ఆసియా కప్ టి20 టోర్నీ ఫైనల్లో నేడు శ్రీలంకతో భారత్ తుది సమరం
మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్–3లో ప్రత్యక్ష ప్రసారం
దంబుల్లా (శ్రీలంక): మహిళల ఆసియాకప్ టి20 క్రికెట్ టోరీ్న లో ఎదురు లేకుండా సాగుతున్న భారత జట్టు.. నేడు తుది సమరానికి సిద్ధమైంది. టోరీ్నలో ఎదురైన ప్రత్యరి్థనల్లా చిత్తుచేసిన టీమిండియా.. ఆదివారం జరగనున్న ఫైనల్లో శ్రీలంకతో తలపడనుంది. ఇప్పటికే ఎనిమిదిసార్లు (వన్డే, టి20 పార్మాట్లలో కలిపి) ఆసియాకప్ ఫైనల్ ఆడి అందులో ఏడింట విజేతగా నిలిచిన టీమిండియా.. ఎనిమిదోసారి ట్రోఫీ కైవసం చేసుకోవాలని తహతహలాడుతోంది. గ్రూప్ ‘ఎ’ నుంచి బరిలోకి దిగిన హర్మన్‌ప్రీత్ బృందం.. దాయాది పాకిస్తాన్, యూఏఈ, నేపాల్ జట్లపై గెలిచి సెమీఫైనల్లో అడుగుపెట్టింది.
ఏకపక్షంగా సాగిన సెమీస్‌లో బంగ్లాదేశ్‌పై ఘనవిజయం సాధించి తుదిపోరుకు చేరింది. ఇటీవలి కాలంలో హర్మన్‌ప్రీత్ బృందం జోరు చూస్తుంటే.. కప్ ఖాయంగానే కనిపిస్తోంది. ఓపెనర్లు స్మృతి మంధాన, షఫాలీ వర్మతో పాటు జెమీమా రోడ్రిగ్స్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్‌తో బ్యాటింగ్ పటిష్టంగా ఉంటే... బౌలింగ్‌లో రేణుక సింగ్, రాధ యాదవ్, దీప్తి శర్మ అదరగొడుతున్నారు. హర్మన్, జెమీమాకు ఈ టోరీ్నలో పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోయినా... సమయం వస్తే సత్తా చాటడం ఖాయమనే మేనేజ్‌మెంట్ భావిస్తోంది.
మరోవైపు గ్రూప్ ‘బి’లో ఆడిన మూడు మ్యాచ్‌లు నెగ్గిన లంక... పాకిస్తాన్‌తో హోరాహోరీ సెమీఫైనల్లో ఒత్తిడిని జయించి ఫైనల్‌కు అర్హత సాధించింది. కెప్టెన్ చమరి అటపట్టుపై లంక భారీ ఆశలు పెట్టుకుంది. ఈ టోర్నీలో 243 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్న చమరి రాణిస్తేనే టీమిండియాకు లంక పోటీనివ్వగలదు.
Comments
Please login to add a commentAdd a comment