ఆసియాకప్ మహిళల టి20 టోర్నీలో టీమిండియా శుభారంభం చేసింది. శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు 18.2 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలింది. లంక బ్యాటర్స్‌లో హాసిని పెరీరా 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హర్షితా మాధవి 26 పరుగులు చేసింది. భారత మహిళా బౌలర్లలో హేమలత మూడు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ చెరో రెండు వికెట్లు తీయగా.. రాధా యాదవ్ ఒక వికెట్ తీసింది.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఉమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. జేమీమా రోడ్రిగ్స్ 53 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 76 పరుగులతో రాణించగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 33 పరుగులు చేసింది. లంక బౌలర్లలో రణసింగే మూడు వికెట్లు తీయగా.. సుగంధిక కుమారి, ఆటపట్టు చెరొక వికెట్ తీశారు. ఇక 76 పరుగులతో రాణించిన రొడ్రిగ్స్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. ఇక భారత మహిళల జట్టు తమ తర్వాతి మ్యాచ్‌ను(అక్టోబర్ 3న) మలేషియా ఉమెన్స్‌తో ఆడనుంది.
Comments
Please login to add a commentAdd a comment