Shika Pandey Stunning Delivery.. ఆస్ట్రేలియా వుమెన్స్‌తో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ శిఖా పాండే అద్బుత బంతితో మెరిసింది. ఆసీస్ ఇన్నింగ్స్ సమయంలో తొలి ఓవర్ రెండో బంతిని శిఖా పాండే ఆఫ్‌స్టంప్ దిశగా వేసింది. అయితే బంతి అనూహ్యంగా లెగ్‌స్టంప్ దిశగా టర్న్ అయి వికెట్లను గిరాటేసింది. దీంతో షాకైన ఆసీస్ ఓపెనర్ అలీసా హేలీ నిరాశగా పెవిలియన్ చేరింది. ఈ నేపథ్యంలోనే శిఖాపాండేను పులువురు మాజీ క్రికెటర్లతో పాటు నెటిజన్స్ ప్రశంసించారు.'' శిఖా పాండే ఒక అద్భుతం.. వుమెన్స్ క్రికెట్ చరిత్రలో బాల్ ఆఫ్ ది సెంచరీ'' అంటూ వసీం జాఫర్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చదవండి: INDw Vs AUSw: రెండో టి20లో టీమిండియా వుమెన్స్ ఓటమి
ఇక ఆస్ట్రేలియా వుమెన్స్‌తో జరిగిన రెండో టి20లో టీమిండియా పరాజయం పాలైంది. తద్వారా రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను ఆసీస్ వుమెన్స్ జట్టు 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా వర్షం కారణంగా తొలి మ్యాచ్ రద్దైన సంగతి తెలిసిందే. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా వుమెన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. టీమిండియా వుమెన్స్ బ్యాటర్స్‌లో పూజా వస్త్రాకర్ 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా కాగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 28 పరుగులు చేసింది. అనంతరం 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా వుమెన్స్ జట్టు 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
చదవండి: ఉమ్రాన్ మాలిక్ మరోసారి అత్యంత ఫాస్ట్‌బాల్; సూర్యకుమార్ విలవిల
షేన్ వార్న్‌ను ఎలా మరిచిపోగలం.. ''బాల్ ఆఫ్ ది సెంచరీ''
ప్రస్తుతం శిఖా పాండే అద్భుత బంతి గురించి మాట్లాడుకుంటున్నాం గానీ.. బాల్ ఆఫ్ ది సెంచరీ అంటే మొదటగా గుర్తొచ్చేది ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్. 1993లో ఇంగ్లండ్ ఆటగాడు మైక్ గాటింగ్‌ను వార్న్ అవుట్ చేసిన తీరు క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో వార్న్ బంతిని లెగ్‌సైడ్ అవతల విసిరాడు. అయితే గాటింగ్ ఊహించని విధంగా అతని వెనుక నుంచి అనూహ్యంగా టర్న్ అయిన బంతి ఆఫ్‌స్టంప్ వికెట్‌ను ఎగురగొట్టింది. అసలు తాను ఔట్ అని తెలియక గాటింగ్ కాసేపు క్రీజులోనే ఉండడం విశేషం. వార్న్ విసిరిన అద్భుత బంతికి అప్పటి ఫీల్డ్ అంపైర్ కూడా ఆశ్చర్యానికి లోనయ్యాడు. మెన్స్ క్రికెట్ చరిత్రలో అప్పటికి.. ఇప్పటికి వార్న్ వేసిన బంతి ''బాల్ ఆఫ్ ది సెంచరీ''గా మిగిలిపోయింది.
Unreeeeeeal! 😱 How far did that ball move? #AUSvIND pic.twitter.com/D3g7jqRXWK
— cricket.com.au (@cricketcomau) October 9, 2021
Ball of the century, women's cricket edition! Take a bow Shikha Pandey🙌🏻 #AUSvIND pic.twitter.com/WjaixlkjIp
— Wasim Jaffer (@WasimJaffer14) October 9, 2021
#OnThisDay in 1993, the ball of the century from Shane Warne 💪pic.twitter.com/yhZS2FBWqE
— 7Cricket (@7Cricket) June 4, 2020
Comments
Please login to add a commentAdd a comment