సూర్యకుమార్ యాదవ్ (PC: IPL)
IPL 2023- Suryakumar Yadav: ముంబై ఇండియన్స్ బ్యాటర్, టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్‌పై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల జల్లు కురిపించాడు. వాంఖడే స్టేడియంలో మాస్టర్‌క్లాస్ టీ20 సెంచరీ తనకు కనులవిందు చేసిందని పేర్కొన్నాడు. అద్భుత ఇన్నింగ్స్ చూసిన ఆ సమయంలో ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యానని తెలిపాడు.
కాగా ఐపీఎల్-2023 ఆరంభంలో సూర్యకుమార్ యాదవ్ స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడ్డాడు. అయితే, ఆ తర్వాత బ్యాట్ ఝులిపించిన సూర్య కీలక మ్యాచ్‌లలో ముంబై ఇండియన్స్‌కు విజయాలు అందించాడు.
తొలి సెంచరీ
ఇక లీగ్ దశలో మే 12న వాంఖడే స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సూర్య ఆడిన ఇన్నింగ్స్ అన్నింటిలోకి హైలైట్‌గా నిలిచింది. 49 బంతుల్లో 103 పరుగులతో అజేయంగా నిలిచిన మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్.. ఐపీఎల్‌లో తన తొలి సెంచరీ నమోదు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 6 సిక్సర్లు ఉండటం విశేషం.
ఈ మ్యాచ్‌లో ముంబై 27 పరుగుల తేడాతో గుజరాత్‌పై గెలుపొందగా.. సూర్య ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. నాటి జ్ఞాపకాలను తాజాగా గుర్తు చేసుకున్నాడు కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్.
టీ20 మాస్టర్‌క్లాస్ చూశాను
ఈఎస్‌పీఎన్‌క్రిక్‌ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘వాంఖడే మైదానంలో నా కళ్ల ముందు సూర్యకుమార్ బాదిన ఆ సెంచరీ అద్భుతం. టీ20 మాస్టర్‌క్లాస్ చూశాను. టీ20 భవిష్యత్ ఆశాకిరణం కనిపించింది. ఆరోజు సూర్య ఇన్నింగ్స్ అమోఘం. అసలు ఇది నిజంగా జరిగిందా లేదా అనే సందేహంలో ఉండిపోయా. ఆశ్చర్యంతో అలా చూస్తుండిపోయా’’ అంటూ మంజ్రేకర్.. సూర్యను ఆకాశానికెత్తాడు.
కాగా ఐపీఎల్-2023లో ప్లే ఆఫ్స్ చేరిన ముంబై ఇండియన్స్.. క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది. తద్వారా టోర్నీ నుంచి రిక్తహస్తాలతో నిష్క్రమించింది. ఇక రిజర్వ్‌డే (మే 29) నాటి ఫైనల్లో గుజరాత్‌ను ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి చాంపియన్‌గా అవతరించింది.
అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా ముంబై ఇండియన్స్ పేరిట ఉన్న రికార్డును సమం చేసింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023 సీజన్లో సూర్య 16 ఇన్నింగ్స్‌లలో కలిపి 605 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు అర్థ శతకాలు , ఒక సెంచరీ ఉంది. అత్యధిక స్కోరు 103 నాటౌట్.
చదవండి: SL Vs AFG: లంకతో వన్డే సిరీస్.. అఫ్గనిస్తాన్‌కు ఊహించని షాక్!
ఆనందంలో సీఎస్‌కే ఆల్‌రౌండర్.. సర్ జడేజాకు థాంక్స్! పోస్ట్ వైరల్
A 💯 that wowed teammates, fans and opponents alike 🤩
— JioCinema (@JioCinema) May 12, 2023
Take a bow #SuryakumarYadav 👏#MIvGT #IPLonJioCinema | @surya_14kumar pic.twitter.com/kwUuMfTGKz
Comments
Please login to add a commentAdd a comment