విరాట్ కోహ్లి (PC: IPL)
IPL 2023 RCB- Virat Kohli: ‘‘చాలా మంది నా టీ20 క్రికెట్ గురించి ఏదేదో మాట్లాడారు. సరిగ్గా ఆడటం లేదని విమర్శించారు. కానీ నాకెప్పుడూ నా ఆట తీరుపై ఎలాంటి అసంతృప్తి లేదు. ప్రస్తుతం నేను టీ20లలో అత్యుత్తమంగా ఆడుతున్నాను. నా ఆటను పూర్తిగా ఆస్వాదిస్తున్నాను.
నేను టీ20 క్రికెట్ ఇలాగే ఆడతాను. గ్యాప్స్ మధ్య బౌండరీలు బాదుతూ.. పరిస్థితి నాకు అనుకూలంగా మారినపుడు మరింత స్వేచ్ఛగా భారీ షాట్లు ఆడుతూ ఉంటాను’’ అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి అన్నాడు.
రికార్డులు బద్దలు
ఐపీఎల్-2023లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో అజేయ శతకంతో మెరిసిన విషయం తెలిసిందే. తద్వారా ఈ ఎడిషన్‌లో వరుసగా రెండు సెంచరీలు బాది.. క్యాష్ రిచ్‌లీగ్‌లో ఓవరాల్‌గా ఏడు శతకాలతో రికార్డులు బద్దలు కొట్టాడు. మునుపటి కోహ్లిని గుర్తు చేస్తూ అద్భుత ఇన్నింగ్స్‌తో అభిమానులకు కావాల్సినంత వినోదం పంచాడు.
అయితే, ఈ మ్యాచ్‌లో లక్ష్య ఛేదనలో గుజరాత్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ ఆఖరి వరకు అజేయంగా నిలిచి సెంచరీ చేసి జట్టును గెలిపించడంతో కోహ్లి ఇన్నింగ్స్ వృథాగా పోయింది. దీంతో ఆర్సీబీ ఈసారి ప్లే ఆఫ్స్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది.
వాళ్లకేం తెలుసు?
ఇదిలా ఉంటే.. కోహ్లి తన ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత రవిశాస్త్రితో మాట్లాడుతూ తనను విమర్శిస్తున్న వాళ్లకు గట్టి కౌంటర్ ఇచ్చాడు. ‘‘నాకు గొప్పగా అనిపిస్తోంది. టీ20 క్రికెట్‌ను పూర్తిగా ఆస్వాదిస్తున్నాను. చాలా మంది స్ట్రైక్‌రేటు గురించి మాట్లాడుతూ ఉంటారు.
గతంలో చెప్పాను.. ఇప్పుడు కూడా చెబుతున్నాను. పరిస్థితులకు తగ్గట్లు జట్టు అవసరాలను బట్టి బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. జట్టును గెలిపించడం కోసం ఆడటం గొప్పగా అనిపిస్తుంది. నేను మొదటి నుంచి ఇదే సూత్రాన్ని పాటిస్తున్నాను. నా బ్యాటింగ్ పట్ల పూర్తి సంతృప్తిగా ఉన్నాను’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు.
ఓవరాల్‌గా ఎన్ని పరుగులంటే?
కాగా ఈ మ్యాచ్‌లో రన్‌మెషీన్.. 61 బంతులు ఎదుర్కొని 101 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఇక గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కోహ్లి శతకం(100)తో మెరిసిన విషయం తెలిసిందే. గుజరాత్‌తో మ్యాచ్‌లో బాదిన సెంచరీ ఈ సీజన్‌లో కోహ్లికి రెండోది. ఇక ఐపీఎల్-2023లో కింగ్ కోహ్లి మొత్తంగా 639 పరుగులు సాధించి ప్రస్తుతం అత్యధిక పరుగుల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు.
ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్ స్కోర్లు:
►టాస్- గుజరాత్- బౌలింగ్
►ఆర్సీబీ స్కోరు: 197/5 (20)
►గుజరాత్ స్కోరు: 198/4 (19.1)
►విజేత: ఆరు వికెట్ల తేడాతో గుజరాత్ గెలుపు.. టోర్నీ నుంచి ఆర్సీబీ అవుట్
►ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శుబ్‌మన్ గిల్ (52 బంతుల్లో 104 పరుగులు).
చదవండి: #Shubman Gill: కాస్తైనా సిగ్గుండాలి! ఆమె మిమ్మల్ని ఏమీ అనలేదుగా? ఇంతలా దిగజారి..
Comments
Please login to add a commentAdd a comment