టి20 బ్లాస్ట్ 2023లో భాగంగా గ్లామోర్గాన్స్ తరపున తొలి శతకం నమోదైంది. గ్లామోర్గాన్ బ్యాటర్ క్రిస్ కూక్ 38 బంతుల్లోనే శతకం మార్క్ సాధించి రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా 41 బంతుల్లో 113 పరుగులు నాటౌట్‌గా నిలిచిన క్రిస్ కూక్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. కాగా క్రిస్ కూక్ సెంచరీ ఈ సీజన్ టి20 బ్లాస్ట్‌లో ఏడో శతకం. ఇక టి20 బ్లాస్ట్ టోర్నీలో క్రిస్ కూక్‌ది జాయింట్ ఆరో ఫాస్టెస్ట్ సెంచరీ. 26 బంతుల్లో అర్థసెంచరీ చేసిన క్రిస్ కూక్.. తర్వాతి 12 బంతుల్లోనే మరో 50 పరుగులు చేయడం విశేషం
ఇక అంతర్జాతీయ టి20 క్రికెట్‌లో అత్యల్ప బంతుల్లో సెంచరీ సాధించిన ఆటగాళ్లు ముగ్గురు ఉన్నారు. డేవిడ్ మిల్లర్, రోహిత్ శర్మ, సుదేశ్ విక్రమసేనలు 35 బంతుల్లోనే శతకం సాధించి తొలి స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో పెరియాల్వార్, జీషన్ కుకికెల్, జాన్సన్ చార్లెస్‌లు 39 బంతుల్లో ఈ ఫీట్ సాధించడం విశేషం. అంతర్జాతీయం కాకుండా అత్యల్ప బంతుల్లో సెంచరీ సాధించిన నాలుగో ఆటగాడిగా క్రిస్ కూక్ ఘనత సాధించాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే గ్లామోర్గాన్స్ 29 పరుగుల తేడాతో మిడిలెసెక్స్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గ్లామెర్గాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోరు చేసింది. క్రిస్ కూక్‌కు తోడుగా కొలిన్ ఇంగ్రామ్(51 బంతుల్లో 92 నాటౌట్) రాణించాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మిడిలెసెక్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేయగలిగింది. స్టీఫెన్ ఎస్కినాజి 59, జో క్రాక్‌నెల్ 77 మినహా మిగతావరు విఫలమయ్యారు.
WHAT A CENTURY!!! 💯
— Vitality Blast (@VitalityBlast) May 31, 2023
Chris Cooke scores his 100 from just 38 balls which is the joint-sixth fastest Blast ton 🤯#Blast23 pic.twitter.com/wPU58omoJh
చదవండి: ఫామ్‌లో ఉన్నాడు.. రికార్డులు బద్దలు కొట్టడం కష్టమేమి కాదు
Comments
Please login to add a commentAdd a comment