T20 tournament
-
న్యూజిలాండ్ టీ20 టోర్నీ విజేతగా సెంట్రల్ డిస్ట్రిక్ట్స్
న్యూజిలాండ్ టీ20 టోర్నీ సూపర్ స్మాష్ (Super Smash) విజేతగా సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ (Central Districts) (సెంట్రల్ స్టాగ్స్) అవతరించింది. ఇవాళ (ఫిబ్రవరి 2) జరిగిన ఫైనల్లో ఆ జట్టు కాంటర్బరీ కింగ్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ సూపర్ స్మాష్ టైటిల్ గెలవడం 2019 తర్వాత ఇదే మొదటిసారి. ఇనాగురల్ ఎడిషన్‌లో (2006) టైటిల్ గెలిచిన కాంటర్బరీ కింగ్స్ వరుసగా ఐదోసారి, మొత్తంగా ఏడో సారి రన్నరప్‌తో సరిపెట్టుకుంది.ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన కాంటర్బరీ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. 46 పరుగులు చేసిన డారిల్ మిచెల్ (Daryl Mitchell) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మెక్కోంచీ (27), చాడ్ బోవ్స్ (16), షిప్లే (10), మ్యాట్ హెన్రీ (12) రెండంకెల స్కోర్లు చేయగా.. మిచెల్ హే (5), మాథ్యూ బాయిల్ (2), జకరీ ఫౌల్క్స్ (7) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ బౌలర్లలో టాబీ ఫిండ్లే 3 వికెట్లు పడగొట్టగా.. రాండెల్ 2, అంగస్ షా, టిక్నర్ తలో వికెట్ దక్కించుకున్నారు.136 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సెంట్రల్ డిస్ట్రిక్ట్స్.. డేన్ క్లీవర్ (43), విల్ యంగ్ (35) రాణించడంతో మరో 16 బంతులు మిగిలుండగానే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ ఇన్నింగ్స్‌లో జాక్ బాయిల్ 5, కెప్టెన్ టామ్ బ్రూస్ 14 పరుగులు చేసి ఔట్ కాగా.. విలియమ్ క్లార్క్ (17), కర్టిస్ హీపీ (9) సెంట్రల్ డిస్ట్రిక్ట్స్‌ను విజయతీరాలకు చేర్చారు. కాంటర్బరీ కింగ్స్ బౌలర్లలో కైల్ జేమీసన్ 2, విలియమ్ ఓరూర్కీ, హెన్రీ షిప్లే తలో వికెట్ పడగొట్టారు.కాగా, న్యూజిలాండ్‌లో జరిగే సూపర్ స్మాష్ టీ20 టోర్నీ 2005-06లో తొలిసారి ప్రారంభమైంది. అప్పటి నుంచి ఈ టోర్నీ పలు పేర్లతో చలామణి అవుతూ వస్తుంది. తొలుత న్యూజిలాండ్ టీ20 కాంపిటీషన్ అని, ఆతర్వాత స్టేట్ టీ20 అని, 2009-2012 వరకు హెచ్ఆర్వీ కప్ అని, 2013-14 ఎడిషన్‌లో హెచ్ఆర్వీ టీ20 అని, 2018-19 సీజన్ నుంచి సూపర్ స్మాష్ అని నిర్వహించబడుతుంది. ఈ టోర్నీ పురుషులతో పాటు మహిళల విభాగంలోనూ జరుగుతుంది. ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. ప్రస్తుత సీజన్లో సెంట్రల్ డిస్ట్రిక్ట్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి నాకౌట్‌కు క్వాలిఫై అయిన తొలి జట్టుగా నిలిచింది. ఈ టోర్నీలో న్యూజిలాండ్ జాతీయ జట్టుకు ఆడే చాలామంది ఆటగాళ్లు పాల్గొంటారు. -
U19 Asia Cup 2024: ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్
ఆసియా కప్ అండర్–19 మహిళల టీ20 క్రికెట్ టోర్నీలో భారత జట్టు అదరగొడుతోంది. సూపర్-4 మ్యాచ్‌లో శ్రీలంకపై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తాజా గెలుపుతో ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. కౌలలంపూర్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భారత్- శ్రీలంక మధ్య బేయ్మాస్ క్రికెట ఓవల్ మైదానంలో శుక్రవారం మ్యాచ్ జరిగింది.ఆకాశమే హద్దుగా ఆయుషిఇందులో టాస్ గెలిచిన యువ భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆయుషి శుక్లా ఆకాశమే హద్దుగా చెలరేగి.. లంక బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించింది. కేవలం పది పరుగులే ఇచ్చిన ఆయుశి నాలుగు వికెట్లు కూల్చింది.మరోవైపు పరుణికా రెండు, షబ్నమ్ షకీల్, ద్రితి కేసరి ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఈ క్రమంలో నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయిన శ్రీలంక కేవలం 98 పరుగులే చేసింది. లంక ఇన్నింగ్స్‌లో మనుడి ననయక్కర 33 పరుగులతో టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచింది.రాణించిన త్రిష, కమలినిఇక లక్ష్య ఛేదనలో భారత్ ఆరంభంలో తడబడినా.. గొంగడి త్రిష, కమలిని రాణించడంతో విజయం సాధించింది. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసిన తెలుగమ్మాయి త్రిష 32 రన్స్‌తో రాణించగా.. తమిళనాడు స్టార్ జి.కమలిని 28 పరుగులతో ఆకట్టుకుంది. వీరిద్దరు కలిసి మూడో వికెట్‌కు 63 పరుగులు జోడించారు. మిగతా వాళ్లలో మిథిల 17 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచి.. భవిక(7)తో కలిసి జట్టును విజయతీరాలకు చేర్చింది. ఈశ్వరి డకౌట్ కాగా.. సానికా చాల్కె(4) పూర్తిగా విఫలమైంది. ఈ క్రమంలో 14.5 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి భారత్ 99 పరుగులు సాధించింది. తద్వారా లంకపై జయభేరి మోగించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన ఆయుషికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. తుదిజట్లుభారత్జి. కమిలిని, త్రిష, సానిక, నికీ ప్రసాద్ (కెప్టెన్), ఈశ్వరి, మిథిల, ఆయుషి, భవిక (వికెట్ కీపర్), షబ్నం, పారుణిక, ద్రితి .శ్రీలంకమనుడి, రష్మిక, లిమాన్సా, సుముడు, హిరుణి, ప్రముది, సంజన, దహామి, చముది, అసేని, షష్ని.చదవండి: భారత్‌తో టెస్టులకు ఆసీస్ జట్టు ప్రకటన.. అతడిపై వేటు.. ‘జూనియర్’ పాంటింగ్‌కు చోటు -
దేశవాళీ ధనాధన్‌కు అంతా సిద్ధం
న్యూఢిల్లీ: దేశవాళీ ధనాధన్ మెరుపుల ‘షో’కు రంగం సిద్ధమైంది. సాధారణంగా ఐపీఎల్ మెగా వేలానికి ముందే ఈ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టి20 టోర్నీని నిర్వహిస్తారు. దీంతో ప్లేయర్లకు ఫ్రాంచైజీలను ఆకర్షించే అవకాశం లభించేది. కానీ ఈసారి వేలానికి ఏమాత్రం సంబంధం లేకుండా ఈ టి20 టోర్నీ శనివారం నుంచి దేశంలోని వివిధ నగరాల్లో (హైదరాబాద్, విశాఖపట్నం, విజయనగరం, రాజ్‌కోట్, ఇండోర్, ముంబై) జరగనుంది. ఠాకూర్ తిలక్ వర్మ సారథ్యంలో హైదరాబాద్ జట్టు ఈ టోర్నీలో పోటీపడనుంది. రాజ్‌కోట్‌లో నేడు జరిగే గ్రూప్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌లో మేఘాలయ జట్టుతో హైదరాబాద్ తలపడుతుంది. ఉప్పల్ స్టేడియంలో ఈనెల 25న జరిగే గ్రూప్ ‘ఇ’ తొలి లీగ్ మ్యాచ్‌లో నాగాలాండ్ జట్టుతో ఆంధ్ర పోటీపడుతుంది. డిసెంబర్ 15వ తేదీన జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీ ముగుస్తుంది. ఈ టోర్నీలో పాల్గొంటున్న మొత్తం 38 జట్లను ఐదు గ్రూప్‌లుగా విభజించారు. డిఫెండింగ్ చాంపియన్‌గా పంజాబ్ జట్టు ఉంది. బరిలో స్టార్ క్రికెటర్లు... భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా (బరోడా), మొహమ్మద్ షమీ (బెంగాల్), శ్రేయస్ అయ్యర్ (ముంబై), యుజువేంద్ర చహల్ (హరియాణా) తదితరులతో పాటు దేశవాళీ స్టార్లు అభిషేక్ పొరెల్ (బెంగాల్), షారుక్ ఖాన్ (తమిళనాడు), అభినవ్ మనోహర్ (కర్ణాటక), మానవ్ సుతార్ (రాజస్తాన్), కరుణ్ నాయర్ (విదర్భ), కృనాల్ పాండ్యా (బరోడా), దీపక్ హుడా (రాజస్తాన్) ముస్తాక్ అలీ ట్రోఫీలో మెరిపించడానికి ‘సై’ అంటున్నారు. ఇందులో ఒక్క హార్దిక్ పాండ్యానే రిటెయిన్ ప్లేయర్ కాగా మిగతా వారంతా ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకోవాలని... తమపై కోట్ల రూపాయాలు కురవాలని గంపెడాశలతో ఉన్నారు. వేలాన్ని పక్కన బెడితే ముస్తాక్ అలీ టోర్నీలో ఏటికేడు పోటీ పెరుగుతోంది. ఆటగాళ్లు తమ సత్తా చాటుకుంటున్నారు. గాయం నుంచి కోలుకున్నాక రంజీ బరిలో దిగిన వెటరన్ సీమర్ షమీ మధ్యప్రదేశ్‌పై నిప్పులు చెరిగాడు. 7 వికెట్లతో అదరగొట్టిన 34 ఏళ్ల సీమర్ తనలో ఇంకా పేస్ పదును ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం ఆసీస్‌లో జరుగుతున్న బోర్డర్–గావస్కర్ ట్రోఫీకి ఎంపిక కాలేకపోయినా... ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌లో పేస్ షమీ ఆడే అవకాశాల్ని తోసిపుచ్చలేం. ఈ టి20 టోర్నీలోనూ ఫిట్నెస్ నిరూపించుకుంటే ఆసీస్ ఫ్లయిట్ ఎక్కడం దాదాపు ఖాయమవుతుంది. ఏ గ్రూప్‌లో ఎవరంటే... గ్రూప్ ‘ఎ’: హైదరాబాద్, మధ్యప్రదేశ్, బెంగాల్, మేఘాలయ, పంజాబ్, మిజోరం, బిహార్, రాజస్తాన్. గ్రూప్ ‘బి’: బరోడా, సిక్కిం, గుజరాత్, సౌరాష్ట్ర, కర్ణాటక, ఉత్తరాఖండ్, తమిళనాడు, త్రిపుర. గ్రూప్ ‘సి: హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, హరియాణా, జమ్మూ కశ్మీర్, మణిపూర్, ఢిల్లీ, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్. గ్రూప్ ‘డి’: ఛత్తీస్‌గఢ్, పుదుచ్చేరి, అస్సాం, విదర్భ, రైల్వేస్, ఒడిశా, చండీగఢ్. గ్రూప్ ‘ఇ’: ఆంధ్ర, నాగాలాండ్, కేరళ, ముంబై, గోవా, సర్వీసెస్, మహారాష్ట్ర. -
SA vs NZ W T20: వరల్డ్‌కప్ విజేత న్యూజిలాండ్
మహిళల టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్లో సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ విజయం సాధించింది. దీంతో తొలిసారి న్యూజిలాండ్ మహిళల టీ20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకుంది. సౌతాఫ్రికాపై 32 పరుగుల తేడాతో న్యూజిలాండ్ గెలుపొందింది. స్కోర్లు: న్యూజిలాండ్ 158/5, సౌతాఫ్రికాపై 126/9మహిళల టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్లో న్యూజిలాండ్ మెరుగైన స్కోరు సాధించింది. దుబాయ్ వేదికగా సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 158 పరుగులు చేసింది. వైట్‌ఫెర్న్స్ బ్యాటర్లలో ఓపెనర్ సుజీ బేట్ 31 బంతుల్లో 32 పరుగులు చేయగా.. మరో ఓపెనర్ జార్జియా ప్లిమెర్(9) మాత్రం నిరాశపరిచింది.ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న వన్‌డౌన్ బ్యాటర్ అమేలియా కెర్ 38 బంతుల్లో నాలుగు ఫోర్ల సాయంతో 43 రన్స్ సాధించింది. ఆమెకు తోడుగా బ్రూక్ హాలీడే(28 బంతుల్లో 38) రాణించింది. వీరిద్దరి కారణంగా న్యూజిలాండ్ పటిష్ట స్థితిలో నిలిచింది. మిగతా వాళ్లలో కెప్టెన్ సోఫీ డివైన్(6) విఫలం కాగా.. మ్యాడీ గ్రీన్ 12, వికెట్ కీపర్ ఇసబెల్లా గేజ్ 3 పరుగులతో అజేయంగా నిలిచారు.సౌతాఫ్రికా బౌలర్లలో అయబోంగా ఖాకా, క్లోయీ ట్రియాన్, నాడిన్ డి క్లెర్క్ ఒక్కో వికెట్ తీయగా.. నోన్కులులేకో మ్లాబా రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకుంది. ఎవరు గెలిచినా చరిత్రే!కాగా 14 ఏళ్ల తర్వాత తొలిసారి న్యూజిలాండ్ మహిళా జట్టు వరల్డ్‌కప్ ఫైనల్ చేరగా.. సౌతాఫ్రికా వరుసగా రెండోసారి తుదిపోరుకు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ విధించిన 159 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా ఛేదిస్తే తమ దేశం ఖాతాలో మొట్టమొదటి ఐసీసీ వరల్డ్‌కప్‌ను జమచేస్తుంది. లేదంటే.. న్యూజిలాండ్‌కు తొలి ప్రపంచకప్ దక్కుతుంది.మహిళల టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికాతుదిజట్లున్యూజిలాండ్సుజీ బేట్స్, జార్జియా ప్లిమెర్, అమేలియా కెర్, సోఫీ డివైన్(కెప్టెన్), బ్రూక్ హాలిడే, మ్యాడీ గ్రీన్, ఇసబెల్లా గాజ్(వికెట్ కీపర్), రోజ్మేరీ మైర్, లీ తహుహు, ఈడెన్ కార్సన్, ఫ్రాన్ జోనాస్సౌతాఫ్రికాలారా వోల్వార్డ్ (కెప్టెన్), టాజ్మిన్ బ్రిట్స్, అన్నేక్ బాష్, క్లోయి ట్రియాన్, మారిజానే కాప్, సునే లుస్, నాడిన్ డి క్లెర్క్, అన్నేరీ డెర్క్సెన్, సినాలో జఫ్తా(వికెట్ కీపర్), నోన్కులులేకో మ్లాబా, అయబోంగా ఖాకా.చదవండి: IPL 2025- CSK: ధోనికి రూ. 4 కోట్లు! వాళ్లిద్దరూ జట్టుతోనే! -
వచ్చే ఏడాది భారత్‌లో ఆసియా కప్ టి20 క్రికెట్ టోర్నీ
పురుషుల ఆసియాకప్ టోర్నమెంట్‌కు భారత్ ఆతిథ్యమివ్వనుంది. టి20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీని వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించనున్నారు. 2026లో స్వదేశంలో జరిగే టి20 ప్రపంచకప్‌కు ముందుగా ఈ టోర్నీ నిర్వహిస్తారు. గతంలోనూ 2023 వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా పాకిస్తాన్లో ఆసియా కప్‌ను వన్డే ఫార్మాట్లో నిర్వహించారు. అయితే భారత్ అక్కడికి వెళ్లేందుకు నిరాకరించడంతో ‘హైబ్రిడ్ మోడల్’తో భారత్ ఆడిన మ్యాచ్‌ల్ని శ్రీలంకలో ఏర్పాటు చేశారు. ఫైనల్లో శ్రీలంకపై గెలిచి భారత్ విజేతగా నిలిచింది. అనంతరం 2027 ఆసియా కప్‌కు బంగ్లాదేశ్ ఆతిథ్యమిస్తుంది. అదే ఏడాది దక్షిణాఫ్రికాలో వన్డే ప్రపంచకప్ ఉండటంతో బంగ్లాలో వన్డే ఫార్మాట్లో ఆసియాకప్ జరుగనుంది. ఈ రెండు టోరీ్నల్లోనూ భారత్, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లతో పాటు టెస్టు హోదా దక్కని ఒక ఆసియా జట్టు పాల్గొంటుందని ఆసియా క్రికెట్ మండలి తెలిపింది. -
కళ్లు చెదిరే క్యాచ్.. క్రికెట్ చరిత్రలోనే ఇప్పటివరకు చూసిండరు! వీడియో
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్‌లో సంచలన క్యాచ్ నమోదైంది. క్రికెట్ చరిత్రలోనే కనీ వినీ ఎరుగని రీతిలో ఉన్న ఈ క్యాచ్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం(జూన్ 16) చెస్టర్-లీ-స్ట్రీట్ వేదికగా డర్హామ్, లంకాషైర్ జట్లు తలపడ్డాయి. ఈ క్రమంలో డర్హామ్ ఆల్‌రౌండర్ పాల్ కొగ్లిన్ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. లంకాషైర్ బ్యాటర్ మాథ్యూ హర్ట్స్ను సంచలన క్యాచ్‌తో కొగ్లిన్ పెవిలియన్‌కు పంపాడు. లంకాషైర్ ఇన్నింగ్స్ 7వ ఓవర్ వేసిన పాల్ కొగ్లిన్ యార్కర్ వేయడానికి ప్రయత్నించాడు. కానీ కొగ్లిన్ ప్లాన్‌ను ముందుగానే గమనించిన మాథ్యూ హర్ట్స్ ఫ్రంట్‌పుట్‌కు వచ్చి స్టైట్‌గా భారీ షాట్ ఆడాడు. ఈ క్రమంలో పాల్ కొగ్లిన్ రిటర్న్‌లో సింగిల్ హ్యాండ్‌తో స్టన్నింగ్ క్యాచ్‌ను అందుకున్నాడు. బంతి తన తలకు తాకుతుందని భావించిన పాల్ కొగ్లిన్.. ఎవరూ ఊహించని విధంగా మెరుపు వేగంతో క్యాచ్‌ను అందుకున్నాడు. ఇది చూసిన బ్యాటర్ అలా కాసేపు క్రీజులోనే ఉండిపోయాడు. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులు సైతం బిత్తరపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు దశాబ్దంలోనే అత్యుత్తమ క్యాచ్‌గా అభివర్ణిస్తున్నారు. What a ludicrous catch.pic.twitter.com/ucPjKpeH0Z— The Cricketer (@TheCricketerMag) June 16, 2024 -
శిఖర్ ధావన్ విధ్వంసం.. చెలరేగిన దినేష్ కార్తీక్
డివై పాటిల్ టీ20 కప్-2024లో టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ మరోసారి చెలరేగాడు. ఈ టోర్నీలో డివై పాటిల్ బ్లూ జట్టుకు ధావన్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్బీఐతో జరిగిన మ్యాచ్‌లో ధావన్ సత్తాచాటాడు. డివై పాటిల్ బ్లూ జట్టు విజయంలో గబ్బర్ కీలక పాత్ర పోషించాడు. 9 వికెట్ల తేడాతో ఆర్సీఐని బ్లూ జట్టు చిత్తు చేసింది. 113 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన డివై పాటిల్ బ్లూ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఓపెనర్‌గా బరిలోకి దిగిన ధావన్ కేవలం 29 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 45 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు మరో వెటరన్ క్రికెటర్ దినేష్ కార్తీక్ సైతం కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 21 బంతుల్లో 6 ఫోర్లతో 36 పరుగులు చేసి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఆర్బీఐ జట్టు కేవలం 112 పరుగులకే కుప్పకూలింది. ఆర్బీఐ బ్యాటర్లలో ప్రణయ్ శర్మ(33) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాటిల్ బ్లూ జట్టులో పరీక్షిత్ వల్సంకర్ 4 వికెట్లతో సత్తాచాటగా.. కొథారీ 3 వికెట్లు పడగొట్టాడు. -
హార్దిక్ పాండ్యా రీఎంట్రీ.. తొలి మ్యాచ్‌లోనే..!
గతేడాది వన్డే వరల్డ్‌కప్ సందర్భంగా (బంగ్లాదేశ్‌తో మ్యాచ్) గాయపడిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దాదాపు నాలుగు నెలల విరామం తర్వాత కాంపిటేటివ్ క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ముంబైలో జరుగుతున్న డీవై పాటిల్ టీ20 కప్-2024లో హార్దిక్ రిలయన్స్ 1 జట్టు తరఫున బరిలోకి దిగాడు. 16 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో హర్దిక్ రిలయన్స్ టీమ్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. బీపీసీఎల్‌తో ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ రెండు వికెట్లు తీయడంతో పాటు తన జట్టును ఉపయోగపడే అతి మూల్యమైన పరుగులు చేశాడు. ఛేదనలో 10వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన హార్దిక్.. 4 బంతుల్లో 3 పరుగులు చేసి తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బీపీసీఎల్ 15 ఓవర్లలో 126 పరుగులు చేయగా.. స్వల్ప లక్ష్య ఛేదనకు తడబడిన హార్దక్ సేన 8 వికెట్లు కోల్పోయి అతికష్టం మీద విజయం సాధించింది. హార్దక్ ప్రాతినిథ్యం వహిస్తున్న రిలయన్స్ జట్టులో నేహల్ వధేరా, తిలక్ వర్మ, పియూశ్ చావ్లా లాంటి ముంబై ఇండియన్స్ ప్లేయర్లు ఉన్నారు. ఇదిలా ఉంటే, ఇటీవల జరిగిన ఐపీఎల్ ట్రేడింగ్‌లో హార్దిక్‌ను ముంబై ఇండియన్స్ గుజరాత్ నుంచి ట్రేడ్ చేసుకున్న విషయం తెలిసిందే. ముంబై యాజమాన్యం రోహిత్‌ను తప్పించి.. వచ్చీ రాగానే హార్దిక్‌కు కెప్టెన్సీ అప్పగించింది. త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్ 2024 ఎడిషన్ కోసం హార్దిక్ కఠోరంగా శ్రమిస్తున్నాడు. హార్దిక్ ముంబై గూటికి చేరడంతో అతని స్థానంలో గుజరాత్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. -
Senior Women T20: సౌత్‌జోన్ జట్టులో త్రిష..
Senior Women’s Inter-Zone T20 Trophy: సీనియర్ మహిళల ఇంటర్ జోనల్ టి20 క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనే సౌత్‌జోన్ జట్టును ప్రకటించారు. 15 మంది సభ్యులతో కూడిన ఈ జట్టులో హైదరాబాద్ నుంచి గొంగడి త్రిష, భోగి శ్రావణి ఎంపికయ్యారు. అదే విధంగా ఆంధ్ర నుంచి బారెడ్డి అనూష, ఎస్.అనూష, నీరగట్టు అనూష ఈ జట్టులో స్థానం సంపాదించారు. ఇక ఈ టోర్నీ ఈనెల 24 నుంచి డిసెంబర్ 4 వరకు లక్నోలో జరుగుతుంది. ఈ జట్టుకు శిఖా పాండే కెప్టెన్‌గా వ్యవహరించనుంది. సౌత్‌జోన్ జట్టు: శిఖా పాండే (కెప్టెన్), గొంగడి త్రిష, డి.బృందా, జి.దివ్య, ఎల్.నేత్ర, పూర్వజ వెర్లేకర్, దృశ్య, ఎంపీ వైష్ణవి, మిన్ము మణి (వైస్ కెప్టెన్), అనూష బారెడ్డి, ఎస్.అనూష, ఎండీ షబ్నం, బూగి శ్రావణి, ఎన్.అనూష, యువశ్రీ. సెమీస్‌లో అభయ్ నిష్క్రమణ న్యూఢిల్లీ: నియోస్ వెనిస్ వెర్టె ఓపెన్ స్క్వాష్ టోర్నీలో భారత ప్లేయర్ అభయ్ సింగ్ సెమీఫైనల్లో ని్రష్కమించాడు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఈ టోరీ్నలో శుక్రవారం రెండో సీడ్ రోరీ స్టీవర్ట్ (స్కాట్లాండ్)తో జరగాల్సిన సెమీఫైనల్లో అభయ్ గాయం కారణంగా బరిలోకి దిగకుండా తన ప్రత్యర్థికి వాకోవర్ ఇచ్చాడు. క్వార్టర్ ఫైనల్లో అభయ్ 11–1, 7–11, 19–17, 8–11, 11–6తో ఆరో సీడ్ విక్టర్ బైర్టస్ (చెక్ రిపబ్లిక్)పై గెలిచాడు. -
ACC Women's T20: భారత్- పాక్ మ్యాచ్ రద్దు.. సెమీస్‌లో ఇరు జట్లు
హాంకాంగ్: ఎమర్జింగ్ కప్ ఆసియా అండర్–23 మహిళల టి20 క్రికెట్ టోర్నమెంట్లో భారత ‘ఎ’ జట్టు సెమీఫైనల్ చేరింది. భారీ వర్షం కారణంగా భారత్ ‘ఎ’, పాకిస్తాన్ ‘ఎ’ జట్ల మధ్య శనివారం జరగాల్సిన గ్రూప్ ‘ఎ’ లీగ్ మ్యాచ్ రద్దయింది. దాంతో రెండు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు. లీగ్ మ్యాచ్‌లు ముగిశాక భారత్, పాక్ జట్లు నాలుగు పాయింట్లతో గ్రూప్ ‘ఎ’ నుంచి సెమీఫైనల్‌కు చేరాయి. గ్రూప్ ‘బి’ నుంచి శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లకు సెమీఫైనల్ బెర్త్‌లు ఖరారయ్యాయి. సోమవారం జరిగే సెమీఫైనల్స్‌లో శ్రీలంకతో భారత్; బంగ్లాదేశ్‌తో పాకిస్తాన్ తలపడతాయి. బంగ్లాదేశ్ భారీ విజయం.. టెస్టు క్రికెట్ చరిత్రలో.. మిర్పూర్: ఆద్యంతం ఆధిపత్యం కనబరిచిన బంగ్లాదేశ్ జట్టు తమ టెస్టు క్రికెట్ చరిత్రలోనే అతి పెద్ద విజయాన్ని నమోదు చేసింది. అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో లిటన్ దాస్ సారథ్యంలోని బంగ్లాదేశ్ ఏకంగా 546 పరుగుల తేడాతో ఘనవిజయం అందుకుంది. 662 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 33 ఓవర్లలో 115 పరుగులకే కుప్పకూలింది. ఓవర్‌నైట్ స్కోరు 45/2తో ఆట నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన అఫ్గానిస్తాన్ మరో 70 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లను కోల్పోయింది. బంగ్లాదేశ్ బౌలర్లు తస్కిన్ అహ్మద్ (4/37), షోరిఫుల్ ఇస్లాం (3/28) అఫ్గానిస్తాన్‌ను దెబ్బ తీశారు. రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు చేసిన బంగ్లాదేశ్ బ్యాటర్ నజ్ముల్ హుస్సేన్ షాంతో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు గెల్చుకున్నాడు. మొత్తం టెస్టు క్రికెట్ చరిత్రలో పరుగుల తేడా పరంగా బంగ్లాదేశ్‌ది మూడో అతి పెద్ద విజయం కావడం విశేషం. ఈ జాబితాలో ఇంగ్లండ్ (1928లో ఆస్ట్రేలియాపై 675 పరుగుల తేడాతో గెలుపు), ఆస్ట్రేలియా (1934లో ఇంగ్లండ్‌పై 562 పరుగుల తేడాతో గెలుపు) జట్లు తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. -
ఐపీఎల్ బంధం ముగిసే.. మేజర్ లీగ్ క్రికెట్లో మొదలు
ఇటీవల ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పిన భారత క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు వచ్చే నెలలో అమెరికాలో జరిగే మేజర్ లీగ్ క్రికెట్ టి20 టోర్నమెంట్లో బరిలోకి దిగనున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాయుడు మేజర్ లీగ్‌లో టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఐపీఎల్‌లోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యానిదే టెక్సాస్ సూపర్ కింగ్స్ జట్టు. జూలై 13 నుంచి 30 వరకు జరిగే మేజర్ లీగ్ టోర్నీలో ముంబై ఇండియన్స్ న్యూయార్క్ జట్టు, లాస్ ఏంజెలిస్ నైట్‌రైడర్స్, సియాటెల్ ఒర్కాస్, వాషింగ్టన్ ఫ్రీడమ్, శాన్ఫ్రాన్సిస్కో యునికార్న్ జట్లు కూడా పోటీపడనున్నాయి. ఇక ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకడిగా పేరు తెచ్చుకున్న అంబటి రాయుడు 204 మ్యాచ్‌ల్లో 4238 పరుగులు చేశాడు. చదవండి: వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కకపోవడంపై అంబటి రాయుడు సంచలన వ్యాఖ్యలు -
విచిత్రరీతిలో రనౌట్ అయిన పాక్ బ్యాటర్
పాకిస్తాన్ ఆటగాడు హైదర్ అలీ విచిత్రరీతిలో స్టంపౌట్ అవ్వడం ఆసక్తి కలిగించింది. విటాలిటీ టి20 బ్లాస్ట్ టోర్నీలో ఈ ఘటన చోటు చేసుకుంది. విషయంలోకి వెళితే.. స్పిన్నర్ బ్రిగ్స్ వేసిన ఫుల్ లెన్త్ బంతిని బాదేందుకు క్రీజులో నుంచి బయటికి వచ్చి బీట్ అయ్యాడు హైదర్. అయితే, బంతిని పట్టడంలో మొదట బర్మింగ్‌హామ్ కీపర్ అలెక్స్ డేవియస్ తడబడ్డాడు. గ్లవ్లో తొలుత సరిగా ఒడిసిపట్టలేకపోయి, రెండో ప్రయత్నంలో పట్టుకున్నాడు. ఆలోగానే హైదర్ అలీ క్రీజులోకి వచ్చాడు. అయితే బంతి కీపర్ అలెక్స్ చేతిలో ఉందని గమనించని హైదర్ అలీ పరుగులు తీసేందుకు క్రీజు దాటి మళ్లీ ముందుకు పరుగెత్తాడు. ఆ సమయంలో వికెట్లను గిరాటేశాడు కీపర్ అలెక్స్. దీంతో షాకైన హైదర్ అలీ (48 పరుగులు).. స్టంపౌట్‌గా పెవిలియన్ చేరాడు. హైదర్ అలీ స్టంపౌట్ అయిన వీడియోను విటాలిటీ బ్లాస్ట్.. ట్విట్టర్లో పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు నవ్వుకుంటున్నారు. కొందరు హైదర్ అలీని ట్రోల్ చేస్తున్నారు. హైదర్ మందు కొట్టినట్టున్నాడంటూ ఓ యూజర్ సరదాగా కామెంట్ చేశారు. అతడి కెరీర్‌లాగే హైదర్ అలీ తికమకపడ్డాడని మరో యూజర్ రాసుకొచ్చారు. అలీ దిమ్మతిరిగిందని మరికొందరు ట్రోల్ చేశారు. ఈ మ్యాచ్‌లో డెర్బీషైర్ విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బర్మింగ్‌హామ్ బియర్స్ 7 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. అనంతరం ఈ లక్ష్యాన్ని 19.3 ఓవర్లలో డెర్బీషైర్ చేజ్ చేసింది. డెర్బీ షైర్ కెప్టెన్ డు ప్లూయీ (25 బంతుల్లో 66, నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. సిక్సర్ల మోత మోగించి చివరి వరకు ఉండి సత్తాచాటాడు. Make sense of this Haider Ali stumping 👀 #Blast23 pic.twitter.com/d1iD6t1yMZ — Vitality Blast (@VitalityBlast) June 7, 2023 చదవండి: సిరాజ్‌కు కోపం తెప్పించిన స్మిత్ చర్య -
విధ్వంసకర ఇన్నింగ్స్.. 38 బంతుల్లోనే సెంచరీ
టి20 బ్లాస్ట్ 2023లో భాగంగా గ్లామోర్గాన్స్ తరపున తొలి శతకం నమోదైంది. గ్లామోర్గాన్ బ్యాటర్ క్రిస్ కూక్ 38 బంతుల్లోనే శతకం మార్క్ సాధించి రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా 41 బంతుల్లో 113 పరుగులు నాటౌట్‌గా నిలిచిన క్రిస్ కూక్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. కాగా క్రిస్ కూక్ సెంచరీ ఈ సీజన్ టి20 బ్లాస్ట్‌లో ఏడో శతకం. ఇక టి20 బ్లాస్ట్ టోర్నీలో క్రిస్ కూక్ది జాయింట్ ఆరో ఫాస్టెస్ట్ సెంచరీ. 26 బంతుల్లో అర్థసెంచరీ చేసిన క్రిస్ కూక్.. తర్వాతి 12 బంతుల్లోనే మరో 50 పరుగులు చేయడం విశేషం ఇక అంతర్జాతీయ టి20 క్రికెట్లో అత్యల్ప బంతుల్లో సెంచరీ సాధించిన ఆటగాళ్లు ముగ్గురు ఉన్నారు. డేవిడ్ మిల్లర్, రోహిత్ శర్మ, సుదేశ్ విక్రమసేనలు 35 బంతుల్లోనే శతకం సాధించి తొలి స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో పెరియాల్వార్, జీషన్ కుకికెల్, జాన్సన్ చార్లెస్‌లు 39 బంతుల్లో ఈ ఫీట్ సాధించడం విశేషం. అంతర్జాతీయం కాకుండా అత్యల్ప బంతుల్లో సెంచరీ సాధించిన నాలుగో ఆటగాడిగా క్రిస్ కూక్ ఘనత సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే గ్లామోర్గాన్స్ 29 పరుగుల తేడాతో మిడిలెసెక్స్పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గ్లామెర్గాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోరు చేసింది. క్రిస్ కూక్‌కు తోడుగా కొలిన్ ఇంగ్రామ్(51 బంతుల్లో 92 నాటౌట్) రాణించాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మిడిలెసెక్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేయగలిగింది. స్టీఫెన్ ఎస్కినాజి 59, జో క్రాక్నెల్ 77 మినహా మిగతావరు విఫలమయ్యారు. WHAT A CENTURY!!! 💯 Chris Cooke scores his 100 from just 38 balls which is the joint-sixth fastest Blast ton 🤯#Blast23 pic.twitter.com/wPU58omoJh — Vitality Blast (@VitalityBlast) May 31, 2023 చదవండి: ఫామ్‌లో ఉన్నాడు.. రికార్డులు బద్దలు కొట్టడం కష్టమేమి కాదు -
WPL 2023: డబ్ల్యూపీఎల్ వేలానికి వేళాయె.. వివరాలివే
ముంబై: బీసీసీఐ ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహించనున్న మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) టి20 టోర్నీ క్రికెటర్ల వేలం కార్యక్రమం నేడు జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు మొదలయ్యే ఈ కార్యక్రమాన్ని స్పోర్ట్స్ 18 చానెల్, జియో సినిమా యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. మహిళా లీగ్ వేలం మహిళ మల్లిక సాగర్ నేతృత్వంలో జరగనుండటం విశేషం. మల్లిక 2021లో ప్రొ కబడ్డీ లీగ్ వేలం కార్యక్రమాన్ని నిర్వహించింది. మొత్తం 90 బెర్త్‌ల కోసం 409 మంది క్రికెటర్లు వేలం బరిలో ఉన్నారు. ఇందులో భారత్ నుంచి 246 మంది... విదేశీ జట్ల నుంచి 163 మంది ఉన్నారు. హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, రేణుక సింగ్, రిచా ఘోష్ (భారత్), ఎలీస్ పెర్రీ, బెత్ మూనీ, అలీసా హీలీ, మేగన్ షుట్ (ఆస్ట్రేలియా), నాట్ సివెర్, సోఫీ ఎకిల్‌స్టోన్ (ఇంగ్లండ్), డియాండ్ర డాటిన్ (వెస్టిండీస్) తదితరులకు భారీ మొత్తం లభించే అవకాశముంది. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఆర్సీబీ, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్జ్ జట్లు పాల్గొంటున్న డబ్ల్యూపీఎల్ మార్చి 4 నుంచి 26 వరకు ముంబైలో జరుగుతుంది. -
Big Bash League: సిడ్నీ థండర్ 15 ఆలౌట్!
సిడ్నీ: 0 0 3 0 2 1 1 0 0 4 1... ఇవీ ఒక టి20 మ్యాచ్‌లో వరుసగా 11 మంది ఆటగాళ్ల స్కోర్లు! ప్రతిష్టాత్మక బిగ్‌బాష్ లీగ్...ఐపీఎల్ తర్వాత అత్యంత ప్రజాదరణ ఉన్న టి20 టోర్నీ...ఇప్పటికే ఒక సారి చాంపియన్‌గా నిలిచిన సిడ్నీ థండర్ జట్టు... కానీ అత్యంత చెత్త ప్రదర్శనతో ఆ జట్టు టి20 చరిత్రలో తలదించుకునే రికార్డు నమోదు చేసింది. శుక్రవారం అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్ 5.5 ఓవర్లలో 15 పరుగులకే కుప్పకూలింది. ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోగా, ఎక్స్‌ట్రాల రూపంలో 3 పరుగులు వచ్చా యి. టి20 ఫార్మాట్లో విధ్వంసక ఆటగాళ్ల జాబి తాలో నిలిచే అలెక్స్ హేల్స్, రిలీ రోసో సిడ్నీ జట్టు లో ఉన్నారు. కనీసం ఒక్క ఆటగాడు కూడా పరిస్థితిని బట్టి నిలబడేందుకు గానీ, కౌంటర్ అటాక్‌తో పరుగులు రాబట్టేందుకు గానీ ప్రయత్నించలేదు. దాంతో 35 బంతుల్లోనే జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. పదో నంబర్ బ్యాటర్ డాగెట్ బ్యాట్‌కు ఎడ్జ్ తీసుకొని ఒకే ఒక ఫోర్ రాగా... స్టేడియంలో ప్రేక్షకులంతా నిలబడి వ్యంగ్యంగా ‘స్టాండింగ్ ఒవేషన్’ ఇవ్వ డం పరిస్థితిని చూపిస్తోంది! 17 బంతుల్లో 3 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టిన అడిలైడ్ పేసర్ హెన్రీ థార్టన్ సిడ్నీ పతనంలో కీలక పాత్ర పోషించాడు. వెస్ అగర్ 12 బంతుల్లో 6 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు. అంతకు ముందు 139 పరుగులు చేసిన స్ట్రైకర్స్ 124 పరుగులతో మ్యాచ్ గెలుచుకుంది. 15: టి20 క్రికెట్లో ఇదే అత్యల్ప స్కోరు. 2019లో కాంటినెంటల్ కప్‌లో భాగంగా చెక్ రిపబ్లిక్‌తో జరిగిన మ్యాచ్‌లో టర్కీ 21 పరుగులకే ఆలౌటైన రికార్డు ఇప్పుడు కనుమరుగైంది. అతి తక్కువ బంతులు (35) సాగిన ఇన్నింగ్స్ కూడా ఇదే. -
భారత అమ్మాయిల ‘హ్యాట్రిక్’
సిల్హెట్ (బంగ్లాదేశ్): మహిళల ఆసియా కప్ టి20 టోర్నమెంట్లో భారత జట్టు హ్యాట్రిక్ విజయం సాధించింది. మంగళవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జెమీమా రోడ్రిగ్స్ (45 బంతుల్లో 75 నాటౌట్; 11 ఫోర్లు), దీప్తి శర్మ (49 బంతుల్లో 64; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) చెలరేగారు. దీంతో భారత అమ్మాయిల జట్టు 104 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఈ టోర్నీలో మహిళల జట్టుకిది వరుసగా మూడో విజయం. ముందుగా బ్యాటింగ్ చేపట్టిన భారత అమ్మాయిల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్లు సబ్బినేని మేఘన (10), రిచా ఘోష్ (0), దయాళన్ హేమలత (2) నిరాశపరచడంతో భారత్ 20 పరుగులకే 3 కీలక వికెట్లను కోల్పోయింది. ఈ దశలో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన దీప్తి, ఐదో వరుస బ్యాటర్ జెమీమా ధాటిగా ఆడారు. ఇద్దరు నాలుగో వికెట్‌కు 128 పరుగులు జోడించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 74 పరుగులు చేసింది. తదుపరి మ్యాచ్‌లో భారత అమ్మాయిల జట్టు 7న పాకిస్తాన్‌తో తలపడుతుంది. -
జెమీమా రోడ్రిగ్స్ విధ్వంసం.. ఆసియాకప్‌లో టీమిండియా శుభారంభం
ఆసియాకప్ మహిళల టి20 టోర్నీలో టీమిండియా శుభారంభం చేసింది. శనివారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 151 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక జట్టు 18.2 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలింది. లంక బ్యాటర్స్‌లో హాసిని పెరీరా 30 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. హర్షితా మాధవి 26 పరుగులు చేసింది. భారత మహిళా బౌలర్లలో హేమలత మూడు వికెట్లు తీయగా.. దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్ చెరో రెండు వికెట్లు తీయగా.. రాధా యాదవ్ ఒక వికెట్ తీసింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా ఉమెన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. జేమీమా రోడ్రిగ్స్ 53 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 76 పరుగులతో రాణించగా.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 33 పరుగులు చేసింది. లంక బౌలర్లలో రణసింగే మూడు వికెట్లు తీయగా.. సుగంధిక కుమారి, ఆటపట్టు చెరొక వికెట్ తీశారు. ఇక 76 పరుగులతో రాణించిన రొడ్రిగ్స్‌ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వరించింది. ఇక భారత మహిళల జట్టు తమ తర్వాతి మ్యాచ్‌ను(అక్టోబర్ 3న) మలేషియా ఉమెన్స్‌తో ఆడనుంది. చదవండి: క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ కంటికి తీవ్ర గాయం.. -
Ind Vs Pak: కోహ్లికి గంగూలీ వార్నింగ్! సెంచరీ చేయాలని ఆశిస్తున్నా.. కానీ కష్టమే!
Asia Cup 2022 India Vs Pakistan: ‘‘ప్రస్తుతం అతడు కేవలం దేశం కోసం మాత్రమే కాదు.. తన కోసం తాను కూడా పరుగులు సాధించాల్సి ఉంది’’ అని భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నాడు. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిని ఉద్దేశించి పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశాడు. అదే విధంగా కోహ్లి తిరిగి ఫామ్‌లోకి వస్తాడని ధీమా వ్యక్తం చేసిన దాదా.. అతడు సెంచరీ చేస్తే చూడాలని ఉందని వ్యాఖ్యానించాడు. గడ్డు పరిస్థితుల్లో కింగ్.. ప్రస్తుతం కోహ్లి తన కెరీర్లోనే అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఫామ్‌లేమితో ఇబ్బందిపడుతున్న ఈ స్టార్ బ్యాటర్ శతకం చేసి వెయ్యి రోజులు దాటిపోయింది. ఇక కొన్నాళ్లుగా విశ్రాంతి తీసుకుంటున్న కోహ్లి.. ఆసియా కప్-2022 భారత్ - పాకిస్తాన్ మ్యాచ్‌తో తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. గొప్పగా ఉండాలి! ఈ నేపథ్యంలో క్రీడా వర్గాల్లో ఎక్కడ చూసినా కోహ్లి ఫామ్ గురించే చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో మీడియా సమావేశంలో గంగూలీ మాట్లాడుతూ.. టీ20 ప్రపంచకప్-2022 ఆరంభానికి ముందు ఆసియా కప్ రూపంలో వచ్చిన అవకాశాన్ని కోహ్లి సద్వినియోగం చేసుకోవాలని సూచించాడు. ఈ మేరకు దాదా మాట్లాడుతూ.. ‘‘ఈ సీజన్ కోహ్లికి గొప్పగా ఉంటుందని ఆశిస్తున్నా. సెంచరీ ఇప్పుడు కష్టమే! తను తిరిగి ఫామ్‌లోకి వస్తాడని మాకు నమ్మకం ఉంది. అందరిలాగే మేము కూడా తను శతకం బాదితే చూడాలని కోరుకుంటున్నాం. అందుకు తగ్గట్లుగా కోహ్లి ప్రాక్టీసు చేశాడు కూడా! అయితే, టీ20లలో సెంచరీ చేసేందుకు అవకాశాలు తక్కువ. ఏదేమైనా ఇది కోహ్లికి గొప్ప సీజన్‌గా గుర్తుండిపోవాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు. కాగా ఆసియా కప్ 15వ ఎడిషన్‌లో ఆడబోయే తొలి మ్యాచ్ కోహ్లికి 100వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కావడం విశేషం. దీంతో ఈ పరుగుల యంత్రంపై అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో గంగూలీ ఈ మేరకు వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక ఆదివారం(ఆగష్టు 28) పాకిస్తాన్‌తో మ్యాచ్‌తో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా.. పాకిస్తాన్‌తో ఈ టోర్నీలో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. చదవండి: Asia Cup 2022: భారత్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్! ఫ్రీగా చూడాలనుకుంటున్నారా? -
SL Vs Afg: శ్రీలంకతో మ్యాచ్‌కు ముందు నెట్స్‌లో రషీద్ ఖాన్ షాట్లు!
Asia Cup 2022 Sri Lanka vs Afghanistan: శ్రీలంకతో ఆరంభ మ్యాచ్ నేపథ్యంలో అఫ్గనిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్ షేర్ చేసిన వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఇది చూసిన అభిమానులు.. ‘‘నువ్వు ఈరోజు మ్యాచ్‌లో బంతితో పాటు.. బ్యాట్‌తోనూ మ్యాజిక్ చేయగలవని నమ్ముతున్నాం బాస్’’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. దుబాయ్ వేదికగా శ్రీలంక- అఫ్గనిస్తాన్ మ్యాచ్‌తో ఆసియా కప్-2022 టోర్నీ మరికొన్ని గంటల్లో ఆరంభం కానుంది. ఇందుకోసం ఇరు జట్లు ఇప్పటికే సన్నద్ధమయ్యాయి. ప్రతిష్టాత్మక టోర్నీ మొదటి మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో తాను నెట్స్‌లో బ్యాటింగ్ చేసిన వీడియోను రషీద్ ట్విటర్లో పంచుకున్నాడు. ఇందులో రషీద్ స్నేక్ షాట్ ఆడినట్లు కనిపిస్తోంది. ఇక ఈ వీడియోకు.. ‘‘గేమ్ డే.. అఫ్గనిస్తాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్‌కు అంతా సిద్ధమైంది’’ అంటూ అతడు క్యాప్షన్ ఇచ్చాడు. కాగా మహ్మద్ నబీ సారథ్యంలో అఫ్గన్ జట్టు లంకతో తలపడనుంది. ఆసియా కప్ ఈవెంట్‌కు ముందు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన అఫ్గనిస్తాన్‌కు ఆతిథ్య జట్టు చేతిలో ఘోర పరాభవం ఎదురైంది. 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఐర్లాండ్.. అఫ్గన్‌ను 3-2తో ఓడించి ట్రోఫీని గెలిచింది. ఇక స్పిన్నర్ రషీద్‌ఖాన్‌కు టీ20లలో అద్భుతమైన రికార్డు ఉంది. పొట్టి ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా అతడు కొనసాగుతున్నాడు. కాగా ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన రషీద్.. జట్టును టైటిల్ విజేతగా నిలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. ముఖ్యంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఆడిన షాట్‌ను అభిమానులు అంత తేలికగా మర్చిపోలేరు. ఇది ధోని హెలికాప్టర్ షాట్‌ను పోలి ఉన్నా బ్యాటర్ తల చుట్టూ కాకుండా బ్యాట్ యథాస్థానంలోకి వచ్చి చేరింది. దీనికి స్నేక్షాట్గా రషీద్ నామకరణం చేశాడు. చదవండి: Asia Cup 2022: ఆసియా కప్ ఎలా పుట్టిందో తెలుసా?.. ఆసక్తికర విషయాలు Asia Cup 2022: ఆసియా కప్ 15వ ఎడిషన్ పూర్తి షెడ్యూల్, ఇతర వివరాలు Game day all set and ready to go 🇦🇫vs🇱🇰 #asiacup #dubai #afghanistan #gameday #snakeshot pic.twitter.com/RljJIwrhxo — Rashid Khan (@rashidkhan_19) August 27, 2022 -
Asia Cup 2022: కోహ్లి భవితవ్యంపై ఆఫ్రిది కామెంట్.. ఏమన్నాడంటే!
Asia Cup 2022- Ind Vs Pak- Virat Kohli: ఆసియా కప్-2022 టోర్నీ సమీపిస్తున్న తరుణంలో భారత్- పాకిస్తాన్ మ్యాచ్ కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా.. గత కొంతకాలంగా నిలకడలేమి ఫామ్‌తో సతమతమవుతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి ఈ మెగా ఈవెంట్లో చెలరేగాలని ఆకాంక్షిస్తున్నారు. పాక్‌పై మంచి రికార్డు కలిగి ఉన్న కోహ్లి.. చిరకాల ప్రత్యర్థితో తిరిగి ఫామ్‌లోకి వస్తాడని వేచి చూస్తున్నారు. అదే సమయంలో ఈ టోర్నీలో గనుక రాణించకపోతే తమ ఆరాధ్య క్రికెటర్ భవిష్యత్తు ఏమవుతుందోననే కలవరపాటుకు గురవుతున్నారు కూడా! ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది కోహ్లి భవితవ్యంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ట్విటర్ వేదికగా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించిన ఆఫ్రిదికి కోహ్లి గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందనగా.. ‘‘ఆ విషయం అతడి చేతుల్లోనే ఉంది’’ అంటూ ఆఫ్రిది సమాధానమిచ్చాడు. ఇక కోహ్లి సెంచరీ చేసి వెయ్యి రోజులు పూర్తైంది కదా అని ఫాలోవర్ అడుగగా.. ‘‘కఠిన సమయాల్లోనే ఆటగాళ్ల గొప్పదనం బయటపడుతుంది’’ అని పేర్కొన్నాడు. కాగా ఆగష్టు 27న ఆసియా కప్-2022 టోర్నీ ఆరంభం కానుండగా.. ఆ మరుసటి రోజు టీమిండియా- పాకిస్తాన్ తలపడబోతున్నాయి. గతేడాది టీ20 ప్రపంచకప్ సమయంలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఇక కోహ్లి ఈ మెగా ఈవెంట్ కోసం ఇప్పటికే ప్రాక్టీసు మొదలుపెట్టేశాడు. కాగా భారత ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. మరోవైపు.. గాయపడిన కారణంగా పాక్ కీలక బౌలర్ షాహిన్ ఆఫ్రిది కూడా ఈ ఈవెంట్‌కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో అతడి స్థానంలో యువ పేసర్ మహ్మద్ హస్నైన్ జట్టులోకి వచ్చాడు. చదవండి: Virat Kohli:'కింగ్ కోహ్లి'.. మొన్న మెచ్చుకున్నారు.. ఇవాళ తిట్టుకుంటున్నారు -
Asia Cup 2022: మెగా టోర్నీకి జట్టును ప్రకటించిన అఫ్గనిస్తాన్
ఆసియా కప్-2022 టోర్నీకి అఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా జరుగబోయే మెగా ఈవెంట్‌కు 17 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసినట్లు మంగళవారం వెల్లడించింది. కాగా ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ సారథ్యంలోని అఫ్గనిస్తాన్ ప్రస్తుతం ఐర్లాండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడే నిమిత్తం అక్కడికి వెళ్లిన జట్టులో కేవలం ఒకే ఒక మార్పుతో నబీ బృందం ఆసియా కప్ బరిలోకి దిగనుంది. షరాఫుద్దీన్ ఆష్రఫ్ స్థానంలో ఆల్‌రౌండర్ సమీఉల్లా శిన్వారీ ప్రధాన జట్టులో చోటు దక్కించుకోగా.. అష్రఫ్‌ను రిజర్వు ప్లేయర్‌గా ఎంపిక చేశారు. కాగా శిన్వారీ 2020 మార్చిలో ఐర్లాండ్‌తో చివరిగా సారిగా అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడాడు. సుదీర్ఘ విరామం తర్వాత దాదాపు రెండున్నరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఏకంగా మెగా టోర్నీకి ఎంపికయ్యాడు. అయితే.. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా అతడిని ఆసియా కప్ జట్టుకు ఎంపిక చేసినట్లు అఫ్గనిస్తాన్ చీఫ్ సెలక్టర్ నూర్ మాలిక్జాయ్ తెలిపాడు. ఇక 17 ఏళ్ల లెఫ్టార్మ్ రిస్ట్ స్పిన్నర్ నూర్ అహ్మద్‌కు కూడా జట్టులో స్థానం దక్కడం విశేషం. కాగా ఆగష్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకు ఆసియా కప్ టోర్నీ సాగనుంది. మరోవైపు.. ఆగష్టు 17న ఆఖరి టీ20తో అఫ్గన్ జట్టు ఐర్లాండ్ పర్యటనను ముగించనుంది. ఇక ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు జట్లు రెండేసి మ్యాచ్‌లు గెలిచి 2-2తో సమంగా ఉన్నాయి. ఆసియా కప్-2022కు అఫ్గనిస్తాన్ జట్టు: మహ్మద్ నబీ(కెప్టెన్), రహ్మనుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), హజార్తుల్లా జజాయ్, నజీబుల్లా జద్రాన్, హష్మతుల్లా షాహిది, అఫ్సర్ జజాయ్, కరీం జనత్, అజ్మతుల్లా ఓమర్జాయ్, సమీఉల్లా శిన్వారీ, రషీద్ ఖాన్, ఫాజల్ హక్ ఫరూకీ, ఫరీద్ అహ్మద్ మాలిక్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, ముజీబ్ ఉర్ రెహమాన్. రిజర్వు ప్లేయర్లు: కైస్ అహ్మద్, షరాఫుద్దీన్ అష్రఫ్, నిజత్ మసూద్. చదవండి: Abudhabi Night Riders ILT20: కేకేఆర్ ఫ్యామిలీలోకి ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్.. Ind Vs Zim ODI 2022: జింబాబ్వే పర్యటనలో టీమిండియా.. పూర్తి షెడ్యూల్, జట్ల వివరాలు.. తాజా అప్డేట్లు! ACB Name Squad for Asia Cup 2022 Kabul, 16 August 2022: Afghanistan Cricket Board today announced its 17-member squad for the ACC Men's T20 Asia Cup 2022, which will be played from 27th August to 11th September in the United Arab Emirates. Read More: https://t.co/0Py8GqhiK4 pic.twitter.com/B5bK9tn2R4 — Afghanistan Cricket Board (@ACBofficials) August 16, 2022 -
Asia Cup: టీమిండియా సెలక్టర్లు చేసిన అతి పెద్ద తప్పు అదే! టాప్ స్కోరర్లను వదిలేసి..
Asia Cup 2022 India Squad: టీ20 ప్రపంచకప్-2022కు సన్నాహకంగా భావిస్తున్న మరో ప్రతిష్టాత్మక టోర్నీ ఆసియా కప్-2022నకు భారత క్రికెట్ నియంత్రణ మండలి జట్టును ఎంపిక చేసిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటు మాజీ సెలక్టర్లు, మాజీ ఆటగాళ్లతో పాటు.. అటు అభిమానులు సైతం భారత జట్టు సెలక్షన్‌పై పెదవి విరుస్తున్నారు. చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. మరి నిజంగానే ఆసియా కప్ ఈవెంట్‌కు బీసీసీఐ సెలక్ట్ చేసిన టీమిండియా మరీ అంత దారుణంగా ఉందా? ఒకవేళ రాహుల్ దూరమైతే! ఆగష్టు 27 నుంచి ఆరంభం కానున్న ఆసియా కప్‌నకు బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన జట్టును సోమవారం ప్రకటించింది. దీని ఆధారంగా.. ఎప్పటిలాగే కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఓపెనింగ్ జోడీగా బరిలోకి వచ్చే అవకాశం ఉంది. ఇక గత కొంతకాలంగా జట్టుకు దూరమైన విరాట్ కోహ్లి తిరిగి వచ్చాడు. మూడో స్థానంలో.. అతడు బ్యాటింగ్‌కు రావడం దాదాపు ఖాయమే. ఇక మిడిలార్డర్లో రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా ఉండనే ఉన్నారు. కాగా ఇప్పటి వరకు కేఎల్ రాహుల్ ఇంకా ఫిట్నెస్ నిరూపించుకోనే లేదు. ఒకవేళ అతడు గనుక ఫిట్నెస్ పరీక్షలో విఫలమైతే ఓపెనర్‌గా ఎవరు ఆడతారనేది ప్రశ్న? వాళ్లు ముగ్గురు ఉన్నారు.. మరి మిడిలార్డర్లో.. ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లండ్, వెస్టిండీస్ పర్యటనలో భాగంగా టీమిండియా బ్యాటర్లు దీపక్ హుడా, రిషభ్ పంత్, సూర్యకుమార్ యాదవ్ ఓపెనర్లుగా రంగంలోకి దిగారు. అయితే, టాపార్డర్‌లో కంటే మిడిలార్డర్లో వీరి అవసరం ఎక్కువగా కనిపిస్తోంది. ఒకవేళ ఏదేని కారణాల వల్ల రాహుల్ జట్టుకు దూరమైతే... వీరిలో ఎవరో ఒకరు ఓపెనర్‌గా వచ్చినా.. మిడిలార్డర్లో ప్రత్యామ్నాయం కనిపించడం లేదు. నిజంగా ఇది పెద్ద తప్పే! అంతర్జాతీయ టీ20లలో ఈ ఏడాది అత్యధిక పరుగులు సాధించిన భారత బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్‌ది మొదటి స్థానం. ఇప్పటి వరకు వివిధ సిరీస్‌లలో భాగమైన అతడు మొత్తంగా 449 పరుగులు(14 ఇన్నింగ్స్‌లో) చేశాడు. ఈ జాబితాలో శ్రేయస్ తర్వాతి స్థానం ఇషాన్ కిషన్‌దే. ఈ యువ ఓపెనర్ ఇప్పటి వరకు 430 పరుగులు సాధించాడు. అయితే, వీళ్లిద్దరిలో ఏ ఒక్కరిని కూడా సెలక్టర్లు పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం. శ్రేయస్ స్టాండ్ బైగా ఉన్నా.. ఇషాన్‌ను మొత్తంగా పక్కనపెట్టేశారు. ఒకవేళ వీళ్లిద్దరిలో ఒక్కరు ప్రధాన జట్టులో ఉన్నా ఇటు ఓపెనింగ్, అటు మిడిలార్డర్లో సమస్య ఉండేదే కాదు. అంతేకాదు.. వెటరన్ బ్యాటర్ దినేశ్ కార్తిక్‌కు బదులు ఇటీవల వరుస సిరీస్‌లలో రాణించిన సంజూ శాంసన్‌ను సెలక్ట్ చేసినా బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతా ‘రవి’మయం.. ఆసియా కప్-2022కు ఎంపిక చేసిన భారత జట్టులో స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాతో కలిపి నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, రవి బిష్ణోయి, యజువేంద్ర చహల్‌ను సెలక్ట్ చేశారు. అయితే, అదే సమయంలో ఇటీవల బ్యాటింగ్‌తోనూ అదరగొడుతున్న అక్షర్ పటేల్‌కు మాత్రం ప్రధాన జట్టులో చోటు ఇవ్వకపోవడం గమనార్హం. రవి బిష్ణోయిని బెంచ్‌కే పరిమితం చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక సీనియర్ స్పిన్నర్ అశ్విన్ ఐపీఎల్-2022లో పెద్దగా రాణించిన దాఖలాలు లేవు. అదే విధంగా ఇటీవలి సిరీస్‌లలోనూ తన స్థాయికి తగ్గట్టు ఆకట్టుకోలేకపోయాడు. దీంతో మాజీ సెలక్టర్ కిరణ్ మోరే వంటి వారు సహజంగానే అశ్విన్ ఎంపికను తప్పుబడుతున్నారు. చహర్ ఉన్నాడు కదా! ఈ నేపథ్యంలో అక్షర్‌ను స్టాండ్‌బైగా కాకుండా ప్రధాన జట్టుకు ఎంపిక చేసి ఉంటే బాగుండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే విధంగా.. ఒకవేళ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేయలేని పరిస్థితి తలెత్తితే.. ఆవేశ్ ఖాన్‌కు బదులు అనుభవజ్ఞుడైన ఆల్‌రౌండర్ దీపక్ చహర్ జట్టులో ఉంటే ఉపయోగకరంగా ఉంటుందని పలువురు క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, హర్షల్ పటేల్ గాయాల కారణంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భువనేశ్వర్ కుమార్‌తో పాటు అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్ పేసర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. దీపక్ చహర్‌ను సెలక్టర్లు స్టాండ్ బైగా ఎంపిక చేశారు. కాగా గాయం కారణంగా దీపక్ చహర్ ఐపీఎల్-2022కు దూరమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇంతవరకు టీమిండియా తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మరోవైపు ఆవేశ్ తనకు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. అయినప్పటికీ మెగా టోర్నీలో అతడు ఎంతవరకు రాణిస్తాడో వేచి చూడాలి. మరోవైపు.. సీనియర్ పేసర్ మహ్మద్ షమీని విస్మరించడం పట్ల కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతడిని ఎంపిక చేయాల్సిందని కొంతమంది అంటుండగా.. టీ20 ప్రపంచకప్-2022 జట్టులోనైనా చోటు ఇస్తారేమోనని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఆసియా కప్ 2022: బీసీసీఐ ప్రకటించిన భారత జట్టు రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్(వికెట్ కీపర్), దినేశ్ కార్తిక్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, యజువేంద్ర చహల్, రవి బిష్ణోయి, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్. స్టాండ్ బై ప్లేయర్లు: శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, దీపక్ చహర్ చదవండి: Asia Cup 2022: కేఎల్ రాహుల్ కోలుకున్నాడు.. కానీ..! Trent Boult: న్యూజిలాండ్ క్రికెట్‌కు భారీ షాక్.. సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తప్పుకున్న స్టార్ బౌలర్ -
APL 2022: ఏపీఎల్‌లో రాణిస్తున్న వైజాగ్ ఆటగాళ్లు
విశాఖ స్పోర్ట్స్: ఐపీఎల్.. క్రికెట్ ఆడే ప్రపంచ దేశాల్లోని ఆట గాళ్లకు ఎంతో మోజు. దేశంలో ఈ లీగ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినా పనిలేదు. రాష్ట్రాల్లోనూ ఇదే తరహాలో ప్రీమి యర్ లీగ్‌లు కొనసాగుతున్నాయి. ఐపీఎల్ స్ఫూర్తితో ఆంధ్రాలో ప్రీమియర్ లీగ్(ఏపీఎల్) ప్రారంభమైంది. లీగ్ తొలి దశ శుక్రవారంతో ముగిసింది. లీగ్‌ల్లో నాలుగు ప్రాంచైజీ జట్లు రెండేసి మ్యాచ్‌లు ఆడాయి. రాయలసీమ కింగ్స్ మూడు మ్యాచ్‌లు ఆడగా వైజాగ్ వారియర్స్ ఒక మ్యాచ్‌నే ఆడింది. దీంతో బెజవాడ టైగర్స్‌తో పాటు మిగిలిన మూడు జట్లు ఆరేసి పాయింట్లు సాధించినా.. నెట్ రన్‌రేట్‌తో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర లయన్స్ రెండో స్థానంలో, మూడు మ్యాచ్‌లాడిన రాయలసీమ కింగ్స్ మూడో స్థానంలో, గోదావరి టైటాన్స్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి. రాణిస్తున్న మన కుర్రాళ్లు ఉత్తరాంధ్ర నుంచి రెండు ప్రాంచైజీలకు అవకాశం ఇవ్వగా సెంట్రల్ ఆంధ్ర, దక్షిణాంధ్ర నుంచి మరో రెండేసి ప్రాంచైజీలకు అర్హత కల్పించారు. ఉత్తరాంధ్ర నుంచి హోం టీమ్‌గా వైజాగ్ వారియర్స్, ఉత్తరాంధ్ర లయన్స్ జట్లు ఆడుతున్నాయి. వైజాగ్ వారియర్స్‌కు విశాఖ ఆటగాళ్లు లేకున్నా.. ఉత్తరాంధ్ర లయన్స్ జట్టు కెప్టెన్‌గా భరత్‌ను, బౌలర్ అజయ్‌ను తీసుకుంది. అయితే అజయ్‌కు తొలి మ్యాచ్‌లో బాటింగ్ చేసే అవకాశం రాకుండానే జట్టు విజయం సాధించగా.. భరత్ అందుబాటులో లేడు. రెండో మ్యాచ్‌కు భరత్ అందుబాటులోకి వచ్చినా.. వర్షం అడ్డంకిగా మారి మ్యాచ్ రద్దయింది. సెంట్రల్ ఆంధ్ర నుంచి పోటీపడుతున్న రెండు జట్లకు విశాఖ కుర్రాళ్లే కెప్టెన్లుగా ముందుండి.. ఆడిన తొలి మ్యాచ్‌ల్లో జట్లను విజయతీరానికి చేర్చారు. బెజవాడ టైగర్స్‌కు అంతర్జాతీయ ఆటగాడు రికీబుయ్ ముందుండి నడపడమే కాక తొలి మ్యాచ్‌లో మూడో వికెట్ పడకుండానే విశాఖ కుర్రాడు అవినాష్‌తో కలిసి అజేయంగా ఉండి జట్టును గెలిపించాడు. బౌలర్ మనీష్ రెండు వికెట్లతో పాటు చివరి బ్యాటర్‌ను రనౌట్ చేసి ప్రత్యర్థి జట్టును తక్కువ స్కోర్‌కే నిలువరించడంలో సహకరించాడు. ఇక బి.సుమంత్(21 బంతుల్లోనే రెండు ఫోర్లతో 31 పరుగులు) ఓపెనర్‌గా వచ్చి తొలి వికెట్‌కు 66 పరుగుల(లక్ష్య ఛేదనలో సగం పరుగులు) భాగస్వామ్యాన్ని అందించాడు. టాప్ ఆర్డర్లో అవినాష్, రికీబుయ్ జోడీ వికెట్ చేజారుకుండానే జట్టును గెలిపించింది. ఇక టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో గోదావరి టైటాన్స్‌ను విశాఖ కుర్రాడు శశికాంత్ కెప్టెన్సీలో విజయతీరానికి చేర్చి శుభారంభం చేశాడు. టోర్నీలోనే తొలి అర్ధసెంచరీ నమోదు చేయడమే కాక మ్యాచ్ బెస్ట్‌గానూ నిలిచాడు. విశాఖ కుర్రాళ్లు ఓపెనర్‌గా హేమంత్, టాప్ ఆర్డర్లో నితీష్(25) రాణించారు. ఇక దక్షిణాంధ్ర జట్లు కోస్టల్ రైడర్స్, రాయలసీమ కింగ్స్‌లో ఒక్క విశాఖ ఆటగాడికి ఆడే అవకాశం రాలేదు. అటు ఐపీఎల్‌లోనే కాకుండా ఏపీఎల్‌లో సైతం స్థానిక ఆటగాళ్లు ఇతర ప్రాంచైజీ జట్లకు ఆడుతూ విజయంలో కీలకపాత్ర పోషించడం క్రీడాస్ఫూర్తికి నిదర్శనం. వరుణుడి రాకతో మ్యాచ్‌లు రద్దు ఏపీఎల్‌లో భాగంగా వైఎస్సార్ స్టేడియంలో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఉత్తరాంధ్ర లయన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బెజవాడ టైగర్స్ బ్యాటింగ్‌కు దిగింది. ఏడు ఓవర్లలో మూడు వికెట్లకు 23 పరుగుల చేసిన స్థితిలో వరుణుడు ప్రవేశించాడు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో మ్యాచ్ రద్దయింది. ఇరు జట్లకు రెండేసి పాయింట్లు చేకూరాయి. రాత్రి ఫ్లడ్‌లైట్ల వెలుతురులో ఆడాల్సిన మ్యాచ్ సైతం వర్షం కారణంగా రద్దయింది. దీంతో గోదావరి టైటాన్స్, రాయలసీమ కింగ్స్ జట్లకు చెరో రెండేసి పాయింట్లు కేటాయించారు. (క్లిక్: విశాఖ ఐటీ హిల్స్‌లో ఇన్ఫోసిస్!) -
'చేసిన పాపం ఊరికే పోదు'.. బౌలర్ తిక్క కుదిర్చిన అంపైర్
'చేసిన పాపం ఊరికే పోదంటారు'' పెద్దలు. తాజాగా విండీస్ స్టార్ క్రికెటర్ కార్లోస్ బ్రాత్‌వైట్ విషయంలో అదే జరిగింది. త్రో విసిరే సమయంలో బంతిని బ్యాటర్‌వైపు ఉద్దేశపూర్వకంగానే కొట్టినట్లు రుజువు కావడంతో బ్రాత్‌వైట్ జట్టుకు ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తూ అంపైర్ నిర్ణయం తీసుకున్నాడు. విషయంలోకి వెళితే.. విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో భాగంగా వార్విక్షైర్, డెర్బీషైర్ మధ్య మ్యాచ్ జరిగింది. డెర్బీషైర్ ఇన్నింగ్స్ 13వ ఓవర్ బ్రాత్‌వైట్ వేశాడు. 34 పరుగులతో క్రీజులో వేన్ మాడ్సన్ ఉన్నాడు. ఆ ఓవర్ మూడో బంతిని బ్రాత్‌వైట్ యార్కర్ వేయగా.. మాడ్సన్ బంతిని ముందుకు పుష్ చేశాడు. బంతిని అందుకున్న బ్రాత్‌వైట్ త్రో విసిరే ప్రయత్నం చేయగా.. బంతి మాడ్సన్ పాదానికి గట్టిగా తగిలింది. నాన్‌స్ట్రైకర్ కాల్ ఇవ్వడంతో సింగిల్ పూర్తి చేశారు. బ్రాత్‌వైట్ కూడా మాడ్సన్ను క్షమాపణ కోరాడు. ఇక్కడితో దీనికి ఫుల్స్టాప్ పడిందని అంతా భావించారు. కానీ ఇదంతా గమనించిన ఫీల్డ్ అంపైర్ బ్రాత్‌వైట్ చేసింది తప్పని.. అందుకు శిక్షగా ఐదు పరుగుల పెనాల్టీ విధిస్తున్నట్లు తెలిపాడు. లెగ్ అంపైర్‌తో విషయం చర్చించాకా బంతిని కూడా డెడ్‌బాల్‌గా పరిగణిస్తూ.. ప్రత్యర్థి జట్టు తీసిన సింగిల్‌ను కూడా అంపైర్లు రద్దు చేశారు. దీంతో ప్రత్యర్థి జట్టుకు ఐదు పరుగులు అదనంగా వచ్చాయి. ఇక బ్రాత్‌వైట్ అనవసరంగా గెలుక్కొని మూల్యం చెల్లించుకున్నట్లు.. ఆ ఓవర్లో ఎనిమిది పరుగులు సహా ఐదు పెనాల్టీ పరుగులతో మొత్తంగా 13 పరుగులు సమర్పించుకోవాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే డెర్బీషైర్ వార్విక్‌షైర్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వార్విక్ షైర్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన డెర్బీషైర్ 18.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. Not ideal for Carlos Brathwaite 😬 A 5-run penalty was given against the Bears after this incident...#Blast22 pic.twitter.com/pXZLGcEGYa — Vitality Blast (@VitalityBlast) June 19, 2022 చదవండి: అరుదైన సెంచరీల రికార్డు.. సచిన్ సర్‌తో పాటు నా పేరు కూడా: యశస్వి Cristiano Ronaldo: కోట్ల విలువైన కారుకు యాక్సిడెంట్.. రొనాల్డో క్షేమంగానే -
తొమ్మిదేళ్ల తర్వాత ప్రారంభం కానున్న టోర్నీ.. జై షా ట్వీట్ వైరల్
ACC Women's T20 Championship 2022: ఆసియా క్రికెట్ కౌన్సిల్(ఏసీసీ) మహిళల టి20 చాంపియన్‌షిప్ టోర్నీ తొమ్మిదేళ్ల తర్వాత తిరిగి ప్రారంభం కానుంది. జూన్ 17 నుంచి 25 వరకు జరగనున్న ఈ టోర్నీకి మలేషియా క్రికెట్ అసోసియేషన్ ఆతిథ్యం ఇవ్వనుంది. టోర్నీలో జరగనున్న మ్యాచ్‌లకు కిన్రారా ఓవల్, వైఎస్‌డీ యుకెఎమ్ ఓవల్‌లు వేదికలు కానున్నాయి. ఈ టర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి. యూఏఈ, మలేషియా, ఒమన్, ఖతార్, నేపాల్, హాంకాంగ్, కువైట్, బహ్రెయిన్, సింగపూర్, బూటాన్‌లు ఈ లిస్టులో ఉన్నాయి. 10 జట్లు రెండు గ్రూఫులుగా విడిపోయి మ్యాచ్‌లు ఆడనుండగా.. రెండు గ్రూఫుల నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌లో తలపడనున్నాయి. దీనికి సంబంధించి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు జై షా చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ''2013లో చివరిసారి ఏసీసీ మహిళల టి20 చాంపియన్‌షిప్‌ను నిర్వహించాం. తిరిగి తొమ్మిదేళ్ల తర్వాత జూన్ 25న టోర్నీ ఆరంభం కానుంది. ఇకపై ప్రతీ ఏడాది నిర్వహించేలా ప్లాన్ చేసుకుంటాం. ఆసియాలో మహిళల క్రికెట్ అభివృద్ధికి ఇలాంటి టోర్నీలు బాగా ఉపయోగపడుతాయి. మహిళా క్రికెటర్లు భవిష్యత్తులో మరింత రాణించేందుకు దోహద పడుతాయని చెప్పొచ్చు. అలాగే ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, థాయిలాండ్‌తో పాటు మరో రెండు జట్లతో మహిళల ఆసియాకప్ టి20 టోర్నీని కూడా త్వరలో నిర్వహించనున్నాం. ఈ టోర్నీలో పాల్గొనబోయే మిగిలిన రెండు జట్లను ఏసీసీ టి20 చాంపియన్‌లో ఫైనల్ చేరే రెండు జట్లుగా ఉంటాయి. ఆల్‌ది బెస్ట్'' అంటూ ట్వీట్ చేశాడు. I'm pleased to announce the commencement of the ACC Women's T20 Championship in Malaysia. Good luck to all ten participating teams! We're playing against each other, but playing as one. May the best team win. @ACCMedia1#AsianCricketCouncil #WomensT20Championship2022 pic.twitter.com/TsddSKA4La — Jay Shah (@JayShah) June 16, 2022 చదవండి: Viral Video: క్రికెట్ చరిత్రలో ఇలాంటి క్యాచ్ చూసి ఉండరనుకుంటా! 'థాంక్యూ రహానే.. కోహ్లిని రనౌట్ చేయకుంటే గెలిచేవాళ్లం కాదు' -
చేతిలో 8 వికెట్లు.. విజయానికి 29 పరుగులు; నెత్తిన శని తాండవం చేస్తే
చేతిలో 8 వికెట్లు.. విజయానికి కావాల్సింది 38 బంతుల్లో 29 పరుగులు.. క్రీజులో అప్పటికే పాతుకుపోయిన ఇద్దరు బ్యాటర్లు. దీన్నిబట్టి చూస్తే సదరు జట్టు కచ్చితంగా భారీ విజయం సాధిస్తుందని ఎవరైనా అంచనా వేస్తారు. కానీ మనం ఒకటి తలిస్తే విధి మరొకటి తలిచింది. శని తమ నెత్తిన పెట్టుకొని తిరుగుతున్నట్లు.. చేజేతులా ఓటమిని కొనితెచ్చుకున్న ఆ జట్టు కేవలం 23 పరుగుల వ్యవధిలో 8 వికెట్లు చేజార్చుకొని నాలుగు పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. ఈ అరుదైన ఘటన ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. శుక్రవారం రాత్రి ససెక్స్, గ్లూస్టర్షైర్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన గ్లూస్టర్షైర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. గ్లెన్ పిలిప్స్ 66, టేలర్ 46 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన ససెక్స్ జట్టు ఆరంభంలోనే టిమ్ సీఫెర్ట్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 10 పరుగులు చేసిన రవి బొపారా ఔటయ్యాడు. క్రీజులోకి వచ్చిన టామ్ అల్సోప్(82 పరుగులు).. ఫిన్ హడ్సన్(18 పరుగులు) మూడో వికెట్‌కు 70 పరుగులు జోడించడంతో ససెక్స్ కోలుకుంది. 13 ఓవర్ వరకు రెండు వికెట్ల నష్టానికి 11 8 పరుగులు చేసింది. 38 బంతుల్లో 29 పరుగులు అవసరమైన దశలో ఫిన్ హడ్సన్ స్టంప్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత అదే ఓవర్ ఆఖరి బంతికి టామ్ అల్సోప్ కూడా స్టంప్ఔట్ కావడంతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. కేవలం 23 పరుగుల తేడా వ్యవధిలో 8 వికెట్లు కోల్పోయిన ససెక్స్ 19.4 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటై కేవలం నాలుగు పరుగులతో ఓటమి చవిచూసింది. ససెక్స్ ఆట తీరుపై క్రికెట్ ఫ్యాన్స్ వినూత్న రీతిలో కామెంట్స్ చేశారు. ''నెత్తిన శని తాండవం చేస్తుంటే ఇలాగే జరుగుతుంది.. ఓడిపోవాలని రాసిపెట్టి ఉంటే ఎవరు మాత్రం ఏం చేయగలరు'' అంటూ పేర్కొన్నారు. చదవండి: ఖరీదైన కారు కొన్న వెస్టిండీస్ హిట్టర్.. డారిల్ మిచెల్ భారీ సిక్సర్.. అభిమాని బీర్ గ్లాస్లో పడ్డ బంతి.. వీడియో వైరల్! -
'క్యాచెస్ విన్ మ్యాచెస్' అని ఊరికే అనరు
'క్యాచెస్ విన్ మ్యాచెస్' అని అంటారు. తాజాగా అది మరోసారి నిరూపితమైంది. విటాలిటీ బ్లాస్ట్ టి20 టోర్నీలో భాగంగా లంకాషైర్, యార్క్‌షైర్ మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో క్యాచ్ టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. విషయంలోకి వెళితే.. యార్క్‌షైర్ విజయానికి ఆఖరి ఓవర్లో ఆఖరి బంతికి ఆరు పరుగులు కావాలి. క్రీజులో డొమినిక్ డ్రేక్స్ ఉన్నాడు. అవతలి ఎండ్‌లో డానీ లాంబ్ బౌలింగ్ చేస్తున్నాడు. సిక్స్ కొడితే మ్యాచ్ విన్ అవుతుంది.. లేదంటే యార్క్‌షైర్‌కు ఓటమి తప్పదు. ఈ దశలో డానీ లాంబ్ పూర్తిగా ఆఫ్ స్టంప్ అవతల బంతిని విసిరాడు. అయితే డొమినిక్ డ్రేక్స్ డీమ్ మిడ్‌వికెట్ మీదుగా భారీ షాట్ ఆడాడు. అతని టైమింగ్ షాట్ చూసి అంతా సిక్స్ అని భావించారు. ఇక్కడే ఊహించని ట్విస్ట్ ఎదురైంది. బౌండరీ లైన్ వద్ద టామ్ హార్ట్లే సూపర్ క్యాచ్ అందుకున్నాడు. అయితే లైన్ తొక్కాడేమోనన్న చిన్న అనుమానం ఉండడంతో ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌ను ఆశ్రయించాడు. రిప్లేలో టామ్ హార్టీ చిన్న మిస్టేక్ కూడా చేయకుండా క్యాచ్‌ను ఒడిసిపడినట్లు తేలడంతో ఔట్ ఇచ్చాడు. దీంతో యార్క్‌షైర్ విజయానికి ఆరు పరుగుల దూరంలో ఆగిపోయింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తొలుత బ్యాటింగ్ చేసిన లంకాషైర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. టిమ్ డేవిడ్(32 బంతుల్లో 66), క్రాప్ట్ 41, జెన్నింగ్స్ 42 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన యార్క్‌షైర్ ఇన్నింగ్స్‌లో టామ్ కోహ్లెర్ 77, డేవిడ్ విల్లీ 52 పరుగులతో మెరిసినప్పటికి లాభం లేకుండా పోయింది. చదవండి: European T10 League: హతవిధి.. నవ్వాలో ఏడ్వాలో అర్థం కాని స్థితిలో! UNBELIEVABLE DRAMA!!! Tom Hartley catches on the boundary to win it for @lancscricket!!#Blast22 #RosesT20 pic.twitter.com/StKY6rcv5T — Vitality Blast (@VitalityBlast) June 8, 2022 -
వీరోచిత సెంచరీ.. జట్టును మాత్రం ఓటమి నుంచి రక్షించలేకపోయాడు
న్యూజిలాండ్ స్టార్ టిమ్ సీఫెర్ట్ విటాలిటీ టి20 బ్లాస్ట్ టోర్నమెంట్లో సూపర్ సెంచరీతో మెరిశాడు. ససెక్స్ తరపున ఆడుతున్న టిమ్ సీఫెర్ట్ సెంచరీ(56 బంతుల్లో 100 నాటౌట్, 9 ఫోర్లు, 5 సిక్సర్లు) జట్టును ఓటమి నుంచి మాత్రం కాపాడలేకపోయింది. విషయంలోకి వెళితే.. శనివారం రాత్రి హాంప్‌షైర్, ససెక్స్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన హాంప్‌షైర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఓపెనర్లు జేమ్స్ విన్స్(65), బెన్ మెక్డొర్మెట్ 60 పరుగులతో చెలరేగారు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 124 పరుగులు జత చేయడంతో హాంప్‌షైర్ భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ససెక్స్.. టిమ్ సీఫెర్ట్ మినహా మిగతావారు పెద్దగా రాణించలేకపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో హాంప్‌షైర్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా సీఫెర్ట్ ఆఖరి వరకు నాటౌట్‌గా నిలిచి చివరి బంతికి సెంచరీ పూర్తి చేసుకున్నప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా సీఫెర్ట్ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మధ్యలో డిల్రే రావ్లిన్స్ 32 పరుగులతో నిలదొక్కుకోవడంతో ఒక దశలో హాంప్‌షైర్ గెలుస్తుందనే ఆశలు కలిగాయి. కానీ రావ్లిన్స్ ఔట్ కావడం.. సీఫెర్ట్‌పై ఒత్తిడి పడడం జట్టు విజయాన్ని దెబ్బ తీసింది. చదవండి: Mitchell Marsh: 'భారత్‌లో నాకు శాపం తగిలింది'.. ఆసీస్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు Ravi Shastri Vs Javed Miandad: రవిశాస్త్రి, మియాందాద్ల గొడవకు కారణమైన 'ఆడి' కారు.? Runs: 1️⃣0️⃣0️⃣* Fours: 9️⃣ Sixes: 5️⃣ That is a fantastic innings from Tim Seifert 👏#Blast22 | @SussexCCC pic.twitter.com/FxRlzGYlbf — Vitality Blast (@VitalityBlast) June 4, 2022 -
ఆ బ్యాటర్ పని అయిపోందన్నారు.. సెంచరీతో నోరు మూయించాడు
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు క్రిస్ లిన్ టి20 బ్లాస్ట్‌లో సూపర్ సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో క్రిస్ లిన్ నార్తంప్టన్‌షైర్ తరపున క్రిస్ లిన్ ఈ సీజన్లో అరంగేట్రం చేశాడు. సీజన్లో నాలుగో మ్యాచ్ ఆడుతున్న లిన్.. లీస్టర్‌షైర్‌తో మ్యాచ్‌లో 66 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 106 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. క్రిస్ లిన్ టి20 కెరీర్లో ఇది మూడో సెంచరీ. అతని ధాటికి నార్తంప్టన్ 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ టోర్నీకి ముందు లిన్ పని అయిపోయిందని.. అతను రాణించే అవకాశం లేదని విమర్శలు వచ్చాయి. అయితే తనపై వచ్చిన విమర్శలన్నింటికి క్రిస్ లిన్ తన బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన నార్తంప్టన్‌షైర్ 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. తొలి వికెట్‌కు మరో ఓపెనర్ బెన్ కరన్(31)తో కలిసి 109 పరుగలు భాగస్వామ్యం నెలకొల్పిన లిన్ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత లిన్‌కు జేమ్స్ నీషమ్ తోడయ్యాడు. ఐపీఎల్ నుంచి నేరుగా టి20 బ్లాస్ట్‌లో అడుగుపెట్టిన నీషమ్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే మెరిశాడు. 30 బంతుల్లోనే 75 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన లీస్టర్‌షైర్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. స్కాట్ స్టీల్ 64 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: Liam Livingstone: బౌలర్లు అయిపోయారు.. పనిచేసేవాళ్లను కూడా వదిలిపెట్టవా! A special innings from a special player @lynny50 💯 #Blast22 | @NorthantsCCC pic.twitter.com/NImOepuOHU — Vitality Blast (@VitalityBlast) June 1, 2022 -
బౌలర్లు అయిపోయారు.. పనిచేసేవాళ్లను కూడా వదిలిపెట్టవా!
భారీ సిక్సర్లకు పెట్టింది పేరు.. ఇంగ్లండ్ విధ్వంసకర ఆటగాడు లియామ్ లివింగ్‌స్టోన్. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరపున ప్రాతినిధ్యం వహించిన లివింగ్‌స్టోన్ సీజన్ మొత్తం భారీ సిక్సర్లతో అలరించాడు. తాజాగా అదే టెంపోను టి20 బ్లాస్ట్‌లోనూ కొనసాగిస్తున్నాడు. ఇంగ్లండ్ వేదికగ జరుగుతున్న విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో లంకాషైర్ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న లివింగ్‌స్టోన్ బౌలర్లను ఊచకోత కోస్తున్నాడు. ఏ మాత్రం జాలీ, దయ లేకుండా నిర్దాక్షిణ్యంగా భారీ సిక్సర్లు బాదుతు చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పటికే టోర్నీలో అత్యంత భారీ సిక్స్ లివింగ్‌స్టోన్ పేరిటే ఉంది. తాజాగా బుధవారం రాత్రి లంకాషైర్, డెర్బీషైర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ 46 బంతుల్లోనే 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 75 పరుగులు చేశాడు. అయితే లివింగ్‌స్టోన్ కొట్టిన ఒక భారీ సిక్స్ స్టేడియం అవతల ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేస్తున్న దగ్గరపడింది. అయితే బంతి ఎక్కడ పడింతో తెలియకపోడంతో ఆటకు కాసేపు అంతరాయం ఏర్పడింది. వర్క్‌లో ఉన్న బిల్డర్లు కూడా పని ఆపేసి బంతికోసం వెతికారు. చివరకు ఒక గుంత పక్కడ కనిపించడంతో బంతిని అందుకొని గ్రౌండ్లోకి విసిరేశారు. అప్పటికే కాచుకు కూర్చొన్న అంపైర్ పరిగెత్తుకెళ్లి బాల్‌ను తీసుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. లివింగ్‌స్టోన్ విధ్వంసం దాటికి లంకాషైర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన డెర్బీషైర్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 202 పరుగులు మాత్రమే చేసి 17 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. డెర్బీషైర్ ఇన్నింగ్స్‌లో లూస్ డూ ప్లూయ్ 59, లుయిస్ రీస్ 55 పరుగులు చేశారు. చదవండి: Mayank Agarwal:'కెప్టెన్సీ భారం మంచి బ్యాటర్‌ను చంపేసింది' T20 Blast 2022: భారీ సిక్సర్.. బర్గర్ వ్యాన్‌లోకి దూసుకెళ్లిన బంతి Liam Livingstone is starting to tee off! 💥 Watch him bat LIVE ➡️ https://t.co/fvUbVrnZuz#Blast22 pic.twitter.com/tl6iEYZzZN — Vitality Blast (@VitalityBlast) June 1, 2022 Shoutout to the builders who helped retrieve the match ball 🤣#Blast22 https://t.co/1cKEDkFWVQ pic.twitter.com/wWGKexREW0 — Vitality Blast (@VitalityBlast) June 1, 2022 -
భారీ సిక్సర్.. బర్గర్ వ్యాన్‌లోకి దూసుకెళ్లిన బంతి
టి20 క్రికెట్ అంటేనే హిట్టింగ్‌కు మారుపేరు. క్రీజులో ఉన్నంతసేపు బ్యాటర్లు ఫోర్లు, సిక్సర్లు బాదడమే లక్ష్యంగా పెట్టుకుంటారు. పనిలో పనిగా బ్యాటర్లు కొట్టే సిక్సర్లు ఒకసారి స్టేడియం అవతల పడితే.. మరికొన్ని సార్లు మ్యాచ్ చూడడానికి వచ్చే ప్రేక్షకుల తలల పగిలేలా చేశాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిక్సర్ మాత్రం కాస్త విచిత్ర పద్దతిలో వెళ్లింది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టి20 బ్లాస్ట్ టోర్నమెంట్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్లో బ్యాట్స్మెన్లు అవలీలగా భారీ సిక్సర్లు బాదుతున్నారు. తాజాగా మే 30న హాంప్‌షైర్, సోమర్సెట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. హాంప్‌షైర్ ఇన్నింగ్స్ 13వ ఓవర్లో జేమ్స్ ఫుల్లర్ వాండర్‌మెర్వ్ బౌలింగ్‌లో మిడ్ వికెట్ మీదుగా కళ్లు చెదిరే సిక్స్ కొట్టాడు. భారీ ఎత్తులో వెళ్లిన సిక్స్ నేరుగా స్టాండ్స్‌లో బర్గర్ వ్యాన్‌లోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ ప్రేక్షకులు ఎక్కువ లేకపోవడంతో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. కాగా బర్గర్ సర్వ్ చేస్తున్న వ్యక్తి వ్యాన్‌లోకి దూసుకొచ్చిన బంతిని చేతిలోకి తీసుకొని ఒక స్టిల్ ఇవ్వడం మాత్రం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే జేమ్స్ ఫుల్లర్ 42 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడినప్పటికి హాంప్‌షైర్ 123 పరుగులకే ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన సోమర్సెట్ 25 బంతులు మిగిలిఉండగానే ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. చదవండి: 'అవమానాలు తట్టుకుని నా భర్త విజయం సాధించాడు.. అందుకే' ఐదేళ్ల స్నేహం! వివాహ బంధంతో ఒక్కటైన ఇంగ్లండ్ మహిళా క్రికెటర్లు James Fuller gets hold of this 😳@James_Fuller246 | @hantscricket | #Blast22 pic.twitter.com/jB2ke5mRuT — Vitality Blast (@VitalityBlast) May 31, 2022 Guess which player hit the match ball into a burger van at the Ageas Bowl tonight? 😆#Blast22 pic.twitter.com/YXBICflW3J — Vitality Blast (@VitalityBlast) May 30, 2022 -
అదృష్టం బాగుంది.. కొంచెమైతే పరువు పోయేదే!
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టి20 బ్లాస్ట్ టోర్నమెంట్లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. లంకాషైర్, యార్క్‌షైర్ మధ్య మ్యాచ్‌లో ఫీల్డర్ క్యాచ్ అందుకునే క్రమంలో ప్యాంట్ జారిపోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యార్క్‌షైర్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో విజయానికి 13 పరుగులు కావాల్సి ఉంది. అయితే మరో రెండు బంతుల్లో ఆరు పరుగులు అవసరమైన దశలో లంకాషైర్ బౌలర్ హై ఫుల్‌టాస్ వేశాడు. క్రీజులో ఉన్న షాదాబ్ సిక్స్ కొట్టబోయే ప్రయత్నం చేశాడు. బంతి బ్యాట్ ఎడ్జ్‌ను తాకి గాల్లోకి లేచింది. మిడాఫ్ నుంచి పరిగెత్తుకొచ్చిన డేన్ విలా క్యాచ్ అందుకునే ప్రయత్నం చేసినప్పటికి మిస్ అయింది. దీంతో బంతిని తీసుకోవడానికి పైకి లేచిన డేన్ ప్యాంట్ ఒక్కసారిగా కిందకు జారింది. షాక్ తిన్న డేన్ విలా.. ''ఎవరైనా చూశారేమో..నాకు సిగ్గేస్తుందన్న'' తరహాలో అక్కడే కూలబడ్డాడు. ఆ తర్వాత పైకి లేచి ప్యాంటును సర్దుకొని బంతిని విసిరేశాడు. ఈ వీడియోనూ విటాలిటీ బ్లాస్ట్ తన ట్విటర్లో షేర్ చేసింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్.. ''అరె కొంచమైతే పరువు మొత్తం పోయేదే.. క్యాచ్ పట్టడం సంగతి దేవుడెరుగు.. ముందు పరువు పోయేది'' అంటూ కామెంట్స్ చేశారు. ఇక లంకాషైర్, యార్క్‌షైర్ మధ్య మ్యాచ్ టైగా ముగిసింది. యార్క్‌షైర్‌కు చివరి ఓవర్లో విజయానికి 13 పరుగులు అవసరం కాగా.. 12 పరుగులు మాత్రమే చేయడంతో మ్యాచ్ డ్రా అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన లంకాషైర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఫిలిప్ సాల్ట్ 41 బంతుల్లో 59 పరుగులు చేశాడు. ఇక టి20 బ్లాస్ట్ టోర్నమెంట్లో యార్క్‌షైర్ రెండో స్థానంలో ఉండగా.. లంకాషైర్ ఏడో స్థానంలో ఉంది. చదవండి: Paul Stirling: ఒక్క ఓవర్లో 34 పరుగులు.. అయినా మొహంలో చిరాకే! If the #RosesT20 didn't have enough drama... Dane Vilas had an unfortunate moment 😂#Blast22 pic.twitter.com/WBq2gSpMRx — Vitality Blast (@VitalityBlast) May 28, 2022 -
ఒక్క ఓవర్లో 34 పరుగులు.. అయినా మొహంలో చిరాకే!
ఐర్లాండ్ స్టార్ బ్యాటర్ పాల్ స్టిర్లింగ్ టి20 క్రికెట్లో తాను ఎంత ప్రమాదకర ఆటగాడో మరోసారి రుచి చూపించాడు. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టి20 బ్లాస్ట్ టోర్నమెంట్లో పాల్ స్టిర్లింగ్ 51 బంతుల్లోనే 119 పరుగులు చేశాడు. స్టిర్లింగ్ ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. బర్మింగ్హమ్ బేర్స్, నార్త్ హాంట్స్ మధ్య మ్యాచ్‌లో ఇది చోటుచేసుకుంది. కాగా స్టిర్లింగ్ ఇన్నింగ్స్‌లో హైలైట్ అయింది మాత్రం ఒకే ఓవర్లో 34 పరుగులు బాదడం. ఒక్క ఓవర్లో అన్ని పరుగులు బాదినప్పటికి పాల్ స్టిర్లింగ్ మొహంలో నవ్వు కంటే చిరాకే ఎక్కువగా కనిపించింది. విషయంలోకి వెళితే.. జేమ్స్ సేల్స్ బౌలింగ్‌లో పాల్ స్టిర్లింగ్ వరుసగా 6,6,6,6,6,4 బాది మొత్తంగా 34 పరుగులు పిండుకున్నాడు. ఆ ఓవర్ మొత్తం జేమ్స్ సేల్స్ షార్ట్ బాల్స్ వేయగా.. తొలి ఐదు బంతులను సిక్సర్లుగా మలిచాడు. మరొక సిక్సర్ కొడితే ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టిన బ్యాటర్‌గా చరిత్ర సృష్టించే అవకాశం వచ్చేది. కానీ స్టిర్లింగ్ తృటిలో ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. జేమ్స్ సేల్స్ తన ఆరో బంతిని కూడా షార్ట్ బాల్ వేసినప్పటికి యాంగిల్ మారడం.. స్టిర్లింగ్ బ్యాట్ ఎడ్జ్‌ను తాకి డీప్ థర్డ్‌మన్ దిశగా బౌండరీ వెళ్లింది. దీంతో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్టలేకపోయాననే బాధ పాల్ స్టిర్లింగ్ మొహంలో స్పష్టంగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టి20 క్రికెట్లో మూడో సెంచరీ అందుకున్న స్టిర్లింగ్ పనిలో పనిగా 7వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఐర్లాండ్ తరపున ఈ ఘనత సాధించిన తొలి బ్యాటర్‌గా పాల్ స్టిర్లింగ్ చరిత్ర సృష్టించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. వర్షం అంతరాయం కలిగించడంతో 16 ఓవర్లకు మ్యాచ్‌ను కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన బర్మింగ్హమ్ బేర్స్ పాల్ స్టిర్లింగ్ దాటికి 3 వికెట్లు కోల్పోయి 207 పరుగుల భారీస్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన నార్త్ హంట్స్ 14.2 ఓవర్లలో 81 పరుగులకే కుప్పకూలింది. చదవండి: RCB: మరో దక్షిణాఫ్రికాలా తయారైంది.. ఇంకా ఎన్నేళ్లు నిరీక్షించాలో! Alastair Cook: 15 ఏళ్ల కుర్రాడి ముందు 12 ఏళ్ల అనుభవం పనికిరాలేదు 6️⃣6️⃣6️⃣6️⃣6️⃣4️⃣ - 34 from an over!@stirlo90 is a cheat code 😲 #Blast22 pic.twitter.com/Sy7ByS4wwm — Vitality Blast (@VitalityBlast) May 26, 2022 -
T20 Trophy: హైదరాబాద్‌పై ఆంధ్ర జట్టు గెలుపు
Senior Women's T20 Trophy 2022- పుదుచ్చేరి: జాతీయ సీనియర్ మహిళల టి20 క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్ర జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేసింది. ఎలైట్ గ్రూప్ ‘ఎ’లో భాగంగా మంగళవారం హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఆంధ్ర జట్టు 26 పరుగుల ఆధిక్యంతో గెలిచింది. తొలుత ఆంధ్ర జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 130 పరుగుల స్కోరు చేసింది. ఓపెనర్ ఎన్.అనూష (54 బంతుల్లో 61 నాటౌట్; 7 ఫోర్లు) రాణించింది. హైదరాబాద్ బౌలర్ జి.త్రిష రెండు వికెట్లు తీసింది. 131 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరా బాద్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. ఓపెనర్ జి.త్రిష (56 బంతుల్లో 56 నాటౌట్; 6 ఫోర్లు) మినహా మిగతావారు విఫలమయ్యారు. ఆంధ్ర బౌలర్లలో శరణ్య గద్వాల్ (3/13), సీహెచ్ ఝాన్సీలక్ష్మి (2/24) హైదరాబాద్‌ను దెబ్బ తీశారు. చదవండి: IPL 2022: సెంచరీ మిస్.. అయితేనేం జట్టును గెలిపించాడు! జోష్‌లో బెంగళూరు! -
సిక్స్ కొడితే ఫైనల్‌కు.. బౌలర్‌కు హ్యాట్రిక్; ఆఖరి బంతికి ట్విస్ట్
ఆ జట్టుకు చేతిలో ఆఖరి వికెట్.. సిక్స్ కొడితే నేరుగా ఫైనల్లోకి.. అవతలేమో హ్యాట్రిక్‌తో సూపర్ ఫామ్‌లో ఉన్న బౌలర్.. ఇక్కడ చూస్తే ఒక టెయిలెండర్ బ్యాట్స్‌మన్.. అంత ఫామ్‌లో ఉన్న బౌలర్ బౌలింగ్‌లో ఆఖరి బంతికి సిక్స్ కొట్టడం అంత తేలికైన విషయం కాదు. ఇంకేం గెలుస్తారులే అని మనం అనుకునేలోపూ అసాధ్యం సుసాధ్యమైంది. జట్టులోని 11వ బ్యాట్స్‌మన్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టి సగర్వంగా ఫైనల్‌కు చేర్చాడు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ కింగ్స్గ్రూవ్ స్పోర్ట్స్ టి20 కప్‌లో చోటుచేసుకుంది. చదవండి: WI vs SA: సూపర్ ఓవర్లో వెస్టిండీస్ వీర బాదుడు.. 3సిక్స్‌లు, 2ఫోర్లతో విషయంలోకి వెళితే.. న్యూసౌత్ వేల్స్ వేదికగా మోస్మన్తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో యునివర్సిటీ ఆఫ్ న్యూసౌత్‌వేల్స్ క్రికెట్ క్లబ్ 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగింది. ఆఖరి ఓవర్లో ఏడు పరుగులు చేయాల్సి ఉంది. న్యూ సౌత్‌వేల్స్ కచ్చితంగా గెలుస్తుందని అంతా భావించారు.. కానీ హైడ్రామా నెలకొంది. ఆ ఓవర్ వేసిన జేక్ టర్నర్ తొలి బంతికి పరుగులివ్వలేదు. ఇక వరుసగా రెండు, మూడు, నాలుగు బంతుల్లో వరుసగా వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఇక రెండు బంతుల్లో విజయానికి ఏడు పరుగులు అవసరమయ్యాయి. ఐదో బంతికి డెక్లన్ సింగిల్ తీసి మెక్లీన్కు స్ట్రైక్ ఇచ్చాడు. మెక్లీన్ అప్పుడే వచ్చిన 11వ బ్యాట్స్‌మన్.. ఆఖరి బంతికి సిక్స్ కొడితేనే జట్టు ఫైనల్‌కు చేరుతుంది. ఉత్కంఠగా మారిన వేళ టర్నర్ ఫుల్ లెంగ్త్ డెలివరీని వేశాడు. అంతే బంతి మంచి టైమింగ్‌తో రావడంతో మెక్లీన్ లెగ్‌సైడ్ దిశగా భారీ షాట్ ఆడాడు. కట్‌చేస్తే.. సిక్స్ పడింది.. ఇంకేముంది బ్యాటింగ్ సైడ్ టీమ్‌లో సంబరాలు షురూ అయ్యాయి. ఎవరు ఊహించని రీతిలో న్యూసౌత్‌వేల్స్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు చేరుకుంది. ఒకే ఒక్క సిక్స్‌తో మెక్లీన్ ఇప్పుడు హీరోగా మారిపోయాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: టీమిండియాపై విజయం మాదే.. విండీస్ పవర్ ఏంటో చూపిస్తాం: హోల్డర్ Your number 11 walks to the crease. He needs 6️⃣ runs to win from 1️⃣ ball in the Semi Final. AND the bowler has just taken a hat-trick. pic.twitter.com/0acu5a3xJt — MyCricket (@MyCricketAus) January 26, 2022 -
Babar Azam: బ్యాట్ నేలకేసి కొట్టాడు.. ఆ తర్వాత సెంచరీతో చెలరేగాడు
Babar Azam Smashes Pitch Out Of Frustration: పాక్‌లో జరుగుతున్న నేషనల్ టీ20 కప్‌లో భాగంగా నార్త్రన్ పంజాబ్, సెంట్రల్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సెంట్రల్ పంజాబ్ ఓపెనర్, పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ ఎన్నడూ లేని విధంగా సహనం కోల్పోయి బ్యాట్‌తో నేలకేసి గట్టిగా కొట్టాడు. ప్రత్యర్ధి బౌలర్ ఇమాద్ వసీంను సమర్థవంతంగా ఎదుర్కోలేక బాబర్ ఈ అనూహ్య చర్యకు పాల్పడ్డాడు. అనంతరం సెంచరీతో చెలరేగిన అతను.. తన జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. ఈ మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగిన బాబర్.. 63 బంతుల్లో 105 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 11 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. బాబర్ ధాటికి సెంట్రల్ పంజాబ్ జట్టు నిర్ణీత ఓవర్లలో 200 పరుగులు చేసింది. అనంతరం హైదర్ అలీ (53 బంతుల్లో 91) విధ్వంసం ధాటికి నార్త్రన్ పంజాబ్ సునాయాసంగా లక్ష్యాన్ని చేరుకుంది. కాగా, ఈ టీ20 టోర్నీలో బాబర్ ఆజమ్ సూపర్ ఫామ్‌లో కొనసాగుతున్నాడు. 6 మ్యాచ్‌ల్లో 71.50 సగటుతో 286 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా భారత్-పాక్‌లు అక్టోబర్ 24న తలపడనున్నారు. చదవండి: బాలీవుడ్లో మరో స్టార్ క్రికెటర్ బయోపిక్.. డైరెక్ట్ చేయనున్న కరణ్ జోహార్..? -
ఐపీఎల్లో ప్రత్యర్థులు.. అక్కడ మాత్రం మిత్రులు
లండన్: ఆసీస్ విధ్వంసకర ఆటగాడు డేవిడ్ వార్నర్, ఇంగ్లండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్.. విండీస్ విధ్వంసం ఆండీ రసెల్ ఒక జట్టుకు ఆడడం ఎప్పుడైనా చూశారా. అంతర్జాతీయంగా వేర్వేరు జట్లకు ఆడే వీరు ఐపీఎల్ సహా ఇతర లీగ్‌ల్లోనూ ప్రత్యర్థులుగా తలపడ్డారు. అయితే త్వరలోనే వీరు ముగ్గురు ఒకే జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు.. కాకపోతే హండ్రెడ్ 2021 టోర్నమెంట్ వరకు ఆగాల్సిందే. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు సంయుక్తంగా హండ్రెడ్ 2021 టోర్నమెంట్‌ను నిర్వహించనున్నాయి. వాస్తవానికి గతేడాది జూన్‌లోనే ఈ టోర్నమెంట్ జరగాల్సింది. కానీ కరోనా మహమ్మారితో టోర్నీ నిర్వహణ వాయిదా పడింది. తాజాగా ఐపీఎల్ 2021 సీజన్ ముగిసిన తర్వాత జూలై 2021లో ఈ టోర్నీ ఆరంభం కానుంది. కాగా టోర్నీలో పురుషులతో పాటు మహిళల మ్యాచ్‌లు కూడా సమానంగా జరగనున్నాయి. హండ్రెడ్ 2021 పేరుతో నిర్వహించనున్న ఈ టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటాయి. బర్మింగ్హమ్ ఫోనిక్స్, ట్రెంట్ రాకెట్స్, ఓవల్ ఇన్విసిబల్స్, సౌతర్న్ బ్రేవ్, లండన్ స్పిరిట్, వేల్ష్ ఫైర్, నార్తన్ సూపర్ చార్జర్స్, మాంచెస్టర్ ఒరిజనల్స్ టోర్నీలో జట్లుగా ఉండనున్నాయి. కాగా జోఫ్రా ఆర్చర్, వార్నర్, ఆండీ రసెల్‌లు సౌతర్న్ బ్రేవ్‌లో ఆడనున్నారు. అయితే వార్నర్ గజ్జల్లో గాయం కారణంగా ఐపీఎల్ ఆడేది అనుమానంగా ఉంది. 6-9 నెలల విశ్రాంతి అవసరం అని స్వయంగా వార్నరే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఐపీఎల్లో వార్నర్ ఎస్ఆర్హెచ్కు, ఆర్చర్ రాజస్తాన్ రాయల్స్‌కు, ఆండీ రసెల్ కేకేఆర్‌కు ఆడుతున్న సంగతి తెలిసిందే. చదవండి: సన్‌రైజర్స్‌కు వార్నర్ షాక్ ఇవ్వనున్నాడా! That's it for The Hundred Men's Draft 2021! 🖋️ Happy with how your team is looking? 👇 pic.twitter.com/j7c2KdMHSJ — The Hundred (@thehundred) February 23, 2021 -
ఐపీఎల్ వేలం.. బరిలో అర్జున్ టెండూల్కర్
చెన్నై: వివాదాస్పద భారత క్రికెటర్ శ్రీశాంత్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్లో మళ్లీ ఆడేందుకు తహతహలాడుతున్నాడు. ఈ సీజన్ కోసం నిర్వహించే వేలంలో పాల్గొనేందుకు రూ. 75 లక్షల కనీస ధరతో తన పేరు నమోదు చేసుకున్నాడు. కానీ పోటీ తీవ్రంగా ఉన్న ప్రస్తుత తరుణంలో ఫిక్సింగ్ మరకలున్న అతనిపై ఏ ఫ్రాంచైజీ కన్నెత్తి చూస్తోందో వేచి చూడాలి. భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ కూడా ఈ వేలంలో తన పేరు నమోదు చేసుకున్నాడు. అర్జున్ రూ. 20 లక్షల కనీస ధరతో పేరును రిజిస్టర్ చేసుకున్నాడు. ఈ నెల 18న జరిగే ఆటగాళ్ల వేలానికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రంగం సిద్ధం చేసింది. మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీల్లో కేవలం 61 ఖాళీలే ఉన్న ఈ సీజన్ కోసం 1,097 మంది ఆటగాళ్లు వేలంలో పోటీపడుతున్నారు. మిషెల్ స్టార్క్, ప్యాటిన్సన్ (ఆస్ట్రేలియా), జో రూట్ (ఇంగ్లండ్)లాంటి అంతర్జాతీయ స్టార్లు ఈ వేలంలో పాల్గొనడం లేదు. వేలం బరిలో 814 మంది భారత ఆటగాళ్లు (21 అంతర్జాతీయ క్రికెటర్లు, 793 అన్క్యాప్డ్ ప్లేయర్లు) ఉన్నారు. 283 మంది విదేశీ ఆటగాళ్లు ఫ్రాంచైజీల కంటపడేందుకు బోర్డు వద్ద తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆటగాళ్ల నమోదుకు గడువు గురువారంతో ముగియడంతో బీసీసీఐ వేలం జాబితాను శుక్రవారం విడుదల చేసింది. విదేశాల నుంచి అందుబాటులో ఉన్న క్రికెటర్లలో వెస్టిండీస్ ఆటగాళ్లే (56 మంది) ఎక్కువ ఉన్నారు. ఆ తర్వాత సంఖ్య ఆస్ట్రేలియా (42), దక్షిణాఫ్రికా (38) ఆటగాళ్లది. ప్రస్తుతమున్న 61 ఖాళీల్లో విదేశీ ఆటగాళ్లతోనే 22 స్థానాల్ని భర్తీ చేసుకోవాల్సి ఉంటుంది. రూ. 2 కోట్ల ధరలో... హర్భజన్ సింగ్, కేదార్ జాదవ్ (భారత్), స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్ (ఆస్ట్రేలియా), షకీబుల్ హసన్ (బంగ్లాదేశ్), మొయిన్ అలీ, బిల్లింగ్స్, ప్లంకెట్, జేసన్ రాయ్, మార్క్ వుడ్ (ఇంగ్లండ్), ఇంగ్రామ్ (దక్షిణాఫ్రికా). ఏ దేశం నుంచి ఎందరంటే... వెస్టిండీస్ (56), ఆస్ట్రేలియా (42), దక్షిణాఫ్రికా (38), శ్రీలంక (31), అఫ్గానిస్తాన్ (30), న్యూజిలాండ్ (29), ఇంగ్లండ్ (21), యూఏఈ (9), నేపాల్ (8), స్కాట్లాండ్ (7), బంగ్లాదేశ్ (5), ఐర్లాండ్ (2), అమెరికా (2), జింబాబ్వే (2), నెదర్లాండ్స్ (1). -
ధోని తరహాలో.. చివరి బంతికి సిక్స్ కొట్టి
అహ్మదాబాద్: టీ20 అంటేనే ఉత్కంఠకు పేరు... ఇన్నింగ్స్ చివరి బంతి వరకు ఇరు జట్ల మధ్య విజయం దోబూచులాడుతూనే ఉంటుంది. అంతర్జాతీయ టీ20లు, ఐపీఎల్, బిగ్‌బాష్ వంటి టోర్నీలలో జరిగిన కొన్ని మ్యాచ్‌లు అభిమానులకు థ్రిల్ కలిగించడమే గాక వారిని మునివేళ్లపై నిలబెట్టేలా చేశాయి. తాజాగా దేశవాలీ టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా బుధవారం బరోడా, హర్యానాల మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ థ్రిల్లర్‌ను తలపించింది. బరోడా బ్యాట్స్‌మన్ విష్ణు సోలంకి చివరి బంతికి ధోని తరహాలో హెలికాప్టర్ సిక్స్ కొట్టి జట్టును సెమీస్ చేర్చాడు. మొదట బ్యాటింగ్ చేసిన హర్యానా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బరోడా జట్టు ఆరంభం నుంచి దూకుడుగానే ఆడింది. ఓపెనర్ స్మిత్ పటేల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విష్ణు సోలంకి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 5 సిక్సర్లు, 4 ఫోర్లతో 46 బంతుల్లోనే 71 పరుగులతో వీరవిహారం చేశాడు. సోలంకి దాటిని చూస్తే మాత్రం బరోడా ఈజీగానే మ్యాచ్‌ను గెలవాల్సి ఉండేది. కానీ ఇదే సమయంలో 19వ ఓవర్ వేసిన హర్యానా బౌలర్ మోహిత్ శర్మ అద్భుతమైన బౌలింగ్ చేశాడు. మోహిత్ వేసిన ఓవర్లో కేవలం 4 పరుగులు మాత్రమే రావడంతో చివరి ఓవర్‌కు బరోడా జట్టు విజయానికి 6 బంతుల్లో 18 పరుగులు కావాల్సి వచ్చింది.చదవండి: 'పైన్‌ను తీసేయండి.. అతన్ని కెప్టెన్ చేయండి' ఇన్నింగ్స్ చివరి ఓవర్ వేసిన సుమిత్ కుమార్ వేయగా.. మొదటి బంతికి సింగిల్ వచ్చింది. రెండో బంతిని విష్ణు సోలంకి ఇచ్చిన కష్టతరమైన క్యాచ్‌ను సుమీత్ వదిలేశాడు. ఆ తర్వాత బంతికి సింగిల్ రావడంతో బరోడాకు 3 బంతుల్లో 15 పరుగులు కావాల్సి వచ్చింది. నాలగో బంతిని సిక్స్ కొట్టిన సోలంకి.. ఐదో బంతిని ఫోర్‌గా మలిచాడు. ఇక చివరి బంతికి 5 పరుగులు అవసరమైన దశలో సోలంకి.. ధోని ఫేవరెట్ షాట్ అయిన హెలికాప్టర్ సిక్స్‌తో జట్టును ఒంటిచేత్తో సెమీస్‌కు చేర్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సోలంకి ఆడిన హెలికాప్టర్ షాట్‌ను చూస్తే ధోని మెచ్చుకోకుండా ఉండలేడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.చదవండి: టాప్‌లో కోహ్లి.. రెండుకే పరిమితమైన రోహిత్ — varun seggari (@SeggariVarun) January 27, 2021 -
సహనం కోల్పోయిన క్రికెటర్.. తోటి ఆటగాడిపై
ఢాకా: బంగ్లాదేశ్ క్రికెటర్ ముష్ఫికర్ రహీం సహనం కోల్పోయాడు. సహచర ఆటగాడిపై కోపంతో విరుచుకుపడ్డాడు. అతడిని కొట్టినంత పని చేశాడు. ఇతర ఆటగాళ్లు వచ్చి సర్దిచెప్పడంతో కాస్త కూల్ అయ్యాడు. కానీ అతడి చేతిలో తిట్లు తిన్న ప్లేయర్ మాత్రం భయంతో బిక్కచచ్చిపోయాడు. అసలేం జరిగిందంటే.. బంగ్లాదేశ్‌లో బంగాబంధు టీ20 కప్ పేరిట టోర్నీ నిర్వహిస్తున్నారు. దాదాపు 20 మ్యాచ్‌ల తర్వాత టాప్ 5 జట్ల నుంచి నాలుగు జట్లు ప్లేఆఫ్‌కు చేరుకున్నాయి. ఈ క్రమంలో బెక్సిమ్కో ఢాకా, ఫార్చూన్ బరిషల్ జట్ల మధ్య సోమవారం ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా ఢాకా కెప్టెన్, వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీంకు ఆ జట్టు ఆటగాడు నసూమ్ అహ్మద్ మధ్య చిన్నపాటి ఘర్షణ చోటుచేసుకుంది. ప్రత్యర్థి జట్టుపై విజయం సాధించే దిశగా అడుగులు పడుతున్న వేళ.. బరిషల్ క్రికెటర్ అఫిఫ్ హుస్సేన్ బంతిని గాల్లోకి లేపాడు. దీనిని పట్టుకునేందుకు ముష్పికర్, అహ్మద్ పరుగెత్తారు. ఈ క్రమంలో ఒకరినొకరు ఢీకొన్నారు. బంతి చేజారే పరిస్థితి వచ్చింది. ఎట్టకేలకు బాల్‌ను క్యాచ్ చేసిన ముష్ఫికర్, అహ్మద్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు. అతడి మీద చేయి చేసుకుంటాడా అన్నంతలా బెంబేలెత్తించాడు. (చదవండి: 5 మిలియన్ల ప్రేమ; అత్యధికులు వాళ్లే: వార్నర్) అయితే అహ్మద్ మాత్రం అతడిని కూల్ చేసేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో సహచర ఆటగాళ్లు వచ్చి సారథికి సర్దిచెప్పారు. అహ్మద్ భుజం తట్టి ఊరడించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘‘కూల్ రహీమ్.. అంతగా ఆవేశపడితే ఎలా.. ఇది జస్ట్ మ్యాచ్ అంతే ’’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌లో ఢాకా జట్టు 9 పరుగుల తేడాతో గెలుపొందింది. ఒకవేళ ఈ క్యాచ్ మిస్ అయి ఉంటే కథ వేరేలా ఉండేది. అందుకే కెప్టెన్ అంతలా నారాజ్ అయ్యాడని ముష్పికర్ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా ఢాకా జట్టు నిర్ణీత ఓవర్లలో 150 పరుగులు చేసింది. 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నవేళ ముష్పికర్ 43, యాసిర్ అలీ 54 పరుగులతో రాణించడంతో ఢాకా జట్టు మంచి స్కోరు నమోదు చేయగలిగింది. ఇక చివరికంటా పోరాడిన బరిషల్ జట్టు 141 పరుగులకే ఆలౌట్ అయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. -
లంక ప్రీమియర్ లీగ్‌లో సొహైల్ ఖాన్ పెట్టుబడి
ముంబై: లంక ప్రీమియర్ లీగ్ (ఎల్పీఎల్) టి20 టోర్నమెంట్లో బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సోదరుడు నటుడు, నిర్మాత సొహైల్ ఖాన్ పెట్టుబడి పెట్టాడు. ‘క్యాండీ టస్కర్స్’ ఫ్రాంచైజీని సొహైల్ ఖాన్, అతని తండ్రి సలీమ్ ఖాన్‌కు చెందిన కన్సార్టియం ‘సొహైల్ ఖాన్ ఇంటర్నేషనల్ ఎల్ఎల్పీ’ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని సొహైల్ ఖాన్ అధికారికంగా ప్రకటించాడు. ‘ఎల్‌పీఎల్‌కు మంచి భవిష్యత్ ఉంది. ఇందులో భాగం కావడం సంతోషాన్నిచ్చింది. ఆట పట్ల లంక అభిమానులు ఉత్సుకతతో ఉంటారు. జట్టుకు మద్దతు ఇవ్వడానికి వారంతా మా వెంటే ఉంటారని నమ్ముతున్నా’ అని సొహైల్ పేర్కొన్నాడు. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 13 వరకు జరుగనున్న ఈ ఎల్పీఎల్లో ఐదు జట్లు కొలంబో కింగ్స్, దంబుల్లా హాక్స్, గాలె గ్లాడియేటర్స్, జాఫ్నా స్టాలియన్స్, క్యాండీ టస్కర్స్ తలపడనున్నాయి. లీగ్ కోసం రెండు రోజులుగా జరిగిన ఆటగాళ్ల వేలంలో టస్కర్స్ జట్టు వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్‌ను దక్కించుకుంది. గేల్‌తో పాటు ఫ్లంకెట్, వహాబ్ రియాజ్, కుశాల్ పెరీరా, కుశాల్ మెండిస్, నువాన్ ప్రదీప్‌లు టస్కర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారు. శ్రీలంక మాజీ కెప్టెన్ హసన్ తిలకరత్నే ఈ జట్టు కోచింగ్ బృందంలో పనిచేయనున్నాడు. ఎల్పీఎల్లో పాల్గొనే ప్రముఖ ఆటగాళ్లు జాఫ్నా స్టాలియన్స్: షోయబ్ మాలిక్. దంబుల్లా హాక్స్: డేవిడ్ మిల్లర్, కార్లోస్ బ్రాత్‌వైట్. కొలంబో కింగ్స్: రసెల్, డుప్లెసిస్, ఏంజె లో మాథ్యూస్. గాలె గ్లాడియేటర్స్: లసిత్ మలింగ, అఫ్రిది, ఇంగ్రామ్, మొహమ్మద్ ఆమీర్. -
సీపీఎల్‌కు ఓకే
పోర్ట్ ఆఫ్ స్పెయిన్: అతి త్వరలోనే క్రికెట్ అభిమానులకు ధనాధన్ క్రికెట్ వినోదం లభించనుంది. కరోనా మహమ్మారి కారణంగా దాదాపు నాలుగు నెలలుగా క్రికెట్ కార్యకలాపాలు నిలిచిపోగా... ఈనెల 8న ఇంగ్లండ్, వెస్టిండీస్ తొలి టెస్టుతో అంతర్జాతీయ క్రికెట్ పునఃప్రారంభమైంది. తాజాగా టి20 ఫార్మాట్లో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)కు కూడా లైన్ క్లియర్ అయ్యింది. ప్రేక్షకులు లేకుండా ఈ లీగ్‌ను నిర్వహించుకోవచ్చని ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రభుత్వం నిర్వాహకులకు అనుమతి ఇచ్చింది. దాంతో సీపీఎల్ ఏడో సీజన్ ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 10 వరకు ట్రినిడాడ్ అండ్ టొబాగోలోని రెండు వేదికల్లో ప్రేక్షకులకు ప్రవేశం లేకుండా జరగనుంది. మొత్తం ఆరు జట్లు (బార్బడోస్ ట్రైడెంట్స్, గయానా అమెజాన్ వారియర్స్, జమైకా తలవాస్, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్, సెయింట్ లూసియా జూక్స్, ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్) ఈ లీగ్‌లో టైటిల్ కోసం తలపడనున్నాయి. రెండు సెమీఫైనల్స్, ఫైనల్‌తో కలుపుకొని మొత్తం 33 మ్యాచ్‌లు జరుగుతాయి. సీపీఎల్ నిర్వాహకులకు, ట్రినిడాడ్ ప్రభుత్వానికి జరిగిన ఒప్పందంలో భాగంగా మొత్తం ఆరు జట్లకు చెందిన ఆటగాళ్లు, సిబ్బంది టోర్నీకి బయలుదేరేముందు 14 రోజులు... ట్రినిడాడ్‌లో అడుగుపెట్టాక 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాలి. ట్రినిడాడ్ చేరుకున్న వెంటనే అందరికీ కోవిడ్–19 పరీక్షలు చేస్తారు. ఆ తర్వాత 7 రోజులకు, 14 రోజులకు మళ్లీ కోవిడ్–19 పరీక్షలు నిర్వహిస్తారు. ఆరు జట్లూ ట్రినిడాడ్లోనే ఒకే హోటల్లో బస చేస్తాయి. టోర్నీకి ముందుగానీ, టోర్నీ మధ్యలోగానీ ఎవరికైనా కోవిడ్–19 పాజిటివ్ వస్తే వారు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాల్సి ఉంటుంది. కరోనా వైరస్ కారణంగా మార్చిలోనే ట్రినిడాడ్ అండ్ టొబాగో ప్రభుత్వం తమ దేశ సరిహద్దులను మూసివేసింది. సీపీఎల్ కారణంగా బయటి వారిని తొలిసారి దేశంలోకి అనుమతి ఇవ్వనుంది. ట్రినిడాడ్‌లో ఇప్పటివరకు కరోనా తీవ్రత తక్కువగానే ఉంది. జూలై 9 వరకు ట్రినిడాడ్‌లో కేవలం 133 కోవిడ్–19 పాజిటివ్ కేసులు రాగా, ఎనిమిది మంది మాత్రమే మృతి చెందారు. -
ఐపీఎల్‌పై రేపు తుది నిర్ణయం!
ముంబై: కరోనా వైరస్ కట్టడి కోసం దేశంలోని పలు రాష్ట్రాలు లాక్డౌన్ ప్రకటిస్తుండటం... ఈ మహమ్మారి ఇంకా నియంత్రణలోకి రాకపోవడం... వెరసి ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టి20 టోర్నమెంట్ జరుగుతుందా లేదా అనే సందేహాలు మరింత ఎక్కువయ్యాయి. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 29న ఐపీఎల్–13 సీజన్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే భారత్‌లో కరోనా కేసులు బయటపడటంతో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలతో ఐపీఎల్‌ను ఏప్రిల్ 15 వరకు వాయిదా వేశారు. కానీ ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఇంకా తగ్గుముఖం పట్టకపోవడం... అమితాదరణ ఉన్న అన్ని క్రీడాంశాల టోర్నమెంట్స్‌ను వాయిదా వేయడం లేదా రద్దు చేయడం జరిగాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌పై తుది నిర్ణయం తీసుకునేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఫ్రాంచైజీలు మంగళవారం కాన్ఫరెన్స్ కాల్ ద్వారా సమావేశం కానున్నాయి. ఈ సమావేశంలోనే ఐపీఎల్‌ను మరికొంత కాలం వాయిదా వేయాలా లేక ఈ ఏడాదికి పూర్తిగా రద్దు చేయాలా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటారు. బీసీసీఐ కార్యాలయం తాత్కాలికంగా మూసి వేయడం... ఏదైనా హోటల్లోనూ సమావేశం నిర్వహించే అవకాశం లేకపోవడంతో... ఈ సమావేశాన్ని కాన్ఫరెన్స్ కాల్ ద్వారా నిర్వహిస్తారు. కరోనా వైరస్ భారత్‌లో అడుగు పెట్టిన తర్వాత కూడా బీసీసీఐ మార్చి 13న ఈసారి ఐపీఎల్‌ను ప్రేక్షకులు లేకుండా నిర్వహిస్తామని ప్రకటించింది. అయితే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగడంతో తమ నిర్ణయంపై వెనక్కి తగ్గి ఏప్రిల్ 15 వరకు ఐపీఎల్‌ను వాయిదా వేస్తున్నామని ప్రకటించింది. అనంతరం ఐపీఎల్‌ను కుదించి నిర్వహించాలని... ఒకవేళ వేసవి కాలంలో సాధ్యంకాకపోతే జూలై–సెప్టెంబర్ మధ్య కాలంలో ఏర్పాటు చేసే అంశాన్ని బీసీసీఐ పరిశీలించింది. ఈ ఏడాది అక్టోబరులో ఆస్ట్రేలియాలో టి20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో సెప్టెంబర్‌లోపే ఐపీఎల్‌ను నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. పరిస్థితులు అనుకూలించక ఐపీఎల్–2020 సీజన్ పూర్తిగా రద్దయితే మాత్రం బీసీసీఐ సుమారు రూ. 3500 కోట్లు నష్టపోయే అవకాశముంది. -
మళ్లీ బ్యాట్ పట్టిన యువరాజ్ సింగ్
బ్రాంప్టన్: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ మళ్లీ బరిలోకి దిగాడు. కెనడాలో జరుగుతున్న గ్లోబల్ టి20 టోర్నమెంట్లో టొరంటో నేషనల్స్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. వాంకోవర్ నైట్స్ టీమ్‌తో గురువారం జరిగిన ఆరంభ మ్యాచ్‌లో యువీ నిరాశపరిచాడు. 27 బంతుల్లో కేవలం 14 పరుగులు మాత్రమే చేసి స్టంపౌట్ అయ్యాడు. అయితే రీప్లేలో అతడు నాటౌట్ అయినట్టు గుర్తించినా, అప్పటికే యువీ మైదానాన్ని వీడి వెళ్లిపోయాడు. రిజ్వాన్ బౌలింగ్‌లో యువరాజ్ ఆడిన బంతి అతడి బ్యాట్ ఎడ్జ్‌కు తగిలి కీపర్ చేతుల్లోంచి వికెట్ల మీద పడింది. యువీ క్రీజ్‌లోనే ఉన్నట్టు రీప్లేలో కనబడింది. అయితే బ్యాట్ ఎడ్జ్‌కు తగిలిన బంతి వికెట్లను పడగొట్టిందన్న భావనతో యువీ మైదానాన్ని వీడినట్టుగా అనిపించింది. ఈ మ్యాచ్‌లో యువీ టీమ్‌పై వాంకోవర్ నైట్స్ 8 వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్ చేసిన టొరంటో నేషనల్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. వాల్టన్(59), హి వాండర్ డసేన్(65) అర్ధసెంచరీలతో రాణించడంతో వాంకోవర్ నైట్స్ సునాయంగా లక్ష్యాన్ని ఛేదించింది. 17.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్‌లో ఓడినప్పటికి మున్ముందు జరిగే మ్యాచ్‌ల్లో యువరాజ్ సింగ్ రాణిస్తాడని అతడి అభిమానులు నమ్మకంతో ఉన్నారు. యువీకి స్పెషల్ పర్మిషన్ బీసీసీఐ నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకుని గ్లోబల్ టి20లో యువీ ఆడుతున్నాడని బీసీసీఐ అధికారి ఒకరు ‘పీటీఐ’తో చెప్పారు. ఈ టోర్నమెంట్లో ఆడేందుకు అనుమతి ఇవ్వాలని బీసీసీఐకి యువరాజ్ లేఖ రాసినట్టు వెల్లడించారు. అంతర్జాతీయ క్రికెట్, ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యాడు కాబట్టి అతడికి బోర్డు అనుమతి ఇచ్చినట్టు వివరించారు. యువీతో పాటు బ్రెండన్ మెక్కల్లమ్, క్రిస్ గేల్, హెన్రీచ్ క్లాసన్ లాంటి అంతర్జాతీయ ఆటగాళ్లు గ్లోబల్ టి20లో ఆడుతున్నారు. వాంకోవర్ నైట్స్ టీమ్‌ను గేల్ నాయకత్వం వహిస్తున్నాడు. -
ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు
షార్జా: అఫ్గానిస్తాన్ ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) టి20 క్రికెట్ టోర్నమెంట్లో ఆదివారం అద్భుతం చోటు చేసుకుంది. బల్ఖ్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కాబుల్ జ్వనాన్ బ్యాట్స్‌మన్ హజ్రతుల్లా జజాయ్ ఒకే ఓవర్లో 6 సిక్స్‌లు కొట్టడంతోపాటు 37 పరుగులు సాధించి సంచలనం సృష్టించాడు. అబ్దుల్లా మజారి వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో హజ్రతుల్లా (6, 6, వైడ్, 6, 6, 6, 6) రెచ్చిపోవడంతో ఈ అద్భుతం జరిగింది. ఇదే జోరులో హజ్రతుల్లా 12 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసి... టి20 క్రికెట్లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును సమం చేశాడు. గతంలో యువరాజ్ (2007లో ఇంగ్లండ్‌పై), క్రిస్ గేల్ (2016 బిగ్‌బాష్ లీగ్‌లో) కూడా 12 బంతుల్లోనే అర్ధ సెంచరీలు చేశారు. హజ్రతుల్లా (17 బంతుల్లో 62; 4 ఫోర్లు, 7 సిక్స్‌లు) అదరగొట్టినా ఈ మ్యాచ్‌లో కాబుల్ జ్వనాన్ జట్టుకు ఓటమి తప్పలేదు. తొలుత బల్ఖ్ లెజెండ్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 244 పరుగులు చేసింది. క్రిస్ గేల్ (48 బంతుల్లో 80; 2 ఫోర్లు, 10 సిక్స్‌లు) వీరవిహారం చేయడంతో బల్ఖ్ లెజెండ్స్ 23 సిక్స్‌లు బాది ఓ టి20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన జట్టుగా రికార్డు సృష్టించింది. 21 సిక్స్‌లతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (2013లో), వెస్టిండీస్ (2016లో), రంగ్‌పూర్ రైడర్స్ (2017లో), భారత్ (2017లో) పేరిట ఉన్న రికార్డును బల్ఖ్ లెజెండ్స్ తిరగరాసింది. అనంతరం కాబుల్ జ్వనాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 223 పరుగులు చేసి 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. -
అమెరికా క్రికెట్ కెప్టెన్‌గా ఇబ్రహీం ఖలీల్
వాషింగ్టన్: ఐసీసీ వరల్డ్ టి20 క్వాలిఫయింగ్ టోర్నీలో పాల్గొనే అమెరికా జట్టుకు హైదరాబాద్‌కు చెందిన ఇబ్రహీం ఖలీల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. వచ్చే నెల 19 నుంచి నార్త్ కరోలినాలో జరిగే ఈ టోర్నీ కోసం 15 మంది సభ్యుల యూఎస్ఏ జట్టును సెలక్షన్ కమిటీ చైర్మన్, మాజీ వెస్టిండీస్ క్రికెటర్ రికార్డో పావెల్ ప్రకటించారు. హైదరాబాద్ తరఫున సుదీర్ఘ కాలం రంజీ ఆడిన అనంతరం యూఎస్ఏ వలస వెళ్లిన వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఖలీల్ ... గత ఏడాది నుంచి జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఇంతకుముందు కూడా జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అతను, మరోసారి సారథిగా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. టోర్నీలో భాగంగా కెనడా, పనామా, హోండురస్ జట్లతో అమెరికా తలపడుతుంది. ఇబ్రహీం ఖలీల్ ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)లో క్రిస్ గేల్ కెప్టెన్‌గా ఉన్న సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. -
మహిళల విజయం.. పురుషుల సంబరం
హైదరాబాద్ : ఆసియాకప్ మహిళల టీ20 టైటిల్‌ను గెలిచి బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఆదివారం భారత్‌తో జరిగిన ఉత్కంఠపోరులో చివరి బంతికి విజయాన్నందుకున్న బంగ్లాదేశ్ మహిళలు తొలిసారి ఆసియాకప్ టైటిల్‌ను గెలుచుకున్నారు. ఈ విజయానంతరం బంగ్లా మహిళా క్రికెటర్లంతా మైదానంలో చిందేయగా.. ఆ దేశ పురుష క్రికెటర్లు మాత్రం టీవీ ముందు సంబరాలు చేసుకున్నారు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌ను టీవీలో చూసిన బంగ్లా పురుషుల జట్టు..విజయానంతరం తామే గెలిచినట్లు సంబరాలు చేసుకున్నారు. మైదానంలో ఉండి తమ జట్టుకు మద్దతు తెలుపుతున్నట్లే చప్పట్లు కొడుతూ.. విజయాన్ని ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఈ వీడియోను బంగ్లా మాజీ టెస్టు కెప్టెన్, ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ తమీమ్ ఇక్బాల్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీనికి క్యాఫ్షన్‌గా ‘ఈ ఏడాది మహిళలకు కలిసొచ్చింది.. పురుషులు కూడా ఇలానే విజయంసాధిస్తారు’ అని పేర్కొన్నాడు. అయితే అభిమానులు మాత్రం ఇక ‘ఇప్పుడేసుకోండి నాగినీ డ్యాన్స్..’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇటీవల అఫ్గానిస్తాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో బంగ్లాదేశ్ పురుషుల జట్టు దారుణంగా క్లీన్ స్వీప్ అయిన విషయం తెలిసిందే. చదవండి: ఫైనల్లో భారత్‌కు చుక్కెదురు -
ఫైనల్లో మహిళల విజయం.. బంగ్లా పురుషుల జట్టు సంబరాలు
-
ఆసియాకప్: ఫైనల్లో భారత్‌కు చుక్కెదురు
కౌలాలంపూర్ : ఆసియాకప్ మహిళల టీ20 టైటిల్‌ను బంగ్లాదేశ్ కైవసం చేసుకుంది. ఆదివారం భారత్‌తో జరిగిన ఫైనల్లో మూడు వికెట్ల తేడాతో బంగ్లా విజయం సాధించింది. వరుసగా గత ఆరు టోర్నీల టైటిళ్లను నెగ్గిన భారత్‌కు ఈ సారి బంగ్లాదేశ్ షాక్ ఇచ్చింది. లీగ్ మ్యాచ్‌లో సైతం భారత్‌ను ఓడించిన బంగ్లాదేశ్ మహిళలు అదే ప్రదర్శనను తుది పోరులో సైతం పునరావృతం చేసి టైటిల్ నెగ్గారు. ఫలితంగా తొలిసారి బంగ్లాదేశ్ ఆసియాకప్‌ను సొంతం చేసుకుంది. హర్మన్ మినహా.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత మహిళల్లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(56) మినహా అందరూ విఫలమయ్యారు. . స్మృతీ మంధాన(7), దీప్తి శర్మ(4), మిథాలీ రాజ్(11), అనుజా పటేల్(3 ఆబ్సెంట్ హర్ట్)లు తీవ్రంగా నిరాశపరచడంతో భారత్ కేవలం 113 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే నిర్ధేశించింది. స్వల్పలక్ష్యాన్ని చేధించే క్రమంలో బంగ్లాదేశ్ మహిళలు సైతం తడబడ్డారు. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ సాగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌నే విజయం వరించింది. ఓపెనర్లు షమిమా సుల్తానా(16), అయేషా రెహ్మాన్(17)లు మంచి శుభారంభాన్ని అందించినా ఎక్కువసేపు క్రీజులో నిలదొక్కలేకపోయారు. నిగర్‌సుల్తానా (27) దాటిగా ఆడే ప్రయత్నం చేసినా పూనమ్యాదవ్ చక్కటి బంతికి పెవిలియన్ చేరింది. చివర్లో రుమాన్ అహ్మద్(23) రాణించడంతో బంగ్లా విజయానికి చివరి ఓవర్లో 9 పరుగులు అవసరమయ్యాయి. అయితే కెప్టెన్ హర్మన్ కట్టడి చేయడంతో చివరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. కాగా, క్రీజులోకి వచ్చిన జహనార్ అలామ్ ఇన్నింగ్స్ ఆఖరికి రెండు పరుగులు తీయడంతో బంగ్లా విజయం ఖాయమైంది. ఇక భారత మహిళల్లో పూనమ్ యాదవ్ 4 వికెట్లు తీయగా.. హర్మన్‌ప్రీత్ రెండు వికెట్లు తీసింది. ప్లేయర్ ఆఫ్‌ది టోర్నీ అవార్డు హర్మన్ ప్రీత్‌కు దక్కగా.. మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ రుమాన్ అహ్మద్‌ను వరించింది. -
ఆసియా కప్ ఫైనల్; బంగ్లాదేశ్ లక్ష్యం 113
కౌలాలంపూర్: ఆసియాకప్ టీ20లో టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 113 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్((56) మినహా ఎవరూ రాణించకపోవడంతో భారత్ సాధారణ స్కోరుకే పరిమితమైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఆదిలోనే కీలక వికెట్లను చేజార్చుకుంది. స్మృతీ మంధాన(7), దీప్తి శర్మ(4), మిథాలీ రాజ్(11), అనుజా పటేల్(3 ఆబ్సెంట్ హర్ట్)లు ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరడంతో భారత్ 32 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. కాగా, ఆ దశలో హర్మన్‌ప్రీత్-వేదా కృష్ణమూర్తిలు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే యత్నం చేశారు. అయితే ఈ జోడి 30 పరుగులు జోడించిన తర్వాత వేదా(11) పెవిలియన్ చేరారు. ఆపై భారత్ వరుసగా వికెట్లను కోల్పోగా, హర్మన్‌ప్రీత్ కడవరకూ పోరాడింది. ఇన్నింగ్స్ ఆఖరి బంతిని భారీ షాట్ కొట్టే యత్నంలో హర్మన్ పెవిలియన్ బాట పట్టడంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 112 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లలో కుబ్రా, రుమానా అహ్మద్‌లు తలో రెండు వికెట్లు సాధించగా,సాల్మా ఖాతన్, జహరానా అలామ్ చెరో వికెట్ తీశారు. -
ముక్కోణపు టి20 టోర్నీ విజేత ఆస్ట్రేలియా
ముంబై: ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన ఆస్ట్రేలియా మహిళల జట్టు ముక్కోణపు టి20 టోర్నమెంట్ టైటిల్ సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన ఫైనల్లో ఆసీస్ 57 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగుల చేసింది. కెప్టెన్ మెగ్ లానింగ్ (45 బంతుల్లో 88 నాటౌట్; 16 ఫోర్లు, 1 సిక్స్), విలానీ (51; 8 ఫోర్లు) చెలరేగడంతో ఆసీస్ భారీ స్కోరు చేయగలిగింది. మహిళల అంతర్జాతీయ టి20ల్లో ఇదే అత్యధిక స్కోరు. అనంతరం బరిలో దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 152 పరుగులకే పరిమితమైంది. స్కీవర్ (50; 5 ఫోర్లు) రాణించింది. ప్రత్యర్థి బౌలర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ షుట్ 3 వికెట్లు పడగొట్టింది. లానింగ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. -
ఇంగ్లండ్ x ఆస్ట్రేలియా
ముంబై: మహిళల ముక్కోణపు టి20 టోర్నీ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. భారత్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు తలపడ్డ ఈ టోర్నీలో హర్మన్‌ప్రీత్ బృందం ఇప్పటికే ఇంటిముఖం పట్టగా శనివారం ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య తుదిపోరు జరుగనుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు ఇరు జట్లు రెండు సార్లు తలపడగా... చెరోసారి విజయం సాధించాయి. ఇంగ్లండ్‌కు వ్యాట్, స్కీవర్, బ్యూమౌంట్, హీతర్ నైట్ ముఖ్యమైన ఆటగాళ్లు. ఆస్ట్రేలియాకు మూనీ, హేలీ, విలానీ, మెగ్ లానింగ్, పెర్రీ, షుట్ కీలకం. -
శ్రీలంకకు పయనమైన భారత జట్టు
ముంబై: ముక్కోణపు టి20 టోర్నీలో పాల్గొనేందుకు రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టు ఆదివారం శ్రీలంక బయల్దేరి వెళ్లింది. మంగళవారం మొదలయ్యే ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్... శ్రీలంకతో తలపడనుంది. మూడు జట్లు ప్రత్యర్థితో రెండేసి మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఫైనల్ సహా ఈ మ్యాచ్‌లన్నిటికీ కొలంబోలోని ప్రేమదాస స్టేడియమే వేదిక కానుంది. -
ఇంగ్లండ్‌పై కివీస్‌దే గెలుపు
వెల్లింగ్టన్: ముక్కోణపు టి20 టోర్నీ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్‌దే పైచేయి అయింది. రెండు జట్ల మధ్య మంగళవారం ఇక్కడ జరిగిన పోరులో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (46 బంతుల్లో 72; 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), ఓపెనర్ మార్టిన్ గప్టిల్ (40 బంతుల్లో 65; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగి ఆడటంతో కివీస్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ పోరాటం 184 పరుగులకే పరిమితమైంది. అలెక్స్ హేల్స్ (24 బంతుల్లో 47; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), మలాన్ (40 బంతుల్లో 59; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) మంచి భాగస్వామ్యం అందించినా మిగతావారు విఫలమమయ్యారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ (2/46), శాన్‌ట్నర్ (2/29), ఇష్ సోధి (2/29) రాణించారు. విలియమ్సన్‌కే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పురస్కారం దక్కింది. -
ఆంధ్ర ఆశలు సజీవం
సాక్షి, విశాఖపట్నం: కీలకమైన మ్యాచ్‌లో సమష్టిగా రాణించిన ఆంధ్ర జట్టు సయ్యద్ ముస్తాక్ అలీ సౌత్‌జోన్ టి20 టోర్నమెంట్లో మూడో విజయం నమోదు చేసింది. సూపర్ లీగ్ దశకు అర్హత సాధించే అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. హైదరాబాద్ జట్టుతో స్థానిక వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 129 పరుగులు చేసింది. సందీప్ (35 బంతుల్లో 39; 3 ఫోర్లు), కెప్టెన్ అంబటి రాయుడు (25 బంతుల్లో 24; 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. ఆంధ్ర బౌలర్లలో హరిశంకర్ రెడ్డి మూడు వికెట్లు, బండారు అయ్యప్ప రెండు వికెట్లు తీశారు. 130 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆంధ్ర జట్టు 18.2 ఓవర్లలో నాలుగు వికెట్లకు 133 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ఆంధ్ర జట్టును రికీ భుయ్ (58 బంతుల్లో 73 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), డీబీ రవితేజ (43 బంతుల్లో 46; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) ఆదుకున్నారు. వీరిద్దరూ హైదరాబాద్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. అలవోకగా ఆడుతూ మూడో వికెట్‌కు 114 పరుగులు జోడించారు. ఆంధ్ర విజయాన్ని ఖాయం చేశారు. హైదరాబాద్ బౌలర్లలో సిరాజ్ మూడు వికెట్లు తీయగా, ఆశిష్ రెడ్డికి ఒక వికెట్ దక్కింది. ఎవరికి అవకాశం? ప్రస్తుతం ఆంధ్ర (రన్‌రేట్ –0.109), కర్ణాటక (+1.445), తమిళనాడు (+0.314) తలా 12 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నాయి. అయితే రన్‌రేట్‌లో ఆంధ్ర ఈ రెండు జట్లకంటే వెనుకబడి ఉంది. హైదరాబాద్ ఎనిమిది పాయింట్లతో నాలుగో స్థానంలో, కేరళ నాలుగు పాయింట్లతో ఐదో స్థానంలో, గోవా పాయింట్లేమీ లేకుండా ఆరో స్థానంలో ఉన్నాయి. ఆదివారం జరిగే చివరి రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో గోవాతో ఆంధ్ర; తమిళనాడుతో హైదరాబాద్; కర్ణాటకతో కేరళ తలపడతాయి. ఒకవేళ ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు జట్లు తమ ప్రత్యర్థి జట్లపై విజయం సాధిస్తే మూడు జట్లూ 16 పాయింట్లతో సమమవుతాయి. ఒకవేళ ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు జట్లు చివరి లీగ్ మ్యాచ్‌ల్లో ఓడిపోతే మాత్రం హైదరాబాద్‌తో కలిపి నాలుగు జట్లు 12 పాయింట్లతో సమఉజ్జీగా నిలుస్తాయి. ఈ పరిస్థితిలో మెరుగైన రన్‌రేట్‌తో ఉన్న రెండు జట్లు ముందంజ వేస్తాయి. లీగ్ మ్యాచ్‌లు ముగిశాక తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లే సూపర్ లీగ్ దశకు అర్హత సాధిస్తాయి. ఓవరాల్‌గా ఐదు (నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్, సెంట్రల్) జోన్ల నుంచి రెండేసి జట్ల చొప్పున మొత్తం 10 జట్లు సూపర్ లీగ్ దశకు అర్హత పొందుతాయి. -
టీ20 విజేత కరీంనగర్
కరీంనగర్ స్పోర్ట్స్: వెంకటస్వామి స్మారకార్థం నిర్వహించిన టీ–20 క్రికెట్ పోటీల్లో భాగంగా జోనల్ స్థాయి విభాగంలో చాంపియన్ షిప్ ట్రోపీని కరీంనగర్ జిల్లా జట్టు సాధించగా రన్నరప్ ట్రోపీని మంచిర్యాల జిల్లా జట్టు గెలుచుకుంది. తెలంగాణవ్యాప్తంగా ఈ టోర్నమెంట్ జరుగుతుండగా సోమవారం జోనల్‌స్థాయిలో ఫైనల్ మ్యాచ్ కరీంనగర్‌లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో కరీంనగర్, మంచిర్యాల జిల్లా జట్ల మధ్య జరిగింది. సాయంత్రం జరిగిన బహుమతి ప్రదా నోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి, మాజీ హెచ్‌సీఏ అధ్యక్షుడు వినోద్, కరీంనగర్ మేయర్ రవీందర్ సింగ్, ఏసీపీ వెంకటరమణ హాజరై ట్రోపీలతోపాటు లక్ష రూపాయల చెక్ అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రీడల్లో క్రేజీ గేమ్ క్రికెట్ అన్నారు. జిల్లా నుంచి రంజీ జట్టుకు ప్రాతినిథ్యం వహించి దేశం తరఫున ఆడేలా క్రీడాకారులు తయారు కావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు ఆగంరావు, జిల్లా క్రికెట్ సంఘం బాధ్యుడు మహేందర్‌గౌడ్, మురళీధర్‌రావు, సుకుమార్, మనోహర్‌రావు, జిల్లా ఒలంపిక్ సంఘం అధ్యక్షుడు నందెల్లి మహిపాల్, కోచ్‌లు చందు,శ్రీను పాల్గొన్నారు. ఉత్కంఠంగా ఫైనల్... కరీంనగర్, మంచిర్యాల జిల్లాల జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన మంచిర్యాల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. కరీంనగర్ బౌలింగ్‌లో ఆకాశ్‌రావు, విష్ణురెడ్డి అద్భుతంగా బౌలింగ్ చేసి ఇద్దరు 4 ఓవర్లు వేసి 21 పరుగులిచ్చి చెరి రెండు వికెట్లు పడగొట్టారు. తదనంతరం బ్యాటింగ్ చేసిన కరీంనగర్ జట్టు 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసి 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జట్టులో షానావాజ్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి జట్టుకు ట్రోపీ అందించాడు. కేవలం 29 బంతుల్లో 4 ఫోర్లు ఒక సిక్స్‌తో చెలరేగి 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. బ్యాటింగ్‌లో మధుకర్ 22, సిద్దార్థరెడ్డి 23, హరేన్ 26 పరుగులు చేసి విజయంలో కీలకపాత్ర పోషించారు. -
విజేత సెయింట్ జాన్స్
సాక్షి, హైదరాబాద్: సెయింట్‌జాన్స్ ఫ్రెండ్షిప్ కప్ టి20 క్రికెట్ టోర్నమెంట్లో ఆతిథ్య సెయింట్ జాన్స్ జట్టు విజేతగా నిలిచింది. శ్రీలంకకు చెందిన సీసీసీ స్కూల్ ఆఫ్ క్రికెట్ జట్టుతో జరిగిన ఈ మ్యాచ్‌లో 63 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించి టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఈమ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సెయింట్ జాన్స్ ‘ఎ’ జట్టు 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసింది. సిద్ధార్థ్ (90) చెలరేగాడు. యశ్ (20) ఫర్వాలేదనిపించాడు. ప్రత్యర్థి బౌలర్లలో ప్రకాశ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం సీసీసీ స్కూల్ ఆఫ్ క్రికెట్ జట్టు 20 ఓవర్లలో 8 వికెట్లకు 113 పరుగులు చేసి పరాజయం పాలైంది. దిశాల్ (25), సహన్ (24) రాణించారు. సెయింట్ జాన్ బౌలర్లు ప్రియాన్షు, యశ్ చెరో 2 వికెట్లు దక్కించుకున్నారు. -
సఫారీ గడ్డపై మరో టి20 లీగ్
దుబాయ్: దక్షిణాఫ్రికా మరో టి20 టోర్నీకి వేదికవుతోంది. ఇప్పటికే ఆరు జట్లతో జరుగుతున్న వార్షిక దేశవాళీ టి20 ఈవెంట్‌తో పాటు సరికొత్త హంగులతో ఎనిమిది జట్లతో ఈ ఏడాది చివర్లో ఈ గ్లోబల్ టోర్నీని నిర్వహించాలని క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ టోర్నీలో ప్రపంచ దేశాలకు చెందిన మేటి క్రికెటర్లను భాగస్వామ్యం చేయాలని సీఎస్ఏ భావిస్తోంది. -
టీ20లో సంచలనం.. సున్నాకు 6 వికెట్లు!
లెప్ట్ ఆర్మ్ స్పిన్నర్ సర్ఫరాజ్ అష్రఫ్ టీ-20లో అరుదైన ఘనతను సాధించాడు. ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ఏకంగా ఆరు వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన టీ20 పోటీల్లో అతను ఈ రికార్డు సాధించాడు. ఇటీవల బెంగళూరులో జరిగిన టీ20 మ్యాచ్‌లో యంగ్ పాయినీర్స్ క్రికెట్ క్లబ్ తరఫున ఆడిన సర్ఫరాజ్... మెర్కారా యూత్ క్రికెట్ క్లబ్ బ్యాట్స్ మెన్ ను తన స్పిన్‌తో వణికించాడు. ఒక హ్యాట్రిక్ కూడా సాధించాడు. దీంతో అతని జట్టు 107 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. సర్ఫరాజ్ సాధించిన ఆరు వికెట్లలో ఐదు వికెట్లు వరుస బంతులలో సాధించాడు. నిజానికి సర్ఫరాజ్ డబుల్ హ్యాట్రిక్ సాధించే చాన్స్ కూడా తృటిలో మిస్సైంది. అతను విసిరిన మూడో బంతికి ఎల్బీడబ్ల్యూకి అప్పీల్ చేసినప్పటికీ ఎంపైర్ ఔట్ ఇవ్వలేదు. ’పరుగులను కట్టడి చేయాలంటే దూకుడుగా బౌలింగ్ చేయాలని నేను భావిస్తా. అదే నాకు వికెట్లు సంపాదించి పెడుతుంది. శ్రీలంక బౌలర్ మలింగ తరహాలో విభిన్న యాక్షన్ తో బౌలింగ్ చేస్తూ బ్యాట్స్‌మెన్ ను తికమకపెడతాను’ అని మ్యాచ్ అనంతరం సర్ఫరాజ్ మీడియాకు తెలిపాడు. బిహార్ ముజఫర్‌పూర్‌కు చెందిన సర్ఫరాజ్ బీసీసీఐ దేశీయ టీ20 టోర్నమెంట్ సయెద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ తరఫున ఆడాడు. గతంలో ఎయిరిండియా జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహించాడు. 2014లో ఒడిశాతో జరిగిన రాష్ట్రస్థాయి క్రికెట్ మ్యాచ్‌లో జార్ఖండ్ తరఫున చివరిసారిగా ఆడిన సర్ఫరాజ్ ఇప్పటివరకు భారత ఏ జట్టులో చోటు సంపాదించుకోలేకపోయాడు. ఈసారి ఏ జట్టుతోపాటు ఐపీఎల్‌లోనూ తనకు అదృష్టంవరిస్తుందని సర్ఫరాజ్ భావిస్తున్నాడు. తన తాజా ప్రదర్శనను సెలెక్టర్లు గుర్తిస్తారని అతను ఆశాభావంతో ఉన్నాడు. సర్ఫరాజ్ మ్యాచ్‌లో విసిరిన ఏడు బంతులు ఇలా సాగాయి.. మొదటి బంతి: ఫస్ట్ స్లిప్‌లో క్యాచ్ ఔట్ రెండో బంతి: ఎల్బీడబ్ల్యూ మూడో బంతి: డాట్ నాలుగో బంతి: ఎల్బీడబ్ల్యూ ఐదో బంతి: బౌల్డ్ ఆరో బంతి: ఎల్బీడబ్ల్యూ ఏడో బంతి (రెండో ఓవర్ మొదటి బంతి): ఎల్బీడబ్ల్యూ సంక్షిప్తంగా స్కోర్లు యంగ్ పయనీర్స్ క్లబ్: 264/4 20 ఓవర్లు. (సర్ఫరాజ్ అష్రఫ్ 40, దీపక్ 74, కిరణ్ 70, రామ్ (నాటౌట్) 22, సునీల్ (నాటౌట్) 33, ఎన్ స్వామి 2/56) మెర్కారా యూత్ క్లబ్: 14.3 ఓవర్లలో 57 పరుగులకు ఆలౌట్. (బ్యాటింగ్.. మహేష్ 22; బౌలింగ్ మదన్ 3/21, సర్ఫరాజ్ అష్రఫ్ 6/0 (3-3-0-6) -
ఫీల్డింగ్ చేస్తుండగా..ఆ క్రికెటర్ కాలూడిపోయింది!
-
ఫీల్డింగ్ చేస్తుండగా..ఆ క్రికెటర్ కాలూడిపోయింది!
దుబాయ్‌లో ఇటీవల ఐసీసీ అకాడెమీ ఇన్విటేషనల్ టీ20 టోర్నమెంట్ సందర్భంగా అరుదైన ఘటన జరిగింది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌండరీ దిశగా దూసుకుపోతున్న బంతిని ఇంగ్లండ్ క్రికెటర్ లియాయ్ థామస్ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తుండగా అనూహ్యంగా అతని కృత్రిమకాలు ఊడిపోయింది. కాలు ఊడిపోయినా అతను మాత్రం వెనక్కితగ్గలేదు. ఒంటికాలితో కుంటుతూ బంతిని కీపర్‌కు విసిరేసి.. అందరి మన్ననలు అందుకున్నాడు. లియామ్ థామస్ దివ్యాంగుడు. ఇంగ్లండ్ దివ్యాంగుల క్రికెట్ టీమ్‌లో సభ్యుడైన అతడు ఇటీవల పాకిస్థాన్ దివ్యాంగుల జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఈ విధంగా అసాధారణ ప్రతిభ చూపాడు. బౌండరీ వెళుతున్న బంతిని డైవ్ చేసి అడ్డుకోబోతుండగా.. అనూహ్యంగా అతని కృత్రిమకాలు ఊడిపోయింది. అయినా, ఒంటికాలితో కుంటుతూ వెళ్లి బంతిని అందుకొని.. కీపర్‌కు అందించాడు. ఇలా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. బంతిని అందుకునే క్రమంలో భూమిని బలంగా ఢీకొన్నా. ఆ తర్వాత నేను లేచేందుకు ప్రయత్నించగా ఒక కాలు లేదు. ముందు ఊడిపోయిన కాలును పెట్టుకోవాలా? లేక బంతిని అందుకోవాలా? అన్న సందిగ్ధ పరిస్థితి. కానీ బంతికే నేను ప్రాధాన్యం ఇచ్చాను' అని మ్యాచ్ అనంతరం థామస్ తెలిపారు. ' వైకల్యం కారణంగా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఒకరినొకరు చూసుకొని కొంత నవ్వుకుంటాం. కానీ నిజానికి ఇలాంటి ఘటనల్లో ఒకరి బాధ మరొకరికి తెలుస్తుంది' అని చెప్పాడు. లియామ్ థామస్ ఈ ఫీల్డింగ్ వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. -
బంగ్లా ఫైనల్ కు... పాక్ ఇంటికి..
మిర్పూర్: ఆసియా కప్ లో భాగంగా పాక్ తో జరిగిన మ్యాచ్ లో ఆతిథ్య బంగ్లాదేశ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మరో ఐదు బంతులు ఉండగానే పాక్ నిర్దేశించిన 129 పరుగుల లక్ష్యాన్ని బంగ్లా ఛేదించింది. 19.1 ఓవర్లలో 131 పరుగులు చేసింది. సౌమ్య సర్కార్ (48; 48 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్)రాణించడంతో బంగ్లా మరోసారి సంచలనం సృష్టించింది. దీంతో బంగ్లా ఆసియాకప్ ఫైనల్లోకి ప్రవేశించింది. చివరి రెండు ఓవర్లలో 18 పరుగులు చేయాల్సి ఉండగా.. 19వ ఓవర్లో సమీ చేసిన తప్పిదాల కారణంగా 15 పరుగులు రాబట్టుకున్నారు. చివరి ఓవర్ తొలి బంతికి మహ్మదుల్లా(22) ఫోర్ కొట్టి బంగ్లా ఆకాంక్షను నెరవేర్చాడు. మొర్తాజా(12) కూడా చివరి వరకు నిలిచి లాంఛనాన్ని పూర్తి చేయడంలో సహకరించాడు. పాక్ బౌలర్లలో మహ్మద్ ఆమీర్ రెండు వికెట్లు తీయగా, ఇర్ఫాన్, ఆఫ్రిది, మాలిక్ ఒక్కో వికెట్ తీశారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 129 పరుగులు చేసింది. ఆతిథ్య బంగ్లా జట్టుకు 130 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సర్ఫరాజ్(42 బంతుల్లో, 58 పరుగులు: 5 ఫోర్లు, 2 సిక్సులు) అర్ధ శతకంతో ఆదుకోవడంతో పాక్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. షోయబ్ మాలిక్(31 బంతుల్లో 41 పరుగులు) కూడా రాణించాడు. వీరిద్దరూ ఐదో వికెట్ కు 70 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. బ్యాటింగ్ ప్రారంభించిన పాక్ 12 పరుగులకే జట్టు ఓపెనర్లను కోల్పోయింది. ఆరుఓవర్లకు పాక్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 20 పరుగులే చేయడం.. 28 పరుగుల వద్ద నాలుగో వికెట్ రూపంలో ఉమర్ అక్మల్(4) పరుగులకే ఔటవ్వడంతో పాక్ ఆచితూచి ఆడటం మొదలుపెట్టింది. షోయబ్ మాలిక్ ఔటైన తర్వాత ఆ జట్టు బాధ్యతను సర్ఫరాజ్ తనపై వేసుకుని చివర్లో షాట్లు ఆడటంతో పాక్ పోరాడే స్కోరును చేయగలిగింది. బంగ్లా బౌలర్లలో అమిద్ అల్ హసన్ 3 వికెట్లు పడగొట్టాడు. ఆరాఫత్ సన్నీ 2, టస్కీన్, మొర్తాజా తలో వికెట్ తీశారు. సౌమ్య సర్కార్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ లభించింది. ఈ నెల 6న ఫైనల్లో భారత్, బంగ్లాలు తలపడనున్నాయి. -
బంగ్లా జట్టుకు స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించిన పాక్
మిర్పూర్: టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 129 పరుగులు చేసింది. ఆతిథ్య బంగ్లా జట్టుకు 130 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. సర్ఫరాజ్(42 బంతుల్లో, 58 పరుగులు: 5 ఫోర్లు, 2 సిక్సులు) అర్ధ శతకంతో ఆదుకోవడంతో పాక్ ఆ మాత్రం స్కోరు చేయగలిగింది. షోయబ్ మాలిక్(31 బంతుల్లో 41 పరుగులు) కూడా రాణించాడు. బ్యాటింగ్ ప్రారంభించిన పాక్ 12 పరుగులకే జట్టు ఓపెనర్లను కోల్పోయింది. ఆరుఓవర్లకు పాక్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 20 పరుగులే చేయడం.. 28 పరుగుల వద్ద నాలుగో వికెట్ రూపంలో ఉమర్ అక్మల్(4) పరుగులకే ఔటవ్వడంతో పాక్ ఆచితూచి ఆడటం మొదలుపెట్టింది. షోయబ్ మాలిక్ ఔటైన తర్వాత ఆ జట్టు బాధ్యతను సర్ఫరాజ్ తనపై వేసుకుని చివర్లో షాట్లు ఆడటంతో పాక్ పోరాడే స్కోరును చేయగలిగింది. బంగ్లా బౌలర్లలో అమిద్ అల్ హసన్ 3 వికెట్లు పడగొట్టాడు. ఆరాఫత్ సన్నీ 2, టస్కీన్, మొర్తాజా తలో వికెట్ తీశారు. -
పాక్ ను ఆదుకున్న మాలిక్, సర్ఫరాజ్
మిర్పూర్: టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తున్న పాక్ ఇన్నింగ్స్ నత్తనడకన సాగుతోంది. ఆ జట్టు 15 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసింది. అంతకుముందు 12 పరుగులకే పాక్ జట్టు ఓపెనర్లను కోల్పోయింది. ఆరుఓవర్లకు పాక్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 20 పరుగులే చేయడం.. 28 పరుగుల వద్ద నాలుగో వికెట్ రూపంలో ఉమర్ అక్మల్(4) పరుగులకే ఔటవ్వడంతో పాక్ ఆచితూచి ఆడుతోంది. ప్రస్తుతం సర్ఫరాజ్(36), షోయబ్ మాలిక్ (26) పరుగులతో క్రీజులో ఉన్నారు. బంగ్లా బౌలర్లలో మొర్తాజా, అమిద్ అల్ హసన్, ఆరాఫత్ సన్నీ, టస్కీన్ తలో వికెట్ తీశారు. -
కుప్పకూలిన పాక్ టాపార్డర్
మిర్పూర్: బంగ్లాదేశ్ తో జరుగుతున్న టీ20 మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు టాపార్డర్ కుప్పకూలింది. ఆరుఓవర్లు ముగిసేసరికి పాక్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 20 పరుగులే చేసింది. పాక్ జట్టు 12 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. అల్ అమిన్ హుస్సేన్ తన తొలి బంతికే ఓపెనర్ ఖుర్రం మంజూర్(1) ను వెనక్కి పంపాడు. చాలా ఎత్తులో వస్తున్న బంతిని కీపర్ ముష్ఫికర్ రహీమ్ క్యాచ్ పట్టడంతో ఖుర్రం పెవిలియన్ కు చేరాడు. నాలుగో ఓవర్ ఐదో బంతికి మరో ఓపెనర్ షార్జిల్ ఖాన్(10) ఓటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకొచ్చిన సర్ఫరాజ్ అహ్మద్ రావడంతోనే ఫోర్ కొట్టి ధీమాగా కనిపించాడు. ఆరాఫత్ సన్నీ వేసిన ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో 12 పరుగుల వద్ద మరో ఓపెనర్ షార్జిల్ ఖాన్(10) రెండో వికెట్ రూపంలో నిష్క్రమించాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ వేసిన మొర్తాజా తన తొలి ఓవర్లోనే పాక్ కు షాకిచ్చాడు. మహ్మద్ హహీజ్ ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ప్రస్తుతం సర్ఫరాజ్ అహ్మద్ (6), ఉమర్ అక్మల్ (1) క్రీజులో ఉన్నారు. బంగ్లా బౌలర్లలో మొర్తాజా, అమిద్ అల్ హసన్, ఆరాఫత్ సన్నీ తలో వికెట్ తీశారు. -
బ్యాటింగ్ కు దిగిన పాకిస్తాన్
మిర్పూర్: ఖుర్రం మంజూర్, షార్జిల్ ఖాన్ ఓపెనర్లుగా దిగి పాక్ బ్యాటింగ్ ప్రారంభించారు. ఆసియా కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగే టీ20 మ్యాచ్ లో పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బంగ్లా బౌలర్ టస్కీన్ అహ్మద్ చేతికి కెప్టెన్ మొర్తాజా బంతిని అందించాడు. ఛేజింగ్ లో గత మూడు మ్యాచ్ లలో ఓడిన బంగ్లా ఈ మ్యాచ్ లో సంచలనం సృష్టించి పాక్ ను ఇంటిదారి పట్టిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. పాక్, బంగ్లా జట్లలో చిన్న మార్పులు చోటుచేసుకున్నాయి. మహమ్మద్ నవాజ్ స్థానంలో అన్వర్ అలీ జట్టులోకి వచ్చాడు. అలాగే బంగ్లా జట్టులో తమీమ్ ఇక్బాల్, ఆరాఫత్ సన్నీ స్థానం దక్కించుకోగా, నురల్ హసన్, ముస్తాఫిజర్ లు తుదిజట్టులో చోటు కోల్పోయారు. టాస్ గెలిస్తే తాను కూడా బ్యాటింగ్ ఎంచుకునే వాడినని బంగ్లా కెప్టెన్ మష్రాఫే మోర్తాజా చెప్పడం గమనార్హం. -
బ్యాటింగ్ ఎంచుకున్న పాక్
మిర్పూర్: ఆసియా కప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగే టీ20 మ్యాచ్ లో పాకిస్తాన్ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పాక్, బంగ్లా జట్లలో చిన్న మార్పులు చోటుచేసుకున్నాయి. మహమ్మద్ నవాజ్ స్థానంలో అన్వర్ అలీ జట్టులోకి వచ్చాడు. అలాగే బంగ్లా జట్టులో తమీమ్ ఇక్బాల్, ఆరాఫత్ సన్నీ స్థానం దక్కించుకోగా, నురల్ హసన్, ముస్తాఫిజర్ లు తుదిజట్టులో చోటు కోల్పోయారు. టాస్ గెలిస్తే తాను కూడా బ్యాటింగ్ ఎంచుకునే వాడినని బంగ్లా కెప్టెన్ మష్రాఫే మోర్తాజా చెప్పడం గమనార్హం. -
'భారీ సిక్సులు కొట్టడం నా వల్ల కాదు'
మిర్పూర్: ప్రపంచంలో ఉత్తమ ఆటగాళ్లలో అతడికి ఎప్పుడూ చోటుంటుంది. భారత యువ సంచలనంగా పేరు గాంచిన బ్యాట్స్ మన్ అతడు. అతడు క్రీజులో ఉంటే చాలు ఎన్ని పరుగుల లక్ష్యం ఎదురుగా ఉన్న ఛేదిస్తామన్న నమ్మకం కెప్టెన్ కు ఉంటుంది. అయినా అతడిలో ఏదో చిన్న వెలితి ఉన్నట్లు కనిపిస్తోంది. అతడు మరెవరో కాదు టీమిండియా వన్డే వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ. తాను ఇతర ఆటగాళ్ల తరహాలో భారీ సిక్సర్స్ బాదలేనని కోహ్లీ పేర్కొన్నాడు. ఆసియా కప్ టోర్నమెంట్ లో భాగంగా భారత్ నేడు బంగ్లాతో తలపడుతుంది. ఈ మ్యాచ్ ముందురోజు కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. టీ20ల్లో ప్రతి జట్టు ప్రమాదకరేనని, తమదైన రోజును ఏ జట్టు అయినా సరే తమ ప్రత్యర్థులను సులువుగా ఓడించగలుగుతుందని అభిప్రాయపడ్డాడు. ఇటీవల కాస్త విరామం దొరకడంతో పునరుత్తేజంతో బరిలోకి దిగుతామన్నాడు. ఇప్పుడు నా శైలి మారింది తాను ఇప్పటికే 33 టీ20 మ్యాచ్ లు ఆడినప్పటికీ కేవలం 27 సిక్సర్స్ కొట్టానని, బౌండరీలు అయితే 127 కొట్టినట్లు చెప్పాడు. భారీ సిక్సర్స్ కొట్టడం తనవల్ల కాదని, అందుకే ఎక్కువగా ఫోర్లు బాదేందుకు ప్రయత్నిస్తానని చెప్పుకొచ్చాడు. టీ20 తొలిరోజుల్లో పది బంతులకు పది పరుగులు చేయాలని భావించేవాడినని, ఆ తర్వాత తన దృక్పథంలో మార్పు వచ్చిందన్నాడు. ఏ ప్రత్యర్థి జట్టును తాము తక్కువ అంచానా వేయడం లేదని, అన్ని జట్లను బలమైన ప్రత్యర్థులుగా స్వీకరిస్తామన్నాడు. గతేడాది మా జట్టు 1-2తో బంగ్లాతో ఓటమి పాలైన విషయాన్ని ప్రస్తావించాడు. బౌలర్ ముస్తాఫిజర్ అద్భుత ప్రదర్శన కారణంగా తమ ఓటమి తప్పలేదన్నాడు.