
Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో కింగ్ కోహ్లి సెంచరీ మార్క్ సాధించాడు. గురువారం ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో ఈ ఆర్‌సీబీ ఓపెనర్ సిక్సర్‌తో శతకం పూర్తి చేయడం విశేషం. ఈ సీజన్‌లో ఆర్‌సీబీ తరపున కోహ్లిది తొలి శతకం కాగా.. ఓవరాల్‌గా సీజన్‌లో ఇది ఏడో శతకం. 61 బంతుల్లో శతకం సాధించిన కోహ్లి ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. 35 బంతుల్లో తొలి ఫిఫ్టీ సాధించిన కోహ్లి.. మలి ఫిఫ్టీని 26 బంతుల్లో అందుకున్నాడు.
కాగా కోహ్లికి ఐపీఎల్‌లో ఇది ఆరో శతకం కాగా.. నాలుగేళ్ల తర్వాత మళ్లీ శతకంతో మెరవడం విశేషం. అచ్చొచ్చిన ఉప్పల్ స్టేడియంలో కోహ్లి సెంచరీ సాధించడం అభిమానులను సంతోషపెట్టింది. అంతేకాదు ప్లేఆఫ్ రేసులో ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో కోహ్లి సెంచరీ సాధించి జట్టు విజయంలో కీలకపాత్రో పోషించాడు. కోహ్లి ఆడిన ఈ ఇన్నింగ్స్ కొంతకాలం గుర్తుండిపోవడం ఖాయం.
A magnificent CENTURY by Virat Kohli 🔥🔥
— IndianPremierLeague (@IPL) May 18, 2023
Take a bow, King Kohli!
His SIXTH century in the IPL.#TATAIPL #SRHvRCB pic.twitter.com/gd39A6tp5d
Comments
Please login to add a commentAdd a comment