IPL 2022: RCB Batter Rajat Patidar Break Many Records After Century Vs LSG - Sakshi
Sakshi News home page

IPL 2022: రజత్‌ పాటిదార్‌ కొత్త చరిత్ర.. ఆర్‌సీబీ తరపున తొలి బ్యాటర్‌గా

Published Wed, May 25 2022 10:01 PM | Last Updated on Thu, May 26 2022 8:50 AM

IPL 2022 RCB Batter Rajat Patidar Break Many Records After Century Vs LSG - Sakshi

PC: IPL Twitter

ఆర్‌సీబీ బ్యాటర్‌ రజత్‌ పాటిదార్‌ కీలకమైన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సూపర్‌ శతకంతో మెరిశాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌లో పాటిదార్‌ 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సర్లతో సెంచరీ మార్క్‌ అందుకున్నాడు. ఈ నేపథ్యంలో 54 బంతుల్లో 112 పరుగులు నాటౌట్‌గా నిలిచిన పాటిదార్‌ ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరపున పలు రికార్డులు బద్దలు కొట్టాడు. 

►ఆర్‌సీబీ తరపున నాకౌట్‌ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన తొలి బ్యాటర్‌గా రజత్‌ పాటిదార్‌ నిలిచాడు.
►ప్లేఆఫ్‌ మ్యాచ్‌లో ఆర్‌సీబీ తరపున అత్యధిక స్కోరు సాధించిన తొలి ఆటగాడిగా రజత్‌ పాటిదార్‌(54 బంతుల్లో 112, 12 ఫోర్లు, 7 సిక్సర్లు). ఈ నేపథ్యంలో క్రిస్‌ గేల్‌(89 పరుగులు)ను అధిగమించాడు.
►అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా ఐపీఎల్‌లో సెంచరీ అందుకున్న నాలుగో ఆటగాడిగా రజత్‌ పాటిదార్‌. ఇంతకముందు పాల్‌ వాల్తాటి(120*పరుగులు, పంజాబ్‌ కింగ్స్‌, 2011లో సీఎస్‌కేపై), మనీష్‌ పాండే(114*పరుగులు, ఆర్‌సీబీ, 2009లో డెక్కన్‌ చార్జర్స్‌పై), దేవదత్‌ పడిక్కల్‌(101*పరుగులు, ఆర్‌సీబీ, 2021లో రాజస్తాన్‌ రాయల్స్‌పై)
►అన్‌క్యాప్‌డ్‌ ప్లేయర్‌గా ప్లేఆఫ్‌ మ్యాచ్‌లో సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా రజత్‌ పాటిదార్‌ నిలిచాడు. ఓవరాల్‌గా ప్లేఆఫ్‌ మ్యాచ్‌ల్లో సెంచరీ అందుకున్న ఐదో ఆటగాడిగా నిలిచాడు. ఇంతకముందు సెహ్వాగ్‌, షేన్‌ వాట్సన్‌, వృద్దిమాన​ సాహా, మురళీ విజయ్‌లు ఈ ఫీట్‌ సాధించారు.
►అన్‌ క్యాప్‌డ్‌ ప్లేయర్‌గాఅత్యధిక స్కోరు సాధించిన మూడో ఆటగాడిగా నిలిచాడు. ఇంతకముందు మనీష్‌ పాండే 94 పరుగులు( కేకేఆర్‌, 2014లో పంజాబ్‌ కింగ్స్‌పై ), మన్విందర్‌ బిస్లా 89 పరుగులు(కేకేఆర్‌, 2012లో సీఎస్‌కేపై) ఉన్నారు.

చదవండి: Kohli-Ganguly: కోహ్లి స్టైలిష్‌ బౌండరీ.. గంగూలీ రియాక్షన్‌ అదిరే

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement