Heinrich Klaasen Maiden IPL Century In 49 Balls-SRH Vs RCB Match - Sakshi
Sakshi News home page

#HeinrichKlaasen: క్లాసెన్‌ విధ్వంసం.. సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ తరపున రెండో శతకం

Published Thu, May 18 2023 9:01 PM | Last Updated on Thu, May 18 2023 9:34 PM

Heinrich Klaasen Maiden IPL Century In 49 Balls-SRH Vs RCB Match - Sakshi

Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ నుంచి స్థిరమైన బ్యాటింగ్‌ కనబరుస్తున్న ఒకే ఒక్కడు హెన్రిచ్‌ క్లాసెన్‌. అలాంటి క్లాసెన్‌ గురువారం ఆర్‌సీబీతో మ్యాచ్‌లో సెంచరీ మార్క్‌‌ అందుకున్నాడు. 49 బంతుల్లో శతకం పూర్తి చేసుకున్న క్లాసెన్‌ ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి.


Photo: IPL Twitter

కాగా క్లాసెన్‌కు ఐపీఎల్‌లో ఇదే తొలి శతకం కాగా.. ఎస్‌ఆర్‌హెచ్‌ తరపున ఈ సీజన్‌లో క్లాసెన్‌ది రెండో శతకం కాగా.. తొలి శతకం హ్యారీ బ్రూక్‌ సాధించిన సంగతి తెలిసిందే. ఓవరాల్‌గా ఈ సీజన్‌లో ఇది ఆరో సెంచరీ. ఇంతకముందు ఈ సీజన్‌లో వెంకటేశ్‌ అయ్యర్‌(కేకేఆర్‌), యశస్వి జైశ్వాల్‌(రాజస్తాన్‌ రాయల్స్‌), హ్యారీ బ్రూక్‌(ఎస్‌ఆర్‌హెచ్‌), సూర్యకుమార్‌ యాదవ్‌(ముంబై ఇండియన్స్‌), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌(పంజాబ్‌ కింగ్స్‌) సెంచరీ మార్క్‌ అందుకున్నారు.

చదవండి: RCB ప్లేఆఫ్‌ కోసం పూజలు.. పిచ్చి పీక్స్‌ అంటే ఇదే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement