
టీమిండియా వుమెన్స్‌తో జరిగిన నాలుగో టి20లో ఆస్ట్రేలియా వుమెన్స్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఆస్ట్రేలియా వుమెన్స్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మహిళల జట్టు ఆఖరి వరకు విజయం కోసం పోరాడినప్పటికి ఒత్తిడి జయించలేక చతికిలపడింది.
నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి విజయానికి ఏడు పరుగుల దూరంలో ఆగిపోయింది. టీమిండియా వుమెన్స్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(30 బంతుల్లో 46 పరుగులు)టాప్ స్కోరర్‌గా నిలవగా.. చివర్లో రిచా ఘోష్(19 బంతుల్లో 40 నాటౌట్) రాణించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో అష్లీ గార్డెనర్, అలానా కింగ్ చెరో రెండు వికెట్లు తీయగా.. డార్సీ బ్రైన్ ఒక వికెట్ తీసింది.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా వుమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. పెర్రీ(42 బంతుల్లో 72 పరుగులు నాటౌట్), గార్డెనర్(27 బంతుల్లో 42 పరుగులు, హేలీ 30 పరుగులు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment