Australia Women Cricket Team
-
వరల్డ్‌కప్‌లో బోణీ కొట్టిన ఆసీస్.. శ్రీలంక టోర్నీ నుంచి ఔట్
మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. షార్జా వేదికగా శ్రీలంక మహిళలతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది.94 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 4 వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా అమ్మాయిలు చేధించారు. స్టార్ ఓపెనర్ బెత్ మూనీ 43 పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేసింది. లంక బౌలర్లలో ప్రబోధని, రణవీర, కుమారి తలా వికెట్ సాధించారు.తేలిపోయిన లంక బ్యాటర్లు.. అంతకముందు ఆసీస్ బౌలర్ల దాటికి శ్రీలంక బ్యాటర్లు తేలిపోయారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లంకేయులు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 93 పరుగులకే పరిమితమైంది.ఆస్ట్రేలియా బౌలర్లలో పేసర్ స్కాట్ మూడు వికెట్లు పడగొట్టగా.. మోలనిక్స్ రెండు వికెట్లు సాధించింది. ఇక ఈ ఓటమితో శ్రీలంక దాదాపు సెమీస్ రేసు నుంచి నిష్క్రమించినట్లే. ఆసీస్ తమ తదుపరి మ్యాచ్‌లో ఆక్టోబర్ 8న న్యూజిలాండ్‌తో తలపడనుంది.చదవండి: అశ్విన్ వారసుడు దొరికినట్లేనా? -
ఆస్ట్రేలియాతో రెండో వన్డే.. 8 వికెట్ల తేడాతో భారత్ ఓటమి
ఆ్రస్టేలియా పర్యటనలో భారత మహిళల ‘ఎ’ జట్టు పరాజయాల పరంపర కొనసాగుతోంది. టి20 సిరీస్‌లో మూడు మ్యాచ్‌లూ ఓడిన మన అమ్మాయిల జట్టు.. వన్డేల్లోనూ వరుసగా రెండో మ్యాచ్ ఓడి సిరీస్ కోల్పోయింది. శుక్రవారం మెకాయ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో భారత మహిళల ‘ఎ’ జట్టు 8 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 48 ఓవర్లలో 218 పరుగులకే ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రాఘవి ఆనంద్ సింగ్(70), తేజల్ హసబ్నిస్(63) టాప్ స్కోరర్లగా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో మాట్ బ్రౌన్, నికోలా హాన్కాక్, నాట్ తలా రెండు వికెట్లు సాధించగా.. తైలా, పర్సన్స్ చెరో వికెట్ సాధించారు. అనంతరం 219 పరుగుల లక్ష్యాన్ని ఆసీస్ 40.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఊదిపడేసింది. ఆసీస్ ఓపెనర్ డార్క్(105) ఆజేయ శతకంతో చెలరేగింది.చదవండి: LPL 2024: శ్రీలంక స్టార్ క్రికెటర్‌పై వేటు.. -
ఆస్ట్రేలియా కెప్టెన్‌గా స్టార్ ఓపెనర్.. వైస్ కెప్టెన్ ఎవరంటే?
ఆస్ట్రేలియా మహిళా జట్టు రెగ్యూలర్ కెప్టెన్‌గా స్టార్ వికెట్ కీపర్-బ్యాటర్ అలిస్సా హీలీ ఎంపికైంది. మూడు ఫార్మాట్లలోనూ మేగ్ లానింగ్ వారసురాలిగా హేలీని నియమిస్తూ క్రికెట్ ఆస్ట్రేలియా శనివారం నిర్ణయం తీసుకుంది. అదే విధంగా ఆసీస్ జట్టు వైస్ కెప్టెన్‌గా తహ్లియా మెక్‌గ్రాత్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. కాగా మేగ్ లానింగ్ గైర్హజరీలో చాలా సిరీస్‌లలో హీలీనే ఆసీస్ జట్టుకు సారథ్యం వహించింది. ఈ ఏడాది జూన్ నుంచి ఇంగ్లండ్, ఐర్లాండ్, వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లలో ఆసీస్ స్టాండింగ్ కెప్టెన్ హీలీ వ్యవహరించింది. ఇక ఫుల్‌టైమ్ కెప్టెన్‌గా ఎంపికైన తర్వాత హీలీ స్పందించింది. ‘ఆసీస్ సారథిగా ఎంపికైనందకు చాలా గర్వంగా ఫీలవుతున్నా. జట్టును నడిపించే అవకాశం దొరికినందుకు సంతోషంగా ఉంది. గత కొన్ని నెలలుగా జట్టు సభ్యులు ఎంతో సహకారం అందించారు’ అని హేలీ తెలిపింది. కాగా హీలీకి ఫ్రాంచైజీ క్రికెట్లో కూడా సారధిగా అనుభవం ఉంది. మహిళల ప్రీమియర్ లీగ్‌లో యూపీ వారియర్స్ జట్టుకు ఆమె సారధిగా కొనసాగుతోంది. మహిళల బిగ్‌బాష్‌లీగ్‌లో కూడా కొన్ని సీజన్లలో సిడ్నీ సిక్సర్స్‌కు కెప్టెన్‌గా కూడా వ్యవహరించింది. కాగా ఆస్ట్రేలియా పురుషల జట్టు స్టార్ బౌలర్ మిచెల్ స్టార్క్ భార్యనే హీలీ అన్న సంగతి తెలిసిందే. Introducing our official @AusWomenCricket leadership duo! Congratulations to Alyssa and Tahlia 👏 pic.twitter.com/soNHQXQPOz — Cricket Australia (@CricketAus) December 8, 2023 -
యాషెస్ సిరీస్ విజేతగా ఇంగ్లండ్.. ఆఖరి మ్యాచ్‌లో ఆసీస్ ఓటమి
మహిళల యాషెస్ 2023లో భాగంగా జరిగిన టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో ఇంగ్లండ్ సొంతం చేసుకుంది. లార్డ్స్ వేదికగా జరిగిన సిరీస్ డిసైడర్ మూడో టీ20లో ఆస్ట్రేలియాపై 5 వికెట్ల తేడాతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో ఇంగ్లండ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మూనీ(32), గార్డెనర్(32), పెర్రీ(34) పరుగులతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో నాట్ స్కివర్ రెండు, డీన్, బెల్, గిబ్సన్, ఎకిలస్టన్ తలా వికెట్ సాధించారు. ఇక ఇన్నింగ్స్ అనంతరం మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో ఇంగ్లండ్ విజయలక్ష్యాన్ని 14 ఓవర్లకు 119 పరుగులగా కుదించారు. అనంతరం 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లీష్ జట్టు 13.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లండ్ విజయంలో అలీస్ క్యాప్సీ(46) పరుగులతో కీలక పాత్ర పోషించింది. ఆసీస్ బౌలర్లలో మెగాన్ స్కాట్ రెండు వికెట్లు, బ్రౌన్, జానెసన్, జార్జీయా తలా వికెట్ సాధించారు. కాగా అంతకుముందు యాషెస్‌లో భాగంగా జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మహిళల జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. అదే విధంగా మహిళల యాషెస్ 2023లో భాగంగా మూడు వన్డేల సిరీస్‌లో కూడా ఇరు జట్లు తలపడనున్నాయి. జూలై 12 బ్రిస్టల్ వేదికగా జరగనున్న తొలి వన్డేతో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. చదవండి: IND vs AFG: టీమిండియా అభిమానులకు గుడ్‌న్యూస్.. ఆ సిరీస్‌కు ముహూర్తం ఖరారు! -
ఆస్ట్రేలియా ‘హ్యాట్రిక్’ విజయం.. శ్రీలంకను చిత్తు చేసిన కంగారూలు
గెబెర్హా: మహిళల టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన గ్రూప్ ‘1’ మ్యాచ్‌లో ఆసీస్ 10 వికెట్ల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ముందుగా లంక 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 112 పరుగు లకే పరిమితమైంది. హర్షిత (34)దే అత్యధిక స్కోరు. అనంతరం ఆసీస్ 15.5 ఓవర్లలో వికెట్ కో ల్పోకుండా 113 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అలీసా హీలీ (43 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్), బెత్ మూనీ (53 బంతుల్లో 56 నాటౌట్; 7 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. చదవండి: స్టన్నింగ్ క్యాచ్.. అద్భుత విన్యాసానికి హ్యాట్సాఫ్ -
76 పరుగులకే ఆలౌట్.. న్యూజిలాండ్‌పై ఆసీస్ ఘన విజయం
మహిళల టీ20 ప్రపంచకప్-2023లో ఆస్ట్రేలియా జట్టు శుభారంభం చేసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా శనివారం పార్ల్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 97 పరుగుల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. 174 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 76 పరుగులకే ఆలౌటైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో గార్డనర్ 5 వికెట్లతో చెలరేగగా.. స్కాట్ రెండు, బ్రౌన్, పెర్రీ తలా వికెట్ సాధించారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో అమీలియా కెర్ 21 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో హీలీ (55), లానింగ్(41), పెర్రీ(40) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో తాహు, అమేలియా కెర్ తలా మూడు వికెట్లు పడగొట్టగా.. జెస్ కెర్, జానెసన్ చెరో వికెట్ సాధించారు. ఇక ఆస్ట్రేలియా తమ తదుపరి మ్యాచ్‌లో మంగళవారం బంగ్లాదేశ్ తలపడనుండగా.. న్యూజిలాండ్ సోమవారం దక్షిణాఫ్రికాతో ఆడనుంది. చదవండి: T20 World Cup: పాక్‌తో పోరుకు భారత్ ‘సై’ -
అందంతో మతిపోగొడుతున్న మహిళా క్రికెటర్
ఆస్ట్రేలియా మహిళా క్రికెట్ ఆల్ రౌండర్ ఎల్లీస్ పెర్రీ తన అందచందాలతో కుర్రకారు గుండెళ్లో రైళ్లు పరిగెత్తించింది. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన క్రికెట్ ఆస్ట్రేలియా అవార్డ్స్ లో పెర్రీ తళుక్కున మెరిసింది. ఈ కార్యక్రమానికి ఆసీస్ మెన్స్ క్రికెటర్లతో పాటు మహిళా క్రికెటర్లు హాజరయ్యారు. అయితే అందరి దృష్టి ఎల్లీస్ పెర్రీపైనే నెలకొంది. అందుకు కారణం ఆమె వేసుకొచ్చిన దుస్తులు. రెడ్ కలర్ డ్రెస్‌లో బ్లూ కార్పెట్‌పై క్లీవేజ్ షో చేస్తూ దగదగ మెరిసిపోయిన ఎల్లీస్ పెర్రీ అవార్డు కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రౌండ్లో తన ఆటతో అభిమానులను మంత్రముగ్దులను చేసిన ఎలీస్ పెర్రీ.. తాజాగా అవార్డు కార్యక్రమంలో తన అందచందాలతో అలరించింది. ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 32 ఏండ్ల ఈ ఆసీస్ ఆల్ రౌండర్.. 2007 నుంచి కంగారు జట్టులో కీలక సభ్యురాలిగా వ్యవహరిస్తోంది. ఆస్ట్రేలియా తరఫున 10 టెస్టులు, 128 వన్డేలు, 131 టీ20 మ్యాచ్ లు ఆడింది. టెస్టులలో 752 పరుగులు చేసింది. ఇందులో రెండు సెంచరీలు కూడా ఉండటం విశేషం. బౌలర్ గా 37 వికెట్లు పడగొట్టింది. వన్డేలలో పెర్రీ.. 3,369 పరుగులు చేసి 161 వికెట్లు పడగొట్టడం విశేషం. ఇక టీ20లలో 1,418 రన్స్ చేసి 117 వికెట్లు సాధించింది. ఇక అవార్డుల విషయానికి వస్తే.. ►స్టీవ్ స్మిత్ ఉత్తమ ఆస్ట్రేలియా క్రికెటర్(అలెన్ బోర్డర్ మెడల్) అవార్డు సొంతం చేసుకోగా.. ఉత్తమ ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్‌గా బెత్‌మూనీ(బెలిండా క్లార్క్) అవార్డు గెలుచుకుంది. ►మెన్స్ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్- ఉస్మాన్ ఖవాజా ►ఉమెన్స్ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్- బెత్ మూనీ ►మెన్స్ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్- డేవిడ్ వార్నర్ ►వుమెన్స్ టి20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్- తాహిలా మెక్‌గ్రాత్ ►మెన్స్ టి20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్- మార్కస్ స్టోయినిస్ ►వుమెన్స్ డొమెస్టిక్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్-అన్నాబెల్ సదర్లాంఢ్ ►మెన్స్ డొమెస్టిక్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్- మైకెల్ నాసర్ ►బ్రాడ్‌మన్ యంగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్- లాన్స్ మోరిస్ ►కమ్యూనిటి ఇంపాక్ట్ అవార్డు- ఉస్మాన్ ఖవాజా -
రూల్స్ భ్రష్టు పట్టించారు.. క్రీడాస్పూర్తికి విరుద్ధం
ఐసీసీ అండర్-19 టి20 వుమెన్స్ వరల్డ్‌కప్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. శ్రీలంక మహిళా క్రికెటర్ ఐసీసీ రూల్స్‌ను తుంగలోకి తొక్కి క్రీడాస్పూర్తికి విరుద్ధంగా వ్యవహరించింది. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బ్యాటర్‌ను క్రీజులోకి రానీయకుండా ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడమే గాక రనౌట్‌కు కారణమైంది సదరు లంక క్రికెటర్. విషయంలోకి వెళితే.. టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియా వుమెన్స్, శ్రీలంక వుమెన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆస్ట్రేలియా వుమెన్స్ బ్యాటింగ్ సమయంలో ఇన్నింగ్స్ 19వ ఓవర్ నేత్రాంజలి వేసింది. ఆ ఓవర్ చివరి బంతిని అమీ స్మిత్ లాంగాఫ్ దిశగా ఆడింది. రెండు పరుగులు వచ్చే అవకాశం ఉండడంతో అమీ స్మిత్ పరిగెత్తింది. నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న హామిల్టన్ రెండో పరుగు పూర్తి చేసే క్రమంలో దిశానాయకే బంతి అందుకొని నాన్‌స్టైక్ర్ ఎండ్ వైపు విసిరింది. అయితే ఇదే సమయంలో అక్కడే ఉన్న నేత్రాంజలి హామిల్టన్‌కు క్రీజులోకి రాకుండా కావాలనే ఆమెకు అడ్డుగా వెళ్లింది. ఇదంతా రిప్లేలో స్పష్టంగా కనిపించింది. అప్పటికే బంతి నేరుగా వికెట్లను గిరాటేయడం.. అంపైర్ రనౌట్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. ఒకవేళ లంక బౌలర్ అడ్డుకోకపోయుంటే హామిల్టన్ సకాలంలో క్రీజులోకి చేరేదే. ఈ పరిణామంతో షాక్ తిన్న ఆసీస్ బ్యాటర్లు ఇదేం చర్య అన్నట్లుగా చూశారు. కానీ అంపైర్ ఔట్ ఇవ్వడంతో చేసేదేం లేక హామిల్టన్ నిరాశగా పెవిలియన్ చేరింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ''అంత క్లియర్‌గా చీటింగ్ అని తెలుస్తుంది.. ఇది క్రీడాస్పూర్తికి విరుద్ధం'' అంటూ కామెంట్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా వుమెన్స్ 108 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ వుమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. ఎల్లా హేవార్డ్ 36, సియాన్నా జింజర్ 30 పరుగులు, కేట్ పిల్లే 27 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన లంక మహిళల జట్టు 51 పరుగులకే కుప్పకూలింది. లంక బ్యాటర్లలో ఒక్కరు మాత్రమే డబుల్ డిజిట్ మార్క్ అందుకోగా.. మిగతా పది మంది సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆసీస్ బౌలర్లలో మ్యాగీ క్లార్క్ , లూసీ హామిల్టన్‌లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు. View this post on Instagram A post shared by ICC (@icc) చదవండి: 43 ఏళ్లలో తొలిసారి.. ముంబై జట్టుకు ఘోర అవమానం స్లో ఓవర్ రేట్.. టీమిండియాకు పడింది దెబ్బ -
ఆఖరి టీ20లోనూ భారత్‌కు తప్పని ఓటమి..
ముంబై: గత మ్యాచ్‌లోనే ఆస్ట్రేలియా మహిళల చేతికి టి20 సిరీస్ అప్పగించిన భారత మహిళల జట్టు చివరి పోరులోనూ చతికిలపడింది. ఫలితంగా సొంతగడ్డపై సిరీస్‌ను ఓటమితో ముగించింది. మంగళవారం జరిగిన ఐదో టి20 మ్యాచ్‌లో ఆస్ట్రే లియా 54 పరుగులతో భారత్‌పై నెగ్గి సిరీస్‌ను 4–1తో సొంతం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేయగా... భారత్ 20 ఓవర్లలో 142 పరుగులకే ఆలౌటైంది. ఆసీస్ పేసర్ హీతర్ గ్రాహమ్ (4/8) ‘హ్యాట్రిక్’తో భారత్‌ను దెబ్బ తీసింది. తాను వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్లోని చివరి రెండు బంతులకు దేవిక, రాధ యాదవ్‌లను అవుట్ చేసిన హీతర్... 20వ ఓవర్ తొలి బంతికి రేణుక సింగ్‌ను అవుట్ చేసి ‘హ్యాట్రిక్’ పూర్తి చేసుకుంది. అంతకుముందు ఆస్ట్రేలియా తరఫున యాష్లే గార్డ్నర్ (32 బంతుల్లో 66 నాటౌట్; 11 ఫోర్లు, 1 సిక్స్), గ్రేస్ హారిస్ (35 బంతుల్లో 64 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు అర్ధ సెంచరీలతో చెలరేగారు. 67 పరుగుల వద్దే ఆసీస్ నాలుగో వికెట్ కోల్పోగా, ఆ తర్వాత గార్డ్నర్, హారిస్ కలిసి జట్టుకు భారీ స్కోరు అందించారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు అభేద్యంగా 62 బంతుల్లోనే 129 పరుగులు జోడించడం విశేషం. తొలి 10 ఓవర్లలో ఆస్ట్రేలియా స్కోరు 72 పరుగులు కాగా, తర్వాతి 10 ఓవర్లలో జట్టు 124 పరుగులు సాధించింది. 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఏ దశలోనూ విజయం దిశగా సాగలేదు. ఒక్క దీప్తి శర్మ (53; 8 ఫోర్లు, 1 సిక్స్) చివరి వరకు పోరాడటం మినహా ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు. హర్లీన్ (24) ఫర్వాలేదనిపించగా... టాప్ బ్యాటర్లు స్మృతి మంధాన (4), షఫాలీ వర్మ (13), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (12) ప్రభావం చూపలేకపోవడంతో జట్టుకు ఓటమి తప్పలేదు. చదవండి: FIFA WC 2022: అభిమాన సంద్రం మధ్య... అర్జెంటీనా జట్టు సంబరాలు -
టీమిండియాకు తప్పని పరాభవం.. ఆస్ట్రేలియా వుమెన్స్దే సిరీస్
టీమిండియా వుమెన్స్‌తో జరిగిన నాలుగో టి20లో ఆస్ట్రేలియా వుమెన్స్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఆస్ట్రేలియా వుమెన్స్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మహిళల జట్టు ఆఖరి వరకు విజయం కోసం పోరాడినప్పటికి ఒత్తిడి జయించలేక చతికిలపడింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి విజయానికి ఏడు పరుగుల దూరంలో ఆగిపోయింది. టీమిండియా వుమెన్స్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(30 బంతుల్లో 46 పరుగులు)టాప్ స్కోరర్‌గా నిలవగా.. చివర్లో రిచా ఘోష్(19 బంతుల్లో 40 నాటౌట్) రాణించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో అష్లీ గార్డెనర్, అలానా కింగ్ చెరో రెండు వికెట్లు తీయగా.. డార్సీ బ్రైన్ ఒక వికెట్ తీసింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా వుమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. పెర్రీ(42 బంతుల్లో 72 పరుగులు నాటౌట్), గార్డెనర్(27 బంతుల్లో 42 పరుగులు, హేలీ 30 పరుగులు చేసింది. -
సిరీస్‌లో నిలవాలంటే.. గెలవాల్సిందే! భారత్ తుది జట్టు ఇదే?
ముంబై: ఆస్ట్రేలియాతో జరుగుతున్న ద్వైపాక్షిక సిరీస్ రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌కు భారత మహిళల జట్టు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య శనివారం ఇక్కడ నాలుగో టి20 మ్యాచ్ జరుగుతుంది. ఇందులో గెలిస్తేనే భారత్‌కు సిరీస్ గెలిచే అవకాశముంటుంది. ఈ మ్యాచ్‌లో గనక ఓడితే ఇక్కడే సిరీస్‌ను సమర్పించుకుంటుంది. ఈ నేపథ్యంలో చావోరేవో తేల్చుకోవాల్సిన భారత అమ్మాయిలపైనే ఒత్తిడి నెలకొంది. పైగా ఆసీస్‌లాంటి మేటి జట్టును ఎదుర్కోవాలంటే హర్మన్‌ప్రీత్ సేన సర్వశక్తులు ఒడ్డాల్సిందే! ముఖ్యంగా బ్యాటింగ్ ఫర్వాలేదనిపిస్తున్నా... బౌలింగే జట్టు మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది. గత మ్యాచ్‌లో ఆరంభంలోనే ఆసీస్ వికెట్లను పడగొట్టినప్పటికీ తర్వాత పట్టు సడలించడంతో ఆస్ట్రేలియా స్కోరు మళ్లీ 170 పరుగులు దాటింది. ఆంధ్ర పేసర్ అంజలి శర్వాణి వికెట్లు తీస్తున్నప్పటికీ పరుగులు మాత్రం ధారాళంగా ఇస్తోంది. సీనియర్లు రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మలు సైతం భారీగా పరుగులు ఇవ్వడం ప్రతికూలంగా మారుతోంది. ఈ నేపథ్యంలో కోచింగ్ బృందం బౌలింగ్ విభాగంపైనే ప్రధానంగా దృష్టి సారించాలి. లోపాలను సరిదిద్దుకొని బౌలింగ్ పదును పెంచాలి. ఇక బ్యాటింగ్ విషయానికొస్తే జెమిమా రోడ్రిగ్స్ పేలవ ఫామ్ వల్ల పటిష్ట భాగస్వామ్యాలకు అవకాశం లేకుండాపోతోంది. మూడు మ్యాచ్‌ల్లో ఆమె వరుసగా 0, 4, 16 పరుగులతో నిరాశపరిచింది. కీలకమైన నేటి మ్యాచ్‌లో ఆమె మంచి స్కోరు చేస్తే జట్టు భారీస్కోరుకు బాటపడుతుంది. మరోవైపు 2–1తో ఇప్పటికే ఆధిక్యంలో ఉన్న ఆసీస్ అమ్మాయిలు ఇక్కడే సిరీస్ గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ముఖ్యంగా బౌలింగ్, బ్యాటింగ్ రంగాల్లో మనకన్నా మెరుగ్గా ఉండటంతో ఆస్ట్రేలియాకు వరుస విజయం ఏమంత కష్టం కాదు. భారత తుది జట్టు(అంచనా): స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్, దేవికా వైద్య, రిచా ఘోష్, దీప్తి శర్మ, రాధా యాదవ్, అంజలి సర్వాణి, రేణుకా ఠాకూర్, రాజేశ్వరి గయక్వాడ్ చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్ గడ్డపై కుల్దీప్ యాదవ్ సరికొత్త చరిత్ర.. తొలి భారత స్పిన్నర్‌గా -
ఆస్ట్రేలియాతో టి20 మ్యాచ్.. దుమ్మురేపిన ఇండియా అమ్మాయిలు ( ఫొటోలు)
-
మన అమ్మాయిలే ‘సూపర్’
ఆ్రస్టేలియా మహిళల జట్టు భారత్ పాలిట దుర్భేద్యమైన ప్రత్యర్థి. ప్రపంచకప్, పతకం (కామన్వెల్త్ గేమ్స్) తెచ్చే మ్యాచ్‌ల్లో మనల్ని రన్నరప్‌గా మార్చిన జట్టు. ఒత్తిడిలో చిత్తుచేసే అలాంటి ఘనమైన ప్రత్యరి్థని ఈసారి భారత మహిళలు చిత్తు చేశారు. మొదట భారీ స్కోరు చేస్తే దాన్ని మనమ్మాయిలు సమం చేశారు. తొలిసారి ‘సూపర్ ఓవర్’ ఒత్తిడిని భారత్ జయిస్తే... ఆసీస్ మూడోసారి తడబడి ఓడింది. అమ్మాయిల క్రికెట్ అంటే మనం ఏ ప్రపంచకప్పో లేదంటే ఫైనల్ మ్యాచో ఉంటేనే కన్నేస్తాం! సాధారణ ద్వైపాక్షిక సిరీస్‌లు ఎన్ని ఆడినా అటువైపే కన్నెత్తి చూడం. ఇకపై ఈ చిన్నచూపు మాయం కానుంది. ఎందుకంటే భారత అమ్మాయిల ఆట కూడా ‘సూపర్’ టెన్షన్ తెస్తోంది. కాబట్టి మనందరి అటెన్షన్ మారబోతోంది. ముంబై: అట్లుంటది మనతోని! అని ఇన్నాళ్లు పురుషుల క్రికెటే భారత్‌లో కాలర్ ఎగరేసింది. ఉత్కంఠ రేపినా... ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టినా... ‘సూపర్ ఓవర్’ అయినా పురుషాధిక్య క్రికెట్టే శాసించింది. తొలిసారి ఉత్కంఠ ఉరిమి, భారీస్కోర్లు సమమైతే... ‘సూపర్ ఓవర్’ కిక్‌లో తామేమీ తక్కువ కాదని భారత అమ్మాయిల క్రికెట్ జట్టు నిరూపించింది. తమకెదురైన భారీ స్కోరుకు దీటుగా మెరుపులు మెరిపించిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్మృతి మంధాన (49 బంతుల్లో 79; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), రిచా ఘోష్ (13 బంతుల్లో 26 నాటౌట్; 3 సిక్సర్లు) ఉత్కంఠభరిత పోరులో భారత్‌ను నిలబెట్టారు. ‘సూపర్ ఓవర్లో’నూ భారీ షాట్లతో భారత్‌ను గెలిపించారు. ఎవరి ఊహకందని ఈ మహిళల రెండో టి20 మ్యాచ్‌లో భారత్ ‘సూపర్ ఓవర్’లో 4 పరుగుల తేడాతో ప్రపంచ చాంపియన్ ఆ్రస్టేలియాపై గెలిచింది. మొదట ఆ్రస్టేలియా నిరీ్ణత 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 187 పరుగులు చేసింది. బెత్ మూనీ (54 బంతుల్లో 82 నాటౌట్; 13 ఫోర్లు), తాలియా మెక్‌గ్రాత్ (51 బంతుల్లో 70 నాటౌట్; 10 ఫోర్లు, 1 సిక్స్) దంచేశారు. అనంతరం భారత్ కూడా 20 ఓవర్లలో 5 వికెట్లకు సరిగ్గా 187 పరుగులు చేసింది. స్మృతి, రిచా ధనాధన్ ఆట ఆడారు. దీంతో మ్యాచ్ ‘టై’ కాగా ఫలితం తేల్చేందుకు ‘సూపర్ ఓవర్’ ఆడించారు. ఇందులోనూ రిచా సిక్స్ కొట్టి నిష్క్రమించగా, స్మతి 4, 6లతో అదరగొట్టింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ప్రస్తుతం రెండు జట్లు 1–1తో సమంగా ఉన్నాయి. మూడో టి20 మ్యాచ్ బుధవారం జరుగుతుంది. ‘సూపర్ ఓవర్’ సాగిందిలా... భారత్ 20/1 బంతి ఆ్రస్టేలియా 16/1 రిచా ఘోష్ (6) అలీసా హీలీ (4) రిచా ఘోష్ (అవుట్) అలీసా హీలీ (1) హర్మన్‌ప్రీత్ (1) గార్డెనర్ (అవుట్) స్మృతి మంధాన (4) తాలియా (1) స్మృతి మంధాన (6) అలీసా హీలీ (4) స్మృతి మంధాన (3) అలీసా హీలీ (6) బౌలర్: హీతెర్ గ్రాహమ్ బౌలర్: రేణుక సిం చితగ్గొట్టిన మూనీ, తాలియా తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా జట్టు... ఓపెనర్, కెపె్టన్ అలీసా హీలీ (15 బంతుల్లో 25; 5 ఫోర్లు) వికెట్‌ను ఆరంభంలోనే కోల్పోయింది. ధాటిగా ఆడిన ఆమెను దీప్తి శర్మ బోల్తా కొట్టించింది. కానీ ఆ తర్వాత బెత్ మూనీ, తాలియా మెక్‌గ్రాత్ ఆఖరి 20వ ఓవర్‌దాకా ఆటాడుకున్నారు. బౌండరీలతో భారత బౌలర్ల భరతం పట్టారు. దీంతో 13వ ఓవర్లోనే ఆసీస్ స్కోరు 100 దాటింది. మొదట తాలియా 37 బంతుల్లో (8 ఫోర్లు, 1 సిక్స్), కాసేపటికి మూనీ 38 బంతుల్లో (8 ఫోర్లు) అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. ఆ తర్వాత కూడా వీరి జోరు పెరిగిందే తప్ప ఏమాత్రం తగ్గలేదు. దీంతో అబేధ్యమైన రెండో వికెట్‌కు వీరిద్దరు 158 పరుగులు జోడించారు. స్మృతి ధనాధన్... షఫాలీ వర్మ (23 బంతుల్లో 34; 4 ఫోర్లు, 1 సిక్స్)తో ఓపెనింగ్‌కు దిగిన స్మృతి దంచేసింది. ఇద్దరు 8.4 ఓవర్లలోనే 76 పరుగులు చేశారు. జెమీమా (4) నిరాశపరచగా, హర్మన్‌ప్రీత్ (22 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్స్) అండతో స్మృతి చెలరేగింది. 37 బంతుల్లో (8 ఫోర్లు, 1 సిక్స్) ఫిఫ్టీ పూర్తి చేసుకుంది. వరుస ఓవర్లలో హర్మన్, స్మృతి ని్రష్కమించగా... భారత్ విజయానికి 21 బంతుల్లో 39 పరుగులు కావాలి. ఓటమి ఖాయమైన దశలో రిచా భారీ సిక్సర్లతో విరుచుకుపడింది. ఆఖరి ఓవర్లో 14 పరుగులు కావాల్సి ఉండగా... రిచా, దేవిక తొలి 5 బంతుల్లో 9 పరుగులు చేశారు. ఇక ఆఖరి బంతికి విజయం కోసం 5 పరుగులు అవసరం కాగా, బ్యాక్వర్డ్ పాయింట్ దిశగా దేవిక బౌండరీ బాదడంతో స్కోర్లు సమమయ్యాయి. -
ఆస్ట్రేలియాతో తొలి టీ20.. బ్యాటింగ్ భారత్‌దే! కర్నూలు అమ్మాయి ఎంట్రీ
ముంబై వేదికగా ఆస్ట్రేలియా మహిళలలతో తొలి టీ20లో తలపడేందుకు భారత జట్టు సిద్దమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. కాగా గత కొంత కాలంగా జట్టుకు దూరంగా భారత బ్యాటర్ దేవికా వైద్యకు తుది జట్టలో చోటు దక్కింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అంజలి శర్వణి భారత తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయనుంది. ఇక ఈ సిరీస్‌కు ఆస్ట్రేలియా రెగ్యూలర్ కెప్టెన్ లానింగ్ దూరం కావడంతో హీలీ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహిస్తుంది. కాగా భారత పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. తుది జట్లు ఆస్ట్రేలియా: అలిస్సా హీలీ(కెప్టెన్), బెత్ మూనీ, తహ్లియా మెక్‌గ్రాత్, ఆష్లీ గార్డనర్, ఎల్లీస్ పెర్రీ, గ్రేస్ హారిస్, అన్నాబెల్ సదర్లాండ్, జెస్ జోనాసెన్, అలానా కింగ్, కిమ్ గార్త్, మేగాన్ షుట్ భారత జట్టు: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), దేవికా వైద్య, రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, రాధా యాదవ్, అంజలి శర్వాణి, మేఘనా సింగ్, రేణుకా సింగ్ చదవండి: ENG vs PAK: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. 120 ఏళ్ల రికార్డు బద్దలు! ప్రపంచంలోనే తొలి జట్టుగా -
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. టీమిండియాలో ఆదోని అమ్మాయి
India W Vs Australia W T20 Series- న్యూఢిల్లీ: కొంతకాలంగా దేశవాళీ క్రికెట్లో తన ఎడంచేతి పేస్ బౌలింగ్‌తో నిలకడగా రాణిస్తున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి కేశవరాజుగారి అంజలి శర్వాణి తొలిసారి భారత టి20 జట్టులోకి ఎంపికైంది. ఆస్ట్రేలియా జట్టుతో ముంబైలో ఈనెల 9 నుంచి జరిగే ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో పాల్గొనే భారత జట్టులో అంజలికి చోటు లభించింది. కర్నూలు జిల్లా ఆదోని పట్టణానికి చెందిన 25 ఏళ్ల అంజలి ఇటీవల జాతీయ సీనియర్ మహిళల టి20 టోర్నీలో ఇండియన్ రైల్వేస్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ 17 వికెట్లతో టాపర్‌గా నిలిచింది. ఆసీస్‌తో సిరీస్‌కు భారత జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, యాస్తిక భాటియా (వికెట్ కీపర్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్ ఠాకూర్, మేఘనా సింగ్, అంజలి శర్వాణి, ఎస్ మేఘన, రిచా ఘోష్ (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్ చదవండి: IND-W vs AUS_W: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన! స్టార్ ఆల్ రౌండర్ దూరం -
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన! స్టార్ ఆల్ రౌండర్ దూరం
స్వదేశంలో ఆస్ట్రేలియా మహిళలతో టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ఆల్ ఇండియా ఉమెన్స్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఈ జట్టుకు హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహించనుంది. ఇక ఈ హోం సిరీస్‌కు స్టార్ ఆల్ రౌండర్ పూజా వస్త్రాకర్ గాయం కారణంగా దూరమైంది. ఇక స్వదేశీ సిరీస్‌లో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. డిసెంబర్ 9న ముంబై వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇక ఇప్పటికే ఈ సిరీస్ కోసం ఆస్ట్రేలియా క్రికెట్ తమ జట్టును ప్రకటిచింది. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు భారత జట్టు హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, యాస్తిక భాటియా (వికెట్ కీపర్), జెమిమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రాధా యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్, రేణుకా సింగ్ ఠాకూర్, మేఘనా సింగ్, అంజలి శర్వాణి, ఎస్ మేఘన, రిచా ఘోష్ (వికెట్ కీపర్), హర్లీన్ డియోల్ భారత పర్యటనకు ఆస్ట్రేలియా జట్టు: అలిస్సా హీలీ (కెప్టెన్), తహ్లియా మెక్‌గ్రాత్ (వైస్ కెప్టెన్), డార్సీ బ్రౌన్, నికోలా కారీ, ఆష్లీ గార్డనర్, కిమ్ గార్త్, హీథర్ గ్రాహం, గ్రేస్ హారిస్, జెస్ జోనాస్సెన్, అలనా కింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, బెత్ మూనీ, ఎల్లీస్ పెర్రీ, మేగాన్ షుట్ల్యాండ్, అన్నాబెల్ సుదర్‌ల్యాండ్. చదవండి: IPL Mini Auction: వేలంలో 991 మంది క్రికెటర్లు! పాపం.. టీమిండియా ఆటగాళ్లు.. కనీసం 2 కోట్లు కూడా! -
భారత్‌తో టీ20 సిరీస్.. ఆస్ట్రేలియా జట్టు ప్రకటన! కెప్టెన్ దూరం
భారత మహిళల జట్టుతో టీ20 సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది. ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ లానింగ్ దూరం కావడంతో వికెట్ కీపర్ బ్యాటర్ అలిస్సా హీలీ కెప్టెన్‌గా ఎంపికైంది. ఆమెకు డిప్యూటీగా ఆల్‌రౌండర్ తహ్లియా మెక్‌గ్రాత్ వ్యవహరించనుంది. అదే విధంగా మాజీ ఐర్లాండ్ ఆల్‌రౌండర్ కిమ్ గార్త్‌కు ఆస్ట్రేలియా జట్టు తరపున చోటు దక్కింది. కాగా గతంలో ఐర్లాండ్‌కు ప్రాతినిథ్యం వహించిన గార్త్.. ప్రస్తుతం ఆస్ట్రేలియా తరపున దేశీవాళీ క్రికెట్ ఆడుతోంది. దేశీవాళీ క్రికెట్లో అదరగొట్టిన గార్త్‌కు జాతీయ జట్టు తరపున చోటు దక్కింది. మరోవైపు యువ బ్యాటర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ కూడా ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేయనుంది. ఇక భారత పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా జట్టు ఐదు టీ20ల సిరీస్ ఆడనుంది. అన్ని మ్యాచ్‌లు ముంబై వేదికగానే జరగనున్నాయి. డిసెంబర్ 9న జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. భారత పర్యటనకు ఆస్ట్రేలియా జట్టు: అలిస్సా హీలీ (కెప్టెన్), తహ్లియా మెక్‌గ్రాత్ (వైస్ కెప్టెన్), డార్సీ బ్రౌన్, నికోలా కారీ, ఆష్లీ గార్డనర్, కిమ్ గార్త్, హీథర్ గ్రాహం, గ్రేస్ హారిస్, జెస్ జోనాస్సెన్, అలనా కింగ్, ఫోబ్ లిచ్‌ఫీల్డ్, బెత్ మూనీ, ఎల్లీస్ పెర్రీ, మేగాన్ షుట్ల్యాండ్, అన్నాబెల్ సుదర్‌ల్యాండ్. చదవండి: IND vs NZ: 'న్యూజిలాండ్‌తో మూడో టీ20.. సూర్యకుమార్ స్థానంలో అతడు రావాలి' -
చరిత్రకు అడుగుదూరంలో.. ఫైనల్లో తలపడనున్న భారత్, ఆస్ట్రేలియా
కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించడానికి భారత మహిళల జట్టు ఒక్క అడుగుదూరంలో ఉంది. ఆగస్టు 8(ఆదివారం) రాత్రి జరగనున్న ఫైనల్లో ఆస్ట్రేలియాను భారత్ ఎదుర్కోనుంది. ముఖాముఖి రికార్డులో భారత్‌పై ఆస్ట్రేలియాదే పైచేయి అయినప్పటికి.. ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత్‌ను ఆసీస్ ఏ మేరకు నిలువరిస్తుందనే వేచి చూడాలి. భారత మహిళా బ్యాటర్లలో స్మృతి మంధాన, జేమీమా రోడ్రిగ్స్‌లు తమ కెరీర్లో అత్యున్నత ఫామ్‌లో ఉండగా.. బౌలింగ్‌లో రేణుకా సింగ్ తన మిస్టరీ బౌలింగ్‌తో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెడుతుంది. ఒకవేళ భారత్ గెలిస్తే మాత్రం చరిత్ర సృష్టించినట్లే. కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల విభాగంలో క్రికెట్‌ను ప్రవేశపెట్టిన తొలిసారే పతకం సాధించిన జట్టుగా భారత మహిళల జట్లు కొత్త రికార్డు నెలకొల్పనుంది. సెమీస్‌లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా గెలుపు ఇక శనివారం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో సెమీఫైనల్లో ఆసీస్ మహిళలు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. సోఫీ డివైన్ 53 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. అమేలియా ఖేర్ 40 పరుగులతో రాణించింది. ఆసీస్ బౌలర్లలో స్కాట్ 3, తాహిలా మెక్‌గ్రాత్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళలు 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. బెత్ మూనీ 36, తాహిలా మెక్‌గ్రాత్ 34 పరుగులు చేశారు. చదవండి: Obed Mccoy: మొన్న 'భయపెట్టాడు'.. ఇవాళ 'భయపడ్డాడు' Katherine Brunt CWG 2022: ఇంగ్లండ్ బౌలర్‌కు షాకిచ్చిన ఐసీసీ -
గార్డనర్ మెరుపు ఇన్నింగ్స్.. ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి
కామన్వెల్త్ గేమ్స్-2022లో భాగంగా ఆస్ట్రేలియా మహిళలతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో కెప్టెన్ హర్మాన్‌ప్రీత్ కౌర్(52), షఫాలీ వర్మ(48) పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో జానెసన్ నాలుగు వికెట్లు పడగొట్టగా..స్కాట్ రెండు వికెట్లు, బ్రౌన్ ఒక్క వికెట్ సాధించింది. అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కాగా లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఆస్ట్రేలియా కేవలం 55 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. భారత యువ పేసర్ నాలుగు వికెట్లు పడగొట్టి ఆరంభంలోనే ఆసీస్‌ను దెబ్బకొట్టింది. ఇక ఆసీస్ ఓటమి ఖాయం అనుకున్న వేళ బ్యాటర్లు ఆష్లీ గార్డనర్, గ్రేస్ హ్యారీస్ భారత్‌పై ఎదురుదాడికి దిగారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. అనంతరం మేఘనా సింగ్ బౌలింగ్‌లో గ్రేస్ హారిస్ (20 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 37 పరుగులు) ఔటైంది. ఆ తర్వాత వచ్చిన జొనసేన్ ను 14వ ఓవర్లో దీప్తి శర్మ పెవిలియన్‌కు పంపింది. ఒక వైపు క్రమం తప్పకుండా వికెట్లు పడుతోన్న గార్డనర్ మాత్రం తన పోరాటాన్ని కొనసాగించింది. గార్డనర్ 52 పరుగులతో అఖరి వరకు నిలిచి ఆస్ట్రేలియాను విజయ తీరాలకు చేర్చింది. ఇక భారత్ తమ తదుపరి మ్యాచ్ జూలై 31న పాకిస్తాన్ తో ఆడనున్నది. చదవండి: IND vs WI: వెస్టిండీస్‌తో తొలి టీ20.. అరుదైన రికార్డుకు చేరువలో రోహిత్ శర్మ..! -
Starc-Healy: నాడు భర్త, నేడు భార్య.. చరిత్ర సృష్టించిన ఆసీస్ జంట
మహిళల వన్డే ప్రపంచకప్ 2022 ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌పై ఆస్ట్రేలియా 71 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, 7వ సారి జగజ్జేతగా అవతరించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ప్రత్యర్ధి ఆహ్వానం మేరకు తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. ఓపెనర్ అలీసా హీలీ (138 బంతుల్లో 170; 26 ఫోర్లు) భారీ శతకంతో విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత 50 ఓవర్లల్లో 5 వికెట్ల నష్టానికి 356 పరుగుల భారీ స్కోర్ చేసింది. హీలీకి జతగా మరో ఓపెనర్ రేచల్ హేన్స్ (68), వన్ డౌన్ బ్యాటర్ మూనీ (62) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో ష్రబ్సోల్ 3, ఎక్లెస్టోన్ ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. నతాలీ స్కీవర్ (121 బంతుల్లో 148 నాటౌట్; 15 ఫోర్లు, సిక్స్) ఒంటరిపోరాటం చేసినప్పటికీ విజయతీరాలకు చేరలేకపోయింది. ఆసీస్ బౌలర్లు అలానా కింగ్ (3/64), జెస్ జోనాస్సెన్ (3/57), మెగాన్ షట్ (2/42) ధాటికి 43.4 ఓవర్లల్లో 285 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో నతాలీ మినహా మరే ఇతర బ్యాటర్ కనీసం 30 పరుగులు కూడా చేయలేకపోయారు. ఈ మ్యాచ్‌లో భారీ శతకంతో పాటు వెస్టిండీస్‌తో జరిగిన సెమీస్‌లోనూ శతకం (129) బాదిన అలీసా హీలీకి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుతో పాటు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా లభించింది. Alyssa Healy gives another master class in a World Cup final. 170 runs from 138 balls as Australia fly high @cricketworldcup #CWC22 #Final #TeamAustralia pic.twitter.com/ZcXNrvLMDY — Anjum Chopra (@chopraanjum) April 3, 2022 కాగా, 2022 ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌ల్లో 56.56 సగటున 2 సెంచరీలు, 2 హాఫసెంచరీల సాయంతో 509 పరుగులు చేసిన ఆసీస్ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ అలీసా హీలీ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుతో పాటు మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది. వన్డే, టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌లో ప్లేయర్ ఆప్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న ఏకైక మహిళా క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. 🔥 Player of the Match of #T20WorldCup 2020 Final 🔥 Player of the Match of #CWC22 Final Champion, @ahealy77 👑 pic.twitter.com/TxvRbbffDy — ICC Cricket World Cup (@cricketworldcup) April 3, 2022 2020 టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ప్లేయర్ ఆప్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న హీలీ తాజాగా ఆ ఘనతను మరోసారి సాధించింది. ఇదిలా ఉంటే.. హీలీ భర్త, స్టార్ ఆస్ట్రేలియన్ క్రికెటర్ మిచెల్ స్టార్క్ 2015 పురుషుల వన్డే ప్రపంచ కప్ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. 2015లో భర్త ఆసీస్ వరల్డ్‌కప్ సాధించడంలో కీలకపాత్ర పోషించగా.. తాజాగా భార్య తన దేశాన్ని ఏడోసారి జగజ్జేతగా నిలిపింది. చదవండి: World Cup 2022: భారీ విజయం.. ఓటమన్నదే ఎరుగదు.. జగజ్జేతగా ఆస్ట్రేలియా -
దవడ విరిగింది.. ముఖానికి సర్జరీ.. పడిలేచిన కెరటం
ఆస్ట్రేలియన్ మహిళా క్రికెటర్ బెత్ మూనీ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతుంది. ఇంగ్లండ్‌తో యాషెస్ టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు రెండోరోజు ఆటలో బెత్‌మూనీ డైవ్ చేసి బౌండరీని సేవ్ చేయడం వైరల్‌గా మారింది. ఇందులో గొప్పేముంది అనుకుంటున్నారా.. అక్కడికే వస్తున్నాం. ఇంగ్లండ్‌తో టి20 సిరీస్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా జట్టు ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. ప్రాక్టీస్ సెషన్లో బెత్‌మూనీ ఫీల్డింగ్ చేస్తూ జారిపడింది. వేగంగా పడడంతో ఆమె దవడ పగిలింది. ముఖమంతా రక్తమయమయింది. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. చదవండి: IPL 2022: సగం సీజన్ ఆడడం ఎందుకు... అక్కడే ఉండండి వైద్యులు ఆమె ముఖానికి మూడు మెటల్ప్లేట్స్ అమర్చి కుట్లు వేసి సర్జరీ చేశారు. దవడ బాగానికి బలంగా తాకడంతో గట్టి పదార్థాలు తినకూడదని డాక్టర్లు పేర్కొన్నారు. దీంతో బెత్‌మూనీ తన రోజూవారి ఆహరంలో సూప్, మిల్క్‌షేక్, ఐస్‌క్రీమ్‌లను కేవలం స్ట్రా ద్వారా మాత్రమే తీసుకుంది. దాదాపు పదిరోజుల పాటు బెత్‌మూనీ ఆహారం ఇదే. సరిగ్గా పదిరోజుల తర్వాత పడిలేచిన కెరటంలా బెత్‌మూనీ యాషెస్‌లో బరిలోకి దిగింది. రెండోరోజు ఆటలో బెత్‌మూనీ బౌండరీలైన్ వద్ద డైవ్ చేస్తూ బంతిని ఆపడం కెమెరాలకు చిక్కింది. గాయం నొప్పి ఇంకా ఉన్నప్పటికి ఏ మాత్రం లెక్కచేయకుండా జట్టుకోసం బరిలోకి దిగిన బెత్మూనీపై ప్రశంసల వర్షం కురుస్తుంది. బెత్ మూనీ దైర్యాన్ని తాము మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నామని.. సర్జరీ జరిగిన కేవలం పదిరోజుల్లోనే తిరిగి క్రికెట్ ఆడిన బెత్‌మూనీ మాకు ఆదర్శప్రాయమని ఆ జట్టు కెప్టెన్ మెగ్ లానింగ్ పేర్కొంది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. రెండోరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ వుమెన్స్ జట్టు 8 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. కెప్టెన్ హెథర్ నైట్ 127 పరుగులు నాటౌట్, సోఫీ ఎసిల్స్టోన్ 27 పరుగులతో క్రీజులో ఉన్నారు. అంతకముందు ఆస్ట్రేలియా 9 వికెట్ల నష్టానికి 337 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. Playing with a broken jaw and Beth Mooney is still throwing herself around in the field 😳 #Ashes pic.twitter.com/hBjxOnVgtw — 7Cricket (@7Cricket) January 28, 2022 -
శిఖా పాండే అద్భుతం.. వుమెన్స్ క్రికెట్ చరిత్రలో 'బాల్ ఆఫ్ ది సెంచరీ'
Shika Pandey Stunning Delivery.. ఆస్ట్రేలియా వుమెన్స్‌తో జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో టీమిండియా బౌలర్ శిఖా పాండే అద్బుత బంతితో మెరిసింది. ఆసీస్ ఇన్నింగ్స్ సమయంలో తొలి ఓవర్ రెండో బంతిని శిఖా పాండే ఆఫ్‌స్టంప్ దిశగా వేసింది. అయితే బంతి అనూహ్యంగా లెగ్‌స్టంప్ దిశగా టర్న్ అయి వికెట్లను గిరాటేసింది. దీంతో షాకైన ఆసీస్ ఓపెనర్ అలీసా హేలీ నిరాశగా పెవిలియన్ చేరింది. ఈ నేపథ్యంలోనే శిఖాపాండేను పులువురు మాజీ క్రికెటర్లతో పాటు నెటిజన్స్ ప్రశంసించారు.'' శిఖా పాండే ఒక అద్భుతం.. వుమెన్స్ క్రికెట్ చరిత్రలో బాల్ ఆఫ్ ది సెంచరీ'' అంటూ వసీం జాఫర్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: INDw Vs AUSw: రెండో టి20లో టీమిండియా వుమెన్స్ ఓటమి ఇక ఆస్ట్రేలియా వుమెన్స్‌తో జరిగిన రెండో టి20లో టీమిండియా పరాజయం పాలైంది. తద్వారా రెండు మ్యాచ్‌ల టి20 సిరీస్‌ను ఆసీస్ వుమెన్స్ జట్టు 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. కాగా వర్షం కారణంగా తొలి మ్యాచ్ రద్దైన సంగతి తెలిసిందే. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా వుమెన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. టీమిండియా వుమెన్స్ బ్యాటర్స్‌లో పూజా వస్త్రాకర్ 37 పరుగులతో టాప్ స్కోరర్‌గా కాగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 28 పరుగులు చేసింది. అనంతరం 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా వుమెన్స్ జట్టు 19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. చదవండి: ఉమ్రాన్ మాలిక్ మరోసారి అత్యంత ఫాస్ట్‌బాల్; సూర్యకుమార్ విలవిల షేన్ వార్న్‌ను ఎలా మరిచిపోగలం.. ''బాల్ ఆఫ్ ది సెంచరీ'' ప్రస్తుతం శిఖా పాండే అద్భుత బంతి గురించి మాట్లాడుకుంటున్నాం గానీ.. బాల్ ఆఫ్ ది సెంచరీ అంటే మొదటగా గుర్తొచ్చేది ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్. 1993లో ఇంగ్లండ్ ఆటగాడు మైక్ గాటింగ్‌ను వార్న్ అవుట్ చేసిన తీరు క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో వార్న్ బంతిని లెగ్‌సైడ్ అవతల విసిరాడు. అయితే గాటింగ్ ఊహించని విధంగా అతని వెనుక నుంచి అనూహ్యంగా టర్న్ అయిన బంతి ఆఫ్‌స్టంప్ వికెట్‌ను ఎగురగొట్టింది. అసలు తాను ఔట్ అని తెలియక గాటింగ్ కాసేపు క్రీజులోనే ఉండడం విశేషం. వార్న్ విసిరిన అద్భుత బంతికి అప్పటి ఫీల్డ్ అంపైర్ కూడా ఆశ్చర్యానికి లోనయ్యాడు. మెన్స్ క్రికెట్ చరిత్రలో అప్పటికి.. ఇప్పటికి వార్న్ వేసిన బంతి ''బాల్ ఆఫ్ ది సెంచరీ''గా మిగిలిపోయింది. Unreeeeeeal! 😱 How far did that ball move? #AUSvIND pic.twitter.com/D3g7jqRXWK — cricket.com.au (@cricketcomau) October 9, 2021 Ball of the century, women's cricket edition! Take a bow Shikha Pandey🙌🏻 #AUSvIND pic.twitter.com/WjaixlkjIp — Wasim Jaffer (@WasimJaffer14) October 9, 2021 #OnThisDay in 1993, the ball of the century from Shane Warne 💪pic.twitter.com/yhZS2FBWqE — 7Cricket (@7Cricket) June 4, 2020 -
ఆ రెండు ఓవర్లు కొంపముంచాయి.. టీమిండియా ఓటమి
గోల్డ్‌కోస్ట్: చక్కటి బౌలింగ్ ప్రదర్శనతో విజయానికి చేరువగా వచ్చినా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ తహ్లియా మెక్‌గ్రాత్ (33 బంతుల్లో 42 నాటౌట్; 6 ఫోర్లు) జోరుతో చివరకు భారత మహిళల జట్టుకు ఓటమి తప్పలేదు. మెక్‌గ్రాత్ ఫోర్లతో విరుచుకుపడటంతో కష్టమనుకున్న విజయాన్ని మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే ఆ్రస్టేలియా అందుకుంది. శనివారం జరిగిన రెండో టి20లో భారత మహిళల జట్టుపై ఆ్రస్టేలియా మహిళల టీమ్ 4 వికెట్లతో గెలుపొందింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0 ఆధ్యింలో నిలిచింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 118 పరుగులు చేసింది. పూజా వస్త్రకర్ (26 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. వర్షంతో రద్దయిన తొలి టి20లో బ్యాటింగ్‌లో అదరగొట్టిన భారత్... ఇక్కడ మాత్రం తేలిపోయింది. స్మృతి మంధాన (1), షఫాలీ వర్మ (3), జెమీమా రోడ్రిగ్స్ (7) ఒకరి తర్వాత ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ (20 బంతుల్లో 28; 5 ఫోర్లు) దూకుడుగా ఆడినా అనవసరపు షాట్‌కు ప్రయతి్నంచి స్టంపౌట్‌గా వెనుదిరిగింది. చివర్లో పూజ జోరుతో భారత్ 100 మార్కును అందుకుంది. ఆ రెండు ఓవర్లు... స్వల్ప ఛేదనలో ఆ్రస్టేలియా కూడా మొదట్లో తడబడింది. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో... అలీసా హీలీ (4), కెపె్టన్ మెగ్ లానింగ్ (15), గార్డ్నెర్ (1), ఎలైస్ పెర్రీ (2) వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన మెక్‌గ్రాత్... బెత్ మూనీ (36 బంతుల్లో 34; 4 ఫోర్లు)తో కలిసి జట్టును ఆదుకుంది. రాజేశ్వరీ గైక్వాడ్ తన వరుస ఓవర్లలో మూనీని, క్యారీ (7)లను అవుట్ చేసి ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. దాంతో ఆసీస్ విజయం కోసం చివరి మూడు ఓవర్లలో 25 పరుగులు చేయాలి. శిఖా పాండే వేసిన 18వ ఓవర్లో రెండు ఫోర్లతో మొత్తం 11 పరుగులు... రేణుక సింగ్ వేసిన 19వ ఓవర్లో మరో రెండు ఫోర్లతో 13 పరుగులను ఆసీస్ రాబట్టింది. 20వ ఓవర్ తొలి బంతికి సింగిల్ తీసిన మెక్‌గ్రాత్ ఆసీస్‌కు గెలుపును ఖాయం చేసింది. నేడు ఇక్కడే చివరి టి20 జరగనుంది. చదవండి: శిఖా పాండే అద్భుతం.. వుమెన్స్ క్రికెట్ చరిత్రలో 'బాల్ ఆఫ్ ది సెంచరీ' -
అంపైర్ ఔటివ్వలేదు.. పెవిలియన్ చేరి మనసులు దోచుకుంది
Punam Raut Walks Despite Being Given Not Out.. ఆస్ట్రేలియా వుమెన్స్‌తో జరుగుతున్న పింక్‌బాల్ టెస్టులో టీమిండియా బ్యాటర్స్ ఒకేరోజు రెండు అద్భుతాలు చేసి చూపించారు. ఆసీస్ గడ్డపై సెంచరీ బాదిన తొలి టీమిండియా మహిళా క్రికెటర్‌గా.. తొలి పింక్ బాల్ టెస్టులోనే శతక్కొట్టిన స్మృతి మంధన చరిత్ర సృష్టించగా.. మరో టీమిండియా బ్యాటర్ పూనమ్ రౌత్ అభిమానుల మనసులు గెలుచుకుంది. అంపైర్ ఓటవ్వికున్నా తనకు తానుగా క్రీజు వీడి క్రీడాస్పూర్తి ప్రదర్శించింది. విషయంలోకి వెళితే.. పింక్‌బాల్ టెస్టులో భాగంగా ఆట రెండో రోజు పూనమ్ రౌత్ 36 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ 81వ ఓవర్లో మొలినుక్స్ వేసిన నాలుగో బంతిని పూనమ్ ఫ్లిక్ చేయగా.. కీపర్ హీలే దానిని అందుకుంది. అంపైర్‌కు అప్పీల్ చేయగా అతను ఔట్ కాదంటూ సిగ్నల్ ఇచ్చాడు. చదవండి: Smriti Mandhana: చారిత్రక టెస్ట్ మ్యాచ్‌లో రికార్డు శతకం.. కోహ్లి తర్వాత..! అయితే రౌత్ మాత్రం బంతి తన బ్యాట్‌కు తగిలిందని నిర్థారణకు వచ్చి అంపైర్ నిర్ణయం చూడకుండానే వాకౌట్ చేసింది. ఈ చర్యతో అంపైర్‌తో పాటు ఆసీస్ మహిళా క్రికెటర్లు ఆశ్చర్యపోయారు.. అనంతరం క్రీడాస్పూర్తిని ప్రదర్శించిన పూనమ్‌ను అభినందించారు. దీనికి సంబంధించిన వీడియోను క్రికెట్ ఆస్ట్రేలియా స్వయంగా ట్విటర్లో షేర్ చేసింది. ''నమ్మశక్యం కాని విషయం.. పూనమ్ రౌత్ ఔట్ కాదని అంపైర్ అన్నాడు.. కానీ ఆమె పెవిలియన్‌కు చేరింది.. సూపర్ పూనమ్ రౌత్ అంటూ క్యాప్షన్ జత చేసింది. పూనమ్ రౌత్ చేసిన పనిని మెచ్చకుంటున్న అభిమానులు ఆమె క్రీడాస్పూర్తిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఇక టీమిండియా రెండో రోజు టీ విరామం సమయానికి 5 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. క్రీజ్‌లో దీప్తి శర్మ(12), తానియా భాటియా ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో సోఫి మోలినెక్స్ 2, ఆష్లే గార్డనర్, ఎలైస్ పెర్రీ తలో వికెట్ పడగొట్టగా.. కెప్టెన్ మిథాలీ రాజ్(30) రనౌటైంది. భారత బ్యాటర్లలో షెఫాలీ వర్మ(31), పూనమ్ రౌత్(36) పర్వాలేదనిపించగా, యస్తికా భాటియా(19) నిరాశపరిచింది. అంతకుముందు తొలి రోజు వర్షం అంతరాయం కలిగించడంతో కేవలం 44 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. చదవండి: Ashes Series: మిమ్మల్ని ఎవరూ రమ్మని బలవంతం చేయడం లేదు Unbelievable scenes 😨 Punam Raut is given not out, but the Indian No.3 walks! #AUSvIND | @CommBank pic.twitter.com/xfAMsfC9s1 — cricket.com.au (@cricketcomau) October 1, 2021 -
ఆసీస్ అదుర్స్...
బ్రిస్బేన్: టి20 సిరీస్‌ను సొంతం చేసుకున్న ఉత్సాహంలో ఆస్ట్రేలియా క్రికెట్ మహిళల జట్టు న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. శనివారం జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. వన్డే ఫార్మాట్లో ఆసీస్ జట్టుకిది వరుసగా 19వ విజయం కావడం విశేషం. తదుపరి రెండు వన్డేల్లోనూ గెలిస్తే 2003లో 21 వరుస విజయాలతో రికీ పాంటింగ్ సారథ్యంలోని ఆస్ట్రేలియా పురుషుల జట్టు నెలకొల్పిన ప్రపంచ రికార్డును మహిళల జట్టు సమం చేస్తుంది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో ఆసీస్ 181 పరుగుల విజయలక్ష్యాన్ని 33.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి అధిగమించింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (70 బంతుల్లో 62 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ అర్ధ సెంచరీ చేయగా... ఓపెనర్లు రాచెల్ హేన్స్ (62 బంతుల్లో 42; 5 ఫోర్లు, సిక్స్), అలీసా హీలీ (27 బంతుల్లో 26; 5 ఫోర్లు) రాణించారు. అంతకుముందు న్యూజిలాండ్ జట్టు 49.1 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌటైంది. కేటీ పెర్కిన్స్ (32; 3 ఫోర్లు), మ్యాడీ గ్రీన్ (35; 3 సిక్స్‌లు) మినహా మిగతావారు విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో జార్జియా, జెస్సికా, సోఫీ మోలినెక్స్ రెండేసి వికెట్లు పడగొట్టారు.