ఒక్క పరుగు తేడాతో... | India Women's Team Lost By One Run In ODI Against West Indies | Sakshi
Sakshi News home page

ఒక్క పరుగు తేడాతో...

Published Sun, Nov 3 2019 3:30 AM | Last Updated on Sun, Nov 3 2019 3:30 AM

India Women's Team Lost By One Run In ODI Against West Indies - Sakshi

నార్త్‌ సౌండ్‌: భారత మహిళల విజయ లక్ష్యం 226 పరుగులు... ఓపెనర్లు మినహా మిగతావారు విఫలం కావడంతో తక్కువ వ్యవధిలోనే జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. చివరి ఓవర్‌కు వచ్చేసరికి చేయాల్సిన పరుగులు 9 కాగా 2 వికెట్లు చేతిలో ఉన్నాయి. ఒక ఎండ్‌లో జులన్‌ గోస్వామి (12 బంతుల్లో 14 నాటౌట్‌; ఫోర్‌) ఉండటంతో భారత్‌ విజయంపై ఆశలు పెట్టుకుంది. అయితే 50వ ఓవర్‌ వేసిన వెస్టిండీస్‌ సీనియర్‌ స్పిన్నర్‌ అనీసా మొహమ్మద్‌ ప్రత్యర్థిని దెబ్బ కొట్టింది. తొలి బంతికే ఏక్తా బిష్త్‌ (0)ను అవుట్‌ చేయగా, తర్వాతి నాలుగు బంతుల్లో జులన్‌ 7 పరుగులు రాబట్టింది. ఆఖరి బంతికి 2 పరుగులు చేస్తే గెలిచే అవకాశం ఉండగా, పూనమ్‌ యాదవ్‌ (0) అవుటయ్యింది.

దాంతో తొలి వన్డేలో భారత్‌కు పరుగు తేడాతో ఓటమి తప్పలేదు. భారత్‌ 50 ఓవర్లలో 224 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌ ప్రియా పూనియా (107 బంతుల్లో 75; 6 ఫోర్లు) అర్ధ సెంచరీ సాధించగా, జెమీమా రోడ్రిగ్స్‌ (75 బంతుల్లో 41; 6 ఫోర్లు, సిక్స్‌) రాణించింది. కెప్టెన్‌ మిథాలీ రాజ్‌ (32 బంతుల్లో 20; ఫోర్‌), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (12 బంతుల్లో 5) విఫలమయ్యారు. అనీసాకు 5 వికెట్లు దక్కాయి. అంతకుముందు వెస్టిండీస్‌ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. కెప్టెన్‌ స్టెఫానీ టేలర్‌ (91 బంతుల్లో 94; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ అవకాశం కోల్పోగా, నటాషా మెక్లీన్‌ (82 బంతుల్లో 51; 6 ఫోర్లు, సిక్స్‌), చెడీన్‌ నేషన్‌ (55 బంతుల్లో 43; 4 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. శిఖా పాండే, దీప్తి శర్మ చెరో 2 వికెట్లు తీశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement