Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో ఆర్‌సీబీ స్టార్.. కింగ్ కోహ్లి రెండో సెంచరీ నమోదు చేశాడు. ఆదివారం(మే 21) గుజరాత్ టైటాన్స్‌తో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కోహ్లి ఈ ఫీట్ అందుకున్నాడు. 60 బంతుల్లో శతకం మార్క్ సాధించిన కోహ్లి ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. సీజన్‌లో కోహ్లికి ఇది రెండో సెంచరీ కాగా.. ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన గత మ్యాచ్‌లోనూ కోహ్లి సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.
ఓవరాల్‌గా కోహ్లికి ఇది ఏడో సెంచరీ. ఈ సెంచరీతో కోహ్లి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన మొనగాడిగా కోహ్లి నిలిచాడు. ఇప్పటివరకు ఆరు సెంచరీలతో గేల్‌తో సమానంగా ఉన్న కోహ్లి తాజాగా అతన్ని దాటి అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. కోహ్లి, గేల్ తర్వాత జాస్ బట్లర్ ఆరు సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు.
ఇక ఐపీఎల్ 2023లో కోహ్లిది పదోదో శతకం. ఇంతకముందు హెన్రిచ్ క్లాసెన్ (104 పరుగులు), విరాట్ కోహ్లీ (100 పరుగులు), శుభమాన్ గిల్ (101 పరుగులు), ప్రబ్‌సిమ్రాన్ సింగ్ (103 పరుగులు) , సూర్యకుమార్ యాదవ్ (103* పరుగులు) , యశస్వి జైస్వాల్ (124 పరుగులు) , వెంకటేష్ అయ్యర్ (104 పరుగులు) , హ్యారీ బ్రూక్ (100* పరుగులు), కోహ్లి(101*)తో ఉన్నారు.
ఇక టి20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్లలో కోహ్లి 8 సెంచరీలతో మైకెల్ కింగర్, డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్‌లతో కలిసి సంయుక్తంగా ఉన్నాడు. ఇక తొలి స్థానంలో క్రిస్ గేల్(22 సెంచరీలు) ఉండగా.. బాబర్ ఆజం 9 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు.
ఐపీఎల్‌లో ఒకే సీజన్‌లో వరుసగా రెండు సెంచరీలు బాదిన మూడో క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. ఇంతకముందు శిఖర్ ధావన్(2020లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున), జాస్ బట్లర్(రాజస్తాన్ రాయల్స్ తరపున 2022లో) వరుసగా రెండు సెంచరీలు బాదారు.
Not just a player, he is an emotion 🙌🤩#KingKohli 👑 conquers his way to the most centuries in #TATAIPL history 🤯#RCBvGT #IPLonJioCinema #EveryGameMatters #IPL2023 | @RCBTweets @imVkohli pic.twitter.com/J2d4vnO0PX
— JioCinema (@JioCinema) May 21, 2023
చదవండి: 'గతేడాది ఆర్‌సీబీకి సాయం చేశాం.. ఈసారి పరిస్థితి వేరు'
Comments
Please login to add a commentAdd a comment