India womens cricket team
-
భారత బౌలర్లను ఊతికారేసిన ఆసీస్.. ఏకంగా 372 పరుగులు
బ్రిస్బేన్ వేదికగా భారత మహిళలతో జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటర్లు అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఏకంగా 371 పరుగులు చేసింది. ఆసీస్ బ్యాటర్లలో జార్జియా వాల్(87 బంతుల్లో 12 ఫోర్లుతో 101), ఎల్లీస్ పెర్రీ(75 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్స్‌లు) అద్బుతమైన సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరితో పాటు లిచ్‌ఫీల్డ్(60),బీత్ మూనీ(56) హాఫ్ సెంచరీలతో రాణించారు.భారత బౌలర్లలో సైమా ఠాకూర్ 3 వికెట్లు పడగొట్టగా, మిన్ను మని 2, దీప్తీ శర్మ, ప్రియా మిశ్రా తలా వికెట్ సాధించారు. కాగా వన్డేల్లో భారత మహిళల జట్టుపై అత్యధిక స్కోర్ నమోదు చేసిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డులకెక్కింది. మరి ఇంతటి భారీ లక్ష్యాన్ని భారత బ్యాటర్లు ఛేజ్ చేస్తారో లేదో వేచి చూడాలి.తుది జట్లుభారత్: ప్రియా పునియా, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), దీప్తి శర్మ, మిన్ను మణి, ప్రియా మిశ్రా, సైమా ఠాకోర్, రేణుకా ఠాకూర్ సింగ్ఆస్ట్రేలియా: ఫోబ్ లిచ్‌ఫీల్డ్, జార్జియా వోల్, ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ (వికెట్ కీపర్), అన్నాబెల్ సదర్లాండ్, ఆష్లీ గార్డనర్, తహ్లియా మెక్‌గ్రాత్ (కెప్టెన్), సోఫీ మోలినక్స్, అలానా కింగ్, కిమ్ గార్త్, మేగాన్ షట్చదవండి: సిరాజ్ కాస్త తగ్గించుకో.. అతడొక లోకల్ హీరో: సునీల్ గవాస్కర్ -
ఐసీసీ వరల్డ్ కప్ బెస్ట్ టీమ్ ప్రకటన.. భారత్ నుంచి ఒకే ఒక్కరు
మహిళల టీ20 ప్రపంచకప్-2024 విజేతగా న్యూజిలాండ్ నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో దక్షిణాఫ్రికాను 32 పరుగుల తేడాతో ఓడించి తొలిసారి ప్రపంచకప్ ట్రోఫీని న్యూజిలాండ్ ముద్దాడింది. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మెగా ఈవెంట్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన ప్లేయర్లతో కూడిన టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను ఐసీసీ ప్రకటించింది.ఈ టీమ్‌కు దక్షిణాఫ్రికా సారథి లారా వోల్వార్ట్ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. వోల్వార్ట్ తన అద్భుత కెప్టెన్సీ, ప్రదర్శనతో సౌతాఫ్రికాను ఫైనల్‌కు చేర్చింది. 12 మంది సభ్యుల ఈ టీమ్‌లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాల నుంచి చెరో ముగ్గురికి అవకాశం లభించింది. ఈ జట్టులో భారత్ నుంచి కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌కు ఒక్కరికే చోటు దక్కింది. . భారత జట్టు సెమీఫైనల్‌కు చేరడంలో విఫలమైనా నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి హర్మన్ 2 అర్ధ సెంచరీలు సహా 133.92 స్ట్రయిక్ రేట్‌తో 150 పరుగులు సాధించింది.జట్టు వివరాలు: లారా వోల్వార్ట్ (కెప్టెన్), తజీమిన్ బ్రిట్స్, నాన్కులులెకొ ఎమ్‌లాబా (దక్షిణాఫ్రికా), అమేలియా కెర్, రోజ్మేరీ మెయిర్, ఈడెన్ కార్సన్ (న్యూజిలాండ్), డియాండ్రా డాటిన్, అఫీ ఫ్లెచర్ (వెస్టిండీస్), డానీ వ్యాట్ (ఇంగ్లండ్), మెగాన్ షుట్ (ఆ్రస్టేలియా), నిగార్ సుల్తానా (బంగ్లాదేశ్), హర్మన్‌ప్రీత్ కౌర్ (భారత్). -
ఆస్ట్రేలియాతో రెండో టీ20.. 8 వికెట్ల తేడాతో భారత్ ఓటమి
ఆ్రస్టేలియాలో పర్యటిస్తున్న భారత మహిళల ‘ఎ’ జట్టు వరుసగా రెండో టి20లో పరాజయం పాలైంది. శుక్రవారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు 8 వికెట్ల తేడాతో భారత ‘ఎ’ జట్టుపై గెలిచింది. మొదట భారత్ ‘ఎ’ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. ప్రియా పూనియా (29) టాప్ స్కోరర్ కాగా.. కెప్టెన్ మిన్ను మణి (17 నాటౌట్) ఫర్వాలేదనిపించింది. ఆ్రస్టేలియా బౌలర్లలో గ్రేస్ పర్సన్స్ 4, నికోలా మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆ్రస్టేలియా ‘ఎ’ జట్టు 18.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 133 పరుగులు చేసి గెలిచింది. తహిలా విల్సన్ (53 నాటౌట్), కెప్టెన్ తహిలా మెక్‌గ్రాత్ (47 నాటౌట్) రాణించారు. ఈ పర్యటనలో భాగంగా భారత మహిళల ‘ఎ’ జట్టు మూడు టి20, మూడు వన్డేలు, ఏకైక అనధికారిక టెస్టు ఆడనుంది. -
ఎనిమిదో టైటిల్ లక్ష్యంగా...
దంబుల్లా (శ్రీలంక): మహిళల ఆసియాకప్ టి20 క్రికెట్ టోరీ్న లో ఎదురు లేకుండా సాగుతున్న భారత జట్టు.. నేడు తుది సమరానికి సిద్ధమైంది. టోరీ్నలో ఎదురైన ప్రత్యరి్థనల్లా చిత్తుచేసిన టీమిండియా.. ఆదివారం జరగనున్న ఫైనల్లో శ్రీలంకతో తలపడనుంది. ఇప్పటికే ఎనిమిదిసార్లు (వన్డే, టి20 పార్మాట్లలో కలిపి) ఆసియాకప్ ఫైనల్ ఆడి అందులో ఏడింట విజేతగా నిలిచిన టీమిండియా.. ఎనిమిదోసారి ట్రోఫీ కైవసం చేసుకోవాలని తహతహలాడుతోంది. గ్రూప్ ‘ఎ’ నుంచి బరిలోకి దిగిన హర్మన్‌ప్రీత్ బృందం.. దాయాది పాకిస్తాన్, యూఏఈ, నేపాల్ జట్లపై గెలిచి సెమీఫైనల్లో అడుగుపెట్టింది. ఏకపక్షంగా సాగిన సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై ఘనవిజయం సాధించి తుదిపోరుకు చేరింది. ఇటీవలి కాలంలో హర్మన్‌ప్రీత్ బృందం జోరు చూస్తుంటే.. కప్ ఖాయంగానే కనిపిస్తోంది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మతో పాటు జెమీమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్‌తో బ్యాటింగ్ పటిష్టంగా ఉంటే... బౌలింగ్‌లో రేణుక సింగ్, రాధ యాదవ్, దీప్తి శర్మ అదరగొడుతున్నారు. హర్మన్, జెమీమాకు ఈ టోరీ్నలో పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా... సమయం వస్తే సత్తా చాటడం ఖాయమనే మేనేజ్మెంట్ భావిస్తోంది. మరోవైపు గ్రూప్ ‘బి’లో ఆడిన మూడు మ్యాచ్‌లు నెగ్గిన లంక... పాకిస్తాన్‌తో హోరాహోరీ సెమీఫైనల్లో ఒత్తిడిని జయించి ఫైనల్‌కు అర్హత సాధించింది. కెప్టెన్ చమరి అటపట్టుపై లంక భారీ ఆశలు పెట్టుకుంది. ఈ టోర్నీలో 243 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్న చమరి రాణిస్తేనే టీమిండియాకు లంక పోటీనివ్వగలదు. -
INDW Vs SAW Photos: దక్షిణాఫ్రికా మహిళలతో వన్డే సిరీస్‌లో టీమిండియా ఘన విజయం (ఫొటోలు)
-
33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం.. ఎవరీ ఆశా శోభన?
భారత జట్టు తరపున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాలనుకున్న కేరళ స్పిన్నర్ ఆశా శోభన కల ఎట్టకేలకు నేరవేరింది. సోమవారం సిల్హెట్ వేదికగా బంగ్లాదేశ్ మహిళలలతో జరుగుతున్న నాలుగో టీ20లో ఆశా శోభనా టీమిండియా తరపున అరంగేట్రం చేసింది. భారత బ్యాటర్ స్మృతి మంధాన చేతుల మీదగా శోభన టీమిండియా క్యాప్ అందుకుంది. కాగా ఆశా శోభన 33 ఏళ్ల వయస్సులో అంతర్జాతీయ అరంగేట్రం చేయడం గమనార్హం. ఈ క్రమంలో ఆశా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.ఎవరీ ఆశా శోభన?ఆశా శోభన దేశీవాళీ క్రికెట్లో కేరళ సీనియర్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తోంది. భారత మాజీ స్పిన్నర్ నీతూ డేవిడ్‌ను ఆదర్శంగా తీసుకుని ఆశా శోభన క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. 13 ఏళ్ల వయస్సులోనే ఆశా క్రికెట్ వైపు అడుగులు వేసింది. ఆ తర్వాత కేరళ జట్టు తరపున అద్బుతంగా రాణించడంతో భారత-ఏ జట్టులో ఆమెకు చోటు దక్కింది. కానీ సీనియర్ జట్టులో మాత్రం చోటు దక్కించుకలేకపోయింది. అయితే డబ్ల్యూపీఎల్ ఆరంభ సీజన్లో రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు ఆమెను సొంతం చేసుకుంది. తొలి సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఆశా.. డబ్ల్యూపీఎల్-2024 సీజన్లో మాత్రం దుమ్ములేపింది. 10 మ్యాచ్‌ల్లో 7.11 ఏకానమితో 12 వికెట్లు పడగొట్టి సత్తాచాటింది. ఈ క్రమంలో భారత సెలక్టర్లు నుంచి ఆశాకు పిలుపు వచ్చింది. -
హర్మన్ ప్రీత్ బృందానికి ఊరట
ముంబై: వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయి... ఇంగ్లండ్ జట్టుకు సిరీస్‌ను అప్పగించేసిన తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టు తేరుకుంది. ఆదివారం జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలిచి పరువు నిలబెట్టుకుంది. దాంతో మూడో మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని ఆశించిన హీతెర్ నైట్ నాయకత్వంలోని ఇంగ్లండ్ తుదకు సిరీస్‌ను 2–1తో సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ సరిగ్గా 20 ఓవర్లలో 126పరుగుల వద్ద ఆలౌటైంది. కెపె్టన్ హీతెర్ నైట్ (42 బంతుల్లో 52; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించగా, అమీ జోన్స్ (21 బంతుల్లో 25; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడింది. ఇంగ్లండ్ 76 పరుగులకు 8 వికెట్లు కోల్పోయిన దశలో హీతెర్ నైట్, చార్లీ డీన్ (15 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్) తొమ్మిదో వికెట్‌కు 50 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఇన్నింగ్స్ చివరి రెండు బంతుల్లో హీతెర్, మహికా గౌర్ (0) అవుటవ్వడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. భారత స్పిన్నర్లు సైకా ఇషాక్ (3/22), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శ్రేయాంక పాటిల్ (3/19) ఇంగ్లండ్ జట్టును దెబ్బ కొట్టారు. సీమర్లు రేణుక సింగ్, అమన్‌జోత్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన భారత్ మహిళల జట్టు 19 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 130 పరుగులు చేసి గెలిచింది. ఆరంభంలోనే షఫాలీ వర్మ (6) నిష్క్ర మించినా... ఓపెనర్ స్మృతి మంధాన (48 బంతుల్లో 48; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), జెమీమా (33 బంతుల్లో 29; 4 ఫోర్లు) రెండో వికెట్‌కు 57 పరుగులు జోడించారు. అనంతరం విజయానికి చేరువైన తరుణంలో దీప్తి శర్మ (12), స్మృతి, రిచా ఘోష్ (2) స్వల్పవ్యవధిలో నిష్క్రమించారు. ఉత్కంఠకు దారితీస్తున్న దశలో అమన్‌జోత్ (4 బంతుల్లో 13 నాటౌట్; 3 ఫోర్లు) 19వ ఓవర్లో 3 బౌండరీలు కొట్టి భారత్‌ను గెలిపించింది. ఇంగ్లండ్ ప్లేయర్ నాట్ సివర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ 14 నుంచి డీవై పాటిల్ స్టేడియంలో జరుగుతుంది. -
ఉత్కంఠ సమరంలో భారత్‌ను నిలువరించిన బంగ్లాదేశ్.. మ్యాచ్ టై, సిరీస్ డ్రా
బంగ్లాదేశ్‌లో పర్యటిస్తున్న భారత మహిళల క్రికెట్ జట్టు స్థాయికి తగ్గట్టుగా రాణించలేక 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకుంది. తొలుత టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో అతికష్టం మీద కైవసం చేసుకున్న భారత్.. ఇవాళ (జులై 22) జరిగిన వన్డే సిరీస్ డిసైడర్ మ్యాచ్‌లో గెలుపు అంచుల వరకు వచ్చి, ఆఖరి నిమిషంలో చతికిలపడింది. బంగ్లాదేశ్ నిర్ధేశించిన 226 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి 6 వికెట్లు 34 పరుగుల వ్యవధిలో కోల్పోయిన భారత్.. స్కోర్లు సమం అయ్యాక ఆఖరి వికెట్‌ను కోల్పోయింది. దీంతో మ్యాచ్ 'టై'గా ముగిసింది. సూపర్ ఓవర్ నిబంధన లేకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను 'టై'గా సిరీస్‌ను 'డ్రా'గా ప్రకటించారు. వన్డే ట్రోఫీని బంగ్లా టీమ్.. టీమిండియాతో సంయుక్తంగా పంచుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. ఫర్జానా హాక్ (107) సూపర్ శతకంతో, షమీమా సుల్తానా (52) అర్ధసెంచరీతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఆఖర్లో శోభన మోస్త్రీ (23 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. టీమిండియా బౌలర్లలో స్నేహ్ రాణా 2, దేవిక వైద్య ఓ వికెట్ పడగొట్టారు. అనంతరం 226 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 32 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినప్పటికీ స్మృతి మంధన (59), హర్లీన్ డియోల్ (77) ఆదుకున్నారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 107 పరుగులు జోడించారు. ఈ దశలో భారత్ సునాయాసంగా గెలిచేలా కనిపించింది. అయితే బంగ్లా బౌలర్లు మూకుమ్మడిగా రాణించడంతో భారత్ 34 పరుగుల వ్యవధిలో చివరి 6 వికెట్లు కోల్పోయి, మ్యాచ్‌తో పాటు సిరీస్ గెలిచే అవకాశాలను చేజార్చుకుంది. ఆఖర్లో జెమీమా రోడ్రిగెజ్ (33 నాటౌట్) టీమిండియాను గెలిపించేందుకు విఫలయత్నం చేసింది. ఆఖరి ఓవర్లో భారత్ విజయానికి కేవలం 3 పరుగులు మాత్రమే అవసరం కాగా.. మరూఫా బౌలింగ్‌లో మేఘన సింగ్ ఔటై, భారత్‌కు విజయాన్ని దూరం చేసింది. బంగ్లా బౌలర్లలో నహిద అక్తర్ 3, మరూఫా అక్తర్ 2, సుల్తానా ఖాతూన్, రబేయా ఖాన్, ఫహీమ ఖాతూన్ తలో వికెట్ పడగొట్టారు. -
టీమిండియాకు చుక్కలు చూపించిన బంగ్లా బౌలర్లు
3 టీ20లు, 3 వన్డేల సిరీస్‌ల కోసం భారత మహిళల క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటిస్తుంది. ఇందులో భాగంగా బంగ్లాదేశ్-టీమిండియాల మధ్య ఇవాళ (జులై 11) రెండో టీ20 జరుగుతుంది. ఢాకా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాను బంగ్లాదేశ్ బౌలర్లు కట్టడి చేశారు. బంగ్లా బౌలర్లు మూకుమ్మడిగా రాణించి టీమిండియాకు చుక్కలు చూపించారు. వీరి ధాటికి టీమిండియా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 95 పరుగలు మాత్రమే చేయగలిగింది. బంగ్లా బౌలర్లలో సుల్తానా ఖాతూన్ 3 వికెట్లతో రెచ్చిపోగా.. ఫాతిమా ఖాతూన్ 2, మరూఫా అక్తెర్, నమిద అక్తెర్, రబెయా ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. భారత బ్యాటర్లలో ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కును దాటలేకపోయారు. ఓపెనర్ షఫాలీ వర్మ చేసిన 19 పరుగులే టాప్ భారత ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్‌గా నిలిచింది. షఫాలీ సహా స్మృతి మంధన (13), యస్తిక భాటియా (11), దీప్తి శర్మ (10), అమన్‌జోత్ కౌర్ (14) రెండంకెల స్కోర్లు చేశారు. టీమిండియా స్టార్ బ్యాటర్లు హర్మన్‌ప్రీత్ కౌర్ డకౌట్ కాగా.. జెమీమా రోడ్రిగెజ్ (8), హర్లీన్ డియోల్ (6) నిరాశపరిచారు. కాగా, ఈ సిరీస్‌లో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇదే వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. -
బంగ్లాదేశ్ టూర్‌కు భారత జట్టు ఎంపిక.. స్టార్ ప్లేయర్‌పై వేటు
న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న భారత మహిళల క్రికెట్ జట్టును ఆదివారం ప్రకటించారు. గాయంతో పేసర్ రేణుక సింగ్ దూరం కాగా, వికెట్ కీపర్ రిచా ఘోష్‌ను ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌లకు (టి20, వన్డే) పక్కనబెట్టారు. యువ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్‌కు సెలక్టర్లు అవకాశమివ్వలేదు. బంగ్లాదేశ్‌తో భారత్ మూడేసి టి20లు, వన్డేలు ఆడుతుంది. ముందుగా మిర్పూర్ వేదికగా ఈనెల 9, 11, 13 తేదీల్లో టి20 మ్యాచ్‌లు, అదే స్టేడియంలో 16, 19, 22 తేదీల్లో మూడు వన్డేలు జరుగనున్నాయి. టి20 జట్టు: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి (వైస్ కెప్టెన్), దీప్తిశర్మ, షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, యస్తిక భాటియా, హర్లీన్ డియోల్, దేవిక వైద్య, ఉమా చెట్రి, అమన్‌జోత్ కౌర్, సబ్బినేని మేఘన, అంజలి శర్వాణి, పూజ, మేఘన సింగ్, మోనిక పటేల్, రాశి కనోజియా, అనూష బారెడ్డి, మిన్నురాణి. వన్డే జట్టులో సబ్బినేని మేఘన, మిన్నురాణి స్థానాల్లో ప్రియా పూనియా, స్నేహ్ రాణాలను తీసుకున్నారు. -
'మ్యాచ్‌కు అదే టర్నింగ్ పాయింట్.. లేదంటే విజయం మాదే'
ఐసీసీ టైటిల్‌ను సొంతం చేసుకోవాలనుకున్న భారత మహిళల జట్టు ఆశలు మరోసారి ఆవిరైపోయాయి. మహిళల టీ20 ప్రపంచకప్-2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో 5 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. దీంతో ఈ మెగా టోర్నీ నుంచి టీమిండియా ఇంటిముఖం పట్టింది. అయితే కీలక సమయంలో టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్ రనౌట్‌గా వెనుదిరగడంతో ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమిపాలైంది. ఇక మ్యాచ్ అనంతరం ఓటమిపై టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్‌కౌర్ స్పందించింది. పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో హర్మన్ మాట్లాడుతూ.. "నా బ్యాట్ అలా ఇరుక్కుపోయి ఉండకపోయింటే.. ఆ పరుగు ఈజీగా వచ్చేంది. ఆఖరి వరకు క్రీజులో నేను ఉండి ఉంటే, మా జోరు మ్యాచ్‌ను ఒక ఓవర్ ముందే ఫినిష్ చేసేవాళ్లం. అయినప్పటకి నా తర్వాత దీప్తి శర్మ, రిచా ఘోష్ ఉన్నారు. కాబట్టి మేము గెలుస్తాం అనే నమ్మకం నాకు ఉండేది. రిచా గత కొన్ని మ్యాచ్‌ల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. కానీ నేను ఔటైన తర్వాత ఏడెనిమిది డాట్ బాల్స్ వచ్చాయి. అదే మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్. ఇక నేను జెమిమా క్రీజులో ఉన్నప్పుడు సులువైన బంతులను బౌండరీలుగా మలచాలని అనుకున్నాం. మాకు మొదటి నుంచి ఓవర్‌కు 8 పరుగులు అవసరం. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మేము బ్యాటింగ్ చేశాం.జెమిమా అద్భుతంగా ఆడింది. నాన్-స్ట్రైకర్‌గా ఉన్న భాగస్వామి నుంచి ఇలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తే చాలా బాగుంటుంది. ఇక రనౌట్ కూడా ఈ మ్యాచ్‌కు టర్నింగ్ పాయింట్. ఆస్ట్రేలియాను 170కి పరిమితం చేస్తే చాలు అని మేము ముందే అనుకున్నాం. ఆ స్కోర్‌ను మేము చేధిస్తామని మాకు నమ్మకం ఉండేది. కానీ నా రనౌట్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది" అని ఆమె పేర్కొంది. చదవండి: T20 WC: 'నేను ఏడుస్తుంటే నా దేశం చూడకూడదు.. అందుకే అలా చేశా' -
టీమిండియాకు తప్పని పరాభవం.. ఆస్ట్రేలియా వుమెన్స్దే సిరీస్
టీమిండియా వుమెన్స్‌తో జరిగిన నాలుగో టి20లో ఆస్ట్రేలియా వుమెన్స్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఆస్ట్రేలియా వుమెన్స్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది. 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మహిళల జట్టు ఆఖరి వరకు విజయం కోసం పోరాడినప్పటికి ఒత్తిడి జయించలేక చతికిలపడింది. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసి విజయానికి ఏడు పరుగుల దూరంలో ఆగిపోయింది. టీమిండియా వుమెన్స్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(30 బంతుల్లో 46 పరుగులు)టాప్ స్కోరర్‌గా నిలవగా.. చివర్లో రిచా ఘోష్(19 బంతుల్లో 40 నాటౌట్) రాణించింది. ఆస్ట్రేలియా బౌలర్లలో అష్లీ గార్డెనర్, అలానా కింగ్ చెరో రెండు వికెట్లు తీయగా.. డార్సీ బ్రైన్ ఒక వికెట్ తీసింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా వుమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. పెర్రీ(42 బంతుల్లో 72 పరుగులు నాటౌట్), గార్డెనర్(27 బంతుల్లో 42 పరుగులు, హేలీ 30 పరుగులు చేసింది. -
'ఇప్పుడే సరైనోడి చేతుల్లోకి వెళ్లాం'.. టీమిండియా కెప్టెన్ కౌంటర్
భారత మహిళల జట్టు మాజీ హెడ్‌కోచ్ రమేశ్ పవార్‌పై కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నవంబర్ 6న బీసీసీఐ రమేశ్ పొవార్‌ను భారత మహిళల జట్టు హెడ్‌కోచ్ పదవి నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు గ్రూప్ దశలోనే వెనుదిరగడం పొవార్‌ను కోచ్ పదవి నుంచి తప్పించడానికి ప్రధాన కారణమయింది. ఇక బ్యాటింగ్ కోచ్‌గా హృషికేష్ కనిత్కర్‌ను ఎంపిక చేసిన బీసీసీఐ రమేశ్ పొవార్‌ను ఎన్సీఏకు బదిలీ చేసింది. ఇకపై ఎన్సీఏ హెడ్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్‌తో పొవార్ కలిసి పనిచేస్తాడని బీసీసీఐ తెలిపింది. ఇదిలా ఉంటే టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మాత్రం రమేశ్ పొవార్‌పై పరోక్షంగా కౌంటర్ వేసింది. ఇండియా, ఆస్ట్రేలియా వుమెన్స్ ద్వైపాక్షిక సిరీస్ సందర్భంగా హర్మన్‌ప్రీత్ మీడియాతో మాట్లాడింది. ఇప్పుడు మేం సరైన వ్యక్తి చేతుల్లో ఉన్నాం అంటూ తెలిపింది. అయితే పొవార్‌ను ఉద్దేశించే హర్మన్ ప్రీత్ ఇలా వ్యాఖ్యలు చేసిందంటూ కొంతమంది పేర్కొన్నారు. అయితే పొవార్‌ను కోచ్ పదవి నుంచి తప్పించడం వెనుక హర్మన్‌ప్రీత్ హస్తం ఉందని హిందుస్థాన్ టైమ్స్ ఆరోపణలు చేసింది. పొవార్‌ను కోచ్ పదవి నుంచి తొలగించాలంటూ బీసీసీఐ సెక్రటరీ జై షాకు స్వయంగా లేఖ రాసినట్లు తెలిసింది. అయితే టీమిండియా మహిళా జట్టుకు పొవార్‌పై ముందు నుంచి మంచి అభిప్రాయం లేదు. ఇంతకముందు 2018 టి20 వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో సెమీఫైనల్ సందర్భంగా అప్పటికి మంచి ఫామ్‌లో ఉన్న మిథాలీరాజ్‌ను పొవార్ పక్కనబెట్టడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. మిథాలీ రిటైర్మెంట్ తర్వాత తన పుస్తకంలోనూ రమేశ్ పొవార్‌తో ఉన్న విబేధాలను బయటపెట్టింది. హెడ్‌కోచ్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి చాలాసార్లు వివాదాల్లో నిలిచాడు. అందుకే హర్మన్‌ప్రీత్ స్వయంగ రంగంలోకి దిగి బీసీసీఐకి లేఖ రాసినట్లు సమాచారం. ఇక కొత్త హెడ్‌కోచ్ ఎవరనే దానిపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం హెడ్‌కోచ్ లేకుండానే ఆస్ట్రేలియాతో సిరీస్ ఆడనుంది. అయితే 2021లో హృషికేష్ కనిత్కర్ హెడ్‌కోచ్ పదవికి అప్లై చేసినప్పటికి అతనికి అవకాశం రాలేదు. తాజాగా ఆస్ట్రేలియాతో సిరీస్‌కు మాత్రం హృషికేష్ కనిత్కర్‌కు బ్యాటింగ్ కోచ్‌గా టీమిండియా మహిళల జట్టుకు పనిచేసే అవకాశం లభించింది. చదవండి: ఓటమికి నైతిక బాధ్యత.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఫుట్‌బాలర్ -
అదరగొట్టిన ఆంధ్ర అమ్మాయి.. మలేషియాపై భారత్ ఘన విజయం
మహిళల ఆసియాకప్-2022లో భారత్ రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. షెల్లాట్ వేదికగా మలేషియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 30 పరుగుల తేడాతో విజయం సాధించిది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఆంధ్ర అమ్మాయి సబ్భినేని మేఘన అద్భుతమైన అర్ధ సెంచరీ సాధించింది. ఈ మ్యాచ్‌లో 53 బంతులు ఎదుర్కొన్న మేఘన.. 11 ఫోర్లు, సిక్స్‌తో 69 పరుగులు చేసింది. అదే విధంగా మరో ఓపెనర్ షఫాలీ వర్మ(39 బంతుల్లో 46 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడింది. కాగా 182 పరుగులు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మలేషియా 5.2 ఓవర్లకు రెండు వికెట్లు కోల్పోయి 16 పరుగులు చేసింది. ఈ సమయంలో వరుణుడు మ్యాచ్‌కు అంతరాయం కలిగించాడు. దీంతో మ్యాచ్ నిలిచిపోయింది. అయితే ఎప్పటికీ వర్షం తగ్గుముఖం పట్టకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం భారత్‌ను విజేతగా ప్రకటించారు. భారత్ తమ తదపరి మ్యాచ్‌లో ఆక్టోబర్4న యూఏఈతో తలపడనుంది. చదవండి: రోహిత్, కోహ్లి, సూర్య కాదు.. వరల్డ్ టాప్-5 టీ20 ఆటగాళ్లు వీరే! -
జెమీమా రోడ్రిగ్స్ విధ్వంసం.. ఆసియాకప్‌లో టీమిండియా శుభారంభం
ఆసియాకప్ మహిళల టి20 టోర్నీలో టీమిండియా శుభారంభం చేసింది. శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు 18.2 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలింది. లంక బ్యాటర్స్‌లో హాసిని పెరీరా 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హర్షితా మాధవి 26 పరుగులు చేసింది. భారత మహిళా బౌలర్లలో హేమలత మూడు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ చెరో రెండు వికెట్లు తీయగా.. రాధా యాదవ్ ఒక వికెట్ తీసింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఉమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. జేమీమా రోడ్రిగ్స్ 53 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 76 పరుగులతో రాణించగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 33 పరుగులు చేసింది. లంక బౌలర్లలో రణసింగే మూడు వికెట్లు తీయగా.. సుగంధిక కుమారి, ఆటపట్టు చెరొక వికెట్ తీశారు. ఇక 76 పరుగులతో రాణించిన రొడ్రిగ్స్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. ఇక భారత మహిళల జట్టు తమ తర్వాతి మ్యాచ్‌ను(అక్టోబర్ 3న) మలేషియా ఉమెన్స్‌తో ఆడనుంది. చదవండి: క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ కంటికి తీవ్ర గాయం.. -
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్.. భారత క్రికెటర్ గదిలో చోరీ
ఇంగ్లండ్ మహిళలతో వన్డే సిరీస్‌లో భారత జట్టు సభ్యురాలిగా ఉన్న తానియా భాటియాకు అనూహ్య పరిణామం ఎదురైంది. లండన్‌లో ఆమె బస చేసిన మారియట్ హోటల్లోని తన గదిలో దొంగతనం జరిగినట్లు ఆమె వెల్లడించింది. ‘నన్ను చాలా నిరాశకు గురి చేసిన, నిర్ఘాంతపోయే ఘటన ఇది. ఎవరో అపరిచితులు నా గదిలోకి వచ్చి బ్యాగ్ చోరీ చేశారు. ఇందులో నగదు, కార్డులు, గడియారాలతో పాటు నగలు కూడా ఉన్నాయి. ఇంగ్లండ్ బోర్డుతో భాగస్వామ్యం ఉన్న హోటల్లోనే ఇలా జరిగింది. భద్రతా ఏర్పాట్ల వైఫల్యం ఇది. వీలైనంత తొందరగా విచారణ జరిపి తగిన చర్య తీసుకుంటారని భావిస్తున్నా’ అని తానియా ట్వీట్ చేసింది. కాగా ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. చదవండి: Runout controversy: ‘అప్పటికే పలుమార్లు హెచ్చరించాం’ -
ఈడెన్ గార్డెన్స్ స్టాండ్‌కు ఝులన్ గోస్వామి పేరు!
భారత సీనియర్ పేసర్ ఝులన్ గోస్వామి అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్ మహిళలతో జరిగిన మూడో వన్డేలో తన అఖరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడింది. కాగా భారత జట్టు ఇంగ్లండ్ మూడు వన్డేల సిరీస్‌కు క్లీన్ స్వీప్ చేసి జూలన్కు ఘనమైన విడ్కోలు ఇచ్చారు. తన అఖరి మ్యాచ్‌లో గో స్వామి రెండు వికెట్లు పడగొట్టింది. దీంతో 355 వికెట్లతో అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా ఝులన్ తన కెరీర్‌ను ముగించింది. కాగా పశ్చిమబెంగాల్‌కు చెందిన జులన్ 2002లో ఇంగ్లండ్‌పై అంతర్జాతీయ అరంగేట్రం చేయగా.. ఇప్పడు అదే ఇంగ్లీష్ జట్టుపై తన కెరీర్‌ను ముగించడం గమానార్హం. ఇక ఇది ఇలా ఉండగా.. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో ఒక స్టాండ్‌కు ఝులన్ పేరును పెట్టి ఆమెను గౌరవించాలని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ యోచిస్తోంది. "మేము ఈడెన్ గార్డెన్స్‌లో ఒక స్టాండ్‌కు ఝులన్ గోస్వామి పేరు పెట్టాలని ప్లాన్ చేస్తున్నాము. ఆమె ఒక లెజెండరీ క్రికెటర్. కాబట్టి దిగ్గజ క్రికెటర్లతో పాటుగా ఆమె కూడా పేరు చిరస్మరణీయంగా నిలిచిపోయేలా ఉండాలి అనుకుంటున్నాము. అదే విధంగా ఒక ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించాలని భావిస్తున్నాము" అని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో పేర్కొన్నారు. చదవండి: Jhulan Goswami: ఒక శకం ముగిసింది.. బాల్‌గర్ల్ నుంచి స్టార్ క్రికెటర్ దాకా -
ఇంగ్లండ్ గడ్డపై టి20 సిరీస్ గెలవాలన్న కోరిక కలగానే..
ఇంగ్లండ్ గడ్డపై టి20 సిరీస్ గెలవాలనే కోరిక టీమిండియా మహిళల జట్టుకు కలగానే మిగిలిపోయింది. గురువారం రాత్రి జరిగిన మూడో టి20లో ఇంగ్లండ్ మహిళల జట్టు ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఉమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్ల దాటికి భారత్ టాప్-5 బ్యాటర్స్ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఒక దశలో 35 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్ కనీసం వంద పరుగులైనా చేస్తుందా అన్న అనుమానం కలిగింది. ఈ దశలో దీప్తి శఱ్మ(25 బంతుల్లో 24 పరుగులు), రిచా ఘోష్(22 బంతుల్లో 33 పరుగులు), పూజా వస్త్రాకర్ 19 పరుగులు నాటౌట్ చేయడంతో టీమిండియా గౌరవ ప్రదమైన స్కోరు అందుకుంది. ఇంగ్లండ్ బౌలర్లలో ఎక్లీస్టోన్ 3, సారా గ్లెన్ 2, వాంగ్, డేవిస్, స్మిత్‌లు తలా ఒక వికెట్ తీశారు. 123 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 18.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఓపెనర్లు సోఫియా డంక్లీ 49 పరుగులు, డేనియల్ వ్యాట్ 22 పరుగులతో శుభారంభం అందించారు. అనంతరం అలీస్ క్యాప్సీ(24 బంతుల్లో 38 నాటౌట్), బ్రయాన్ స్మిత్ 13 పరుగులు నాటౌట్ జట్టును గెలిపించారు. కాగా ఇరుజట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ సెప్టెంబర్ 18న(ఆదివారం) జరగనుంది. చదవండి: జడేజాలా తిప్పాలని యువ క్రికెటర్ విశ్వ ప్రయత్నాలు -
భారత్‌ను చిత్తు చేసిన ఇంగ్లండ్.. 9 వికెట్ల తేడాతో ఘన విజయం!
చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా భారత మహిళలతో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో దీప్తి శర్మ(29), స్మృతి మంధాన(23) పరుగులతో రాణించారు. వీరిద్దరూ మినహా మిగితా భారత బ్యాటర్ల అంతా దారుణంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో గ్లెన్ నాలుగు వికెట్లతో భారత పతనాన్ని శాసించగా.. డేవిస్, స్మిత్ తలా వికెట్ సాధించారు. అనంతరం 133 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 13 ఓవర్లలో చేధించింది. ఇంగ్లండ్ ఓపెనర్ సోఫియా డంక్లీ 61 పరుగులతో ఆజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా మాత్రమే వికెట్ సాధించింది. చదవండి: Road Safety World Series: బిన్నీ ఊచకోత.. సౌతాఫ్రికాపై ఇండియా లెజెండ్స్ ఘన విజయం -
భారత్‌తో టీ20 సిరీస్.. ఇంగ్లండ్‌కు భారీ షాక్!
స్వదేశంలో భారత మహిళలతో టీ20 సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్, స్టాండింగ్ కెప్టెన్ నాట్ స్కివర్ టీ20 సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌కు కూడా దూరమైంది. మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా స్కివర్ ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇప్పటికే రెగ్యులర్ కెప్టెన్ హీథర్ నైట్ గాయం కారణంగా భారత్ సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నైట్ స్థానంలో స్కివర్‌కు జట్టు కెప్టెన్సీ బాధ్యతలు ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అప్పగించింది. తాజాగా స్కివర్ కూడా తప్పుకోవడంతో ఇంగ్లండ్‌కు గట్టి ఎదురు దెబ్బ అనే చెప్పుకోవాలి. ఇక స్కివర్ స్థానంలో ఇంగ్లీష్ జట్టుకు కెప్టెన్‌గా వికెట్ కీపర్ అమీ జోన్స్ కెప్టెన్‌గా ఎంపికైంది. ఇక ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా భారత జట్టు మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. చెస్టర్ లీ స్ట్రీట్ వేదికగా శనివారం జరగనున్న తొలి టీ20తో భారత్ టూర్ ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ జట్టు: లారెన్ బెల్, మైయా బౌచియర్, ఆలిస్ క్యాప్సే, కేట్ క్రాస్, ఫ్రెయా డేవిస్, సోఫియా డంక్లీ, సోఫీ ఎక్లెస్టోన్, సారా గ్లెన్, అమీ జోన్స్ (కెప్టెన్), ఫ్రెయా కెంప్, బ్రయోనీ స్మిత్, ఇస్సీ వాంగ్, డాని వ్యాట్ భారత జట్టు: షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ, తనియా భాటియా(వికెట్ కీపర్), స్నేహ రాణా, రాధా యాదవ్, మేఘనా సింగ్, రేణుకా సింగ్, రాజేశ్వరి గయాక్వాడ్, సబ్బినేని మేఘనా, సబ్బినేని మేఘనా హేమలత, రిచా ఘోష్, సిమ్రాన్ బహదూర్, కిరణ్ నవ్‌గిరే చదవండి: Asia Cup 2022: 'కెప్టెన్ రిజ్వాన్ కాదు.. నేను'.. అంపైర్‌పై బాబర్ ఆజాం ఆగ్రహం -
1st T20I: నేడు ఇంగ్లండ్, భారత మహిళల తొలి టి20
కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిన చోటే భారత మహిళలు ఇప్పుడు ఇంగ్లండ్‌పై గెలిచేందుకు శ్రమించనున్నారు. మూడు టి20ల సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య తొలి పొట్టి మ్యాచ్ నేడు చెస్టర్ లీ స్ట్రీట్‌లో జరుగుతుంది. అంతర్జాతీయ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న హర్మన్‌ప్రీత్ సేన ఫినిషింగ్ లోపాలతో ‘బంగారం’లాంటి అవకాశాన్ని చేజార్చుకుంది. బ్యాటింగ్‌లో అప్పటిదాకా బాగా ఆడే అమ్మాయిలు విజయానికి చేరువగా వచ్చి చేతులెత్తేయడం ఐసీసీ ఈవెంట్లలో పరిపాటిగా మారింది. అయితే ఇకపై ఆ పొరపాట్లు పునరావృతం కాకుండా చూసుకుంటామని కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తెలిపింది. ‘కామన్వెల్త్లో మేం బాగా ఆడాం. కానీ ఇంకా మెరుగవ్వాలి. లోపాలు సరిదిద్దుకోవాల్సి వుంది’ అని కెప్టెన్ చెప్పింది. రా.గం. 11.30 నుంచి జరిగే మ్యాచ్‌ను సోనీ టెన్–1 చానెల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. -
టీమిండియా సీనియర్ పేసర్ రీఎంట్రీ.. లార్డ్స్‌లో ఫేర్వెల్!
ఇంగ్లండ్ గడ్డపై మూడు టి20లు, 3 వన్డేల్లో తలపడే భారత మహిళల జట్టును సెలక్టర్లు గురువారం ప్రకటించారు. గత శ్రీలంక సిరీస్‌కు దూరంగా ఉండి రిటైర్మెంట్పై అనుమానాలు పెంచిన సీనియర్ పేసర్ జులన్ గోస్వామి ఇప్పుడు జట్టులోకి పునరాగమనం చేయడం విశేషం. అయితే ఇదే సిరీస్‌లో సెప్టెంబర్ 24న లార్డ్స్ వేదికగా జరగనున్న మూడో వన్డే ఆమెకు ఆఖరి మ్యాచ్ కానుందనే వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు బీసీసీఐ ప్లాన్‌లో భాగంగానే ఝులన్ గోస్వామికి వీడ్కోలు మ్యాచ్ నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ఇక 39 ఏళ్ల ఝులన్ గోస్వామి 2018లో టి20 క్రికెట్ నుంచి తప్పుకొని కేవలం వన్డేలకు పరిమితమైంది. మహిళా క్రికెట్లో వన్డే ఫార్మాట్లో 200, 250 వికెట్ల మైలురాయిని అందుకున్న తొలి బౌలర్‌గా ఝులన్ గోస్వామి చరిత్ర సృష్టించింది. 2007లో ఐసీసీ వుమెన్స్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన ఝులన్ గోస్వామి 2008 నుంచి 2011 వరకు టీమిండియా మహిళా జట్టుకు నాయకత్వం వహించింది. ఇక ఝులన్ గోస్వామి టీమిండియా తరపున 12 టెస్టుల్లో 291 పరుగులు.. 44 వికెట్లు, 199 వన్డేల్లో 1226 పరుగులు.. 250 వికెట్లు.. 68 టి20ల్లో 405 పరుగులు.. 56 వికెట్లు పడగొట్టింది. ఇక ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఏడాది తర్వాత వన్డే టీమ్‌లో జెమీమా రోడ్రిగ్స్‌కు చోటు దక్కగా, దేశవాళీ క్రికెట్లో మెరుపు ఇన్నింగ్స్‌లతో సత్తా చాటిన నాగాలాండ్ బ్యాటర్ కిరణ్ ప్రభు నవ్‌గిరేకు తొలిసారి భారత టి20 జట్టులో చోటు లభించింది. రెండేళ్ల తర్వాత హేమలత మళ్లీ వన్డే టీమ్‌కు ఎంపిక కాగా, లెగ్‌స్పిన్నర్ పూనమ్ యాదవ్‌కు రెండు టీమ్‌లలోనూ స్థానం లభించలేదు. ఆంధ్ర క్రికెటర్ సబ్బినేని మేఘన వన్డే, టి20 టీమ్‌లలోనూ అవకాశం దక్కించుకోగలిగింది. Jhulan Goswami's 20-year international career is set to conclude at Lord's, after the third and final ODI of India's tour of England on September 24 — ESPNcricinfo (@ESPNcricinfo) August 20, 2022 చదవండి: అంపైర్ల నియామకానికి రాత పరీక్ష.. పిచ్చి ప్రశ్నలతో విసిగించిన బీసీసీఐ Eugenie Bouchard: ఐడీకార్డుపై బికినీతో ఫోటో.. షాకైన టెన్నిస్ స్టార్ -
ఇంగ్లండ్ కెప్టెన్‌కు సర్జరీ.. భారత్‌తో సిరీస్‌కు దూరం!
ఈ ఏడాది సెప్టెంబర్‌లో భారత మహిళలతో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌కు ఇంగ్లండ్ సారథి హీథర్ నైట్ దూరం కానుంది. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లో గాయపడిన నైట్.. ప్రస్తుతం తన తుంటి ఎముక గాయానికి సర్జరీ చేయించుకుంది. దీంతో ఆమె కొన్ని నెలలపాటు క్రికెట్‌కు దూరంగా ఉండనుంది. ఈ క్రమంలోనే భారత్‌తో జరగనున్న సిరీస్‌కు, మహిళల బిగ్‌బాష్ లీగ్‌కు నైట్ దూరం కానుంది. కాగా ఆమె ఈ గాయం కారణంగానే కామన్వెల్త్ గేమ్స్-2022, ది హండ్రెడ్ సీజన్ నుంచి తప్పుకుంది. ఇక ఇదే విషయాన్ని నైట్ కూడా దృవీకరించింది. "నేను నా తుంటి ఎముక గాయానికి సర్జరీ చేయించుకున్నాను. మళ్లీ ఎప్పటి మాదిరిగానే మైదానంలో పరిగెత్తడానికి సిద్దమవుతాను. అయితే దురదృష్టవశాత్తూ ఈ గాయం నన్ను భారత్ సిరీస్, మహిళల బిగ్‌బాష్ లీగ్‌లో భాగం కాకుండా చేసింది. కానీ ఈ ఏడాది అఖరి నాటికి తిరిగి జట్టులోకి రావాలని లక్ష్యంగా పెట్టుకున్నాను" నైట్ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. భారత్‌తో జరిగే సిరీస్‌కు నైట్ స్థానంలో ఆ జట్టు ఆల్‌రౌండర్ స్కైవర్ కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం ఉంది. కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా ఆమెనే ఇంగ్లండ్ సారథిగా బాధ్యతలు నిర్వర్తించింది. కాగా ఇంగ్లండ్ పర్యటలో భాగంగా భారత్ మూడు టీ20లు మూడు వన్డేలు ఆడనుంది. సెప్టెంబర్ 10న చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా జరగనున్న తొలి టీ20తో భారత పర్యటన ప్రారంభం కానుంది. చదవండి: ILT20: జట్టును ప్రకటించిన షార్జా వారియర్స్.. మోయిన్ అలీతో పాటు! -
కామన్వెల్త్ గేమ్స్.. 10వ రోజు భారత్ షెడ్యూల్ ఇదే!
బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్-2022లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. ఈ మెగా ఈవెంట్లో భాగంగా తొమ్మిదో రోజు(శనివారం) అథ్లెట్లు 11 పతకాలతో సత్తా చాటారు. ఈ 11 పతకాల్లో మూడు స్వర్ణ పతకాలు, మూడు రజతాలు, ఐదు కాంస్య పతకాలు ఉన్నాయి. కామన్వెల్త్ పతకాల పట్టికలో 40 మెడల్స్‌తో భారత్ ఐదో స్థానంలో కొనసాగుతోంది. ఇక 10వరోజు కూడా భారత క్రీడాకారులు సత్తాచాటడానికి సిద్దమయ్యారు. కామెన్వెల్త్ గేమ్స్‌లో 10వ రోజు భారత్ షెడ్యూల్ హాకీ ఉమెన్స్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 1.30 నుంచి) ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ బ్యాడ్మింటన్ ఉమెన్స్ సింగిల్స్ సెమీఫైనల్ (మధ్యాహ్నం 2.20) పీవీ సింధు మెన్స్ సింగిల్స్ సెమీఫైనల్ (మధ్యాహ్నం 3.10) లక్ష్య సేన్ మెన్స్ సింగిల్స్ సెమీఫైనల్ (మధ్యాహ్నం 3.10) కిదాంబి శ్రీకాంత్ మహిళల డబుల్స్ సెమీ ఫైనల్ ట్రీసా జాలీ/గాయత్రి గోపీచంద్ (సాయంత్రం 4 గంటలు) పురుషుల డబుల్స్ సెమీఫైనల్ చిరాగ్ శెట్టి/సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి (సాయంత్రం 4.50) అథ్లెటిక్స్ మెన్స్ ట్రిపుల్ జంప్ (మధ్యాహ్నం 2.45 ) అబ్దుల్లా అబూబాకర్, ఎల్డోస్ పాల్, ప్రవీన్ చిట్రివేల్ మెన్స్ 10000 మీటర్ల రేజ్ వాక్ ఫైనల్ (మధ్యాహ్నం 3.50) సందీప్ కుమార్ ఉమెన్స్ జావెలిన్ త్రో ఫైనల్ (సాయంత్రం 4.05) శిల్ప రాణి, అన్నూ రాణి ఉమెన్స్ 4 *100 రిలే ఫైనల్ (సాయంత్రం 5.24) మెన్స్ జావెలిన్ త్రో ఫైనల్ (ఆదివారం అర్థరాత్రి) రోహిత్ యాదవ్, డీపీ మను మెన్స్ 4 * 100 రిలేజ్ ఫైనల్ ఆదివారం అర్ధరాత్రి బాక్సింగ్ ఉమెన్స్ 48 కేజీలు ఫైనల్(మధ్యాహ్నం 3 గంటలకు) - నీతు గంగహాస్ మెన్స్ 51 కేజీలు ఫైనల్ మధ్యాహ్నం 3.15 గంటలకు - అమిత్ పంగల్ ఉమెన్స్ 50 కేజీలు ఫైనల్ రాత్రి 7 గంటలకు - నిఖత్ జరీన్ టేబుల్ టెన్నిస్ ఉమెన్స్ సింగిల్స్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్ (మధ్యాహ్నం 3.35) మెన్స్ డబుల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (సాయంత్రం 6.15) ఆచంట శరత్ కమల్, జి సత్యన్ మెన్స్ సింగిల్స్ సెమీఫైనల్ ఆచంట శరత్ కమల్( రాత్రి 9.50) సత్యన్ జ్ఞానశేఖరన్ ( రాత్రి 10.40) మిక్స్ డ్ డబుల్స్ గోల్డ్ మెడల్ మ్యాచ్ (ఆదివారం అర్ధరాత్రి ) ఆచంట శరత్ కమల్, శ్రీజ ఆకుల క్రికెట్ ఉమెన్స్ టీ20 ఫైనల్(ఆస్ట్రేలియా-భారత్) రాత్రి 9:30 గంటలకు ప్రారంభం స్క్వాష్ మిక్స్ డ్ డబుల్స్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్ (రాత్రి 10.30) దీపిక పల్లికల్, సౌరభ్ ఘోషల్ చదవండి: Commonwealth Games 2022: భారత్ పతకాల మోత -
చరిత్రకు అడుగుదూరంలో.. ఫైనల్లో తలపడనున్న భారత్, ఆస్ట్రేలియా
కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించడానికి భారత మహిళల జట్టు ఒక్క అడుగుదూరంలో ఉంది. ఆగస్టు 8(ఆదివారం) రాత్రి జరగనున్న ఫైనల్లో ఆస్ట్రేలియాను భారత్ ఎదుర్కోనుంది. ముఖాముఖి రికార్డులో భారత్‌పై ఆస్ట్రేలియాదే పైచేయి అయినప్పటికి.. ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత్‌ను ఆసీస్ ఏ మేరకు నిలువరిస్తుందనే వేచి చూడాలి. భారత మహిళా బ్యాటర్లలో స్మృతి మంధాన, జేమీమా రోడ్రిగ్స్‌లు తమ కెరీర్లో అత్యున్నత ఫామ్‌లో ఉండగా.. బౌలింగ్‌లో రేణుకా సింగ్ తన మిస్టరీ బౌలింగ్‌తో ప్రత్యర్థులను ముప్పతిప్పలు పెడుతుంది. ఒకవేళ భారత్ గెలిస్తే మాత్రం చరిత్ర సృష్టించినట్లే. కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల విభాగంలో క్రికెట్‌ను ప్రవేశపెట్టిన తొలిసారే పతకం సాధించిన జట్టుగా భారత మహిళల జట్లు కొత్త రికార్డు నెలకొల్పనుంది. సెమీస్‌లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా గెలుపు ఇక శనివారం న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో సెమీఫైనల్లో ఆసీస్ మహిళలు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. సోఫీ డివైన్ 53 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. అమేలియా ఖేర్ 40 పరుగులతో రాణించింది. ఆసీస్ బౌలర్లలో స్కాట్ 3, తాహిలా మెక్‌గ్రాత్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మహిళలు 19.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. బెత్ మూనీ 36, తాహిలా మెక్‌గ్రాత్ 34 పరుగులు చేశారు. చదవండి: Obed Mccoy: మొన్న 'భయపెట్టాడు'.. ఇవాళ 'భయపడ్డాడు' Katherine Brunt CWG 2022: ఇంగ్లండ్ బౌలర్‌కు షాకిచ్చిన ఐసీసీ -
CWG 2022: బార్బడోస్పై ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన టీమిండియా
కామన్వెల్త్ గేమ్స్ 2022లో టీమిండియా మహిళల జట్టు సెమీస్‌కు దూసుకెళ్లింది. గేమ్స్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా వుమెన్స్ జూలు విదిల్చారు. బుధవారం బార్బడోస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మహిళలు 100 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా మహిళలు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. జెమీమా రోడ్రిగ్స్(46 బంతుల్లో 56 నాటౌట్, 6 ఫోర్లు, ఒక సిక్స్) టాప్ స్కోరర్ కాగా.. షఫాలీ వర్మ(26 బంతుల్లో 43, 7 ఫోర్లు, 1 సిక్సర్), చివర్లో దీప్తి శర్మ(28 బంతుల్లో 34, 2 ఫోర్లు, 1 సిక్సర్) దుమ్మురేపడంతో భారత్ మహిళల జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్ చేసిన బార్బడోస్ మహిళల జట్టు భారత్ బౌలర్ల ఒత్తిడిని తట్టుకోలేక 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 62 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగించింది. కోషోనా నైట్ 16 పరుగులతో టాప్ స్కోరర్ కాగా.. మిగతావారు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. టీమిండియా వుమెన్స్ బౌలర్లలో రేణుకా సింగ్ 4 వికెట్లు తీయగా.. మేఘనా సింగ్, స్నేహ్ రాణా, రాదా యాదవ్, హర్మన్‌ప్రీత్ కౌర్‌లు తలా ఒక వికెట్ తీశారు. ఇక న్యూజిలాండ్, ఇంగ్లండ్ మధ్య విజేతతో టీమిండియా మహిళల జట్టు సెమీస్‌లో తలపడనుంది. సెమీస్‌లో గెలిస్తే మాత్రం టీమిండియా మహిళల జట్టుకు పతకం ఖాయమైనట్లే. A fantastic victory for #TeamIndia. They win by 100 runs and advance into the semi-finals at the #CWG2022 👏👏 Scorecard - https://t.co/upMpWogmIP #INDvBAR #B2022 pic.twitter.com/uH6u7psVmG — BCCI Women (@BCCIWomen) August 3, 2022 -
టీమిండియాకు భారీ షాక్.. ఇద్దరు క్రికెటర్లకు కోవిడ్
బర్మింగ్‌హామ్ వేదికగా ఈనెల (జులై) 28 నుంచి ప్రారంభంకానున్న కామన్వెల్త్ గేమ్స్‌కు ముందు భారత మహిళా క్రికెట్ జట్టుకు భారీ షాక్ తగిలింది. టీమిండియాలోని ఇద్దరు ఆటగాళ్లు కోవిడ్ బారిన పడినట్లు జట్టు యాజమాన్యం మంగళవారం ప్రకటించింది. ఆదివారం (జులై 24) జట్టు బర్మింగ్‌హామ్‌కు బయల్దేరాక టీమిండియా మేనేజ్మెంట్ ఈ విషయాన్ని ఇవాళ వెల్లడించింది. అయితే ఆ ఇద్దరి పేర్లను చెప్పేందుకు నిరాకరించింది. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత ఆ ఇద్దరు బర్మింగ్‌హామ్‌లో జట్టుతో కలుస్తారని తెలిపింది. కాగా, కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల క్రికెట్‌కు తొలిసారి ప్రాతినిధ్యం లభించిన విషయం తెలిసిందే. జులై 29న టీమిండియా తమ తొలి పోరులో పటిష్టమైన ఆసీస్‌ను ఢీకొట్టాల్సి ఉంది. అనంతరం భారత్ జులై 31న పాకిస్థాన్‌తో.. ఆగస్ట్ 3న బార్బడోస్‌తో తలపడాల్సి ఉంది. మొత్తం 8 జట్లు పాల్గొనే ఈ క్రీడల్లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బార్బడోస్, భారత్ ఓ గ్రూప్ (ఏ)లో.. ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక జట్లు మరో గ్రూప్‌లో (బి) ఉన్నాయి. చదవండి: CWG 2022: క్రికెట్లో గోల్డ్ మెడల్ సాధించగల సత్తా ఉన్న మూడు జట్లు ఇవే..! -
అంతర్జాతీయ క్రికెట్‌కు టీమిండియా సీనియర్ ఆల్‌రౌండర్ గుడ్ బై
టీమిండియా మహిళా క్రికెట్లో మరో శకం ముగిసింది. మహిళా సీనియర్ ఆల్‌రౌండర్ రుమేలీ ధార్ బుధవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికింది. 2005 మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్ చేరిన టీమిండియా జట్టులో రుమేలీ ధార్ సభ్యురాలు. ఈ విషయాన్ని రుమేలీ ధార్ తన ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ''23 ఏళ్ల క్రితం బెంగాల్‌లోని శ్యామ్నగర్లో ప్రారంభమైన నా క్రికెట్ కెరీర్ నేటితో ముగిసింది. అంతర్జాతీయ క్రికెట్ సహా అన్ని రకాల ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నా. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు చూశాను. ఇక 2005 నా కెరీర్లో మరిచిపోలేని సంవత్సరం. ఆ ఏడాది వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్ చేరడం.. అందులో నేను భాగస్వామ్యం అవడం ఎప్పటికి మరిచిపోలేను. మెన్ ఇన్ బ్లూ డ్రెస్‌లో కప్ కొట్టలేదన్న వెలితి తప్ప మిగతా అంతా సంతోషంగానే అనిపించింది. ఆ తర్వాత గాయాలు తరచూ వేధించినప్పటికి తిరిగి ఫుంజుకొని టీమిండియాకు ఆడాను. ఇక యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చేసింది. అందుకే రిటైర్మెంట్కు ఇదే కరెక్ట్ అని భావించాను. ఇంతకాలం నాకు సహకరించిన కుటుంబసభ్యులకు, బీసీసీఐ, నా స్నేహితులకు కృతజ్ఞతలు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో నేను ప్రాతినిధ్యం వహించిన అన్ని జట్లకు నా తరపున మరోసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నా.'' అంటూ ముగించింది. 2003లో ఇంగ్లండ్ పర్యటనలో రుమేలీ ధార్ టీమిండియా తరపున మహిళల క్రికెట్లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసింది. రుమేలీ ధార్ చివరిసారి 2018లో టీమిండియా తరపున ఆడింది. ఇండియా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన ట్రై సిరీస్ ఆమెకు ఆఖరుది. 19 ఏళ్ల కెరీర్లో టీమిండియా తరపున 78 వన్డేల్లో 961 పరుగులతో పాటు 63 వికెట్లు పడగొట్టింది. ఇక నాలుగు టెస్టుల్లో 236 పరుగులతో పాటు వికెట్లు తీసింది. 18 టి20ల్లో 131 పరుగులు చేసిన రుమేలీ ధార్ బౌలింగ్‌లో 13 వికెట్లు పడగొట్టింది. 2005లో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా మహిళల జట్టు ఫైనల్ చేరడంలో రుమేలీ ధార్ పాత్ర కూడా ఉంది. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో 98 పరుగుల తేడాతో ఓటమిపాలై రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత ఇంగ్లండ్ వేదికగా జరిగిన 2009 టి20 ప్రపంచకప్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో ఆరు వికెట్లు తీసిన రుమేలీ ధార్.. ఒక పొట్టి ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో రుమేలీ ధార్ మరో బౌలర్‌తో కలిసి సంయుక్తంగా నిలిచింది. View this post on Instagram A post shared by Rumeli Dhar (@rumelidhar54) చదవండి: ఐసీయూలో వెంటిలేటర్‌పై పాక్ దిగ్గజ క్రికెటర్ -
శెభాష్ అమ్మాయిలు.. పాక్‌పై భారత్ ఘన విజయం(ఫోటోలు)
-
ప్రపంచకప్‌లో భారత్ బోణి.. పాకిస్తాన్‌కు చుక్కలు..
Ind W Vs Pak W 2022 World Cup: ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2022లో భారత్ బోణి కొట్టింది. పాకిస్తాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 107 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. కాగా పాక్‌పై భారత్‌కు ఇది వరుసగా 11వ విజయం. ఇక 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. భారత బౌలర్ల ధాటికి 137 పరుగులకే కుప్పకూలింది. పాక్ బ్యాటర్లలో సిద్రా అమీన్(30) తప్ప మిగితా ఎవరూ రాణించలేదు. భారత బౌలర్లలో రాజేశ్వరీ గైక్వాడ్ మూడు వికెట్లు పడగొట్టగా, గోస్వామి, స్నేహ్ రానా చెరో రెండు వికెట్లు సాధించారు.ఇక అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 244 పరుగులు సాదించింది. భారత బ్యాటర్లలో పూజా వస్త్రాకర్ అద్భుతంగా రాణించింది. ఇక 114 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన భారత్‌ను పూజా వస్త్రాకర్(67),స్నేహ్ రానా(53) అదుకున్నారు. వీరిద్దరూ ఏడో వికెట్‌కు 124 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. భారత బ్యాటర్లలో కెప్టెన్ మిథాలీ, హర్మన్ ప్రీత్, షఫాలీ వర్మ నిరాశపరిచాడు. పాక్ బౌలర్లలో నిదా ధార్,సంధు చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. బేగ్, ఆమీన్ ఒక్కో వికెట్ సాధించారు. ఇక ఈమ్యాచ్‌లో 67 పరుగులతో అద్భుతంగా రాణించిన పూజా వస్త్రాకర్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో మార్చి10న తలపడనుంది. చదవండి: Shane Warne: శవపరీక్షకు వార్న్ మృతదేహం.. బోరుమన్న దిగ్గజం కుమారుడు -
వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.. అదరగొట్టిన మంధాన
రంగియోరా (న్యూజిలాండ్): వన్డే ప్రపంచకప్ సన్నాహాల్లో భాగంగా మంగళవారం జరిగిన రెండో ప్రాక్టీస్ పోరులో భారత జట్టు 81 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై నెగ్గింది. ఓపెనర్ స్మృతి మంధాన (67 బంతుల్లో 66; 7 ఫోర్లు), దీప్తి శర్మ (64 బంతుల్లో 51; 1 ఫోర్) అర్ధ సెంచరీలు చేశారు. యస్తిక భాటియా (42; 5 ఫోర్లు), కెప్టెన్ మిథాలీ రాజ్ (30; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. దీంతో మొదట భారత్ 50 ఓవర్లలో 258 పరుగులకు ఆలౌటైంది. తర్వాత విండీస్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 177 పరుగులే చేయగలిగింది. -
Team India: కుటుంబ సమేతంగా ఇంగ్లండ్‌కు పయనం!
ముంబై: భారత పురుషులు, మహిళల క్రికెట్ జట్లు కుటుంబ సమేతంగా ఇంగ్లండ్ పర్యటనకు వచ్చేందుకు యూకే ప్రభుత్వం సమ్మతి తెలిపింది. తమ దేశంలో సుదీర్ఘ పర్యటన నిమిత్తం రానున్న రెండు జట్ల ప్లేయర్స్.. తమ తమ ఫ్యామిలీస్‌తో కలిసి ఉండేందుకు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్(ఈసీబీ) ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పర్యటనలో భాగంగా భారత పురుషుల జట్టు ఏకంగా నాలుగున్నర నెలలు యూకేలోనే గడపనుండగా, మహిళా జట్టు కూడా దాదాపు నెలన్నర రోజులు అక్కడే స్టే చేయనుంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌తో పాటు రూట్ సేనతో ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో పాల్గొనేందుకు భారత పురుషుల జట్టు, ఇంగ్లండ్ వుమెన్స్ టీమ్‌తో ఒక టెస్ట్, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడేందుకు భారత మహిళా జట్లు ఈ నెల 2న ప్రత్యేక విమానంలో లండన్‌కు బయల్దేరనున్నాయి. లండన్‌లో ల్యాండ్ అయ్యాక ఇండియా మెన్స్ టీమ్.. డబ్ల్యూటీసీ ఫైనల్ వేదికైన సౌథాంప్టన్‌కు వెళ్లనుండగా.. భారత మహిళల జట్టు ఏకైక టెస్ట్‌కు వేదికైన బ్రిస్టల్‌కు బయల్దేరుతుంది. అయితే, యూకేలో ల్యాండ్ అయ్యాక భారత బృందం 10 రోజుల పాటు తప్పనిసరి క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. అనంతరం ప్లేయర్స్‌తో పాటు వారి కుటుంబ సభ్యుల నెగటివ్ ఆర్టీ-పీసీఆర్ రిపోర్టును కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. కాగా, లండన్‌కు బయల్దేరనున్న భారత బృందం ఇప్పటికే ముంబైలోని ఒకే హోటల్లో క్వారంటైన్లో ఉంటుంది. భారత్‌లో రెండో దశ కరోనా వ్యాప్తి కారణంగా ఇండియా నుంచి ప్రయాణాలపై నిషేధం ఉన్నా.. క్రికెట్ మ్యాచ్‌ల కోసం యూకే ప్రభుత్వం ప్లేయర్స్‌కు సడలింపులు ఇచ్చినట్లు ఐసీసీ వెల్లడించింది. చదవండి: నా 'ఈ స్థాయికి' ధోనినే కారణం: జడ్డూ -
ధోని సలహాల వల్ల చాలా మెరుగయ్యాను..
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోని సలహాలు తనను మెరుగైన వికెట్‌కీపర్‌గా మార్చాయని భారత మహిళా జట్టు వికెట్ కీపర్ ఇంద్రాణి రాయ్ తెలిపారు. త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టులో సభ్యురాలైన ఈ పశ్చిమ్ బెంగాల్ మహిళా క్రికెటర్.. ధోనిని ఆదర్శంగా తీసుకుని, అతని అడుగుజాడల్లో నడుస్తానంటోంది. భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనలో ఒక టెస్ట్, మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుండగా ఇంద్రాణి.. మూడు ఫార్మాట్లలో జట్టు సభ్యురాలిగా ఉంది. టెస్ట్ ఫార్మాట్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించడం తన కల అని, ఇంగ్లండ్ పర్యటనతో అది నిజం కాబోతుందని ఆమె ఉబ్బితబ్బిబవుతోంది. మిథాలీ రాజ్, జులన్ గోస్వామి వంటి సీనియర్లతో డ్రస్సింగ్ రూమ్ షేర్ చేసుకోవడం గొప్ప అనుభూతి అని చెప్పుకొచ్చింది. అండర్-19, అండర్-23 బెంగాల్‌కు ఆడిన ఆమె.. అక్కడ సరైన అవకాశాలు రాకపోవడంతో 2018లో ఝార్ఖండ్‌కు మారింది. రాంచీలో జరిగే ట్రైనింగ్ సెషెన్స్‌లో ఆమె ధోనిని చాలాసార్లు కలిసింది. వికెట్ కీపింగ్‌పై ఆమెకు మక్కువను చూసిన మహేంద్రుడు ఆమెకు ఎన్నో సలహాలు ఇచ్చాడు. ఆ సలహాల వల్లే తాను జాతీయ జట్టుకు ఎంపిక కాగలిగానని ఆమె పేర్కన్నారు. -
చరిత్ర సృష్టించనున్న మిథాలీ సేన..
ముంబై: భారత మహిళా క్రికెట్ లో మరో ఘట్టానికి తెర లేవనుంది. మహిళల క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకు వేళ్లేందుకు బీసీసీఐ అడుగులు వేస్తుంది. దీనిలో భాగంగా భారత మహిళా క్రికెట్ జట్టు తమ తొలి డేనైట్ టెస్ట్ మ్యాచ్ ఆడబోతోంది. ఈ ఏడాది చివరలో ఆస్ట్రేలియాలో మిథాలీ సేన పింక్ బాల్ టెస్ట్ ఆడనుంది. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య సెప్టెంబర్ 30 నుంచి అక్టోబర్ 3 వరకు ఈ మ్యాచ్ జరగునుంది. ఈ విషయాన్ని భారత నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా ట్విట్టర్ ద్వారా తెలిపారు. అయితే మహిళల క్రికెట్ చరిత్రలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగే పింక్‌బాల్ టెస్టు రెండోది మాత్రమే. 2017లో ఇంగ్లండ్-ఆస్ట్రేలియా తొలి డేనైట్ టెస్ట్ మ్యాచ్ జరిగింది.ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.జూన్ 2న భారత పురుషులతో పాటు మహిళలు కూడా ఇంగ్లండ్ పర్యటనకు వెళుతున్న విషయం తెలిసిందే. ఏడేళ్ల తర్వాత ఇంగ్లండ్‌లో మిథాలీ సేన టెస్టు మ్యాచ్ ఆడనుంది. జూన్ 16 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. (చదవండి:ఇంగ్లండ్ వేదికగా ఐపీఎల్ ?) -
టీమిండియా తొలి ఉమెన్ క్రికెటర్‌గా
లక్నో: టీమిండియా ఉమెన్స్ వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన ఘనత సాధించింది. అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి 10వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి టీమిండియా ఉమెన్ క్రికెటర్‌గా చరిత్ర సృష్టించింది. అలాగే అంతర్జాతీయ మహిళల క్రికెట్లో ఈ ఫీట్‌ను అందుకున్న రెండో క్రికెటర్‌గా రికార్డు అందుకుంది. తాజాగా దక్షిణాఫ్రికాతో జరగుతున్న మూడో వన్డేలో మిథాలీ ఈ ఘనతను అందుకుంది. ఇన్నింగ్స్ 28వ ఓవర్లో అన్నే బోస్క్ వేసిన బంతిని బౌండరీగా మలిచిన మిథాలీ ఈ ఫీట్‌ను చేరుకుంది. మొత్తంగా చూసుకుంటే మిథాలీ రాజ్ ఇప్పటివరకు 10 టెస్టుల్లో 663 పరుగులు, 210 వన్డేల్లో 6938 పరుగులు, 89 టీ20ల్లో 2364 పరుగులు సాధించింది. ఇందులో వన్డేల్లో 7 సెంచరీలు చేయగా.. టెస్టుల్లో 1 సెంచరీ సాధించింది. కాగా ఇప్పటివరకు అంతర్జాతీయ కెరీర్లో అన్ని ఫార్మాట్లు కలిపి 10వేల పరుగులు సాధించిన మహిళ క్రికెటర్‌గా ఇంగ్లండ్‌కు చెందిన చార్లెట్ ఎడ్వర్డ్స్ తొలి స్థానంలో ఉంది. ఇంగ్లండ్ తరపున ఎడ్వర్డ్స్ 23 టెస్టుల్లో 1676 పరుగులు, 191 వన్డేల్లో 5992 పరుగులు, 95 టీ20ల్లో 2605 పరుగులు సాధించింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఉమెన్స్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. పూనమ్ రౌత్ 77 పరుగులతో రాణించగా.. మిథాలీ, హర్మన్ ప్రీత్, దీప్తి శర్మ 36 పరుగులతో రాణించారు. ప్రస్తుతం ఇంగ్లండ్ 4 ఓవర్లలో వికెట్లు కోల్పోకుండా 8 పరుగులు చేసింది. చదవండి: త్రో వేయడంలో కన్ఫ్యూజన్.. అసలు మజా అక్కడే పంత్‌ను వదిలేశాం.. మీరు వదిలేస్తే మంచిది: రోహిత్ Congratulations, Mithali Raj 👏 A modern-day legend. pic.twitter.com/XyI89zWL47 — ICC (@ICC) March 12, 2021 -
చెలరేగిన స్మృతి మంధాన.. దక్షిణాఫ్రికా చిత్తు
లక్నో: తొలి వన్డేలో ఎదురైన పరాజయం నుంచి భారత మహిళల క్రికెట్ జట్టు వెంటనే తేరుకుంది. రెండో వన్డేలో దక్షిణాఫ్రికాను ఆల్‌రౌండ్ ప్రదర్శన తో దెబ్బకొట్టి సిరీస్‌లో సమంగా నిలిచింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మిథాలీ రాజ్ కెప్టెన్సీలోని భారత జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై జయభేరి మోగించింది. బౌలింగ్‌లో వెటరన్ సీమర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జులన్ గోస్వామి (4/42) దక్షిణాఫ్రికాను వణికించగా... తర్వాత బ్యాటింగ్‌లో స్మృతి మంధాన (64 బంతుల్లో 80 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగింది. స్మృతికి పూనమ్ రౌత్ (89 బంతుల్లో 62 నాటౌట్; 8 ఫోర్లు) తోడుగా నిలిచింది. దాంతో భారత్ 28.4 ఓవర్లలో కేవలం వికెట్ నష్టపోయి 160 పరుగులు చేసి విజయాన్ని దక్కించుకుంది. ఛేజింగ్‌లో వరుసగా పది అర్ధ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా స్మృతి గుర్తింపు పొందింది. అంతకుముందు టాస్ నెగ్గిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 41 ఓవర్లలో 157 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు లిజెల్లి లీ (4), వోల్వర్డ్ (9) జట్టు స్కోరు 20 పరుగులకే వెనుదిరిగారు. ఈ దశలో లారా గుడ్‌ఆల్ (49; 2 ఫోర్లు), సునే లూస్ (36; 5 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. మూడో వికెట్‌కు 60 పరుగులు జోడించాక కెప్టెన్ లూస్‌ను మాన్సీ జోషి అవుట్ చేసింది. అక్కడి నుంచి భారత బౌలర్లు పట్టుబిగించారు. కేవలం 58 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లను పడేశారు. లూస్, గుడ్‌ఆల్ తర్వాత ఇంకెవరూ భారత బౌలింగ్‌కు అసలు క్రీజులో నిలిచే సాహసం చేయలేకపోయారు. స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ 3, మాన్సి జోషి 2 వికెట్లు తీశారు. ఛేజింగ్‌లో ఓపెనర్ జెమీమా రోడ్రిగ్స్ (9) తక్కువ స్కోరుకే వెనుదిరగగా... స్మృతి, పూనమ్ రౌత్‌తో కలిసి అబేధ్యమైన రెండో వికెట్‌కు 138 పరుగులు జోడించడంతో భారత్ విజయం ఖాయమైంది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే షబ్నిమ్ బౌలింగ్‌లో స్మృతి రెండు వరుస సిక్సర్లతో ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో స్మృతి 46 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. ఆమెకు అండగా నిలిచిన పూనమ్ రౌత్ 79 బంతుల్లో ఫిఫ్టీని అధిగమించింది. ఐదు వన్డేల సిరీస్ 1–1తో సమంగా ఉండగా... మూడో వన్డే శుక్రవారం ఇదే వేదికపై జరుగుతుంది. దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో ఆడటం ద్వారా అంతర్జాతీయ మహిళల క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా మిథాలీ రాజ్ గుర్తింపు పొందింది. 1999లో అరంగేట్రం చేసిన మిథాలీ ఇప్పటివరకు 310 మ్యాచ్‌లు (10 టెస్టులు+211 వన్డేలు+82 టి20లు) ఆడింది. 309 మ్యాచ్‌లతో (23 టెస్టులు+191 వన్డేలు+95 టి20లు) చార్లోటి ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్) పేరిట ఉన్న రికార్డును మిథాలీ అధిగమించింది. -
ప్రతిభను వెలికితీస్తాం
న్యూఢిల్లీ: యువ ప్రతిభను వెలికితీయడమే తమ ప్యానెల్ లక్ష్యమని భారత మహిళల క్రికెట్ చీఫ్ సెలక్టర్ నీతూ డేవిడ్ అన్నారు. 16 ఏళ్ల వయస్సులోనే సత్తా చాటుతోన్న భారత క్రికెటర్ షఫాలీ వర్మలాంటి ప్లేయర్లను ప్రోత్సహిస్తామని ఆమె చెప్పారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం అన్ని స్థాయిల క్రికెట్లో హిట్టింగ్, ఆట వేగం పెరిగిపోయిందని విశ్లేషించారు. యువ సత్తాతో పాటు అనుభవజ్ఞులు కూడిన జట్టుతో అద్భుతాలు చేయొచ్చని ఆమె వివరించారు. ‘ఇప్పుడు దేశవాళీ క్రికెట్లో కూడా వేగం చాలా పెరిగింది. గతంలో ఇలా ఉండేది కాదు. ప్లేయర్లు దూకుడుగా ఆడుతున్నారు. వారి ఆలోచనా విధానం మారింది. అందుకు తగినట్లే షఫాలీలా ఆడే వారు కావాలి. మన దగ్గర చాలా మంది యువ ప్రతిభావంతులు ఉన్నారు. తగిన సమయంలో వారికి అవకాశాలు కల్పించాలి. వారితో పాటు మిథాలీ రాజ్, జులన్ గోస్వామి అనుభవజ్ఞులు ఉంటేనే జట్టుకు సమతూకం వస్తుంది. వారు మెరుగ్గా ఆడినంత కాలం రిటైర్మెంట్ గురించి ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. ఏ నిర్ణయం ఎప్పుడు తీసుకోవాలో వారికి బాగా తెలుసు’ అని ఆమె చెప్పుకొచ్చారు. మెగా టోర్నీల్లో తుదిపోరులో జట్టు వైఫల్యంపై దృష్టిసారిస్తామన్న ఆమె భారత్ ప్రపంచకప్ సాధించడమే అంతిమ లక్ష్యమని వ్యాఖ్యానించింది. -
మహిళల ఐపీఎల్ అనవసరం!
భారత మహిళల క్రికెట్ జట్టు టి20 ప్రపంచ కప్ ఫైనల్లో ఓడిపోయి ఉండవచ్చు. కానీ గత కొంత కాలంగా జట్టు ఆటతీరులో వచ్చిన మార్పులు మాత్రం అనూహ్యం. సాంప్రదాయ ధోరణిలో కాకుండా దూకుడు పెంచి సమకాలీన టి20 టీమ్‌గా మన జట్టు ఎదగగలిగింది. ఏ ఒక్కరిపైనో ఆధారపడకుండా జట్టులో అందరు ప్లేయర్లు తమ ఆటతో నమ్మకాన్ని కలిగించగలిగారు. దీని వెనక ఉన్నది జట్టు కోచ్ వూర్కేరి వెంకట్ (డబ్ల్యూవీ) రామన్. శిక్షకుడిగా గతంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ మాజీ క్రికెటర్ 14 నెలల తక్కువ వ్యవధిలోనే మహిళల జట్టుపై కూడా తన ముద్ర వేయగలిగారు. వరల్డ్ కప్‌లో జట్టు ప్రదర్శనను విశ్లేషించడంతో పాటు జట్టు భవిష్యత్తుకు సంబంధించి పలు అంశాలపై ఆయన మీడియాతో మాట్లాడారు. విశేషాలు రామన్ మాటల్లోనే.... స్మృతి, హర్మన్ వైఫల్యాలపై... ఇద్దరు స్టార్ బ్యాటర్లు టోర్నీ మొత్తం విఫలం కావడం దురదృష్టకరం. అయితే అలా జరిగినా జట్టు విజయాలు సాధించగలిగిందంటే అది సానుకూల అంశం. క్రీజ్‌లో నిలబడిపోవడంకంటే ఒక భారీ షాట్ ఆడి హర్మన్ తిరిగి వచ్చేయడమే మంచిదని భావించా. ఎందుకంటే ఆమె అలా చేస్తే ప్రత్యర్థులు మానసికంగా పైచేయి సాధిస్తారు. ఆమె తర్వాత వచ్చే మన అమ్మాయిలేమో హర్మనే ఆడలేకపోతోంది మనమేం ఆడగలం అనే ధోరణితో మైదానంలో దిగుతారు. అది మంచిది కాదు. అయితే హర్మన్ సాధ్యమైనంతగా ప్రయత్నించింది. అయితే అనుభవం లేని ఒక జట్టును నడిపిస్తూ వ్యక్తిగతంగా కూడా విఫలమవుతూ ఆమె తీవ్ర ఒత్తిడిని అనుభవించింది. కోచ్‌గా పని చేసే శైలిపై... నా దృష్టిలో కోచ్ అనేవాడు ఒక ఎయిర్‌క్రాఫ్ట్‌కు పని చేసే సర్వీస్ ఇంజినీర్లాంటివాడు. అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకొని, అన్నింటినీ చక్కబెట్టి ఇవ్వడమే నా బాధ్యత. ఆపై ఒక పైలెట్లాగా మైదానంలో కెప్టెన్ జట్టును నడిపించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో బయటి నుంచి పరిశీలించడమే నేను చేస్తాను. మ్యాచ్‌కు ముందే ఆటగాళ్లతో వివరంగా మాట్లాడి వారు మనసులో ఏదైనా సందేహాలు ఉంటే వాటిని తీర్చి ఆత్మవిశ్వాసంతో గ్రౌండ్లోకి అడుగు పెట్టేలా చేయగలను. ఇప్పటి వరకు కోచ్‌గా నేను ఇలాగే పని చేస్తున్నాను. జట్టు ప్రదర్శనపై... వరల్డ్కప్కంటే ముందు మేం ముక్కోణపు టోర్నీ కూడా ఆడాం. ఈ రెండు టోర్నమెంట్లను కలిసి చూస్తే ఆస్ట్రేలియాలాంటి జట్టును రెండు సార్లు, మహిళల క్రికెట్లో అతి పటిష్టమైన ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లను కూడా ఓడించగలిగాం. మా అమ్మాయిల ప్రదర్శన పట్ల చాలా గర్వపడుతున్నాను. మా బలం ఏమిటో గట్టిగా నమ్మి దాని ప్రకారం ఆడటం వల్లే ఇది సాధ్యమైంది. సరిగ్గా చెప్పాలంటే గతంలో ఈ జట్లతో మ్యాచ్‌కు ముందు ప్లేయర్లు ఒక పెద్ద సవాల్ ఎదురైనట్లుగా భావించేవారు. ఇప్పుడు అలా కాదు. ప్రపంచంలో ఏ జట్టునైనా ఓడించగలమనే ఆత్మవిశ్వాసం వచ్చింది. అదే విజయానికి తొలి మెట్టు. మెగా టోర్నీ జరిగిన సమయంలో నేను ఒక్కసారి కూడా ‘వరల్డ్ కప్’ అనే మాటను ఉచ్ఛరించలేదు. ఒక టోర్నీ అని మాత్రమే అన్నాడు. ఎందుకంటే ప్రపంచకప్ అనే వారిపై అనవసరపు ఒత్తిడి పెంచవచ్చు. రాబోయే వన్డే వరల్డ్ కప్ కోసం కూడా నాకంటూ కొన్ని ఆలోచనలు ఉన్నాయి. టోర్నీకి ఆరు నెలల ముందుగా పూర్తి స్థాయిలో జట్టును ఎంపిక చేసుకొని వారితో సన్నాహాలు సాగించాలి. టి20 ప్రపంచకప్‌లో ఆడినవారే కాకుండా వన్డేలకు తగిన ప్లేయర్లను తీసుకోవడం కూడా కీలకం. రాబోయే చాలెంజర్ టోర్నీ అందుకు కావాల్సిన అవకాశమిస్తుంది. ఫైనల్లో ప్రేక్షకులు, ఒత్తిడి గురించి... మెల్బోర్న్ మైదానంలో దాదాపు లక్ష మంది ప్రేక్షకులు ఉంటారనే విషయం నాకు తెలుసు. కానీ ఆ సమయంలో ఎలా ఉండాలో, ఏం చేయాలో నేను చెప్పలేదు. ఎందుకంటే ఆ వాతావరణం, జోష్ అంతా అనుభవిస్తేనే అర్థమవుతుంది తప్ప ఇలా ఉంటుందని మనమేమీ చెప్పలేం. ఇలాంటి స్థితిలో కూడా బంతిపైనే దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. లేదంటే ప్రేక్షకుల చేతుల్లోనే ఓడిపోతాం. అయితే మా పరాజయానికి ప్రేక్షకుల సంఖ్య లేదా అక్కడి వాతావరణం కారణం కానే కాదు. నేను అలాంటి సాకులు చెప్పను. అయితే ఫైనల్‌కు ముందు వారం రోజుల పాటు మ్యాచ్ లేకుండా విరామం రావడం మమ్మల్ని దెబ్బ తీసిందనేది మాత్రం వాస్తవం. ఒక యువ జట్టు ఇన్ని రోజులు ఆటకు దూరంగా ఉండి మళ్లీ ఆటలోకి వచ్చి నేరుగా ఫైనల్ ఆడటం మానసికంగా అంత సులువు కాదు. నలుగురు స్పిన్నర్లతో ఆడటం ఎప్పుడైనా దెబ్బ కొట్టవచ్చని ఒక దశలో భయపడ్డాను. చివరకు ఫైనల్లోనే అది జరిగింది. మనకు అందుబాటులో ఉన్న వనరులతోనే జట్టును రూపొందించాలి కదా. కొన్ని ప్రణాళికలు ఫైనల్లో పని చేయలేదు. అయితే ఆటలంటే ఇలాగే ఉంటాయి. వాటిని మరచి ముందుకు సాగాలి. టీనేజర్ షఫాలీ వర్మ గురించి... బౌలర్లపై విరుచుకుపడటమే షఫాలీ శైలి. దాదాపు అన్ని మ్యాచ్‌లలో ఆమె అదే చేసింది. షఫాలీతో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని నాకర్థమైంది. నిజంగా బ్యాటింగ్ గురించి ఆమెకు నేను సూచనలేమీ చేయను. జట్టు సమావేశాల తర్వాత ఆమెతో విడిగా మాట్లాడుతూ అక్కడ చెప్పిందంతా నీకు కాదులే. నువ్వు ఎలా ఆడాలనుకుంటే అలా ఆడు అనేవాడిని. 16 ఏళ్ల అమ్మాయితో అలాగే చెప్పాలి. అవసరం లేకపోయినా మనసులో వేరే ఆలోచనలు ఎందుకు చొప్పించాలి. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు రోజు ప్రాక్టీస్ సెషన్లో ఆమె ఒక్క షాట్ కూడా గాల్లోకి కొట్టకుండా ఆడింది. చూశారా నేను ఎంత పద్ధతిగా ఆడానో అని నాతో చెప్పింది కానీ నేను పట్టించుకోలేదు. తర్వాతి రోజు ఏం చేస్తుందో నేను వేచి చూశా. అన్ని షాట్లు గాల్లోకి వెళ్లాయి. నాలుగు సిక్సర్లు వచ్చేశాయి (ఆ మ్యాచ్‌లో 17 బంతుల్లో 39). నాకు నవ్వొచ్చింది. ఆమె ఆటలో చాలా వినోదం లభించింది. అమ్మాయిల ప్రతిభ గురించి... మా టీమ్ సగటు వయసు 22 ఏళ్లు! ఆస్ట్రేలియా గడ్డపై చూపిన ప్రదర్శనను కొనసాగించగలిగితే మంచి భవిష్యత్తు ఉంటుంది. ఆడినవారిలో ఆత్మవిశ్వాసం పెరగడమే కాదు, వారిని చూసినవారు కూడా స్ఫూర్తి పొందేందుకు ఈ ప్రదర్శన ఉపయోగపడుతుంది. ప్రపంచకప్‌లాంటి మెగా టోర్నీ జట్టులో ముగ్గురు టీనేజర్లు, అనుభవం లేని ఇద్దరు యువ ప్లేయర్లను ఎంపిక చేసినప్పుడు అంతా ఆశ్చర్యపోయారు. అయితే ప్రతిభ ఉంటే వేదిక ఎంత పెద్దదైనా భయపడకుండా ఆడవచ్చని వారు నిరూపించారు. కొన్ని చిన్న చిన్న లోపాలు సరిదిద్దుకుంటే ఈ జట్టు మున్ముందు మరింత బలమైన జట్టుగా ఎదగడం ఖాయం. సరిగ్గా చెప్పాలంటే పేస్ బౌలింగ్ దళాన్ని పటిష్ట పరచుకోవాల్సి ఉంది. ఇది మాకు బలహీనతగా కనిపించింది కాబట్టి పేసర్లను తీర్చిదిద్దడం ముఖ్యం. నిజాయితీగా చెప్పాలంటే మన అమ్మాయిలు శారీరకంగా కొంత బలహీనంగానే ఉన్నారు. వారు తమ ఫిట్‌నెస్‌పై మరింత శ్రద్ధ పెట్టి బలంగా తయారవడంతో పాటు విరామం లేకుండా బౌలింగ్ చేసేందుకు సిద్ధంగా ఉండాలి. గతంతో పోలిస్తే వేగం, చురుకుదనం కొంత పెరిగినా అది ఇంకా మెరుగవ్వాలి. దీనికి కొంత సమయం పట్టవచ్చు కానీ భవిష్యత్తులో ఫలితాలు బాగుంటాయి. నాణ్యత లోపిస్తే పరిస్థితి ఘోరం... మహిళల ఐపీఎల్ విషయంపై తొందరపడవద్దని నా హెచ్చరిక! నా అభిప్రాయం ప్రకారం ఇప్పటికిప్పుడు అనవసరం. ప్రస్తుతం మన మహిళా క్రికెటర్లు పూర్తి స్థాయి (ఎనిమిది జట్లతో) ఐపీఎల్‌కు సిద్ధంగా లేరు. ఐపీఎల్ ఆలోచన మంచిదే కావచ్చు. కానీ వాటిని అమలు చేయడం అంత సులువు కాదు. ఇప్పటికిప్పుడు హడావిడిగా ఐపీఎల్ అని మొదలు పెట్టి అందులో నాణ్యత లోపిస్తే పరిస్థితి ఘోరంగా మారిపోతుంది. పురుషుల ఐపీఎల్ కూడా ఆరంభమైనప్పుడు ఇంత సూపర్ సక్సెస్ అవుతుందని ఎవరూ ఊహించలేదు. నాకు తెలిసి ముందుగా పెద్ద సంఖ్యలో ప్లేయర్లకు గుర్తించి జట్లను తయారు చేయడం ముఖ్యం. నా అవగాహన ప్రకారం ఈ విషయంలో తొందర పడాల్సిన అవసరం లేదు. ఇక ప్లేయర్లకు మ్యాచ్ ప్రాక్టీస్ ఎలా అని ప్రశ్నిస్తే... రాబోయే రోజుల్లో భారత్ ‘ఎ’, అండర్–23 టోర్నీలు నిర్వహించవచ్చు. అండర్–19 ప్రపంచకప్ ప్రతిపాదన కూడా ఉంది కాబట్టి అమ్మాయిలకు పెద్ద సంఖ్యలో క్రికెట్ ఆడే, తమ సత్తాను నిరూపించుకునే అవకాశం లభిస్తుంది. ఆ తర్వాత ఏదో రోజు ఐపీఎల్ రావచ్చేమో. హడావిడిగా కాకుండా క్రమక్రమంగా ఒక్కో అడుగు వేసుకుంటూ వెళ్లాలి. ఈసారి నాలుగు జట్లు అంటున్నారు మంచిదే. ఒక్కో జట్టు మరో టీమ్‌తో కనీసం రెండు సార్లయినా తలపడితే బాగుంటుంది. -
వర్షం తెచ్చిన విజయం
అద్భుత ప్రదర్శనతో సాధించిన వరుస విజయాలు అసలు సమయంలో అక్కరకు వచ్చాయి. వర్షంతో మైదానంలో అడుగు పెట్టకపోయినా విజయం మన జట్టును వెతుక్కుంటూ వచ్చింది. ఫలితంగా టి20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు తొలిసారి ఫైనల్లోకి అడుగు పెట్టింది. ఇంగ్లండ్‌తో జరగాల్సిన సెమీఫైనల్ మ్యాచ్‌లో వాన కారణంగా ఒక్క బంతి పడకపోయినా... లీగ్ దశలో అజేయంగా నిలిచిన హర్మన్ సేన తుది పోరుకు అర్హత సాధించింది. మెగా టోర్నీలో మనపై ఉన్న ఘనమైన రికార్డును కొనసాగించాలనుకున్న ఇంగ్లండ్‌ను వరుణుడు కరుణించకపోవడంతో నిరాశతో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది. ఇక లక్ష మంది ప్రేక్షకుల సమక్షంలో ఆదివారం ఆతిథ్య ఆస్ట్రేలియాను ఓడించడమే భారత్ అంతిమ లక్ష్యం కానుంది. సిడ్నీ: టి20 ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం ఇక్కడి సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్సీజీ)లో ఇంగ్లండ్‌తో జరగాల్సిన తొలి సెమీఫైనల్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా పూర్తిగా రద్దయింది. ఊహించినట్లుగానే సిడ్నీ నగరాన్ని వర్షం ముంచెత్తడంతో ఈ మ్యాచ్‌లో అసలు టాస్ వేయడం కూడా సాధ్యం కాలేదు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 9.30 గంటలకు (భారత కాలమానం ప్రకారం) మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అప్పటికీ వాన కురుస్తూనే ఉంది. ఆ తర్వాత సుదీర్ఘ సమయం పాటు ఎదురు చూసినా వాన తగ్గే అవకాశం కనిపించలేదు. దాంతో మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. సెమీఫైనల్ మ్యాచ్‌కు ఎలాంటి రిజర్వ్ డే లేదు. వాన వల్ల ఆట సాధ్యం కాని పక్షంలో లీగ్ దశలో అత్యధిక విజయాలు/ పాయింట్లు సాధించిన జట్టు ముందంజ వేస్తుందని టోర్నీ నిబంధనలు చెబుతున్నాయి. గ్రూప్ ‘ఎ’లో ఆడిన నాలుగు మ్యాచ్‌లు కూడా గెలిచి అజేయంగా నిలిచిన హర్మన్ సేన మొత్తం 8 పాయింట్లు సాధించింది. గ్రూప్ ‘బి’లో మూడు మ్యాచ్‌లు మాత్రమే నెగ్గిన ఇంగ్లండ్ మరో మ్యాచ్‌లో ఓటమి పాలైంది. భారత జట్టు టి20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు అర్హత సాధించడం ఇదే తొలిసారి. గతంలో జరిగిన ఆరు టోర్నీల్లో మూడుసార్లు మన జట్టు సెమీఫైనల్‌కే పరిమితమైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ)లో ఆదివారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది. లీగ్ దశలో ఎలాంటి ఉదాసీనతకు తావు లేకుండా ప్రతీ మ్యాచ్‌లో విజయంపై దృష్టి పెట్టడం భారత్‌కు కలిసొచ్చింది. ఈ క్రమంలో శ్రీలంక, బంగ్లాదేశ్‌లతో పాటు పటిష్టమైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లను కూడా ఓడించి మన జట్టు తమ సత్తాను ప్రదర్శించింది. అప్పుడు బౌండరీలు... ఇప్పుడు లీగ్ పాయింట్లు! మెగా టోర్నీలలో ఐసీసీ నిర్వహణా వైఫల్యం గత ఏడాది పురుషుల వన్డే ప్రపంచకప్‌ను ఇంగ్లండ్ జట్టు ‘బౌండరీ కౌంట్’ ద్వారా గెలుచుకున్నప్పుడు న్యూజిలాండ్ జట్టు గుండె బద్దలైంది. ఇదేం నిబంధన అంటూ అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)పై క్రికెట్ ప్రపంచం ధ్వజమెత్తింది. అయితే నిబంధనల ప్రకారమే గెలిచాం కాబట్టి మమ్మల్ని తప్పు పట్టవద్దంటూ ఇంగ్లండ్ పదే పదే చెప్పుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఐసీసీ పెట్టిన ‘నో రిజర్వ్ డే’ నిబంధన అదే ఇంగ్లండ్ మహిళల జట్టు కొంప ముంచింది. టి20 ప్రపంచకప్‌లోనే కాకుండా ఓవరాల్‌గా కూడా భారత్‌పై ఉన్న ఘనమైన రికార్డు, తాజా ఫామ్‌ను బట్టి ఈ మ్యాచ్‌లో గెలవగలమని భావించిన ఇంగ్లండ్‌కు నిరాశ తప్పలేదు. ఈ నిష్క్రమణ అనంతరం టీమ్ కెప్టెన్ హెథర్ నైట్‌తో సహా మాజీ క్రికెటర్లు మైకేల్ వాన్, స్టువర్ట్ బ్రాడ్లు రిజర్వ్ డే లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు. రెండు సందర్భాల్లోనూ ఐసీసీ పనితీరుపైనే సందేహాలు రేకెత్తాయి. మన వన్డే కెప్టెన్ మిథాలీ రాజ్ చెప్పినట్లు సగటు భారత అభిమానిగా భారత్ ఫైనల్ చేరడం సంతోషం కలిగిస్తున్నా... ఇలా ఆడకుండా ముందుకు వెళ్లడం మాత్రం నిరాశపర్చే అంశం. అసలు టి20 ప్రపంచ కప్ అంటే తక్కువ వ్యవధిలో ముగిసిపోవాలి కాబట్టి రెండు సెమీస్‌లకు రిజర్వ్ డే అంటే కష్టం అంటూ ఐసీసీ ఇచ్చిన వివరణే హాస్యాస్పదం. ప్రపంచకప్‌లాంటి టోర్నీ రెండు రోజులు పెరిగినా ఎవరికీ అభ్యంతరం ఉండదు. అయితే టోర్నీకి ముందు నిబంధనల గురించి కెప్టెన్ల అంగీకారం తీసుకునే విషయంలోనే అసలు సమస్య ఉంది. మనం ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడో, ఏదైనా వెబ్సైట్లు వీక్షించేందుకు ప్రయత్నించినప్పుడు పైనుంచి కింది వరకు సుదీర్ఘ నిబంధనలు ఉంటే అవేవీ చదవకుండా చివర్లో ‘ఐ అగ్రీ’ అంటూ ఓకే చేయడం అందరికీ అనుభవమే! వరల్డ్ కప్ విషయంలోనూ అలాగే జరిగినట్లు అనిపించింది. వివరాలు ఏమీ తెలియకుండా, ప్రశ్నలు అడగకుండా కెప్టెన్లు సంతకం చేసేశారు. ఇప్పుడు రిజర్వ్ డే గురించి అడిగితే ఇది చూపించి నిబంధనల్లో లేదని, అందరూ అంగీకరించారని చెబుతూ ఐసీసీ తప్పించుకుంది. మరో మాజీ క్రికెటర్ ఇయాన్ బిషప్ మాత్రం ఇది అందరికీ ఒక పాఠం కావాలంటూ సూచన చేశాడు. ‘ఇకపై ఏదైనా టోర్నీ ప్రారంభానికి ముందు నిబంధనలు పూర్తిగా చదువుకోవాలని ఆటగాళ్లు, క్రికెట్ బోర్డులకు తెలియాలి. అయితే నిజాయితీగా చెప్పాలంటే అదృష్టాన్ని నమ్ముకోకుండా మెగా టోర్నీలో మీ రాతను మీరే రాసుకోమని కూడా ఇది నేర్పించింది. నాకౌట్ మ్యాచ్‌లకే కాదు... టోర్నీ ఆరంభంలోనూ బాగా ఆడాల్సిన అవసరం ఉందని అర్థమైంది. ఇది చూపించి ముందంజ వేసిన భారత్‌కు అభినందనలు’ అని బిషప్ వ్యాఖ్యానించాడు. వర్షం వెంటాడినా సరే... అదృష్టవశాత్తూ కుదించిన మ్యాచ్‌తోనైనా సరే ఆతిథ్య ఆస్ట్రేలియా ఫైనల్ చేరింది. ఆ మ్యాచ్ కూడా రద్దయి ఉంటే ఇంగ్లండ్‌లాగే ఆసీస్ కూడా నిష్క్రమించాల్సి వచ్చేది. వేరే జట్ల సంగతి తెలీదుకానీ మాకైతే వర్షం నిబంధనలపై అవగాహన ఉంది. ఏదైనా కారణంగా సెమీస్ జరగకపోతే లీగ్‌లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ఫైనల్ వెళుతుందని తెలుసు. అందుకే ఆరంభం నుంచి కూడా ప్రతీ మ్యాచ్‌లో గెలవాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగాం. మేం ఫైనల్ చేరడంలో జట్టు సభ్యులందరి పాత్ర ఉంది. సెమీస్ మ్యాచ్ జరగకపోవడం దురదృష్టకరం. అయితే నిబంధనలు అలాగే ఉన్నాయి. మేమేమీ చేయలేం. మున్ముందు రిజర్వ్ డే ఉంచాలనే ఆలోచన మంచిదే. ‘తొలిసారి ఫైనల్’ అనే అనుభూతి గొప్పగా ఉంది. మా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాం. సెమీస్ చూసేందుకు అమ్మా, నాన్న రావడం నా ఆనందాన్ని రెట్టింపు చేసింది. వారు నేను అంతర్జాతీయ క్రికెట్ ఆడగా ఎప్పుడూ చూడలేదు. వారు ఇప్పుడు ఫైనల్ మ్యాచ్‌కు హాజరవుతారు. నా తల్లిదండ్రులే కాదు భారత్‌లో ఎంతో మంది మా విజయాన్ని కోరుకుంటున్నారు. మేం గెలిస్తే అది నిజంగా గొప్ప ఘనత అవుతుంది. –హర్మన్‌ప్రీత్ కౌర్, భారత కెప్టెన్ (ఫైనల్ జరిగే మార్చి 8 హర్మన్ 31వ పుట్టిన రోజు కూడా) హర్మన్ దగ్గర భవిష్యత్తు గురించి చెప్పే మాయా అద్దం ఏదైనా ఉందేమో నాకు తెలీదు. వచ్చే టోర్నమెంట్‌కు ముందు ఆమె దగ్గర నేను తీసుకుంటా. ఎవరూ సెమీస్‌లో వర్షం పడుతుందని ఊహించరు. అలాంటి అరుదైన సందర్భం కోసం ఎవరూ ప్రణాళికలు రూపొందించుకోరు. రిజర్వ్ డే గురించి అసలు చర్చ జరగనే లేదు. ముందుగా సెమీస్‌కు అర్హత సాధించాలని, అక్కడ గెలిచి ఫైనల్ చేరాలని మాత్రమే అనుకున్నాం. ప్రతీ మ్యాచ్ గెలవాలని ఎవరైనా ప్రయత్నిస్తారు. ఈ తరహాలో నిష్క్రమించడం, వరల్డ్ కప్ ముగించడం అసహనం కలిగిస్తోంది. దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి మాకు నష్టం కలిగించింది. గత మూడు మ్యాచ్‌లలో బాగా ఆడాక సెమీస్ కోసం ఉత్సాహంగా ఎదురు చూశాం. చివరకు ఇలా జరిగింది. – హెథర్ నైట్, ఇంగ్లండ్ కెప్టెన్ -
హ్యాట్రిక్‌తో సెమీస్
భారత మహిళలకు ‘హ్యాట్రిక్’ విజయమైతే దక్కింది. అందరికంటే ముందే సెమీస్‌కు వెళ్లింది. కానీ ఆట ఆఖరి పోరాటమే అందరినీ మునికాళ్లపై నిలబెట్టింది. క్రికెటర్ల వెన్నుల్లో వణుకుపుట్టించింది. ఆఖరి బంతి పడక ముందు ఇరుజట్లకు సమాన అవకాశాలున్నాయి. పడ్డాక భారత్ గెలిచింది... కానీ కివీస్ పోరాటం అదిరింది. ఈ మెగా ఈవెంట్‌కే హైలైట్ అయిన మ్యాచ్‌తో అందరికీ క్రికెట్ మజా దక్కింది. మెల్బోర్న్: ఔరా... మన అమ్మాయిల జట్టు సైరా! న్యూజిలాండ్‌తో ఆడి గెలిచింది. పోరాడి సెమీస్ చేరింది. ఉన్నపళంగా ఉత్కంఠ పెంచిన ఈ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 3 పరుగుల తేడాతో కివీస్‌పై నెగ్గింది. ఈ టి20 ప్రపంచకప్‌కే కిక్కెక్కించే ఈ మ్యాచ్‌లో కివీస్ చివరి బంతిదాకా గెలుపోటముల త్రాసులో నిలిచింది. చివరకు శిఖా యార్కర్‌కు ఓడింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 133 పరుగులు చేసింది. ఓపెనింగ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షఫాలీ వర్మ (34 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) మళ్లీ దంచేసింది. 14 ఓవర్ల దాకా ఇన్నింగ్స్‌ను ఆమెనే నడిపించింది. జ్వరం నుంచి కోలుకున్న స్మృతి మంధాన (11) విఫలం కాగా, తానియా (25 బంతుల్లో 23; 3 ఫోర్లు) మిగతా వారి కంటే మెరుగ్గా ఆడింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (1) విఫలయాత్ర కొనసాగింది. కివీస్ కెప్టెన్ సోఫీ డివైన్ ఏకంగా ఏడుగురు బౌలర్లను రంగంలోకి దించి భారత ఇన్నింగ్స్‌ను చక్కగా కట్టడి చేసింది. మార్చి మార్చి ప్రయోగించిన బౌలర్లతో ఇబ్బంది పడిన జెమీమా రోడ్రిగ్స్ (10), దీప్తి శర్మ (8), వేద (6) పరుగులు చేయలేకపోయారు. రోజ్మేరి మెయిర్, అమెలియా కెర్ చెరో 2 వికెట్లు తీశారు. తహుహు, సోఫీ ఒక్కో వికెట్ పడేశారు. తర్వాత కివీస్ ముందరి కాళ్లకు ముందే బంధం వేశారు భారత బౌలర్లు. ఓపెనర్లు ప్రియెస్ట్ (12), సోఫీ (14), వన్‌డౌన్‌లో సుజీ బేట్స్ (6) అవుట్ కావడంతో 34 పరుగులకే ‘టాప్’ లేచింది. ఈ దశలో మ్యాడీ గ్రీన్ (23 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్), కేటీ మార్టిన్ (28 బంతుల్లో 25; 3 ఫోర్లు) న్యూజిలాండ్‌ను ఓ దారికి తెచ్చారు. చివర్లో అమెలియా కెర్ (19 బంతుల్లో 34 నాటౌట్; 6 ఫోర్లు) శివమెత్తడంతో సాఫీగా సాగుతున్న మ్యాచ్ ఉత్కంఠకు తెరలేపింది. భారత బౌలర్లు దీప్తి, శిఖా, రాజేశ్వరి, పూనమ్, రాధ తలా ఒక వికెట్ తీశారు. షఫాలీ వర్మ 34 బంతుల్లో 46, 4 ఫోర్లు, 3 సిక్స్‌లు టెన్షన్... టెన్షన్... 18వ ఓవర్ ముగిసే సరికి కివీస్ స్కోరు 100/2. గెలిచేందుకు ఇంకా 12 బంతుల్లో 34 చేయాలి. ఈ సమీకరణం భారత అమ్మాయిల జట్టుకే అనుకూలం. ఇక సెమీస్ బాటలో హ్యాట్రిక్ విజయమే అనుకుంటే... అమెలియా కెర్ బౌండరీలతో జూలు విదిల్చింది. పూనమ్ వేసిన 19 ఓవర్లో 18 పరుగులు పిండేసింది. ఆఖరి ఓవరే మిగిలింది. 16 పరుగులు కావాల్సివుంది. మారిన సమీకరణం మన అమ్మాయిల్ని ఒత్తిడిలోకి నెట్టింది. శిఖాపాండే ఆఖరి ఓవర్లో తొలి బంతి బౌండరీకెళ్లింది. 12 చేస్తే గెలుపే. 3 సింగిల్స్ తర్వాత 2 బంతుల్లో 9 చేయాలి. ఇక్కడ మరో ఫోర్. ఆఖరి బంతికి 5 పరుగులు కావాలి. ఫోర్ వస్తే మ్యాచ్ సూపర్ ఓవర్‌కు వెళుతుంది. ఉత్కంఠ అమాంతం పెరిగింది. ప్రేక్షకులు ఒళ్లంతా కళ్లు చేసుకున్నారు. శిఖా యార్కర్ కెర్ మతిపోగొట్టింది. అంతే ఓ పరుగొచ్చాక ఇంకో సింగిల్ తీసేలోపే జెన్సన్ రనౌటైంది. ఆఖరిదాకా చెమటలు కక్కిన భారత మహిళలు 3 పరుగులతో గెలిచి ఊపిరిపీల్చుకున్నారు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: షఫాలీ వర్మ (సి) జెన్సన్ (బి) కెర్ 46; మంధాన (బి) తహుహు 11; తానియా (సి) కెర్ (బి) మెయిర్ 23; జెమీమా (సి) కెర్ (బి) మెయిర్ 10; హర్మన్‌ప్రీత్ (సి) అండ్ (బి) కాస్పెరెక్ 1; దీప్తి (సి) జెన్సన్ (బి) డివైన్ 8; వేద ఎల్బీడబ్ల్యూ (బి) కెర్ 6; శిఖా నాటౌట్ 10; రాధ రనౌట్ 14; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 133. వికెట్ల పతనం: 1–17, 2–68, 3–80, 4–93, 5–95, 6–104, 7–111, 8–133. బౌలింగ్: తహుహు 2–0–14–1, మెయిర్ 3–0–27–2, డివైన్ 2–0–12–1, పీటర్సన్ 2–0–19–0, జెన్సన్ 3–0–20–0, కెర్ 4–0–21–2, కాస్పెరెక్ 4–0–19–1. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: ప్రియెస్ట్ (సి) రాధ (బి) శిఖా 12; డివైన్ (సి) రాధ (బి) పూనమ్ 14; సుజీ బేట్స్ (బి) దీప్తి 6; మ్యాడీగ్రీన్ (సి) తానియా (బి) రాజేశ్వరి 24; మార్టిన్ (సి) రోడ్రిగ్స్ (బి) రాధ 25; కెర్ నాటౌట్ 34; జెన్సన్ రనౌట్ 11; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 130. వికెట్ల పతనం: 1–13, 2–30, 3–34, 4–77, 5–90, 6–130. బౌలింగ్: దీప్తిశర్మ 4–0–27–1, శిఖాపాండే 4–0–21–1, రాజేశ్వరి 4–0–22–1, పూనమ్ 4–0–32–1, రాధ 4–0–25–1. -
ఫైనల్ : స్మృతి మాత్రమే నిలిచింది.. దాంతో
మెల్బోర్న్: భారత క్రికెట్ అభిమానులకు మరోసారి నిరాశ తప్పలేదు. ఇప్పటికే అండర్-19 ప్రపంచకప్ ఫైనల్లో యువ భారత్ బోల్తాపడగా.. మంగళవారం నాటి మ్యాచ్‌లోనూ ఓటమి చవిచూసిన మెన్ ఇన్ బ్లూ జట్టు 0-3 తో కివీస్ చేతిలో వైట్ వాష్ అయింది. ఇక బుధవారం జరిగిన ముక్కోణపు మహిళల టీ20 క్రికెట్ టోర్నీ ఫైనల్లో సైతం చేదు ఫలితమే వచ్చింది. ఆస్ట్రేలియతో జరిగిన టోర్నీ తుది పోరులో భారత మహిళల జట్టు 11 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. తడబడిన భారత్.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 155 పరుగులు చేయగా.. లక్ష్య చేధనలో భారత్ తడబడింది. ఓపెనర్ షఫాలీ వర్మ 10 పరుగులకే వెనుదిరగ్గా.. మరో ఓపెనర్ స్మృతి మంధాన (37 బంతుల్లో 66; 12 ఫోర్లు) అర్ధ సెంచరీతో చెలరేగింది. మిగతా ఆటగాళ్ల నుంచి సహకారం కరువైనా చాలాసేపు ఒంటరి పోరాటం చేసింది. 15వ ఓవర్లో స్మృతి ఔటయ్యే వరకు భారత్ ఇన్నింగ్స్ గెలుపు దిశగానే సాగింది. ఆ ఓవర్లో స్మృతి క్యాచ్ ఔట్‌గా వెనుదిరగడంతో టీమిండియా ఏ దశలోనూ తేరుకోలేదు. స్టార్ ప్లేయర్ హర్మన్ ప్రీత్ కౌర్ (14) కూడా మరుసటి ఓవర్లో ఎల్బీగా వెనుదిరగడంతో ఆస్ట్రేలియా గెలుపు లాంఛనమే అయింది. మిగతా ఆటగాళ్లు వచ్చిన వారు వచ్చినట్టు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. దాంతో మొత్తం ఓవర్లపాటు బ్యాటింగ్ కొనసాగించిన టీమిండియా 144 పరుగులు మాత్రమే చేయగలిగింది. విజయం ఆమెదే..! ఆస్ట్రేలియా విజయంలో ప్లేయర్ ఆఫ్‌ద మ్యాచ్ జెస్ జొనాసేన్ కీలకపాత్ర పోషించారు. నాలుగు ఓవర్లు వేసిన జొనాసేన్ కేవలం 12 పరుగులిచ్చి 5 వికెట్లు తీశారు. వ్లామింక్ రెండు, ఎలిస్ పెరీ, సుతర్లాండ్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో మూనీ (54 బంతుల్లో 71; 9 ఫోర్లు) రాణించింది. గార్డ్నర్ (26), లేనింగ్ (26), రాచెల్ హెయ్‌నస్ (18) పరవాలేదనిపించారు. దీప్తి శర్మ, రాజేశ్వరీ గైక్వాడ్ తలా రెండు వికెట్లు, రాధా యాదవ్, అరుంధతి రెడ్డి చెరో వికెట్ తీశారు. మూనీ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా ఎంపికైంది. -
నేడు ఆసీస్‌తో భారత్ అమీతుమీ
మెల్బోర్న్: పొట్టి ప్రపంచకప్‌కు ముందు ముక్కోణపు టైటిల్ పట్టాలని భారత్, ఆస్ట్రేలియా మహిళలు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇరు జట్ల మధ్య బుధవారం టి20 ఫైనల్ పోరు జరుగనుంది. ఇంగ్లండ్ కూడా పాల్గొన్న ఈ టోర్నీలో లీగ్ మ్యాచ్‌ల తర్వాత మూడు జట్లూ నాలుగేసి పాయింట్లతో సమఉజ్జీగా నిలిచాయి. దాంతో మెరుగైన రన్‌రేట్‌తో భారత్, ఆస్ట్రేలియా టైటిల్ పోరుకు అర్హత సాధించాయి. ఆసీస్‌తో చివరి లీగ్ మ్యాచ్‌లో షఫాలీ వర్మ, స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్ ధాటిగా ఆడటంతో కొండంత లక్ష్యాన్ని భారత్ ఛేదించింది. బౌలింగ్‌లో దీప్తి, రాజేశ్వరి గైక్వాడ్, రాధ యాదవ్‌లు కూడా తమ స్థాయి మేరకు రాణిస్తే ఆసీస్‌ను మళ్లీ కంగుతినిపించి కప్ కొట్టడం భారత్‌కు కష్టమేమీ కాదు. -
పవార్‌కే ‘మహిళల’ పగ్గాలు
న్యూఢిల్లీ: భారత మహిళల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా మాజీ స్పిన్నర్ రమేశ్ పవార్ ఎంపికయ్యాడు. ఈ ఏడాది నవంబర్‌లో వెస్టిండీస్‌లో జరగనున్న టి20 ప్రపంచకప్ వరకు అతను కొనసాగుతాడని బీసీసీఐ ప్రకటించింది. సీనియర్ ప్లేయర్లతో విభేదాల కారణంగా కోచ్ తుషార్ అరోథే తప్పుకోవడంతో గత నెలలో పవార్‌ను తాత్కాలిక కోచ్‌గా ఎంపిక చేశారు. ఇటీవలే పవార్ పర్యవేక్షణలోనే జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో భారత జట్టు శిక్షణా శిబిరం కొనసాగింది. ప్రపంచకప్‌కంటే ముందు భారత జట్టు శ్రీలంకలో పర్యటించి 3 వన్డేలు, 5 టి20లు ఆడనుంది. ఆ తర్వాత వెస్టిండీస్‌తో టి20 సిరీస్ తర్వాత వరల్డ్‌కప్‌లో పాల్గొంటుంది. మహిళల జట్టు కోచ్ పదవి కోసం ఈ నెల 10నే బీసీసీఐ దరఖాస్తులు కోరింది. 20 మంది దీని కోసం పోటీ పడ్డారు. డయానా ఎడుల్జీ, రాహుల్ జోహ్రి, సబా కరీం వీరందరినీ పది నిమిషాల చొప్పున ఇంటర్వ్యూ చేశారు. అనంతరం జాబితాను ఆరుగురికి కుదించారు. పవార్‌తో పాటు మాజీ ఆటగాళ్లు సునీల్ జోషి, అతుల్ బెదాడే, కోహ్లి తొలి కోచ్ రాజ్‌కుమార్ శర్మ, మహిళల జట్టు మాజీ కెప్టెన్ మమతా మాబెన్, సనత్ కుమార్ ఈ జాబితాలో నిలిచారు. చివరకు పవార్‌కే అవకాశం దక్కింది. శ్రీలంకతో సిరీస్‌కు ఇప్పటికే పవార్‌ను కోచ్‌గా ప్రకటించిన నేపథ్యంలో కొద్ది రోజులకే జరుగనున్న వరల్డ్ కప్ వరకు కొనసాగించడమే మంచిదనే అభిప్రాయంతో అతడి ఎంపిక ఖరారైనట్లుగా సమాచారం. భారత్ తరఫున 2 టెస్టులు ఆడిన 40 ఏళ్ల రమేశ్ పవార్, 31 వన్డేల్లో 34 వికెట్లు పడగొట్టాడు. 148 మ్యాచ్‌ల ఫస్ట్‌క్లాస్ కెరీర్లో అతను 470 వికెట్లు పడగొట్టడం విశేషం. -
ఇంగ్లాండ్‌పై భారత మహిళల జట్టు ఘన విజయం
-
సఫారీలపై భారత్ ఘనవిజయం
ఈస్ట్ లండన్: దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న భారత మహిళల క్రికెట్ జట్టు ట్వంటీ20 సిరీస్‌లోనూ తమ సత్తా చాటుతోంది. శుక్రవారం జరిగిన రెండో టీ20లోనూ సఫారీలపై హర్మన్ ప్రీత్ కౌర్ సేన 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈస్ట్ లండన్‌లో బఫెలో పార్క్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఓపెనర్లు స్మృతీ మంధాన(57), మిథాలీ రాజ్ (76 నాటౌట్) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ విజయం నల్లేరు మీద నడకగా మారింది. రెండో టీ20 విజయంతో ఐదు టీ20ల సిరీస్‌లో 2-0తో భారత్ ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ డేన్ వాన్ నికెర్క్ సేన నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. లూస్ (32 బంతుల్లో 33), డే క్లెర్క్ (28 బంతుల్లో 26) మాత్రమే రాణించడంతో సఫారీ మహిళల జట్టు ఓ మోస్తరు స్కోరు చేసింది. కెప్టెన్ డేన్ వాన్ నికెర్క్(15) నిరాశ పరిచింది. చివర్లో ట్రయాన్ (11 బంతుల్లో 15), ఇస్మాయిల్ (9 బంతుల్లో 16) వేగం పెంచడంతో సఫారీ టీమ్ 142 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పూనం యాదవ్, పాటిల్ చెరో 2 వికెట్లు తీశారు. శిఖా పాండే, వస్త్రాకర్ లకు చెరో వికెట్ దక్కింది. 143 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు మహిళా ఓపెనర్లు సెంచరీ భాగస్వామ్యాన్ని అందించారు. స్మృతీ మంధాన (42 బంతుల్లో 57: 4 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫె సెంచరీ అనంతరం జట్టు స్కోరు 106 వద్ద తొలి వికెట్‌గా నిష్క్రమించింది. ఆపై మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ (61 బంతుల్లో 76: 8 ఫోర్లు) అజేయ భారీ అర్ధశతకం చేసి, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (7 నాటౌట్)తో కలిసి మరో ఐదు బంతులుండగానే జట్టును విజయతీర్చాలకు చేర్చింది. సిరీస్‌లో వరుసగా రెండో హాఫ్ సెంచరీ చేసిన మిథాలీకి టి20ల్లో ఇది 12వ అర్ధసెంచరీ. తొలి టీ20లోనూ మిథాలీ రాజ్ (54 నాటౌట్) అజేయంగా నిలవడంతో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. -
భారత్ రికార్డు ఛేదన
పోచెఫ్‌స్ట్రూమ్: దక్షిణాఫ్రికా పర్యటనలో భారత మహిళ జట్టు జోరు కొనసాగుతోంది. వన్డే సిరీస్ చేజిక్కించుకున్న భారత్ టి20 సిరీస్‌లో తొలి మ్యాచ్ గెలిచి శుభారంభం చేసింది. ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో భాగంగా మంగళవారం ఇక్కడ జరిగిన తొలి మ్యాచ్‌లో మిథాలీ రాజ్ (48 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) అద్భుత ఇన్నింగ్స్‌తో భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మిథాలీకి టి20ల్లో ఇది 11వ అర్ధసెంచరీ. మిథాలీతోపాటు తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న 17 ఏళ్ల జెమీమా రోడ్రిగ్స్ (27 బంతుల్లో 37; 4 ఫోర్లు, 1 సిక్స్), వేద కృష్ణమూర్తి (22 బంతుల్లో 37 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) విజృంభించడంతో... భారత్ 18.5 ఓవర్లలో 165 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. టి20ల్లో భారత జట్టుకు ఇదే అత్యధిక పరుగుల ఛేదన కావడం విశేషం. గతంలో ఆస్ట్రేలియాపై 141 పరుగుల చేధనే అత్యధికంగా ఉండేది. మొదట దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. కెప్టెన్ డేన్ వాన్ నికెర్క్ (38; 5 ఫోర్లు, 1 సిక్స్), డు ప్రీజ్ (31; 5 ఫోర్లు) ఆకట్టుకోగా... చివర్లో ట్రియాన్ (7 బంతుల్లో 32; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) బౌండరీలతో విరుచుకుపడటంతో ఆ జట్టు భారీ స్కోరు చేసింది. భారత బౌలర్లలో అనుజా 2, శిఖా, పూజ చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం భారీ లక్ష్యఛేధనలో బరిలోకి దిగిన భారత్‌కు మిథాలీ, స్మృతి (15 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) శుభారంభం అందించారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 47 పరుగులు జోడించారు. అనంతరం వరుస బంతుల్లో మంధాన, హర్మన్‌ప్రీత్ కౌర్ (0) ఔటైనా... జెమీమాతో మిథాలీ మూడో వికెట్‌కు 69, వేదతో నాలుగో వికెట్‌కు అజేయంగా 52 పరుగులు జతజేసింది. దీంతో భారత్ మరో 7 బంతులు మిగిలుండగానే 168 పరుగులు చేసి గెలుపొందింది. అజేయంగా జట్టును గెలిపించిన మిథాలీకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. సీనియర్ పేసర్ జులన్ గోస్వామి మడమ గాయం కారణంగా ఈ మ్యాచ్‌తో పాటు మొత్తం సిరీస్‌కు దూరమైంది. -
సఫారీలతో మ్యాచ్: టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!
పోట్చెఫ్స్ట్రూమ్: ఆతిథ్య దక్షిణాఫ్రికాతో ట్వంటీ సిరీస్ మొదలవ్వక ముందే టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత మహిళల క్రికెట్ జట్టులో సీనియర్ క్రికెటర్, స్టార్ పేసర్ జులన్ గోస్వామి ఏకంగా మొత్తం సిరీస్‌కే దూరమైంది. కాలి గాయం కారణంగా సీనియర్ ప్లేయర్ జులన్ గోస్వామి జట్టు నుంచి తప్పుకున్నారని బీసీసీఐ తెలిపింది. దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు తొలి మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో స్టార్ బౌలర్ జట్టుకు దూరం కావడం మిథాలీరాజ్ సేనకు ప్రతికూలాంశం. వన్డే సిరీస్ నెగ్గిన ఉత్సాహంతో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావించిన టీమిండియాకు జులన్ లేకపోవడంతో బౌలింగ్ దళం కాస్త బలహీనమైనట్లు కనిపిస్తోంది. ఇటీవల కాలి గాయంతో బాధపడుతోన్న జులన్ కి నిన్న ఎమ్మారై స్కాన్ టెస్ట్ చేశాం. అందులో గాయం తీవ్రమైందని వైద్యులు చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నాం. కనీసం రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలన్న వైద్యుల సూచన మేరకు జులన్ కు సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చామని బీసీసీ మంగళవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆమె స్థానంలో ఎవరికీ అవకాశం ఇస్తున్నారో మాత్రం మేనేజ్మెంట్ చెప్పలేదు. మరోవైపు ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1తో సొంతం చేసుకుంది. వరుసగా రెండు వన్డేలు నెగ్గిన మిథాలీ సేన గాయం కారణంగా జులన్ మూడో వన్డేకు దూరమైన వన్డేలో ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. మహిళల అంతర్జాతీయ వన్డేల్లో 200 వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా గోస్వామి గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. స్మృతి మంధానతో పాటు, దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి ఫామ్‌లో ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. శిఖా పాండే, దీప్తి శర్మ, పూజ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలరు. చివరి వన్డేలో దక్షిణాఫ్రికా జట్టులో డు ప్రీజ్, లారా వోల్వార్డ్ నిలకడగా ఆడారు. సఫారీ కెప్టెన్ డేన్ వాన్ నికెర్క్ ఫామ్‌లో ఉంది. దీంతో ఇరు జట్ల మధ్య నేడు జరగనున్న తొలి టీ20లో ఆసక్తికర పోరు జరగనుంది. -
ఇక టి20 సిరీస్‌పై దృష్టి
పోట్చెఫ్స్ట్రూమ్: వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత మహిళల జట్టు ఇప్పుడు టి20లపై కన్నేసింది. ఆతిథ్య దక్షిణాఫ్రికాతో ఐదు టి20ల సిరీస్ నేడు జరిగే తొలి మ్యాచ్‌తో మొదలవుతోంది. తొలి రెండు వన్డేల్లోనూ భారీ తేడాతో గెలుపొందిన మిథాలీ సేన మూడో మ్యాచ్‌లో మాత్రం ఓడింది. ఇప్పుడు కొత్త కెప్టెన్ హర్మన్‌ప్రీత్ నేతృత్వంలో పొట్టి ఫార్మాట్లోనూ తమ ఆధిపత్యం చాటాలని భావిస్తోంది. ఇందులో 17 ఏళ్ల ముంబై అమ్మాయి జెమీమా రోడ్రిగ్స్ ఆకర్షణగా నిలవనుంది. భారత క్రీడాకారిణుల్లో స్మృతి మంధానతో పాటు, దీప్తి శర్మ, వేద కృష్ణమూర్తి ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్ హర్మన్ ధాటిగా ఆడటంలో దిట్ట. మూడో వన్డేలో విశ్రాంతి తీసుకున్న వెటరన్ బౌలర్ జులన్ గోస్వామి తిరిగి తుది జట్టులోకి రావడం భారత్‌కు లాభించనుంది. ఈమెతో పాటు శిఖా పాండే, దీప్తి శర్మ, పూజ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలరు. చివరి వన్డేలో దక్షిణాఫ్రికా జట్టులో డు ప్రీజ్, లారా వోల్వార్డ్ నిలకడగా ఆడారు. కెప్టెన్ డేన్ వాన్ నికెర్క్ ఫామ్‌లో ఉంది. దీంతో ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. -
దీప్తి శర్మ 6/20
మూడో వన్డే కూడా భారత మహిళలదే శ్రీలంకపై 3-0తో క్లీన్‌స్వీప్ రాంచీ: శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌లో భారత మహిళల క్రికెట్ జట్టు జోరు కొనసాగింది. వరుసగా రెండు విజయాలతో ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకున్న మిథాలీ రాజ్ సేన శుక్రవారం మూడో వన్డేలోనూ గెలిచి ద్వైపాక్షిక పోరును 3-0తో ముగించింది. చివరి మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో లంకను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంక 38.2 ఓవర్లలో 112 పరుగులకే కుప్పకూలింది. సురాంగిక (23) టాప్ స్కోరర్‌గా నిలిచింది. భారత బౌలర్లలో ఆఫ్‌స్పిన్నర్ దీప్తి శర్మ 9.2 ఓవర్లలో కేవలం 20 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టడం విశేషం. కెరీర్లో తొలి వన్డే ఆడుతున్న ఆఫ్‌స్పిన్నర్ ప్రీతి బోస్ (8-4-8-2) కట్టుదిట్టమైన బౌలింగ్ గణాంకాలు నమోదు చేసింది. అనంతరం భారత్ 29.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. 18 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినా... వేద కృష్ణమూర్తి (90 బంతుల్లో 61 నాటౌట్; 8 ఫోర్లు), దీప్తి శర్మ (59 బంతుల్లో 28; 5 ఫోర్లు) మూడో వికెట్‌కు 70 పరుగులు జోడించి జట్టు విజయాన్ని ఖాయం చేశారు. దీప్తికే ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. నాలుగో స్థానానికి భారత్... ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన ఈ సిరీస్‌లో మూడు విజయాల ద్వారా భారత్‌కు మొత్తం 6 పాయింట్లు లభించాయి. ఫలితంగా పట్టికలో మొత్తం 13 పాయింట్లతో జట్టు ప్రస్తుతం నాలుగో స్థానంలో నిలిచింది. ఇప్పటికే 15 మ్యాచ్‌లు ఆడిన భారత్... ఇకపై వెస్టిండీస్‌తో 3, పాకిస్తాన్‌తో 3 వన్డేలు ఆడాల్సి ఉంది. ఈ చాంపియన్‌షిప్‌లో అన్ని మ్యాచ్‌లు ముగిసిన అనంతరం టాప్-4 టీమ్‌లు 2017లో ఇంగ్లండ్‌లో జరిగే వరల్డ్ కప్‌కు నేరుగా అర్హత సాధిస్తాయి. మొదటి నాలుగు స్థానాల్లో నిలవలేకపోతే... మొత్తం 10 జట్లతో కూడిన క్వాలిఫయింగ్ టోర్నీలో ఆడాల్సి ఉంటుంది. భారత్‌తో పోలిస్తే విండీస్, పాక్ బలహీన జట్లే కావడంతో మన జట్టుకు ఇంకా అవకాశం ఉంది. -
భారత్‌దే తొలి వన్డే
శ్రీలంక మహిళలతో మ్యాచ్ రాంచీ: శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్‌ను భారత మహిళల క్రికెట్ జట్టు విజయంతో ఆరంభించింది. లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ (4/22) ప్రత్యర్థిని బెంబేలెత్తించడంతో సోమవారం జరిగిన తొలి వన్డేలో భారత్ 107 పరుగుల భారీ తేడాతో గెలిచింది. రెండో వన్డే రేపు (బుధవారం) ఇదే వేదికపై జరుగుతుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 245 పరుగులు చేసింది. స్మృతి మందానా (81 బంతుల్లో 55; 8 ఫోర్లు), హర్మన్‌ప్రీత్ కౌర్ (61 బంతుల్లో 50; 4 ఫోర్లు; 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేశారు. కెప్టెన్ మిథాలీ రాజ్ (74 బంతుల్లో 49; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్ ఆడింది. ప్రబోధని, సిరివర్ధనెలకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్ ఆరంభించిన శ్రీలంక 45.2 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌట్ అయ్యింది. వీరక్కోడి (113 బంతుల్లో 69; 7 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. 122/3 స్కోరుతో శ్రీలంక పటిష్ట స్థితిలో కనిపించినా... పూనమ్, దీప్తి (2/20), రాజేశ్వరి (2/31) ధాటికి ఆ జట్టు చివరి ఏడు వికెట్లను 16 పరుగులకే కోల్పోయింది.