది. మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో ఆమెకు మంచి అనుభవం ఉంది. మరో ఆల్‌రౌండర్ లౌరా డెలానీ, లెఫ్టార్మ్ స్పిన్నర్ ఎయిమీ మగ్వైర్, జొవానా లాఫ్రన్ టీమ్‌లో ఇతర ప్రధాన ప్లేయర్లు. అయితే గత కొంతకాలంగా సంచలన ఆటతో 19 ఏళ్ల ఐర్లాండ్ స్టార్‌గా ఎదిగిన ఎమీ హంటర్ గాయంతో ఈ సిరీస్‌కు దూరం కావడం జట్టును కాస్త బలహీనపర్చింది. -
భారత్ జోరుకు ఎదురుందా!
వడోదర: కరీబియన్ జట్టుపై వరుసగా మరో సిరీస్ నెగ్గేందుకు భారత మహిళల జట్టు సిద్ధమైంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆదివారం తొలి వన్డే జరుగుతుంది. ముంబైలో జరిగిన టి20 సిరీస్‌లో రెండు మ్యాచ్‌లకు రెగ్యులర్ కెపె్టన్, కీలకమైన మిడిలార్డర్ బ్యాటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ లేకపోయినా స్మృతి మంధాన నేతృత్వంలో జట్టు విజేతగా నిలిచింది. ముఖ్యంగా బ్యాటింగ్ ఆర్డర్ పటిష్టంగా మారడం జట్టుకు కలిసొచ్చే అంశం. అయితే మోకాలు గాయంతో సతమతమవుతున్న హర్మన్ ప్రీత్ ఫిట్నెస్ జట్టును కాస్త కలవరపెడుతోంది. 50 ఓవర్ల మ్యాచ్‌ల్లో మిడిలార్డర్ పాత్ర చాలా కీలకం. కాబట్టి ఆమె అందుబాటులోకి వస్తే జట్టుకు లాభిస్తుంది. 2017లో ఇరు జట్ల మధ్య జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో భారత మహిళల జట్టు 4–1తో వెస్టిండీస్‌ను కంగుతినిపించింది. అయితే అప్పటికీ ఇప్పటికి చాలా మారింది. ప్రస్తుత జట్ల బలాబలాల విషయానికొస్తే... సొంతగడ్డపై పొట్టి ఫార్మాట్లో భారత్ జట్టు గర్జించింది. వన్డే ఫార్మాట్లోనూ ఇదే జోరు కనబరిచేందుకు తహతహలాడుతోంది. స్టార్ ఓపెనర్, తాత్కాలిక కెప్టెన్ స్మృతి వరుస మూడు మ్యాచ్‌ల్లో అర్ధసెంచరీలతో అదరగొట్టింది. జెమీమా రోడ్రిగ్స్ నిలకడగా రాణిస్తుండగా, హిట్టర్ రిచా ఘోష్ ఆఖరి టి20లో మెరుపు ఫిఫ్టీతో విండీస్ బౌలర్ల భరతం పట్టింది. ఈ త్రయం ఫామ్ ఇలాగే కొనసాగితే భారత్‌కు ఏ బెంగా ఉండదు. మిడిలార్డర్లో తేజల్ హసబి్నస్, హర్లిన్ డియోల్ జట్టును నడిపించగలరు. బౌలింగ్‌లో దీప్తిశర్మ, రేణుక సింగ్, సైమా ఠాకూర్లు ప్రభావం చూపిస్తున్నారు. యువ పేసర్ టైటస్ సాధు ఫీల్డింగ్‌లో కనిపించే చురుకుదనం ప్రత్యర్థి పరుగుల్ని నిరోధిస్తోంది. మరోవైపు ప్రత్యర్థి వెస్టిండీస్ దెబ్బతిన్న పులిలా ఉంది. టి20ల్లో కోల్పోయిన సిరీస్‌ను వన్డేల్లో రాబట్టుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది. కెపె్టన్ హేలీ మాథ్యూస్ వెటరన్ బ్యాటర్స్ డియాండ్రా డాటిన్, షెమైన్ క్యాంప్‌బెల్ నిలకడగా ఆడితే భారత్‌కు కష్టాలు తప్పవు. బౌలింగ్‌లో హెన్రీ, ఫ్లెచర్, కరిష్మా రమ్హారక్, జైదా జేమ్స్ ప్రభావం చూపగలరు. తుది జట్లు (అంచనా) భారత్ మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన, ఉమా ఛెత్రి, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, హర్లిన్ డియోల్, తేజల్ హసబ్నిస్, దీప్తి శర్మ, రేణుక, సైమా ఠాకూర్, మిన్ను మణి. వెస్టిండీస్ మహిళల జట్టు: హేలీ మాథ్యూస్ (కెప్టెన్), క్వియానా జోసెఫ్, డియాండ్రా, షెమైన్ క్యాంప్‌బెల్, నెరిసా క్రాఫ్టన్, హెన్రీ, ఆలియా అలిన్, అఫీ ఫ్లెచర్, షబిక, జైదా జేమ్స్, కరిష్మా. -
సిరీస్ సొంతం చేసుకోవాలని...
ముంబై: భారత్, వెస్టిండీస్ మహిళల జట్ల మధ్య గురువారం నిర్ణయాత్మక మూడో టి20 మ్యాచ్ జరగనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి టి20లో భారత్ విజయం సాధించగా... రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్ గెలిచి 1–1తో లెక్క సరిచేసింది. తొలి టి20లో బ్యాటర్లు దంచికొట్టడంతో భారీ స్కోరు చేసిన టీమిండియా... రెండో మ్యాచ్‌లో అదే జోరు కొనసాగించలేకపోయింది. గత మ్యాచ్‌కు అందుబాటులో లేకపోయిన భారత రెగ్యులర్ కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగడం కూడా సందేహమే. ఈ నేపథ్యంలో మరోసారి స్మృతి మంధాన జట్టును నడిపించనుంది. బ్యాటింగ్‌లో స్మృతి రాణిస్తున్నా... ఆమెతో పాటు ఇతర ప్లేయర్లు కూడా సత్తా చాటాల్సిన అవసరముంది. ఈ సిరీస్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ అర్ధశతకాలు సాధించిన స్మృతి అదే ఫామ్ కొనసాగించాలని మేనేజ్మెంట్ ఆశిస్తుండగా... జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, ఉమా ఛెత్రి, దీప్తి శర్మ నిలకడ ప్రదర్శించాల్సిన అవసరముంది. బౌలింగ్‌లో అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తోంది. గత మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు విజృంభిస్తుంటే... మన బౌలర్లు వారిని అడ్డుకోవడంలో విఫలమయ్యారు. సీనియర్లు దీప్తి శర్మ, రాధ యాదవ్, రేణుక సింగ్‌తో పాటు యంగ్‌ప్లేయర్లు సైమా ఠాకూర్, సజీవన్ సజన, టిటాస్ సాధు సమష్టిగా సత్తా చాటాల్సిన అవసరముంది. మరోవైపు రెండో టి20లో విజయంతో ఫుల్ జోష్‌లో ఉన్న వెస్టిండీస్ అదే ఊపు కొనసాగించాలని భావిస్తోంది. ఈ ఫార్మాట్లో భారత్ చేతిలో వరుసగా తొమ్మిది పరాజయాల తర్వాత గత మ్యాచ్‌లో విజయం సాధించిన కరీబియన్ జట్టు సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. ముఖ్యంగా కెప్టెన్ హేలీ మాథ్యూస్, క్యాంప్‌బెల్, డాటిన్ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. గత మ్యాచ్‌లో కరీబియన్ ప్లేయర్లు భారత బౌలింగ్‌ను ఓ ఆటాడుకున్నారు. 150 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 26 బంతులు మిగిలుండగానే పూర్తి చేశారు. సిరీస్ సొంతం చేసుకోవాలంటే కరీబియన్ హిట్టర్ల దూకుడును భారత్ అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. -
మహిళ జట్టు సత్తా చాటేనా!
ముంబై: ఆ్రస్టేలియా చేతిలో మూడు వన్డేల సిరీస్‌లో వైట్‌వాష్ అయిన భారత మహిళల క్రికెట్ జట్టు ఐదు రోజుల వ్యవధిలోనే మరో ద్వైపాక్షిక సిరీస్‌కు సిద్ధమైంది. భారత్ పర్యటనకు వ చ్చిన వెస్టిండీస్ అమ్మాయిల జట్టుతో సొంతగడ్డపై నెగ్గే ప్రయత్నంలో సాధన చేస్తోంది. రెండు పరిమిత ఓవర్ల సిరీస్‌లలో ముందుగా భారత్, విండీస్ జట్ల మధ్య నేడు తొలి టి20 జరగనుంది. జట్టులో కొరవడిన నిలకడ, అనుభవజ్ఞుల బాధ్యతా రాహిత్యం, బ్యాటర్ల ఫామ్ లేమి హర్మన్‌ప్రీత్ సేనను కలవరపెడుతోంది. స్టార్ ఓపెనర్, వైస్ కెపె్టన్ స్మృతి మంధాన చాన్నాళ్ల తర్వాత సెంచరీతో టచ్‌లోకి వచ్చిoది. అయితే ఈ ఫామ్ ఇకపై కొనసాగిస్తుందో లేదో కరీబియన్‌తో జరిగే ద్వైపాక్షిక సిరీస్‌లలో తెలుస్తుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ మాత్రం వరుసగా విఫలం కావడం జట్టుపై ప్రభావం చూపిస్తోంది. వరల్డ్ కప్ తర్వాత భారత జట్టు ఆడనున్న తొలి టి20 సిరీస్ ఇదే కానుంది. ఆ్రస్టేలియా లాంటి పటిష్టమైన జట్టుతో జరిగిన చివరి వన్డేలో 4 వికెట్లతో చెలరేగినా... హైదరాబాదీ పేసర్ అరుంధతి రెడ్డి జట్టులో స్థానం కోల్పోయింది. ఆతిథ్య జట్టు పరిస్థితి ఇలా ఉంటే వెస్టిండీస్ అమ్మాయిల జట్టు మనకంటే మెరుగనే చెప్పవచ్చు. బ్యాటింగ్‌లో కెపె్టన్ హేలీ మాథ్యూస్, క్వియానా జోసెఫ్, డియాండ్రా డాటిన్, షెమైన్ క్యాంప్‌బెల్ ఫామ్‌లో ఉన్నారు. ఈ ఏడాది టి20 ఫార్మాట్లో కరీబియన్ టీమ్ 13 మ్యాచ్‌లాడితే తొమ్మిది మ్యాచ్‌ల్లో గెలిచింది. అయితే నవంబర్ 2019నుంచి భారత్, విండీస్ మహిళల జట్ల మధ్య ఎనిమిది టి20లు జరిగితే అన్నింటిలో భారతే విజయం సాధించడం విశేషం. జట్లు (అంచనా) భారత మహిళల జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన, నందిని కశ్యప్, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, దీప్తిశర్మ, రేణుక, ప్రియా మిశ్రా, సైమా ఠాకూర్, మిన్ను మణి, రాధా యాదవ్. వెస్టిండీస్ మహిళల జట్టు: హేలీ మాథ్యూస్ (కెప్టెన్ ), షెమైన్ క్యాంప్‌బెల్, ఆలియా అలెన్, షమిలియా కానెల్, డియాండ్ర డాటిన్, అఫి ఫ్లెచర్, నెరిసా, క్వియానా జోసెఫ్, హెన్రీ, జైదా జేమ్స్, కరిష్మా రమ్హారక్. -
క్లీన్‌స్వీప్ తప్పించుకోవాలని...
పెర్త్: ఇప్పటికే ఆ్రస్టేలియా చేతిలో వన్డే సిరీస్ కోల్పోయిన భారత మహిళల జట్టు నేడు ఆఖరి వన్డే బరిలోకి దిగనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి రెండు వన్డేల్లోనూ ఓడిన హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు... బుధవారం పెర్త్ వేదికగా చివరి మ్యాచ్‌లో ఆ్రస్టేలియాతో పోటీపడనుంది. ఇటీవల సొంతగడ్డపై న్యూజిలాండ్‌పై వన్డే సిరీస్ నెగ్గిన టీమిండియా... ఆసీస్ చేతిలో క్లీన్‌స్వీప్ తప్పించుకోవాలని ప్రయతి్నస్తోంది. వచ్చే ఏడాది భారత్‌లో వన్డే ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో మెగా టోర్నీకి ముందు... ఆఖరి వన్డేలో నెగ్గి హర్మన్ బృందం ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంటుందా చూడాలి. గత రెండు మ్యాచ్‌ల్లోనూ ఆ్రస్టేలియా సంపూర్ణ ఆధిపత్యం కనబర్చగా... భారత జట్టు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో ఘోర ప్రదర్శన కనబర్చింది. సీనియర్ ప్లేయర్లు హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోగా... మిగిలిన వాళ్లు కూడా సత్తా చాటడం లేదు. దీంతో బ్యాటింగ్ వైఫల్యం జట్టును దెబ్బ తీస్తోంది. ఇక చివరి మ్యాచ్‌లోనైనా టీమిండియా కలిసికట్టుగా కదంతొక్కాలని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. వరల్డ్‌కప్‌నకు ముందు బ్యాటింగ్ కూర్పునకు ఈ సిరీస్ ఉపయోగపడుతుందని భావించగా... అదీ సాధ్యపడలేదు. ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమైన యువ ఓపెనర్ షఫాలీ వర్మ స్థానంలో ఎవరిని ప్రయత్నించినా... ముద్ర వేయలేకపోగా... మిడిలార్డర్లో జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ మినహా తక్కిన వాళ్లెవరూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. గత రెండు మ్యాచ్‌ల్లో కలిపి ఆసీస్ ప్లేయర్లు 2 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు నమోదు చేస్తే... భారత్ నుంచి అత్యధికంగా రిచా ఘోష్ మాత్రమే ఒక హాఫ్ సెంచరీ చేసింది. రెండో వన్డే ఓటమి అనంతరం హర్మన్‌ప్రీత్ మాట్లాడుతూ... ‘ఎక్కువ సేపు క్రీజులో నిలవడంపై దృష్టి పెట్టాలి. మొత్తం 50 ఓవర్లు ఆడటంతో పాటు... బౌలింగ్‌లోనూ భిన్నమైన ప్రణాళికలు అమలు చేయాలి’ అని చెప్పింది. మరి మూడో మ్యాచ్‌లోనైనా అలాంటి ప్రయత్నం చేస్తారా చూడాలి. మరోవైపు సీనియర్ ప్లేయర్లు అందుబాటులో లేకపోయినా... ఆసీస్ అమ్మాయిలు అదరగొడుతున్నారు. ఈ సిరీస్‌తోనే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన జార్జియా వోల్... భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు రాబడుతోంది. ఆ తెగింపు మన ప్లేయర్లు కూడా కనబర్చాల్సిన అవసరముంది. 6 ఇప్పటి వరకు ఆ్రస్టేలియాతో మూడు లేదా అంతకంటే ఎక్కువ వన్డేలతో కూడిన ద్వైపాక్షిక సిరీస్‌లలో భారత జట్టు ఆరుసార్లు (1984లో 0–4తో; 2006లో 0–3తో; 2008లో 0–5తో; 2012లో 0–3తో; 2018లో 0–3తో; 2023లో 0–3తో) క్లీన్‌స్వీప్ అయింది. -
Paris Olympics 2024: భారత మహిళల టీటీ జట్టు అవుట్
పారిస్: ఒలింపిక్స్‌లో భారత మహిళల టేబుల్ టెన్నిస్ (టీటీ) జట్టు పోరాటం ముగిసింది. జర్మనీ జట్టుతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఆకుల శ్రీజ, మనిక బత్రా, అర్చనా కామత్‌లతో కూడిన భారత జట్టు 1–3తో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో శ్రీజ–అర్చన ద్వయం 5–11, 11–8, 10–12, 6–11తో చైనా సంతతికి చెందిన జర్మనీ జోడీ యువాన్ వాన్–జియోనా షాన్ చేతిలో పరాజయం పాలైంది. రెండో మ్యాచ్‌లో మనిక బత్రా 11–8, 5–11, 7–11, 5–11తో అనెట్ కౌఫమన్ చేతిలో ఓడింది. మూడో మ్యాచ్‌లో అర్చన 19– 17, 1–11, 11–5, 11–9తో జియోనా షాన్‌ను ఓడించింది. అయితే నాలుగో మ్యాచ్‌లో శ్రీజ 6–11, 7–11, 7–11తో అనెట్ చేతిలో ఓడిపోవడంతో భారత కథ ముగిసింది. -
భారత మహిళలు పోరాడినా...
చెన్నై: వన్డే సిరీస్, ఏకైక టెస్టులో చిత్తుగా ఓడిన దక్షిణాఫ్రికా మహిళల జట్టు టి20 సిరీస్‌లో భారత మహిళలకు అలాంటి అవకాశం ఇవ్వలేదు. మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో శుభారంభం చేసిన సఫారీ టీమ్ టీమిండియాపై పైచేయి సాధించింది. శుక్రవారం చెపాక్ మైదానంలో చివరి వరకు హోరాహోరీగా సాగిన తొలి టి20లో దక్షిణాఫ్రికా 12 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. తజ్మిన్ బ్రిట్స్ (56 బంతుల్లో 81; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు), మరిజన్ కాప్ (33 బంతుల్లో 57; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో చెలరేగగా...కెపె్టన్ లారా వోల్వార్ట్ (22 బంతుల్లో 33; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక పరుగులు సాధించింది. బ్రిట్స్, కాప్ రెండో వికెట్‌కు 56 బంతుల్లోనే 96 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో పూజ వస్త్రకర్, రాధ యాదవ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 177 పరుగులే చేయగలిగింది. జెమీమా రోడ్రిగ్స్ (30 బంతుల్లో 53 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేయగా... స్మృతి మంధాన (30 బంతుల్లో 46; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (29 బంతుల్లో 35; 5 ఫోర్లు) రాణించారు. స్మృతి, షఫాలీ వర్మ (18) తొలి వికెట్‌కు 32 బంతుల్లోనే 56 పరుగులు జోడించి శుభారంభం అందించారు. ఆ తర్వాత ఒకే స్కోరు వద్ద స్మృతి, హేమలత (18) వెనుదిరిగారు. విజయం కోసం 59 బంతుల్లో 103 పరుగులు చేయాల్సిన ఈ దశలో జెమీమా, హర్మన్ జత కలిశారు. వీరిద్దరు దూకుడుగా ఆడి నాలుగో వికెట్‌కు 59 బంతుల్లో 90 పరుగులు జోడించగలిగినా...చివరకు ఓటమి తప్పలేదు. తాజా ఫలితంతో సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1–0తో ఆధిక్యంలో నిలవగా, రెండో టి20 మ్యాచ్ ఆదివారం ఇక్కడే జరుగుతుంది. -
భారత మహిళల భారీ విజయం
చెన్నై: ఇన్నింగ్స్ ఓటమి నుంచి గట్టెక్కినా దక్షిణాఫ్రికా మహిళల జట్టు పరాజయాన్ని మాత్రం తప్పించుకోలేకపోయింది. భారత బౌలర్లు మరోసారి సమయోచితంగా రాణించడంతో దక్షిణాఫ్రికాతో జరిగిన ఏకైక టెస్టులో టీమిండియా 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దక్షిణాఫ్రికా కెప్టెన్ లౌరా వొల్వార్ట్ (314 బంతుల్లో 122; 16 ఫోర్లు) పట్టుదలతో పోరాడి తమ జట్టును ఇన్నింగ్స్ ఓటమి నుంచి తప్పించింది. మ్యాచ్ చివరిరోజు సోమవారం ఓవర్‌నైట్ స్కోరు 232/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 154.4 ఓవర్లలో 373 పరుగులకు ఆలౌటై భారత్‌కు 37 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. ఓపెనర్లు శుభ సతీశ్ (13 నాటౌట్; 1 ఫోర్), షఫాలీ వర్మ (24 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) ఇబ్బంది పడకుండా 9.2 ఓవర్లలో 37 పరుగులు సాధించి భారత్‌కు 10 వికెట్లతో విజయాన్ని అందించారు. అంతకుముందు ఓవర్‌నైట్ వ్యక్తిగత స్కోరు 93తో ఆట కొనసాగించిన లౌరా సెంచరీని పూర్తి చేసుకుంది. అనంతరం లౌరాను రాజేశ్వరి గైక్వాడ్ అవుట్ చేశాక దక్షిణాఫ్రికా క్రమం తప్పకుండా వికెట్లను చేజార్చుకుంది. భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించిన నదినె డి క్లెర్క్ (185 బంతుల్లో 61; 8 ఫోర్లు, 1 సిక్స్) చివరి వికెట్‌గా వెనుదిరగడంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది. మ్యాచ్ మొత్తంలో 10 వికెట్లు తీసిన భారత ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. భారత టెస్టు చరిత్రలో 10 వికెట్లతో విజయం ఇది రెండోది మాత్రమే. 2002లో దక్షిణాఫ్రికాపైనే భారత జట్టు 10 వికెట్ల తేడాతో గెలిచింది. సంక్షిప్త స్కోర్లు భారత్ తొలి ఇన్నింగ్స్: 603/6 డిక్లేర్డ్; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 266 ఆలౌట్; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 373 ఆలౌట్; భారత్ రెండో ఇన్నింగ్స్: 37/0 (9.2 ఓవర్లలో). -
బంగ్లాదేశ్‌లో భారత మహిళల జట్టు పర్యటన
ఢాకా: ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్ ఆడేందుకు ఈనెలలో భారత మహిళల క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. బంగ్లాదేశ్ బోర్డు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం భారత జట్టు ఈనెల 23న బంగ్లాదేశ్‌కు చేరుకుంటుంది. మే 10వ తేదీన పర్యటన ముగించుకొని తిరిగి వెళుతుంది. సిల్హెట్లో జరిగే ఈ సిరీస్‌లో రెండు జట్లు ఏప్రిల్ 28, 30, మే 2, 6, 9వ తేదీల్లో ఐదు టి20 మ్యాచ్‌లు ఆడతాయి. -
IND-W vs AUS-W: విజయంతో ప్రారంభించాలని...
ముంబై: కొత్త ఏడాదిని విజయంతో ప్రారంభించాలనే లక్ష్యంతో... నేడు ఆస్ట్రేలియా మహిళల జట్టుతో జరిగే చివరిదైన మూడో వన్డేలో భారత జట్టు బరిలోకి దిగనుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా ఇప్పటికే తొలి రెండు వన్డేల్లో ఓటమి పాలై సిరీస్‌ను కోల్పోయింది. ఫలితంగా ఆ్రస్టేలియాపై తొలిసారి ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ఆశించిన భారత జట్టుకు మరోసారి నిరాశే ఎదురైంది. ఇక చివరి మ్యాచ్‌లోనైనా గెలిచి ఊరట చెందాలని భారత బృందం భావిస్తోంది. ఇంగ్లండ్, ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టుల్లో విశేషంగా రాణించి అద్భుత విజయాలు అందుకున్న భారత జట్టు వన్డే ఫార్మాట్‌కు వచ్చేసరికి తడబడింది. సమష్టి ప్రదర్శన కొరవడటంతో ఈ ప్రభావం మ్యాచ్ తుది ఫలితంపై పడింది. భారత్ తరఫున బ్యాటింగ్, బౌలింగ్ విభాగాలలో ఒకరిద్దరే రాణిస్తుండటం ప్రతికూలంగా మారింది. తొలి వన్డేలో భారత జట్టు భారీ స్కోరు చేసినా బౌలర్ల వైఫల్యం దెబ్బతీసింది. రెండో వన్డేలో రిచా ఘోష్ ఒంటరి పోరాటంతో విజయానికి చేరువైన భారత్ చివర్లో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయి ఆఖరికి మూడు పరుగుల తేడాతో ఓడిపోయింది. అంతేకాకుండా రెండో మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు ఏకంగా ఏడు క్యాచ్‌లు జారవిడిచారు. కెపె్టన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమైంది. తొలి మ్యాచ్‌లో 9 పరుగులు చేసిన హర్మన్ రెండో మ్యాచ్‌లో 5 పరుగులతో సరిపెట్టుకుంది. చివరిసారి 2007లో స్వదేశంలో ఆ్రస్టేలియాపై వన్డే మ్యాచ్‌లో గెలిచిన భారత్ ఆ తర్వాత వరుసగా తొమ్మిది వన్డేల్లో ఓటమి చవిచూసింది. స్వదేశంలో ఆసీస్ చేతిలో పరాజయపరంపరకు తెర దించాలంటే చివరి వన్డేలో భారత జట్టు విశేషంగా రాణించాల్సి ఉంటుంది. స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, యసిక్త భాటియాలతోపాటు కెపె్టన్ హర్మ న్‌ప్రీత్ కూడా బ్యాటింగ్‌లో మెరిపిస్తే భారత్ భారీ స్కోరు చేసే అవకాశముంటుంది. బౌలింగ్‌లో రేణుక సింగ్‌తోపాటు స్పిన్నర్లు కూడా తమ బాధ్యతను నిర్వర్తించడంతో టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. చివరి బంతి వరకు ఓటమిని అంగీకరించని తత్వం ఆ్రస్టేలియా క్రికెటర్ల సొంతం. అందుకే రెండు వన్డేల్లోనూ ఆ జట్టు ఒత్తిడికిలోనైన సందర్భాల్లో తడబడకుండా సంయమనంతో ఆడి కోలుకున్నారు. ఫోబి లిచ్‌ఫీల్డ్, తాలియా మెక్‌గ్రాత్, యాష్లే గార్డ్నర్, ఎలీస్ పెరీ, కెపె్టన్ అలీసా హీలీ, అనాబెల్ సదర్లాండ్ మరోసారి రాణిస్తే ఆ్రస్టేలియా వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయడం సాధ్యమే. -
పరాజయంతో ప్రారంభం
ముంబై: ఈసారైనా ఆ్రస్టేలియాపై వన్డే సిరీస్ నెగ్గాలనే పట్టుదలతో ఉన్న భారత మహిళల జట్టుకు శుభారంభం లభించలేదు. వరల్డ్ చాంపియన్ ఆ్రస్టేలియా జట్టుతో గురువారం వాంఖెడె స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో హర్మన్‌ప్రీత్ నాయకత్వంలోని భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో ఓడిపోయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 282 పరుగులు సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ (77 బంతుల్లో 82; 7 ఫోర్లు), పూజ వస్త్రకర్ (46 బంతుల్లో 62 నాటౌట్; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేయగా... ఓపెనర్ యస్తిక భాటియా (64 బంతుల్లో 49; 7 ఫోర్లు) రాణించింది. అస్వస్థత కారణంగా భారత వైస్ కెపె్టన్, ఓపెనర్ స్మృతి మంధాన ఈ మ్యాచ్‌లో ఆడలేదు. అనంతరం ఆ్రస్టేలియా జట్టు 46.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 285 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ అలీసా హీలీ (0) ఖాతా తెరవకుండానే అవుటైనా... ఫోబి లిచ్‌ఫీల్డ్ (89 బంతుల్లో 78; 8 ఫోర్లు, 1 సిక్స్), ఎలీసా పెరీ (72 బంతుల్లో 75; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) రెండో వికెట్‌కు 148 పరుగులు జోడించారు. వీరిద్దరు అవుటయ్యాక తాలియా మెక్‌గ్రాత్ (55 బంతుల్లో 68 నాటౌట్; 11 ఫోర్లు), బెత్ మూనీ (47 బంతుల్లో 42; 4 ఫోర్లు) దూకుడుగా ఆడి ఆసీస్ విజయాన్ని ఖరారు చేశారు. భారత బౌలర్లలో రేణుక, పూజ, స్నేహ్ రాణా, దీప్తి శర్మ ఒక్కో వికెట్ తీశారు. రెండో వన్డే శనివారం ఇదే వేదికపై జరుగుతుంది. -
తొలి విజయం లక్ష్యంగా...
ముంబై: ఇంగ్లండ్ జట్టుపై సాధించిన ఘనవిజయం స్ఫూర్తితో... నేటి నుంచి ఆ్రస్టేలియాతో జరిగే నాలుగు రోజుల ఏకైక టెస్ట్‌లో గెలుపే లక్ష్యంగా భారత మహిళల జట్టు బరిలోకి దిగనుంది. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా 347 పరుగుల తేడాతో గెలిచింది. అయితే ఆ్రస్టేలియా జట్టుపై భారత రికార్డు అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పటి వరకు ఆస్ట్రేలియాతో జరిగిన 10 టెస్టుల్లో భారత్ ఒక్క విజయం కూడా నమోదు చేయలేకపోయింది. నాలుగు టెస్టుల్లో ఓడిన భారత జట్టు... ఆరు టెస్టులను డ్రా చేసుకుంది. 1984 తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియా జట్టుతో భారత్ టెస్టు ఆడనుండటం గమనార్హం. ఆసీస్‌పై భారత్ తొలి గెలుపు సాధించాలంటే సమష్టి ప్రదర్శన తప్పనిసరి. బ్యాటింగ్‌లో స్మృతి మంధాన, షపాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్, యస్తిక భాటియా భారీ స్కోర్లు చేయాలి. ఆల్‌రౌండర్లు దీప్తి శర్మ, స్నేహ్ రాణా, పూజా వస్త్రకర్ కూడా తమవంతు పాత్రను పోషించారు. బౌలర్ రేణుక సింగ్ తన స్వింగ్ బౌలింగ్ పేస్‌తో ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేయాలి. మరోవైపు అలీసా హీలీ నాయకత్వంలో ఆ్రస్టేలియా జట్టు కూడా పటిష్టంగా ఉంది. బెత్ మూనీ, యాష్లే గార్డ్నర్, తాలియా మెక్‌గ్రాత్, ఎలీసా పెర్రీ, అనాబెల్ సదర్లాండ్ ప్రదర్శనపై ఆ్రస్టేలియా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. -
మహిళల ‘టెస్టు’కు సిద్ధం
ముంబై: రెండేళ్ల విరామం తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టు టెస్టు మ్యాచ్ బరిలోకి దిగుతోంది. టి20 సిరీస్ తర్వాత ఇంగ్లండ్‌తో నేటినుంచి జరిగే ఏకైక టెస్టు (నాలుగు రోజుల మ్యాచ్)లో భారత్ తలపడుతుంది. వన్డేలు, టి20లను పక్కన పెడితే టెస్టుల్లో భారత జట్టు ప్రత్యర్థి తో పోలిస్తే అనుభవం, ఫలితాలపరంగా చాలా వెనుకబడి ఉంది. మన అమ్మాయిలకు ఎప్పుడో గానీ టెస్టులు ఆడే అవకాశం రాదు. ఓవరాల్‌గా భారత్ ఇప్పటి వరకు 38 టెస్టులు మాత్రమే ఆడగా...99 మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్ ఇప్పుడు 100వ మ్యాచ్‌కు సిద్ధమైంది. 2014 తర్వాత భారత్‌లో మహిళల టెస్టు జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. భారత మహిళల క్రికెట్ దిగ్గజాలు మిథాలీరాజ్, జులన్ గోస్వామిల రిటైర్మెంట్ తర్వాత జట్టు ఆడుతున్న మొదటి టెస్టు ఇదే కానుంది. ఈ నేపథ్యంలో టెస్టు అనుభవంపై ఇంగ్లండ్ ఆధారపడుతుండగా... సొంతగడ్డపై ఆడుతున్న అనుకూలతను హర్మన్ సేన నమ్ముకుంది. 2021 సెపె్టంబర్లో ఆఖరి సారిగా టెస్టు ఆడిన భారత్ ఆసీస్‌తో జరిగిన ఆ మ్యాచ్‌ను ‘డ్రా’గా ముగించగలిగింది. ఇంగ్లండ్ సమష్టిగా... దేశవాళీలో నాలుగు రోజుల మ్యాచ్‌లు ఎక్కువగా ఆడటం పాటు ‘యాషెస్’ కార ణంగా కూడా ఇంగ్లండ్ టీమ్ తరచుగా టెస్టు మ్యాచ్‌ల బరిలోకి దిగుతూ వస్తోంది. ఇప్పు డు కూడా ఆ జట్టు ఈ ఫార్మాట్లో తమ బలాన్నే నమ్మకుంది. జట్టులో ఎక్కువ మంది సభ్యులకు టెస్టు అనుభవం ఉంది. కెప్టెన్ హీతర్ నైట్‌తో పాటు బీమాంట్, సివర్ బ్రంట్ కీలక బ్యాటర్లు కాగా...మిడిలార్డర్లో క్యాప్సీ, డాని వాట్ ప్రభావం చూపించగలరు. బీమాంట్‌తో పాటు రెండో ఓపెనర్‌గా డంక్లీ బరిలోకి దిగవచ్చు. కీపర్ ఎమీ జోన్స్ ధాటిగా ఆడగలదు. స్పిన్నర్ సోఫీ ఎకెల్‌స్టోన్ ఇంగ్లండ్‌కు బౌలింగ్‌లో ప్రధాన బలం. ఇతర బౌలర్లు క్రాస్, బెల్, డీన్ భారత పిచ్‌పై ఏమాత్రం ప్రభావం చూపించగలరో చెప్పలేం. ఇంగ్లండ్ జట్టు భారత గడ్డపై 2005 తర్వాత టెస్టు మ్యాచ్ ఆడటం ఇదే మొదటిసారి. వారిద్దరే కీలకం... భారత జట్టులో భారత కెప్టెన్ కు 3 టెస్టుల, స్టార్ బ్యాటర్ స్మృతి మంధానకు 4 టెస్టుల అనుభవం మాత్రమే ఉండగా...మిగతా జట్టు సభ్యులకు ఆమాత్రం అనుభవం కూడా లేదు. వన్డేలు, టి20లతో పోలిస్తే క్రీజ్‌లో నిలవడంలో వీరు ఏమాత్రం పట్టుదల కనబరుస్తారనేది ఆసక్తికరం. అందుకే జట్టు విజయావకాశాలు ప్రధానంగా హర్మన్, స్మృతిలపైనే ఆధారపడి ఉన్నాయి. షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్ తమ బ్యాటింగ్ బలాన్ని ప్రదర్శించాల్సి ఉంది. ముఖ్యంగా పరిమిత ఓవర్ల క్రికెట్లో దూకుడుకు మారుపేరైన షఫాలీ ఇక్కడ కాస్త ఓపికను చూపించి ఆడితే భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. రోడ్రిగ్స్ కూడా టెస్టుకు తగినట్లుగా తన ఆటతీరును మార్చుకోగలదని టీమ్ మేనేజ్మెంట్ ఆశిస్తోంది. అనుభవజు్ఞలైన స్పిన్నర్లు స్నేహ్ రాణా, రాజేశ్వరి గైక్వాడ్ టెస్టులో ఎలాంటి ప్రభావం చూపిస్తారనేది చూడాలి. వీరితో పాటు దీప్తి శర్మ కూడా స్పిన్‌తో రాణించగలదు. భారత్ ఆడిన గత రెండు టెస్టులు కూడా విదేశీ గడ్డపైనే జరిగాయి. ఆ రెండు మ్యాచ్‌లలో జట్టు ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగింది. అలా చూస్తే రేణుకా సింగ్, మేఘనా సింగ్‌లతో పాటు పూజ వస్త్రకర్‌కు అవకాశం ఉంటుంది. ఇద్దరు పేసర్లకే పరిమితమైతే మాత్రం పూజను పక్కన పెట్టి అదనపు బ్యాటర్‌గా రిచా ఘోష్‌ను తీసుకోవచ్చు. -
ఆస్ట్రేలియాతో తొలి టీ20.. బ్యాటింగ్ భారత్‌దే! కర్నూలు అమ్మాయి ఎంట్రీ
ముంబై వేదికగా ఆస్ట్రేలియా మహిళలలతో తొలి టీ20లో తలపడేందుకు భారత జట్టు సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా భారత బ్యాటర్ దేవికా వైద్యకు తుది జట్టలో చోటు దక్కింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంజలి శర్వణి భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయనుంది. ఇక ఈ సిరీస్‌కు ఆస్ట్రేలియా రెగ్యూలర్ కెప్టెన్ లానింగ్ దూరం కావడంతో హీలీ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తుంది. కాగా భారత పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. తుది జట్లు ఆస్ట్రేలియా: అలిస్సా హీలీ(కెప్టెన్), బెత్ మూనీ, తహ్లియా మెక్‌గ్రాత్, ఆష్లీ గార్డనర్, ఎల్లీస్ పెర్రీ, గ్రేస్ హారిస్, అన్నాబెల్ సదర్లాండ్, జెస్ జోనాసెన్, అలానా కింగ్, కిమ్ గార్త్, మేగాన్ షుట్ భారత జట్టు: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), దేవికా వైద్య, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, రాధా యాదవ్, అంజలి శర్వాణి, మేఘనా సింగ్, రేణుకా సింగ్ చదవండి: ENG vs PAK: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. 120 ఏళ్ల రికార్డు బద్దలు! ప్రపంచంలోనే తొలి జట్టుగా -
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. టీమిండియాలో ఆదోని అమ్మాయి
India W Vs Australia W T20 Series- న్యూఢిల్లీ: కొంతకాలంగా దేశవాళీ క్రికెట్లో తన ఎడంచేతి పేస్ బౌలింగ్‌తో నిలకడగా రాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి కేశవరాజుగారి అంజలి శర్వాణి తొలిసారి భారత టి20 జట్టులోకి ఎంపికైంది. ఆస్ట్రేలియా జట్టుతో ముంబైలో ఈనెల 9 నుంచి జరిగే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనే భారత జట్టులో అంజలికి చోటు లభించింది. కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన 25 ఏళ్ల అంజలి ఇటీవల జాతీయ సీనియర్ మహిళల టి20 టోర్నీలో ఇండియన్ రైల్వేస్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ 17 వికెట్లతో టాపర్‌గా నిలిచింది. ఆసీస్‌తో సిరీస్‌కు భారత జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, యాస్తిక భాటియా (వికెట్ కీపర్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్ ఠాకూర్, మేఘనా సింగ్, అంజలి శర్వాణి, ఎస్ మేఘన, రిచా ఘోష్ (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్ చదవండి: IND-W vs AUS_W: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన! స్టార్ ఆల్ రౌండర్ దూరం -
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన! స్టార్ ఆల్ రౌండర్ దూరం
స్వదేశంలో ఆస్ట్రేలియా మహిళలతో టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఆల్ ఇండియా ఉమెన్స్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుంది. ఇక ఈ హోం సిరీస్‌కు స్టార్ ఆల్ రౌండర్ పూజా వస్త్రాకర్ గాయం కారణంగా దూరమైంది. ఇక స్వదేశీ సిరీస్‌లో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 9న ముంబై వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ఇప్పటికే ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ తమ జట్టును ప్రకటిచింది. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, యాస్తిక భాటియా (వికెట్ కీపర్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్ ఠాకూర్, మేఘనా సింగ్, అంజలి శర్వాణి, ఎస్ మేఘన, రిచా ఘోష్ (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్ భారత పర్యటనకు ఆస్ట్రేలియా జట్టు: అలిస్సా హీలీ (కెప్టెన్), తహ్లియా మెక్‌గ్రాత్ (వైస్ కెప్టెన్), డార్సీ బ్రౌన్, నికోలా కారీ, ఆష్లీ గార్డనర్, కిమ్ గార్త్, హీథర్ గ్రాహం, గ్రేస్ హారిస్, జెస్ జోనాస్సెన్, అలనా కింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, బెత్ మూనీ, ఎల్లీస్ పెర్రీ, మేగాన్ షుట్ల్యాండ్, అన్నాబెల్ సుదర్‌ల్యాండ్. చదవండి: IPL Mini Auction: వేలంలో 991 మంది క్రికెటర్లు! పాపం.. టీమిండియా ఆటగాళ్లు.. కనీసం 2 కోట్లు కూడా! -
చెలరేగిన టీమిండియా బౌలర్లు.. 16 పరుగులకే ఐదు వికెట్లు
Womens Asia Cup T20 2022 - India Women vs Sri Lanka Women, Final: మహిళల ఆసియా కప్ టి20 టోర్నీలో టీమిండియా, శ్రీలంక మధ్య ఫైనల్ మ్యాచ్ ఆసక్తికరంగా మొదలైంది. టాస్ గెలిచిన లంక వుమెన్స్ బ్యాటింగ్‌కు మొగ్గు చూపింది. అయితే తమ నిర్ణయం ఎంత తప్పిదమో లంకకు కాసేపటికే అర్థమయింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్ నుంచి లంక క్రికెటర్ల పతనం మొదలైంది. 10 పరుగుల లోపే నాలుగు కీలక వికెట్లు కోల్పోయిన లంక జట్టు కష్టాల్లో పడింది. ప్రస్తుతం 6 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 16 పరుగులు చేసింది. టీమిండియా మహిళా బౌలర్లలో రేణుకా సింగ్ మూడు వికెట్లు తీయగా.. రెండు రనౌట్లు ఉండడం విశేషం. ఏడోసారి.. ఆసియా కప్ మహిళల టి20 టోర్నీ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన భారత జట్టు ఆ హోదాను నిలబెట్టుకుంటూ ఫైనల్ చేరింది. ఇప్పటికే ఆరు సార్లు టైటిల్ గెలుచుకున్న భారత్ మరోసారి ట్రోఫీని అందుకోవడంపై దృష్టి పెట్టింది. జట్టు తాజా ఫామ్, ఆటగాళ్ల వ్యక్తిగత ప్రదర్శనను బట్టి చూస్తే అది అసాధ్యమేమీ కాదు. తొలి లీగ్ మ్యాచ్‌లో లంకను సునాయాసంగానే భారత్ ఓడించినా... ఆ జట్టు సెమీస్ తరహాలో సంచలనం సృష్టించే అవకాశాలను తక్కువ చేయలేం. అప్డేట్: భారత బౌలర్లు చెలరేగడంతో శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 65 పరుగులు మాత్రమే చేయగలిగింది. చదవండి: T20 WC 2022: రోహిత్ నాకంటే పెద్దవాడు! ఇంట్లో వాళ్లు బాగున్నారా? ఏ కారు కొంటున్నావు.. మేము మాట్లాడుకునేది ఇవే! Virat Kohli: ఈ ఏడాది 23 మందిలో 'కింగ్' కోహ్లి ఒక్కడే.. -
థాయ్‌లాండ్‌పై విజయం.. ఆసియాకప్ ఫైనల్లో టీమిండియా వుమెన్స్
మహిళల ఆసియా కప్ టి20 టోర్నీలో టీమిండియా వుమెన్స్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. గురువారం థాయ్‌లాండ్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా వుమెన్స్ 74 పరుగులతో ఘన విజయం సాధించింది. 149 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన థాయ్‌లాండ్ వుమెన్స్ భారత బౌలర్ల దాటికి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 74 పరుగులే చేయగలిగింది. థాయ్‌లాండ్ బ్యాటర్లలో నరుమోల్ చవాయి 21, నట్టాయా బుచాతమ్ 21 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో దీప్తి శర్మ మూడు వికెట్లు తీయగా.. రాజేశ్వరి గైక్వాడ్ రెండు, షఫాలీ వర్మ, స్నేహ్ రాణా, రేణుకా సింగ్‌లు తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా వుమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. షఫాలీ వర్మ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 36 పరుగులు, జేమీమా రోడ్రిగ్స్ 27 పరుగులతో రాణించారు. ఇక శ్రీలంక వుమెన్స్, పాకిస్తాన్ వుమెన్స్ మధ్య జరగనున్న రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో టీమిండియా వుమెన్స్ ఫైనల్లో తలపడనుంది. ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 15న(శనివారం) జరగనుంది. Women's Asia Cup: India beat Thailand by 74 runs in the first semifinal to enter the final. (Pic Source: BCCI Women) pic.twitter.com/VwWZl0gjkQ — ANI (@ANI) October 13, 2022 4⃣2⃣ Runs 1⃣ Wicket 1⃣ Catch@TheShafaliVerma bags the Player of the Match as #TeamIndia beat Thailand. 👍 👍 Scorecard ▶️ https://t.co/pmSDoClWJi #AsiaCup2022 | #INDvTHAI pic.twitter.com/Jidbc383eX — BCCI Women (@BCCIWomen) October 13, 2022 -
థర్డ్ అంపైర్ చీటింగ్.. టీమిండియా క్రికెటర్‌కు అన్యాయం
ఆసియాకప్ మహిళల టి20 టోర్నీలో టీమిండియా మహిళలు శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. శనివారం శ్రీలంక వుమెన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా వుమెన్స్ 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ బ్యాటింగ్‌లో మెరవగా.. బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో భారత మహిళల జట్టు విజయాన్ని అందుకుంది. అయితే మ్యాచ్ విజయం పక్కనబెడితే.. థర్డ్ అంపైర్ చీటింగ్‌కు టీమిండియా క్రికెటర్ పూజా వస్త్రాకర్‌కు అన్యాయంగా బలవ్వాల్సి వచ్చింది. రనౌట్ కాదని క్లియర్‌గా తెలుస్తున్నప్పటికి రిప్లేలో ఔటివ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఈ ఘటన టీమిండియా ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లో చోటుచేసుకుంది. అచిని కౌలసూరియా వేసిన ఓవర్ ఐదో బంతిని పూజా వస్త్రాకర్ కవర్స్ దిశగా ఆడింది. సింగిల్ పూర్తి చేసిన పూజా రెండో పరుగు కోసం ప్రయత్నించింది. పూజా క్రీజులో బ్యాట్ పెట్టగానే కీపర్ బెయిల్స్‌ను ఎగురగొట్టింది. రిప్లేలో చూస్తే పూజా క్రీజుకు చేరినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. కానీ థర్డ్ అంపైర్ మాత్రం ఔట్ ఇవ్వడం షాక్‌కు గురిచేసింది. ఇది చూసిన పూజాకు కాసేపు ఏమి అర్థం కాలేదు. థర్డ్ అంపైర్ పొరపాటున ఔట్ ఇచ్చాడేమోనని ఎదురుచూసింది. కానీ బిగ్‌స్క్రీన్‌లో ఎలాంటి మార్పు లేదు. దీంతో నిరాశగా పెవిలియన్‌కు వెళ్తున్న సమయంలోనూ ఆమె స్క్రీన్‌నే చూడడం గమనార్హం. కామెంటేటర్లు కూడా థర్డ్ అంపైర్ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ''ఓ మై గుడ్నెస్ ఇట్స్ ఔట్.. హౌ'' అంటూ కామెంట్ చేయడం స్పష్టంగా వినిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ''పూజా వస్త్రాకర్ రనౌట్ కాదని క్లియర్‌గా తెలుస్తోంది. అసలు ఏ కోశానా థర్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడో అర్థం కావడం లేదు.. '' అంటూ కామెంట్ చేశారు. కాగా పూజా వస్త్రాకర్ ఔటైన తీరుపై టీమిండియా మాజీ డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. ''థర్డ్ అంపైర్‌ది వెరీ పూర్ డెసిషన్. రనౌట్ కాదని క్లియర్‌గా తెలుస్తోంది.. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద ఔట్ ఇచ్చి ఉంటాడు.'' అని పేర్కొన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఉమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. జేమీమా రోడ్రిగ్స్ 53 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 76 పరుగులతో రాణించగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 33 పరుగులు చేసింది. లంక బౌలర్లలో రణసింగే మూడు వికెట్లు తీయగా.. సుగంధిక కుమారి, ఆటపట్టు చెరొక వికెట్ తీశారు 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు 18.2 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలింది. లంక బ్యాటర్స్‌లో హాసిని పెరీరా 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హర్షితా మాధవి 26 పరుగులు చేసింది. భారత మహిళా బౌలర్లలో హేమలత మూడు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ చెరో రెండు వికెట్లు తీయగా.. రాధా యాదవ్ ఒక వికెట్ తీసింది. pic.twitter.com/lRDMOGYF6U — cricket fan (@cricketfanvideo) October 1, 2022 చదవండి: ప్రేమలో పడ్డ పృథ్వీ షా!.. గర్ల్‌ఫ్రెండ్ ఎవరంటే.. జెమీమా రోడ్రిగ్స్ విధ్వంసం.. ఆసియాకప్‌లో టీమిండియా మహిళలు శుభారంభం -
రన్ఔట్ విషయం లో మమ్మల్ని హెచ్చరించలేదు : హీథర్ నైట్
-
ఒక శకం ముగిసింది.. బాల్‌గర్ల్ నుంచి స్టార్ క్రికెటర్ దాకా
భారత మహిళా క్రికెట్లో ఒక శకం ముగిసింది. మిథాలీరాజ్ తర్వాత భారత మహిళా క్రికెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన క్రికెటర్‌గా జులన్ గోస్వామి గుర్తింపు పొందింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు భారత మహిళల జట్టు పేస్ బౌలింగ్ విభాగాన్ని తన భుజాలపై మోసింది. జనవరి 6, 2002లో చెన్నై వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన జులన్ గోస్వామి.. 20 ఏళ్ల తర్వాత మళ్లీ అదే ఇంగ్లండ్‌పై తన చివరి మ్యాచ్ ఆడడం విశేషం. క్రికెటర్‌గా ఎన్నో రికార్డులు అందుకున్న ఆమె జీవితం ఇప్పటి యువతరానికి ఒక ఆదర్శం పశ్చిమబెంగాలోని నదియా జిల్లా చక్డా.. జులన్ సొంత గ్రామం. చక్డా నుంచి కోల్‌కతాకు 80 కిలోమీటర్ల దూరం. మధ్యతరగతి కుటుంబానికి చెందిన జులన్‌కు బెంగాల్ లో అందరి మాదిరే ఫుట్‌బాల్ అంటే ఇష్టం. కానీ టీవీలలో వచ్చే క్రికెట్ మ్యాచ్‌లను చూసి ఆమె దృష్టి బంతి మీద పడింది. చిన్నప్పటి నుంచే క్రికెట్ మీద ఆసక్తి పెంచుకున్న జులన్.. చిన్నప్పుడు స్కూల్లో, తన ఉరిలో అబ్బాయిలతోనే క్రికెట్ ఆడేది. అప్పటికీ అమ్మాయిల క్రికెట్‌కు ఇప్పుడున్నంత ఆదరణ కూడా లేదు. ‘ఆడపిల్లలకు ఆటలెందుకు.. అది కూడా క్రికెట్. అవసరమా..?’ అని అవమానించినప్పటికి క్రికెట్ ఆడాలనే తన పట్టుదలను మాత్రం విడవలేదు. బాల్‌గర్ల్ నుంచి క్రికెటర్ దాకా అంతర్జాతీయ క్రికెట్ ఆడాలన్న ఆమె కోరిక బలంగా నాటుకుపోయింది 1997లో. ఆ ఏడాది కోల్‌కతాలోని ప్రఖ్యాత ఈడెన్ గార్డెన్లో ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మహిళల మధ్య వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో జులన్ గోస్వామి బాల్ గర్ల్‌గా పనిచేసింది. ఆ మ్యాచ్ చూసిన జులన్.. 'భారత్ తరఫున కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడాలి. ఒక్క వికెట్ అయినా తీయాలి..' అని మనసులో నిశ్చయించుకుంది. అప్పుడు ఆమె వయసు 15 ఏండ్లు. అయితే ఆమె నివసిస్తున్న చక్డాలో, నదియాలో క్రికెట్ అకాడమీలు లేవు. క్రికెట్ కోచింగ్ తీసుకోవాలంటే 80 కిమీ ఆవల ఉన్న కోల్‌కతాకు వెళ్లాల్సిందే. అందుకోసం రోజూ ఉదయం 5 గంటలకు చక్డాలో ట్రైన్ ఎక్కి సీల్దాలో ప్రాక్టీస్ కోసం వచ్చేది. 19 ఏండ్ల వయసులో జులన్ గోస్వామి 2002 జనవరి 14న చెన్నైలో ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్ ఆడింది. అప్పటికింకా బీసీసీఐ మహిళా విభాగం లేకపోవడంతో అప్పుడు భారత మహిళల జట్టు ఉమెన్స్ క్రికెట్ అసోసియేషన్ (డబ్ల్యూసీఎఐ) కింద ఆడారు. అప్పట్లో భారత పురుషుల క్రికెట్ కు ఉన్న ఆదరణ మహిళా క్రికెట్ కు లేదు. ఏదో ఒక జట్టు ఉందా..? అంటే ఉన్నదన్నట్టుగానే ఉమెన్ క్రికెట్ టీమ్ ఉండేది. బీసీసీఐ కూడా మహిళా క్రికెట్ మీద అంత ఆసక్తి చూపలేదు. దీంతో పురుష క్రికెటర్లు అనుభవించిన లగ్జరీలు మహిళా క్రికెటర్లకు దక్కలేదు. భారత్ లో మ్యాచ్ లు ఆడేందుకు జులన్.. సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్స్ లలో ప్రయాణించేది. డార్మెటరీలలో అతి సాధారణ వాష్ రూమ్ లు ఉన్నచోట కూడా సర్దుబాటు అయింది. కనీసం మ్యాచ్‌లలో అమ్మాయిలకు ప్రత్యేక జెర్సీలు కూడా లేని రోజులనూ చూసింది జులన్. లెక్కకు మించి రికార్డులు భారత జట్టు తరఫున ఆడుతూ ఒక్క వికెట్ తీసినా చాలు అని కలలు కన్న జులన్ గోస్వామి.. తన కెరీర్ లో ఇన్ని ఘనతలు సాధిస్తుందని కలలో కూడా ఊహించి ఉండదు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు ఇప్పటికీ జులన్ పేరిటే ఉంది. తన సుదీర్ఘ కెరీర్ లో మొత్తం 353 వికెట్లు పడగొట్టింది. ప్రపంచ క్రికెట్ (మహిళల) లో మరే బౌలర్ ఇన్ని వికెట్లు తీయలేదు. ముఖ్యంగా వన్డేలలో ఆమె రికార్డులు చేరుకునే బౌలర్ అయితే దరిదాపుల్లో కూడా కనిపించడం లేదు. జులన్ తన కెరీర్ లో 12 టెస్టులలో 44 వికెట్లు, 203 వన్డేలలో 253 వికెట్లు, 68 టీ20లలో 56 వికెట్లు తీసింది. జులన్ సాధించిన రికార్డులను ఓసారి పరిశీలిస్తే.. ►వన్డేలలో 200, 250 వికెట్లు తీసుకున్న తొలి మహిళా బౌలర్. ►జులన్ బౌలరే కాదు.. మంచి బ్యాటర్ కూడా. వన్డేలలో ఆమె 1,228 పరుగులు చేసింది. వన్డే ఫార్మాట్ లో వెయ్యికి పైగా పరుగులు, వంద వికెట్లు సాధించిన భారత క్రికెటర్. ►మహిళల ప్రపంచకప్ (34 మ్యాచ్ లు) లో అత్యధిక వికెట్లు : 43 ►ఉమెన్స్ క్రికెట్ లో మిథాలీ రాజ్ (22 ఏండ్ల 274 రోజులు) తర్వాత అత్యధిక కెరీర్ కలిగిన (20 ఏండ్ల 260 రోజులు) రెండో క్రికెటర్. ►అత్యధిక క్యాచ్ లు పట్టిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానం. తన కెరీర్ లో ఆమె 68 క్యాచ్ లు అందుకుంది. న్యూజిలాండ్ కు చెందిన సూజీ బేట్స్ 78 క్యాచ్ లు పట్టింది. ►2006 లో ఇంగ్లాండ్ లో ఆడుతూ ఒక టెస్టులో పది వికెట్ల (78-10) ప్రదర్శన చేసిన ఏకైక భారత బౌలర్. A long list of special performances 📝 Some of Jhulan Goswami's finest moments in international cricket 👇 https://t.co/Mb2eBIYS1N — ICC (@ICC) September 24, 2022 చదవండి: 'గార్డ్ ఆఫ్ హానర్' స్వీకరించిన గోస్వామి.. జులన్‌కు క్లీన్‌స్వీప్ కానుక -
కోహ్లి, ధావన్‌ల తర్వాత స్మృతి మందానకే సాధ్యమైంది..
టీమిండియా స్టార్ ఓపెనర్ స్మృతి మందాన వన్డే క్రికెట్లో సరికొత్త రికార్డు అందుకుంది. వన్డేల్లో వేగంగా 3,000 పరుగులు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కింది. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన భారత క్రికెటర్లలో ఆమె మూడో బ్యాటర్‌గా నిలిచింది. ఈ జాబితాలో శిఖర్ ధావన్ ముందు వరుసలో ఉన్నాడు. అతను 72 ఇన్నింగ్స్‌ల్లో, కోహ్లి 75 ఇన్నింగ్స్‌ల్లో 3,000 క్లబ్లో చేరాడు. ఇతనికి ఒక్క ఇన్నింగ్స్ తేడాతో మందాన 76వ ఇన్నింగ్స్‌లో రికార్డు చేరుకుంది. గత నెలలో ఐసీసీ ప్రకటించిన ఐదుగురు ‘క్రికెట్ సూపర్‌స్టార్స్’లో మందాన ఉంది. మిథాలీ రాజ్, హర్మన్‌ప్రీత్‌ల తర్వాత భారత మహిళల్లో 3,000 పరుగుల మైలురాయిని దాటిన మూడో క్రికెటర్ మందాన. ప్రత్యేకించి మహిళల్లో 22 మంది క్రికెటర్లు ఈ ఘనత సాధించగా... వేగంగా చేరుకున్న జాబితాలోనూ ఆమెది మూడో స్థానం కావడం మరో విశేషం. బెలిండా క్లార్క్ (ఆస్ట్రేలియా; 62 ఇన్నింగ్స్‌లు), మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా; 64 ఇన్నింగ్స్‌లు) భారత బ్యాటర్ కంటే చకచకా 3000 పరుగుల్ని పూర్తి చేశారు. చదవండి: 23 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై కొత్త చరిత్ర -
23 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ గడ్డపై కొత్త చరిత్ర
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా మహిళలు సరికొత్త చరిత్ర సృష్టించారు. దాదాపు 23 ఏళ్ల తర్వాత బ్రిటీష్ గడ్డపై వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్నారు. హర్మన్‌ప్రీత్ కౌర్ సుడిగాలి ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేలో భారత మహిళల జట్టు 88 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 333 పరుగులు చేసింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (111 బంతుల్లో 143 నాటౌట్; 18 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఆకాశమే హద్దుగా చెలరేగింది. ఓపెనర్ షఫాలీ వర్మ (8) నిరాశపరచగా, స్మృతి మంధాన (51 బంతుల్లో 40; 4 ఫోర్లు, 1 సిక్స్), యస్తిక భాటియా (34 బంతుల్లో 26; 4 ఫోర్లు) రెండో వికెట్‌కు 54 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 66 పరుగుల వద్ద యస్తిక నిష్క్రమించడంతో క్రీజులోకి వచ్చిన హర్మన్ మొదట కుదురుగా ఆడింది. తర్వాత దూకుడు పెంచింది. ఇక ఆఖర్లో చుక్కలు చూపించింది. 64 బంతుల్లో ఫిఫ్టీ (4 ఫోర్లు, 1 సిక్స్) పూర్తి చేసుకున్న హర్మన్ వంద బంతుల్లో సెంచరీ (12 ఫోర్లు, 1 సిక్స్) సాధించింది. ఆమె వన్డే కెరీర్లో ఇది ఐదో శతకం. తర్వాత 11 బంతుల్లోనే 43 పరుగులు ధనాధన్‌గా చేసింది. 6 ఫోర్లు, 3 సిక్సర్ల రూపంలోనే 42 పరుగులు వచ్చాయి. హర్లీన్ డియోల్ (72 బంతుల్లో 58; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అండగా నిలిచింది. పూజ వస్త్రకర్ (18) తక్కువ స్కోరే చేయగా, దీప్తి శర్మ (9 బంతుల్లో 15 నాటౌట్; 2 ఫోర్లు) కెప్టెన్‌తో కలిసి అజేయంగా నిలిచింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 44.2 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. డేనియల్ వ్యాట్ 65 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. అలిస్ కాప్సీ 39, చార్లెట్ డీన్ 37 పరుగులు చేశారు. టీమిండియా మహిళా బౌలర్లలో రేణుకా సింగ్ 4 వికెట్లు, దయాలన్ హేమలత 2, దీప్తి శర్మ, షఫాలీ వర్మ తలా ఒక వికెట్ తీశారు. ఈ విజయంతో టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక ఝులన్ గోస్వామికి ఈ విజయంతో టీమిండియా మహిళల జట్టు ఘనమైన వీడ్కోలు పలికినట్లయింది. ఇక నామమాత్రంగా మారిన చివరి వన్డే సెప్టెంబర్ 24న(శనివారం) జరగనుంది. అయితే వచ్చే వన్డే వరల్డ్‌కప్ 2023 వరకు టీమిండియాకు మరో వన్డే సిరీస్ ఆడే అవకాశం లేదు. The way Harmanpreet Kaur played was excellent, what a top knock of 143*. pic.twitter.com/w9m2ZQtIFs — Mufaddal Vohra (@mufaddal_vohra) September 21, 2022 -
జులన్‌కు ఘనమైన వీడ్కోలే లక్ష్యంగా...
హోవ్: పొట్టి ఫార్మాట్లో నిరాశపరిచిన భారత మహిళల జట్టు ఇప్పుడు వన్డే సిరీస్‌లో రాణించాలనే పట్టుదలతో ఉంది. టి20ల్లో పేలవమైన ఆటతీరుతో హర్మన్‌ప్రీత్ జట్టు 1–2తో ఆతిథ్య జట్టుకు సిరీస్‌ను అప్పగించింది. కానీ ఇప్పుడు దిగ్గజ బౌలర్ జులన్ గోస్వామికి ఇది ఆఖరి సిరీస్ కావడంతో సిరీస్ గెలిచి తమ సహచర క్రీడాకారిణికి ఘనమైన వీడ్కోలు ఇవ్వాలని హర్మన్‌ప్రీత్ కౌర్ సేన భావిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో అమ్మాయిలంతా బాధ్యత కనబరిస్తే గత వైఫల్యాల్ని అధిగమించవచ్చు. ముందుగా ఆదివారం జరిగే తొలి వన్డేలో శుభారంభం చేస్తే సిరీస్‌పై పట్టుసాధించవచ్చని జట్టు మేనేజ్మెంట్ ఆశిస్తోంది. టాపార్డర్‌లో స్మృతి, షఫాలీ సహా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఇంగ్లండ్ బౌలింగ్‌కు ఎదురొడ్డితే మిగతా వారికి పని సులువవుతుంది. మరోవైపు ఆతిథ్య జట్టుకు రెగ్యులర్ కెప్టెన్ హీథెర్‌నైట్ గాయంతో దూరమవడం ఇబ్బందికరం. అయితే ఇంగ్లండ్ మంచి ఆల్‌రౌండ్ జట్టు. పైగా టి20 సిరీస్ గెలిచిన ఊపు మీదుంది. ఇదే జోరుతో సొంతగడ్డపై వరుసగా మరో సిరీస్‌పై కన్నేసింది. ఓపెనర్లు సోఫియా డంక్లే, డానీ వ్యాట్, మూడోస్థానంలో అలైస్ కాప్సీ ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసివస్తోంది. బౌలింగ్‌లోనూ సోఫీ ఎకిల్‌స్టోన్, ఫ్రెయా డెవిస్ భారత బ్యాటర్లపై ప్రభావం చూపగలరు. -
స్మృతి మందాన మెరుపులు.. ఇంగ్లండ్‌పై ఘన విజయం
భారత మహిళల జట్టు ఇంగ్లండ్ పర్యటనలో తొలి విజయాన్ని అందుకుంది. డెర్బీ వేదికగా మంగళవారం ఇంగ్లండ్ మహిళలతో జరిగిన రెండో టి20లో భారత మహిళల జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఉమెన్స్ 16.2 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. భారత బ్యాటర్స్‌లో స్మృతి మందాన (53 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 79 పరుగులు నాటౌట్) మెరుపులు మెరిపించగా.. చివర్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 22 బంతుల్లో 29 పరుగులు నాటౌట్‌తో ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ ఉమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఫ్రెయా కెంప్ (37 బంతుల్లో 51 పరుగులు నాటౌట్) టాప్ స్కోరర్ కాగా.. ఎం.బౌచిర్ 34 పరుగులు చేసింది. టీమిండియా మహిళల్లో స్నేహ్ రాణా 3 వికెట్లతో మెరవగా.. దీప్తి శర్మ, రేణుక సింగ్ చెరొక వికెట్ తీశారు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో ఇరుజట్లు 1-1తో సమంగా నిలిచాయి. ఇక నిర్ణయాత్మక మూడో టి20 సెప్టెంబర్ 15(గురువారం) జరగనుంది. ఆ తర్వాత భారత్, ఇంగ్లండ్‌లు మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనున్నాయి. -
CWG 2022: చరిత్ర సృష్టించిన భారత్.. స్వర్ణం నెగ్గిన వుమెన్స్ టీమ్
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న 22వ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళల లాన్ బౌల్స్ జట్టు చరిత్ర సృష్టించింది. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో తొలిసారి లాన్ బౌల్స్ క్రీడలో పతకాన్ని సాధించింది. ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన వుమెన్స్ టీమ్.. ఫైనల్లో మూడు సార్లు ఛాంపియన్ సౌతాఫ్రికాని 17-10 తేడాతో ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఫైనల్స్‌లో భారత్ పటిష్టమైన ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించింది. ఆట ఆరంభంలో టీమిండియాను తక్కువ అంచనా వేసిన సఫారీ టీమ్.. ఆ తర్వాత తేరుకున్నప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఒక దశలో దక్షిణాఫ్రికా 10-10తో స్కోర్‌ను సమం చేసుకున్నప్పటికీ.. ఆ తర్వాత టీమిండియా రెచ్చిపోయి ప్రత్యర్ధిని అదే స్కోర్ వద్ద ఉంచి ఘన విజయం సాధించింది. భారత జట్టులో రూపా దేవి ట్రికీ, నయన్మోనీ సైకియా, లవ్లీ చౌబీ, పింకీ సింగ్ అద్భుతంగా రాణించారు. సెమీస్‌లో భారత్.. న్యూజిలాండ్‌ను 16-13 తేడాతో మట్టికరిపించి ఫైనల్‌కు చేరింది. ఇదిలా ఉంటే, లాన్ బౌల్స్‌లో స్వర్ణంతో భారత్ పతకాల సంఖ్య పదికి (4 స్వర్ణాలు, 3 రజతాలు, మూడు కాంస్యాలు) చేరింది. చదవండి: కామన్వెల్త్ క్రీడల్లో సంచలనం.. 12 స్వర్ణాలు సాధించిన ఆసీస్ స్విమ్మర్ -
స్వర్ణంపై భారత్ గురి.. అసలు లాన్ బౌల్స్ అంటే ఏమిటి?
బర్మింగ్‌హామ్: లాన్ బౌల్స్... కామన్వెల్త్ క్రీడలు ప్రారంభమైన నాటినుంచి ఒక్కసారి మినహా ప్రతీసారి ఈ మెగా ఈవెంట్లో భాగంగా ఉంది. 2010 నుంచి మాత్రమే పాల్గొంటున్న భారత్ అత్యుత్తమంగా నాలుగో స్థానంలో నిలిచింది. అయితే ఇప్పుడు మన మహిళలు కొత్త చరిత్రను సృష్టించారు. లాన్ బౌల్స్ ‘ఫోర్స్’ ఫార్మాట్లో ఫైనల్‌కు చేరి పతకం ఖాయం చేశారు. లవ్లీ చౌబే, రూపా రాణి టిర్కీ, పింకీ, నయన్మోని సైకియా సభ్యులుగా ఉన్న భారత బృందం సెమీఫైనల్లో 16–13 పాయింట్ల తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించింది. నేడు దక్షిణాఫ్రికాతో జరిగే ఫైనల్లో విజయం సాధిస్తే భారత్‌కు స్వర్ణ పతకం దక్కుతుంది. ఓడితే రజతం లభిస్తుంది. భారత పురుషుల జట్టు మాత్రం 8–26 తేడాతో నార్తర్న్ ఐర్లాండ్ చేతిలో ఓడి క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది. ‘లాన్ బౌల్స్’ ఎలా ఆడతారంటే... సింగిల్స్, డబుల్స్‌లతో పాటు టీమ్‌లో నలుగురు ఉండే ‘ఫోర్స్’ ఫార్మాట్లు ఇందులో ఉన్నాయి. పచ్చిక మైదానంలో ఆడే ఈ ఆటలో ‘బౌల్స్’గా పిలిచే రెండు పెద్ద సైజు బంతులతో పాటు ‘ది జాక్’ అని చిన్న బంతి కూడా ఉంటుంది. టాస్ వేసి ముందుగా ఎవరు బౌల్ చేస్తారో, ఎవరు జాక్‌ను విసురుతారో తేలుస్తారు. ముందుగా ఒకరు ‘జాక్’ను అండర్ ఆర్మ్ త్రో తో విసురుతారు. ఆపై మరో జట్టు సభ్యులకు బౌల్స్ విసిరే అవకాశం లభిస్తుంది. ‘ఫోర్స్’ ఫార్మాట్లో ఒక్కో జట్టు ఒక్కో రౌండ్ (ఎండ్)లో ఎనిమిది త్రోలు విసరవచ్చు. ఇలా 18 రౌండ్లు ఉంటాయి. ‘జాక్’కు సాధ్యమైనంత దగ్గరగా బౌల్ చేయడమే ఫలితాన్ని నిర్దేసిస్తుంది. ప్రత్యర్థికంటే ఎన్ని తక్కువ ప్రయత్నాల్లో జాక్‌కు దగ్గరగా బౌల్ చేయగలరో అన్ని పాయింట్లు జట్టు ఖాతాలో చేరతాయి. చివర్లో ఈ పాయింట్లను లెక్కకట్టి విజేతను నిర్ణయిస్తారు. 🇮🇳 Creates History at @birminghamcg22 🔥 India's #LawnBowl Women's Four team creates history by becoming the 1st Indian Team to reach the Finals of #CommonwealthGames India 🇮🇳 16- 13 🇳🇿 New Zealand (SF) They will now take on South Africa in the Finals on 2nd Aug#Cheer4India pic.twitter.com/tu64FSoi8R — SAI Media (@Media_SAI) August 1, 2022 చదవండి: Commonwealth Games 2022: సుశీలకు చేజారిన స్వర్ణం -
కెప్టెన్ ఇన్నింగ్స్.. అర్ధసెంచరీతో చెలరేగిన హర్మన్‌ప్రీత్ కౌర్
కామన్వెల్త్ గేమ్స్-2022లో భాగంగా ఆస్ట్రేలియా మహిళలతో జరుగుతోన్న తొలి మ్యాచ్‌లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అర్ధసెంచరీతో చెలరేగింది. హర్మన్‌ప్రీత్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఫలితంగా భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 154 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో హార్మాన్ ప్రీత్(52)తో పాటు ఓపెనర్ షఫాలీ వర్మ(48) పరుగులతో రాణించింది. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మ తొలి వికెట్‌కు 24 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దూకుడుగా ఆడిన స్మృతి మంధాన(24) బ్రౌన్ బౌలింగ్‌లో తొలి వికెట్‌గా వెనుదిరిగింది. అనంతరం బ్యాటింగ్‌కు వచ్చిన యస్తికా(9) రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన హర్మన్‌ప్రీత్.. షఫాలీ వర్మతో కలిసి స్కోర్ బోర్డును చక్కదిద్దే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో 11 ఓవర్ వేసిన బ్రౌన్ బౌలింగ్‌లో భారత బ్యాటర్లు 17 పరుగులు రాబట్టారు. ఇక 48 పరుగులు సాధించి జోరు మీద ఉన్న షఫాలీ వర్మ జూనెసన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరింది. ఇక జట్టు పూర్తి బాధ్యతను కెప్టెన్ హర్మన్‌ప్రీత్ తన భుజాలపై వేసుకుంది. ఓ వైపు వికెట్లు పడుతున్న హర్మన్ మాత్రం తన కెప్టెన్ ఇన్నింగ్స్‌ను కొనసాగించింది. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో జానెసన్ నాలుగు వికెట్లు పడగొట్టగా..స్కాట్ రెండు వికెట్లు, బ్రౌన్ ఒక్క వికెట్ సాధించింది. చదవండి: Rohit Sharma: ఒంటి చేత్తో మ్యాచ్‌ను లాగేయగలరు.. అందుకే: రోహిత్ శర్మ 🔹 Who are the eight teams? 🔹 Teams in each group? 🔹 Possible gold, silver and bronze medalists? Here's all you need to know ahead of the historic debut for women's cricket at the Commonwealth Games 📽️#B2022 pic.twitter.com/4SQXu8LkLY — ICC (@ICC) July 29, 2022 -
శ్రీలంకపై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం
శ్రీలంక మహిళల జట్టుతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా మహిళల జట్టు 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో భారత మహిళల జట్టు మూడు టి20 మ్యాచ్‌ల సిరీస్‌కు ఒక మ్యాచ్ ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక మహిళల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. ఓపెనర్లు విశ్మి గుణరత్నే 45, కెప్టెన్ ఆటపట్టు 43 పరుగులు మాత్రమే రాణించగా.. మిగతావారు విఫలమయ్యారు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 87 పరుగులు జోడించారు. జట్టు స్కోరులో 75 శాతం స్కోరు ఈ ఇద్దరిదే కావడం విశేషం. టీమిండియా మహిళల బౌలర్లలో దీప్తి శర్మ 2, రేణుక సింగ్, రాదా యాదవ్, పూజా వస్రాకర్, హర్మన్ ప్రీత్ కౌర్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన టీమిండియా మహిళల జట్టు 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. స్మృతి మంధాన 39 పరుగులు చేయగా.. చివర్లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 31 పరుగులు నాటౌట్‌గా నిలిచి జట్టుకు విజయాన్ని అందించింది. మ్యాచ్ విజయంలో కీలకపాత్ర పోషించిన హర్మన్ ప్రీత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రంగా మారిన మూడో టి20 జూన్ 27న(సోమవారం) జరగనుంది. చదవండి: Virat Kohli Tattoos: కోహ్లి చేతిపై 11 పచ్చబొట్ల వెనుక రహస్యం ఏంటంటే.. -
టీమిండియా బౌలర్ అరుదైన ఫీట్.. చరిత్రకు అడుగుదూరంలో
మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా వెటరన్ పేసర్ ఝులన్ గోస్వామి సరికొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచకప్ టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా.. ఆస్ట్రేలియన్ మహిళా బౌలర్ లిన్ ఫుల్స్టన్తో కలిసి గోస్వామి సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ ఉమెన్స్‌తో మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 9 ఓవర్లో కేటీ మార్టిన్‌ను ఔట్ చేయడం ద్వారా ఈ ఫీట్‌ను అందుకుంది. ఇప్పటివరకు ఐదు ప్రపంచకప్‌లు ఆడిన గోస్వామి.. కేటీ మార్టిన్ వికెట్‌తో కలిపి 39 వికెట్లు తీసింది. ఆస్ట్రేలియాకు చెందిన లిన్ ఫుల్స్టన్ 39 వికెట్లతో తొలి స్థానంలో ఉండగా.. తాజాగా గోస్వామి ఆమె సరసన చేరింది. రాబోయే మ్యాచ్‌ల్లో గోస్వామి ఒక వికెట్ తీస్తే చాలు.. మెగాటోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్రకెక్కనుంది. ఇక 37 వికెట్లతో ఇంగ్లండ్ మహిళ క్రికెటర్ కరోల్ హోడ్జెస్ రెండో స్థానంలో.. క్లేరీ టేలర్(ఇంగ్లండ్) 36 వికెట్లతో మూడో స్థానంలో.. ఆస్ట్రేలియాకు చెందిన క్యాథరిన్ ఫిట్జ్ పాట్రిక్ 33 వికెట్లతో నాలుగో స్థానంలో ఉంది. ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ ఉమెన్స్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. అమీ సాథర్వెయిట్ 75, అమిలియా కెర్ 50 పరుగులతో రాణించారు. చదవండి: Virat Kohli: రికార్డులన్ని కోహ్లి ఖాతాలోకే.. ఎవరు టచ్ చేయలేరు Inzamam-ul-Haq: 'పనికిమాలిన పిచ్‌లు తయారు చేయకండి' -
స్మృతి మంధాన రీ ఎంట్రీ.. ఇప్పటికైనా గెలిచేనా!
క్వీన్స్‌టౌన్‌లో నేడు భారత్, న్యూజిలాండ్ మహిళల జట్ల మధ్య నాలుగో వన్డే జరగనుంది. క్వారంటైన్ కారణంగా తొలి మూడు మ్యాచ్‌లకు దూరమైన స్మృతి మంధాన ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే 0–3తో సిరీస్ కోల్పోయిన మిథాలీ సేన మిగిలిన మ్యాచ్‌లలోనైనా గెలిచి వరల్డ్ కప్‌కు ముందు కోలుకోవాలని భావిస్తోంది. తెల్లవారుజామున 3.30 గంటల నుంచి జరిగే ఈ మ్యాచ్ ‘అమెజాన్ ప్రైమ్’లో ప్రసారమవుతుంది. -
రెండో వన్డేలోనూ టీమిండియా మహిళా జట్టు ఓటమి
న్యూజిలాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా వుమెన్స్ జట్టు రెండో పరాజయాన్ని మూటగట్టుకుంది. న్యూజిలాండ్ బ్యాటర్ అమిలియా కెర్ అద్భుత సెంచరీతో భారత మహిళల జట్టుకు ఓటమి తప్పలేదు. కాగా ఐదు వన్డేల సిరీస్‌లో న్యూజిలాండ్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా వుమెన్స్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 270 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీరాజ్(81 బంతుల్లో 66 నాటౌట్, 3 ఫోర్లు), రిచా ఘోష్(64 బంతుల్లో 65, 6 ఫోర్లు, ఒక సిక్స్)తో రాణించారు. ఓపెనర్ సబ్బినేని మేఘన 49 పరుగులతో ఆకట్టుకుంది. న్యూజిలాండ్ బౌలర్లలో డివైన్ 2 వికెట్లు తీయగా.. అమిలా కెర్, ఫ్రాన్ జోనస్, రోస్‌మేరీ మెయిర్, జెస్ కెర్లు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ వుమెన్స్ 49 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. అమిలియా కెర్(135 బంతుల్లో 119 నాటౌట్, 7 ఫోర్లు) అద్బుత సెంచరీతో కడదాకా నిలిచి జట్టుకు విజయాన్ని అందించింది. మిగతావారిలో మ్యాడీ గ్రీన్(61 బంతుల్లో 52,5 ఫోర్లు), సోఫి డివైన్ 33 పరుగులతో రాణించారు. టీమిండియా వుమెన్స్ బౌలర్లలో దీప్తి శర్మ 4, పూనమ్ యాదవ్, హర్మన్‌ప్రీత్ కౌర్, రాజేశ్వరి గైక్వాడ్ తలా ఒక వికెట్ తీశారు. -
భారత మహిళా జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన..!
Powar Foresees A New Captain Smriti Mandhana: గోల్డ్‌కోస్ట్ వేదికగా ఆదివారం జరిగిన మూడో టీ20లో ఆస్ట్రేలియా మహిళల చేతిలో ఓటమి పాలైన భారత్ సిరీస్‌ను చేజార్చుకుంది. అంతక ముందు జరిగిన వన్డే సిరీస్‌లో కూడా ఓటమి పాలై ఘోర పరాభవాన్ని భారత్ మూటకట్టుకుంది. ఈ క్రమంలో జట్టు హెడ్ కోచ్ రమేశ్ పవార్ కీలక వాఖ్యలు చేశారు. భారత జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన త్వరలోనే కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకుంటుందని పవార్ తెలిపారు. టెస్టులో స్మృతి మంధాన బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతంగా ఉందని, ఏదో ఒకరోజు ఆమె జట్టును నడిపిస్తుందని ఆయన అన్నారు. "మేము ఆమెను భారత జట్టు సారధిగా చూడాలని అనుకుంటున్నాము. ‘ఆమె ప్రస్తుతం జట్టు వైస్ కెప్టెన్‌గా ఉంది. ఏదో ఒక సమయంలో ఆమె ఈ జట్టుకు నాయకత్వం వహిస్తుంది. ఏ ఫార్మాట్‌కు స్మృతి కెప్టెన్‌గా ఎంపిక అవుతోందో నాకు తెలియదు. బీసీసీఐ, సెలెక్టర్లు, నేను తదుపరి కార్యాచరణను నిర్ణయిస్తాము’ అని పవార్ పేర్కొన్నాడు. కాగా ఆస్ట్రేలియాతో జరిగినన రెండో వన్డే మ్యాచ్‌లో 86 పరుగులు చేసిన స్మృతి మంధాన, పింక్ బాల్ టెస్టు మ్యాచ్‌లో 127 పరుగులు చేసి డ్రాగా ముగియడంలో కీలక పాత్ర పోషించింది. ఆఖరి టీ20 మ్యాచ్‌లోను 52 పరుగులు చేసి రాణించింది. చదవండి: IPL 2021: ఎలిమినేటర్ మ్యాచ్‌కు ముందు ఆర్సీబీ కీలక ప్రకటన -
శిఖా పాండే అద్భుతం.. వుమెన్స్ క్రికెట్ చరిత్రలో 'బాల్ ఆఫ్ ది సెంచరీ'
Shika Pandey Stunning Delivery.. ఆస్ట్రేలియా వుమెన్స్‌తో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ శిఖా పాండే అద్బుత బంతితో మెరిసింది. ఆసీస్ ఇన్నింగ్స్ సమయంలో తొలి ఓవర్ రెండో బంతిని శిఖా పాండే ఆఫ్‌స్టంప్ దిశగా వేసింది. అయితే బంతి అనూహ్యంగా లెగ్‌స్టంప్ దిశగా టర్న్ అయి వికెట్లను గిరాటేసింది. దీంతో షాకైన ఆసీస్ ఓపెనర్ అలీసా హేలీ నిరాశగా పెవిలియన్ చేరింది. ఈ నేపథ్యంలోనే శిఖాపాండేను పులువురు మాజీ క్రికెటర్లతో పాటు నెటిజన్స్ ప్రశంసించారు.'' శిఖా పాండే ఒక అద్భుతం.. వుమెన్స్ క్రికెట్ చరిత్రలో బాల్ ఆఫ్ ది సెంచరీ'' అంటూ వసీం జాఫర్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: INDw Vs AUSw: రెండో టి20లో టీమిండియా వుమెన్స్ ఓటమి ఇక ఆస్ట్రేలియా వుమెన్స్‌తో జరిగిన రెండో టి20లో టీమిండియా పరాజయం పాలైంది. తద్వారా రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను ఆసీస్ వుమెన్స్ జట్టు 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా వర్షం కారణంగా తొలి మ్యాచ్ రద్దైన సంగతి తెలిసిందే. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా వుమెన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. టీమిండియా వుమెన్స్ బ్యాటర్స్‌లో పూజా వస్త్రాకర్ 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా కాగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 28 పరుగులు చేసింది. అనంతరం 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా వుమెన్స్ జట్టు 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. చదవండి: ఉమ్రాన్ మాలిక్ మరోసారి అత్యంత ఫాస్ట్‌బాల్; సూర్యకుమార్ విలవిల షేన్ వార్న్‌ను ఎలా మరిచిపోగలం.. ''బాల్ ఆఫ్ ది సెంచరీ'' ప్రస్తుతం శిఖా పాండే అద్భుత బంతి గురించి మాట్లాడుకుంటున్నాం గానీ.. బాల్ ఆఫ్ ది సెంచరీ అంటే మొదటగా గుర్తొచ్చేది ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్. 1993లో ఇంగ్లండ్ ఆటగాడు మైక్ గాటింగ్‌ను వార్న్ అవుట్ చేసిన తీరు క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో వార్న్ బంతిని లెగ్‌సైడ్ అవతల విసిరాడు. అయితే గాటింగ్ ఊహించని విధంగా అతని వెనుక నుంచి అనూహ్యంగా టర్న్ అయిన బంతి ఆఫ్‌స్టంప్ వికెట్‌ను ఎగురగొట్టింది. అసలు తాను ఔట్ అని తెలియక గాటింగ్ కాసేపు క్రీజులోనే ఉండడం విశేషం. వార్న్ విసిరిన అద్భుత బంతికి అప్పటి ఫీల్డ్ అంపైర్ కూడా ఆశ్చర్యానికి లోనయ్యాడు. మెన్స్ క్రికెట్ చరిత్రలో అప్పటికి.. ఇప్పటికి వార్న్ వేసిన బంతి ''బాల్ ఆఫ్ ది సెంచరీ''గా మిగిలిపోయింది. Unreeeeeeal! 😱 How far did that ball move? #AUSvIND pic.twitter.com/D3g7jqRXWK — cricket.com.au (@cricketcomau) October 9, 2021 Ball of the century, women's cricket edition! Take a bow Shikha Pandey🙌🏻 #AUSvIND pic.twitter.com/WjaixlkjIp — Wasim Jaffer (@WasimJaffer14) October 9, 2021 #OnThisDay in 1993, the ball of the century from Shane Warne 💪pic.twitter.com/yhZS2FBWqE — 7Cricket (@7Cricket) June 4, 2020 -
ఆ రెండు ఓవర్లు కొంపముంచాయి.. టీమిండియా ఓటమి
గోల్డ్‌కోస్ట్: చక్కటి బౌలింగ్ ప్రదర్శనతో విజయానికి చేరువగా వచ్చినా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తహ్లియా మెక్‌గ్రాత్ (33 బంతుల్లో 42 నాటౌట్; 6 ఫోర్లు) జోరుతో చివరకు భారత మహిళల జట్టుకు ఓటమి తప్పలేదు. మెక్‌గ్రాత్ ఫోర్లతో విరుచుకుపడటంతో కష్టమనుకున్న విజయాన్ని మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ఆ్రస్టేలియా అందుకుంది. శనివారం జరిగిన రెండో టి20లో భారత మహిళల జట్టుపై ఆ్రస్టేలియా మహిళల టీమ్ 4 వికెట్లతో గెలుపొందింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0 ఆధ్యింలో నిలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 118 పరుగులు చేసింది. పూజా వస్త్రకర్ (26 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. వర్షంతో రద్దయిన తొలి టి20లో బ్యాటింగ్‌లో అదరగొట్టిన భారత్... ఇక్కడ మాత్రం తేలిపోయింది. స్మృతి మంధాన (1), షఫాలీ వర్మ (3), జెమీమా రోడ్రిగ్స్ (7) ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ (20 బంతుల్లో 28; 5 ఫోర్లు) దూకుడుగా ఆడినా అనవసరపు షాట్‌కు ప్రయతి్నంచి స్టంపౌట్‌గా వెనుదిరిగింది. చివర్లో పూజ జోరుతో భారత్ 100 మార్కును అందుకుంది. ఆ రెండు ఓవర్లు... స్వల్ప ఛేదనలో ఆ్రస్టేలియా కూడా మొదట్లో తడబడింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో... అలీసా హీలీ (4), కెపె్టన్ మెగ్ లానింగ్ (15), గార్డ్నెర్ (1), ఎలైస్ పెర్రీ (2) వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన మెక్‌గ్రాత్... బెత్ మూనీ (36 బంతుల్లో 34; 4 ఫోర్లు)తో కలిసి జట్టును ఆదుకుంది. రాజేశ్వరీ గైక్వాడ్ తన వరుస ఓవర్లలో మూనీని, క్యారీ (7)లను అవుట్ చేసి ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. దాంతో ఆసీస్ విజయం కోసం చివరి మూడు ఓవర్లలో 25 పరుగులు చేయాలి. శిఖా పాండే వేసిన 18వ ఓవర్లో రెండు ఫోర్లతో మొత్తం 11 పరుగులు... రేణుక సింగ్ వేసిన 19వ ఓవర్లో మరో రెండు ఫోర్లతో 13 పరుగులను ఆసీస్ రాబట్టింది. 20వ ఓవర్ తొలి బంతికి సింగిల్ తీసిన మెక్‌గ్రాత్ ఆసీస్‌కు గెలుపును ఖాయం చేసింది. నేడు ఇక్కడే చివరి టి20 జరగనుంది. చదవండి: శిఖా పాండే అద్భుతం.. వుమెన్స్ క్రికెట్ చరిత్రలో 'బాల్ ఆఫ్ ది సెంచరీ' -
మెరిసిన షఫాలీ వర్మ, స్మృతి
మెల్బోర్న్: ఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు అదరగొట్టింది. ముక్కోణపు టి20 క్రికెట్ టోర్నీలో భాగంగా శనివారం ఆస్ట్రేలియా జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత ఆసీస్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 173 పరుగులు చేసింది. యాష్లే గార్డెనర్ (57 బంతుల్లో 93; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు) త్రుటిలో సెంచరీ చేజార్చుకుంది. భారత బౌలర్లలో దీప్తి శర్మ రెండు వికెట్లు తీయగా... రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్, హర్లీన్ డియోల్‌లకు ఒక్కో వికెట్ లభించింది. 174 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 19.4 ఓవర్లలో మూడు వికెట్లకు 177 పరుగులు చేసి అద్భుత విజయం సాధించింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (28 బంతుల్లో 49; 8 ఫోర్లు, సిక్స్), స్మృతి మంధాన (48 బంతుల్లో 55; 8 ఫోర్లు) తొలి వికెట్‌కు 8.2 ఓవర్లలో 85 పరుగులు జోడించి శుభారంభం ఇచ్చారు. అనంతరం జెమీమా రోడ్రిగ్స్ (19 బంతుల్లో 30; 5 ఫోర్లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (20 బంతుల్లో 20 నాటౌట్; సిక్స్), దీప్తి శర్మ (4 బంతుల్లో 11 నాటౌట్; 2 ఫోర్లు) కూడా ధాటిగా ఆడటంతో భారత్ రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని దక్కించుకుంది. టి20ల్లో భారత్‌కిదే అత్యుత్తమ ఛేజింగ్ కావడం విశేషం. -
భారత మహిళల జట్టు ఓటమి
కాన్బెర్రా: ముక్కోణపు టి20 మహిళల క్రికెట్ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో ఓడింది. తొలుత భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 103 పరుగులు చేసింది. స్మృతి (35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), హర్మన్‌ప్రీత్ (28; 4 ఫోర్లు) రాణించారు. ఎలీస్ పెర్రీ (4/13) భారత్‌ను కట్టడి చేసింది. అనంతరం ఆసీస్ 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసి నెగ్గింది. పెర్రీ (49; 8 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. -
హర్మన్‌ప్రీత్ నాయకత్వంలోనే...
ముంబై: వచ్చే నెలలో ఆ్రస్టేలియాలో జరిగే మహిళల టి20 ప్రపంచకప్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన జట్టుకు స్టార్ క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహిస్తుంది. స్మృతి మంధాన వైస్ కెప్టెన్ గా వ్యవహరిస్తుంది. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 8 వరకు ఆస్ట్రేలియాలో జరిగే ఈ మెగా ఈవెంట్ కోసం ప్రకటించిన భారత జట్టులో బెంగాల్ అమ్మాయి రిచా ఘోష్‌కు తొలిసారి స్థానం లభించింది. హైదరాబాద్‌కు చెందిన పేస్ బౌలర్ అరుంధతి రెడ్డి తన స్థానాన్ని నిలబెట్టుకుంది. విండీస్ ఆతిథ్యమిచి్చన 2018 టి20 ప్రపంచకప్‌లోనూ అరుంధతి రెడ్డి భారత్‌కు ప్రాతినిధ్యం వహించింది. హరియాణాకు చెందిన 15 ఏళ్ల టీనేజ్ సంచలనం షఫాలీ వర్మ తొలి వరల్డ్ కప్ ఆడనుంది. ఇటీవల జరిగిన చాలెంజర్ టోర్నీలో రిచా ఘోష్ బ్యాటింగ్‌తో ఆకట్టుకోవడంతో సెలక్టర్లు ఆమెను తొలిసారి జాతీయ జట్టులో ఎంపిక చేశారు. ప్రపంచకప్‌కు ముందు ఆ్రస్టేలియాలోనే జరిగే మూడు దేశాల టోర్నీలో పాల్గొనే జట్టులో 16వ సభ్యురాలిగా నుజత్ పరీ్వన్‌ను చేర్చారు. టి20 ప్రపంచకప్‌కు భారత మహిళల టి20 జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెపె్టన్), స్మృతి మంధాన (వైస్ కెపె్టన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి, రిచా ఘోష్, తానియా భాటియా, పూనమ్ యాదవ్, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, శిఖా పాండే, పూజా వస్త్రకర్, అరుంధతి రెడ్డి. -
ఒక్క పరుగు తేడాతో...
నార్త్ సౌండ్: భారత మహిళల విజయ లక్ష్యం 226 పరుగులు... ఓపెనర్లు మినహా మిగతావారు విఫలం కావడంతో తక్కువ వ్యవధిలోనే జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్‌కు వచ్చేసరికి చేయాల్సిన పరుగులు 9 కాగా 2 వికెట్లు చేతిలో ఉన్నాయి. ఒక ఎండ్‌లో జులన్ గోస్వామి (12 బంతుల్లో 14 నాటౌట్; ఫోర్) ఉండటంతో భారత్ విజయంపై ఆశలు పెట్టుకుంది. అయితే 50వ ఓవర్ వేసిన వెస్టిండీస్ సీనియర్ స్పిన్నర్ అనీసా మొహమ్మద్ ప్రత్యర్థిని దెబ్బ కొట్టింది. తొలి బంతికే ఏక్తా బిష్త్ (0)ను అవుట్ చేయగా, తర్వాతి నాలుగు బంతుల్లో జులన్ 7 పరుగులు రాబట్టింది. ఆఖరి బంతికి 2 పరుగులు చేస్తే గెలిచే అవకాశం ఉండగా, పూనమ్ యాదవ్ (0) అవుటయ్యింది. దాంతో తొలి వన్డేలో భారత్‌కు పరుగు తేడాతో ఓటమి తప్పలేదు. భారత్ 50 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ ప్రియా పూనియా (107 బంతుల్లో 75; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, జెమీమా రోడ్రిగ్స్ (75 బంతుల్లో 41; 6 ఫోర్లు, సిక్స్) రాణించింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (32 బంతుల్లో 20; ఫోర్), హర్మన్‌ప్రీత్ కౌర్ (12 బంతుల్లో 5) విఫలమయ్యారు. అనీసాకు 5 వికెట్లు దక్కాయి. అంతకుముందు వెస్టిండీస్ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. కెప్టెన్ స్టెఫానీ టేలర్ (91 బంతుల్లో 94; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ అవకాశం కోల్పోగా, నటాషా మెక్లీన్ (82 బంతుల్లో 51; 6 ఫోర్లు, సిక్స్), చెడీన్ నేషన్ (55 బంతుల్లో 43; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. శిఖా పాండే, దీప్తి శర్మ చెరో 2 వికెట్లు తీశారు. -
జెమీమా మెరుపు ఇన్నింగ్స్
కొలంబో: ముందు బౌలింగ్‌లో... ఆ తర్వాత బ్యాటింగ్‌లో మెరిసిన భారత మహిళల క్రికెట్ జట్టు శ్రీలంకతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో రెండో విజయం నమోదు చేసింది. శనివారం జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు ఐదు వికెట్ల తేడాతో గెలిచి సిరీస్‌లో 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. వర్షం కారణంగా రెండో టి20 మ్యాచ్ రద్దయింది. ఇరుజట్ల మధ్య నాలుగో మ్యాచ్ సోమవారం జరుగుతుంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 131 పరుగులు చేసింది. శశికళ సిరివర్ధనే (32 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1సిక్స్), నీలాక్షి డిసిల్వా (20 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్) మినహా మిగతావారు విఫలమయ్యారు. హైదరాబాద్ అమ్మాయి అరుంధతి రెడ్డి పొదుపుగా బౌలింగ్ చేసి 19 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకుంది. ఆమె ఓపెనర్ యశోద మెండిస్, శశికళ సిరివర్ధనేలను ఔట్ చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ కూడా రెండు వికెట్లు తీయగా... పూనమ్, అనూజా పాటిల్‌లకు ఒక్కో వికెట్ లభించింది. 132 పరుగుల లక్ష్యాన్ని భారత్ 18.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి అధిగమించింది. ఓపెనర్లు మిథాలీ రాజ్ (13), స్మృతి మంధాన (6) తక్కువ స్కోర్లకే వెనుదిరగ్గా... యువతార జెమీమా రోడ్రిగ్స్ (40 బంతుల్లో 57; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో భారత్‌ను ఆదుకుంది. హర్మన్‌ప్రీత్ కౌర్ (19 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్), జెమీమా నాలుగో వికెట్‌కు 53 పరుగులు జోడించారు. వీరిద్దరు మూడు పరుగుల తేడాలో పెవిలియన్ చేరినా... వేద కృష్ణమూర్తి (11 నాటౌట్), అనూజా పాటిల్ (8 నాటౌట్) జాగ్రత్తగా ఆడి భారత విజయాన్ని ఖాయం చేశారు. -
మహిళా కబడ్డీలోనూ నిరాశే!
జకార్త: భారత మహిళల కబడ్డీ జట్టు హ్యాట్రిక్ స్వర్ణం మిస్సయ్యింది. ఏషియన్స్ గేమ్స్‌లో భాగంగా శుక్రవారం ఇరాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళలు 24-27 తేడాతో తృటిలో పసిడిని చేజార్చుకున్నారు. ఒకవైపు పురుషుల జట్టు తొలిసారి సెమీఫైనల్లో ఓడి నిరాశపరచగా.. మహిళలు సైతం ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకున్నారు. హోరాహొరిగా సాగిన ఈ మ్యాచ్‌లో ఇరాన్ మహిళలే పై చేయి సాధించారు. అద్యాంతం ఉత్కంఠగా సాగిన ఈమ్యాచ్‌కు ఇరు దేశాల పురుషుల జట్లు హాజరై తమ జట్లకు మద్దతు పలికాయి. మ్యాచ్ సందర్భంగా పురుషుల జట్టు కెప్టెన్ అజయ్ ఠాకుర్ కన్నీటీ పర్యంతమయ్యాడు. ఆసియా క్రీడల్లో మహిళల కబడ్డీని 2010లో ప్రవేశ పెట్టినప్పటి నుంచి రెండు సార్లు భారత మహిళలే స్వర్ణం సాధించారు. తొలిసారి ఇరాన్ మహిళల జట్టు స్వర్ణం దక్కించుకుంది. ఇక భారత్ పతకాల సంఖ్య 24కు చేరింది. ఇందులో 6 స్వర్ణాలు, 5 రజతాలు, 13 కాంస్య పతకాలు ఉన్నాయి. -
విజయంతో ముగించారు
ముంబై: ఫైనల్ చేరే అవకాశాలు చేజారిన తర్వాత భారత మహిళల జట్టు మెరిసింది. ముక్కోణపు టి20 టోర్నీని విజయంతో ముగించింది. గురువారం నామమాత్రమైన చివరి లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ బృందం 8 వికెట్లతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ స్మృతి మంధాన (41 బంతుల్లో 62 నాటౌట్; 8 ఫోర్లు, 1 సిక్స్) ఈ సిరీస్‌లో మూడో అర్ధ శతకంతో విజయంలో కీలక పాత్ర పోషించింది. భారత స్పిన్నర్ల విజృంభణతో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 18.5 ఓవర్లలో 107 పరుగులకే ఆలౌటైంది. వ్యాట్ (31; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అనూజ పాటిల్ 3, రాధా యాదవ్, దీప్తి శర్మ, పూనమ్ యాదవ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఈ ఇన్నింగ్స్‌లో స్పిన్నర్లే 9 వికెట్లు పడగొట్టడం విశేషం. అనంతరం బరిలో దిగిన భారత్ 15.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసి గెలుపొందింది. మిథాలీ రాజ్ (6), జెమీమా రోడ్రిగ్స్ (7) విఫలమైనా... కెప్టెన్ హర్మన్‌ప్రీత్ (20 నాటౌట్)తో కలిసి స్మృతి మంధాన జట్టును గెలిపించింది. వీరిద్దరు అభేద్యమైన మూడో వికెట్‌కు 60 పరుగులు జత చేయడంతో మరో 26 బంతులు మిగిలుండగానే భారత్ విజయం సాధించింది. శనివారం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ల మధ్య ఫైనల్ జరుగనుంది. -
సఫారీ గడ్డపై నారీభేరి
-
సఫారీ గడ్డపై నారీభేరి
దక్షిణాఫ్రికా పర్యటనలో భారత నారీమణుల జట్టు చరిత్రకెక్కే సిరీస్‌లను కైవసం చేసుకుంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో మొదట వన్డే సిరీస్‌ను, తాజాగా టి20 సిరీస్‌నూ కైవసం చేసుకొని ఇక్కడ రెండు ఫార్మాట్లలలో నెగ్గిన తొలి జట్టుగా ఘనత వహించింది. శనివారం జరిగిన ఆఖరి టి20లో బ్యాటింగ్‌లో మిథాలీ రాజ్, ముంబై టీనేజ్ సంచలనం జెమీమా రోడ్రిగ్స్... బౌలింగ్‌లో శిఖా పాండే, రుమేలీ ధర్, రాజేశ్వరి అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నారు. కేప్‌టౌన్: భారత మహిళల జట్టు సఫారీ పర్యటనను దిగ్విజయంగా ముగించింది. ఆఖరి టి20లో హర్మన్‌ప్రీత్ బృందం 54 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘనవిజయం సాధించింది. ఐదు టి20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత మహిళల జట్టు 3–1తో కైవసం చేసుకుంది. మరో మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. మూడు వన్డేల సిరీస్‌ను 2–1తో చేజిక్కించుకున్న భారత్ వరుస సిరీస్‌లతో దక్షిణాఫ్రికా గడ్డపై చరిత్ర సృష్టించింది. శనివారం జరిగిన పోరులో మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. అనుభవజ్ఞురాలైన మిథాలీ రాజ్ (50 బంతుల్లో 62; 8 ఫోర్లు, 3 సిక్సర్లు)తో పాటు టీనేజ్ సంచలనం జెమీమా రోడ్రిగ్స్ (34 బంతుల్లో 44; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (17 బంతుల్లో 27; 1 ఫోర్, 2 సిక్సర్లు) కూడా ధాటిగా ఆడింది. సఫారీ బౌలర్లలో మరిజనే కాప్, అయబొంగ కాకా, షబ్నిమ్ ఇస్మాయిల్ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం దక్షిణాఫ్రికా జట్టు 18 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు శిఖా పాండే (3/16), రుమేలీ ధర్ (3/26), రాజేశ్వరి గైక్వాడ్ (3/26) సమష్టిగా విజృంభించడంతో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. మరిజనే కాప్ చేసిన 27 పరుగులే ప్రత్యర్థి ఇన్నింగ్స్ టాప్‌స్కోర్ కాగా... ట్రియాన్ 25 పరుగులు చేసింది. సిక్సర్లతో చెలరేగుతున్న కాప్ ఇన్నింగ్స్‌కు జెమీమా అద్భుతమైన క్యాచ్‌తో ముగింపు పలికింది. రుమేలీ బౌలింగ్‌లో మరిజనె కాప్ భారీ షాట్ బాదగా... బౌండరీ లైన్ దగ్గర జెమీమా కళ్లు చెదిరే క్యాచ్ అందుకోవడం మ్యాచ్‌లో హైలైట్. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్ రెండూ మిథాలీకే లభించాయి. -
ఆధిక్యంపై దృష్టి
ఈస్ట్ లండన్(దక్షిణాఫ్రికా):దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్‌ను గెలవడంతో పాటు మొదటి టీ 20లో గెలిచిన భారత మహిళల జట్టు.. అదే ఊపును రెండో టీ 20ల్లో కూడా కొనసాగించాలని భావిస్తోంది. ఐదు టీ 20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో భారత జట్టు ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. దాంతో రేపటి మ్యాచ్‌లో విజయం సాధించి ఆధిక్యాన్ని పెంచుకోవడంపై భారత జట్టు దృష్టి సారించింది. శుక్రవారం ఈస్ట్ లండన్‌లో బఫెలో పార్క్ స్టేడియం వేదికగా ఇరు జట్ల మధ్య రెండో టీ 20 జరుగనుంది. రేపు సాయంత్రం 4.30 ని.లకు మ్యాచ్ ఆరంభం కానున్న మ్యాచ్‌లో సైతం గెలిచి సిరీస్‌లో పైచేయి సాధించడానికి హర్మన్ ప్రీత్ కౌర్ సేన కసరత్తులు చేస్తోంది. తొలి టీ 20లో దక్షిణాఫ్రికా విసిరిన 165 పరుగుల లక్ష్యాన్ని భారత మహిళలు 18.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి ఛేదించారు.మిథాలీ రాజ్(54 నాటౌట్), వేదా కృష్ణమూర్తి(37 నాటౌట్), స్మృతీ మంధన(28), రోడ్రిగ్యూస్(37)లు రాణించి జట్టుకు సునాయస విజయాన్ని అందించారు. ఇది భారత్ జట్టుకు అత్యధిక ఛేదన కావడం ఇక్కడ మరో విశేషం. దాంతో రెండో టీ20లో భారత జట్టు ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. -
తొలి టి20లో భారత్ ఘన విజయం
పోట్చెఫ్స్ట్రూమ్: దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టి20లో భారత మహిళల జట్టు విజయం సాధించింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఆతిథ్య టీమ్‌ను 7 వికెట్లు తేడాతో చిత్తుగా ఓడించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 18.5 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. మిథాలీరాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో విజయంలో కీలకపాత్ర పోషించింది. 48 బంతుల్లో 6 ఫోర్లు సిక్సర్‌తో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. రోడ్రిక్స్(37), వేద కృష్ణమూర్తి(37) రాణించారు. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. వాన్ నీకెర్క్ 38, ట్రియన్ 32, డు ప్రీజ్ 31 రాణించారు. భారత బౌలర్లలో అనుజ పాటిల్ 2 వికెట్లు తీసింది. శిఖా పాండే, వస్త్రకార్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
ఆసీస్ మహిళలదే వన్డే సిరీస్
భారత్‌పై 2-0తో కైవసం హోబర్ట్: పొట్టి ఫార్మాట్లో దుమ్మురేపిన భారత మహిళల జట్టు... వన్డే సిరీస్‌లో మాత్రం చేతులెత్తేసింది. లక్ష్య ఛేదనలో నిలకడగా ఆడిన ఆస్ట్రేలియా... శుక్రవారం జరిగిన రెండో వన్డేలోనూ 6 వికెట్ల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో కైవసం చేసుకుంది. బెల్లెరివ్ ఓవల్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 252 పరుగులు చేసింది. స్మృతి మందన (109 బంతుల్లో 102; 11 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా, మిథాలీ రాజ్ (58), శిఖా పాండే (33 నాటౌట్), హర్మన్‌ప్రీత్ కౌర్ (21) మెరుగ్గా ఆడారు. పెర్రీ 3, షుట్ 2 వికెట్లు తీశారు. తర్వాత ఆసీస్ 46.4 ఓవర్లలో 4 వికెట్లకు 253 పరుగులు చేసింది. బోల్టన్ (77), లాన్నింగ్ (61), పెర్రీ (31), జొనాసేన్ (29 నాటౌట్), హీలే (29 నాటౌట్) గెలుపునకు అవసరమైన పరుగులు జత చేశారు. శిఖా పాండే, రాజేశ్వరి చెరో రెండు వికెట్లు తీశారు. మందనకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆఖరి వన్డే ఇదే వేదికపై ఆదివారం జరుగుతుంది. -
నయా చరిత్ర
ఆసీస్ గడ్డపై తొలిసారి సిరీస్ గెలిచిన భారత మహిళల జట్టు మెల్బోర్న్: ఆస్ట్రేలియా గడ్డపై... భారత మహిళల క్రికెట్ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. అద్భుతమైన ఆటతీరుతో పటిష్టమైన కంగారూలకు చెక్ పెట్టి తొలిసారి టి20 సిరీస్ (2-0)ను కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లోనూ 10 వికెట్ల తేడాతో ఆసీస్‌ను ఓడించి ఈ ఘనత సాధించింది. మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో 18 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 18 ఓవర్లలో 8 వికెట్లకు 125 పరుగులు చేసింది. లాన్నింగ్ (39 బంతుల్లో 49; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. జొనాసేన్ (26 బంతుల్లో 27; 1 సిక్స్), బ్లాక్వెల్ (12) మోస్తరుగా ఆడారు. భారత బౌలర్ల ధాటికి ఆసీస్ 5 ఓవర్లలో 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయినా... లాన్నింగ్, జొనాసేన్‌లు నాలుగో వికెట్‌కు 70 పరుగులు జోడించి ఆదుకున్నారు. జులన్ గోస్వామి, రాజేశ్వరి గైక్వాడ్ చెరో రెండు వికెట్లు తీశారు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన భారత్ 9.1 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 69 పరుగులు చేసి నెగ్గింది. మిథాలీ రాజ్ (32 బంతుల్లో 37 నాటౌట్; 6 ఫోర్లు), మందన (24 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు) నిలకడగా ఆడారు. టీమిండియా స్కోరు 7.5 ఓవర్లలో 52 పరుగులు ఉన్న దశలో వర్షం పడటంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం లక్ష్యాన్ని 10 ఓవర్లలో 66 పరుగులుగా సవరించారు. దీంతో 12 బంతుల్లో 13 పరుగులు చేయాల్సిన దశలో మిథాలీ రెండు, మందన ఓ ఫోర్‌తో జట్టును గెలిపించారు. ఇరుజట్ల మధ్య మూడో టి20 సిడ్నీలో ఆదివారం జరుగుతుంది. గోస్వామికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. స్కోరు వివరాలు:- ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: మూనీ (సి) పాటిల్ (బి) గోస్వామి 10; హారిస్ (బి) గోస్వామి 0; లాన్నింగ్ రనౌట్ 49; పెర్రీ రనౌట్ 4; జొనాసేన్ (సి) కృష్ణమూర్తి (బి) కౌర్ 27; హీలే (సి) మిథాలీ రాజ్ (బి) పూనమ్ 1; బ్లాక్వెల్ నాటౌట్ 12; కోయ్‌టి (సి) పాండే (బి) గైక్వాడ్ 3; ఫర్రెల్ (స్టంప్) వర్మ (బి) గైక్వాడ్ 0; చీట్లి నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం: 18 ఓవర్లలో 8 వికెట్లకు) 125. వికెట్ల పతనం: 1-1; 2-28; 3-33; 4-103; 5-105; 6-106; 7-112; 8-113. బౌలింగ్: గోస్వామి 4-0-16-2; పాండే 1-0-12-0; నిరంజన 3-0-23-0; అనుజా పాటిల్ 3-0-20-0; గైక్వాడ్ 4-0-27-2; పూనమ్ యాదవ్ 2-0-17-1; హర్మన్‌ప్రీత్ కౌర్ 1-0-2-1. భారత్ ఇన్నింగ్స్: మిథాలీ రాజ్ నాటౌట్ 37; మందన నాటౌట్ 22; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: (9.1 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా) 69. బౌలింగ్: జొనాసేన్ 2-1-7-0; ఫర్రెల్ 2-0-17-0; చీట్లి 2-0-9-0; ఫెర్లింగ్ 2-0-16-0; కోయ్‌టి 1-0-12-0; పెర్రీ 0.1-0-4-0. 2-0తో టి20 సిరీస్ సొంతం -
‘కనక’ కాంతలు...
- 4x400 రిలేలో నాలుగోసారి భారత మహిళలకు పసిడి పతకం - షాట్‌పుట్‌లో ఇందర్‌జిత్‌కు కాంస్యం ఇంచియాన్: రిలే రేసుల్లో తమ ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ భారత మహిళల జట్టు వరుసగా నాలుగోసారి ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. గురువారం జరిగిన మహిళల 4ఁ400 మీటర్ల రిలేలో ప్రియాంక, టింటూ లుకా, మన్దీప్ కౌర్, పూవమ్మలతో కూడిన భారత బృందం విజేతగా నిలిచింది. దీంతో 2002 బుసాన్ గేమ్స్ నుంచి వరుసగా నాలుగోసారి పసిడి పతకం భారత్ సొంతమైంది. 3ని 28.68 సెకన్లలో రేసును పూర్తి చేసిన భారత బృందం ఆసియా క్రీడల రికార్డును నెలకొల్పింది. 2010లో తమ పేరిటే ఉన్న రికార్డును (3ని 29.02 సెకన్లు) తిరగరాసింది. జపాన్ (3ని 30.80 సెకన్లు), చైనా (3ని 32.02 సెకన్లు)లు రజతం, కాంస్యం దక్కించుకున్నాయి. తొలి అంచెలో పరుగెత్తిన ప్రియాంక..... జపాన్ అమ్మాయి కంటే కాస్త వెనుకబడింది. అయితే రెండో అంచెలో టింటూ అద్భుతమైన పరుగుతో భారత్ లోటును పూర్తి చేసింది. మూడో అంచెలో జపాన్ నుంచి సవాలు ఎదురైనా మన్దీప్ ఏమాత్రం తడబడకుండా ఆధిక్యాన్ని కొనసాగిస్తూ పరుగు పూర్తి చేసింది. చివరిదైన నాలుగో అంచెలో పూవమ్మ యాంకర్ పాత్రలో అద్భుతమైన ఫినిషింగ్ ఇచ్చి భారత్‌కు కనకాన్ని అందించింది. పురుషుల షాట్‌పుట్‌లో భారత్‌కు కాంస్యం లభించింది. ఫైనల్లో ఇందర్జిత్ సింగ్ ఇనుప గుండును 19.63 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచాడు. ఐదో ప్రయత్నంలో భారత షాట్ పుటర్ ఈ దూరాన్ని అందుకున్నాడు.