
ఐపీఎల్-2024లో తొలి సెంచరీ నమోదైంది. ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ విరాట్ కోహ్లి అద్బుతమైన సెంచరీతో చెలరేగాడు. ఓపెనర్‌గా వచ్చిన విరాట్ రాజస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.
కేవలం 67 బంతుల్లో విరాట్ తన సెంచరీని మార్క్‌ను అందుకున్నాడు. ఇది విరాట్‌కు 8వ ఐపీఎల్ సెంచరీ. తన ట్రేడ్ మార్క్ షాట్లతో రన్‌మిషన్ అభిమానులను అలరించాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో 72 బంతులు ఎదుర్కొన్న కింగ్ కోహ్లి.. 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 113 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. ఈ ఏడాది సీజన్ తమ తొలి మ్యాచ్ నుంచే కోహ్లి తన అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నాడు.
ఇప్పటివరరకు ఈ ఏడాది సీజన్‌లో 5 మ్యాచ్‌లు ఆడిన కింగ్.. 316 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా కొనసాగతున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఆర్సీబీ కోహ్లితో పాటు కెప్టెన్ ఫాప్ డుప్లెసిస్(44) పరుగులతో రాణించాడు. రాజస్తాన్ బౌలర్లలో యజువేంద్ర చాహల్ రెండు వికెట్లు పడగొట్టగా.. బర్గర్ ఒక్క వికెట్ సాధించాడు.
It's official: Kohli is the real Gotham's Batman 🦇 #RRvsRCB #KingKohli pic.twitter.com/hTY3Feg2nL
— Satan (@Scentofawoman10) April 6, 2024