IPL Centuries
-
చరిత్ర సృష్టించిన ఐపీఎల్ 2024
ఐపీఎల్ 2024 సీజన్ సెంచరీల విషయంలో ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పింది. ఈ సీజన్లో రికార్డు స్థాయిలో 14 సెంచరీలు నమోదయ్యాయి. గతంలో ఏ సీజన్లోనూ ఇన్ని సెంచరీలు నమోదు కాలేదు. 2023 సీజన్లో నమోదైన 12 సెంచరీల రికార్డును ఈ సీజన్ బద్దలు కొట్టింది. ఈ సీజన్లో వివిధ ఫ్రాంచైజీలకు చెందిన 13 మంది ప్లేయర్లు శతక్కొట్టారు. వీరిలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు జోస్ బట్లర్ రెండుసార్లు సెంచరీ మార్కును తాకాడు. సీజన్ తొలి సెంచరీని లక్నో ఆటగాడు మార్కస్ స్టోయినిస్ (63 బంతుల్లో 124*) నమోదు చేయగా.. విరాట్ కోహ్లి (72 బంతుల్లో 113*), సునీల్ నరైన్ (56 బంతుల్లో 109), రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 108*), జానీ బెయిర్‌స్టో (48 బంతుల్లో 108*), జోస్ బట్లర్ (60 బంతుల్లో 107*), రోహిత్ శర్మ (63 బంతుల్లో 105*), యశస్వి జైస్వాల్ (60 బంతుల్లో 104*), శుభ్‌మన్ గిల్ (55 బంతుల్లో 104), సాయి సుదర్శన్ (51 బంతుల్లో 103), సూర్యకుమార్ యాదవ్ (51 బంతుల్లో 102*), ట్రవిస్ హెడ్ (41 బంతుల్లో 102), జోస్ బట్లర్ (58 బంతుల్లో 100*), విల్ జాక్స్ (41 బంతుల్లో 100*) వరుసగా సెంచరీలు చేశారు. ఈ సీజన్ వేగవంతమైన సెంచరీ రికార్డు ట్రవిస్ హెడ్, విల్ జాక్స్ పేరిట సంయుక్తంగా నమోదై ఉంది. హెడ్ ఆర్సీబీపై.. జాక్స్ గుజరాత్‌పై 41 బంతుల్లో శతక్కొట్టారు.సీజన్ల వారీగా సెంచరీలు..2024- 14 సెంచరీలు2023- 12 సెంచరీలు2022- 8 సెంచరీలు2021- 4 సెంచరీలు2020- 5 సెంచరీలు2019- 6 సెంచరీలు2018- 5 సెంచరీలు2017- 5 సెంచరీలు2016- 7 సెంచరీలు2015- 4 సెంచరీలు2014- 3 సెంచరీలు2013- 4 సెంచరీలు2012- 6 సెంచరీలు2011- 6 సెంచరీలు2010- 4 సెంచరీలు2009- 2 సెంచరీలు2008- 6 సెంచరీలుఓవరాల్గా 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో 101 సెంచరీలు నమోదయ్యాయి. -
జోస్ బట్లర్ వీరోచిత సెంచరీ.. క్రిస్ గేల్ రికార్డు బద్దలు
ఐపీఎల్-2024లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 224 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్తాన్ 8 వికెట్లు కోల్పోయి ఆఖరి బంతికి చేధించింది. ఈ మ్యాచ్‌లో బట్లర్ విరోచిత శతకంతో చెలరేగాడు. ఈ విజయంలో ఆ జట్టు స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ కీలక పాత్ర పోషించాడు. ఓటమి తప్పదనుకున్న చోట బట్లర్ తన విధ్వంసకర ఇన్నింగ్స్‌తో తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. 224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ ఆరంభంలో తడబడింది. వరుస క్రమంలో జైశ్వాల్, సంజూ శాంసన్ వికెట్లు కోల్పోయి రాజస్తాన్ కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన పరాగ్‌తో కలిసి బట్లర్ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. అనంతరం పరాగ్, అశ్విన్, హెట్‌మైర్ వరుస క్రమంలో ఔటయ్యారు. దీంతో రాజస్తాన్ ఓటమి ఖాయమైందని అంతా భావించారు. కానీ క్రీజులో ఉన్న బట్లర్ మాత్రం తన పట్టును విడలేదు. ఓ వైపు వికెట్లు పడుతున్నప్పటికి తన జోరును కొనసాగించాడు. తన హాఫ్ సెంచరీ పూర్తియ్యాక కేకేఆర్ బౌలర్లను బట్లర్ ఊచకోత కోశాడు. ఆఖరివరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 60 బంతులు ఎదుర్కొన్న బట్లర్.. 9 ఫోర్లు, 6 సిక్స్‌లతో 107 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. క్రిస్ గేల్ రికార్డు బద్దలు ఓవరాల్‌గా బట్లర్‌కు ఇది ఏడో ఐపీఎల్ సెంచరీ కావడం గమనార్హం. తద్వారా ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా బట్లర్ రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ దిగ్గజం గేల్(6 సెంచరీలు) రికార్డును జోస్ బ్రేక్ చేశాడు. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో తొలి స్ధానంలో ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి(8) ఉన్నాడు. ఆ తర్వాతి స్ధానంలో బట్లర్(7) నిలిచాడు. Like this tweet if u witnessed jos Buttler Alone warrior century knock Jos the boss you absolutely beauty #KKRvRR | #IPL2024 pic.twitter.com/EpWGnD1OOL — 𝑃𝑖𝑘𝑎𝑐ℎ𝑢☆•° (@11eleven_4us) April 16, 2024 -
విరాట్ కోహ్లి విధ్వంసకర సెంచరీ.. 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో! వీడియో
ఐపీఎల్-2024లో తొలి సెంచరీ నమోదైంది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్‌గా వచ్చిన విరాట్ రాజస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. కేవలం 67 బంతుల్లో విరాట్ తన సెంచరీని మార్క్‌ను అందుకున్నాడు. ఇది విరాట్‌కు 8వ ఐపీఎల్ సెంచరీ. తన ట్రేడ్ మార్క్ షాట్లతో రన్‌మిషన్ అభిమానులను అలరించాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 72 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి.. 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 113 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ ఏడాది సీజన్ తమ తొలి మ్యాచ్ నుంచే కోహ్లి తన అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నాడు. ఇప్పటివరరకు ఈ ఏడాది సీజన్లో 5 మ్యాచ్‌లు ఆడిన కింగ్.. 316 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగతున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆర్సీబీ కోహ్లితో పాటు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్(44) పరుగులతో రాణించాడు. రాజస్తాన్ బౌలర్లలో యజువేంద్ర చాహల్ రెండు వికెట్లు పడగొట్టగా.. బర్గర్ ఒక్క వికెట్ సాధించాడు. It's official: Kohli is the real Gotham's Batman 🦇 #RRvsRCB #KingKohli pic.twitter.com/hTY3Feg2nL — Satan (@Scentofawoman10) April 6, 2024 -
#SKY: టీ20 మాస్టర్‌క్లాస్ చూశాను! నా కళ్ల ముందే.... వారెవ్వా!
IPL 2023- Suryakumar Yadav: ముంబై ఇండియన్స్ బ్యాటర్, టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్‌పై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల జల్లు కురిపించాడు. వాంఖడే స్టేడియంలో మాస్టర్‌క్లాస్ టీ20 సెంచరీ తనకు కనులవిందు చేసిందని పేర్కొన్నాడు. అద్భుత ఇన్నింగ్స్ చూసిన ఆ సమయంలో ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యానని తెలిపాడు. కాగా ఐపీఎల్-2023 ఆరంభంలో సూర్యకుమార్ యాదవ్ స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడ్డాడు. అయితే, ఆ తర్వాత బ్యాట్ ఝులిపించిన సూర్య కీలక మ్యాచ్‌లలో ముంబై ఇండియన్స్‌కు విజయాలు అందించాడు. తొలి సెంచరీ ఇక లీగ్ దశలో మే 12న వాంఖడే స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సూర్య ఆడిన ఇన్నింగ్స్ అన్నింటిలోకి హైలైట్‌గా నిలిచింది. 49 బంతుల్లో 103 పరుగులతో అజేయంగా నిలిచిన మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్.. ఐపీఎల్లో తన తొలి సెంచరీ నమోదు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 6 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ మ్యాచ్‌లో ముంబై 27 పరుగుల తేడాతో గుజరాత్‌పై గెలుపొందగా.. సూర్య ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. నాటి జ్ఞాపకాలను తాజాగా గుర్తు చేసుకున్నాడు కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్. టీ20 మాస్టర్‌క్లాస్ చూశాను ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘వాంఖడే మైదానంలో నా కళ్ల ముందు సూర్యకుమార్ బాదిన ఆ సెంచరీ అద్భుతం. టీ20 మాస్టర్‌క్లాస్ చూశాను. టీ20 భవిష్యత్ ఆశాకిరణం కనిపించింది. ఆరోజు సూర్య ఇన్నింగ్స్ అమోఘం. అసలు ఇది నిజంగా జరిగిందా లేదా అనే సందేహంలో ఉండిపోయా. ఆశ్చర్యంతో అలా చూస్తుండిపోయా’’ అంటూ మంజ్రేకర్.. సూర్యను ఆకాశానికెత్తాడు. కాగా ఐపీఎల్-2023లో ప్లే ఆఫ్స్ చేరిన ముంబై ఇండియన్స్.. క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది. తద్వారా టోర్నీ నుంచి రిక్తహస్తాలతో నిష్క్రమించింది. ఇక రిజర్వ్‌డే (మే 29) నాటి ఫైనల్లో గుజరాత్‌ను ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి చాంపియన్‌గా అవతరించింది. అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా ముంబై ఇండియన్స్ పేరిట ఉన్న రికార్డును సమం చేసింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023 సీజన్లో సూర్య 16 ఇన్నింగ్స్‌లలో కలిపి 605 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు అర్థ శతకాలు , ఒక సెంచరీ ఉంది. అత్యధిక స్కోరు 103 నాటౌట్. చదవండి: SL Vs AFG: లంకతో వన్డే సిరీస్.. అఫ్గనిస్తాన్‌కు ఊహించని షాక్! ఆనందంలో సీఎస్కే ఆల్‌రౌండర్.. సర్ జడేజాకు థాంక్స్! పోస్ట్ వైరల్ A 💯 that wowed teammates, fans and opponents alike 🤩 Take a bow #SuryakumarYadav 👏#MIvGT #IPLonJioCinema | @surya_14kumar pic.twitter.com/kwUuMfTGKz — JioCinema (@JioCinema) May 12, 2023 -
ముందే అనుకున్నారా.. కలిసే సెంచరీలు కొడుతున్నారు!
విరాట్ కోహ్లి, శుబ్‌మన్ గిల్.. ఇద్దరిలో ఒకరు ఇప్పటికే తానేంటో ప్రూవ్ చేసుకొని క్రికెట్ ప్రపంచాన్ని శాసిస్తుంటే.. మరొకరు యంగ్ ప్లేయర్‌గా రికార్డులు సృష్టిస్తున్నాడు. ఆటలో ఎవరికి వారే సాటి. గిల్ కోహ్లి కంటే చాలా సీనియర్ అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంకా చెప్పాలంటే కోహ్లి ఆటను చూస్తూ గిల్ పెరిగాడు. అలాంటిది ఈ ఇద్దరు ఇప్పుడు టీమిండియా తరపున కీలక బ్యాటర్లుగా ఎదిగారు. మరో విశేషమేమిటంటే ఈ ఇద్దరు కలిసి ఈ ఏడాది మూడు వేర్వరు మ్యాచ్‌ల్లో ఒకేసారి సెంచరీలతో మెరిశారు. అందులో రెండు మ్యాచ్‌లు టీమిండియా తరపున .. మరొకటి ఐపీఎల్లో వేర్వేరు జట్లు తరపున ఒకే మ్యాచ్‌లో సెంచరీలు బాదారు. తొలిసారి లంకతో జరిగిన మూడో వన్డేలో ఈ ఏడాది శుబ్‌మన్ గిల్, కోహ్లిలు ఒకే మ్యాచ్‌లో సెంచరీలతో మెరిసింది లంకతో జరిగిన మూడో వన్డేలో. ఆ మ్యాచ్‌లో టీమిండియా 317 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 390 పరుగుల భారీ స్కోరు చేసింది. తొలుత ఓపెనర్ గిల్ 116 పరుగులు సెంచరీ చేయగా.. ఆ తర్వాత కోహ్లి 166 పరుగులతో నాటౌట్‌గా నిలవడం విశేషం. రెండోసారి.. ఆస్ట్రేలియాతో నాలుగో టెస్టులో ఇక ఈ ఇద్దరు ఒకే మ్యాచ్‌లో రెండోసారి సెంచరీలు చేసింది బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన నాలుగో టెస్టులో. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఈ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 571 పరుగులకు ఆలౌట్ అయింది. శుబ్‌మన్ గిల్ 128 పరుగులు చేయగా.. కోహ్లి 186 పరుగులు చేశాడు. అయితే ఈ మ్యాచ్ ఫలితం తేలకుండా డ్రాగా ముగిసింది. ఐపీఎల్లో ముచ్చటగా మూడోసారి Photo: IPL Twitter ఇక ముచ్చటగా మూడోసారి ఒకే మ్యాచ్‌లో సెంచరీలు బాదింది ఐపీఎల్లో. అయితే ఇక్కడ మాత్రం ప్రత్యర్థులుగా సెంచరీలు సాధించారు. ప్లేఆఫ్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో కోహ్లి 101 నాటౌట్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఆర్సీబీ 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. అయితే గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ 104 పరుగులు నాటౌట్ చివరివరకు నిలిచి గుజరాత్‌ను గెలిపించి ఆర్సీబీ లీగ్ స్టేజీలోనే వెనుదిరగడానికి కారణమయ్యాడు. అలా కోహ్లి, గిల్లు ముచ్చటగా మూడుసార్లు మూడు వేర్వేరు మ్యాచ్‌ల్లో సెంచరీలతో మెరిసి అరుదైన ఘనత సాధించారు. ఐపీఎల్ అనంతరం ఆస్ట్రేలియాతో జరగనున్న వరల్డ్‌టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో మరోసారి ఈ ఇద్దరు సెంచరీలతో చెలరేగి జట్టును గెలిపించాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా జూన్ ఏడు నుంచి 11 వరకు ఓవల్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. చదవండి: జడ్డూకు ఫుల్ డిమాండ్.. సీఎస్కే నుంచి బయటికి వస్తే?! -
ప్లేఆఫ్‌లో సెంచరీ చేసిన ఏడో బ్యాటర్‌గా; ఒక్క శతకంతో ఇన్ని రికార్డులా
గుజరాత్ టైటాన్స్ విధ్వంసకర ఓపెనర్ శుబ్‌మన్ గిల్ తన కెరీర్లోనే పీక్ ఫామ్‌లో ఉన్నాడు. బరిలో ఉన్నాడంటే చాలు సెంచరీ లేదా అర్థసెంచరీల మోత మోగిస్తున్నాడు. ఇక సెంచరీలు అయితే మంచినీళ్ల ప్రాయంగా అందుకుంటున్నాడు. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో కీలకమైన క్వాలిఫయర్-2 పోరులో గిల్ శతకంతో మెరిశాడు. 49 బంతుల్లో సెంచరీ మార్క్ అందుకున్న గిల్‌కు ఇది సీజన్లో మూడో సెంచరీ కావడం విశేషం. ఈ నేపథ్యంలో ఒక్క సెంచరీతో గిల్ తన పేరిట చాలా రికార్డులు లిఖించుకున్నాడు. అవేంటో ఒకసారి పరిశీలిద్దాం. Photo: IPL Twitter ► ఐపీఎల్లో ప్లేఆఫ్స్‌లో సెంచరీ బాదిన ఏడో క్రికెటర్‌గా శుబ్‌మన్ గిల్ నిలిచాడు. ఇంతకముందు ఐపీఎల్ 2014లో వీరేంద్ర సెహ్వాగ్ 122 పరుగులు, ఐపీఎల్ 2018లో షేన్ వాట్సన్ 117 పరుగులు, ఐపీఎల్ 2014లో వృద్ధిమాన్ సాహా 115 పరుగులు, ఐపీఎల్ 2022లో మురళీ విజయ్ - 113, ఐపీఎల్ 2022లో రజత్ పాటిదార్ 112 పరుగులు, ఐపీఎల్ 2022లో జోస్ బట్లర్ 106 పరుగులు ప్లేఆఫ్‌లో సెంచరీలు చేశారు. ► ఐపీఎల్లో ఒకే సీజన్లో మూడు సెంచరీలు బాదిన యంగెస్ట్ క్రికెటర్‌గా(23 ఏళ్ల 260 రోజులు) శుబ్‌మన్ గిల్ నిలిచాడు. Photo: IPL Twitter ► ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్‌లో అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్‌గా గిల్ నిలిచాడు. ముంబైతో మ్యాచ్‌లో 129 పరుగులు చేసిన గిల్.. సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టాడు. 2014లో సీఎస్కేపై పంజాబ్ కింగ్స్ తరపున 122 పరుగులు ఇప్పటివరకు టీమిండియా తరపున ఏ బ్యాటర్‌కైనా ప్లేఆప్లో అత్యధిక స్కోరు. తాజాగా గిల్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు. ► ఐపీఎల్లో టీమిండియా తరపున అత్యధిక స్కోరు చేసిన రెండో బ్యాటర్‌గా గిల్ నిలిచాడు. మ్యాచ్‌లో గిల్ 60 బంతుల్లో 129 పరుగులు చేశాడు. ఇక 2020లో పంజాబ్ కింగ్స్ తరపున 132 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ టీమిండియా తరపున ఐపీఎల్లో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. Photo: IPL Twitter ► ఐపీఎల్లో ఒక సీజన్లో 800 పరుగుల మార్క్‌ను దాటిన రెండో బ్యాటర్‌గా గిల్ నిలిచాడు. ఇంతకముందు విరాట్ కోహ్లి 2016లో 973 పరుగులు చేశాడు. ఇక సెంచరీల విషయంలోనూ మరొక రికార్డు సాధించాడు. ఒక సీజన్లో మూడు సెంచరీలు చేసిన గిల్.. ఐపీఎల్లో టీమిండియా తరపున అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. తొలి స్థానంలో కోహ్లి(2016లో నాలుగు సెంచరీలతో) ఉన్నాడు. ఓవరాల్‌గా కోహ్లి(2016), బట్లర్(2022) నాలుగు సెంచరీలతో సంయుక్తంగా తొలి స్థానంలో ఉండగా.. గిల్ మూడు సెంచరీలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ► ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో అత్యంత వేగంగా సెంచరీ సాధించిన ఆటగాడిగా గిల్.. సాహా, రజత్ పాటిదార్లతో కలిసి సంయుక్తంగా నిలిచాడు. ముంబైతో మ్యాచ్‌లో గిల్ 49 బంతుల్లోనే శతకం అందుకోగా.. గతంలో సాహా ఐపీఎల్ 2014 ఫైనల్లో, రజత్ పాటిదార్(2022 ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో) 49 బంతుల్లోనే శతకం సాధించారు. Photo: IPL Twitter ► ఐపీఎల్ ప్లేఆఫ్ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన జాబితాలో గిల్ తొలిస్థానంలో ఉన్నాడు. ముంబైతో మ్యాచ్‌లో గిల్ 60 బంతుల్లో 129 పరుగులు చేయగా.. అందులో 10 సిక్సర్లు ఉన్నాయి. ఇంతకముందు వృద్దిమాన్ సాహా(2014 ఫైనల్). క్రిస్ గేల్(2016 ఫైనల్), వీరేంద్ర సెహ్వాగ్(2014 క్వాలిఫయర్-2), షేన్ వాట్సన్(2018 ఫైనల్) తలా 8 సిక్సర్లు బాదారు. 𝙂𝙄𝙇𝙇𝙞𝙖𝙣𝙩! 👏👏 Stand and applaud the Shubman Gill SHOW 🫡🫡#TATAIPL | #Qualifier2 | #GTvMI | @ShubmanGill pic.twitter.com/ADHi0e6Ur1 — IndianPremierLeague (@IPL) May 26, 2023 His royal highness, first of his name, destroyer of bowling attacks, lord of the sixes - Prince Shubman Gill 💯#GTvMI #TATAIPL #IPLonJioCinema #IPLPlayoffs pic.twitter.com/HQns2Gq5mv — JioCinema (@JioCinema) May 26, 2023 చదవండి: గిల్ సెంచరీ.. ఒకే సీజన్లో మూడు శతకాలు బాదిన యంగెస్ట్ క్రికెటర్‌గా -
గిల్ సెంచరీ.. ఒకే సీజన్లో మూడు శతకాలు బాదిన యంగెస్ట్ క్రికెటర్‌గా
ఐపీఎల్ 16వ సీజన్లో శుబ్‌మన్ గిల్ మూడో సెంచరీతో మెరిశాడు. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో శుబ్‌మన్ గిల్ శతకం మార్క్ సాధించాడు. 49 బంతుల్లో సెంచరీ సాధించిన గిల్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. ఇదే సీజన్లో లీగ్ దశలో రెండు సెంచరీలు బాదిన గిల్.. తాజాగా క్వాలిఫయర్-2లో మూడో శతకం సాధించాడు. Photo: IPL Twitter ఐపీఎల్ చరిత్రలో ఒకే సీజన్లో మూడు సెంచరీలు చేసిన రెండో భారత బ్యాటర్‌గా.. తొలి యంగెస్ట్ ప్లేయర్‌గా(23 ఏళ్ల 260 రోజులు) గిల్ రికార్డులకెక్కాడు. ఇంతకవరకు ఒకే సీజన్లో నాలుగు సెంచరీలు బాదిన బట్లర్(ఐపీఎల్ 2022లో), కోహ్లి(2016లో) సంయుక్తంగా తొలి స్థానంలో ఉన్నారు. తాజాగా గిల్ మూడో సెంచరీ బాది రెండో స్థానంలో నిలిచాడు. Photo: IPL Twitter ఇక ఒకే సీజన్లో రెండు సెంచరీలు బాదిన క్రికెటర్ల జాబితాలో కోహ్లి, గిల్, శిఖర్ ధావన్, షేన్ వాట్సన్, కేఎల్ రాహుల్ ఉన్నారు. తాజాగా గిల్ ఆ రికార్డును బద్దలు కొట్టి ఒకే సీజన్లో మూడు సెంచరీలు బాదిన రెండో భారత క్రికెటర్‌గా నిలిచాడు. ఇక గిల్ తాజా సెంచరీతో ఈ సీజన్లో శతకాల సంఖ్య 12కు చేరుకుంది. His royal highness, first of his name, destroyer of bowling attacks, lord of the sixes - Prince Shubman Gill 💯#GTvMI #TATAIPL #IPLonJioCinema #IPLPlayoffs pic.twitter.com/HQns2Gq5mv — JioCinema (@JioCinema) May 26, 2023 Shubman gill century 💯 👑 💫 #Gill #ShubmanGill #GTvMI #IPL pic.twitter.com/Df5NjYOZ22 — Sandeep kishore 🇮🇳 (@sandeepkishore_) May 26, 2023 చదవండి: అనుభవం ముందు పనికిరాలేదు.. తెలివైన బంతితో బోల్తా -
IPL 2023: గొప్పగా అనిపిస్తోంది.. అయినా వాళ్లకేం తెలుసు?: విరాట్ కోహ్లి
IPL 2023 RCB- Virat Kohli: ‘‘చాలా మంది నా టీ20 క్రికెట్ గురించి ఏదేదో మాట్లాడారు. సరిగ్గా ఆడటం లేదని విమర్శించారు. కానీ నాకెప్పుడూ నా ఆట తీరుపై ఎలాంటి అసంతృప్తి లేదు. ప్రస్తుతం నేను టీ20లలో అత్యుత్తమంగా ఆడుతున్నాను. నా ఆటను పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. నేను టీ20 క్రికెట్ ఇలాగే ఆడతాను. గ్యాప్స్ మధ్య బౌండరీలు బాదుతూ.. పరిస్థితి నాకు అనుకూలంగా మారినపుడు మరింత స్వేచ్ఛగా భారీ షాట్లు ఆడుతూ ఉంటాను’’ అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి అన్నాడు. రికార్డులు బద్దలు ఐపీఎల్-2023లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో అజేయ శతకంతో మెరిసిన విషయం తెలిసిందే. తద్వారా ఈ ఎడిషన్‌లో వరుసగా రెండు సెంచరీలు బాది.. క్యాష్ రిచ్‌లీగ్‌లో ఓవరాల్‌గా ఏడు శతకాలతో రికార్డులు బద్దలు కొట్టాడు. మునుపటి కోహ్లిని గుర్తు చేస్తూ అద్భుత ఇన్నింగ్స్‌తో అభిమానులకు కావాల్సినంత వినోదం పంచాడు. అయితే, ఈ మ్యాచ్‌లో లక్ష్య ఛేదనలో గుజరాత్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఆఖరి వరకు అజేయంగా నిలిచి సెంచరీ చేసి జట్టును గెలిపించడంతో కోహ్లి ఇన్నింగ్స్ వృథాగా పోయింది. దీంతో ఆర్సీబీ ఈసారి ప్లే ఆఫ్స్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. వాళ్లకేం తెలుసు? ఇదిలా ఉంటే.. కోహ్లి తన ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత రవిశాస్త్రితో మాట్లాడుతూ తనను విమర్శిస్తున్న వాళ్లకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. ‘‘నాకు గొప్పగా అనిపిస్తోంది. టీ20 క్రికెట్‌ను పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. చాలా మంది స్ట్రైక్‌రేటు గురించి మాట్లాడుతూ ఉంటారు. గతంలో చెప్పాను.. ఇప్పుడు కూడా చెబుతున్నాను. పరిస్థితులకు తగ్గట్లు జట్టు అవసరాలను బట్టి బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. జట్టును గెలిపించడం కోసం ఆడటం గొప్పగా అనిపిస్తుంది. నేను మొదటి నుంచి ఇదే సూత్రాన్ని పాటిస్తున్నాను. నా బ్యాటింగ్ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నాను’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. ఓవరాల్‌గా ఎన్ని పరుగులంటే? కాగా ఈ మ్యాచ్‌లో రన్‌మెషీన్.. 61 బంతులు ఎదుర్కొని 101 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఇక గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కోహ్లి శతకం(100)తో మెరిసిన విషయం తెలిసిందే. గుజరాత్‌తో మ్యాచ్‌లో బాదిన సెంచరీ ఈ సీజన్లో కోహ్లికి రెండోది. ఇక ఐపీఎల్-2023లో కింగ్ కోహ్లి మొత్తంగా 639 పరుగులు సాధించి ప్రస్తుతం అత్యధిక పరుగుల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ స్కోర్లు: ►టాస్- గుజరాత్- బౌలింగ్ ►ఆర్సీబీ స్కోరు: 197/5 (20) ►గుజరాత్ స్కోరు: 198/4 (19.1) ►విజేత: ఆరు వికెట్ల తేడాతో గుజరాత్ గెలుపు.. టోర్నీ నుంచి ఆర్సీబీ అవుట్ ►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శుబ్‌మన్ గిల్ (52 బంతుల్లో 104 పరుగులు). చదవండి: #Shubman Gill: కాస్తైనా సిగ్గుండాలి! ఆమె మిమ్మల్ని ఏమీ అనలేదుగా? ఇంతలా దిగజారి.. -
కోహ్లికి సాటెవ్వరు.. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన మొనగాడిగా
ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ స్టార్.. కింగ్ కోహ్లి రెండో సెంచరీ నమోదు చేశాడు. ఆదివారం(మే 21) గుజరాత్ టైటాన్స్‌తో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో కోహ్లి ఈ ఫీట్ అందుకున్నాడు. 60 బంతుల్లో శతకం మార్క్ సాధించిన కోహ్లి ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. సీజన్లో కోహ్లికి ఇది రెండో సెంచరీ కాగా.. ఎస్ఆర్హెచ్తో జరిగిన గత మ్యాచ్‌లోనూ కోహ్లి సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. ఓవరాల్‌గా కోహ్లికి ఇది ఏడో సెంచరీ. ఈ సెంచరీతో కోహ్లి ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన మొనగాడిగా కోహ్లి నిలిచాడు. ఇప్పటివరకు ఆరు సెంచరీలతో గేల్‌తో సమానంగా ఉన్న కోహ్లి తాజాగా అతన్ని దాటి అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు. కోహ్లి, గేల్ తర్వాత జాస్ బట్లర్ ఆరు సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక ఐపీఎల్ 2023లో కోహ్లిది పదోదో శతకం. ఇంతకముందు హెన్రిచ్ క్లాసెన్ (104 పరుగులు), విరాట్ కోహ్లీ (100 పరుగులు), శుభమాన్ గిల్ (101 పరుగులు), ప్రబ్సిమ్రాన్ సింగ్ (103 పరుగులు) , సూర్యకుమార్ యాదవ్ (103* పరుగులు) , యశస్వి జైస్వాల్ (124 పరుగులు) , వెంకటేష్ అయ్యర్ (104 పరుగులు) , హ్యారీ బ్రూక్ (100* పరుగులు), కోహ్లి(101*)తో ఉన్నారు. ఇక టి20 క్రికెట్లో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్లలో కోహ్లి 8 సెంచరీలతో మైకెల్ కింగర్, డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్లతో కలిసి సంయుక్తంగా ఉన్నాడు. ఇక తొలి స్థానంలో క్రిస్ గేల్(22 సెంచరీలు) ఉండగా.. బాబర్ ఆజం 9 సెంచరీలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్లో ఒకే సీజన్లో వరుసగా రెండు సెంచరీలు బాదిన మూడో క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. ఇంతకముందు శిఖర్ ధావన్(2020లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున), జాస్ బట్లర్(రాజస్తాన్ రాయల్స్ తరపున 2022లో) వరుసగా రెండు సెంచరీలు బాదారు. Not just a player, he is an emotion 🙌🤩#KingKohli 👑 conquers his way to the most centuries in #TATAIPL history 🤯#RCBvGT #IPLonJioCinema #EveryGameMatters #IPL2023 | @RCBTweets @imVkohli pic.twitter.com/J2d4vnO0PX — JioCinema (@JioCinema) May 21, 2023 చదవండి: 'గతేడాది ఆర్సీబీకి సాయం చేశాం.. ఈసారి పరిస్థితి వేరు' -
అద్భుతం... స్పిన్ ఎలా ఆడాలో చూపిస్తున్నాడు.. మాస్టర్‌క్లాస్! ఎవరికీ సాధ్యం కాని రీతిలో
IPl 2023 SRH vs RCB- Heinrich Klaasen: హెన్రిచ్ క్లాసెన్.. ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టాప్ స్కోరర్. మిగతా బ్యాటర్లంతా విఫలమైన వేళ నేనున్నానంటూ జట్టును ఆదుకునే క్లాస్ ప్లేయర్. ఈ సీజన్లో ఈ మిడిలార్డర్ ఇప్పటి వరకు చేసిన మొత్తం పరుగులు 430. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగి ఈ మేరకు స్కోరు సాధించాడు. మ్యాచ్ ఓడినా మనసులు గెలిచాడు అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు ఈ ప్రొటిస్ బ్యాటర్. ఇక ఆర్సీబీతో గురువారం నాటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ ఓడినప్పటికీ క్లాసెన్ తన అద్భుత సెంచరీతో అభిమానుల మనసు గెలిచాడు. ఈ మ్యాచ్‌లో 51 బంతులు ఎదుర్కొన్న క్లాసెన్.. 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 104 పరుగులు రాబట్టాడు. ఈ నేపథ్యంలో జట్టు మెరుగైన స్కోరు సాధించేలా ఒంటరి పోరాటం చేయడం అలవాటు చేసుకున్న అతడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా సైతం క్లాసెన్ అద్భుత బ్యాటింగ్ ఫిదా అయ్యానంటూ కితాబులిచ్చాడు. ఏ విదేశీ ప్లేయర్‌కు సాధ్యం కాని రీతిలో ‘‘క్లాసెన్ బ్యాటింగ్ అద్భుతం. ముఖ్యంగా స్పిన్నర్లను ఎదుర్కొన్న తీరు అమోఘం. ఏ విదేశీ ప్లేయర్ కూడా తనలా ఇండియన్ పిచ్‌లపై స్పిన్నర్లను అటాక్ చేయడం నేను చూడలేదు. విదేశీ ఆటగాళ్లనే కాదు ఈ టోర్నీలో ఆడుతున్న ప్రతి ఒక్క బ్యాటర్‌కు కూడా స్పిన్ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోవాలో తన మాస్టర్‌క్లాస్‌తో నిరూపించాడు. గత మూడు మ్యాచ్‌లలో అతడి బ్యాటింగ్ ఎంత అద్భుతంగా సాగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పరిస్థితులకు తగ్గట్లుగా ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో ఒక్కరు కూడా క్లాసెన్లా విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడలేకపోయారు. అతడు క్రీజులో నిలదొక్కుకుంటే చాలు.. పరిస్థితులకు అనుగుణంగా జాగ్రత్తగా ఆడుతూనే దూకుడు కూడా ప్రదర్శిస్తాడు’’ అంటూ ఆకాశ్ చోప్రా.. హెన్రిచ్ క్లాసెన్ క్లాస్ ఇన్నింగ్స్‌ను కొనియాడాడు. కాగా ఐపీఎల్-2023లో సన్‌రైజర్స్ తరఫున నిలకడైన ఆట తీరు కనబరుస్తున్న ఏకైక ఆటగాడు అంటే క్లాసెన్ ఒక్కడే! ఇక ఆర్సీబీతో మ్యాచ్ సందర్భంగా క్యాష్ రిచ్ లీగ్‌లో తొలి సెంచరీ సాధించి శతక లోటు కూడా తీర్చేసుకున్నాడు ఈ వికెట్ కీపర్ బ్యాటర్. చదవండి: అవన్నీ చెత్త మాటలు.. నేను అస్సలు పట్టించుకోను! గర్వంగా ఉంది: కోహ్లి కోహ్లి భారీ సిక్సర్.. పాపం నితీశ్‌రెడ్డి! డుప్లెసిస్ రియాక్షన్ వైరల్ Klaasen mowa khundal khundal ke maarre 💯 Heroic Heinrich shines bright in Hyderabad with his maiden #TATAIPL ton ⚡️🔥#SRHvRCB #IPL2023 #IPLonJioCinema #EveryGameMatters | @SunRisers pic.twitter.com/s54WE0x5FR — JioCinema (@JioCinema) May 18, 2023 -
అవన్నీ చెత్త మాటలు.. నేను అస్సలు పట్టించుకోను! గర్వంగా ఉంది: కోహ్లి
IPL 2023 SRH Vs RCB- Virat Kohli: ఐపీఎల్-2023లో ప్లేఆఫ్స్‌కు అడుగు దూరంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. గురువారం ఉప్పల్ వేదికగా ఎస్ఆర్హెచ్తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన ఆర్సీబీ.. పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. కాగా ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ స్టార్ ఓపెనర్ కోహ్లి అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. కీలక మ్యాచ్‌లో కింగ్ కోహ్లి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆరో సెంచరీ ఈ మ్యాచ్‌లో 63 బంతులు ఎదుర్కొన్న విరాట్ 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 100 పరుగులు సాధించాడు. అదే విధంగా కెప్టెన్ డుప్లెసిస్‌తో కలిసి తొలి వికెట్‌కు 172 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. కాగా ఐపీఎల్లో విరాట్‌కు ఇది 6వ ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం. కాగా ఈ ఏడాది సీజన్లో కోహ్లి అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ అతడి స్ట్రైక్ రేట్ మాత్రం తక్కువగా ఉందని పలువరు విమర్శించిన సంగతి తెలిసిందే. తన స్ట్రైక్ రేట్ గురించి వస్తున్న విమర్శలపై కోహ్లి స్పందించాడు. చెత్త మాటలు పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో విరాట్ మాట్లాడుతూ.. "నేను ఎప్పుడూ నా గత మ్యాచ్‌ల్లో ఎలా ఆడానన్న విషయం గురించి ఆలోచించను. ప్రస్తుతం ఏ మ్యాచ్‌లో అయితే ఆడుతున్నానో దాని గురించే ఆలోచిస్తా. కొన్ని సార్లు మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడినప్పటకీ నేను సంతృప్తి చెందను. ఆ విషయం నాకు తెలుసు. అంతే తప్ప బయటనుంచి నా స్ట్రైక్ రేట్ గురించి ఎవరూ ఏమి మాట్లాడిన నేను పట్టించుకోను. ఎందుకంటే అది వారి అభిప్రాయం. అవన్నీ చెత్త మాటలు.. పట్టించుకుంటే ముందుకు వెళ్లలేము. అటువంటి వారు నా పరిస్థితుల్లో ఉంటే తెలుస్తుంది. నేను ఎప్పుడూ జట్టును గెలిపించడానికే ఆడుతాను. పరిస్థితులకు అనుగుణంగా ఆడటం నాకు అలవాటు. అలా చేస్తున్నందకు నాకు గర్వంగా ఉంది" అని చెప్పుకొచ్చాడు. చదవండి: IPL 2023: సెంచరీలతో చెలరేగిన కోహ్లి, క్లాసెన్.. ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలి సారి What is the secret of the highly successful Virat-Faf pair?🤔 We will let King Kohli spill the beans 😉#TATAIPL | #SRHvRCB | @RCBTweets | @imVkohli | @faf1307 pic.twitter.com/BEKGcALbZK — IndianPremierLeague (@IPL) May 18, 2023 -
Virat Kohli: గేల్ రికార్డు సమం.. చరిత్రకెక్కడానికి ఇంకొక్కటి!
ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో జూలు విదిల్చింది. కోహ్లి సెంచరీతో విధ్వంసం సృష్టించడంతో ఆర్సీబీ సునాయాస విజయాన్ని ఖాతాలో వేసుకోవడమే గాక మెరుగైన రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఆర్సీబీ తమ చివరి మ్యాచ్‌లో గెలిస్తే ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్లేఆఫ్‌లో అడుగుపెడుతుంది. ఇక మ్యాచ్‌లో శతకం సాధించిన కోహ్లి ఒక అరుదైన రికార్డును అందుకున్నాడు. ఐపీఎల్లో అత్యధిక సెంచరీల రికార్డు క్రిస్ గేల్ పేరిట ఉంది. గేల్ ఐపీఎల్లో ఆరు శతకాలు సాధించాడు. తాజాగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో కోహ్లి ఐపీఎల్లో ఆరో సెంచరీ సాధించి గేల్ రికార్డును సమం చేశాడు. కోహ్లి, గేల్ తర్వాత జాస్ బట్లర్ ఐదు శతకాలతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక కోహ్లి మరొక సెంచరీ సాధిస్తే ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్‌గా చరిత్రకెక్కనున్నాడు. ఇక ఐపీఎల్లో ఒక మ్యాచ్‌లో రెండు శతకాలు నమోదు కావడం ఇది మూడోసారి. ఇంతకముందు 2016లో గుజరాత్ లయన్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు కోహ్లి, డివిలియర్స్‌లు శతకాలు బాదారు. 2019లో డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో జంట ఆర్సీబీపై సెంచరీలతో చెలరేగగా.. తాజాగా ఐపీఎల్ 16వ సీజన్లో గురువారం ఎస్ఆర్హెచ్,ఆర్సీబీ మ్యాచ్‌లో.. మొదట క్లాసెన్ ఆర్సీబీపై .. అటుపై కోహ్లి ఎస్ఆర్హెచ్పై సెంచరీతో చెలరేగాడు. 💯 Bow down to the greatness of 👑 #ViratKohli 👏 He is now tied with Chris Gayle for the most #TATAIPL hundreds 🔥#SRHvRCB #IPLonJioCinema #IPL2023 #EveryGameMatters pic.twitter.com/OGxWztuhk6 — JioCinema (@JioCinema) May 18, 2023 చదవండి: ఉప్పల్‌లో మ్యాచ్ అంటే చెలరేగుతాడు.. కోహ్లి అరుదైన రికార్డు -
ఆర్సీబీ కెప్టెన్‌కు సెంచరీ యోగ్యం లేదా!
ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్నాడు. ఐపీఎల్ 2022లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో డుప్లెసిస్ 96 పరుగుల అసాధారణ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. 50 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన దశలో జాగ్రత్తగా ఆడిన డుప్లెసిస్ 64 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 96 పరుగులు సాధించాడు. ఐపీఎల్లో ఇంతవరకు సెంచరీ లేని డుప్లెసిస్ ఈసారి ఎలాగైనా ఆ ఫీట్ సాధిస్తాడని అనుకునేలోపే సెంచరీకి నాలుగు పరుగుల దూరంలో హోల్డర్ బౌలింగ్‌లో స్టోయినిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. కాగా డుప్లెసిస్ ఐపీఎల్లో 96 పరుగుల వద్ద ఔట్ కావడం ఇది రెండోసారి. ఇంతకముందు సీఎస్కే తరపున 2019లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లోనూ 96 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇక 2021 సీజన్లో కేకేఆర్‌తో మ్యాచ్‌లో సీఎస్కే తరపున ఆడిన డుప్లెసిస్ 95 పరుగులు నాటౌట్ గా నిలిచి సెంచరీ మార్క్‌ను అందుకోలేకపోయాడు. ఇదే సీజన్లో పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లో 88 పరుగులు చేసి ఔటయ్యాడు. మొత్తానికి చాలా ఏళ్ల నుంచి ఐపీఎల్ ఆడుతున్నప్పటికి డుప్లెసిస్‌కు సెంచరీ కల అలాగే మిగిలిపోయింది. నాలుగుసార్లు సెంచరీ అవకాశం వచ్చినప్పటికి.. మూడుసార్లు ఔట్.. ఒకసారి నాటౌట్‌గా మిగిలి సెంచరీని అందుకోలేకపోయాడు. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్..''డుప్లెసిస్‌కు సెంచరీ చేసే యోగ్యం ఇప్పట్లో లేనట్లేనా'' అంటూ కామెంట్ చేశారు. డుప్లెసిస్ మెరుపు ఇన్నింగ్స్ కోసం క్లిక్ చేయండి చదవండి: Virat Kohli: అదే నిర్లక్ష్యం.. కోహ్లి ఖాతాలో అనవసర రికార్డు CLASS KNOCK! 🙌🏻 Well played, @faf1307! 👏🏻👏🏻#PlayBold #WeAreChallengers #IPL2022 #Mission2022 #RCB #ನಮ್ಮRCB #LSGvRCB pic.twitter.com/29kwOnhPb9 — Royal Challengers Bangalore (@RCBTweets) April 19, 2022 -
జోష్ బట్లర్ తుపాన్ ఇన్నింగ్స్.. 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో..!
ఐపీఎల్-2022లో తొలి సెంచరీ నమోదైంది. ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్ జోష్ బట్లర్ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. దీంతో తన ఐపీఎల్ కెరీర్లో బట్లర్ రెండో సెంచరీను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో 68 బంతుత్లో 100 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. రాజస్తాన్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే జోష్ బట్లర్ సిక్స్‌లు, ఫోర్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రాజస్తాన్ ఇన్నింగ్స్ 4 ఓవర్ వేసిన బసిల్ థంపీ బౌలింగ్‌లో.. 3 సిక్స్‌లు, 2 ఫోర్లతో బట్లర్ ఏకంగా 25 పరుగులు రాబట్టాడు. అఖరికి 100 పరుగుల చేసిన బట్లర్ బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డయ్యాడు. బట్లర్ సునామీ ఇన్నింగ్స్ ఫలితంగా రాజస్తాన్ నిర్ణీత 20 ఓవరల్లో 8 వికెట్ల నష్టానికి 193 పరుగుల భారీ స్కోర్ సాధించింది. బట్లర్‌తో పాటు కెప్టెన్ శాంసన్(30), హెట్‌మైర్(35) పరుగులతో రాణించారు. ముంబై ఇండియన్స్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా,మిల్స్ చెరో మూడు వికెట్లు పడగొట్టగా, పొలార్డ్ ఒక వికెట్ సాధించాడు. చదవండి: IPL 2022- 1st Week: తొలివారంలో అట్టర్ ఫ్లాప్ అయిన 11 మంది ఆటగాళ్లు వీరే! చదవండి: జోష్ బట్లర్ ఇన్నింగ్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
రిషభ్ సూపర్బ్.. గంభీర్‌పై సెటైర్లు
సాక్షి, న్యూఢిల్లీ: రికార్డుల మోత మోగించిన ఢిల్లీ డేర్ డెవిల్స్ బ్యాట్స్‌మన్ రిషభ్ పంత్‌పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. క్రికెటర్లు, సహచర ఆటగాళ్లు, మాజీ క్రికెటర్లు, ప్రముఖులు అతడిని పొగడ్తల్లో ముంచెత్తున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో గురువారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో రిషభ్ ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీ బాదాడు. అతడి ఇన్నింగ్స్ సూపర్బ్, అన్బిలీవబుల్ అంటూ అందరూ మెచ్చుకుంటున్నారు. పొట్టి ఫార్మాట్లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌లో ఇది కూడా ఒకటని పేర్కొంటున్నారు. రిషభ్ ‘సౌ’రభాన్ని వర్ణించడానికి మాటలు చాలడం లేదని ప్రశంసిస్తున్నారు. బీసీసీఐ తాజాగా ప్రకటించిన జాతీయ జట్టులో రిషభ్‌కు స్థానం కల్పించివుంటే బాగుండేదని అభిమానులు అంటున్నారు. భవిష్యత్తులో అతడు కచ్చితంగా మళ్లీ టీమిండియాకు ఆడతాడన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టుకు భారంగా మారిన గౌతమ్ గంభీర్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. Really special innings from Rishabh. Those were not bad balls from Bhuvi in the last over barring the last full toss, but Rishabh Pant is really special and I hope he is nurtured well. #DDvSRH — Virender Sehwag (@virendersehwag) 10 May 2018 Can't believe what I just saw! Still remember the 97 he scored against GL last year. Unbelievable hitting from @RishabPant777. Great going my boy. Keep it up. #DDvSRH #IPL2018 pic.twitter.com/AK3mpC29Bx — Suresh Raina (@ImRaina) May 10, 2018 Unbelievable innings from @RishabPant777 tonight! Continues to play with amazing skill and power. Unfortunately Hyderabad were too good for us tonight. Hopefully finish the season with 3 good wins for our amazing home fans. — Glenn Maxwell (@Gmaxi_32) 10 May 2018 What an amazing innings from such a talent @RishabPant777 absolutely on fire!!!! — Mike Hussey (@mhussey393) May 10, 2018 Superb! An outstanding 💯 from @RishabPant777 @DelhiDaredevils. The knock is a special one as it came against a quality bowling side of @SunRisers @IPL #DDvSRH #DELHI https://t.co/gW3nH4V9i9 — Anjum Chopra (@chopraanjum) 10 May 2018 Gambhir after watching Rishab pant's batting. pic.twitter.com/xH31P5N3Xy — Mask ishan (@Mr_LoLwa) May 10, 2018 -
రెండు సెంచరీలు... ప్చ్!
మొహాలీ: అతడు రెండుసార్లు సెంచరీ కొట్టినా జట్టు విజయం సాధించలేదు. తన శైలికి భిన్నంగా దూకుడుగా ఆడి శతకాలు బాదినా గెలుపు మాత్రం దక్కలేదు. ఐపీఎల్-10లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఆటగాడు హషిమ్ ఆమ్లా సెంచరీలు చేసిన రెండు సందర్భాల్లోనూ జట్టు పరాజయం పాలైంది. గుజరాత్ లయన్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆమ్లా అద్భుతంగా ఆడి (60 బంతుల్లో 104; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీ సాధించాడు. అయితే చెత్త ఫీల్డింగ్‌తో పంజాబ్ ఈ మ్యాచ్‌లో ఓడిపోయింది. ఆమ్లా శతకం వృధా అయింది. అంతకుముందు ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ ఆమ్లా శతకం బాదాడు. 8 ఫోర్లు, 12 సిక్సర్లతో 104 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో ముంబై టీమ్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో ఆమ్లా శ్రమ ఫలించలేదు. తన శైలికి భిన్నంగా బ్యాటింగ్ చేయడం ఆనందంగా ఉందని ఆమ్లా తెలిపాడు. ప్రతి ఒక్కరికి తమదైన శైలి ఉంటుందని, తాను మంచి షాట్లు కొట్టానని చెప్పాడు. తమ జట్టు ప్లేఆఫ్ కు చేరుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. స్వదేశానికి పయనమవుతున్న ఆమ్లా మిగతా మూడు ఐపీఎల్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడు. ఈ సీజన్లో అతడు 10 మ్యాచులు ఆడి 420 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, రెండు అర్ధసెంచరీలు ఉన్నాయి.