t20 century
-
‘ఇలాంటి టీ20 సెంచరీ చూడనేలేదు.. వన్డేల్లోనూ ఇదే దూకుడు’
టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma)పై హెడ్ కోచ్ గౌతం గంభీర్(Gautam Gambhir) ప్రశంసలు కురిపించాడు. ఇంగ్లండ్‌తో చివరి టీ20లో భారీ సెంచరీతో చెలరేగిన అభిషేక్ ఆటతీరు అమోఘమని కొనియాడాడు. ఇంతకంటే మెరుగైన టీ20 సెంచరీ తానెప్పుడూ చూడలేదని గంభీర్ అన్నాడు. పరుగుల సునామీకాగా ఇంగ్లండ్‌తో నామమాత్రపు ఐదో టీ20(India vs England)లో అభిషేక్ ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. పదిహేడు బంతుల్లోనే యాభై పరుగుల మార్కు అందుకున్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 37 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఇంగ్లండ్ బౌలర్లను ఏ దశలోనూ కోలుకోకుండా చేసి.. మొత్తంగా 54 బంతుల్లో ఏడు ఫోర్లు, ఏకంగా పదమూడు సిక్సర్ల సాయంతో 135 పరుగులు సాధించాడు. ధనాధన్ ఇన్నింగ్స్‌తో అభిషేక్ పరుగుల వరద పారిస్తుంటే వాంఖడేలో నేరుగా ఈ అద్బుతాన్ని వీక్షించిన ప్రేక్షకులతో పాటు.. టీవీలు, ఫోన్లలో మ్యాచ్ చూస్తున్న క్రికెట్ ప్రేమికులూ ఆనందంతో మురిసిపోయారు.ప్రశంసల వర్షంఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ ఆట తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక హెడ్‌కోచ్ గౌతం గంభీర్ కూడా అభిషేక్ తుఫాన్ ఇన్నింగ్స్‌కు ఫిదా అయిపోయాడు. ‘అభిషేక్ నిర్భయంగా, నిర్దాక్షిణ్యంగా ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. కొత్త తరం ఆటగాళ్లు భయం లేకుండా దూకుడుగా ఆడుతున్నారు. అలాంటి వాళ్లకు అండగా నిలుస్తాం.ఇలాంటి టీ20 సెంచరీ చూడనేలేదుఇంగ్లండ్ బౌలర్లు 140–150 కిలోమీటర్ల వేగంతో బంతులు విసురుతుంటే అభిషేక్ అలవోకగా సిక్సర్లు బాదాడు. దీనికంటే గొప్ప టీ20 శతకాన్ని చూడలేదు. ఫలితాలు అనుకూలంగా వస్తే అంత సవ్యంగా సాగుతుంది. పరాజయాలు ఎదురైనప్పుడే జట్టుపై విమర్శలు వస్తాయి. అలాంటి కష్ట కాలాన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొంటాం.వన్డేల్లోనూ ఇదే దూకుడుఈ జట్టు చాలా కాలంగా కలిసి ఆడుతోంది. వారి మధ్య మంచి అనుబంధం ఉంది. 140 కోట్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహించడం అంటే ఎలా ఉంటుందో మా ఆటగాళ్లకు తెలుసు. వన్డేల్లోనూ ఇదే దూకుడు కొనసాగిస్తూ అభిమానులను అలరిస్తాం’ అని గంభీర్ పేర్కొన్నాడు. కాగా ఐదు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌లు ఆడేందుకు ఇంగ్లండ్ భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తొలుత టీ20 సిరీస్‌లో భాగంగా కోల్‌కతా, చెన్నై మ్యాచ్‌లలో గెలిచిన సూర్యకుమార్ సేన.. రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టీ20లో ఓటమిపాలైంది. అయితే, పుణెలో జరిగిన నాలుగో మ్యాచ్‌లో విజయం సాధించి.. మరో టీ20 మిగిలి ఉండగానే సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది.247 పరుగులు ఈ క్రమంలో వాంఖడే మైదానంలో ఇరుజట్ల మధ్య నామమాత్రపు ఐదో టీ20లో గెలిచి పరువు నిలబెట్టుకోవాలని భావించిన ఇంగ్లండ్ ఆశలపై భారత జట్టు నీళ్లు చల్లింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. అభిషేక్ శర్మ సునామీ శతకం కారణంగా టీమిండియా నిర్ణీత ఇరవై ఓవర్లలో.. తొమ్మిది వికెట్ల నష్టానికి ఏకంగా 247 పరుగులు చేసింది.ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ భారత బౌలర్ల ధాటికి 97 పరుగులకే కుప్పకూలింది. ఫిలిప్ సాల్ట్(23 బంతుల్లో 55) మెరుపు హాఫ్ సెంచరీతో అలరించినా.. మిగతా వాళ్లలో జాకొబ్ బెతల్(10) మినహా ఎవరూ కనీసం రెండంకెల స్కోరు చేయలేకపోయారు. టీమిండియా బౌలర్లలో మహ్మద్ షమీ మూడు, వరుణ్ చక్రవర్తి, శివం దూబే, అభిషేక్ శర్మ రెండేసి వికెట్లు కూల్చగా.. రవి బిష్ణోయి ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఇక ఇంగ్లండ్‌పై 150 పరుగుల భారీ తేడాతో గెలిచిన టీమిండియా సిరీస్‌ను 4-1తో ముగించింది. తదుపరి ఫిబ్రవరి 6 నుంచి ఇరుజట్ల మధ్య వన్డే సిరీస్ మొదలుకానుంది.చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన అభిషేక్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
స్టీవ్ స్మిత్ ఊచకోత.. విధ్వంసకర శతకం.. ‘బిగ్’ రికార్డ్!
ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్(Steve Smith) విధ్వంసకర శతకంతో మెరిశాడు. ప్రత్యర్థి జట్టు బౌలింగ్‌ను ఊచకోత కోసి.. 58 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. బిగ్ బాష్ లీగ్ 2024- 25(Big Bash League 2024-25 )లో సిడ్నీ సిక్సర్స్- పెర్త్ స్కార్చర్స్ మ్యాచ్ సందర్భంగా స్మిత్ ఈ మేర బ్యాట్ ఝులిపించాడు.బిగ్ రికార్డు.. ఫాస్టెస్ట్‌గా మూడు సెంచరీలుఓవరాల్గా టీ20 ఫార్మాట్లో స్మిత్‌కు ఇది నాలుగో సెంచరీ కాగా.. బిగ్ బాష్ లీగ్(బీబీఎల్)లో మూడోది. తద్వారా లీగ్ చరిత్రలో అత్యధిక శతకాలు బాదిన క్రికెటర్‌గా బెన్ మెక్‌డెర్మాట్(3)ను రికార్డును అతడు సమం చేశాడు. అయితే, మెక్‌డెర్మాట్(Ben McDermott) మూడు శతకాలు బాదడానికి 100 మ్యాచ్‌లు అవసరం కాగా.. స్మిత్ తన 32వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించాడు.కాగా బీబీఎల్‌లో స్మిత్ సిడ్నీ సిక్సర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. లీగ్ తాజా ఎడిషన్‌లో అతడికి ఇదే తొలి మ్యాచ్. ఇటీవల టీమిండియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీతో బిజీబిజీగా గడిపిన ఈ ఆసీస్ సీనియర్ బ్యాటర్.. మెల్బోర్న్ బాక్సింగ్ డే టెస్టులో శతకం బాది ఫామ్‌లోకి వచ్చాడు. లంక టూర్లో సారథిగాఇక ఈ ఐదు టెస్టు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో 3-1తో భారత జట్టుపై గెలిచిన కంగారూలు.. పదేళ్ల తర్వాత ప్రతిష్టాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీని సొంతం చేసుకున్నారు. అనంతరం.. శ్రీలంకతో రెండు టెస్టులు ఆడేందుకు ఆస్ట్రేలియా జట్టు అక్కడికి వెళ్లనుంది. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ సిరీస్‌కు దూరం కాగా.. అతడి స్థానంలో స్టీవ్ స్మిత్ సారథ్య బాధ్యతలు నిర్వర్తించునున్నాడు. అయితే, జనవరి 29 నుంచి ఆసీస్ లంక టూర్ మొదలుకానుంది. ఈ గ్యాప్‌లో స్మిత్ బీబీఎల్‌లో ఎంట్రీ ఇచ్చి.. తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో దుమ్ములేపాడు.ఈలోపు బీబీఎల్‌లో ఎంట్రీసిడ్నీ వేదికగా పెర్త్ స్కార్చర్స్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన సిడ్నీ సిక్సర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్ జోష్ ఫిలిప్(9) విఫలం కాగా.. మరో ఓపెనర్ స్మిత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అరవై నాలుగు బంతుల్లోనే 121 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా పది ఫోర్లతో పాటు ఏడు సిక్సర్లు ఉండటం విశేషం.మిగతా వాళ్లలో కర్టిస్ పాటర్సన్(12) నిరాశపరచగా.. కెప్టెన్ మోయిజెస్ హెండ్రిక్స్ మెరుపు ఇన్నింగ్స్(28 బంతుల్లో 46) ఆడాడు. ఇక బెన్ డ్వార్షుయిస్ ధనాధన్ దంచికొట్టి కేవలం ఏడు బంతుల్లోనే 23 పరుగులు సాధించాడు. స్మిత్‌తో కలిసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో సిడ్నీ సిక్సర్స్ కేవలం మూడు వికెట్ల నష్టానికి 220 పరుగులు స్కోరు చేసింది.ఆఖరి వరకు పోరాడినాఇక లక్ష్య ఛేదనకు దిగిన పెర్త్ స్కార్చర్స్‌కు ఓపెనర్ సామ్ ఫానింగ్(41) శుభారంభం అందించినా.. మరో ఓపెనర్ ఫిన్ అలెన్(15) నిరాశపరిచాడు. మిగతా వాళ్లలో కూపర్ కొన్నోలీ(33), మాథ్యూ కెప్టెన్(17 బంతుల్లో 28) ఫర్వాలేదనిపించారు. ఇక ఆష్టన్ టర్నర్(32 బంతుల్లో 66 నాటౌట్) ఆఖరి వరకు పోరాడాడు. కానీ అప్పటికే బంతులు అయిపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయిన పెర్త్ జట్టు 206 పరుగుల వద్దే నిలిచిపోయింది. ఫలితంగా సిడ్నీ పద్నాలుగు పరుగుల తేడాతో గెలుపొంది. సిడ్నీ సిక్సర్స్ విజయంలో కీలక పాత్ర పోషించిన స్టీవ్ స్మిత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.చదవండి: ‘రోహిత్ శర్మ ఖేల్ ఖతం.. అందులో మాత్రం భవిష్యత్తు ఉంది’Steve Smith is something else 😲 Here's all the highlights from his 121* off 64 balls. #BBL14 pic.twitter.com/MTo82oWAv1— KFC Big Bash League (@BBL) January 11, 2025 -
తిలక్ వర్మ విధ్వంసకర సెంచరీ.. టీ20 ఫార్మాట్లోనే తొలి బ్యాటర్‌గా.. వరల్డ్ రికార్డు!
టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో వరుసగా మూడు శతకాలు బాదిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సాధించాడు. కాగా అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ తరఫున వెలుగులోకి వచ్చిన ఈ హైదరాబాదీ.. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్‌కు ఆడుతున్నాడు.ముంబై తరఫున అరంగేట్రంలోనే అదరగొట్టిన తిలక్ వర్మ.. టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలోనే గతేడాది భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు 20 టీ20లు, 4 వన్డేలు ఆడిన తిలక్ వర్మ ఆయా ఫార్మాట్లలో 68, 616 పరుగులు చేశాడు.సౌతాఫ్రికా గడ్డపై వరుసగా రెండు శతకాలుఇక అంతర్జాతీయ టీ20లలో తిలక్ వర్మకు ఇటీవలే రెండు సెంచరీలు బాదడం విశేషం. ఇటీవల సౌతాఫ్రికా గడ్డపై ఈ ఘనత సాధించాడు. తాజాగా అతడు దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హైదరాబాద్ తరఫున బరిలోకి దిగాడు.ఫోర్లు, సిక్సర్ల వర్షం ఇక్కడా.. తిలక్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ కేవలం 51 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. మేఘాలయతో మ్యాచ్‌లో ఫోర్లు(14), సిక్సర్ల(10) వర్షం కురిపిస్తూ పరుగుల విధ్వంసం సృష్టించాడు. కేవలం 67 బంతుల్లోనే 151 పరుగులతో దుమ్ములేపి కెప్టెన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి హైదరాబాద్‌కు 248 పరుగులు భారీ స్కోరు అందించాడు.సహచర బ్యాటర్ తన్మయ్ అగర్వాల్(55)తో కలిసి 122 పరుగుల భాగస్వామ్యం నమోదు చేయడంతో పాటు.. రాహుల్ బుద్ధి(30)తో కలిపి 84 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. రాజ్‌కోట్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన మేఘాలయ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌కు ఆదిలోనే షాక్ తగిలింది.సుడిగాలి ఇన్నింగ్స్‌లో ఆఖరి వరకు అజేయంగాఓపెనర్ రాహుల్ సింగ్ డకౌట్ అయ్యాడు. అయితే, మరో ఓపెనర్ తన్మయ్ సహకారం అందించగా కెప్టెన్ తిలక్ వర్మ ఈ మేర సుడిగాలి ఇన్నింగ్స్‌లో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో హైదరాబాద్ కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 248 రన్స్ చేసింది.హైదరాబాద్ భారీ విజయంఇక కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన మేఘాలయ హైదరాబాద్ బౌలర్ల ధాటికి 69 పరుగులకే కుప్పకూలింది. 15.1 ఓవర్లలోనే ఆలౌట్ అయింది. దీంతో హైదరాబాద్ ఏకంగా 179 పరుగులతో భారీ విజయం సాధించింది. ఇక హైదరాబాద్ బౌలర్లలో అనికేత్ రెడ్డి నాలుగు, తనయ్ త్యాగరాజన్ మూడు, మికిల్ జైస్వాల్, సరణు నిషాంత్, తెలకపల్లి రవితేజ ఒక్కో వికెట్ పడగొట్టారు.చదవండి: Ind vs Aus 1st Test: ఎవరు అవుట్?.. రాహుల్ ద్రవిడ్ మనసంతా ఇక్కడే..!Tilak Varma becomes the FIRST ever player to score 3 back-to-back T20 centuries.2 for India vs South AfricaToday in SMAT pic.twitter.com/ctVqGgm1wd— Kausthub Gudipati (@kaustats) November 23, 2024 -
'చాలా సంతోషంగా ఉంది.. ఈ క్షణం కోసమే పదేళ్లుగా ఎదురుచూస్తున్నా'
డర్బన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ విధ్వంసకర సెంచరీతో కదం తొక్కాడు. ప్రధాన ఆటగాళ్లు దూరం కావడంతో తనకు వచ్చిన అవకాశాలను శాంసన్ రెండు రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు.గత నెలలో హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌పై శివతాండవం చేసిన సంజూ.. ఇప్పుడు సఫారీ గడ్డపై బీబత్సం సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో వరుస ఇన్నింగ్స్‌లలో సెంచరీలు సాధించిన తొలి భారత బ్యాటర్‌గా శాంసన్ రికార్డులకెక్కాడు. కేవలం 50 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 107 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ ఈ కేరళ స్టార్ నిలిచాడు. ఇక తన అద్బుత ఇన్నింగ్స్‌పై సంజూ శాంసన్ స్పందించాడు. ఇన్నింగ్స్ బ్రేక్‌లో బ్రాడ్‌కాస్టర్‌తో మాట్లాడుతూ ఆధికారిక బ్రాడ్‌కాస్టర్‌తో సంజూ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు."నేను ఇప్పుడు ఎక్కువగా ఆలోచిస్తే కచ్చితంగా ఎమోషనల్ అవుతాను. ఎందుకంటే ఈ క్షణం కోసమే గత 10 ఏళ్ల నుంచి వేచి ఉన్నాను. నేను ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. చాలా మంది నాకు సపోర్ట్‌గా నిలిచారు.నా కష్టానికి తగ్గ ఫలితం ఇన్నాళ్లకు దక్కింది. కానీ నేను గాల్లో తేలిపోవాలనుకోవటం లేదు. రాబోయే మ్యాచ్‌ల్లో కూడా ఇదే తరహా ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తానని" అని భారత్ ఇన్నింగ్స్ అనంతరం సంజూ పేర్కొన్నాడు."ఈ మ్యాచ్‌లో నా బ్యాటింగ్‌ను నేను అస్వాదించాను. నా ఫామ్‌ను పూర్తిగా వినిగియోగించుకున్నాను. మేము దూకుడుగా ఆడాలని ముందే నిర్ణయించుకున్నాము. మూడు నాలుగు బంతులు ఆడిన తర్వాత కచ్చితంగా బౌండరీ కోసం ప్రయత్నించాల్సిందే. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నాను" అని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో శాంసన్ చెప్పుకొచ్చాడు.చదవండి: IND-A vs AUS-A: తీరు మారని టీమిండియా.. ఆసీస్ చేతిలో మరో ఓటమి -
శాంసన్ సరికొత్త చరిత్ర.. ధోనికి కూడా సాధ్యం కాలేదు
హైదరాబాద్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్బుతమైన సెంచరీతో మెరిశాడు. తొలి రెండు టీ20ల్లో 29, 10 పరుగులతో నిరాశపరిచిన సంజూ.. ఆఖరి టీ20లో మాత్రంలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బంగ్లా బౌలర్లకు శాంసన్ చుక్కులు చూపించాడు. ఈ క్రమంలో కేవలం 40 బంతుల్లోనే తన తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీని సంజూ అందుకున్నాడు. ఓవరాల్‌గా ఈ కేరళ స్టార్ క్రికెటర్ 47 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్స్‌లతో 111 పరుగులు చేసాడు. ఇక ఈ మ్యాచ్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన సంజూ పలు అరుదైన రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. శాంసన్ సాధించిన రికార్డులు ఇవే..➔అంతర్జాతీయ టీ20ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన నాల్గవ బ్యాటర్‌గా శాంసన్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా స్టార్ డేవిడ్ మిల్లర్ అగ్రస్ధానంలో ఉన్నాడు. 2017లో బంగ్లాదేశ్‌పై 35 బంతుల్లో మిల్లర్ సెంచరీ సాధించాడు. అదే విధంగా భారత్ తరపున ఈ ఘనత అందుకున్న రెండో ప్లేయర్‌గా శాంసన్ నిలిచాడు. ఈ లిస్ట్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడు. హిట్‌మ్యాన్ శ్రీలంకపై 35 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు.➔ఈ మ్యాచ్‌లో బంగ్లా స్పిన్నర్ రిషద్ హోస్సేన్‌ను సంజూ ఊతికారేశాడు. హోస్సేన్ వేసిన 10 ఓవర్లో వరుసగా ఐదు సిక్స్‌లు బాది 30 పరుగులు పిండుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో ఒకే ఓవర్లో ఐదు లేదా అంతకంటే ఎక్కువ సిక్స్‌లు పరుగులు చేసిన రెండో భారత బ్యాటర్‌గా శాంసన్ రికార్డు క్రియేట్ చేశాడు. ఈ జాబితాలో భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఉన్నాడు. 2007 వరల్డ్‌కప్‌లో ఇంగ్లండ్‌పై యువీ ఆరు సిక్స్‌లు బాదాడు.➔భారత్ తరఫున టీ20ల్లో సెంచరీ సాధించిన ఏకైక వికెట్ కీపర్ బ్యాటర్‌గా సంజు శాంసన్ సంజూ చరిత్రకెక్కాడు. ఇప్పటివరకు భారత వికెట్ కీపర్ చేసిన అత్యధిక స్కోర్ 89 పరుగులు మాత్రమే. 2022లో శ్రీలంకతో జరిగిన టీ20లో ఇషాన్ కిషన్ 89 పరుగులు చేశాడు.➔బంగ్లాదేశ్‌పై టీ20ల్లో ఫాస్టెస్ట్ ఫిప్టీ చేసిన భారత క్రికెటర్‌గా సంజూ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో శాంసన్ కేవలం 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉండేది. 2019లో రాజ్‌కోట్ వేదికగా బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ 23 బంతుల్లో ఆర్ధ శతకం సాధించాడు. తాజా మ్యాచ్‌తో హిట్‌మ్యాన్ రికార్డును శాంసన్ బద్దలు కొట్టాడు.చదవండి: డీఎస్పీగా బాధ్యతలు.. పోలీస్ యూనిఫాంలో సిరాజ్! ఫోటో వైరల్ -
ఫోర్లు, సిక్సర్ల వర్షం.. సామ్ కరన్ తొలి టీ20 సెంచరీ
ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ సామ్ కర్రన్ టీ20 క్రికెట్లో తొలి శతకం సాధించాడు. టీ20 బ్లాస్ట్ లీగ్‌లో భాగంగా హాంప్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ సర్రే క్రికెటర్.. 102 పరుగులతో అజేయంగా నిలిచి సత్తా చాటాడు.లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా సర్రే- హాంప్‌షైర్ జట్లు గురువారం రాత్రి తలపడ్డాయి. టాస్ గెలిచిన సర్రే టీమ్ తొలుత బౌలింగ్ చేసింది.హాంప్‌షైర్ బ్యాటర్లలో కెప్టెన్ జేమ్స్ వినిస్(11 బంతుల్లో 23) ఫర్వాలేదనిపించగా.. ఐదో నంబర్ బ్యాటర్ టోబీ అల్బర్ట్ 66 పరుగులతో రాణించాడు.వీరిద్దరి విజృంభణ నేపథ్యంలో 183 పరుగుల భారీ స్కోరు సాధించింది. అయితే, దురదృష్టవశాత్తూ టోబీ రనౌట్ కావడం, మిగిలిన బ్యాటర్లు ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోవడంతో 19.5 ఓవర్లలోనే హాంప్‌షైర్ ఆలౌట్ అయింది.సామ్ కర్రన్ ఫోర్లు, సిక్సర్ల వర్షంఇక లక్ష్య ఛేదనకు దిగిన సర్రేకు ఆరంభంలోనే చుక్కెదురైంది. ఓపెనర్ విల్ జాక్స్ 6 పరుగులకే నిష్క్రమించాడు. మరో ఓపెనర్ డొమినిక్ సిబ్లే 27 పరుగులతో ఫర్వాలేదనిపించినా.. ఆ తర్వాతి స్థానాల్లో వచ్చిన లారీ ఇవాన్స్(8), రోరీ బర్ర్స్(7) చేతులెత్తేశారు.ఈ క్రమంలో ఇన్నింగ్స్ చక్కదిద్దే బాధ్యత తీసుకున్న సామ్ కర్రన్.. ధనాధన్ దంచికొట్టాడు. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపిస్తూ సెంచరీ కొట్టిన.. సామ్ ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు, 6 సిక్సర్లు ఉండటం విశేషం.ఇక ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో 20 ఓవర్ తొలి బంతికే సిక్సర్ బాదిన సామ్ కర్రన్ వంద పరుగుల మార్కు అందుకోవడంతో పాటు.. జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. సామ్ కర్రన్ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా హాంప్‌షైర్‌పై సర్రే 5 వికెట్ల తేడాతో గెలుపొందింది.ఏమిటీ టీ20 బ్లాస్ట్ లీగ్?రెండు దశాబ్దాలకు పైగా చరి త్ర ఉన్న టీ20 లీగ్ ఈ టీ20 బ్లాస్ట్. ఇంగ్లండ్- వేల్స్ క్రికెట్ బోర్డు 2003లో ఈ పొట్టి లీగ్‌ను మొదలుపెట్టింది.తొలుత దీనిని ట్వంటీ20 కప్(2003- 2009)గా పిలిచేవారు. ఆ తర్వాత నాలుగేళ్లపాటు ఫ్రెండ్స్లైఫ్ టీ20గా.. 2017 వరకు న్యూయెస్ట్ టీ20 బ్లాస్ట్.. ప్రస్తుతం విటలిటీ బ్లాస్ట్గా పిలుస్తున్నారు.ఈ లీగ్‌లో 18 ఫస్ట్‌క్లాస్ క్రికెట్ దేశాలు పాల్గొంటాయి. వీటిని నార్త్, సౌత్ గ్రూపులుగా విభజిస్తారు. సాధారణంగా మే- సెప్టెంబరు మధ్య కాలంలో ఈ లీగ్‌ను నిర్వహిస్తారు. టీ20 బ్లాస్ట్-2024 సీజన్ మే 30న మొదలైంది. సెప్టెంబరు 14న ఫైనల్ మ్యాచ్‌తో ముగియనుంది.నార్త్ గ్రూప్ జట్లుడెర్బీషైర్ ఫాల్కన్స్, దుర్హాం, లంకాషైర్ లైటెనింగ్, లీసెస్టర్‌షైర్ ఫాక్సెస్, నార్తాంప్టన్‌షైర్ స్టీల్‌బాక్స్, నాట్స్ అవుట్లాస్(నాటింగ్హాంషైర్), బర్మింగ్‌హాం బేర్స్(విర్విక్షైర్), వర్సెస్టైర్షైర్ ర్యాపిడ్స్, సార్క్షైర్ వికింగ్స్.సౌత్ గ్రూపు జట్లుఎసెక్స్ ఈగల్స్, గ్లామోర్గాన్, గ్లౌసెస్టర్షైర్, హాంప్‌షైర్, కెంట్ స్పిట్‌ఫైర్స్, మిడిల్సెక్స్, సోమర్సెట్, సర్రే, ససెక్స్ షార్క్స్.ఈ సీజన్లో ప్రస్తుతం నార్త్ గ్రూపు నుంచి బర్మింగ్‌హాం 18 పాయింట్లతో టాప్‌లో ఉండగా.. సౌత్ గ్రూపు నుంచి సర్రే 20 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. SAM CURRAN!! 🤩What a stunning way to reach your maiden T20 century and win a match! pic.twitter.com/bHPxZ6sTvc— Vitality Blast (@VitalityBlast) July 18, 2024 -
బాబర్ ఆజమ్ విధ్వంసం.. టీ20ల్లో 11వ శతకం
పాకిస్తాన్ సూపర్ లీగ్ 2024 ఎడిషన్‌లో పెషావర్ జల్మీ కెప్టెన్ బాబర్ ఆజమ్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ఇస్లామాబాద్ యునైటెడ్‌తో ఇవాళ (ఫిబ్రవరి 26) జరిగిన మ్యాచ్‌లో బాబర్.. 59 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఈ మ్యాచ్‌లో మొత్తం 63 బంతులను ఎదుర్కొన్న బాబర్.. 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 111 పరుగులు చేశాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.పెషావర్ ఇన్నింగ్స్‌లో బాబర్ మినహా ఎవ్వరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేకపోయారు. సైమ్ అయూబ్ (38) కాస్త పర్వాలేదనిపించగా.. మొహమ్మద్ హరీస్ (2), హసీబుల్లా ఖాన్ (0), పాల్ వాల్టర్ (19), రోవ్‌మన్ పావెల్ (8) విఫలమయ్యారు. ఆఖర్లో ఆసిఫ్ అలీ (17 నాటౌట్) వేగంగా పరుగులు సాధించాడు.ఈ మ్యాచ్‌లో తొలి హాఫ్ సెంచరీ పూర్తి చేసేందుకు 42 బంతులు తీసుకున్న బాబర్.. ఆతర్వాతి హాఫ్ సెంచరీని కేవలం 21 బంతుల్లోనే పూర్తి చేశాడు. ఇస్లామాబాద్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ 2, నసీం షా, అఘా సల్మాన్ తలో వికెట్ పడగొట్టారు. కాగా, పొట్టి క్రికెట్లో 11వ సెంచరీ (284 మ్యాచ్‌ల్లో) పూర్తి చేసుకున్న బాబర్.. ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా తన రికార్డును మరింత మెరుగుపర్చుకున్నాడు. టీ20ల్లో అత్యధిక సెంచరీల రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉంది. ఈ ఫార్మాట్లో గేల్ అత్యధికంగా 22 సెంచరీలు (463 మ్యాచ్‌ల్లో) చేశాడు. -
లీగ్‌లో తొలి శతకం నమోదు..సెంచరీ చేజార్చుకున్న సాయి సుదర్శన్
ఐపీఎల్ ముగిసిన కొద్ది రోజులకే ప్రారంభమైన తమిళనాడు ప్రీమియర్ లీగ్(TNPL2023) అభిమానులను అలరిస్తోంది. లో స్కోరింగ్ మ్యాచ్‌లు నమోదైనప్పటికి విజయం కోసం ఆఖరి బంతి వరకు ఎదురుచూడాల్సి వస్తోంది. తాజాగా శుక్రవారం లైకా కోవై కింగ్స్, నెల్లయ్ రాయల్ కింగ్స్ మధ్య మ్యాచ్ భారీ స్కోర్లు నమోదయ్యాయి. నెల్లయ్ రాయల్ కింగ్స్ బ్యాటర్ అజితేశ్ గురుస్వామి ఈ సీజన్లో తొలి సెంచరీ నమోదు చేశాడు. 60 బంతుల్లోనే ఏడు ఫోర్లు, 8 సిక్సర్లతో 112 పరుగులు చేశాడు. మరోవైపు గుజరాత్ టైటాన్స్ సంచలనం.. లైకా కోవై కింగ్స్ బ్యాటర్ సాయి సుదర్శన్ 52 బంతుల్లో 90 పరుగులు మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అయితే 10 పరుగుల తేడాతో మరోసారి సెంచరీ చేసే అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే నెల్లయ్ రాయల్ కింగ్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన లైకా కోవై కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 181 పరుగులు చేసింది. సాయి సుదర్శన్ 90, సురేశ్ కుమార్ 33 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన నెల్లయ్ రాయల్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. అజితేశ్ గురుస్వామి (112 పరుగులు) ఒక్కడే జట్టును గెలిపించడం విశేషం. G Ajitesh cracks 1st hundred of #TNPL2023 👏 P.S. Full innings will be up soon on our Youtube channel.#TNPLonFanCode pic.twitter.com/PAB1BjewTc — FanCode (@FanCode) June 16, 2023 చదవండి: బజ్‌బాల్ దూకుడు; రూట్ సెంచరీ.. తొలి రోజే ఇన్నింగ్స్ డిక్లేర్ -
విధ్వంసకర ఇన్నింగ్స్.. 38 బంతుల్లోనే సెంచరీ
టి20 బ్లాస్ట్ 2023లో భాగంగా గ్లామోర్గాన్స్ తరపున తొలి శతకం నమోదైంది. గ్లామోర్గాన్ బ్యాటర్ క్రిస్ కూక్ 38 బంతుల్లోనే శతకం మార్క్ సాధించి రికార్డులకెక్కాడు. ఓవరాల్‌గా 41 బంతుల్లో 113 పరుగులు నాటౌట్‌గా నిలిచిన క్రిస్ కూక్ ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. కాగా క్రిస్ కూక్ సెంచరీ ఈ సీజన్ టి20 బ్లాస్ట్‌లో ఏడో శతకం. ఇక టి20 బ్లాస్ట్ టోర్నీలో క్రిస్ కూక్ది జాయింట్ ఆరో ఫాస్టెస్ట్ సెంచరీ. 26 బంతుల్లో అర్థసెంచరీ చేసిన క్రిస్ కూక్.. తర్వాతి 12 బంతుల్లోనే మరో 50 పరుగులు చేయడం విశేషం ఇక అంతర్జాతీయ టి20 క్రికెట్లో అత్యల్ప బంతుల్లో సెంచరీ సాధించిన ఆటగాళ్లు ముగ్గురు ఉన్నారు. డేవిడ్ మిల్లర్, రోహిత్ శర్మ, సుదేశ్ విక్రమసేనలు 35 బంతుల్లోనే శతకం సాధించి తొలి స్థానంలో ఉన్నారు. రెండో స్థానంలో పెరియాల్వార్, జీషన్ కుకికెల్, జాన్సన్ చార్లెస్‌లు 39 బంతుల్లో ఈ ఫీట్ సాధించడం విశేషం. అంతర్జాతీయం కాకుండా అత్యల్ప బంతుల్లో సెంచరీ సాధించిన నాలుగో ఆటగాడిగా క్రిస్ కూక్ ఘనత సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే గ్లామోర్గాన్స్ 29 పరుగుల తేడాతో మిడిలెసెక్స్పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గ్లామెర్గాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోరు చేసింది. క్రిస్ కూక్‌కు తోడుగా కొలిన్ ఇంగ్రామ్(51 బంతుల్లో 92 నాటౌట్) రాణించాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మిడిలెసెక్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 209 పరుగులు చేయగలిగింది. స్టీఫెన్ ఎస్కినాజి 59, జో క్రాక్నెల్ 77 మినహా మిగతావరు విఫలమయ్యారు. WHAT A CENTURY!!! 💯 Chris Cooke scores his 100 from just 38 balls which is the joint-sixth fastest Blast ton 🤯#Blast23 pic.twitter.com/wPU58omoJh — Vitality Blast (@VitalityBlast) May 31, 2023 చదవండి: ఫామ్‌లో ఉన్నాడు.. రికార్డులు బద్దలు కొట్టడం కష్టమేమి కాదు -
కోహ్లికి సాటెవ్వరు.. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన మొనగాడిగా
ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ స్టార్.. కింగ్ కోహ్లి రెండో సెంచరీ నమోదు చేశాడు. ఆదివారం(మే 21) గుజరాత్ టైటాన్స్‌తో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కోహ్లి ఈ ఫీట్ అందుకున్నాడు. 60 బంతుల్లో శతకం మార్క్ సాధించిన కోహ్లి ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. సీజన్లో కోహ్లికి ఇది రెండో సెంచరీ కాగా.. ఎస్ఆర్హెచ్తో జరిగిన గత మ్యాచ్‌లోనూ కోహ్లి సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఓవరాల్‌గా కోహ్లికి ఇది ఏడో సెంచరీ. ఈ సెంచరీతో కోహ్లి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన మొనగాడిగా కోహ్లి నిలిచాడు. ఇప్పటివరకు ఆరు సెంచరీలతో గేల్‌తో సమానంగా ఉన్న కోహ్లి తాజాగా అతన్ని దాటి అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. కోహ్లి, గేల్ తర్వాత జాస్ బట్లర్ ఆరు సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక ఐపీఎల్ 2023లో కోహ్లిది పదోదో శతకం. ఇంతకముందు హెన్రిచ్ క్లాసెన్ (104 పరుగులు), విరాట్ కోహ్లీ (100 పరుగులు), శుభమాన్ గిల్ (101 పరుగులు), ప్రబ్సిమ్రాన్ సింగ్ (103 పరుగులు) , సూర్యకుమార్ యాదవ్ (103* పరుగులు) , యశస్వి జైస్వాల్ (124 పరుగులు) , వెంకటేష్ అయ్యర్ (104 పరుగులు) , హ్యారీ బ్రూక్ (100* పరుగులు), కోహ్లి(101*)తో ఉన్నారు. ఇక టి20 క్రికెట్లో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్లలో కోహ్లి 8 సెంచరీలతో మైకెల్ కింగర్, డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్లతో కలిసి సంయుక్తంగా ఉన్నాడు. ఇక తొలి స్థానంలో క్రిస్ గేల్(22 సెంచరీలు) ఉండగా.. బాబర్ ఆజం 9 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్లో ఒకే సీజన్లో వరుసగా రెండు సెంచరీలు బాదిన మూడో క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. ఇంతకముందు శిఖర్ ధావన్(2020లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున), జాస్ బట్లర్(రాజస్తాన్ రాయల్స్ తరపున 2022లో) వరుసగా రెండు సెంచరీలు బాదారు. Not just a player, he is an emotion 🙌🤩#KingKohli 👑 conquers his way to the most centuries in #TATAIPL history 🤯#RCBvGT #IPLonJioCinema #EveryGameMatters #IPL2023 | @RCBTweets @imVkohli pic.twitter.com/J2d4vnO0PX — JioCinema (@JioCinema) May 21, 2023 చదవండి: 'గతేడాది ఆర్సీబీకి సాయం చేశాం.. ఈసారి పరిస్థితి వేరు' -
నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. సెంచరీతో మెరిసిన 'కింగ్' కోహ్లి
ఐపీఎల్ 16వ సీజన్లో కింగ్ కోహ్లి సెంచరీ మార్క్ సాధించాడు. గురువారం ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ఈ ఆర్సీబీ ఓపెనర్ సిక్సర్‌తో శతకం పూర్తి చేయడం విశేషం. ఈ సీజన్లో ఆర్సీబీ తరపున కోహ్లిది తొలి శతకం కాగా.. ఓవరాల్‌గా సీజన్లో ఇది ఏడో శతకం. 61 బంతుల్లో శతకం సాధించిన కోహ్లి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. 35 బంతుల్లో తొలి ఫిఫ్టీ సాధించిన కోహ్లి.. మలి ఫిఫ్టీని 26 బంతుల్లో అందుకున్నాడు. కాగా కోహ్లికి ఐపీఎల్లో ఇది ఆరో శతకం కాగా.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ శతకంతో మెరవడం విశేషం. అచ్చొచ్చిన ఉప్పల్ స్టేడియంలో కోహ్లి సెంచరీ సాధించడం అభిమానులను సంతోషపెట్టింది. అంతేకాదు ప్లేఆఫ్ రేసులో ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్రో పోషించాడు. కోహ్లి ఆడిన ఈ ఇన్నింగ్స్ కొంతకాలం గుర్తుండిపోవడం ఖాయం. A magnificent CENTURY by Virat Kohli 🔥🔥 Take a bow, King Kohli! His SIXTH century in the IPL.#TATAIPL #SRHvRCB pic.twitter.com/gd39A6tp5d — IndianPremierLeague (@IPL) May 18, 2023 చదవండి: 'కెప్టెన్ అయ్యుండి ఉమ్రాన్ విషయం తెలియదంటావ్!' -
క్లాసెన్ విధ్వంసం.. సీజన్లో ఎస్ఆర్హెచ్ తరపున రెండో శతకం
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ నుంచి స్థిరమైన బ్యాటింగ్ కనబరుస్తున్న ఒకే ఒక్కడు హెన్రిచ్ క్లాసెన్. అలాంటి క్లాసెన్ గురువారం ఆర్సీబీతో మ్యాచ్‌లో సెంచరీ మార్క్ అందుకున్నాడు. 49 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న క్లాసెన్ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. Photo: IPL Twitter కాగా క్లాసెన్‌కు ఐపీఎల్లో ఇదే తొలి శతకం కాగా.. ఎస్ఆర్హెచ్ తరపున ఈ సీజన్లో క్లాసెన్‌ది రెండో శతకం కాగా.. తొలి శతకం హ్యారీ బ్రూక్ సాధించిన సంగతి తెలిసిందే. ఓవరాల్‌గా ఈ సీజన్లో ఇది ఆరో సెంచరీ. ఇంతకముందు ఈ సీజన్లో వెంకటేశ్ అయ్యర్(కేకేఆర్), యశస్వి జైశ్వాల్(రాజస్తాన్ రాయల్స్), హ్యారీ బ్రూక్(ఎస్ఆర్హెచ్), సూర్యకుమార్ యాదవ్(ముంబై ఇండియన్స్), ప్రభ్‌సిమ్రన్ సింగ్(పంజాబ్ కింగ్స్) సెంచరీ మార్క్ అందుకున్నారు. Klaasen mowa khundal khundal ke maarre 💯 Heroic Heinrich shines bright in Hyderabad with his maiden #TATAIPL ton ⚡️🔥#SRHvRCB #IPL2023 #IPLonJioCinema #EveryGameMatters | @SunRisers pic.twitter.com/s54WE0x5FR — JioCinema (@JioCinema) May 18, 2023 చదవండి: RCB ప్లేఆఫ్ కోసం పూజలు.. పిచ్చి పీక్స్ అంటే ఇదే! -
సూపర్ ప్రబ్‌సిమ్రన్.. ఓపెనర్‌గా వచ్చి సెంచరీ కొట్టి
ఐపీఎల్ 16వ సీజన్లో ఐదో శతకం నమోదైంది. శనివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రబ్‌సిమ్రన్ ఐపీఎల్లో మెయిడెన్ సెంచరీ నమోదు చేశాడు. 61 బంతుల్లో శతకం మార్క్ అందుకున్న ప్రబ్‌సిమ్రన్ ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. కాస్త నెమ్మదిగా బ్యాటింగ్ చేసినప్పటికి బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై ప్రబ్‌సిమ్రన్ ఒంటరిగా పోరాడాడు. ఒకవైపు వికెట్లు కోల్పోతున్నా తాను మాత్రం స్థిరంగా ఆడి సెంచరీ మార్క్ సాధించాడు. ఈ సీజన్లో ప్రబ్సిమ్రన్ది ఐదో శతకం కాగా.. ఇంతకముందు వెంకటేశ్ అయ్యర్(కేకేఆర్), యశస్వి జైశ్వాల్(రాజస్తాన్ రాయల్స్), హ్యారీ బ్రూక్(ఎస్ఆర్హెచ్), సూర్యకుమార్ యాదవ్(ముంబై ఇండియన్స్) సెంచరీలు బాదారు. అంతేకాదు ఐపీఎల్ చరిత్రలో పిన్న వయసులో సెంచరీ బాదిన క్రికెటర్ల జాబితాలో ప్రబ్‌సిమ్రన్ సింగ్ చోటు సంపాదించాడు. 22 ఏళ్ల 276 రోజుల్లో ప్రబ్‌సిమ్రన్ ఐపీఎల్లో సెంచరీ నమోదు చేశాడు. 𝙋𝙧𝙖𝙗𝙝 𝙧𝙖𝙖𝙠𝙝𝙖 🔥 Maiden #TATAIPL 💯 for @prabhsimran01 🦁 to give @PunjabKingsIPL an edge in this crucial match!#EveryGameMatters #DCvPBKS #TATAIPL #IPL2023 #IPLonJioCinema pic.twitter.com/hicf7UINCM — JioCinema (@JioCinema) May 13, 2023 చదవండి: 'యష్ దయాల్ చివర్లో.. నువ్వు మధ్యలోనే ముంచేశావ్' -
సెంచరీతో కదం తొక్కిన జైశ్వాల్.. యంగెస్ట్ ప్లేయర్‌గా రికార్డు
ఐపీఎల్ 16వ సీజన్లో రాజస్తాన్రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ తన సూపర్ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ఆదివారం ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో జైశ్వాల్ సెంచరీతో కదం తొక్కాడు. కాగా జైశ్వాల్‌కు ఐపీఎల్లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. 53 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న యశస్వి జైశ్వాల్ ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఓవరాల్‌గా జైశ్వాల్ 62 బంతుల్లో 124 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలోనే జైశ్వాల్ ఒక అరుదైన రికార్డు అందుకున్నాడు. ఐపీఎల్లో సెంచరీ చేసిన యంగెస్ట్ ప్లేయర్ల జాబితాలో జైశ్వాల్ చోటు దక్కించుకున్నాడు. 21 ఏళ్ల 123 రోజుల వయసులో జైశ్వాల్ ఈ ఫీట్ సాధించాడు. జైశ్వాల్ కంటే ముందు మనీష్ పాండే(2009లో ఆర్సీబీ తరపున 19 ఏళ్ల 253 రోజులు) తొలి స్థానంలో ఉండగా.. రిషబ్ పంత్( 2018లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 20 ఏళ్ల 218 రోజులు) రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మూడో స్థానంలో దేవదత్ పడిక్కల్(2021లో ఆర్సీబీ తరపున 20 ఏళ్ల 289 రోజులు) ఉన్నారు. A special moment in IPL history: 1st match - Brendon McCullum scored a century. 1000th match - Yashasvi Jaiswal scored a century. pic.twitter.com/wwaE83uRBV — Mufaddal Vohra (@mufaddal_vohra) April 30, 2023 చదవండి: వికెట్లు తీస్తున్నా లాభం లేదు.. ధోనికి మింగుడుపడని అంశం -
#venkateshIyer: నొప్పిని భరిస్తూనే..
ఐపీఎల్ 16వ సీజన్లో రెడో శతకం నమోదైంది. కేకేఆర్ స్టార్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో ఈ ఫీట్‌ను సాధించాడు. 49 బంతుల్లో 9 సిక్సర్లు, ఐదు ఫోర్ల సాయంతో సెంచరీ మార్క్ అందుకున్న వెంకటేశ్ అయ్యర్‌కు ఇదే తొలి ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం. అయితే ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో వెంకటేశ్ అయ్యర్ స్కూప్ షాట్ ఆడే ప్రయత్నంలో కాలికి దెబ్బ తగిలింది. కామెరాన్ గ్రీన్ వేసిన ఇన్నింగ్స్ 4 ఓవర్లో గుడ్‌లెంగ్త్‌తో వచ్చిన డెలివరీని స్కూప్ ఆడే ప్రయత్నంలో బంతి మోకాలికి గట్టిగా తగిలింది. దీంతో వెంకటేశ్ అయ్యర్ నొప్పితో విలవిల్లాడిపోయాడు. ఈ నేపథ్యంలో ఫిజియో వచ్చి పరిశీలించి చికిత్స చేశాడు. అయితే అదే సమయంలో ముంబై ఆటగాడు తిలక్ వర్మ వెంకటేశ్ అయ్యర్ కాలికి మర్దన చేసి క్రీడాస్పూర్తిని చాటుకోవడం విశేషం. ఇక నొప్పి బాధిస్తున్నా వెంకటేశ్ అయ్యర్ తన దూకుడును ఏమాత్రం ఆపలేదు. చూస్తుండగానే ఫిఫ్టీ మార్క్ అందుకున్న వెంకటేశ్ అయ్యర్.. 90 పరుగులకు చేరుకోవడానికి పెద్దగా సమయం తీసుకోలేదు. అయితే 90 నుంచి వంద మార్క్ అందుకోవడానికి మాత్రం కాస్త కష్టపడాల్సి వచ్చింది. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సింగిల్స్ తీస్తూ సెంచరీకి చేరువయ్యాడు. ఈ క్రమంలో అతను నొప్పితో బాధపడుతున్నట్లు కనిపించింది. అయితే గాయం పెద్దగా లేకపోవడం ఊరట అని చెప్పొచ్చు. బంతి కాలికి బలంగా తగలడంతో నొప్పి కాస్త ఎక్కువే ఉందని.. ఎలాగూ ఇంపాక్ట్ కింద డగౌట్ కూర్చుంటా కాబట్టి నొప్పి తగ్గే అవకాశం ఉంది. అని తొలి ఇన్నింగ్స్ అనంతరం చెప్పుకొచ్చాడు. చదవండి: Nitish Rana Vs Hrithik Shokeen: గెలికి మరీ తిట్టించుకోవడం అంటే ఇదే! -
'గర్ల్‌ఫ్రెండ్ మాత్రమే ఇక్కడుంది.. అందరూ వెళ్లిపోయారు'
ఐపీఎల్ 16వ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఓపెనర్ హ్యారీ బ్రూక్ సెంచరీతో మెరిసిన సంగతి తెలిసిందే. ఈ సీజన్లో తొలి సెంచరీ బ్రూక్ దే. 55 బంతుల్లో 12 ఫోర్లు, మూడు సిక్సర్లతో వంద పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడినప్పటికి పేసర్ల బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ ఊచకోత కోశాడు. హ్యారీ బ్రూక్ ఇన్నింగ్స్‌ను చూసిన అతని గర్ల్‌ఫ్రెండ్ చప్పట్లతో అభినందించడం వైరల్‌గా మారింది. ఇక ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ అనంతరం హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ.. ''స్పిన్ ఆడడంలో కాస్త ఇబ్బందికి గురైన మాట వాస్తవమే. కానీ పవర్‌ప్లేను వీలైనంత మేర సద్వినియోగం చేసుకోవాలని అనుకున్నా. ఆ తర్వాత మిడిల్ ఓవర్లలో స్ట్రైక్ రొటేట్ చేస్తూ మార్క్రమ్, అభిషేక్ శర్మలకు సహకరించా. వాళ్లు ఔటైన తర్వాత ఆ బాధ్యతను నేను తీసుకున్నా. బాగా ఆడాలని మాత్రమే అనుకున్నా.. కానీ ఇలా సెంచరీ చేస్తానని ఊహించలేదు. నా వంతు పాత్ర పోషించా.. ఇంకా మ్యాచ్ మిగిలే ఉంది. మా బౌలర్లు ఏం చేస్తారో చూడాలి. నేను ఐపీఎల్ ఆడుతున్నానని తెలిసి ఫ్యామిలీ మొత్తం వచ్చింది. కొన్ని కారణాల రిత్యా వాళ్లు వెళ్లిపోయారు.. కానీ నా గర్ల్‌ఫ్రెండ్ మాత్రం ఇక్కడే ఉంది. నా ఇన్నింగ్స్‌ను బాగా ఎంజాయ్ చేసింది. ఈరోజు నా ప్రదర్శనపై ఫ్యామిలీ మొత్తం సంతోషంగా ఉందని భావిస్తున్నా'' అంటూ తెలిపాడు. 𝐘𝐞𝐫 𝐚 𝐰𝐢𝐳𝐚𝐫𝐝, 𝐇𝐚𝐫𝐫𝐲 🧙♂💫 Ladies & Gentlemen, the first 💯 of #IPL2023 🧡👏#KKRvSRH #HarryBrook #IPLonJioCinema #TATAIPL | @SunRisers pic.twitter.com/4nXzSi4ilV — JioCinema (@JioCinema) April 14, 2023 Harry Brook said, "my girlfriend is here, but the rest of the family just left. I knew this would happen as soon as they left I'll get some runs (laughs)". pic.twitter.com/TJatdittlh — Mufaddal Vohra (@mufaddal_vohra) April 14, 2023 -
ఫఖర్ జమాన్ వీరవిహారం.. డిఫెండింగ్ ఛాంపియన్స్ జోరు
పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) 8వ సీజన్లో లాహోర్ ఖలండర్స్ తన జోరు కొనసాగిస్తుంది. గత మ్యాచ్‌లో ఓటమిని మరిచిపోయేలా ఇస్లామాబాద్ యునైటెడ్‌పై 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఖలండర్స్ ఓపెనర్ ఫఖర్ జమాన్ 57 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లతో వీరవిహారం చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు చేసింది. సామ్ బిల్లింగ్స్ 22 బంతుల్లో 32 పరుగులు చేయగా.. చివర్లో రషీద్ ఖాన్ 5 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్‌తో 15 పరుగులు బాదాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇస్లామాబాద్ యునైటెడ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేకపోయింది. స్పిన్నర్ రషీద్ ఖాన్ స్పిన్ మాయాజాలానికి ఇస్లామాబాద్ తోక ముడిచింది. జట్టులో అత్యధిక స్కోరు 18 పరుగులే కావడం గమనార్హం. బౌలర్ల ధాటికి ఇస్లామాబాద్ 15.1 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. రషీద్ ఖాన్ నాలుగు వికెట్లు తీయగా.. హారిస్ రౌఫ్, జమాన్ ఖాన్లు తలా రెండు వికెట్లు తీశారు. ఇప్పటికే 9 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు, రెండు పాయింట్లతో ఉన్న లాహోర్ ఖలండర్స్ దాదాపు సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. చదవండి: మెస్సీని భయపెట్టిన అజ్ఞాత వ్యక్తి -
రికార్డుల్లోకెక్కిన పాక్ బ్యాటర్.. తొలి క్రికెటర్‌గా..!
మహిళల టీ20 వరల్డ్‌కప్-2023లో పాక్ బ్యాటర్ మునీబా అలీ రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ టీ20ల్లో పాక్ తరఫున తొలి శతకం బాదిన మహిళా క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కింది. అలాగే ప్రపంచకప్ టోర్నీల్లో సెంచరీ సాధించిన ఏడో మహిళా క్రికెటర్‌గా రికార్డుల్లో నిలిచింది. ఇప్పటివరకు జరిగిన ఏడు మహిళల టీ20 వరల్డ్‌కప్ ఎడిషన్లలో డియాండ్ర డొట్టిన్, మెగ్ లాన్నింగ్, హర్మన్‌ప్రీత్ కౌర్, హీథర్ నైట్, లిజెల్ లీ సెంచరీ సాధించగా.. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో శతక్కొట్టడం ద్వారా మునీబా వీరి సరసన చేరింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు కనీసం హాఫ్‌సెంచరీ కూడా చేయని మునీబా ఏకంగా శతకాన్నే బాది ఔరా అనిపించింది. ప్రస్తుత వరల్డ్‌కప్‌లో మునీబా సాధించిన సెంచరీనే తొలి సెంచరీ కావడం విశేషం. మ్యాచ్ విషయానికొస్తే.. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ మునీబా సెంచరీ (68 బంతుల్లో 102; 14 ఫోర్లు) సాయంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 165 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ స్కోర్ ప్రస్తుత వరల్డ్‌కప్‌లో రెండో అత్యధిక టీమ్ స్కోర్‌గా రికార్డైంది. మునీబాతో పాటు నిదా దార్ (33) రాణించింది. ఐర్లాండ్ బౌలర్లలో అర్లెన్ 2, లియా పాల్ ఓ వికెట్ పడగొట్టారు. 166 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఐర్లాండ్.. 16.3 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలి 70 పరుగుల తేడాతో దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. పాక్ బౌలర్లలో నష్రా సంధూ 4 వికెట్లతో చెలరేగగా.. సాదియా ఇక్బాల్, నిదా దార్ తలో 2 వికెట్లు, ఫాతిమా సనా, టుబా హసన్ చెరో వికెట్ పడగొట్టారు. ఐర్లాండ్ ఇన్నింగ్స్‌లో ఓర్లా (31), ఎయిమర్ రిచర్డ్సన్ (28), గాబీ లివిస్ (10) మాత్రమే రెండంకెల స్కోర్ సాధించారు. వరల్డ్‌కప్‌లో ఇవాల్టి (ఫిబ్రవరి 16) మ్యాచ్‌లో శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. -
గిల్‌పై కోహ్లి ఆసక్తికర వ్యాఖ్యలు
టీమిండియా యంగ్ ఆటగాడు శుబ్‌మన్ గిల్ న్యూజిలాండ్‌తో జరిగిన చివరి టి20 మ్యాచ్‌లో స్టన్నింగ్ సెంచరీతో మెరిశాడు. వన్డేలు, టెస్టులకు మాత్రమే పనికొస్తాడని.. గిల్ ఆటతీరు టి20లకు సరిపడదని క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్స్ చేశారు. అయితే వీటన్నింటికి ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో చెక్ పెట్టాడు గిల్. అంతేకాదు కివీస్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా పలు రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు. మ్యాచ్‌లో 126 పరుగులు నాటౌట్ చేయడం ద్వారా ముఖ్యంగా కింగ్ కోహ్లి రికార్డును బద్దలు కొట్టిన గిల్.. టి20ల్లో టీమిండియా తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అంతేకాదు మూడు ఫార్మాట్లలో(వన్డే, టెస్టు, టి20లు) సెంచరీ చేసిన ఐదో ఆటగాడిగా.. ఈ ఫీట్ అందుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. ఇక గిల్ తన రికార్డును బద్దలు కొట్టడంపై కోహ్లి స్పందించాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఆసక్తికర పోస్ట్‌ను జత చేశాడు. ''సితార (స్టార్)... ఫ్యూచర్ ఇక్కడే ఉంది(భవిష్యత్తు ఇక్కడే ఉంది.. ఎక్కడికి పోలేదు)'' అంటూ శుబ్‌మన్ గిల్‌ని హత్తుకున్న ఫోటోలను పోస్ట్ చేశాడు. ఇక గిల్‌తో కలిసి ఇటీవలే వన్డేల్లో కోహ్లి కీలక భాగస్వామ్యాలు నిర్మించాడు. రానున్న ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్‌లోనూ ఇద్దరు కీలకంగా మారనున్నారు. The Virat Kohli and Shubman Gill bond is special! pic.twitter.com/o0chu3FsJG — Mufaddal Vohra (@mufaddal_vohra) February 2, 2023 చదవండి: అభిమానులను ఆశ్చర్యపరిచిన 'కింగ్' కోహ్లి పోస్ట్ -
SA20 2023: ఆర్సీబీ కెప్టెన్ విధ్వంసం.. టోర్నీలో తొలి సెంచరీ నమోదు
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్ సౌతాఫ్రికా 20 లీగ్(SA20 2023) టోర్నీలో తొలి శతకంతో మెరిశాడు. లీగ్‌లో జోబర్గ్ సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న డుప్లెసిస్ కెప్టెన్‌గా జట్టును నడిపిస్తున్నాడు. (58 బంతుల్లోనే 113 పరుగులు నాటౌట్) చేసిన డుప్లెసిస్ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 8 సిక్సర్లు ఉండడం విశేషం. ముందు కెప్టెన్‌గా తన బాధ్యతను నిర్వహించిన డుప్లెసిస్ ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ విధ్వంసం సృష్టించాడు.కాగా తొలిసారి జరుగుతున్న సౌతాఫ్రికా 20 లీగ్ 2023లో డుప్లెసిస్‌దే తొలి శతకం కావడం విశేషం. ఇక డుప్లెసిస్ ఈ సీజన్లో ఏడు మ్యాచ్‌లు కలిపి 277 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో జాస్ బట్లర్ 285 పరుగులు(పార్ల్ రాయల్స్ జట్టు) ఉన్నాడు. మంగళవారం వాండరర్స్ వేదికగా డర్బన్ సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ జరిగింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డర్బన్ సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్(48 బంతుల్లో 65 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలవగా.. హోల్డర్ 28, కైల్ మేయర్స్ 28 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన జోబర్గ్ సూపర్ కింగ్స్ డుప్లెసిస్ ధాటికి 19.1 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే లక్ష్యాన్ని అందుకుంది. ఓపెనర్ రీజా హెండ్రిక్స్ 45 పరుగులతో రాణించాడు. ఇక గతేడాది ఐపీఎల్లో డుప్లెసిస్ ఆర్సీబీకి కెప్టెన్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అతని సారధ్యంలో ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు వెళ్లింది. ఎలిమినేటర్ మ్యాచ్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌కు షాకిచ్చిన ఆర్సీబీ క్వాలిఫయర్-2లో మాత్రం రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఖంగుతింది. అలా గతేడాది ఐపీఎల్లో ఆర్సీబీ మూడో స్థానంతో సరిపెట్టుకుంది. The maiden #Betway #SA20 CENTURY has been an absolute delight to witness! Faf du Plessis is a man for the big moments 🔥#JSKvDSG | @Betway_India pic.twitter.com/QcZAAYOLU6 — Betway SA20 (@SA20_League) January 24, 2023 చదవండి: SA20 2023: చెలరేగిన బట్లర్, మిల్లర్.. సన్‌రైజర్స్‌కు భంగపాటు '22 ఏళ్ల పరిచయం.. కచ్చితంగా తప్పు చేసి ఉండడు' -
సూర్యకుమార్ సెంచరీ.. ఏ మాత్రం తగ్గని జోరు
టీమిండియా నయా సంచలనం సూర్యకుమార్ యాదవ్ అద్బుత సెంచరీతో మెరిశాడు. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టి20లో చెలరేగిన సూర్యకుమార్ 49 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. సూర్య ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఇటీవలే ముగిసిన టి20 ప్రపంచకప్‌లో సూర్యకుమార్ టీమిండియా తరపున రెండో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. కాగా అదే జోరును న్యూజిలాండ్ గడ్డమీద కూడా చూపించాడు. ఇక న్యూజిలాండ్ గడ్డపై కూడా ఒక టీమిండియా బ్యాటర్ టి20ల్లో సెంచరీ చేయడం ఇదే తొలిసారి. అంతేకాదు టీమిండియా తరపున కూడా సూర్యకుమార్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సూర్యకుమార్‌కు టి20ల్లో ఇది రెండో సెంచరీ కాగా.. ఒకే క్యాలెండర్ ఇయర్లో రెండు సెంచరీలు సాధించిన రెండో టీమిండియా బ్యాటర్‌గా సూర్య నిలిచాడు. ఇంతకముందు రోహిత్ శర్మ 2018లో ఈ ఘనత సాధించాడు. -
సెంచరీతో పాటు సిక్సర్ల రికార్డు.. అరుదైన క్రికెటర్‌గా ఘనత
టి20 ప్రపంచకప్‌లో రెండో సెంచరీ నమోదైంది. సూపర్-12లో భాగంగా గ్రూఫ్-1లో శుక్రవారం శ్రీలంకతో మ్యాచ్‌లో కివీస్ స్టార్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ శతకంతో మెరిశాడు. 15 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులోకి వచ్చిన ఫిలిప్స్ బాధ్యతాయుతంగా ఆడుతూనే మెరుపులు మెరిపించాడు. డారిల్ మిచెల్‌ను ఒక ఎండ్‌లో నిలబెట్టి ఫిలిప్స్ స్ట్రైక్ రొటేట్ చేసిన విధానం సూపర్ అని చెప్పొచ్చు. ఓవరాల్‌గా 64 బంతుల్లో 10 ఫోర్లు, 4 సిక్సర్లతో 104 పరుగులు చేసి లాహిరు కుమారా బౌలింగ్‌లో షనకకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలోనే టి20 క్రికెట్లో ఫిలిప్స్ రెండో శతకం అందుకున్నాడు. ఇక టి20 ప్రపంచకప్‌లో నాలుగో స్థానం లేదా ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చి సెంచరీ బాదిన తొలి ఆటగాడిగా గ్లెన్ ఫిలిప్స్ రికార్డులకెక్కాడు. సెంచరీయే ఒక రికార్డు అనుకుంటే దానితో పాటు సిక్సర్ల రికార్డు కూడా అందుకున్నాడు. 2021 నుంచి టి20ల్లో ఫిలిప్స్ బాదిన సిక్సర్ల సంఖ్య 149(తాజా వాటితో కలిపి). ఈ నేపథ్యంలోనే 2021 నుంచి చూసుకుంటే అత్యధిక సిక్సర్లు బాదిన జాబితాలో గ్లెన్ ఫిలిప్స్ రెండో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో ఇంగ్లండ్ విధ్వంసకర ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ ఉన్నాడు. లివింగ్‌స్టోన్ 152 సిక్సర్లు బాదాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే కివీస్ 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ గ్లెన్ ఫిలిప్స్ (64 బంతుల్లో 104; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. లంక బౌలర్లలో రజిత 2 వికెట్ల పడగొట్టగా.. తీక్షణ, ధనంజయ, హసరంగ, లహిరు కుమార తలో వికెట్ దక్కించుకున్నారు. ఛేదనలో భాగంగా శ్రీలంక 19.2 ఓవర్లలో 102 పరుగులకే చాపచుట్టేసింది. భానుక రాజపక్ష (34), దసున్ శనక (35) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 4 వికెట్లు పడగొట్టగా.. సాంట్నర్, సోధి తలో 2 వికెట్లు.. సౌథీ, ఫెర్గూసన్ చెరో వికెట్ పడగొట్టారు. చదవండి: T20 WC 2022 : కొత్త అధ్యాయానికి తెర తీసిన గ్లెన్ ఫిలిప్స్ T20 WC 2022: టీమిండియా గెలవాలని పాక్ అభిమానుల ప్రార్ధనలు -
WC 2022: ‘తొలి’ సెంచరీ.. రికార్డులు సృష్టించిన రోసో.. అరుదైన ఘనతలు
ICC Mens T20 World Cup 2022 - South Africa vs Bangladesh: టీ20 ప్రపంచకప్-2022 సూపర్-12లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్ రిలీ రోసో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆకాశమే హద్దుగా చెలరేగుతూ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించి సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో మొత్తంగా 56 బంతులు ఎదుర్కొన్న అతడు 7 ఫోర్లు, 8 సిక్స్‌ల సాయంతో 109 పరుగులు చేశాడు. తద్వారా టీ20 వరల్డ్‌కప్ ఎనిమిదో ఎడిషన్‌లో తొలి శతకం నమోదు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కాగా రోసోకు అంతర్జాతీయ టీ20లలో ఇది వరుసగా రెండో సెంచరీ. భారత పర్యటనలో భాగంగా అక్టోబరులో టీమిండియాతో జరిగిన ఆఖరి టీ20లో అతడు 48 బంతుల్లో 100 పరుగులతో అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఇప్పుడు ఐసీసీ టోర్నీలో బరిలోకి దిగి మరోసారి శతకం బాదాడు. ఇక సిడ్నీ వేదికగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 52 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న రోసో.. టీ20 ప్రపంచకప్‌లో అత్యంత వేగంగా శతకం బాదిన మూడో బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. ఈ జాబితాలో క్రిస్‌గేల్(తొలి రెండు స్థానాలు), బ్రెండన్ మెకల్లమ్ తర్వాతి స్థానం ఆక్రమించాడు. టీ20 ప్రపంచకప్ టోర్నీలో వేగంగా సెంచరీ సాధించిన క్రికెటర్లు 1. క్రిస్‌గేల్- 47 బంతుల్లో- 2016- 2. క్రిస్‌గేల్- 50 బంతుల్లో- 2007 3. బ్రెండన్ మెకల్లమ్- 51 బంతుల్లో- 2012 4. రిలీ రోసో- 52 బంతుల్లో-2022 అరుదైన ఘనత ఈ రికార్డుతో పాటు మరో ఘనతను కూడా తన ఖాతాలో వేసుకున్నాడు రోసో. టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఇప్పటి వరకు అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. 1. బ్రెండన్ మెకల్లమ్- 123 పరుగులు 2. క్రిస్‌గేల్- 117 పరుగులు 3. అలెక్స్ హేల్స్- 116 నాటౌట్ 4. అహ్మద్ షెహజాద్- 111 నాటౌట్ 5. రిలీ రోసో- 109 పరుగులు చదవండి: IND vs NED: నెదర్లాండ్స్ జట్టులో వాళ్లతో జాగ్రత్త.. లేదంటే అంతే సంగతి? T20 World Cup 2022: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ కాదు.. ఫైనల్ ఆ రెండు జట్లే మధ్యే var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1971406958.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); View this post on Instagram A post shared by ICC (@icc) -
సెంచరీతో చెలరేగిన పృథ్వీ షా.. ముంబై భారీస్కోరు
సయ్యద్ ముస్తాక్ అలీ టి20 టోర్నీలో భాగంగా ముంబై కెప్టెన్ పృథ్వీ షా సెంచరీతో చెలరేగాడు. శుక్రవారం ఎలైట్ గ్రూఫ్-ఏలో భాగంగా అస్సాంతో మ్యాచ్‌లో ఈ ముంబై ఓపెనర్ శతకం సాధించాడు. 61 బంతుల్లోనే 13 ఫోర్లు, 9 సిక్సర్లతో 134 పరుగులు బాదాడు. ఫలితంగా ముంబై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 230 పరుగుల భారీ స్కోరు సాధించింది. ముంబై చేసిన 230 పరుగుల్లో 134 పరుగులు పృథ్వీ షావే ఉన్నాయంటే అతని విధ్వంసం ఎంతలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. యశస్వి జైశ్వాల్ 42 పరుగులతో పృథ్వీకి సహకరించాడు. సర్ఫరాజ్ ఖాన్ 15, శివమ్ దూబే 17 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. అస్సాం బౌలర్లలో రియాన్ పరాగ్, రోషన్ అస్లామ్, రాజ్కుద్దీన్ అహ్మద్‌లు తలా ఒక వికెట్ తీశారు. ఇక మ్యాచ్‌లో 134 పరుగులు నాటౌట్‌గా నిలిచిన పృథ్వీ షా సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. తొలి స్థానంలో శ్రేయాస్ అయ్యర్ 147 పరుగులు, పునిత్ బిస్త్ 146 నాటౌట్, మహ్మద్ అజారుద్దీన్ 137 నాటౌట్ వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నారు. Maiden hundred for Captain Prithvi Shaw in T20 format, hundred from 46 balls including 10 fours and 6 sixes, A knock to remember, What a player. pic.twitter.com/bokhoHDAPQ — Johns. (@CricCrazyJohns) October 14, 2022 చదవండి: 'భయపడితే పనులు కావు.. పరుగులు చేయడమే' గంగూలీపై రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు -
సెంచరీతో చెలరేగిన నమన్ ఓజా.. ఇండియా లెజెండ్స్ భారీ స్కోరు
రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్‌లో భాగంగా శనివారం శ్రీలంక లెజెండ్స్‌తో జరుగుతున్న ఫైనల్లో ఇండియా లెజెండ్స్ భారీ స్కోరు చేసింది. ఓపెనర్ నమన్ ఓజా సెంచరీతో (71 బంతుల్లో 108 నాటౌట్, 15 ఫోర్లు, 2 సిక్సర్లు)చెలరేగాడు. దీంతో ఇండియా లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. సెమీఫైనల్లో సెంచరీకి 10 పరుగుల దూరంలో ఆగిపోయిన నమన్ ఓజా.. ఈసారి మాత్రం అవకాశాన్ని మిస్ చేసుకోలేదు. ఆరంభంలోనే సచిన్ టెండూల్కర్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగినప్పటికి.. సురేశ్ రైనా 4 పరుగులు చేసి ఔటైనప్పటికి.. ఒక ఎండ్‌లో మత్రం నమన్ ఓజా ఇన్నింగ్స్‌ను ధాటిగా కొనసాగించాడు. లంక బౌలర్లను చీల్చి చెండాడుతూ బౌండరీలతో విధ్వంసం సృష్టించాడు. నమన్ ఓజాకు జతగా వినయ్‌కుమార్(21 బంతుల్లో 36 పరుగులు) రాణించాడు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 90 పరుగులు జోడించారు. వినయ్ కుమార్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన యువరాజ్ సింగ్ 13 బంతుల్లో 19 పరుగులు చేసి వెనుదిరిగాడు. అయితే ఆఖర్లో వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ నమన్ ఓజా 68 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇండియా లెజెండ్స్ భారీ స్కోరు చేయడంలో నమన్ ఓజా కీలకపాత్ర పోషించాడు. లంక లెజెండ్స్ బౌలర్లలో నువాన్ కులశేఖర మూడు వికెట్లు తీయగా.. ఇసురు ఉడానా రెండు వికెట్లు, ఇషాన్ జయరత్నే ఒక వికెట్ తీసుకున్నాడు. Naman Ojha smashed 108* runs from 71 balls including 15 fours and 2 sixes in the Road Safety World Series final 2022, a terrific knock to remember. pic.twitter.com/F4gNjjgNyf — Johns. (@CricCrazyJohns) October 1, 2022 చదవండి: థర్డ్ అంపైర్ చీటింగ్.. టీమిండియా క్రికెటర్‌కు అన్యాయం -
CPL 2022: డుప్లెసిస్ అద్భుత సెంచరీ.. టీ20 ఫార్మాట్లో నాలుగోది! కానీ పాపం..
Caribbean Premier League 2022 - Faf Du Plessis 4th T20 Century: కరేబియన్ ప్రీమియర్ లీగ్-2022లో భాగంగా గయానా అమెజాన్ వారియర్స్‌తో మ్యాచ్‌లో సెయింట్ లూసియా కింగ్స్ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అద్భుత సెంచరీతో మెరిశాడు. 59 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్‌ల సాయంతో 103 పరుగులు చేశాడు. తద్వారా టీ20 ఫార్మాట్లో తన నాలుగో శతకాన్ని నమోదు చేశాడు ఈ దక్షిణాఫ్రికా ఆటగాడు. అయితే, గయానా అమెజాన్ వారియర్స్ బ్యాటర్లు రాణించడంతో.. భారీ స్కోరు చేసినా సెయింట్ లూసియా కింగ్స్‌కు ఓటమి తప్పలేదు. దీంతో ఫాఫ్ డుప్లెసిస్ సెంచరీ ఇన్నింగ్స్ వృథాగా పోయింది. Century for Faf!! Faf’s superb 103 runs from 59 balls earns him the @Dream11 MVP for match 27!! #CPL22 #GAWvSLK #CricketPlayedLouder #Dream11 #BiggestPartyInSport pic.twitter.com/R5Rkal9UCW — CPL T20 (@CPL) September 23, 2022 టాస్ గెలిచి.. భారీ స్కోరు చేసి Guyana Amazon Warriors vs Saint Lucia Kings: గయానాలోని ప్రొవిడెన్స్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సెయింట్ లూసియా కింగ్స్, గయానా అమెజాన్ వారియర్స్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కింగ్స్ కెప్టెన్ డుప్లెసిస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి సెంచరీ సాధించాడు. అయితే, మిగతా ఆటగాళ్లలో వన్‌డౌన్ బ్యాటర్ డిక్విల్లా(36 పరుగులు) మినహా ఎవరూ రాణించలేకపోయారు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి కింగ్స్ జట్టు 194 పరుగులు చేసింది. అర్ధ శతకాలతో మెరిసి.. సమిష్టి కృషితో.. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వారియర్స్ జట్టుకు ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్(26 బంతుల్లో 52 పరగులు), చంద్రపాల్ హేమ్రాజ్ (29 పరుగులు) శుభారంభం అందించారు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ షాయీ హోప్ 30 బంతుల్లో 59 పరుగులతో రాణించాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చినా షకీబ్ అల్ హసన్ మాత్రం డకౌట్‌గా వెనుదిరిగి నిరాశపరిచాడు. అయితే, ఆఖర్లో వారియర్స్ కెప్టెన్ షిమ్రన్ హెట్మెయిర్ 36 పరుగులు చేసి జట్టును విజయం దిశగా నడిపాడు. ఆఖరి ఓవర్ రెండో బంతికి ఒక పరుగు తీసి రొమారియో షెఫర్డ్ లాంఛనం పూర్తి చేశాడు. ఇలా 19.2 ఓవర్లలో నాలుగు వికెట్లు పోయి వారియర్స్ లక్ష్యాన్ని ఛేదించింది. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక విలువైన ఇన్నింగ్స్ ఆడిన షాయీ హోప్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2022లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు కెప్టెన్‌గా వ్యవహరించిన ఫాఫ్ డుప్లెసిస్.. 16 ఇన్నింగ్స్‌లో 468 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. ఈ సీజన్లో అతడి అత్యధిక స్కోరు 96. What an innings!!! Faf brings up his 4th T20 century in emphatic style as this evenings @fun88eng Magic Moment. #CPL22 #GAWvSLK #CricketPlayedLouder #Fun88 #BiggestPartyInSport pic.twitter.com/eBZpOUusyM — CPL T20 (@CPL) September 23, 2022 -
'బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు.. పిచ్చి రాతలు మానుకోండి'
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. కొద్దిరోజులుగా చూసుకుంటే బాబర్ ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతూ వచ్చాడు. ఆసియా కప్‌లోనూ దారుణంగా విఫలమైన బాబర్ ఆజం ఆరు ఇన్నింగ్స్‌లు కలిపి 68 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అంతర్జాతీయ మీడియా సహా సోషల్ మీడియా బాబర్ ఆజంపై పెద్ద ఎత్తున విరుచుకుపడింది. ''పెద్ద జట్లతో బ్యాటింగ్ కష్టమే.. వెళ్లి చిన్న దేశాలపై ఆడుకో'' అంటూ కామెంట్ చేశారు. అయితే ఈ విమర్శలను పట్టించుకోని బాబర్ ఆజం ఇంగ్లండ్‌తో టి20 సిరీస్‌కు ముందు కచ్చితంగా ఫామ్‌లోకి వస్తానని ధీమా వ్యక్తం చేశాడు. అన్నట్లుగానే ఇంగ్లండ్ లాంటి పెద్ద జట్టుపై ఏకంగా సెంచరీ సాధించి ఔరా అనిపించాడు. మహ్మద్ రిజ్వాన్‌తో కలిసి 203 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి ప్రపంచ రికార్డు సాధించాడు. 62 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్న బాబర్ ఆజం ఓవరాల్‌గా 66 బంతుల్లో 110 నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. ఇంగ్లండ్ లాంటి పెద్ద జట్టుపై సెంచరీ సాధించి ..''చిన్న దేశాలపై ఆడుకో'' అన్న వారి నోళ్లు మూయించాడు. ఇక అతని ఇన్నింగ్స్‌లో క్లాస్, మాస్ కలగలిపి పాత బాబర్‌ను గుర్తుకుతెచ్చాడు. బాబర్ ఆజం సెంచరీపై క్రికెట్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు. ''బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు.. పిచ్చిరాతలు మానుకోండి'' అంటూ పేర్కొన్నారు. కాగా బాబర్ ఆజంకు టి20ల్లో ఇది రెండో సెంచరీ. చదవండి: ప్రపంచ రికార్డుతో మెరిసిన బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ -
'మై లవ్.. నేను ఎప్పటికి నీతోనే'
ఆసియా కప్ టోర్నీలో సూపర్-4లో భాగంగా గురువారం అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా రన్‌మెషిన్ విరాట్ కోహ్లి సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. కాగా కోహ్లికి టి20ల్లో ఇదే మెయిడెన్ సెంచరీ. దాదాపు వెయ్యి రోజుల తర్వాత వచ్చిన సెంచరీ .. అందునా పొట్టి ఫార్మాట్లో తొలి శతకం కావడంతో కోహ్లి.. ఈ సెంచరీని తన భార్య అనుష్క శర్మ, కూతురు వామికాకు అంకితమిచ్చాడు. ఈ సందర్భంగా కోహ్లి ఎమోషనల్‌గా మాట్లాడాడు. '' 70 సెంచరీలు చేసిన నాకు 71వ సెంచరీని అందుకోవడం కోసం వెయ్యి రోజులు పట్టింది. ఈ గడ్డు కాలంలో నాకు అండగా నిలబడింది నా డియార్ వైఫ్.. అనుష్క శర్మ. అందుకే సెంచరీ కాగానే మెడలో ఉన్న రింగ్‌ను కిస్ చేశా. ఆమెకు ఈ సెంచరీని అంకితమిస్తున్నా. ఆమెతో పాటు నా ముద్దుల కూతురు వామికాకు కూడా...'' అంటూ తెలిపాడు. కాగా కోహ్లి ఎమోషనల్ వ్యాఖ్యలను ట్యాగ్ చేస్తూ అతని భార్య అనుష్క శర్మ ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించింది. ''సందర్భం ఏదైనా.. ఎలాంటిదైనా సరే.. నేను ఎప్పుడు నీతోనే ఉంటాను.. మై లవ్'' అంటూ సింగిల్ లైన్ క్యాప్షన్ జత చేసింది. ఇక టి20ల్లో తొలి సెంచరీ అందుకున్న కోహ్లికి అంతర్జాతీయ క్రికెట్లో ఇది 71వ సెంచరీ. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీల్లో రికీ పాంటింగ్ (71)తో కోహ్లి సమంగా నిలిచాడు. అతను టెస్టుల్లో 27, వన్డేల్లో 43 సెంచరీలు చేశాడు. సచిన్ (100 సెంచరీలు) అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక ఆఫ్గన్‌తో మ్యాచ్‌లో 61 బంతుల్లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్లతో 122 పరుగులు చేసిన కోహ్లి.. టి20ల్లో తన అత్యధిక వ్యక్తిగత స్కోరును అందుకొని చరిత్ర సృష్టించాడు. టీమిండియా ఆటగాళ్లు ఇప్పటివరకు టి20 క్రికెట్లో 10 సెంచరీలు నమోదు చేశారు. కోహ్లి కంటే ముందు రోహిత్ (4 సెంచరీలు), రాహుల్ (2), రైనా, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్ ఈ ఘనత సాధించారు. ఇక కోహ్లి చివరిసారిగా 2019 నవంబర్ 23న కోల్‌కతాలో బంగ్లాదేశ్‌పై టెస్టులో సెంచరీ సాధించాడు. View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma) చదవండి: Kohli-KL Rahul: రోహిత్ లేకుంటే ఫ్రీ హ్యాండ్ తీసుకుంటారా! Virat Kohli: 'డియర్ అనుష్క ఈ సెంచరీ నీకే అంకితం' Virat Kohli: 'కింగ్ ఈజ్ బ్యాక్'.. ఎన్నాళ్లకెన్నాళ్లకు -
'డియర్.. ఈ సెంచరీ నీకే అంకితం'
విరాట్ కోహ్లి.. టీమిండియా రన్‌మెషిన్‌గా గుర్తింపు పొందాడు. ఒకప్పుడు సెంచరీలను మంచినీళ్ల ప్రాయంగా అందుకున్న కోహ్లి.. నాలుగేళ్ల నుంచి మాత్రం సెంచరీ కోసం పరితపిస్తున్నాడు. మధ్యలో కరోనా వల్ల విరామం వచ్చినప్పటికి.. ఆ తర్వాత చాలా మ్యాచ్‌లు ఆడినప్పటికి హాఫ్ సెంచరీలు సాధించాడే కానీ సెంచరీ మాత్రం చేయలేకపోయాడు. కోహ్లి సెంచరీ కోసం అభిమానులు కూడా వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. ఇక కోహ్లి బ్యాట్ నుంచి సెంచరీ రావడం కష్టమే అని హేటర్స్ ఫిక్స్ అయిన తరుణంలో 71వ సెంచరీని బాది తనపై వస్తున్న ట్రోలింగ్‌కు చెక్ పెట్టేశాడు. అంతేకాదు ఆసియా కప్‌లో కచ్చితంగా సెంచరీ చేస్తాడని భావించిన అభిమానుల కలను కోహ్లి నెరవేర్చాడు. ఎందుకంటే ఆసియా కప్‌లో కోహ్లికి మంచి రికార్డు ఉంది. తనకు అచ్చొచ్చిన టోర్నీలోనే కోహ్లి శతకం సాధించాడు. ఆసియాకప్‌లో భాగంగా గురువారం అఫ్గనిస్తాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి 53 బంతుల్లోనే సెంచరీ మార్క్ అందుకున్నాడు. కోహ్లి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. ఓవరాల్‌గా 61 బంతుల్లో 122 పరుగులు చేసిన కోహ్లికి టి20ల్లో ఇదే తొలి సెంచరీ. అలాగే టి20 కెరీర్లోనూ కోహ్లి అత్యధిక వ్యక్తిగత స్కోరును అందుకున్నాడు. కాగా టీమిండియా ఇన్నింగ్స్ ముగిసిన అనంతరం కోహ్లి మీడియాతో మాట్లాడాడు. 'టి20 ఫార్మాట్లో సెంచరీ చేస్తానని నేను పెద్దగా అనుకోలేదు. అందుకే 71వ సెంచరీ ఇలా చేయడం కాస్త షాకింగ్‌గా అనిపించింది. రెండున్నరేళ్లుగా సెంచరీ చేయలేకపోయా. త్వరలో 34 ఏళ్లు నిండబోతున్నాయి. చాలామంది నా ఫామ్ గురించి మాట్లాడారు. 71వ సెంచరీ రావడం లేదని అన్నారు. అయితే నేను మాత్రం ఇప్పటికే చేసిన 70 సెంచరీల గురించే ఆలోచించా. బయట చాలా జరుగుతాయి. అన్నివేళలా నాకు అండగా నిలబడిన వ్యక్తికి ఈ సెంచరీ అంకితం ఇవ్వాలని అనుకుంటున్నా. డియర్ అనుష్క... ఇది నీకోసం. అలాగే వామిక కోసం కూడా. క్లిష్ట సమయాల్లో అనుష్క నాకు అండగా నిలబడింది. ఈ నాలుగు వారాల గ్యాప్ నాకెంతో ఉపయోగపడింది. బ్రేక్ తీసుకున్నాకే నేనెంత అలిసిపోయానో అర్థమైంది. అందుకే కమ్‌బ్యాక్ ఇచ్చిన తర్వాత నెట్స్‌లో ఎక్కువ సమయం గడిపాను. మళ్లీ పూర్వ ఫామ్‌లోకి వస్తాననే భావన నాలోనే కలిగింది.' అంటూ ఉద్వేగంతో పేర్కొన్నాడు. చదవండి: Virat Kohli: 'కింగ్ ఈజ్ బ్యాక్'.. ఎన్నాళ్లకెన్నాళ్లకు -
18 ఏళ్ల వయసులో అదిరిపోయే రికార్డులు.. ఎవరీ క్రికెటర్?
ఫ్రాన్స్ టీనేజ్ క్రికెటర్ గుస్తవ్ మెకియోన్ 18 ఏళ్ల వయసులోనే టి20 క్రికెట్లో సంచలనాలు నమోదు చేస్తున్నాడు. మూడు రోజుల కిందట టి20 క్రికెట్లో సెంచరీ సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా చరిత్రకెక్కిన గుస్తవ్ మెకియోన్ తాజాగా మరో శతకం అందుకున్నాడు. టి20 క్రికెట్లో వరుసగా రెండు సెంచరీలు సాధించిన తొలి క్రికెటర్‌గా గుస్తవ్ మెకియోన్ నిలిచాడు. యూరోప్ టి20 వరల్డ్‌కప్ 2024 సబ్-రీజినల్స్‌లో భాగంగా గ్రూఫ్-బిలో నార్వేతో జరిగిన మ్యాచ్‌లో గుస్తవ్ 53 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్సర్లతో 101 పరుగులు సాధించాడు. అతనికి ఇది వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. అంతకముందు ఆదివారం(జూన్ 24న) స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌లో 61 బంతుల్లోనే తొలి శతకం మార్క్‌ను అందుకున్నాడు. ఇదే వరల్డ్‌కప్‌లో చెక్ రిపబ్లిక్‌తో జరిగిన మ్యాచ్‌తో టి20 క్రికెట్లో అరంగేట్రం చేసిన గుస్తవ్ ఆరంభమ్యాచ్‌లోనే 54 బంతుల్లో 76 పరుగుల మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలోనే గుస్తవ్ మరో అరుదైన ఫీట్ సాధించాడు. వరుసగా తొలి మూడు టి20 మ్యాచ్‌లు కలిపి అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ చరిత్ర సృష్టించాడు. వరుసగా తొలి మూడు టి20ల్లో 76, 109, 101 పరుగులు.. మొత్తంగా 26 పరుగులు సాధించి గుస్తవ్ తొలి స్థానంలో ఉన్నాడు. ఇక పోర్చుగల్‌కు చెందిన క్రికెటర్ అజర్ అదానీ 227 పరుగులతో రెండో స్థానంలో.. చెక్ రిపబ్లిక్కు చెందిన సబావున్ దావీజీ 208 పరుగులతో మూడో స్థానంలో.. నేపాల్ క్రికెటర్ కుషాల్ బుర్తెల్ 185 పరుగులతో నాలుగో స్థానం.. పాకిస్తాన్‌కు చెందిన ముక్తార్ అహ్మద్ 182 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఫ్రాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. ఇక్కడ విచిత్రమేంటంటే గుస్తవ్ మెకియోన్ ఒక్కడే 101 పరుగులు చేయగా.. తర్వాత జట్టులో అత్యధిక స్కోరు 15 మాత్రమే. అనంతరం బ్యాటింగ్ చేసిన నార్వే 19.2 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. సెంచరీతో చెలరేగిన గుస్తవ్ బౌలింగ్‌లోనూ అదరగొట్టాడు. నాలుగు ఓవర్లు వేసి 27 పరుగులిచ్చి మూడు వికెట్లతో గుస్తవ్ విజయంలో కీలకపాత్ర పోషించాడు. చదవండి: ఇంగ్లండ్‌కు చుక్కలు చూపించిన దక్షిణాఫ్రికా యువ ఆటగాడు.. ఫుల్ జోష్‌లో ముంబై! Martin Guptill: రోహిత్ శర్మ రికార్డు బద్దలు.. కివీస్ తరపున తొలి ఆటగాడిగా -
టీ20ల్లో ఫ్రాన్స్ ఓపెనర్ అరుదైన ఘనత.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా..!
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఫ్రాన్స్ ఓపెనర్ గుస్తావ్ మెక్‌కీన్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 ప్రపంచకప్-2024 యూరప్ క్వాలిఫయర్ గ్రూప్ బి రౌండ్లో స్విట్జర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో మెక్‌కీన్ సెంచరీతో మెరిశాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో సెంచరీ సాధించిన అతి పిన్న వయస్కుడుగా మెక్‌కీన్ రికార్డు సృష్టించాడు. కేవలం 18 ఏళ్ల 280 రోజుల వయస్సులోనే మెక్‌కీన్ ఈ ఘనత సాధించాడు. అంతకు ముందు ఈరికార్డు ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్ హజ్రతుల్లా జజాయ్ పేరిట ఉండేది. జజాయ్ 20 ఏళ్ల 337 రోజుల వయస్సులో సెంచరీ సాధించాడు. ఇక తాజా మ్యాచ్‌లో మెక్‌కీన్ జజాయ్ రికార్డును బద్దలు కొట్టాడు. ఈ మ్యాచ్‌లో మెక్‌కీన్ 61 బంతుల్లో 109 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు,9 సిక్స్‌లు ఉన్నాయి. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఫ్రాన్స్‌పై స్విట్జర్లాండ్ ఒక్క వికెట్ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఫ్రాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. ఫ్రాన్స్ బ్యాటర్లలో మెక్‌కీన్(109) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన స్విట్జర్లాండ్ 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. స్విట్జర్లాండ్ బ్యాటర్లలో నజీర్(67), నయ్యర్(48) పరుగులతో రాణించాడు. చదవండి: Rohit Sharma Latest Photo: వెస్టిండీస్‌కు చేరుకున్న టీమిండియా కెప్టెన్.. పంత్, డీకేతో పాటు -
సూర్య 'ఆగయా'.. సెంచరీ 'బన్‌గయా'
ఇంగ్లండ్‌తో మూడో టి20లో టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్ సూపర్ సెంచరీతో మెరిశాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా సూర్యకుమార్ శతకంతో ఆకట్టుకున్నాడు. 49 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో సూర్య సెంచరీ మార్క్ అందుకున్నాడు. టి20ల్లో సూర్యకుమార్‌కు ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. ఇక తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసింది. డేవిడ్ మలాన్ 77 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. లియామ్ లివింగ్‌స్టోన్(29 బంతుల్లో 4 సిక్సర్లతో 42 పరుగులు నాటౌట్) ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక లక్ష్య చేధనలో భాగంగా టాప్-3 బ్యాట్స్‌మన్(రోహిత్ 11, పంత్ 1, కోహ్లి 11) విఫలం కాగా.. శ్రేయాస్ అయ్యర్(28 పరుగులు)ను ఒక ఎండ్‌లో ఉంచి సూర్యకుమార్ సూపర్ బ్యాటింగ్ కనబరిచాడు. వీరిద్దరి మధ్య నాలుగో వికెట్‌కు 119 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఇక విజయం ఖాయమనుకుంటున్న తరుణంలో టీమిండియా మరోసారి తడబడింది. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఇక 117 పరుగులు చేసిన సూర్యకుమార్ మొయిన్ అలీ బౌలింగ్‌లో ఏడో వికెట్‌గా వెనుదిరిగాడు. చివరకు టీమిండియా 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసి 17 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. మూడు టి20ల సిరీస్‌ను టీమిండియా 2-1తో గెలుచుకుంది. 💯 A magnificent CENTURY from @surya_14kumar 👏👏 His first in international cricket! Live - https://t.co/hMsXyHNzf8 #ENGvIND pic.twitter.com/LwZVee9Ali — BCCI (@BCCI) July 10, 2022 -
వీరోచిత సెంచరీ.. జట్టును మాత్రం ఓటమి నుంచి రక్షించలేకపోయాడు
న్యూజిలాండ్ స్టార్ టిమ్ సీఫెర్ట్ విటాలిటీ టి20 బ్లాస్ట్ టోర్నమెంట్లో సూపర్ సెంచరీతో మెరిశాడు. ససెక్స్ తరపున ఆడుతున్న టిమ్ సీఫెర్ట్ సెంచరీ(56 బంతుల్లో 100 నాటౌట్, 9 ఫోర్లు, 5 సిక్సర్లు) జట్టును ఓటమి నుంచి మాత్రం కాపాడలేకపోయింది. విషయంలోకి వెళితే.. శనివారం రాత్రి హాంప్‌షైర్, ససెక్స్ మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన హాంప్‌షైర్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. ఓపెనర్లు జేమ్స్ విన్స్(65), బెన్ మెక్డొర్మెట్ 60 పరుగులతో చెలరేగారు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 124 పరుగులు జత చేయడంతో హాంప్‌షైర్ భారీ స్కోరు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ససెక్స్.. టిమ్ సీఫెర్ట్ మినహా మిగతావారు పెద్దగా రాణించలేకపోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో హాంప్‌షైర్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా సీఫెర్ట్ ఆఖరి వరకు నాటౌట్‌గా నిలిచి చివరి బంతికి సెంచరీ పూర్తి చేసుకున్నప్పటికి జట్టును గెలిపించలేకపోయాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా సీఫెర్ట్ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మధ్యలో డిల్రే రావ్లిన్స్ 32 పరుగులతో నిలదొక్కుకోవడంతో ఒక దశలో హాంప్‌షైర్ గెలుస్తుందనే ఆశలు కలిగాయి. కానీ రావ్లిన్స్ ఔట్ కావడం.. సీఫెర్ట్‌పై ఒత్తిడి పడడం జట్టు విజయాన్ని దెబ్బ తీసింది. చదవండి: Mitchell Marsh: 'భారత్‌లో నాకు శాపం తగిలింది'.. ఆసీస్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు Ravi Shastri Vs Javed Miandad: రవిశాస్త్రి, మియాందాద్ల గొడవకు కారణమైన 'ఆడి' కారు.? Runs: 1️⃣0️⃣0️⃣* Fours: 9️⃣ Sixes: 5️⃣ That is a fantastic innings from Tim Seifert 👏#Blast22 | @SussexCCC pic.twitter.com/FxRlzGYlbf — Vitality Blast (@VitalityBlast) June 4, 2022 -
ఆ బ్యాటర్ పని అయిపోందన్నారు.. సెంచరీతో నోరు మూయించాడు
ఆస్ట్రేలియా విధ్వంసకర ఆటగాడు క్రిస్ లిన్ టి20 బ్లాస్ట్‌లో సూపర్ సెంచరీతో మెరిశాడు. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న విటాలిటీ టి20 బ్లాస్ట్‌లో క్రిస్ లిన్ నార్తంప్టన్‌షైర్ తరపున క్రిస్ లిన్ ఈ సీజన్లో అరంగేట్రం చేశాడు. సీజన్లో నాలుగో మ్యాచ్ ఆడుతున్న లిన్.. లీస్టర్‌షైర్‌తో మ్యాచ్‌లో 66 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 106 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. క్రిస్ లిన్ టి20 కెరీర్లో ఇది మూడో సెంచరీ. అతని ధాటికి నార్తంప్టన్ 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా ఈ టోర్నీకి ముందు లిన్ పని అయిపోయిందని.. అతను రాణించే అవకాశం లేదని విమర్శలు వచ్చాయి. అయితే తనపై వచ్చిన విమర్శలన్నింటికి క్రిస్ లిన్ తన బ్యాట్‌తోనే సమాధానం ఇచ్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన నార్తంప్టన్‌షైర్ 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 227 పరుగుల భారీ స్కోరు చేసింది. తొలి వికెట్‌కు మరో ఓపెనర్ బెన్ కరన్(31)తో కలిసి 109 పరుగలు భాగస్వామ్యం నెలకొల్పిన లిన్ మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత లిన్‌కు జేమ్స్ నీషమ్ తోడయ్యాడు. ఐపీఎల్ నుంచి నేరుగా టి20 బ్లాస్ట్‌లో అడుగుపెట్టిన నీషమ్ ఆడిన తొలి మ్యాచ్‌లోనే మెరిశాడు. 30 బంతుల్లోనే 75 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన లీస్టర్‌షైర్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. స్కాట్ స్టీల్ 64 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: Liam Livingstone: బౌలర్లు అయిపోయారు.. పనిచేసేవాళ్లను కూడా వదిలిపెట్టవా! A special innings from a special player @lynny50 💯 #Blast22 | @NorthantsCCC pic.twitter.com/NImOepuOHU — Vitality Blast (@VitalityBlast) June 1, 2022 -
రజత్ పాటిదార్ కొత్త చరిత్ర.. ఆర్సీబీ తరపున తొలి బ్యాటర్‌గా
ఆర్సీబీ బ్యాటర్ రజత్ పాటిదార్ కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో సూపర్ శతకంతో మెరిశాడు. లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో పాటిదార్ 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ మార్క్ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో 54 బంతుల్లో 112 పరుగులు నాటౌట్‌గా నిలిచిన పాటిదార్ ఐపీఎల్లో ఆర్సీబీ తరపున పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ►ఆర్సీబీ తరపున నాకౌట్ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన తొలి బ్యాటర్‌గా రజత్ పాటిదార్ నిలిచాడు. ►ప్లేఆఫ్ మ్యాచ్‌లో ఆర్సీబీ తరపున అత్యధిక స్కోరు సాధించిన తొలి ఆటగాడిగా రజత్ పాటిదార్(54 బంతుల్లో 112, 12 ఫోర్లు, 7 సిక్సర్లు). ఈ నేపథ్యంలో క్రిస్ గేల్(89 పరుగులు)ను అధిగమించాడు. ►అన్క్యాప్డ్ ప్లేయర్‌గా ఐపీఎల్లో సెంచరీ అందుకున్న నాలుగో ఆటగాడిగా రజత్ పాటిదార్. ఇంతకముందు పాల్ వాల్తాటి(120*పరుగులు, పంజాబ్ కింగ్స్, 2011లో సీఎస్కేపై), మనీష్ పాండే(114*పరుగులు, ఆర్సీబీ, 2009లో డెక్కన్ చార్జర్స్‌పై), దేవదత్ పడిక్కల్(101*పరుగులు, ఆర్సీబీ, 2021లో రాజస్తాన్ రాయల్స్‌పై) ►అన్క్యాప్డ్ ప్లేయర్‌గా ప్లేఆఫ్ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా రజత్ పాటిదార్ నిలిచాడు. ఓవరాల్‌గా ప్లేఆఫ్ మ్యాచ్‌ల్లో సెంచరీ అందుకున్న ఐదో ఆటగాడిగా నిలిచాడు. ఇంతకముందు సెహ్వాగ్, షేన్ వాట్సన్, వృద్దిమాన సాహా, మురళీ విజయ్‌లు ఈ ఫీట్ సాధించారు. ►అన్ క్యాప్డ్ ప్లేయర్గాఅత్యధిక స్కోరు సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు. ఇంతకముందు మనీష్ పాండే 94 పరుగులు( కేకేఆర్, 2014లో పంజాబ్ కింగ్స్‌పై ), మన్విందర్ బిస్లా 89 పరుగులు(కేకేఆర్, 2012లో సీఎస్కేపై) ఉన్నారు. చదవండి: Kohli-Ganguly: కోహ్లి స్టైలిష్ బౌండరీ.. గంగూలీ రియాక్షన్ అదిరే -
సీజన్లో రెండో సెంచరీ అందుకున్న బట్లర్.. పలు రికార్డులు బద్దలు
ఐపీఎల్ 2022లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జాస్ బట్లర్ రెండో సెంచరీ సాధించాడు. కేకేఆర్‌తో మ్యాచ్‌లో బట్లర్ 59 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సర్లతో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. పాట్ కమిన్స్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్ తొలి బంతిని లాంగాన్ దిశగా భారీ సిక్సర్ బాది బట్లర్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అయితే సెంచరీ చేసిన కాసేపటికే బట్లర్ 103 పరుగుల వద్ద పాట్ కమిన్స్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఈ సీజన్లో తొలి సెంచరీని ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో అందుకున్నాడు. తాజా సెంచరీతో బట్లర్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ►ఐపీఎల్ 2022లో రెండో సెంచరీ అందుకున్న బట్లర్‌కు ఓవరాల్‌గా ఐపీఎల్లో మూడో సెంచరీ ►ఇక గత 23 టి20 ఇన్నింగ్స్‌ల్లో బట్లర్‌కు ఇది నాలుగో సెంచరీ కావడం విశేషం. ►ఇక గత ఏడు ఐపీఎల్ ఇన్నింగ్స్‌లో బట్లర్ మూడుసార్లు సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ►ఐపీఎల్లో భాగంగా బ్రబౌర్న్ స్టేడియంలో సెంచరీ బాదిన నాలుగో ఆటగాడిగా బట్లర్ రికార్డు అందుకున్నాడు. ఇంతకముందు యూసఫ్ పఠాన్, షేన్ వాట్సన్, కేఎల్ రాహుల్ ఈ ఘనత అందుకున్నారు. -
37 బంతుల్లోనే శతకం.. ఎస్ఆర్హెచ్కు ఊరటనిచ్చే అంశం
వెస్టిండీస్ హార్డ్ హిట్టర్ నికోలస్ పూరన్ టి10 బ్లాస్ట్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. 37 బంతుల్లోనే 10 సిక్సర్లు.. ఆరు ఫోర్ల సాయంతో శతకం బాదాడు. టి10 బ్లాస్ట్‌లో భాగంగా లెథర్బాక్ జెయింట్స్, స్కార్లెట్ స్కార్చర్స్ మధ్య మ్యాచ్ జరిగింది. 129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లెథర్బాక్ జెయింట్స్ పూరన్ దాటికి 8.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. కాగా నికోలస్ పూరన్‌కు ఇటీవలే ముగిసిన ఐపీఎల్ మెగావేలంలో భారీ ధర పలికిన సంగతి తెలిసిందే. ఎస్ఆర్హెచ్ జట్టు ఏరికోరి పూరన్‌ను రూ. 10.75 కోట్లకు సొంతం చేసుకుంది. అసలే వేలంలో తమ చెత్త నిర్ణయాలతో విమర్శలకు గురైన ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీకి ఇది కాస్త ఊరట కలిగించే అంశమని చెప్పొచ్చు. కోట్లు పెట్టు కొన్నందుకు పూరన్ ఇలాంటి ఇన్నింగ్స్ ఐపీఎల్లో ఆడితే బాగుంటుందని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన స్కార్లెట్ స్కార్చర్స్ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 128 పరుగులు చేసింది. ఓపెనర్ టియోన్ వెబ్‌స్టర్ 54, ఎవార్ట్ నికోల్సన్ 42 పరుగులతో రాణించారు. ఆ తర్వాత నికోలస్ పూరన్(38 బంతుల్లో 101 నాటౌట్, 10 సిక్సర్లు, 6 ఫోర్లు) మెరుపులతో 8.3 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. కాగా లెథర్బాక్ జెయింట్స్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం. చదవండి: Mohammed Shami: 'నన్ను విమర్శించినోళ్లు భారతీయులే కాదు' SA Vs Nz 2nd Test: ప్రతీకారం తీర్చుకున్న దక్షిణాఫ్రికా.. న్యూజిలాండ్ ఘన విజయం Genius at work! 😱@nicholas_47 hit a ton off just 3️⃣7️⃣ balls including 6️⃣ fours and 1️⃣0️⃣ massive sixes to take the Leatherback Giants to a comfortable 9️⃣-wicket win! 👏 📺 Watch the best moments from this match on #FanCode 👉 https://t.co/c8dKvIy6GE pic.twitter.com/h5G2lrEo8s — FanCode (@FanCode) March 1, 2022 -
10 సిక్సర్లతో విండీస్ బ్యాటర్ విధ్వంసం
Rovman Powell Hits Century In 51 Balls.. వెస్టిండీస్ హిట్టర్ రోవ్‌మెన్ పావెల్ ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టి20లో మెరుపు సెంచరీతో విధ్వంసం సృష్టించాడు మెరిశాడు. సిక్సర్ల వర్షం కురిపించిన పావెల్.. 53 బంతుల్లో 4 ఫోర్లు, 10 సిక్సర్లతో 103 పరుగులు చేశాడు. అతని ధాటికి వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 224 పరుగుల భారీ స్కోరు చేసింది. నికోలస్ పూరన్ 43 బంతుల్లో 70 పరుగులతో రాణించాడు. చదవండి: అయ్యర్‌పై వేటు.. రవి బిష్ణోయ్‌కు బంపరాఫర్; తొలి వన్డేకు రాహుల్ దూరం అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగులు మాత్రమే చేసి 20 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో ఓపెనర్ టామ్ బాంటన్ (39 బంతుల్లో 73 పరుగులు, 3 ఫోర్లు, 6 సిక్సర్లు), పిలిఫ్ సాల్ట్(24 బంతుల్లో 57, 3 ఫోర్లు, 5 సిక్సర్లు) రాణించినప్పటికి మిగతావారు విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో షెఫర్డ్ మూడు, పొలార్డ్ 2, మిగతా బౌలర్లలో హొస్సేన్, హోల్డర్, కాట్రెల్ తలా ఒక వికెట్ తీశారు. తద్వారా ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లో విండీస్ 2-1తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. కెన్నింగ్సటన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 40 ఓవర్లలో 428 పరుగులు చేయడం వెస్టిండీస్ గడ్డపై అత్యధిక స్కోరుగా రికార్డు నమోదైంది. మ్యాచ్ మొత్తంలో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 31 సిక్సర్లు.. 19 ఫోర్లు కొట్డడం విశేషం. What a knock from from Rovman Powell! His 1st T20I century earns our #MastercardPricelessMoment. #WIvENG pic.twitter.com/IVtAkWAl5D — Windies Cricket (@windiescricket) January 27, 2022 -
రెండు సెంచరీలు ఒకే తరహాలో.. అరుదైన ఫీట్
బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్ 2021)లో సంచలన ఇన్నింగ్స్‌లు నమోదవుతున్నాయి. ముఖ్యంగా హోబర్ట్ హరికేన్స్ ఓపెనర్ మెక్ డెర్మోట్ వరుస సెంచరీలతో హోరెత్తిస్తున్నాడు. తాజాగా మెల్బోర్న్ రెనెగేడ్స్‌పై సెంచరీ బాదిన అతను బీబీఎల్ చరిత్రలో కొత్త రికార్డు సాధించాడు. అయితే మెక్ డెర్మోట్ రెండు సెంచరీలను ఒకే తరహాలో అందుకోవడం విశేషం. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో 95 పరుగులకు చేరుకున్న మెక్ డెర్మోట్.. కేన్ రిచర్డ్సన్ వేసిన బంతిని స్టాండ్స్‌లో కి బాది సెంచరీ పూర్తి చేశాడు. ఓవరాల్‌గా 65 బంతుల్లో 9 ఫోర్లు, 9 సిక్సర్లతో 127 పరుగులు చేశాడు. బిగ్‌బాష్ లీగ్‌లో మెక్ డెర్మోట్కు మూడో సెంచరీ కాగా.. ఈ సీజన్లో ఇది రెండో సెంచరీ. చదవండి: BBL 2021: కళ్లు చెదిరే క్యాచ్.. ఔటయానన్న సంగతి మరిచిపోయి కాగా ఇంతకముందు అడిలైడ్ స్ట్రైకర్స్‌తో మ్యాచ్‌లోనూ సిక్స్‌తోనే సెంచరీ సాధించాడు. తద్వారా బీబీఎల్ చరిత్రలో వరుసగా రెండు సెంచరీలను సిక్సర్లతో పూర్తి చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా మెక్ డెర్మోట్ చరిత్ర సృష్టించాడు. ఇక హోబర్ట్ హరికేన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. HISTORY MADE 🏆 Ben McDermott just made back-to-back 💯 for the first time in #BBL history! 📺 Watch #BBL11 on @Foxtel CH 503 or stream on @kayosports: https://t.co/gt5iNQ2w7F 📝 Blog: https://t.co/2QI8PpTMaE 🔢 Match Centre: https://t.co/QMgYF6q7lt pic.twitter.com/MFuEmYMWAw — Fox Cricket (@FoxCricket) December 29, 2021 That magic moment 💯 Ben McDermott brings up his second Big Bash century in STYLE 😎 #BBL11 pic.twitter.com/XsZP6cwY8y — KFC Big Bash League (@BBL) December 27, 2021 -
టి20 ప్రపంచకప్ 2021లో తొలి సెంచరీ.. చరిత్ర సృష్టించిన బట్లర్
Jos Buttler Maiden T20I Century.. టి20 ప్రపంచకప్ 2021లో శ్రీలంకతో మ్యాచ్‌లో ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జాస్ బట్లర్ మెరుపు శతకంతో మెరిశాడు. 67 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో లంక బౌలర్లను ఊచకోత కోసిన బట్లర్ ఇన్నింగ్స్ ఆఖరి బంతికి సిక్స్ కొట్టడం ద్వారా సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. కాగా బట్లర్‌కు టి20ల్లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. అంతేగాక ఈ ప్రపంచకప్‌లో బట్లర్‌దే తొలి సెంచరీ. అంతకముందు బట్లర్ 14 పరుగుల వద్ద ఉన్నప్పుడు టి20ల్లో 2వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. చదవండి: T20 World Cup 2021: కోహ్లి సేనకు మద్దతుగా నిలిచిన ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇక ఇప్పటివరకు టి20 ప్రపంచకప్‌ల్లో 8 సెంచరీలు నమోదయ్యాయి. తాజాగా బట్లర్ సెంచరీతో ఆ సంఖ్య తొమ్మిదికి చేరింది. ఈ జాబితాలో క్రిస్ గేల్(2007, 2016 టి20 ప్రపంచకప్‌లు), సురేశ్ రైనా(2010 టి20 ప్రపంచకప్), మహేళ జయవర్దనే(2010 టి20 ప్రపంచకప్), బ్రెండన్ మెక్కల్లమ్(2012 టి20 ప్రపంచకప్), అలెక్స్ హేల్స్(2014 టి20 ప్రపంచకప్), అహ్మద్ షెహజాద్(2014 టి20 ప్రపంచకప్), తమీబ్ ఇక్బాల్(2016 టి20 ప్రపంచకప్) ఉన్నారు. తాజాగా జాస్ బట్లర్ వారి సరసన చేరాడు. -
కోహ్లిని దాటాడు; రోహిత్‌తో సమానంగా నిలిచాడు
Babar Azam Suprass Kohli And Equals Rohit Sharma.. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజమ్ ప్రస్తుతం తన కెరీర్లో అత్యున్నత ఫామ్‌ను కనబరుస్తున్నాడు. సెంచరీలను మంచినీళ్ల ప్రాయంగా అందుకున్న బాబర్ అజమ్ తాజాగా టి20ల్లో కొత్త రికార్డు సాధించి చరిత్ర సృష్టించాడు. టి20ల్లో సెంచరీలు చేయడం చాలా అరుదుగా కనిపిస్తుంది. నేషనల్ టి20కప్‌లో భాగంగా సెంట్రల్ పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న బాబర్ అజమ్ నార్తన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ సాధించాడు. 63 బంతులెదుర్కొన్న అజమ్ 105 పరుగులు సాధించాడు. ఇందులో 11 ఫోర్లు.. 3 సిక్స్‌లు ఉన్నాయి. అయితే బాబర్ అజమ్ మెరుపు ఇన్నింగ్స్ జట్టును గెలిపించలేకపోయినప్పటికీ కొన్ని రికార్డులు మాత్రం బద్దలు కొట్టాడు. చదవండి: Punam Raut: అంపైర్ ఔటివ్వలేదు.. పెవిలియన్ చేరి మనసులు దోచుకుంది తాజా సెంచరీతో టి20ల్లో అన్ని మ్యాచ్‌లు కలిపి బాబర్ అజమ్ 6 సెంచరీలు సాధించాడు. 193 మ్యాచ్‌ల్లోనే అజమ్ ఈ ఫీట్‌ను అందుకున్నాడు. కాగా రోహిత్ శర్మ టి20ల్లో 353 మ్యాచ్‌లాడి 6 సెంచరీలు సాధించాడు. ఇక పాకిస్తాన్‌కే చెందిన అహ్మద్ షెహజాద్(222 మ్యాచ్‌ల్లో 5 సెంచరీలు), కమ్రాన్ అక్మల్(280 మ్యాచ్‌ల్లో 5 సెంచరీలు), టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి(315 మ్యాచ్‌ల్లో 5 సెంచరీలు) సాధించారు. తాజాగా బాబర్ అజమ్ విరాట్ కోహ్లిని అధిగమించి రోహిత్‌తో సమానంగా నిలిచాడు. అయితే మ్యాచ్‌ల పరంగా చూస్తే మాత్రం బాబర్ అజమ్(193 మ్యాచ్‌లు) తొలి స్థానంలో ఉన్నాడు. ఇక ఓవరాల్‌గా చూసుకుంటే క్రిస్ గేల్ 448 మ్యాచ్‌ల్లో 22 సెంచరీలతో తొలి స్థానంలో ఉన్నాడు. మైకెల్ క్లింగర్ 2వ స్థానం (206 మ్యాచ్‌ల్లో 8 సెంచరీలు), డేవిడ్ వార్నర్ 306 మ్యాచ్‌ల్లో 8 సెంచరీలతో మూడో స్థానం, ఆరోన్ ఫించ్ (324 మ్యాచ్‌ల్లో 8 సెంచరీలు) నాలుగు.. లూక్ రైట్(336 మ్యాచ్‌ల్లో 7 సెంచరీలు) ఐదు.. బ్రెండన్ మెక్కల్లమ్(370 మ్యాచ్‌ల్లో 7 సెంచరీలతో ఆరో స్థానంలో ఉన్నారు. చదవండి: Virender Sehwag: ప్రత్యర్థి ఆటగాడిని దూషించాడు.. మనోడైనా తిట్టాడు; అది క్రీడాస్పూర్తి The batting MAESTRO posts his 6th T20 century!@babarazam258 truly SENSATIONAL👏👏 The first 100 of the #NationalT20Cup 2021-22#NORvCP Live: https://t.co/c1M3QVvkws#KhelTouHoRahaHai pic.twitter.com/jGSpjJgUGG — Pakistan Cricket (@TheRealPCB) September 30, 2021 -
పాక్ రివెంజ్.. హీరో మాత్రం అతనే!
భారీ ఛేజ్‌లో భాగంగా జట్టు తడబాటు.. నిలదొక్కుకునే క్రమంలో 42 బంతుల్లో తొమ్మిది సిక్స్‌లతో విధ్వంసం సృష్టించాడు లియామ్ లివింగ్‌స్టోన్. అయినప్పటికీ ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. పాకిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్ తొలి మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓడింది. దీంతో 3-0 వన్డే సిరీస్ అవమానకరైమన ఓటమికి కొంతలో కొంత పాక్ ప్రతీకారం తీర్చుకున్నట్లు అయ్యింది. శుక్రవారం నాటింగ్హమ్ ట్రెంట్ బ్రిడ్జ్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో పాక్, ఆతిథ్య జట్టు ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. కెప్టెన్ బాబర్ అజామ్ 49 బంతుల్లో 85 పరుగులు, రిజ్వాన్ 41 బంతుల్లో 63 పరుగులతో రాణించడంతో ఆరు వికెట్ల నష్టానికి 232 పరుగుల భారీ లక్క్క్ష్యాన్ని ఇంగ్లండ్ ముందు ఉంచింది. బ్యాట్జులిపించిన లిమాయ్ అనంతరం బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. ఏడు ఓవర్లకే నాలుగు వికెట్లు పోగొట్టుకుని మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకుంది. అయితే మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ లియామ్ లివింగ్‌స్టోన్ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఒక్కసారిగా ఆశలు చిగురించాయి. 42 బంతుల్లో శతకం బాదడంతో పాటు.. సిక్స్ ద్వారా టీ20ల్లో ఫాసెస్ట్ సెంచరీ సాధించిన ఇంగ్లీష్ బ్యాట్స్‌మన్ ఘనతకు తన ఖాతాలో వేసుకున్నాడు లియామ్. కానీ, ఆ తర్వాతి బంతికే(17వ ఓవర్లో) భారీ షాట్ప్రయత్నించి అవుట్ అయ్యాడు. తర్వాతి బ్యాట్స్‌మ్యాన్ చేతులెత్తేయడంతో మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 201 పరుగులకు ఆలౌట్ అయ్యింది ఇంగ్లండ్. వీరోచితంగా పోరాడిన లియామ్‌ను ఇంగ్లండ్ మాజీ దిగ్గజాలతో పాటు పలువురు మెచ్చుకుంటున్నారు. The moment Liam Livingstone struck England's fastest T20I century 💪#ENGvPAKpic.twitter.com/nEkYA8iQsf — The Cricketer (@TheCricketerMag) July 16, 2021 -
ఒక్క శతకంతో ఐదు రికార్డులు..
లాహోర్: పాకిస్తాన్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య లాహోర్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో అజేయమైన సెంచరీతో కదం తొక్కిన పాక్ వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్(104 నాటౌట్; 64 బంతుల్లో 6x4, 7x6), అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20ల్లో తొలి సెంచరీని నమోదు చేసుకున్న రిజ్వాన్.. పాక్ తరఫున టీ20ల్లో సెంచరీ చేసిన తొలి వికెట్ కీపర్‌గా రికార్డు పుటల్లోకెక్కాడు. అంతేకాదు అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మట్లలో (వన్డే, టెస్టు, టీ20ల్లో) శతకం బాదిన రెండో వికెట్ కీపర్‌గా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ ఫీట్‌ను న్యూజిలాండ్ వికెట్ కీపర్ బ్రెండన్ మెక్కల్లమ్ మాత్రమే సాధించాడు. మెక్కల్లమ్ టెస్ట్‌ల్లో 5, వన్డేల్లో 3, టీ20ల్లో ఒక శతకం నమోదు చేయగా, రిజ్వాన్ వన్డేల్లో 2, టెస్టుల్లో 1, టీ20ల్లో1 సెంచరీ చేశాడు. ఇక ఓవరాల్‌గా అంతర్జాతీయ టీ20ల్లో శతకం బాదిన ఐదో వికెట్ కీపర్‌గా రిజ్వాన్ నిలిచాడు. మెక్కల్లమ్, అహ్మద్ షాజాద్, మోర్న్ వాన్ విక్, లెస్లీ డన్బార్ తరువాత రిజ్వాన్ ఈ ఘనతను సాధించాడు. అంతేకాదు టీ20 క్రికెట్లో దక్షిణాఫ్రికాపై సెంచరీ కొట్టిన తొలి వికెట్ కీపర్ కూడా రిజ్వానే కావడం విశేషం. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో సెంచరీ కొట్టిన రెండో పాక్ ఆటగాడిగా రిజ్వాన్ నిలిచాడు. అంతకుముందు అహ్మద్ షాజాద్ మత్రమే మూడు ఫార్మాట్లలో సెంచరీ సాధించాడు. మొత్తానికి రిజ్వాన్ ఒక్క సెంచరీతో ఐదు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా, పాక్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 6 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేయగా, దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లకు 166 పరుగులు మాత్రమే చేసి మ్యాచ్‌ను కోల్పోయింది. -
మూడు సెంచరీలతో ప్రపంచ రికార్డు
మౌంట్ మాంగనీ: న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ కొలిన్ మున్రో ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టి20ల్లో మూడు సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. వెస్డిండీస్‌తో జరుగుతున్న మూడో టి20 మ్యాచ్‌లో అతడీ ఘనత సాధించాడు. 47 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సర్లతో శతకం బాదాడు. మున్రో వీరవిహారం చేయడంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ టీమ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 243 పరుగుల భారీ స్కోరు సాధించింది. న్యూజిలాండ్‌కు టి20ల్లో ఇదే అత్యధిక స్కోరు. 104 పరుగులు చేసిన మున్రో చివరి ఓవర్ మొదటి బంతికి అవుటయ్యాడు. 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒక్క పరుగుకే 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు వాల్టన్, క్రిస్ గేల్ డకౌటయ్యారు. గతేడాది జనవరి 6న బంగ్లాదేశ్‌తో జరిగిన టి20 మ్యాచ్‌లో మున్రో (101) తొలి సెంచరీ కొట్టాడు. నవంబర్ 4న రాజ్‌కోట్‌లో భారత్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో 109 పరుగులతో అజేయంగా నిలిచి రెండో శతకాన్ని సాధించాడు. తాజాగా మూడో సెంచరీ చేసి ఇంటర్నేషనల్ టి20 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు. -
ఉతికి ఆరేసిన స్మిత్
మాంగ్ కాక్(హాంకాంగ్):ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుంచి వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ స్మిత్ వీడ్కోలు తీసుకున్నా తనలో సత్తా మాత్రం తగ్గలేదని నిరూపించుకున్నాడు. తాజాగా ప్రారంభమైన హాంకాంగ్ ట్వంటీ 20 బ్లిట్జ్ లో స్మిత్ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. తద్వారా ఈ ఫార్మాట్ లో రెండో వేగవంతమైన శతకం నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. బుధవారం సీటీ కైతక్ తో జరిగిన మ్యాచ్ లో కావ్లూన్ కాంటాన్స్ తో బరిలోకి దిగిన స్మిత్ 31 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. తొలి హాఫ్ సెంచరీని 16 బంతుల్లో పూర్తి చేసిన స్మిత్.. రెండో హాఫ్ సెంచరీని సాధించడానికి 15 బంతులు తీసుకున్నాడు. డ్వేన్ స్మిత్ సెంచరీ చేసి క్రమంలో 11 సిక్సర్లు, 6 ఫోర్లతో చెలరేగిపోయాడు.ఈ మ్యాచ్ లో స్మిత్ ఓవరాల్ గా 40 బంతులు ఆడి 13 సిక్సర్లు, 7 ఫోర్లతో 121 పరుగులు చేశాడు. స్మిత్ చెలరేగి ఆడటంతో 200 పరుగుల లక్ష్యాన్ని కావ్లూన్ కాంటాన్స్ సునాయాసంగా ఛేదించింది. కాంటాన్స్ 14.3 ఓవర్లలో రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. ఇదిలా ఉంచితే స్మిత్ అరుదైన రికార్డును తృటిలో చేజార్చుకున్నాడు. ట్వంటీ 20 ఫార్మాట్ లో వేగవంతమైన సెంచరీ చేసే అవకాశాన్ని కొద్దిలో చేజార్చుకున్నాడు. 2013 ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఆటగాడైన గేల్ 30 బంతుల్లో శతకం చేసి వరల్డ్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత స్మిత్ దే ఈ ఫార్మాట్ లో ఫాస్టెస్ట్ సెంచరీ. ఇక్కడ ఇద్దరూ విండీస్ క్రికెటర్లు కావడం మరో విశేషం. కేవలం అంతర్జాతీయ క్రికెట్ లో ఏకైక సెంచరీ చేసిన స్మిత్..గత కొన్ని రోజుల క్రితం వెస్టిండీస్ జట్టు నుంచి వీడ్కోలు తీసుకున్నాడు. అతనికి జట్టులో స్థానం దక్కి దాదాపు రెండు సంవత్సరాలు కావడంతో విండీస్ కు గుడ్ బై చెప్పేశాడు.