న్యూజిలాండ్ స్టార్ టిమ్ సీఫెర్ట్ విటాలిటీ టి20 బ్లాస్ట్ టోర్నమెంట్‌లో సూపర్ సెంచరీతో మెరిశాడు. ససెక్స్ తరపున ఆడుతున్న టిమ్ సీఫెర్ట్ సెంచరీ(56 బంతుల్లో 100 నాటౌట్, 9 ఫోర్లు, 5 సిక్సర్లు) జట్టును ఓటమి నుంచి మాత్రం కాపాడలేకపోయింది. విషయంలోకి వెళితే.. శనివారం రాత్రి హాంప్‌షైర్, ససెక్స్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన హాంప్‌షైర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఓపెనర్లు జేమ్స్ విన్స్(65), బెన్ మెక్‌డొర్మెట్ 60 పరుగులతో చెలరేగారు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 124 పరుగులు జత చేయడంతో హాంప్‌షైర్ భారీ స్కోరు చేసింది.
అనంతరం బ్యాటింగ్ చేసిన ససెక్స్.. టిమ్ సీఫెర్ట్ మినహా మిగతావారు పెద్దగా రాణించలేకపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో హాంప్‌షైర్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా సీఫెర్ట్ ఆఖరి వరకు నాటౌట్‌గా నిలిచి చివరి బంతికి సెంచరీ పూర్తి చేసుకున్నప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా సీఫెర్ట్ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మధ్యలో డిల్‌రే రావ్‌లిన్స్ 32 పరుగులతో నిలదొక్కుకోవడంతో ఒక దశలో హాంప్‌షైర్ గెలుస్తుందనే ఆశలు కలిగాయి. కానీ రావ్‌లిన్స్ ఔట్ కావడం.. సీఫెర్ట్‌పై ఒత్తిడి పడడం జట్టు విజయాన్ని దెబ్బ తీసింది.
చదవండి: Mitchell Marsh: 'భారత్‌లో నాకు శాపం తగిలింది'.. ఆసీస్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Vs Javed Miandad: రవిశాస్త్రి, మియాందాద్‌ల గొడవకు కారణమైన 'ఆడి' కారు.?
Runs: 1️⃣0️⃣0️⃣*
— Vitality Blast (@VitalityBlast) June 4, 2022
Fours: 9️⃣
Sixes: 5️⃣
That is a fantastic innings from Tim Seifert 👏#Blast22 | @SussexCCC pic.twitter.com/FxRlzGYlbf
Comments
Please login to add a commentAdd a comment