sanjay manjrekar
-
టీమిండియా ‘బిగ్ స్టార్’గా ఎదుగుతాడు.. అతడి స్థానానికి ఎసరు!
టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా(Harshit Rana)పై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్(Sanjay Manjrekar) ప్రశంసలు కురిపించాడు. రానున్న కాలంలో భారత బౌలింగ్ దళంలో ‘బిగ్ స్టార్’గా ఎదుగుతాడని అభిప్రాయపడ్డాడు. ఇటీవలి కాలంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో హర్షిత్ అద్భుత ప్రదర్శనే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నాడు.కాగా ఆస్ట్రేలియాతో బోర్డర్- గావస్కర్ ట్రోఫీ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన హర్షిత్.. స్వదేశంలో ఇంగ్లండ్(India vs England)తో పరిమిత ఓవర్ల క్రికెట్లోనూ అరంగేట్రం చేశాడు. తొలుత టీ20లలో ఎంట్రీ ఇచ్చిన ఈ ఢిల్లీ పేసర్.. అనంతరం వన్డేల్లోనూ చోటు దక్కించుకున్నాడు.బుమ్రా స్థానంలో ఐసీసీ టోర్నీకిఇంగ్లండ్తో ఆడిన టీ20 మ్యాచ్‌లో మూడు వికెట్లతో మెరిసిన రైటార్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్.. మూడు వన్డేల్లో కలిపి ఆరు వికెట్లు కూల్చాడు. తద్వారా ఈ రెండు సిరీస్‌లలో టీమిండియా గెలవడంలో తాను భాగమయ్యాడు. ఈ క్రమంలోనే ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 జట్టులో జస్ప్రీత్ బుమ్రా స్థానాన్ని బీసీసీఐ హర్షిత్ రాణాతో భర్తీ చేసింది.ఈ నేపథ్యంలో కామెంటేటర్, భారత మాజీ బ్యాటర్ సంజయ్ మంజ్రేకర్ హర్షిత్ రాణా ఆట తీరును కొనియాడాడు. రాణా రాకతో అర్ష్‌దీప్ సింగ్‌కు గట్టి పోటీ తప్పదని అభిప్రాయపడ్డాడు. ‘‘ఇటీవలి కాలంలో హర్షిత్ రాణా పరిమిత ఓవర్ల క్రికెట్లో రాణించిన తీరు ఆకట్టుకునే విధంగా ఉంది.టీమిండియా ‘బిగ్ స్టార్’గా ఎదుగుతాడుతన ప్రదర్శనతో అతడు జట్టు విజయాలపై ప్రభావం చూపగలిగాడు. అతడి ఆటిట్యూడ్ కూడా ముచ్చటగొలిపేలా ఉంది. సమీప భవిష్యత్తులోనే అతడు టీమిండియా బౌలింగ్ బిగ్ స్టార్‌గా అవతరించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.ఆట పట్ల అతడి అంకితభావం, ఆలోచనా ధోరణి నాకెంతో నచ్చింది. ఏదేమైనా చాంపియన్స్ ట్రోఫీ తుదిజట్టులో సీనియర్‌గా అర్ష్‌దీప్ సింగ్‌కే ప్రాధాన్యం దక్కుతుంది. అయితే, దీర్ఘ కాలంలో రాణా వల్ల అర్ష్‌దీప్‌నకు కష్టాలు తప్పవు. సెకండ్ సీమర్‌గా అతడికి హర్షిత్ నుంచి పోటీ ఎదురవుతుంది.సిరాజ్ రీ ఎంట్రీ కష్టమే!కచ్చితంగా హర్షిత్ రాణా అర్ష్‌కు గట్టిపోటీగా మారతాడు. అతడి వల్ల ఇప్పటికే సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్‌కు పరిమిత ఓవర్ల క్రికెట్లో పునరాగమనం చేయడం కష్టంగా మారింది’’ అని సంజయ్ మంజ్రేకర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో పేర్కొన్నాడు. కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్-2024లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున బరిలోకి దిగాడు హర్షిత్ రాణా.గత ఎడిషన్‌లో మొత్తంగా పదమూడు మ్యాచ్‌లు ఆడి 19 వికెట్లతో మెరిసిన ఈ ఢిల్లీ బౌలర్.. కోల్‌కతాను చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక నాడు కోల్‌కతా జట్టు మెంటార్‌గా ఉన్న గౌతం గంభీర్ టీమిండియా హెడ్‌కోచ్ కావడంతో హర్షిత్‌కు టీమిండియా ఎంట్రీ కాస్త సులువుగానే దక్కింది.చదవండి: Champions Trophy: ప్రైజ్ మనీ ప్రకటించిన ఐసీసీ.. వామ్మో ఇన్ని కోట్లా? -
'శుబ్‌మన్ గిల్ కూడా అలాంటివాడే.. అతడికి తిరుగు లేదు'
నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లండ్(England)తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. 249 పరుగుల లక్ష్య చేధనలో గిల్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో మూడో స్ధానంలో బ్యాటింగ్ వచ్చిన గిల్ తొలుత ఆచితూచి ఆడాడు. ఆ తర్వాత ఇంగ్లండ్ బౌలర్లను ఊతికారేశాడు. శ్రేయస్ అయ్యర్‌తో కలిసి భారత స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. 96 బంతుల్లో 87 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో శుబ్‌మన్ గిల్‌పై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల వర్షం కురిపించాడు. గిల్ ఒక అద్బుతమైన ఆటగాడని, చాలా కాలం పాటు భారత క్రికెట్ జట్టులో కొనసాగుతాడని మంజ్రేకర్ కొనియాడాడు."భారత క్రికెట్లో ఎక్కువ కాలం కొనసాగగల క్రికెటర్లకు మేము ఓ పదాన్ని ఉపయోగిస్తాం. ‘లంబీ రేస్ కా ఘోడా’(సుదీర్ఘ దూరం పరిగెత్తగల గుర్రం). శుబ్‌మన్ గిల్ కూడా అలాంటివాడే! అంటూ ఎక్స్‌లో మంజ్రేకర్ రాసుకొచ్చాడు.ఓపెనింగ్ స్లాట్ త్యాగం..కాగా ఈ మ్యాచ్‌లో అరంగేట్ర ఆటగాడు యశస్వి జైశ్వాల్ కోసం గిల్ తన ఓపెనింగ్ స్ధానాన్ని త్యాగం చేశాడు. విరాట్ కోహ్లి జట్టులో లేకపోవడంతో మూడో స్ధానంలో గిల్ బ్యాటింగ్‌కు వచ్చాడు. తన బ్యాటింగ్ పొజిషేన్ అది కానప్పటికి గిల్ మాత్రం ప్రశాంతంగా ఉండి క్రీజులో ఇన్నింగ్స్‌ను ముందుకు నడ్పించాడు. శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్‌తో కలిసి విలువైన భాగస్వామ్యాలను నెలకొల్పాడు. ఒకవేళ రెండో వన్డేకు విరాట్ కోహ్లి అందుబాటులోకి వస్తే.. గిల్ మళ్లీ ఓపెనర్‌గానే బరిలోకి దిగే ఛాన్స్ ఉంది.ఇక ఈ మ్యాచ్ అనంతరం తన ఇన్నింగ్స్‌పై గిల్ స్పందించాడు. "వైస్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాక నాపై ఎటువంటి ఒత్తిడి లేదు. నా బ్యాటింగ్‌లో కూడా ఎటువంటి మార్పు రాదు. కానీ మైదానంలో నా ఆలోచనలను రోహిత్ భాయ్‌కు షేర్ చేస్తాను. అదే విధంగా రోహిత్ ప్రణాళకలను కూడా నేను అడిగి తెలుసుకుంటాను.నా వ్యూహాలను కూడా అతడితో పంచుకుంటున్నాను. మ్యాచ్ గురించి ఏదైనా సలహా ఇవ్వాలనకుంటే, సంకోచించకుండా తనతో చెప్పమని రోహిత్ నాతో అన్నాడని" పోస్ట్ మ్యాచ్ ప్రెజేంటేషన్‌లో గిల్ పేర్కొన్నాడు.చదవండి: IND vs ENG: కింగ్ వచ్చేస్తున్నాడు.. పాపం అతడు! ఒక్క మ్యాచ్‌కే వేటు -
అప్పట్లో ఒకడుండేవాడు.. ఇప్పుడు తిలక్ వర్మ!: మాజీ క్రికెటర్
టీమిండియా యువ సంచలనం తిలక్ వర్మ(Tilak Varma) ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న ఈ తెలుగు తేజం.. ఇప్పటికే రెండు శతకాలు సాధించాడు. కష్టతరమైన సౌతాఫ్రికా పిచ్‌లపై వరుస సెంచరీలతో చెలరేగిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. తాజాగా ఇంగ్లండ్‌తో సిరీస్(India vs England)లోనూ అదరగొడుతున్నాడు.స్వదేశంలో ఇంగ్లిష్ జట్టుతో కోల్‌కతాలో జరిగిన తొలి టీ20లో 19 పరుగులతో అజేయంగా నిలిచిన తిలక్ వర్మ.. ఫోర్ బాది జట్టు విజయాన్ని ఖరారు చేశాడు. ఇక చెన్నైలో జరిగిన రెండో టీ20లో ధనాధన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. మిగతా బ్యాటర్లంతా విఫలమైన చోట.. తాను మాత్రం బ్యాట్ ఝులిపించాడు.సూపర్ ఫినిషింగ్ టచ్ఆఖరి ఓవర్ వరకు ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో ఫోర్ బాది జట్టును గెలుపు తీరాలకు చేర్చాడు. మొత్తంగా 55 బంతులు ఎదుర్కొని 72 పరుగులతో అజేయంగా నిలిచిన తిలక్ వర్మ ఇన్నింగ్స్‌లో.. నాలుగు ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉండటం విశేషం. ఈ రెండు సందర్బాల్లోనూ 22 ఏళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్ తనదైన శైలిలో ఫినిషింగ్ టచ్ ఇచ్చి టీమిండియాను గెలిపించడం విశేషం.ఈ నేపథ్యంలో తిలక్ వర్మపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇక భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తిలక్‌ను ఏకంగా మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni)తో పోలుస్తూ ఆకాశానికెత్తడం విశేషం. ‘‘ఆఖరి వరకు అతడి ఆత్మవిశ్వాసం చెక్కుచెదరలేదు. పద్దెమినిదవ ఓవర్లోనూ ఏమాత్రం భయపడలేదు.తిలక్ వర్మ అచ్చం ఆ దిగ్గజం మాదిరేఅంతెందుకు పందొమ్మిదవ ఓవర్లో టీమిండియాకు ఒక్క బౌండరీ కూడా రాలేదు. అప్పుడూ అతడు ఏమాత్రం ఒత్తిడికి లోనుకాకుండా.. ఆఖరి వరకు అజేయంగా నిలిచి.. ఫోర్‌తో ఫినిష్ చేశాడు. అతడు ఆత్మవిశ్వాసంతో ఉండటంతో పాటు జట్టును కూడా కాన్ఫిడెంట్‌గా ఉంచుతున్నాడు.ధోని కంటే కాస్త మెరుగేగతంలో మనకు ఇలాంటి దిగ్గజం ఒకరు ఉండేవారు. అతడు మరెవరో కాదు మహేంద్ర సింగ్ ధోని. తను కూడా ఇలాగే ఆత్మవిశ్వాసంతో ఇన్నింగ్స్ ముగించేవాడు. అతడిలాంటి వ్యక్తి.. అది కూడా మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ.. ఇలాంటి ఫలితాలు రాబట్టడం మామూలు విషయం కాదు’’ అని సంజయ్ మంజ్రేకర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో టైమ్అవుట్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.కాగా తిలక్ వర్మ ఇప్పటి వరకు టీమిండియా తరఫున 22 టీ20 మ్యాచ్‌లు ఆడి 156కు పైగా స్ట్రేక్రేటుతో 707 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో రెండు శతకాలు, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 120. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌తో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా రెండు గెలిచింది. ఆధిక్యంలో టీమిండియాతొలి టీ20లో ఏడు వికె ట్ల తేడాతో విజయం సాధించిన సూర్యకుమార్ సేన.. రెండో మ్యాచ్‌లో రెండు వికెట్ల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. తద్వారా ప్రస్తుతం 2-0తో ఆధిక్యంలో ఉంది. ఇక ఇండియా- ఇంగ్లండ్ మధ్య మంగళవారం రాజ్‌కోట్‌లో మూడో టీ20 జరుగనుంది. తదుపరి పుణె, ముంబైలలో మిగిలిన టీ20లు జరుగుతాయి.చదవండి: చాంపియన్స్ ట్రోఫీ జట్టులోకి సిరాజ్! కారణం ఇదే!2️⃣-0️⃣ 🙌Tilak Varma finishes in style and #TeamIndia register a 2-wicket win in Chennai! 👌Scorecard ▶️ https://t.co/6RwYIFWg7i #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/d9jg3O02IB— BCCI (@BCCI) January 25, 2025 -
సిక్సర్లు బాదడంలో యువీ తర్వాత అతడే!
సంజూ శాంసన్(Sanju Samson)కు తాను పెద్ద అభిమానినైపోయానని టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్(Sanjay Manjrekar) అన్నాడు. గతంలో బ్యాటింగ్ బాగా చేసినా.. పరుగులు రాబట్టలేక ఇబ్బంది పడేవాడని.. ఇప్పుడు మాత్రం దుమ్ములేపుతున్నాడని ప్రశంసించాడు. సంజూ ఆట తీరుకు తాను ఫిదా అయ్యానంటూ కితాబులిచ్చాడు. రానున్న కాలంలో ఈ కేరళ బ్యాటర్ అద్భుతాలు చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.కాగా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్‌కు అద్భుత నైపుణ్యాలున్నా.. నిలకడలేమి ఆట తీరుకు మారుపేరని అపవాదు ఉంది. అయితే, ఇటీవల అంతర్జాతీయ టీ20లలో అతడి ఆట తీరు అభిమానులతో పాటు విమర్శకులనూ మెప్పించింది. తొలుత స్వదేశంలో విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డ సంజూ.. సౌతాఫ్రికా గడ్డ మీద కూడా రెండు సెంచరీలతో రాణించాడు.బంగ్లాదేశ్‌పై 47 బంతుల్లోనే 111 పరుగులు సాధించిన సంజూ శాంసన్.. ఆ తర్వాత సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లో 107, 109 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో సొంతగడ్డపై ఇంగ్లండ్(India Vs England)తో టీ20 సిరీస్ ఆడనున్న భారత జట్టులో అతడికి చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. సంజూ అలాంటి వాడేఈ నేపథ్యంలో కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ స్టార్ స్పోర్ట్స్ షో లో మాట్లాడుతూ.. ‘‘ఆత్మవిశ్వాసం.. పరిణతితో కూడిన బ్యాటింగ్.. వికెట్‌కు విలువ ఇచ్చే విధానం.. సంజూలోని ఈ గుణాలు నన్ను ఆకట్టుకున్నాయి. అతడు సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడలేడని, నిలకడలేని ఆటగాడని విమర్శలు ఉండేవి. కానీ ఇప్పుడు అద్భుతంగా ఆడుతున్నాడు. కొంతమంది ఆలస్యంగా పేరు తెచ్చుకుంటారు. సంజూ అలాంటి వాడే. నేనిప్పుడు అతడికి వీరాభిమానిని. గతంలో అతడు బ్యాటింగ్ మాత్రమే బాగా చేస్తాడు.. పరుగులు చేయడని అంతా అంటూ ఉండేవారు. కానీ ఇప్పుడు రెండూ బాగానే చేస్తున్నాడు’’ అని ప్రశంసలు కురిపించాడు.ఇక ఇదే షోలో మరో మాజీ క్రికెటర్, టీమిండియా మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ సైతం సంజూ గురించి ప్రస్తావన రాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ప్రస్తుతం అతడు మంచి ఫామ్‌లో ఉన్నాడు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. వరుసగా రెండు మ్యాచ్‌లలో బాగా ఆడితే.. బ్యాటర్‌పై కాస్త ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా అతడు మరింత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయగలుగుతాడు.సిక్సర్లు బాదడంలో యువీ తర్వాత అతడే!టాపార్డర్‌లో బ్యాటింగ్ చేయడం అతడికి సానుకూలాంశం. వికెట్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని ఉండదు. అంతేకాదు.. సంజూ సిక్స్ హిట్టర్. ఎంతో ఈజ్‌తో సిక్సర్లు బాదుతాడు. యువరాజ్ సింగ్ తర్వాత.. అదే స్టైల్లో సిక్స్‌లు కొట్టగల మరో బ్యాటర్ సంజూ శాంసనే. అతడు పరుగుల వరద పారిస్తుంటే చూడటానికి చక్కగా ఉంటుంది’’ అని సంజయ్ బంగర్ కొనియాడాడు.కాగా జింబాబ్వేతో టీ20 సిరీస్ ద్వారా 2015లో టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సంజూ శాంసన్.. ఆ తర్వాత ఆరేళ్లకు వన్డేల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 37 టీ20లు, 16 వన్డేలు ఆడాడు. వన్డేల్లో ఓ శతకం సాయంతో 510 పరుగులు చేయగా.. టీ20లలో మూడు సెంచరీల సహాయంతో 810 రన్స్ సాధించాడు. ఇదిలా ఉంటే.. జనవరి 22 నుంచి టీమిండియా ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ మొదలుపెట్టనుంది.చదవండి: IND Vs IRE 1st ODI: చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన.. వన్డేల్లో ఫాస్టెస్ట్‌గా.. -
'భారత్‌కు మరో రవి శాస్త్రి దొరికాడు'.. నితీశ్‌పై ప్రశంసల జల్లు
ఆస్ట్రేలియాతో ఆస్ట్రేలియా గడ్డపై జరిగే టెస్టు సిరీస్ కి ఎప్పుడూ ప్రత్యేకత ఉంటుంది. ఈ సిరీస్ ఏ ఆటగాడికైనా ఒక అగ్ని పరీక్ష వంటింది. ఈ పరీక్షకి తట్టుకుని నిలబడ్డ ఆటగాడికి భవిష్యత్ ఉన్నతంగా ఉంటుందనడంలో సందేహం లేదు.మరి అందరికీ అలాంటి అవకాశం రాదుగా? వచ్చినా సద్వినియోగం చేసుకోగల నైపుణ్యం, చతురత, గుండె నిబ్బరం, అన్నిటికీ మించి ఆ ఒత్తిడికి తట్టుకుని నిలువ గల మానసిక స్థైర్యం కావాలి. ఇవన్నీ తనకు పుష్కలంగా ఉన్నాయి అని నిరూపించాడు 21 ఏళ్ళ విశాఖపట్నం కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి.వికెట్ కీపర్ రిషబ్ పంత్ అవుటైన తర్వాత, ఆస్ట్రేలియా సాధించిన 474 పరుగుల స్కోర్ కి సమాధానంగా 191 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి భారత్ ఫాలోఆన్ ఉచ్చులో చిక్కుకున్న తరుణంలో బ్యాటింగ్ కి వచ్చిన నితీష్ కుమార్ ఎంతో నిబద్దతతో, బాధ్యతాయుతంగా ఆడాడు. ఎలాంటి ఒత్తిడి ని కనబరచకుండా తన సహజ సిద్ధ శైలి తో బ్యాటింగ్ చేశాడు. హేమాహేమీలైన తన జట్టులో సీనియర్ బ్యాటర్ లాగా ఎక్కడా సహనాన్ని కోల్పోలేదు. తడబాటు కనబరచలేదు ఏంటో పరిణతి చెందిన బ్యాట్ లాగా ఒకొక్క ఇటుక పేర్చుకుంటూ తన ఇన్నింగ్స్ ని నిర్మించాడు.సిసలైన టెస్ట్ మ్యాచ్ ఇన్నింగ్స్ ఆడి భారత్‌ని గట్టెక్కించాడు. ఈ దశలో నితీష్ కి వాషింగ్టన్ సుందర్ నుంచి మంచి సహకారం లభించింది. ఈ ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్ల ని ధీటుగా ఎదుర్కొన్నారు. ఎక్కడా వెన్నుచూపలేదు. ఆస్ట్రేలియా కొత్త బంతి తీసుకున్నా ప్రయోజనం లేకపోయింది. చివరికి వెటరన్ స్పిన్నర్ నేథన్ లియాన్ వీరిద్దరి భాగస్వామ్యాన్ని బద్దలు చేసిన సమయానికి భారత్ ఫాలో ఆన్ గట్టెక్కడం కాక ఈ టెస్ట్ ని డ్రా చేయగలమనే ధీమాకి చేరుకుందంటే, వీరిద్దరి ఎనిమిదో వికెట్ కి నెలకొల్పిన 127 పరుగుల భాగస్వామ్యం అంత అమూల్యమైనది.వాషింగ్టన్ సుందర్ నిష్క్రమించే సమయానికి నితీష్ 97 పరుగులతో అజేయంగా ఉన్నాడు. తదుపరి వచ్చిన జస్ప్రీత్ బుమ్రా వెంటనే ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ బౌలింగ్ లో అవుటైనా, హైదరాబాద్ ఆటగాడు మొహమ్మద్ సిరాజ్ మూడు బంతులని నిలువరించి నితీష్ కుమార్ మెల్బోర్న్ లో బాక్సింగ్ డే వంటి ఏంతో ప్రితిష్టాత్మకమైన టెస్ట్ లో సెంచరీ సాధించేందుకు దోహదం చేసాడు. 'భారత్ కి మరో రవి శాస్త్రి దొరికాడు'మెల్బోర్న్ లో తన తొలి టెస్ట్ సెంచరీ సాధించిన నితీష్ కుమార్ రెడ్డి ని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసలతో ముంచెత్తాడు. ముఖ్యంగా నితీష్ ఆటతీరు భారత్ మాజీ కోచ్ రవి శాస్త్రి తో పోలి ఉందని, మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. శాస్త్రి తరహాలో కొద్దిగా బౌలింగ్ వచ్చిన బ్యాటర్‌గా గా జట్టులోకి వచ్చిన నితీష్ ఇప్పుడు జట్టులోని ప్రధాన బ్యాటర్‌గా తన సామర్ధ్యాన్ని నిరూపించుకున్నాడు. అతని బాటింగ్ స్థానాన్ని జట్టు మానేజిమెంట్ మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. నితీష్ భారత బ్యాటింగ్ అర్దర్లో పైకి పైకి ఎగబాకి గతంలో రవి శాస్త్రి లాగా త్వరలో ఓపెనర్ గా వచ్చినా ఆశ్చర్యం లేదని, మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. అయితే నితీష్ తన బౌలింగ్ ని కొద్దిగా మెరుగు పరుచుకుంటే, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న భారత్‌కి ఒక మంచి ఆల్ రౌండర్ జట్టుకి లభించినట్టే. ఫలితం ఎలా ఉన్న, భారత్ కి ఈ సిరీస్ లో ఒక అద్భుతమైన ఆణిముత్యం లభించినట్టే! -
ఆసీస్‌తో మూడో టెస్టు: నితీశ్ రెడ్డి అద్భుతం.. కానీ తుది జట్టులో వద్దు!
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో టీమిండియా యువ ఆల్‌రౌండర్, ఆంధ్ర స్టార్ క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి దుమ్ములేపుతున్న సంగతి తెలిసిందే. తొలిసారి ఆస్ట్రేలియాలో ఆడుతున్న నితీశ్.. మిచెల్ స్టార్క్, ప్యాట్ కమ్మిన్స్ వంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను అలోవకగా ఎదుర్కొని అందరిని ఆశ్చర్యపరుస్తున్నాడు.ఇటీవల జరిగిన పింక్‌బాల్ టెస్టులో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి స్టార్ ప్లేయర్లు విఫలమైనప్పటికి.. నితీశ్ మాత్రం రెండు ఇన్నింగ్స్‌లోనూ టాప్ స్కోరర్‌గా నిలిచి సత్తాచాటాడు. మొత్తం నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 41, 38 (నాటౌట్), 42, 42 పరుగులతో రాణించాడు. అయితే బౌలింగ్‌లో మాత్రం ఈ ఆంధ్ర ఆల్‌రౌండర్ ఇంకా తన మార్క్ చూపించలేదు.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 2 వికెట్లు మాత్రమే తీసాడు. అతడితో పాటు హర్షిత్ రాణా కూడా పెద్దగా రాణించలేకపోతున్నాడు. దీంతో పేస్ బౌలింగ్ భారమంతా జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్‌లపైనే పడుతోంది.ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బ్రిస్బేన్‌లో జరిగే మూడో టెస్టుకు నితీశ్ రెడ్డిని తప్పించాలని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. "నితీష్ కుమార్‌కు అద్బుతమైన బ్యాటింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్టుపై కూడా అతడు ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో పెద్దగా పరుగులు సాధించకపోయినప్పటకి.. అంతర్జాతీయ క్రికెట్లో మెరుగ్గా రాణించడం నిజంగా శుభసూచికం. ఆస్ట్రేలియా వంటి పరిస్థితుల్లో నితీశ్‌లా బ్యాటింగ్ చేసే ప్లేయర్లను అరుదుగా చూస్తూ ఉంటాము. కానీ భారత జట్టు మెనెజ్‌మెంట్ ప్లేయింగ్ ఎలెవన్ కాంబినేషన్‌పై ఆలోచన చేయాలి. బౌలింగ్ యూనిట్‌పై కూడా దృష్టిసారించాలి. నితీష్ బ్యాట్‌తో రాణిస్తున్నా..బౌలింగ్‌లో మాత్రం తేలిపోతున్నాడు. కాబట్టి నితీశ్ రెడ్డిని కేవలం బ్యాటర్‌గా కొనసాగించడం రిస్క్‌తో కూడిన వ్యవహరమని ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ పేర్కొన్నాడు. -
‘కోహ్లి.. జైస్వాల్‌ను చూసి ఎలా ఆడాలో నేర్చుకో’
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ సత్తాచాటాడు. ఆస్ట్రేలియా గడ్డపై తన మొదటి టెస్టు మ్యాచ్‌లోనే జైశ్వాల్ సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైనా.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం కంగారులను కంగరెత్తించాడు.స్టార్క్, హాజిల్‌వుడ్ వంటి వరల్డ్‌క్లాస్ బౌలర్లను ఆలోవకగా ఎదుర్కొని శెభాష్ అన్పించుకున్నాడు. భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్హగ్ను గుర్తు చేసేలా సిక్సర్‌తో తన సెంచరీ మార్క్‌ను జైశ్వాల్ అందుకున్నాడు. ఓవరాల్‌గా జైశ్వాల్‌కు ఇది నాలుగో టెస్టు సెంచరీ కావడం గమనార్హం.ఓవరాల్‌గా 297 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్.. 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 161 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో జైశ్వాల్‌పై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆస్ట్రేలియా వంటి కఠిన పరిస్థితుల్లో అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడాడని మంజ్రేకర్ కొనియాడాడు. అదేవిధంగా బ్యాక్ ఫుట్‌లో జైశ్వాల్ అద్బుతంగా ఆడుతున్నాడని అతడు మెచ్చుకున్నాడు."జైశ్వాల్ ఒక సంచలనం. అతడు షాట్ సెలక్షన్ చాలా బాగుంది. ఈ మ్యాచ్‌లో అతడు కట్ షాట్ వైట్‌బాల్ క్రికెట్లో ఆడినట్లు ఆడాడు. సాధారణంగా ఆటగాళ్ళు కట్‌షాట్ ఆడేందుకు ముందుగానే పొజిషన్లోకి వస్తారు. కానీ జైశ్వాల్ మాత్రం చాలా ఆలస్యంగా ఆడుతున్నాడు.అదే అతడి స్పెషల్. బ్యాక్‌ఫుట్‌లో నుంచి అద్బుతంగా కట్ షాట్ ఆడుతున్నాడు. బ్యాక్‌ఫుట్ నుంచి షాట్ ఆడి స్క్వేర్ వెనక దిశగా పరుగులు రాబడుతున్నాడు. విరాట్ కోహ్లి కంటే జైశ్వాల్ బాగా కట్ షాట్ ఆడుతున్నాడు.విరాట్ కోహ్లి మాత్రం ఫ్రంట్ ఫుట్‌లో ఉండి ఆడేందుకు ఇష్టపడతాడు. అందువల్ల పెద్దగా పరుగులు సాధించలేకపోతున్నాడు. ఆస్ట్రేలియా వంటి పరిస్థితుల్లో బ్యాక్‌ఫుట్‌లో ఎలా ఆడాలన్నది యశస్వి నుంచి కోహ్లి నేర్చుకోవాలి" అని స్టార్ స్పోర్ట్స్ ఇంటర్వ్యూలో సంజయ్ పేర్కొన్నాడు. -
మంజ్రేకర్‌పై మండిపడ్డ మహ్మద్ షమీ.. పోస్ట్ వైరల్
భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీరుపై టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ మండిపడ్డాడు. ఇతరుల కోసం జ్ఞానం వృథా చేసుకుని.. తమ గురించి ఆలోచించుకోవడం మర్చిపోవద్దంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. జోస్యం చెప్పడమే లక్ష్యంగా పెట్టుకుంటే బాబా అవతారం ఎత్తితే బాగుంటుందంటూ చురకలు అంటించాడు.నవంబరు 24, 25 తేదీల్లోఐపీఎల్-2025 మెగా వేలం నవంబరు 24, 25 తేదీల్లో జరుగనున్న విషయం తెలిసిందే. సౌదీ అరేబియాలోని జెద్దా నగరం వేదికగా జరిగే వేలంపాటకు ముందే పది ఫ్రాంఛైజీలు తమ రిటెన్షన్ జాబితాను ఇప్పటికే విడుదల చేశాయి. ఆ ఐదుగురు మాత్రమేఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ రషీద్ ఖాన్(రూ. 18 కోట్లు ), శుబ్‌మన్ గిల్(రూ. 16.50 కోట్లు), సాయి సుదర్శన్(రూ. 8.50 కోట్లు), రాహుల్ తెవాటియా(రూ. 4 కోట్లు), షారుఖ్ ఖాన్(రూ. 4 కోట్లు)లను మాత్రమే అట్టిపెట్టుకుని.. షమీని విడిచిపెట్టింది.ఏడాది తర్వాత రీ ఎంట్రీకాగా వన్డే వరల్డ్‌కప్-2023లో సత్తా చాటిన షమీ.. ఆ తర్వాత చీలమండ గాయంతో ఆటకు దూరమయ్యాడు. శస్త్ర చికిత్స తర్వాత పూర్తిగా కోలుకోలేకపోయిన షమీ దాదాపు ఏడాది తర్వాత ఇటీవలే బెంగాల్ తరఫున రంజీ ట్రోఫీ బరిలో దిగాడు. బాల్తోనే గాకుండా బ్యాట్‌తోనూ సత్తా చాటాడు.షమీ ధర పడిపోవచ్చుఈ పరిణామాల నేపథ్యంలో మెగా వేలానికి ముందు షమీని ఉద్దేశించి కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘షమీపై ఫ్రాంఛైజీలు ఆసక్తి చూపుతాయనడంలో సందేమం లేదు. కానీ.. అతడిని గాయాల బెడద వేధిస్తోందన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.అతడు కోలుకోవడానికి ఎంత సమయం పట్టిందో మనం చూశాం. కాబట్టి ఇలాంటి ఆటగాడిని కొనుగోలు చేయాలంటే.. ఫ్రాంఛైజీలు కాస్త ఆలోచిస్తాయి. ఒకవేళ ఎవరైనా షమీపై భారీగా పెట్టుబడి పెట్టిన తర్వాత.. మధ్యలోనే అతడు జట్టుకు దూరమైతే..వారికి సరైన ఆప్షన్లు కూడా అందుబాటులో ఉండవు. అందుకే.. షమీ ధర పడిపోవచ్చు’’ అని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.బాబాజీని సంప్రదించండిఇందుకు ఘాటుగా స్పందించిన షమీ ఇన్‌స్టా స్టోరీలో మంజ్రేకర్ వ్యాఖ్యలను షేర్ చేస్తూ.. ‘‘బాబాకీ జై! మీ భవిష్యత్తు కోసం కూడా కాస్త జ్ఞానాన్ని దాచిపెట్టుకోండి. ఒకవేళ ఎవరైనా తమ భవిష్యత్తు గురించి తెలుసుకోవాలనుకుంటే బాబాజీని సంప్రదించండి’’ అంటూ సెటైర్లు వేశాడు.రూ. 6.25 కోట్లకు కొనుగోలుకాగా ఐపీఎల్-2022లో గుజరాత్ టైటాన్స్ షమీని రూ. 6.25 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ ఎడిషన్‌లో షమీ 16 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే.. భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ సైతం ఐపీఎల్ మెగా వేలం నేపథ్యంలో.. రిషభ్ పంత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. డబ్బు విషయంలో సయోధ్య కుదరకపోవడంతోనే పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌ను విడిచిపెట్టాడని సన్నీ అంచనా వేశాడు. అయితే, పంత్ ఎక్స్ వేదికగా గావస్కర్ వ్యాఖ్యలను ఖండించాడు. తాజాగా షమీ సైతం అదే పంథాను అనుసరించాడు.చదవండి: IPL 2025 Mega Auction: అతడికి రూ. 25- 28 కోట్లు.. ఆ ఫ్రాంఛైజీ సొంతం చేసుకోవడం ఖాయం!పేసర్లకు కెప్టెన్సీ ఇవ్వాలి.. విరాట్, రోహిత్ వేరు.. నేను వేరు.. తుదిజట్టు ఖరారైంది: బుమ్రా -
BCCI: గంభీర్‌ను ఇంకోసారి ప్రెస్ కాన్ఫరెన్స్‌కు పంపకండి: భారత మాజీ క్రికెటర్
టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌ను ఉద్దేశించి భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దయచేసి అతడిని మరోసారి మీడియా సమావేశానికి పంపవద్దంటూ భారత క్రికెట్ నియంత్రణ మండలికి విజ్ఞప్తి చేశాడు. గంభీర్‌కు బదులు కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌నే ప్రెస్ కాన్ఫరెన్స్‌కు పంపాలని సూచించాడు.టీమిండియా వైట్‌వాష్‌కు గురైన తర్వాతకాగా న్యూజిలాండ్‌తో స్వదేశంలో టెస్టుల్లో 3-0తో టీమిండియా వైట్‌వాష్‌కు గురైన తర్వాత.. గంభీర్ తొలిసారిగా మీడియా ముందుకు వచ్చాడు. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ నేపథ్యంలో సోమవారం విలేకరులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చాడు. కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు అందుబాటులో ఉంటాడో లేదో కచ్చితంగా చెప్పలేమన్న గౌతీ.. అతడి స్థానంలో వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా పగ్గాలు చేపట్టే అవకాశం ఉందని పేర్కొన్నాడు.నష్టమేమీ లేదుఅదే విధంగా.. రోహిత్ శర్మ- విరాట్ కోహ్లిల ఫామ్ గురించి తమకు ఆందోళన లేదంటూ.. వారిని విమర్శిస్తున్న ఆస్ట్రేలియా దిగ్గజం రిక్కీ పాంటింగ్‌కు గౌతీ కౌంటర్ ఇచ్చాడు. ఇక కివీస్ చేతిలో పరాభవం నుంచి పాఠాలు నేర్చకుంటామని.. విమర్శలను స్వీకరిస్తూనే ముందడుగు వేస్తామని పేర్కొన్నాడు. అంతేకాదు.. సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల తమకు వచ్చే నష్టమేమీ లేదంటూ నెటిజన్లకు కౌంటర్ ఇచ్చాడు. అయితే, కొన్నిసార్లు మీడియా ప్రశ్నలకు గంభీర్ దూకుడుగా.. మరికొన్నింటికి దాటవేత ధోరణి అవలంబించినట్లుగా కనిపించిందనే విమర్శలు వస్తున్నాయి. అతడిని తెరవెనుక ఉంచడమే తెలివైన నిర్ణయంఈ నేపథ్యంలో కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ‘‘ఇందాకే గంభీర్ ప్రెస్ కాన్ఫరెన్స్ చూశాను. అతడిని ఇలాంటి పనులకు దూరంగా ఉంచితేనే బీసీసీఐకి మంచిది.అతడిని తెరవెనుక ఉంచడమే తెలివైన నిర్ణయం. మీడియాతో మాట్లాడేటపుడు ఎలా ప్రవర్తించాలో, ఎలాంటి పదాలు వాడాలో అతడికి తెలియదు. రోహిత్, అగార్కర్ అతడి కంటే చాలా బెటర్. వాళ్లిద్దరినే మీడియా ముందుకు పంపిస్తే మంచిది’’ అని సంజయ్ మంజ్రేకర్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.నాలుగు గెలిస్తేనేకాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(డబ్ల్యూటీసీ) 2023-25లో చివరగా టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య పెర్త్ వేదికగా నవంబరు 22 నుంచి బోర్డర్- గావస్కర్ ట్రోఫీ మొదలుకానుంది. ఇందులో భాగంగా భారత్- ఆసీస్ మధ్య ఐదు టెస్టులు జరుగనున్నాయి. వీటిలో కనీసం నాలుగు గెలిస్తేనే టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరుతుంది.చదవండి: అమ్మాయిగా మారిన టీమిండియా మాజీ కోచ్ కొడుకు.. ఎమోషనల్ వీడియో! స్త్రీగా మారినందు వల్ల🗣️ We are absolutely keen to go out there, perform, and try and win the seriesHead Coach Gautam Gambhir ahead of #TeamIndia's departure to Australia for the Border-Gavaskar Trophy.#AUSvIND | @GautamGambhir pic.twitter.com/MabCwkSPGL— BCCI (@BCCI) November 11, 2024 -
'అదొక చెత్త నిర్ణయం.. రోహిత్, గంభీర్‌కు కొంచెం కూడా తెలివి లేదు'
స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో టీమిండియా బ్యాటింగ్ వైఫల్యం కొనసాగుతోంది. తొలి రెండు టెస్టుల్లో నిరాశపరిచిన భారత బ్యాటర్లు.. ఇప్పుడు వాంఖడే వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్టులో అదే తీరును కనబరిచారు.శుబ్‌మన్ గిల్(90), రిషబ్ పంత్(60),సుందర్(38) మినహా మిగతా అందరూ విఫలమయ్యారు. దీంతో టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 263 పరుగుల నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. అయితే ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్‌కోచ్ గౌతం గంభీర్ తీసుకున్న పలు నిర్ణయాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ముఖ్యంగా మిడిలార్డర్ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్ ఆర్డర్ మార్చడాన్ని చాలా మంది మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. ముంబై టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్‌ను ఏకంగా 8వ స్ధానంలో బ్యాటింగ్‌కు టీమిండియా మెన్‌జెమెంట్ పంపించింది. అంతకంటే ముందు సర్ఫరాజ్ స్ధానంలో మొదటి రోజు ఆటలో మహ్మద్ సిరాజ్‌ను నైట్ వాచ్‌మెన్‌గా ప్రమోట్ చేసింది. కానీ సిరాజ్ తొలి బంతికే పెవిలియన్‌కు చేరాడు. రెండో రోజు ఆటలో కూడా సర్ఫరాజ్‌ను ముందుగా బ్యాటింగ్‌కు పంపలేదు. అతడి కంటే ముందు పంత్, జడేజాలను జట్టు మెన్‌జెమెంట్ బ్యాటింగ్‌కు పంపిచారు.ఇక 8వ స్ధానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సర్ఫరాజ్.. ఆజాజ్ పటేల్ బౌలింగ్‌లో ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో రోహిత్, గంభీర్‌లపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్ర విమర్శలు చేశాడు.అదొక చెత్త నిర్ణయం.."సర్ఫరాజ్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతడు తన మొదటి మూడు టెస్టుల్లో మూడు అర్ధశతకాలు సాధించాడు. బెంగుళూరు టెస్టులో సూపర్ సెంచరీ(150)తో చెలరేగాడు. స్పిన్‌కు అద్భుతంగా ఆడుతున్నాడు.రైట్ అండ్ లెఫ్ట్ కాంబనేషన్ను కొనసాగించడానికి అతడిని డిమోట్ చేశారా? అతడి బ్యాటింగ్ ఆర్డర్‌ను ఎందుకు మార్చారు? ఈ విషయం నాకు ఇప్పటికీ ఆర్ధం కావడం లేదు. ఏకంగా అతడిని 8వ స్ధానానికి నెట్టేశారు. ఏమైనప్పటికీ భారత జట్టు మెన్‌జెమెంట్ ఓ చెత్త నిర్ణయం తీసుకుందని ఎక్స్‌లో మంజ్రేకర్ మండి పడ్డాడు.చదవండి: విధ్వంసకర ఇన్నింగ్స్.. భారత తొలి క్రికెటర్‌గా పంత్ రికార్డు -
ఓహ్ డియర్..! కోహ్లి కెరీర్లోనే చెత్త షాట్: భారత మాజీ క్రికెటర్
టెస్టు క్రికెట్లో టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లి పేలవ ఫామ్ కొనసాగుతోంది. పుణే వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో కోహ్లి తీవ్ర నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 9 బంతులు ఎదుర్కొన్న కోహ్లి కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.కివీస్ స్పిన్నర్ మిచెల్ శాంటర్నర్ బౌలింగ్‌లో చెత్త షాట్ ఆడి క్లీన్ బౌల్డయ్యాడు. ఫుల్ టాస్ బంతిని సరిగ్గా ఆర్థం చేసుకోవడంలో విఫలమైన విరాట్ తన వికెట్‌ను సమర్పించుకున్నాడు. దీంతో అతడు ఔటైన తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో కోహ్లి ఔట్‌పై భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ సైతం సోషల్ మీడియా వేదికగా విమర్శించాడు."ఓహ్ డియర్! ఔటైన తర్వాత తన కెరీర్లోనే చెత్త షాట్ ఆడినట్లు విరాట్‌కే అన్పించింటుంది. అతడు కచ్చితంగా బాధపడి ఉంటాడు. ఎందుకంటే అతడు ఎప్పుడూ పరుగులు చేయాలనే ఉద్దేశంతోనే మైదానంలో అడుగుపెడతాడని" ఎక్స్‌లో మంజ్రేకర్ రాసుకొచ్చాడు.ఒకే ఒక ఫిప్టీ..కాగా కోహ్లి 2024 క్యాలెండర్ ఈయర్‌లో టెస్టుల్లో దారుణ ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ ఏడాది టెస్టుల్లో కోహ్లి ఇప్పటివరకు కేవలం ఒక హాఫ్ సెంచరీ మాత్రమే చేశాడు. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో చేసిన 70 పరుగులే ఈ ఏడాది విరాట్ అత్యధిక స్కోర్ కావడం గమనార్హం.ముఖ్యంగా స్పిన్నర్లను ఆడటంలో విరాట్ తడబడుతున్నాడు. తన వికెట్‌ను ఈజీగా స్పిన్నర్లకు సమర్పించుకుంటున్నాడు. గత నాలుగేళ్లలో 26 ఇన్నింగ్స్‌ల్లో 21 సార్లు స్పిన్నర్లకే తన వికెట్‌ను కోహ్లి ఇచ్చేశాడు. Oh dear! Virat will know himself that he has just played the worst shot of his career to get out. Got to feel for him…coz as always he came out with solid & honest intent.— Sanjay Manjrekar (@sanjaymanjrekar) October 25, 2024 -
'సర్ఫరాజ్ ఒక అద్బుతం.. ఆ దిగ్గజాన్ని గుర్తు చేస్తున్నాడు'
బెంగుళూరు వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్నతొలి టెస్టులో భారత యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ అదరగొడుతున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌటైన సర్ఫరాజ్.. రెండో ఇన్నింగ్స్‌లో సత్తాచాటుతున్నాడు. శుబ్‌మన్ గిల్ స్దానంలో జట్టులోకి వచ్చిన 26 ఏళ్ల ముంబైకర్.. మూడో రోజు ఆటలో దుమ్ములేపాడు.భారత పోరాటంలో కీలక పాత్ర పోషించాడు. స్వీప్, ర్యాంప్ షాట్లు ఆడుతూ సర్ఫరాజ్ అలరించాడు. మూడు రోజు ఆట ముగిసే సమయానికి 70 పరుగులతో ఖాన్ అజేయంగా నిలిచాడు. నాలుగో రోజు భారత్ తమ రిథమ్‌ను కొనసాగించాలంటే వీలైనంత సమయం పాటు సర్ఫరాజ్ క్రీజులో ఉండాలి. ఈ నేపథ్యంలో సర్ఫరాజ్ ఖాన్‌పై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల వర్షం కురిపించాడు. సర్ఫరాజ్‌ను భారత దిగ్గజ బ్యాటర్ జావేద్ మియాందాద్‌తో మంజ్రేకర్ పోల్చాడు."సర్పరాజ్ జావేద్ మియాందాద్‌ని గుర్తు చేస్తున్నాడు. 1980లలో జావేద్ ఈ విధంగానే ఆడేవాడు. సర్పరాజ్ మియాందాద్ 2024 వెర్షన్. అతడు ఆట తీరు నన్ను ఎంతోగానే ఆకట్టుకుంది. అతను స్పిన్‌ను బాగా ఆడతాడని మాకు తెలుసు, కానీ ఫాస్ట్ బౌలర్లను కూడా ఈ విధంగా ఆడుతాడని నేను అనుకోలేదు.అతడికి అద్భుతమైన గేమ్ ప్లాన్ ఉంది.మూడో రోజు ఆట ముగిసే సమయంలో తన వికెట్‌ను కోల్పోకుండా జాగ్రత్తపడ్డాడు. ఆఖరిలో డిఫెన్స్ ఆడుతూ మూడో రోజు ఆటను ముగించాడు. నాలుగో రోజు ఆటలో సర్ఫరాజ్ కీలకం కానున్నాడు. బౌన్సర్లను కూడా సర్ఫరాజ్ అద్బుతంగా ఆడుతున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు భారత్‌కు ఇది నిజంగా శుభసూచకమని" ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ పేర్కొన్నాడు. కాగా మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. భారత్ ఇంకా 125 పరుగుల వెనకంజలో ఉంది.చదవండి: IND vs AUS: ఆసీస్ టూర్‌కు భారత జట్టు ఇదే.. కెప్టెన్‌గా రుతురాజ్! తెలుగోడికి చోటు? -
Ind vs Ban: 'టీమిండియాకు ఇది మంచికాదు'
దాదాపు ఆరు నెలల విరామం తర్వాత టెస్టు బరిలో దిగిన భారత క్రికెట్ జట్టు విజయంతో పునరాగమనం చేసింది. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో ఘన విజయం సాధించింది. చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్‌లో ప్రత్యర్థిని ఏకంగా 280 పరుగుల తేడాతో చిత్తు చేసి.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.ఇక బంగ్లాదేశ్‌తో టెస్టులో స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్, యువ బ్యాటర్లు రిషభ్ పంత్, శుబ్‌మన్ గిల్ శతకాలతో మెరవగా.. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో రాణించాడు. సెంచరీ కొట్టడంతో పాటు ఆరు వికెట్లు తీసిన అశ్విన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి విఫలంఅంతాబాగానే ఉన్నా.. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి వైఫల్యం మాత్రం అభిమానులను నిరాశపరిచింది. రెండు ఇన్నింగ్స్‌లో కలిపి రోహిత్ 11, కోహ్లి 23 పరుగులు మాత్రమే చేయడం మేనేజ్మెంట్లో ఆందోళనకు కారణమైంది. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఘాటు విమర్శలు చేశాడు.టీమిండియాకు ఇది మంచికాదురోహిత్, కోహ్లి దులిప్ ట్రోఫీ-2024లో ఆడితే పరిస్థితి వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. అయినా.. ఆటగాళ్ల పేరు ప్రఖ్యాతుల ఆధారంగా తారతమ్యాలు చూపించడం.. భారత క్రికెట్‌కి మంచిది కాదని పేర్కొన్నాడు. ఈ మేరకు సంజయ్ మంజ్రేకర్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘వాళ్లిద్దరు వరల్డ్‌క్లాస్ బ్యాటర్లు. తిరిగి ఫామ్‌లోకి రాగలరు. కానీ ఈ సిరీస్‌కు ముందు దులిప్ ట్రోఫీ ఆడితే బాగుండేది.వారిని ఈ రెడ్‌బాల్ టోర్నీలో ఆడించే వీలున్నా విశ్రాంతినిచ్చారు. మిగతా వాళ్లకు మాత్రం ఆ వెసలుబాటు లేదు. అయినా.. ఒక్కక్కళ్లను ఒకలా ట్రీట్ చేయడం భారత క్రికెట్‌కు నష్టంచేకూర్చే అవకాశం ఉంది. రోహిత్, కోహ్లిల క్రేజ్ దృష్ట్యా వారు కోరినట్లు చేయడం సరికాదు. దులిప్ ట్రోఫీ ఆడి ఉంటే వారిద్దరు ఫామ్‌లోకి వచ్చేవారు’’ అని పేర్కొన్నాడు. తొలి టెస్టులో మిగతా ప్లేయర్లు రాణించారు కాబట్టి సరిపోయిందని.. లేదంటే ఫలితం వేరేలా ఉండేదేమోనని అభిప్రాయపడ్డాడు. కాగా రోహిత్, కోహ్లితో పాటు అశ్విన్, బుమ్రా సైతం దులిప్ ట్రోఫీ ఆడలేదు. ఇదిలా ఉంటే.. టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య కాన్పూర్ వేదికగా శుక్రవారం నుంచి ఆఖరిదైన రెండో టెస్టు ఆరంభం కానుంది.చదవండి: నేను హార్డ్ హిట్టర్‌ని.. వచ్చే వరల్డ్‌కప్‌లోనూ ఆడతా: విండీస్ స్టార్ -
‘రోహిత్ 59 శాతం.. విరాట్ 61 శాతం.. అయినా ఎందుకిలా?’
టీమిండియా సీనియర్లు దులిప్ ట్రోఫీ టోర్నీలో పాల్గొనాల్సిందని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. వారికి ఇప్పటికే కావాల్సినంత విశ్రాంతి దొరికిందని.. అయినా ఈ దేశవాళీ టోర్నమెంట్‌కు దూరంగా ఉండటం ఏమిటని ప్రశ్నించాడు. యువ క్రికెటర్లతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, రన్‌మెషీన్ విరాట్ కోహ్లి, పేస్ దళ నాయకుడు జస్ప్రీత్ బుమ్రా, స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ ఇందులో ఆడితే బాగుండేదని పేర్కొన్నాడు.ఆ నలుగురు దూరంకాగా బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌కు ముందు భారత క్రికెటర్లకు దులిప్ ట్రోఫీ రూపంలో కావాల్సినంత ప్రాక్టీస్ లభించనుంది. రోహిత్, కోహ్లి, అశూ, బుమ్రా మినహా టీమిండియాలోని దాదాపు అందరు ఆటగాళ్లు ఈ రెడ్‌బాల్ టోర్నీ బరిలో దిగనున్నారు. అయితే, పేసర్ మహ్మద్ సిరాజ్, స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా, యువ ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ ఆఖరి నిమిషంలో తప్పుకోగా.. సిరాజ్, ఉమ్రాన్ స్థానాలను నవదీప్ సైనీ, గౌరవ్ యాదవ్‌తో భర్తీ చేస్తున్నట్లు బీసీసీఐ మంగళవారమే ప్రకటించింది.ఐదేళ్లలో 249 మ్యాచ్‌లు.. వీరు ఆడింది మాత్రంఈ నేపథ్యంలో కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఎక్స్ వేదికగా సీనియర్ల గురించి ప్రస్తావిస్తూ.. ‘‘గత ఐదేళ్లలో టీమిండియా 249 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. వీటిలో రోహిత్ కేవలం 59 శాతం, విరాట్ 61 శాతం, బుమ్రా 34 శాతం మ్యాచ్‌లు మాత్రమే ఆడారు. వీళ్లకు దొరికినంత విశ్రాంతి మరే ఇతర భారత క్రికెటర్లకు దొరలేదన్నది నా అభిప్రాయం. వీరిని దులిప్ ట్రోఫీకి ఎంపిక చేయాల్సింది’’ అని పేర్కొన్నాడు. కనీసం ఫస్ట్‌రౌండ్‌లోనైనా ఈ మేటి క్రికెటర్లు పాల్గొనాల్సిందని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.వరుస టెస్టు సిరీస్లుకాగా సెప్టెంబరు 5 నుంచి దులిప్ ట్రోఫీ 2024-25 ఎడిషన్ ఆరంభం కానుంది. అనంతపురం, బెంగళూరులలో ఈ టోర్నీ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఇక శ్రీలంక పర్యటన తర్వాత సుదీర్ఘ విరామం అనంతరం సెప్టెంబరు 19 నుంచి టీమిండియా మళ్లీ బిజీకానుంది. సొంతగడ్డపై బంగ్లాదేశ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడనుంది. తొలి టెస్టుకు చెన్నై, రెండో టెస్టుకు కాన్పూర్ ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఆ తర్వాత బెంగళూరు, పుణె, ముంబై వేదికగా భారత్ న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు షెడ్యూల్ ఖరారైంది. అనంతరం నవంబరు 22 నుంచి ఆస్ట్రేలియాలో పర్యటించనున్న టీమిండియా.. బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ఆడనుంది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25 ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్‌లు భారత్‌కు ఎంతో కీలకం. ఈ నేపథ్యంలోనే సీనియర్లకు విశ్రాంతినిచ్చినట్లు తెలుస్తోంది.చదవండి: Duleep Trophy: ఆ ముగ్గురు స్టార్లు దూరం.. బీసీసీఐ ప్రకటనIndia has played 249 international matches in the last 5 years. Rohit has played only 59% of those. Virat 61 % & Bumrah 34%. I see them as well rested India players. Could have been selected for the Duleep trophy.— Sanjay Manjrekar (@sanjaymanjrekar) August 28, 2024 -
‘బాబర్ స్థానంలో కెప్టెన్‌గా రమీజ్ రాజా.. ఇప్పటికీ ఫిట్‌గానే’
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో చెత్త ప్రదర్శనతో ఇంటా.. బయటా విమర్శలు మూటగట్టుకుంటోంది పాకిస్తాన్ క్రికెట్ జట్టు. ఓవైపు దాయాది టీమిండియా వరుస విజయాలతో సూపర్-8లో సగర్వంగా అడుగుపెట్టగా.. పాక్ మాత్రం లీగ్ దశలోనే నిష్క్రమించింది.పసికూనగా భావించే ఆతిథ్య అమెరికా జట్టు చేతిలో ఓటమితో ఈ ఐసీసీ ఈవెంట్‌ను ఆరంభించిన బాబర్ బృందం.. తర్వాతి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో ఓడిపోయింది. మరోవైపు.. అమెరికా కెనడా, పాక్‌లపై గెలిచి సూపర్-8 మార్గాలను సుగమం చేసుకోగా.. ఐర్లాండ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో అదృష్టం కూడా కలిసి వచ్చింది.ఈ క్రమంలో పాకిస్తాన్‌ను వెనక్కి నెట్టి అమెరికా తదుపరి రౌండ్‌కు అర్హత సాధించగా.. పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. వరుస ఓటముల తర్వాత కెనడా, ఐర్లాండ్ జట్లపై గెలిచినా ఫలితం లేకుండా పోయినా.. గెలుపుతో ఈ ఈవెంట్‌ను ముగించగలిగింది.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జట్టు ఆట తీరు, కెప్టెన్ బాబర్ ఆజంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. బాబర్ వెంటనే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాబర్ స్థానాన్ని మాజీ క్రికెటర్ రమీజ్ రాజాతో భర్తీ చేయాలంటూ సరదాగా పీసీబీకి సూచించాడు.బాబర్ ఆజం బదులు రమీజ్ రాజా అయితే‘‘వాళ్లు(పాక్ జట్టు) ఎప్పుడు కష్టాల్లో ఉన్నా రమీజ్ రాజా కాపాడేవాడు. ఈసారి కూడా జట్టుకు సీఈఓవో అవుతాడేమో ఎవరికి తెలుసు?!..రమీజ్ రాజా ఇప్పటికీ ఫిట్‌గా ఉన్నాడు. బాబర్ ఆజంకు బదులు రమీజ్ రాజాను కెప్టెన్‌గా నియమించాలి’’ అని మంజ్రేకర్ సరదాగా వ్యాఖ్యానించాడు.కాగా మాజీ బ్యాటర్, 61 ఏళ్ల రమీజ్ రాజా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్(2021-2022)గా పనిచేసిన విషయం తెలిసిందే. అతడి హయాంలో బాబర్ ఆజం సారథ్యంలోని పాక్ జట్టు..2021 టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ చేరింది. అదే విధంగా 2022లో ఫైనల్ చేరి.. రన్నరప్‌గా నిలిచింది. చదవండి: అవును నిజమే.. నేను కూడా!: రోహిత్ శర్మతో గిల్.. పోస్ట్ వైరల్ -
Virat Kohli: కోహ్లి రోహిత్‌లా కాదు! అన్నీ తానే చేస్తానంటాడు..
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లికి ఉన్న ట్రాక్ రికార్డు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పొట్టి ఫార్మాట్ వరల్డ్‌కప్ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా ఈ రన్‌మెషీన్ కొనసాగుతున్నాడు.అత్యధిక పరుగుల వీరుడుప్రపంచకప్- 2012లో భాగంగా తొలిసారి టీమిండియా తరఫున టీ20 ప్రపంచకప్ బరిలో దిగిన కోహ్లి ఇప్పటి వరకు.. 25 ఇన్నింగ్స్ ఆడి 1141 పరుగులు సాధించాడు. ఈ ఐసీసీ ఈవెంట్లో అత్యధిక హాఫ్ సెంచరీల(50కి పైగా స్కోర్లు) రికార్డు కూడా కోహ్లి పేరిటే ఉంది.ఇక ఐపీఎల్-2024లో 741 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన ఈ ఆర్సీబీ బ్యాటర్.. ప్రస్తుతం టీ20 వరల్డ్‌కప్-2024కు సన్నద్ధమయ్యే పనిలో ఉన్నాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ విరాట్ కోహ్లిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.అన్నీ తానే అంటాడు‘‘కీలక మ్యాచ్‌లలో విరాట్ కోహ్లి అన్నీ తానై వ్యవహరించాలనుకోవడమే అన్నింటికంటే ఎక్కువగా ఆందోళన కలిగించే అంశం. భారం మొత్తం తానే మోస్తానంటాడు.గతంలో ఇలాంటివెన్నో చూశాం. స్వేచ్ఛగా బ్యాటింగ్ ఝులిపించడం కన్నా క్రీజులో ఎక్కువసేపు నిలబడటానికి ప్రాధాన్యం ఇస్తాడు. భారత క్రికెట్ జట్టులో తనకున్న స్థాయిని బట్టి అలా వ్యవహరిస్తాడేమో!కోహ్లి రోహిత్‌లా కాదురోహిత్ శర్మ మాత్రం ఇందుకు భిన్నం. అతడు ఫ్రీగా బ్యాటింగ్ చేయగలడు. అందుకే సెమీ ఫైనల్స్, ఫైనల్స్ వచ్చేసరికి కోహ్లిని చూస్తే కాస్త కంగారుగా అనిపిస్తుంది.నిజానికి టీ20 క్రికెట్లో యాంకర్(డిఫెన్సివ్) పాత్ర అవసరం లేదు. ముఖ్యంగా తొలుత మన జట్టు బ్యాటింగ్ చేస్తున్నపుడు అస్సలు అవసరం లేదు. వికెట్లు పడుతున్నాయి కదా.. ప్రత్యర్థి జట్టు బౌలర్‌కు కాస్త వెసలు బాటు ఇచ్చామంటే కనీసం రెండు ఓవర్లపాటు నష్టపోవాల్సి ఉంటుంది. అది జట్టుకు నష్టం చేకూరుస్తుంది’’ అని సంజయ్ మంజ్రేకర్ స్టార్ స్పోర్ట్స్ షోలో వ్యాఖ్యానించాడు. కీలక మ్యాచ్‌లలో కోహ్లి బంతులు వృథా చేస్తాడన్నదే తనకు ఆందోళన కలిగించే అంశమని పరోక్షంగా చెప్పుకొచ్చాడు.చదవండి: ట్రోఫీ గెలిచే వ్యూహాలే లేవు.. ఇకనైనా: ద్రవిడ్‌పై లారా సంచలన వ్యాఖ్యలు -
T20 WC: కోహ్లి, హార్దిక్ వద్దు.. ఊహించని ఆటగాడికి ఛాన్స్!
ఐపీఎల్-2024 ఫీవర్ ముగియగానే పొట్టి ప్రపంచకప్ రూపంలో క్రికెట్ ప్రేమికులకు మరో మెగా సమరం కనువిందు చేయనుంది. అమెరికా- వెస్టిండీస్ వేదికగా జూన్ 1 నుంచి టీ20 వరల్డ్‌కప్-2024 టోర్నీ ఆరంభం కానుంది.ఇక హాట్ ఫేవరెట్లలో ఒకటైన టీమిండియా జూన్ 5న ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో ఈ ఐసీసీ ఈవెంట్లో ప్రయాణం ఆరంభించనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు ప్రపంచకప్‌లో తలపడే భారత జట్టు గురించి తమ అభిప్రాయాలు పంచుకున్నారు.విరాట్ కోహ్లి, హార్దిక్ పాండ్యాకు నోఈ క్రమంలో రోహిత్ శర్మకు జోడీగా విరాట్ కోహ్లి టీమిండియా ఇన్నింగ్స్ ఆరంభిస్తే బాగుంటుందని మెజారిటీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన ఎంపికతో ముందుకు వచ్చాడు.తన జట్టులో రన్‌మెషీన్ విరాట్ కోహ్లికి చోటివ్వకపోగా.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు బదులు ఊహించని పేరును తెరమీదకు తెచ్చాడు. కాగా ఆర్సీబీ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న విరాట్ కోహ్లి ఇప్పటి వరకు ఆడిన 9 ఇన్నింగ్స్‌లో కలిపి 430 పరుగులు సాధించాడు.అత్యధిక పరుగుల వీరుడి జాబితాలో టాప్‌లో కొనసాగుతూ.. ప్రస్తుతానికి ఆరెంజ్ క్యాప్ తన వద్ద పెట్టుకున్నాడు. మరోవైపు హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా, ఆల్‌రౌండర్‌గా విఫలమవుతున్నా టీమిండియా వైస్ కెప్టెన్ హోదాలో చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి.ఊహించని ఆటగాళ్లకు చోటుఇక పాండ్యాతో ఇప్పటికే శివం దూబే పోటీపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ ఎంపిక చేసుకున్న జట్టులో కోహ్లితో పాటు హార్దిక్ పాండ్యా, శివం దూబేలకు చోటు దక్కలేదు. అంతేకాదు అనూహ్యంగా హార్దిక్ పాండ్యా సోదరుడు కృనాల్ పాండ్యాను మంజ్రేకర్ ఎంపిక చేసుకున్నాడు.అదే విధంగా లక్నో యువ సంచలనం, స్పీడ్‌గన్ మయాంక్ యాదవ్‌కు కూడా తన జట్టులో స్థానం కల్పించాడు. కాగా లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్య వహిస్తున్న లెఫ్టార్మ్ స్పిన్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా.. ఇప్పటి వరకు 6 ఇన్నింగ్స్‌లో 58 పరుగులు చేశాడు. అదే విధంగా.. 8 మ్యాచ్‌లలో కలిపి ఐదు వికెట్లు తీశాడు.టీ20 ప్రపంచకప్-2024కు సంజయ్ మంజ్రేకర్ ఎంచుకున్న భారత జట్టు:రోహిత్ శర్మ(కెప్టెన్), యశస్వి జైస్వాల్, సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్(వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, యజువేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆవేశ్ ఖాన్, హర్షిత్ రాణా, మయాంక్ యాదవ్, కృనాల్ పాండ్యా.చదవండి: T20 WC 2024: దాదాపు 900 రన్స్ చేశా.. నాకు చోటు ఇవ్వకపోతే: గిల్ కామెంట్స్ వైరల్ -
అవకాశాల్లేవు.. వరల్డ్‌కప్ జట్టులో మాత్రం అతడికి చోటివ్వండి!
ఐపీఎల్-2023.. ఆఖరి ఓవర్లో ఐదు సిక్సర్లతో జట్టును గెలిపించిన ఘనత.. ఆడిన 14 మ్యాచ్‌లలో కలిపి 474 పరుగులతో సత్తా చాటి ‘నయా ఫినిషర్’గా బిరుదు.. అదే ఏడాది ఆగష్టులో టీమిండియా తరఫున అరంగేట్రం.. ఇప్పటికే ఆటగాడు ఎవరో అర్థమైపోయి ఉంటుంది కదా.. అవును.. రింకూ సింగ్. కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున గతేడాది దంచికొట్టిన ఈ యూపీ లెఫ్టాండ్ బ్యాటర్.. సిక్సర్ల కింగ్‌గా పేరొందాడు. అదే జోష్‌లో టీమిండియా తలుపుతట్టి అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు భారత్ తరఫున 15 టీ20లు, రెండు వన్డేలు ఆడిన రింకూ ఆయా ఫార్మాట్లలో వరుసగా 356, 55 పరుగులు సాధించాడు. దేశవాళీ క్రికెట్లోనూ రాణించాడు. అయితే.. ఐపీఎల్-2024లో మాత్రం అతడికి ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రావడం లేదు. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్‌లలో కలిపి రింకూ 83 పరుగులు చేశాడు. రెండుసార్లు అజేయంగా నిలిచాడు. అయితే.. అతడి స్ట్రైక్‌రేటు(162.75) మెరుగ్గా ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అతడికి ఎక్కువగా బ్యాటింగ్ చేసే అవకాశం రావడం లేదు కాబట్టి.. సెలక్టర్లు రింకూ సింగ్ పేరును మర్చిపోరనే అనుకుంటున్నా. ఈ టోర్నీ తర్వాత అతడు నేరుగా టీమిండియాలో అడుగుపెట్టగల సత్తా కలిగిన వాడు. నిలకడైన ఆట తీరుతో ఆకట్టుకోవడం చూస్తున్నాం. టీమిండియా కీలక సభ్యుల్లో అతడూ ఒకడు. కొంతమంది స్టార్ల కంటే కూడా అద్భుతంగా ఆడగలిగినవాడు’’ అంటూ సంజయ్ మంజ్రేకర్.. టీ20 ప్రపంచకప్-2024 ఆడే భారత జట్టులో రింకూ సింగ్‌కు తప్పక చోటు కల్పించాలని సెలక్టర్లకు విజ్ఞప్తి చేశాడు. కాగా మే 26న ఐపీఎల్ పదిహేడో ఎడిషన్ ముగియనుండగా.. జూన్ 1 నుంచి వరల్డ్‌కప్ సమరం మొదలుకానుంది. పొట్టి ఫార్మాట్లో సాగే ఈవెంట్‌కు వెస్టిండీస్- అమెరికా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. జూన్ 5న ఐర్లాండ్‌తో మ్యాచ్‌తో టీమిండియా ఈ ఐసీసీ టోర్నీలో తమ ప్రయాణం ఆరంభించనుంది. చదవండి: హార్దిక్‌ను పట్టించుకోని ఆకాశ్.. రోహిత్ మాట విని అలా! వైరల్ వీడియో var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_7552012696.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
టీమిండియాకు మరో ఆణిముత్యం దొరికేశాడు.. వన్డేల్లో కూడా ఎంట్రీ పక్కా?
సర్ఫరాజ్ ఖాన్ అంతర్జాతీయ అరంగేట్రాన్ని ఘనంగా చాటుకున్నాడు. రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టుతో భారత తరపున టెస్టుల్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్.. తన తొలి మ్యాచ్‌లో అదరగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 62 పరుగులు చేసిన ఈ ముంబైకర్.. రెండో ఇన్నింగ్స్‌లో సైతం 68 పరుగులతో ఆజేయంగా నిలిచాడు. ఓవరాల్‌గా రెండో ఇన్నింగ్స్‌లు 130 పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసే అవకాశం ఉన్నప్పటకీ దురదృష్టవశాత్తూ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇక అరంగేట్రంలోనే అకట్టుకున్న సర్ఫరాజ్‌పై సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల వర్షం కురిపించాడు. భారత జట్టుకు సరైన మిడిలార్డర్ బ్యాటర్ దొరికేశాడని మంజ్రేకర్ కొనియాడాడు. "సర్ఫరాజ్ తన తొలి మ్యాచ్‌లోనే సంచలన ప్రదర్శన కనబరిచాడు. నా వరకు అయితే భారత్‌కు మరో అద్భుతమైన మిడిలార్డర్ బ్యాటర్ దొరికాడని అనుకుంటున్నాను. టెస్టుల్లోనే కాదు వన్డేల్లో కూడా సర్ఫరాజ్ మంచి ఎంపికనే. వైట్‌బాల్ ఫార్మాట్లో కూడా మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వచ్చి అద్బుతాలు సృష్టిస్తాడని భావిస్తున్నానని" ఎక్స్‌లో మంజ్రేకర్ రాసుకొచ్చాడు. కాగా సర్ఫరాజ్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో దుమ్మురేపి భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 46 మ్యాచ్‌లు ఆడిన ఈ ముంబై ఆటగాడు 70.91 సగటుతో 4042 పరుగులు చేశాడు. చదవండి: ధోని కెప్టెన్సీలో అరంగేట్రం.. రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా ఓపెనర్! I think India have found a very good 50 overs middle order batter option, to bat in the middle stages, with 5 fielders inside the circle, it’s Sarfraz Khan. — Sanjay Manjrekar (@sanjaymanjrekar) February 18, 2024 -
అది గతం.. ఇప్పుడు రోహిత్ మునుపటిలా లేడు: మంజ్రేకర్
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ శైలిపై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత రెండేళ్లలో హిట్‌మ్యాన్ అత్యుత్తమ టెస్టు బ్యాటర్‌గా ఎదిగాడని కొనియాడాడు. లెఫ్టార్మ్ పేసర్ల బౌలింగ్‌లో సమర్థవంతంగా ఆడలేడన్న అపవాదును చెరిపివేసుకున్నాడని ప్రశంసించాడు. కాగా వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్లో ఓటమి తర్వాత రోహిత్ శర్మ విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌తో హిట్‌మ్యాన్ మళ్లీ మైదానంలో అడుగుపెట్టనున్నాడు. ఇప్పటి వరకు సఫారీ గడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ గెలవలేదన్న అపఖ్యాతిని పోగొట్టడమే లక్ష్యంగా సన్నద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘లెఫ్టార్మ్ పేసర్ల బౌలింగ్‌లో రోహిత్ శర్మ బాగా ఆడలేడు అనేది గతం. గత రెండు మూడేళ్లలో అతడు తన బలహీనతలను అధిగమించాడు. మిచెల్ స్టార్క్, షాహిన్ ఆఫ్రిది బౌలింగ్‌లో అద్భుతంగా ఆడాడు. ప్రస్తుతం తను అత్యుత్తమ టెస్టు ప్లేయర్‌గా కనిపిస్తున్నాడు. గతేడాది ఇంగ్లండ్ పర్యటనలో అద్భుతంగా ఆడాడు. టెస్టు ఓపెనర్‌గా రాణిస్తూ ఇంగ్లండ్ గడ్డ మీద సెంచరీ చేయడంతో పాటు టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు. గంటల కొద్దీ క్రీజులో నిలబడి ఓపికగా ఆడాడు. ఇక ముందు లెఫ్టార్మ్ పేసర్లను అతడు విజయవంతంగా ఎదుర్కోవడం మనం చూస్తాం’’ అని పేర్కొన్నాడు. సౌతాఫ్రికా పర్యటనలో రోహిత్ శర్మ తప్పక రాణిస్తాడని సంజయ్ మంజ్రేకర్ ధీమా వ్యక్తం చేశాడు. కాగా డిసెంబరు 26న సౌతాఫ్రికా- భారత్ మధ్య తొలి టెస్టు మొదలుకానుంది. చదవండి: పెళ్లిళ్లు అక్కడే నిశ్చయమవుతాయంటారు: చహల్ భావోద్వేగం -
ఐపీఎల్ వేలంలో అతడు హాట్‌కేక్.. కెప్టెన్ చేసినా నో సర్ఫ్రైజ్
ఐపీఎల్-2024 మినీ వేలానికి సర్వం సిద్దమైంది. డిసెంబర్ 19న దుబాయ్ వేదికగా ఈ క్యాష్ రిచ్ లీగ్ వేలం జరగనుంది. ఈ వేలం నేపథ్యంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ కోసం పోటీపడే జట్లను భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ ఎంచుకున్నాడు. పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీలు కమ్మిన్స్ కోసం పోటీ పడనున్నట్లు మంజ్రేకర్ జోస్యం చెప్పాడు. కాగా వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్-2023కు దూరంగా ఉన్న కమ్మిన్స్.. ఐపీఎల్-2024 వేలంలో మాత్రం తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు. ఈ క్రమంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కమ్మిన్స్పై కాసుల వర్షం కురిసే ఛాన్స్ ఉంది. "ప్యాట్ కమ్మిన్స్‌కు పిచ్ పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్ చేసే సత్తా ఉంది. అతడొక ఎక్స్ ఫ్యాక్టర్. ప్రస్తుతం కొన్ని ఐపీఎల్ ఫ్రాంచైజీలు మంచి నాయకులు కోసం వెతుకుతున్నాయి. వేలంలో అతడిని దక్కించుకోనుందుకు సన్‌రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలు పోటీ పడే అవకాశం ఉంది. ఎస్ఆర్హెచ్కు మార్క్రమ్, పంజాబ్ కింగ్స్‌కు ధావన్ కెప్టెన్లగా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో కెప్టెన్‌గా కమ్మిన్స్ ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఈ నేపథ్యంలో పంజాబ్, ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీలు తమ జట్టు పగ్గాలు అప్పగించిన ఆశ్యర్యపోవాల్సిన అవసరం లేదని" స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ పేర్కొన్నాడు . కాగా కమ్మిన్స్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్‌ను కమ్మిన్స్ సారథ్యంలోని ఆసీస్ సొంతం చేసుకుంది. అదే విధంగా ఐపీఎల్లో కూడా కమ్మిన్స్‌కు మంచి రికార్డు ఉంది. ఐపీఎల్లో 42 మ్యాచ్‌లు ఆడిన కమ్మిన్స్ 379 పరుగులతో పాటు 45 వికెట్లు సాధించాడు. చదవండి: అతడొక అద్భుతం.. పాక్ క్రికెట్లో లెజెండ్ అవుతాడు: గంభీర్ -
WC 2024: శ్రేయస్‌ను వన్‌డౌన్‌లో ఆడించాలి.. గిల్, జైశ్వాల్‌కు మరో ఛాన్స్!
South Africa vs India, 3rd T20I: సౌతాఫ్రికాతో టీమిండియా మూడో టీ20 నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక సూచనలు చేశాడు. తుది జట్టు కుర్పు ఎలా ఉండాలన్న అంశంపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. టీ20 వరల్డ్‌కప్-2024 టోర్నీకి సన్నద్ధమయ్యే క్రమంలో మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను టాపార్డర్‌కు ప్రమోట్ చేయాలని సూచించాడు. వన్‌డౌన్‌లో అయ్యర్‌ను ఆడిస్తే మంచి ఫలితాలు రాబట్టవచ్చని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. మంగళవారం ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ జరిగింది. పోర్ట్ ఎలిజబెత్ వేదికగా జరిగిన ఈ టీ20కి అనారోగ్య కారణాల దృష్ట్యా రుతురాజ్ గైక్వాడ్ దూరం కాగా.. స్టార్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్ అతడి స్థానంలో ఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు.. శ్రేయస్ అయ్యర్‌కు సైతం మేనేజ్మెంట్ విశ్రాంతినివ్వడంతో హైదరాబాదీ స్టార్ తిలక్ వర్మ తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. అదే విధంగా ఈ మ్యాచ్‌తో రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్ వంటి సీనియర్లు కూడా రీఎంట్రీ ఇచ్చారు. అయితే, ఈ మ్యాచ్‌లో మెరుగైన స్కోరు సాధించినప్పటికీ టీమిండియాకు ఓటమి తప్పలేదు. సౌతాఫ్రికా బ్యాటర్లలో ఓపెనర్ రీజా హెండ్రిక్స్, కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ అద్భుత ప్రదర్శనతో తమ జట్టుకు విజయం అందించారు. ఈ క్రమంలో ఇరు జట్ల మధ్య గురువారం నాటి ఆఖరి టీ20 సిరీస్ విజేతను నిర్ణయించడంలో కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఈఎస్ఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘శ్రేయస్ అయ్యర్‌ను నంబర్ 3 బ్యాటర్‌గా చూడాలని కోరుకుంటున్నా. ప్రస్తుత మ్యాచ్‌లో తిలక్ వర్మ వన్‌డౌన్‌లో వచ్చి బాగానే ఆడాడు. కానీ దీర్ఘకాలంలో అతడు నిలకడగా ఆడతాడా లేదా అన్నదే ప్రశ్న. కాబట్టి శ్రేయస్ అయ్యర్‌ను టాపార్డర్‌కు ప్రమోట్ చేస్తే ఐసీసీ టోర్నీ నాటికి పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యే అవకాశం ఉంటుంది. రెండో టీ20లో శుబ్‌మన్ గిల్, యశస్వి జైశ్వాల్ డకౌట్ కావడం ప్రభావం చూపింది. అయినప్పటికీ వాళ్లు మరో మ్యాచ్ కచ్చితంగా ఆడగలరు. మేనేజ్మెంట్ వాళ్లకు అవకాశం ఇస్తుందనే భావిస్తున్నా. అయితే, సిరీస్ విజేతను తేల్చే మ్యాచ్ కావడంతో మూడో టీ20లో రుతురాజ్ గైక్వాడ్‌ను ఆడించినా ఆశ్చర్యపోనక్కర్లేదు’’ అని పేర్కొన్నాడు. ఇక వరల్డ్‌కప్ నాటికి రోహిత్ శర్మ అందుబాటులో లేకుంటే హార్దిక్ పాండ్యాకే సారథిగా వ్యవహరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సంజయ్ మంజ్రేకర్ ఈ సందర్భంగా అభిప్రాయపడ్డాడు. కాగా గత ఏడాది కాలంగా రోహిత్ అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉండగా పాండ్యా చేతికి టీ20 పగ్గాలు వచ్చాయి. అయితే, వన్డే వరల్డ్‌కప్-2023 సందర్భంగా గాయపడిన పాండ్యా కోలుకోకపోవడంతో సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం ఆ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. -
WC 2023: అతడిని రిటైర్ కాకుండా చూడాలని పిటిషన్ వేస్తా: భారత మాజీ బ్యాటర్
సౌతాఫ్రికా స్టార్ బ్యాటర్ క్వింటన్ డికాక్ వన్డే వరల్డ్‌కప్-2023 టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచ్‌లలో ఈ ఓపెనింగ్ బ్యాటర్ మూడు సెంచరీలు బాదాడు. ఆరంభ మ్యాచ్‌లో శ్రీలంకపై శతక్కొట్టిన డికాక్.. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లోనూ 109 పరుగులు సాధించాడు. ఇలా మెగా టోర్నీ మొదట్లో వరుస సెంచరీలతో ఆకట్టుకున్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఆ తర్వాతి రెండు మ్యాచ్‌లలో విఫలమయ్యాడు. అయితే, బంగ్లాదేశ్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో మాత్రం మరోసారి విశ్వరూపం ప్రదర్శించాడు డికాక్. ముంబైలోని వాంఖడే మైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. అద్భుతమైన షాట్లతో అలరిస్తూ ప్రేక్షకులకు టీ20 మాదిరి వినోదం అందించాడు ఈ లెఫ్టాండ్ బ్యాటర్. ఈ క్రమంలో పలు రికార్డులు నమోదు చేసిన డికాక్.. సౌతాఫ్రికా విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా శరీరం సహకరించకపోవడం.. ఇకపై లీగ్ మ్యాచ్‌లపై ఎక్కువగా దృష్టి సారించే క్రమంలో వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలుకనున్నట్లు క్వింటన్ డికాక్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్ ముగిసిన తర్వాత రిటైర్ అవ్వబోతున్నట్లు.. టోర్నీ ఆరంభానికి ముందే డికాక్ తెలియజేశాడు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సందర్భంగా క్వింటన్ డికాక్ అద్భుత ఇన్నింగ్స్ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘అతడి బ్యాటింగ్ సూపర్. తన అద్భుతమైన నైపుణ్యాలతో అదరగొట్టాడు. నేనైతే సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుకు ఓ పిటిషన్ సమర్పించాలనుకుంటున్నా. వరల్డ్‌కప్ టోర్నీ ముగిసిన తర్వాత డికాక్ రిటైర్ అవకుండా చూడాలని హామీ ఇమ్మని కోరతా. ఎందుకంటే.. అతడు రిటైర్ అయిపోతే.. 50 ఓవర్ల క్రికెట్లో ఇలాంటి మజాను మనకు ఎవరు అందిస్తారు?’’ అంటూ కామెంటేటర్ మంజ్రేకర్ సౌతాఫ్రికా బ్యాటర్‌ను ఆకాశానికెత్తాడు. ఇందుకు స్పందించిన మరో కామెంటేటర్, సౌతాఫ్రికా మాజీ సారథి ఫాఫ్ డుప్లెసిస్ సైతం.. ‘‘అవును.. తను వయసులో ఇంకా చిన్నవాడే. అంతేకాదు.. కెరీర్లో ఇప్పుడు అత్యుత్తమ దశలో ఉన్నాడు. కానీ ప్రపంచ క్రికెట్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్ల నేపథ్యంలో డికాక్‌తో పాటు చాలా మంది ఆటగాళ్లు వన్డే ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా నువ్వు పిటిషన్ వేస్తానంటే నేను కూడా దానిపై తప్పకుండా సంతకం చేస్తా’’ అని సంజయ్ మంజ్రేకర్‌తో వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే.. ముంబై మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు బంగ్లాదేశ్‌ను 149 పరుగుల తేడాతో చిత్తు చేసిన విషయం తెలిసిందే. View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
Asia Cup: పాకిస్తాన్‌తో మ్యాచ్.. తిలక్ వర్మ అరంగేట్రం ఫిక్స్!
Asia Cup 2023- India Vs Pakistan: ఆసియా కప్-2023లో టీమిండియా ఆరంభ మ్యాచ్‌లో యువ సంచలనం తిలక్ వర్మకు తుదిజట్టులో చోటివ్వాలని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. ఈ లెఫ్టాండ్ బ్యాటర్‌ను ఆడిస్తే జట్టుకు ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా వెస్టిండీస్ పర్యటన సందర్భంగా హైదారాబాదీ స్టార్ తిలక్ వర్మ టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. టాప్ స్కోరర్.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో మొత్తంగా 173 పరుగులతో టీమిండియా టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజాల దృష్టిని ఆకర్షించిన తిలక్ వర్మ.. ఒక్క వన్డే కూడా ఆడకుండానే ఏకంగా ఆసియా కప్ వంటి మెగా ఈవెంట్ జట్టులో స్థానం సంపాదించాడు. అందుకే తిలక్‌కు స్థానం మిడిలార్డర్లో కీలకమైన నాలుగో స్థానంలో లెఫ్టాండర్‌గా రాణించడం.. మిగతా వాళ్లతో పోలిస్తే తిలక్‌కు ఉన్న అదనపు అర్హతగా మారింది. ఈ నేపథ్యంలో అతడిని ఈ వన్డే టోర్నీకి ఎంపిక చేసినట్లు బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ కూడా తెలిపాడు. ఇదిలా ఉంటే.. శ్రీలంక వేదికగా సెప్టెంబరు 2న పాకిస్తాన్‌తో ఈ ఈవెంట్లో రోహిత్ సేన తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఈ క్రమంలో పల్లెకెలె మ్యాచ్‌లో తిలక్ వర్మను తప్పక ఆడించాలంటూ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. లెఫ్టాండర్‌గా తిలక్.. జట్టుకు ప్రయోజనకరం పాక్‌తో మ్యాచ్‌కు తన తుదిజట్టును ఎంచుకున్న సందర్భంగా.. ‘‘ నా జట్టులో ముగ్గురు సీమర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీకి చోటిస్తాను. నాలుగో సీమర్‌గా హార్దిక్ పాండ్యా ఉంటాడు. ఇక స్పిన్నర్లుగా జడేజా, కుల్దీప్ ఉండనే ఉన్నారు. నా ఓపెనర్లుగా శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మలకు అవకాశమిస్తాను. నంబర్ 3లో విరాట్ కోహ్లి. వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌ను తీసుకుంటాను.ఇక మిడిలార్డర్లో శ్రేయస్ అయ్యర్ లేదంటే తిలక్ వర్మలో ఒకరు. అయితే, వీరిద్దరిలో టీమిండియా మొదటి ప్రాధాన్యం తిలక్ వర్మకే ఉండాలంటాను. ఎందుకంటే.. టాప్-7 బ్యాటర్లలో హార్దిక్ పాండ్యాను కలుపుకొని అందరూ కుడిచేతి వాటం గల బ్యాటర్లే. అదే ప్రధాన సమస్య కాబట్టి లెఫ్టాండర్ అయిన తిలక్ వర్మను మిడిలార్డర్లో ఆడించాలి. అయితే, అతడిని ఏ స్థానంలో రప్పించాలి అనేదే టీమిండియాకు ఇప్పుడున్న సమస్య’’ అని ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో చర్చలో సంజయ్ మంజ్రేకర్ జట్టు కూర్పుపై తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా శ్రేయస్ అయ్యర్ ఇటీవలే గాయం నుంచి పూర్తిగా కోలుకుని పునరాగమనం చేయనున్నాడు. అయితే, అతడు వంద శాతం ఫిట్‌గా ఉన్నాడని చెప్పినప్పటికీ మ్యాచ్ సమయానికి ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు.. కాబట్టి తిలక్ అరంగేట్రం ఖాయమని అభిమానులు ఫిక్సయిపోయారు. కానీ, కేఎల్ రాహుల్ పూర్తి ఫిట్‌గా లేడు కాబట్టి లెఫ్టాండర్ ఇషాన్ కిషన్ వికెట్ కీపర్‌గా వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో ఒకవేళ అయ్యర్ ఉంటే.. తిలక్‌కు మొండిచేయి ఎదురుకావచ్చని విశ్లేషకులు అంటున్నారు. ఆసియా కప్-2023లో పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు సంజయ్ మంజ్రేకర్ ఎంచుకున్న జట్టు రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్/ తిలక్ వర్మ, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్. చదవండి: యో- యో టెస్టులో పాసయ్యాను.. ఫొటో షేర్ చేసిన కోహ్లి! స్కోరెంతంటే.. -
అతడికి టెస్టుల్లో అవకాశం ఇవ్వండి.. మార్క్‌వుడ్ మాదిరే: మాజీ క్రికెటర్
India tour of West Indies, 2023: కశ్మీర్ ఎక్స్‌ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ గతేడాది జూన్‌లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ యువ పేసర్.. క్యాష్ రిచ్ లీగ్‌లో అద్భుత ప్రదర్శనతో జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు. చిరుతలాంటి వేగంతో బంతులు సంధిస్తూ తనదైన శైలిలో రాణిస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ఐర్లాండ్‌తో టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఉమ్రాన్.. న్యూజిలాండ్‌తో మ్యాచ్ ద్వారా వన్డేల్లోనూ అడుగుపెట్టాడు. అయితే, గత కొంతకాలంగా నిలకడలేమి ప్రదర్శనతో సతమతమవుతున్నాడు. ఐపీఎల్-2023లోనూ ఆకట్టుకోలేకపోయాడు. ఆడిన 8 మ్యాచ్‌లలో కేవలం 5 వికెట్లు మాత్రమే తీశాడు. విండీస్‌తో టీ20 సిరీస్‌లో అయినప్పటికీ వెస్టిండీస్ టీ20 సిరీస్ నేపథ్యంలో ఉమ్రాన్ మాలిక్‌కు చోటు దక్కడం విశేషం. అయితే, అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్‌లతో కూడిన పేస్ దళంలో భాగమైన ఈ కశ్మీరీ స్పీడ్‌స్టర్‌కు తుదిజట్టులో అవకాశం వస్తుందో లేదో చూడాలి!! ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో రాణిస్తున్న ఉమ్రాన్‌ను టెస్టు జట్టుకు ఎప్పుడు ఎంపిక చేస్తారని సెలక్టర్లను ప్రశ్నించాడు. ఉమ్రాన్‌ను ఇంగ్లండ్ పేసర్ మార్క్‌వుడ్‌తో పోల్చిన మంజ్రేకర్.. టెస్టుల్లో అతడికి అవకాశం ఇస్తే చెలరేగిపోతాడని జోస్యం చెప్పాడు. ఎక్స్ ఫ్యాక్టర్ కాగలడు ఈ మేరకు.. ‘‘టెస్టు క్రికెట్ జట్టుకు ఉమ్రాన్‌ను తప్పకుండా ఎంపిక చేయాలి. మార్క్‌వుడ్ గంటకు 90 మైళ్లకు పైగా వేగంతో బౌలింగ్ చేయగల సమర్థుడు. టెయిలెండర్లను ఎక్కువ సేపు క్రీజులో నిలవనివ్వడు. అదే అతడి స్పెషాలిటీ. ఉమ్రాన్ మాలిక్ విషయంలో పునరాలోచన చేయాలి. మార్క్‌వుడ్ మాదిరే వేగంతో బౌలింగ్ చేయగలడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో అతడికి అవకాశాలు ఇవ్వడం బాగానే ఉంది. అయితే, టెస్టుల్లోనూ ఆడిస్తే వైవిధ్యమైన పేస్‌తో టీమిండియా బౌలింగ్ విభాగంలో అతడు ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారే అవకాశం ఉంది’’ అని సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. కాగా టీమిండియా ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. జూలై 12 నుంచి ఇరు జట్ల మధ్య టెస్టు సిరీస్ ఆరంభమైంది. తొలి మ్యాచ్ తొలిరోజు ఆటలో టీమిండియా పైచేయి సాధించింది. ఇక ఆగష్టు 13నాటి ఐదో టీ20తో ఈ టూర్ ముగియనుంది. చదవండి: Ind Vs WI: మనం తప్పు చేశామా అని పశ్చాత్తాపపడేలా చేశాడు! తొలిరోజే -
డబుల్ సెంచరీ సాధించినా నో ఛాన్స్! రాహుల్ వచ్చేంతవరకు అతడే బెటర్
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్లు కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ గాయాల కారణంగా జట్టుకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వీరిద్దరూ లేని లోటు భారత జట్టులో స్పష్టంగా కన్పిస్తోంది. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావసం పొందుతున్న వీరిద్దరూ.. ఈ ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్‌తో తిరిగి మైదానంలో అడుగుపెట్టే అవకాశం ఉంది. అయితే వన్డే ప్రపంచకప్‌కు పంత్, రాహుల్ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. యువ ఆటగాడు ఇషాన్ కిషన్‌ను బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఎంపిక చేయాలని భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా ప్రపంచకప్‌కు ముందు భారత్ ఆడనున్న అన్నీ పరిమిత ఓవర్ల సిరీస్‌లో కిషన్‌కు అవకాశం ఇవ్వాలని అతడు సూచించాడు. కాగా కిషన్ ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా బ్యాకప్ వికెట్ కీపర్‌గా ఉన్నాడు. త్వరలో వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లలో వికెట్ కీపర్‌గా కిషన్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఇటీవలే జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైనప్పటికి తుది జట్టులో మాత్రం చోటు దక్కలేదు. అతడి స్థానంలో శ్రీకర్ భరత్‌కు జట్టు మెనెజ్‌మెంట్ అవకాశం ఇచ్చింది. కానీ భరత్ మాత్రం తీవ్ర నిరాశ పరిచాడు. ఈ నేపథ్యంలో ఆకాష్ చోప్రా మాట్లాడుతూ.. "ఇషాన్ కిషన్ అద్భుతమైన లెఫ్ట్‌హ్యాండ్ బ్యాటర్. అతడికి ఓపెనర్‌గా వచ్చి విధ్వంసం సృష్టించే సత్తా ఉంది. అదే విధంగా లోయార్డర్‌లో కూడా ఆడగలడు. అటువంటి ఆటగాడికి కచ్చితంగా అవకాశం ఇవ్వాలి. పాపం కిషన్.. డబుల్ సెంచరీ సాధించిన తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. మిగితా ఆటగాళ్లు ఫిట్నెస్ సాధించేంతవరకు రెగ్యూలర్‌గా కిషన్‌తో ముందుకుపోవాలి. రాహుల్ సాధరణంగా వన్డేల్లో ఐదు లేదా ఆరో స్ధానంలో బ్యాటింగ్‌కు వస్తాడు. కిషన్‌ను కూడా ఆ స్ధానంలో బ్యాటింగ్‌కు పంపాలి. రాహుల్ ఫిట్నెస్ సాధించేంతవరకు ఇషాన్ కిషన్ మంచి ఎంపిక అని" తన యూట్యూబ్ ఛానల్లో సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు. చదవండి: డబ్ల్యూటీసీ గాయాన్ని మళ్లీ రేపిన అశ్విన్! ధోని కెప్టెన్సీ అలా ఉంటుంది కాబట్టే! రోహిత్, ద్రవిడ్‌పై విసుర్లు! -
#SKY: టీ20 మాస్టర్‌క్లాస్ చూశాను! నా కళ్ల ముందే.... వారెవ్వా!
IPL 2023- Suryakumar Yadav: ముంబై ఇండియన్స్ బ్యాటర్, టీమిండియా టీ20 స్టార్ సూర్యకుమార్ యాదవ్‌పై భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల జల్లు కురిపించాడు. వాంఖడే స్టేడియంలో మాస్టర్‌క్లాస్ టీ20 సెంచరీ తనకు కనులవిందు చేసిందని పేర్కొన్నాడు. అద్భుత ఇన్నింగ్స్ చూసిన ఆ సమయంలో ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యానని తెలిపాడు. కాగా ఐపీఎల్-2023 ఆరంభంలో సూర్యకుమార్ యాదవ్ స్థాయికి తగ్గట్లు రాణించలేక చతికిలపడ్డాడు. అయితే, ఆ తర్వాత బ్యాట్ ఝులిపించిన సూర్య కీలక మ్యాచ్‌లలో ముంబై ఇండియన్స్‌కు విజయాలు అందించాడు. తొలి సెంచరీ ఇక లీగ్ దశలో మే 12న వాంఖడే స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో సూర్య ఆడిన ఇన్నింగ్స్ అన్నింటిలోకి హైలైట్‌గా నిలిచింది. 49 బంతుల్లో 103 పరుగులతో అజేయంగా నిలిచిన మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్.. ఐపీఎల్లో తన తొలి సెంచరీ నమోదు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, 6 సిక్సర్లు ఉండటం విశేషం. ఈ మ్యాచ్‌లో ముంబై 27 పరుగుల తేడాతో గుజరాత్‌పై గెలుపొందగా.. సూర్య ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్నాడు. నాటి జ్ఞాపకాలను తాజాగా గుర్తు చేసుకున్నాడు కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్. టీ20 మాస్టర్‌క్లాస్ చూశాను ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ.. ‘‘వాంఖడే మైదానంలో నా కళ్ల ముందు సూర్యకుమార్ బాదిన ఆ సెంచరీ అద్భుతం. టీ20 మాస్టర్‌క్లాస్ చూశాను. టీ20 భవిష్యత్ ఆశాకిరణం కనిపించింది. ఆరోజు సూర్య ఇన్నింగ్స్ అమోఘం. అసలు ఇది నిజంగా జరిగిందా లేదా అనే సందేహంలో ఉండిపోయా. ఆశ్చర్యంతో అలా చూస్తుండిపోయా’’ అంటూ మంజ్రేకర్.. సూర్యను ఆకాశానికెత్తాడు. కాగా ఐపీఎల్-2023లో ప్లే ఆఫ్స్ చేరిన ముంబై ఇండియన్స్.. క్వాలిఫయర్-2లో గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయింది. తద్వారా టోర్నీ నుంచి రిక్తహస్తాలతో నిష్క్రమించింది. ఇక రిజర్వ్‌డే (మే 29) నాటి ఫైనల్లో గుజరాత్‌ను ఓడించి చెన్నై సూపర్ కింగ్స్ ఐదోసారి చాంపియన్‌గా అవతరించింది. అత్యధిక విజయాలు అందుకున్న జట్టుగా ముంబై ఇండియన్స్ పేరిట ఉన్న రికార్డును సమం చేసింది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2023 సీజన్లో సూర్య 16 ఇన్నింగ్స్‌లలో కలిపి 605 పరుగులు సాధించాడు. ఇందులో ఐదు అర్థ శతకాలు , ఒక సెంచరీ ఉంది. అత్యధిక స్కోరు 103 నాటౌట్. చదవండి: SL Vs AFG: లంకతో వన్డే సిరీస్.. అఫ్గనిస్తాన్‌కు ఊహించని షాక్! ఆనందంలో సీఎస్కే ఆల్‌రౌండర్.. సర్ జడేజాకు థాంక్స్! పోస్ట్ వైరల్ A 💯 that wowed teammates, fans and opponents alike 🤩 Take a bow #SuryakumarYadav 👏#MIvGT #IPLonJioCinema | @surya_14kumar pic.twitter.com/kwUuMfTGKz — JioCinema (@JioCinema) May 12, 2023 -
గిల్‌ను ఆపాలంటే అదొక్కటే మార్గం.. లేదంటే కష్టమే!
ఐపీఎల్-2023 ఫైనల్‌కు అంతా సిద్దమైంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న టైటిల్ పోరులో చెన్నైసూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ తలడనున్నాయి. ఈ మ్యాచ్‌లో అందరి దృష్టి గుజరాత్ ఓపెనర్ శుబ్‌మన్ గిల్‌పైనే ఉంది. టోర్నీ ఆసాంతం దుమ్మురేపిన గిల్.. కీలకమైన ఫైనల్లో ఎలా రాణిస్తాడో అందరూ వెయ్యికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక తుదిపోరుకు ముందు చెన్నై సూపర్ కింగ్స్‌కు భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కొన్ని విలువైన సూచనలు చేశాడు. ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్‌ను ఎదుర్కోవడానికి తమ ఇద్దరు స్పిన్నర్లలో ఒకరిని ముందుగానే ఉపయోగించుకోవాలని మంజ్రేకర్ సలహా ఇచ్చాడు. "ధోని తమ బౌలింగ్ ఎటాక్‌ను ఎలాగో పేసర్ దీపక్ చాహర్‌తో ప్రారంభిస్తాడు. అతడు బంతిని అద్భుతంగా స్వింగ్ చేస్తాడు కాబట్టి వికెట్లు సాధించే ఛాన్స్ ఉంటుంది. అయితే గిల్ ఫాస్ట్‌బౌలర్లను అద్భుతంగా ఎదుర్కొంటాడు. కానీ స్పిన్నర్లను ఆడడంలో కాస్త ఇబ్బంది పడతాడు. కాబట్టి చెన్నై కొంచెం ముందుగా వారి స్పిన్నర్లను తీసుకువస్తే బాగుంటుంది. అంతే తప్ప దేశ్‌పాండే బౌలింగ్‌ను గిల్ ఈజీగా మెనెజ్చేయగలడు. కాబట్టి తీక్షణ వంటి మణికట్టు స్పిన్నర్లు బౌలింగ్ చేస్తే గిల్ వికెట్ సాధించవచ్చు. ఆతర్వాత జడేజా తన పని తను చేసుకుపోతాడు" అని స్పోర్ట్స్ కీడాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. చదవండి: Shubman Gill: గావస్కర్, సచిన్, కోహ్లితో ఇప్పుడే పోలికలు వద్దు.. వచ్చే సీజన్లోనూ: టీమిండియా దిగ్గజం -
రూ. 13 కోట్లు పెట్టారు కదా! ఇలాగే ఉంటది.. కానీ పాపం: భారత మాజీ క్రికెటర్
IPL 2023- SRH- Harry Brook: ‘‘ఐపీఎల్ వేలం జరిగిన ప్రతిసారి నా దృష్టి విదేశీ ఆటగాళ్లపై కూడా ఉంటుంది. ముఖ్యంగా ఇంగ్లిష్ ప్లేయర్లు.. వారికి లభించే మొత్తాలను గమనిస్తూ ఉంటా. అందుకు తగ్గట్లే వాళ్లు ఐపీఎల్లో మెరుగైన ప్రదర్శన కనబరుస్తారని ఆశిస్తా. కానీ, వారి విషయంలో నా అంచనాలు చాలా వరకు తలకిందులు అయ్యాయి. ఉపఖండ పిచ్‌లపై.. ఐపీఎల్ వంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో.. భారీ ప్రైస్ ట్యాగ్ల నేపథ్యంలో నెలకొన్న అంచనాలు అందుకోవడం అంత తేలికేమీ కాదు. ఇంగ్లండ్ ఆటగాళ్లలో అతికొద్ది మంది మాత్రమే ఐపీఎల్లో ఒత్తిడి అధిగమించి తమను తాము నిరూపించుకున్నారు. అయితే, ఆస్ట్రేలియన్లు, వెస్టిండీస్, సౌతాఫ్రికా క్రికెటర్ల పరిస్థితి ఇందుకు భిన్నం. వారు ఇక్కడి పరిస్థితులు, ఐపీఎల్ ఫార్మాట్‌ను సరిగ్గా అర్థం చేసుకుని ముందుకు సాగుతున్నారు. కానీ ఇంగ్లిష్ ఆటగాళ్లు మాత్రం ఇంకా వారిలా అదరగొట్టలేకపోతున్నారు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. కోట్లు కుమ్మరించారు ఐపీఎల్-2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓటమి నేపథ్యంలో మంజ్రేకర్ ఈ మేరకు స్టార్ స్టోర్స్ షోలో మాట్లాడుతూ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. హైదరాబాద్ ఫ్రాంఛైజీ కోట్లు కుమ్మరించి కొనుగోలు చేసిన ఇంగ్లండ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అవే బ్రూక్‌ను ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాయి బ్రూక్ త్వరలోనే తనదైన శైలిలో చెలరేగాలని ఆశిస్తున్నట్లు మంజ్రేకర్ పేర్కొన్నాడు. ‘‘హ్యారీ బ్రూక్ ఫామ్‌లోకి వస్తాడనే అనుకుంటున్నా? అయితే అది ఎప్పుడంటే మాత్రం కచ్చితంగా చెప్పలేను. ఇందుకు మరో రెండు మ్యాచ్‌లు లేదంటే మూడు మ్యాచ్‌ల సమయం పట్టొచ్చు. తన బలమేంటో తెలుసుకుని.. తన నైపుణ్యాలు ప్రదర్శించగలుగుతాడు. ప్రస్తుతం అతడిపై అధిక ధర పలికిన ప్లేయర్ అనే ట్యాగ్.. చుట్టూ జనాల అంచనాలు.. భారత పిచ్‌లపై బౌలర్లను ఎలా ఎదుర్కోవాలో తెలియని అనుభవలేమి ఒత్తిడిని పెంచుతున్నాయి. వీటిని అధిగమిస్తే బ్రూక్ తప్పకుండా రాణించగలడు’’ అంటూ మంజ్రేకర్ హ్యారీ బ్రూక్‌కు అండగా నిలబడ్డాడు. 13 కోట్ల రూపాయలు పలికిన పవర్ హిట్టర్.. ఐపీఎల్లో ఇలా 24 ఏళ్ల బ్రూక్ బిగ్ హిట్టర్‌గా పేరొందాడు. గతేడాది 6 టెస్టులు ఆడి ఏకంగా నాలుగు సెంచరీలు సాధించాడు. అరంగేట్రంలోనే శతకం బాది తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. ఇప్పటి వరకు ఇంగ్లండ్ తరఫున 20 టీ20లు ఆడిన ఈ రైట్ హ్యాండ్ బ్యాటర్ 372 పరుగులు చేశాడు. ఇక ఐపీఎల్- 2023 మినీ వేలంలో సన్‌రైజర్స్ అతడి కోసం ఇతర ఫ్రాంఛైజీలతో పోటీపడి ఏకంగా 13.25 కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేసింది. కానీ ఇప్పటి వరకు ఆడిన రెండు మ్యాచ్‌లలో ఈ సన్‌రైజర్స్ బ్యాటర్ పూర్తిగా విఫలమయ్యాడు. రాజస్తాన్, లక్నోలతో మ్యాచ్‌లలో కలిపి 16 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిపై విమర్శలు వెల్లువెత్తుతుండగా మంజ్రేకర్ ఈ మేరకు అండగా నిలవడం గమనార్హం. చదవండి: సీఎస్కేతో మ్యాచ్.. సచిన్ కొడుకు ఐపీఎల్ ఎంట్రీ! ఎయిడెన్ అన్న, బ్రూక్ వల్లే ఇదంతా! సాకులు వెతుక్కోవద్దన్న లారా.. బ్యాటర్లపై ఫైర్! ఎవరు బాబు నీవు.. వెళ్లి టెస్టులు ఆడుకో పో! అక్కడ కూడా పనికి రాడు -
Ind Vs Aus: నా దృష్టిలో నిజమైన హీరో జడేజా! నువ్వేనా ఈ మాట అన్నది?
‘‘పరిమిత ఓవర్ల క్రికెట్లో చాలా కాలం తర్వాత టీమిండియా.. బౌలింగ్ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. మిచెల్ మార్ష్ అద్భుత బ్యాటింగ్ చూసి.. ఆస్ట్రేలియా కచ్చితంగా 350 పరుగుల మార్కు దాటుతుందని అనుకున్నాం. కానీ.. టీమిండియా బౌలర్లు వారిని కట్టడి చేశారు. షమీ, సిరాజ్ వికెట్లు తీశారు. అయితే... నా దృష్టిలో మాత్రం నిజమైన హీరో రవీంద్ర జడేజా’’..... ఆస్ట్రేలియాతో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా విజయంతో ఆరంభించిన విషయం తెలిసిందే. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత జట్టుకు పేసర్ మహ్మద్ సిరాజ్.. 5 పరుగులకే ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను పెవిలియన్‌కు పంపి శుభారంభం అందించాడు. అయితే, మరో ఓపెనర్ మార్ష్ ఆ సంతోషాన్ని ఎక్కువ సేపు నిలువనీయలేదు.. 10 బౌండరీలు, 5 సిక్సర్ల సాయంతో 81 పరుగులు చేశాడు. అతడి దూకుడు చూస్తే ఆసీస్ భారీ స్కోరు చేయడం ఖాయమనిపించింది. కీలక సమయంలో రాణించి కానీ.. భారత పేసర్లు సిరాజ్, షమీ కలిసి ప్రత్యర్థి బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. షమీ ఆరు ఓవర్ల బౌలింగ్‌లో 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టగా.. సిరాజ్ 5.4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఒకటి, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు ఒక వికెట్ దక్కాయి. ప్రమాదకరంగా మారి జట్టును భారీ స్కోరు దిశగా నడిపిస్తున్న మార్ష్ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు స్పిన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. అంతేకాదు గ్లెన్ మాక్స్వెల్ రూపంలో మరో కీలక బ్యాటర్‌ను పెవిలియన్‌కు పంపాడు. మొత్తంగా 9 ఓవర్ల బౌలింగ్‌లో 46 పరుగులు మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లు తీశాడు. ఆల్‌రౌండర్ జడ్డూ.. ఈ క్రమంలో ముంబై మ్యాచ్‌లో 35.4 ఓవర్లలోనే ఆస్ట్రేలియా కథ ముగిసింది. 188 పరుగులకే ఆసీస్ ఆలౌట్ అయింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన హార్దిక్ సేన ఆరంభంలో తడబడినా.. కేఎల్ రాహుల్(75), రవీంద్ర జడేజా(45) అద్భుత అజేయ ఇన్నింగ్స్‌తో విజయం అందించారు. ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకుని, లబుషేన్‌ను అవుట్ చేయడంలో సంచలన క్యాచ్‌తో మెరిసిన జడేజాను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. దటీజ్ జడేజా.. నిజమైన హీరో ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ జడేజాను ప్రశంసిస్తూ పైవిధంగా స్పందించాడు. స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఐదు నెలల తర్వాత టెస్టుతో పునరాగమనం చేశాడు. తొలి రెండు టెస్టుల్లో అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. ఇప్పుడు వన్డేలో కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్. బ్యాటింగ్ బౌలింగ్ మాత్రమే కాదు అద్భుత ఫీల్డింగ్ విన్యాసాలతో జట్టును గెలిపిస్తున్నాడు. గాయం నుంచి కోలుకుని సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి వచ్చి ఇలాంటి ప్రదర్శనలు ఇవ్వడం చాలా కొన్ని సందర్భాల్లోనే జరుగుతుంది. జట్టుకు ప్రధాన బలంగా మారాడు’’ అంటూ జడ్డూను మంజ్రేకర్ ఆకాశానికెత్తాడు. అప్పుడలా.. ఇప్పుడిలా.. గతంలో మంజ్రేకర్ జడేజాను ఉద్దేశించి అరకొర ఆటగాడు అంటూ తక్కువ చేసిన మాట్లాడగా.. అదే రేంజ్లో జడ్డూ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆసియా కప్-2022 టీ20 టోర్నీ సందర్భంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో జడేజా అద్భుత ప్రదర్శన నేపథ్యంలో మంజ్రేకర్ మాటలు కలిపాడు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి రవీంద్ర జడేజాను మంజ్రేకర్ ప్రశంసించడం నెట్టింట వైరల్‌గా మారింది. ‘మంజ్రేకర్ నువ్వేనా ఈ మాట అంటున్నది! నిజమేనా.. నమ్మలేకపోతున్నాం’ అంటూ జడ్డూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: KL Rahul: రాహుల్ అద్భుత ఇన్నింగ్స్.. కారణమిదే అంటున్న ఫ్యాన్స్! కోహ్లి కూడా.. NZ VS SL 2nd Test: డబుల్ సెంచరీలు బాదిన కేన్ విలియమ్సన్, హెన్రీ నికోల్స్ #TeamIndia go 1⃣-0⃣ up in the series! 👏 👏 An unbeaten 1⃣0⃣8⃣-run partnership between @klrahul & @imjadeja as India sealed a 5⃣-wicket win over Australia in the first #INDvAUS ODI 👍 👍 Scorecard ▶️ https://t.co/BAvv2E8K6h @mastercardindia pic.twitter.com/hq0WsRbOoC — BCCI (@BCCI) March 17, 2023 Innings Break!#TeamIndia bowlers put up a fine show here at the Wankhede Stadium as Australia are all out for 188 runs in 35.4 overs. Three wickets apiece for Shami and Siraj. Scorecard - https://t.co/8mvcwAvYkJ #INDvAUS @mastercardindia pic.twitter.com/S1HkPEPyGl — BCCI (@BCCI) March 17, 2023 -
విమర్శలు వచ్చాయని 70, 80ల నాటి పిచ్ తయారు చేస్తారా?
టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అహ్మదాబాద్ పిచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య మొదలైన నాలుగో టెస్టు పిచ్ పూర్తిగా బ్యాటింగ్ ట్రాక్‌లా కనిపిస్తుంది. తొలిరోజు ఆటలో టీమిండియా బౌలర్లు నానాకష్టాలు పడి నాలుగు వికెట్లు మాత్రమే తీయగలిగారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 90 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖవాజా 104 పరుగులు నాటౌట్ సెంచరీతో కదం తొక్కగా.. కామెరాన్ గ్రీన్ 49 పరుగులు క్రీజులో ఉన్నారు. ఈ నేపథ్యంలో మ్యాచ్‌కు కామెంటేటర్‌గా వ్యవహరించిన సంజయ్ మంజ్రేకర్ పిచ్‌పై ఆసక్తికరంగా స్పందించాడు. ''అహ్మదాబాద్ పిచ్ పూర్తిగా బ్యాటింగ్ ఫ్రెండ్లీగా కనిపిస్తుంది. మూడు సెషన్లు కలిపి టీమిండియా బౌలర్లు నాలుగు వికెట్లు మాత్రమే తీయగలిగారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. తొలి మూడు టెస్టులు రెండున్నర రోజుల్లోనే ముగియడంపై విమర్శలు రావడంతో బయపడిన క్యురేటర్లు మరీ ఇలా 70, 80ల కాలం నాటి పిచ్‌లను తయారు చేస్తారనుకోలేదు. బ్యాటింగ్‌కు అనుకూలంగా జీవం లేని పిచ్‌పై షమీ తన బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు. జడేజా పర్వాలేదనిపించినా.. అక్షర్, అశ్విన్‌లు మాత్రం వికెట్లు పడగొట్టలేకపోయారు. అయితే రెండోరోజు ఆటలో పిచ్‌లో ఏమైనా మార్పులు జరిగే అవకాశం ఉందేమో.'' అని పేర్కొన్నాడు. మంజ్రేకర్ వ్యాఖ్యలపై మరో కామెంటేటర్ మాథ్యూ హెడెన్ స్పందిస్తూ.. టెస్టు క్రికెట్ మ్యాచ్‌కు ఇది సరైన పిచ్‌లా అనిపిస్తుంది. తొలిరోజే అన్ని జరగాలంటే కుదరదు. రానున్న రోజుల్లో పిచ్ ప్రభావం చూపించే అవకాశం ఉంది. టీమిండియా స్పిన్ త్రయం వికెట్లు తీయలేకపోయినప్పటికి తమ ఇంపాక్ట్‌ను చూపించారు. జడేజాతో పాటు అశ్విన్, అక్షర్ పటేల్‌లు తమ స్పిన్‌తో రెండో రోజు ఆసీస్‌ను తిప్పేస్తారేమో.'' అంటూ తెలిపాడు. -
WC 2023: ప్రపంచకప్ జట్టులో శార్దూల్‌కు చోటు ఖాయం! అంతలేదు..
India vs New Zealand- Shardul Thakur: ‘‘శార్దూల్.. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. లోపాలు సవరించుకుంటూ పట్టువదలని విక్రమార్కుడిలా ముందుకు సాగుతూనే ఉంటాడు. తను బంతిని పెద్దగా స్వింగ్ చేయలేడని మనం భావించినప్పుడల్లా మనల్ని ఆశ్చర్యపరుస్తూ వికెట్లు తీస్తూనే ఉంటాడు. తను ప్రతిసారి గంటకు 140కిలోమీటర్లకు పైగా వేగంతో బౌలింగ్ చేయకపోవచ్చు. కానీ.. అతడు నంబర్ 1గా ఎదుగుతాడు’’ అని టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డాడు. భారత పేస్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను ఉద్దేశించి ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. రాణించిన శార్దూల్ ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో శార్దూల్ మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. హైదరాబాద్‌లో జరిగిన మొదటి వన్డేలో 7.2 ఓవర్లలో 54 పరుగులు ఇచ్చిన రెండు వికెట్లు తీసిన అతడు.. 3 పరుగులు చేయగలిగాడు. రాయ్‌పూర్ వన్డేలో 6 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆఖరిదైన ఇండోర్ మ్యాచ్‌లో 17 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 25 పరుగులతో సత్తా చాటిన శార్దూల్.. 6 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. చోటు ఖాయం ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ మ్యాచ్ పాయింట్ సందర్భంగా.. వన్డే ప్రపంచకప్ జట్టు గురించి ప్రస్తావనకు రాగా ఇర్ఫాన్ పఠాన్ తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కివీస్‌తో ఫైనల్ వన్డేలో శార్దూల్ ప్రదర్శనపై స్పందిస్తూ.. వరల్డ్‌కప్ జట్టులో ఫాస్ట్‌బౌలర్ల విభాగంలో అతడికి కచ్చితంగా చోటు దక్కుతుందని అంచనా వేశాడు. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్ చేయగల శార్దూల్ మిగతా వాళ్లకంటే ఓ అడుగు ముందే ఉంటాడని చెప్పుకొచ్చాడు. అంతలేదన్న మంజ్రేకర్ అయితే, మరో మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మాత్రం ఇర్ఫాన్ అభిప్రాయంతో ఏకీభవించలేదు. ప్రపంచకప్ జట్టులో శార్దూల్‌కు స్థానం దక్కుతుందని తాను భావించడం లేదన్నాడు. ‘‘మెగా టోర్నీకి ఇంకా చాలా సమయం ఉంది. జట్టులో హార్దిక్ పాండ్యా ఉన్నాడు. తనూ పేస్ ఆల్‌రౌండరే. కాబట్టి శార్దూల్‌కు చోటు కష్టమే. పేసర్ల విభాగంలోనూ అతడు గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని మంజ్రేకర్ పేర్కొన్నాడు. చదవండి: ICC T20 World Cup: ప్రపంచకప్ సెమీ ఫైనల్లో టీమిండియా.. కివీస్‌తో పోరుకు సై IPL: ఆల్‌టైం జట్టులో ఏబీడీకి చోటివ్వని టీమిండియా లెజెండ్! కానీ.. -
Ind Vs NZ: అతడి కోసం కోహ్లి త్యాగం చేయాలి! అప్పుడే ఆ ఇద్దరు..
Shubman Gill Vs Ishan Kishan: శుబ్‌మన్ గిల్.. ఇషాన్ కిషన్.. ఈ ఇద్దరు యువ బ్యాటర్లు టీమిండియా ఓపెనింగ్ స్థానం కోసం పోటీపడుతున్నారు. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ ఐదో స్థానానికి డిమోట్ అయిన తరుణంలో కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా వీరిలో ఒకరికి అవకాశం రావడం తథ్యం. అయితే, ఇషాన్ కంటే గిల్‌వైపే యాజమాన్యం మొగ్గుచూపుతోంది. శ్రీలంకతో స్వదేశంలో ఇటీవల ముగిసిన వన్డే సిరీస్‌లోనూ ఈ విషయం మరోసారి నిరూపితమైంది. రోహిత్ గైర్హాజరీ నేపథ్యంలో టీ20 సిరీస్‌లో గిల్- ఇషాన్ ఓపెనర్లుగా వచ్చారు. ఇక వన్డే సిరీస్‌లో మాత్రం హిట్‌మ్యాన్‌కు జోడీగా శుబ్‌మన్ గిల్ వచ్చాడు. ఇషాన్‌ను పక్కన పెట్టి తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. శుబ్‌మన్ గిల్ అద్భుత ప్రదర్శన లంకతో మూడు వన్డేల్లో వరుసగా 70, 21, 116 పరుగులు చేశాడు గిల్. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో స్వదేశంలో ఉప్పల్ వేదికగా మొదలుకానున్న వన్డే సిరీస్‌లోనూ ఇషాన్ కిషన్‌కు మొండిచేయి ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, ప్రపంచకప్-2023 నాటికి బ్యాకప్ ఓపెనర్లను సిద్ధం చేసే క్రమంలో ఇద్దరికీ ఛాన్స్ వస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ ఇందుకు పరిష్కారం తాను చెబుతానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గిల్, ఇషాన్ ఇద్దరికీ వన్డేల్లో ఆడే అవకాశం రావాలంటే రన్‌మెషీన్ విరాట్ కోహ్లి తన మూడో స్థానాన్ని త్యాగం చేయాలని విజ్ఞప్తి చేశాడు. బ్యాటింగ్ చేస్తున్న ఇషాన్ కిషన్ ఎవరో ఒకరికే.. కాబట్టి ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షో గ్లేమ్ ప్లాన్ చర్చలో భాగంగా సంజయ్ మాట్లాడుతూ.. ‘‘ఇది నిజంగా క్లిష్టతరమైన ప్రశ్నే! యువ బ్యాటర్లలో ఒకరికి ఓపెనర్‌గా చోటు ఇస్తే మరొకరికి భంగపాటు తప్పదు. అయితే, ఈ సమస్యను పరిష్కరించే కిటుకు ఒకటి చెప్తాను. అప్పుడు రాయుడు కోసం శుబ్‌మన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్ చేయగలడు. కాబట్టి విరాట్ కోహ్లి తన మూడో స్థానాన్ని త్యాగం చేసి నాలుగో స్థానంలో ఆడితే బాగుంటుంది. గతంలో.. చాలా ఏళ్ల క్రితం శ్రీలంకతో సిరీస్‌లో అంబటి రాయుడు కోసం కోహ్లి ఈ పని చేశాడు. ఇప్పుడు కూడా అలాగే ఆలోచిస్తే.. ఇషాన్ కిషన్‌కు మార్గం సుగమమవుతుంది. ఇషాన్ వస్తే.. వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన ఇషాన్ ఓపెనర్‌గా వస్తే లెఫ్ట్ అండ్ రైట్ బ్యాటింగ్ కాంబినేషన్ కుదురుతుంది’’ అని తన అభిప్రాయం పంచుకున్నాడు. రోహిత్- ఇషాన్ ఓపెనర్లుగా వస్తే.. గిల్ వన్‌డౌన్‌లో.. కోహ్లి నాలుగో స్థానంలో రావాలని సంజయ్ మంజ్రేకర్ సూచించాడు. కాగా బంగ్లాదేశ్‌తో నిర్ణయాత్మక మూడో వన్డేల్లో ఇషాన్ ద్విశతకం బాది పలు రికార్డులు బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. చదవండి: Suryakumar Yadav: జూనియర్ ఎన్టీఆర్‌తో సూర్య, దేవిషా..! బ్రదర్ అంటూ ట్వీట్.. ఫొటో వైరల్ న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. కీలక ఆటగాడు ఔట్ -
'సచిన్ సాధించిన ఆ రికార్డును కోహ్లి సాధించలేడు'
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. గతేడాది జరిగిన ఆసియాకప్‌లో తొలి టీ20 సెంచరీతో చెలరేగిన విరాట్.. అనంతరం టీ20 ప్రపంచకప్, బంగ్లాదేశ్ సిరీస్‌లలో సత్తా చాటాడు. తాజగా శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో అద్భుతమైన సెంచరీ సాధించిన కోహ్లి.. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పలు రికార్డులను బ్రేక్ చేశాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్లో సచిన్ 100 సెంచరీల రికార్డును కూడా కింగ్ కోహ్లి బ్రేక్ చేస్తాడు అని పలువురు భారత మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు విరాట్ కెరీర్లో 73 అంతర్జాతీయ సెంచరీలు ఉన్నాయి. కాగా వన్డేల్లో 45, టెస్టుల్లో 29, టీ20ల్లో ఒక సెంచరీ ఉంది. కాగా వన్డేల్లో సచిన్(49) సెంచరీల రికార్డుకు కోహ్లి కేవలం 4 సెంచరీల దూరంలో మాత్రమే ఉన్నాడు. రాబోయే రోజుల్లో సచిన్ వన్డేల రికార్డును విరాట్ బ్రేక్ చేసే అవకాశం ఉంది. అయితే టెస్టుల్లో సచిన్ సెంచరీల రికార్డును కోహ్లి బ్రేక్ చేయలేడని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. "టెస్టుల్లో సచిన్ సెంచరీల రికార్డును బద్దలు కొట్టడం కోహ్లికి కఠిన సవాలు వంటిది. వన్డేల్లో విరాట్ ఆల్‌టైమ్ గ్రేట్. అదే విధంగా టెస్టుల్లో కూడా విరాట్ అద్భుతమైన ఆటగాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే టెస్టుల్లో సచిన్ 51 సెంచరీలు సాధించాడు. టెస్టు క్రికెట్లో అన్ని సెంచరీలు చేయడం అంతసులభం కాదు. కాబట్టి విరాట్‌కు ఇది అసలైన ఛాలెంజ్. కోహ్లి తన అద్భుత ఫామ్‌ను కొనసాగించి సచిన్ రికార్డును బ్రేక్ చేయాలని ఆశిస్తున్నాను" అని స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ లైవ్ షోలో పేర్కొన్నారు. చదవండి: IND vs SL: వన్డేల్లో శ్రీలంక అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి జట్టుగా -
రంజీల్లో పృథ్వీ షా చరిత్ర.. అరుదైన రికార్డు! ఎవరికీ అందనంత ఎత్తులో!
Prithvi Shaw Triple Century- Rare Record: ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా గురించి మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ముంబై బ్యాటర్ తన అభిమాన ఆటగాడని.. అతడే తన రికార్డును బద్దలు కొట్టడం సంతోషంగా ఉందన్నాడు. రంజీ ట్రోఫీ టోర్నీ 2022-23లో భాగంగా అసోంతో మ్యాచ్‌లో పృథ్వీ షా అద్భుత ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. రెండో రోజు ఆటలో భాగంగా ఈ ముంబైకర్ ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 383 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 379 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. కొద్దిలో క్వాడ్రపుల్ సెంచరీ మిస్ అయినా.. కెరీర్లో గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. రంజీల్లో సరికొత్త చరిత్ర ఈ క్రమంలో రంజీ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన రెండో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. బాంబే ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్‌ను అధిగమించి అత్యధిక పరుగుల వీరుల జాబితాలో రెండో స్థానానికి దూసుకువచ్చాడు. అరుదైన ఘనత సాధించి తన సమకాలీన క్రికెటర్లకు అందనంత ఎత్తుకు ఎదిగాడు 23 ఏళ్ల ఈ టీమిండియా ఓపెనర్. ఈ నేపథ్యంలో పృథ్వీని అభినందిస్తూ.. సంజయ్ మంజ్రేకర్ ట్వీట్ చేశాడు. ‘‘377 పరుగులతో నేను సృష్టించిన రికార్డును.. నేను అభిమానించే ఆటగాడు బద్దలు కొట్టడం చూసి థ్రిల్ అయ్యాను. వెల్డన్ పృథ్వీ!’’ అని ఈ యువ ఆటగాడిని ప్రశంసించాడు. రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన టాప్-5 క్రికెటర్లు 1. బీబీ నింబాల్కర్ (మహారాష్ట్ర) – 443 నాటౌట్ (vs) సౌరాష్ట్ర (1948-49) 2. పృథ్వీ షా (ముంబై) – 379 (vs) అసోం (2022-23) 3. సంజయ్ మంజ్రేకర్ (బాంబే) – 377 (vs)హైదరాబాద్ (1990-91) 4. ఎంవీ శ్రీధర్ (హైదరాబాద్) – 366 (vs) ఆంధ్ర (1993-94) 5. విజయ్ మర్చంట్ (బాంబే) – 359 నాటౌట్(vs) మహారాష్ట్ర (1943-44) చదవండి: Ind Vs SL: ఇలాంటి ఆటగాడిని చూడలేదు.. ఆ ప్రేమ నిజం! కోహ్లి ప్రశంసల జల్లు IPL 2023-Rishabh Pant: పంత్ లేని లోటు ఎవరూ తీర్చలేరు.. అయితే: గంగూలీ కీలక వ్యాఖ్యలు Champion player 💪 Too good @PrithviShaw 💯💯💯 👏 pic.twitter.com/5wZ29EasNb — Shreyas Iyer (@ShreyasIyer15) January 11, 2023 Thrilled that my record of 377 was beaten by a batter I adore! Well done Prithvi! 👏🏼👏🏼👏🏼 — Sanjay Manjrekar (@sanjaymanjrekar) January 11, 2023 -
టీమిండియా యువ ఓపెనర్ విధ్వంసం.. 400 మిస్! రికార్డులు బద్దలు
Assam vs Mumbai- Prithvi Shaw Triple Century: రంజీ ట్రోఫీ టోర్నీలో టీమిండియా యువ ఓపెనర పృథ్వీ షా దుమ్ములేపుతున్నాడు. ఈ ముంబై ఆటగాడు అసోంతో మ్యాచ్‌లో ద్విశతకాన్ని ట్రిపుల్ సెంచరీగా మలిచాడు. గువహటి వేదికగా మంగళవారం మొదలైన టెస్టు తొలి రోజు ఆట ముగిసే సరికి ఈ యువ బ్యాటర్ 240 పరుగులు సాధించాడు. క్వాడ్రపుల్ సెంచరీ మిస్ ఈ క్రమంలో బుధవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా త్రిశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, 379 పరుగుల వద్ద రియాన్ పరాగ్ బౌలింగ్‌లో పృథ్వీ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో క్వాడ్రపుల్ సెంచరీ మిస్సయ్యాడు. కాగా ఈ తొలి ఇన్నింగ్స్‌లో మొత్తంగా 383 బంతులు ఎదుర్కొన్న 49 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో ఈ మేరకు భారీగా పరుగులు రాబట్టాడు. దిగ్గజాల రికార్డులు బద్దలు తద్వారా ట్రిపుల్ సెంచరీ వీరుడు 23 ఏళ్ల పృథ్వీ షా.. టీమిండియా దిగ్గజాల పేరిట ఉన్న పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ముంబై తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గా ఘనత సాధించాడు. గతంలో సంజయ్ మంజ్రేకర్ 377 పరుగులతో ముంబై టాప్ బ్యాటర్‌గా ఉండగా.. 32 ఏళ్ల తర్వాత యువ ఓపెనర్ పృథ్వీ షా అతడిని అధిగమించాడు. అదే విధంగా.. టీమిండియా దిగ్గజం సునిల్ గావస్కర్ (ముంబై తరఫున రంజీల్లో 340 పరుగులు)ను కూడా దాటేశాడు. కాగా గత కొన్నాళ్లుగా భారత జట్టులో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న పృథ్వీ షా ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో మరోసారి సెలక్టర్లకు సవాల్ విసిరాడు. చదవండి: Kohli-Pandya: పాండ్యాపై గుడ్లురిమిన కోహ్లి! సెంచరీ మిస్ అయ్యేవాడే! వీడియో వైరల్ IPL 2023: పంత్ లేని లోటు ఎవరూ తీర్చలేరు.. అయితే: గంగూలీ కీలక వ్యాఖ్యలు -
Ind Vs Ban: రెండో టెస్టులో గిల్‌పై ‘వేటు పడటం’ ఖాయం! వాళ్లున్నారు కదా!
India tour of Bangladesh, 2022: ‘‘ఈ అబ్బాయి సెంచరీ చేశాడు. మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, ఒకవేళ రోహిత్ శర్మ ఫిట్నెస్ సాధించి జట్టులోకి వచ్చాడనుకోండి.. కేఎల్ రాహుల్- రోహిత్‌ల జోడీకే ఓపెనర్లుగా మొదటి ప్రాధాన్యం. కచ్చితంగా రోహిత్‌నే ఆడిస్తారు. ఎందుకంటే తను కెప్టెన్ కదా! ఇక కేఎల్ రాహుల్ పరుగులు రాబట్టకపోయినా వాళ్లు అతడిని పక్కన పెట్టే అవకాశమే లేదు. కాబట్టి శుబ్‌మన్ గిల్‌ను బెంచ్‌కే పరిమితం చేయకతప్పదు. నాకు తెలిసి.. గతంలో అజింక్య రహానే విషయంలో కూడా ఓసారి ఇలాగే జరిగింది’’ అని టీమిండియా మాజీ క్రికెటర్, వివాదాస్పద కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. కాగా బంగ్లాదేశ్ టూర్ నేపథ్యంలో గాయపడ్డ భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ స్వదేశానికి తిరిగి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బంగ్లాదో మొదటి టెస్టులో యువ బ్యాటర్ శుబ్‌మన్ గిల్‌కు ఓపెనర్‌గా అవకాశం దక్కింది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో 20 పరుగులు మాత్రమే చేయగలిగిన గిల్.. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగాడు. 152 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 110 పరుగులు సాధించాడు. తద్వారా జట్టు భారీ స్కోరు చేసి విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. రోహిత్ వస్తే.. గిల్ కచ్చితంగా బెంచ్ మీదే అయితే, రెండో టెస్టు నాటికి రోహిత్ అందుబాటులోకి రానున్నాడన్న వార్తల నేపథ్యంలో జట్టులో గిల్ స్థానం ప్రశ్నార్థకమైంది. ఓపెనర్‌గా కెప్టెన్ బరిలోకి దిగడం ఖాయం.. దీనితో పాటుగా మిడిలార్డర్లో పుజారా, కోహ్లి, పంత్, శ్రేయస్ అయ్యర్ తదితరులు ఉన్న నేపథ్యంలో తుది జట్టులో గిల్‌కు చోటు దక్కే అవకాశం ఉండకపోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై సంజయ్ మంజ్రేకర్ సోనీ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. రోహిత్ జట్టులోకి వస్తే గిల్‌ను తప్పించడం ఖాయమని అంచనా వేశాడు. బంగ్లాదేశ్‌లో టీమిండియా ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగుతుంది కాబట్టి గిల్‌పై వేటువేయక తప్పదని అభిప్రాయపడ్డాడు. అదనపు బ్యాటింగ్ ఆప్షన్లుగా అక్షర్ పటేల్, అశ్విన్ ఉండటం కూడా గిల్ అవకాశాలపై ప్రభావం చూపుతుందని చెప్పుకొచ్చాడు. కాగా డిసెంబరు 22 నుంచి బంగ్లాదేశ్- టీమిండియా మధ్య రెండో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: Mbappe- Messi: మెస్సీ విజయానికి అర్హుడే! కానీ నువ్వు ఓటమికి అర్హుడివి కాదు! గర్వపడేలా చేశావు.. FIFA WC 2022: విజేతకు రూ. 347 కోట్లు.. మిగతా జట్ల ప్రైజ్‌మనీ, అవార్డులు, ఇతర విశేషాలు -
అలాంటి వాళ్లకు స్థానం ఉండదు.. మయాంక్ కోసం పోటీ ఖాయం: భారత మాజీ క్రికెటర్
IPL 2023 Mini Auction- Mayank Agarwal: ఐపీఎల్-2023 మినీ వేలం నేపథ్యంలో మయాంక్ అగర్వాల్‌ను విడుదల చేసింది పంజాబ్ కింగ్స్ ఫ్రాంఛైజీ. గత సీజన్లో తమ కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ ఓపెనింగ్ బ్యాటర్‌కు గుడ్ బై చెప్పింది. అతడి స్థానంలో టీమిండియా వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్‌కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. ఈ క్రమంలో పంజాబ్ రిటెన్షన్ జాబితాలోలేని మయాంక్ వేలంలోకి రానున్న నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మయాంక్ కోసం ఫ్రాంఛైజీలు పోటీ పడటం ఖాయమని అభిప్రాయపడ్డాడు. సంజయ్ మంజ్రేకర్(PC: Sanjay Manjrekar Twitter) మయాంక్ కోసం పోటీ ఎందుకంటే అందుకు గల కారణాన్ని వివరిస్తూ.. ‘‘ఓ సీజన్లో చెత్తగా ఆడామంటే.. కచ్చితంగా వారి కోసం వెచ్చించిన డబ్బు గురించి యాజమాన్యం ఆలోచించడం సహజమే! మిగత వాళ్లతో పోలిస్తే మయాంక్ అగర్వాల్ విషయం కాస్త భిన్నం. అతడిని వదులుకోవడం ద్వారా వచ్చిన డబ్బులో కొంతమొత్తం చెల్లించి అతడిని మళ్లీ కొనుగోలు చేయవచ్చు. లేదంటే వేరే ఆప్షన్ల వైపు చూడొచ్చు. నిజానికి మయాంక్ అగర్వాల్ మంచి ఆటగాడు. ఆటలో మంచి వాళ్లకు స్థానం ఉండదు ఎంత మంచి వాడంటే.. కెప్టెన్‌గా ఉన్నపుడు తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేశాడు. నిజానికి గత సీజన్లలో కేఎల్ రాహుల్‌తో కలిసి ఓపెనర్‌గా వచ్చి జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, కెప్టెన్ అయిన తర్వాత టాపార్డర్‌లో ఉన్నా కొన్నిసార్లు తన ఓపెనర్ స్థానాన్ని త్యాగం చేయాల్సి వచ్చింది. దీంతో పరుగులు చేయలేకపోయాడు. నిజానికి తనకు మరో ఏడాది పాటు అవకాశం ఇవ్వాల్సింది. అయితే ఆటలో మంచి వాళ్లకు స్థానం ఉండదు. తన విషయంలో చాలా బాధగా ఉంది. ఏదేమైనా.. సరైన ఓపెనర్ కోసం ఎదురుచూస్తున్న ఫ్రాంఛైజీలు మయాంక్ కోసం పోటీ పడటం ఖాయం. 150, 160 స్ట్రైక్‌రేటుతో బ్యాటింగ్ చేయగల.. స్పిన్, పేస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కోగల ఓపెనింగ్ బ్యాటర్‌ను కొనడానికి ఆసక్తి చూపిస్తాయి’’ అని స్టార్ స్పోర్ట్స్ షోలో సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. కాగా ఐపీఎల్-2022లో పంజాబ్ సారథిగా వ్యవహరించిన మయాంక్.. 13 ఇన్నింగ్స్ ఆడి 196 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే, కెప్టెన్‌గా పద్నాలుగింట ఏడు మ్యాచ్‌లు గెలిచి పాయింట్ల పట్టికలో జట్టును ఆరో స్థానంలో నిలిపాడు. చదవండి: IPL 2023: ఫ్రాంచైజీలు అవమానకర రీతిలో వదిలించుకున్న ఖరీదైన ఆటగాళ్లు వీరే..! Kane Williamson: నన్ను రిలీజ్ చేస్తారని ముందే తెలుసు.. అయినా హైదరాబాద్‌తో: కేన్ మామ భావోద్వేగం IPL 2023 Retention: స్టార్ ఆటగాళ్లకు షాకిచ్చిన ఐపీఎల్ జట్లు.. మొత్తం రిటెన్షన్ జాబితా ఇదే var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
మంజ్రేకర్ ఫొటో షేర్ చేస్తూ జడేజా ట్వీట్.. రిప్లైతో మనసు గెలిచేశాడు!
Ravindra Jadeja- Sanjay Manjrekar: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. భారత మాజీ ఆటగాడు, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్‌ను ఉద్దేశించి.. ‘‘నా ప్రియమైన మిత్రుడిని స్క్రీన్ మీద చూస్తున్నా’’ అంటూ జడ్డూ మంజ్రేకర్ ఫొటో షేర్ చేశాడు. కాగా గాయం కారణంగా టీ20 ప్రపంచకప్-2022 టోర్నీకి దూరమైన ఈ ఆల్‌రౌండర్.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భాగంగా మంజ్రేకర్ మాట్లాడుతున్న దృశ్యాన్ని పంచుకున్న జడ్డూ అతడిని డియర్ ఫ్రెండ్ అని సంభోదించాడు. ప్రియ మిత్రులుగా మారారా?! ఇక ఇందుకు స్పందనగా.. ‘‘హహా.. నువ్వు త్వరగా మైదానంలో అడుగుపెడితే చూడాలని నీ ఈ ప్రియమిత్రుడు ఎదురుచూస్తున్నాడు’’ అంటూ మంజ్రేకర్ బదులిచ్చాడు. ట్విటర్లో వీరిద్దరి సంభాషణ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ‘‘వామ్మో.. ఒకప్పటి ‘శత్రువులు’ ఇప్పుడు మిత్రులుగా మారిపోయారా!? నీ రిప్లైతో జడ్డూ మనసు గెలిచేసుకున్నావన్న మాట’’ అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. అప్పుడేమో అలా.. వన్డే వరల్డ్‌కప్-2019 సెమీ ఫైనల్ సందర్భంగా మంజ్రేకర్.. జడేజాను ఉద్దేశించి అరకొర ఆటగాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇందుకు స్పందించిన జడ్డూ.. ‘‘నా కెరీర్లో ఇప్పటి వరకు నీకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడాను. ఇంకా ఆడతాను’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య కోల్డ్‌వార్ నడిచింది. అయితే, ఆసియా కప్-2022 టీ20 టోర్నీలో పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్‌లో జడేజా అద్భుత ఇన్నింగ్స్ ఆడిన నేపథ్యంలో.. అతడితో మాట్లాడేందుకు మంజ్రేకర్ వచ్చాడు. మంజ్రేకర్‌ను చూసి జడ్డూ నవ్వగా.. జడ్డూ నాతో మాట్లాడం ఇష్టమేనా అని ప్రశ్నించాడు. ఇందుకు బదులుగా మాట్లాడుతా అంటూ జడేజా నవ్వాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు అప్పట్లో వైరల్ అయ్యాయి కూడా! తాజాగా జడేజా ట్వీట్‌తో మరోసారి వీరిద్దరు వార్తల్లోకి వచ్చారు. ఇదిలా ఉంటే.. ఆసియా కప్ టోర్నీ జరుగుతున్న సమయంలో గాయపడిన జడేజా ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదు. మరోవైపు.. పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు కూడా వెన్నునొప్పి తిరగబెట్టడంతో టీ20 ప్రపంచకప్-2022 ఆడే అవకాశాలు లేకుండా పోయాయి. ఇలా ఇద్దరు ప్రధాన ఆటగాళ్లు దూరం కావడం టీమిండియాకు పెద్ద ఎదురుదెబ్బే. చదవండి: T20 WC 2022 Prize Money: ప్రైజ్‌మనీ వివరాలు ప్రకటించిన ఐసీసీ.. విజేతకు ఎంత లభిస్తుందంటే! Ha ha… and your dear friend looking forward to seeing you on the field soon :) https://t.co/eMpZyZYsYU — Sanjay Manjrekar (@sanjaymanjrekar) September 30, 2022 -
Ind Vs Eng: ప్రస్తుతం అతడిని ఎదుర్కోగల బౌలర్ ప్రపంచంలోనే లేడు! అంతలా..
Ind Vs Eng T20 Series: టీమిండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌పై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల జల్లు కురిపించాడు. అద్భుత షాట్లతో విరుచుకుపడే సూర్యను కట్టడి చేయగల బౌలర్ ప్రస్తుతం ఎవరూ లేరంటూ కొనియాడాడు. అతడికి ఎలా బౌలింగ్ చేయాలో తెలియక చాలా మంది తలలు పట్టుకుంటున్నారని పేర్కొన్నాడు. కాగా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత గతేడాది మార్చిలో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్. ఇంగ్లండ్‌తో టీ20 ఫార్మాట్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌ను స్సిర్తో మొదలు పెట్టి 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి సత్తా చాటాడు. క్యాష్ రిచ్ లీగ్‌లోనూ ముంబై ఇండియన్స్‌లో కీలక బ్యాటర్‌గా తన స్థానం సుస్థిరం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఒకటీ రెండూ మినహా వచ్చిన అవకాశాలన్నీ దాదాపుగా సద్వినియోగం చేసుకుంటూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో మూడో టీ20లో సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో 55 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, ఆరు సిక్సర్ల సాయంతో 117 పరుగులు సాధించి పొట్టి ఫార్మాట్లో తొలి శతకం పూర్తి చేసుకున్నాడు. తద్వారా పొట్టి ఫార్మాట్లో నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోరు సాధించిన మొదటి బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. ఈ నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ స్పోర్ట్స్18తో ముచ్చటిస్తూ సూర్యకుమార్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘‘సూర్య సెంచరీ ఓ మధుర జ్ఞాపకం. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి స్ట్రైక్ రేటు(212.73). క్లాసిక్ ఇన్నింగ్స్. ప్రస్తుతం తన బ్యాటింగ్‌కు ఎదుర్కోగల సమర్థవంతమైన బౌలర్ ఎవరూ లేరని చెప్పొచ్చు’’ అని పేర్కొన్నాడు. ఇక సూర్యకు స్టాండింగ్ ఓవియేషన్ లభించడంపై స్పందిస్తూ.. ‘‘సెంచరీ తర్వాత ప్రేక్షకులు నిలబడి చప్పట్లతో అతడిని అభినందించారు. నిజానికి కేవలం టీమిండియా అభిమానులు మాత్రమే కాదు.. ఇంగ్లండ్ జట్టు మద్దతుదారులు సైతం అతడిని కొనియాడారు. ఈ మ్యాచ్‌లో సూర్య ఇన్నింగ్స్ కారణంగా తాము ఓడినా సరే పర్వాలేదన్నట్లుగా ఒక ఆటగాడికి దక్కాల్సిన గౌరవాన్ని ఇచ్చారు’’ అని మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. చదవండి: Ind Vs Eng 1st ODI: కోహ్లి లేడు.. బుమ్రా, సిరాజ్‌ను కాదని అర్ష్‌దీప్ సింగ్‌కు ఛాన్స్! ఇంకా.. An innings worth millions - whole crowd gave a standing ovation to Suryakumar Yadav. pic.twitter.com/gj2ZzhyS76 — Mufaddal Vohra (@mufaddal_vohra) July 10, 2022 -
జడేజాకు కష్టమే.. త్యాగాల గోల తప్పదు; అభిమానుల ఆగ్రహం
టి20 ప్రపంచకప్ 2022కు మరో నాలుగు నెలల సమయం ఉంది. అయితే అప్పటివరకు పటిష్టమైన జట్టును రూపొందించాలంటే ఈ గ్యాప్‌లో టీమిండియా ఆడనున్న సిరీస్‌లు కీలకమనే చెప్పొచ్చు. సౌతాఫ్రికాతో సిరీస్‌తో ఇప్పటికే టి20 ప్రపంచకప్ సన్నాహకాలు మొదలైనట్లేనని చెప్పొచ్చు. ఆ సిరీస్‌లో ఇషాన్ కిషన్, దినేశ్ కార్తిక్, భువనేశ్వర్ కుమార్‌లు సూపర్‌గా రాణించి పొట్టి ప్రపంచకప్‌కు తమనే ఎంపిక చేయాల్సిందేనంటూ పరోక్షంగా సంకేతాలు పంపారు. తాజాగా ఏకకాలంలో అటు ఐర్లాండ్.. ఇటు ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియా బిజీ కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర సంజయ్ మంజ్రేకర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రానున్న టి20 ప్రపంచకప్ కోసం జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌ను ఎంపిక చేస్తే బాగుంటుందని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. '' ఒక విషయం క్లియర్ అయింది. కార్తిక్ 6 లేదా ఏడో స్థానంలో వచ్చి ఫినిషర్‌గా అదరగొట్టడం గ్యారంటీ. అయితే ఇదే జడేజాను చిక్కుల్లో పడేలా చేసింది. టాప్ నాలుగు స్థానాలు ఇప్పటికే ఖరారయిన నేపథ్యంలో ఐదు, ఆరు, ఏడు స్థానాలు కీలకంగా మారాయి. దినేశ్ కార్తిక్ కంటే ముందు హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌కు వస్తున్నాడు. మధ్యలో రిషబ్ పంత్ కూడా ఉన్నాడు. ఈ ముగ్గురికి తుది జట్టులో చోటు ఉంటే జడేజా ఉండడం కష్టమవుతుంది. అందుకే జడేజా స్థానంలో అక్షర్ పటేల్‌ను తీసుకోవడం ఉత్తమం. అయితే జడేజా స్థానాన్ని నేను తప్పుబట్టడం లేదు. అతను ఎంత మంచి ఆల్‌రౌండర్ అనేది అందరికి తెలిసిందే. కానీ టి20 ప్రపంచకప్‌లో పర్ఫెక్ట్ జట్టును ఎంపిక చేయాలంటే ఈ త్యాగాల గోల తప్పేలా లేదు'' అంటూ కామెంట్ చేశాడు. అయితే మంజ్రేకర్ జడేజాను పక్కనబెట్టాలని చేసిన ప్రతిపాదనను అభిమానులు తిరస్కరించారు. ఈ తరం ఆల్రౌండర్లలో గొప్ప పేరు పొందిన జడేజాను పక్కడబెడితే టీమిండియా తగిన మూల్యం చెల్లించుకున్నట్లే అని కామెంట్స్ చేశారు. ఇక జడేజా ఈ ఏడాది ఐపీఎల్ సీజన్లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో నాయకత్వ బాధ్యతలు అందుకున్న జాడేజా జట్టును నడిపించడంలో విఫలమయ్యాడు. దీంతో కెప్టెన్సీ నుంచి మధ్యలోనే వైదొలిగిన జడ్డూ తిరిగి ధోనికి బాధ్యతలు అప్పజెప్పాడు. సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడిన జడ్డూ 116 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లోనూ 5 వికెట్లు తీసి నిరాశపరిచాడు. ఆ తర్వాత గాయం కారణంగా ఐపీఎల్ నుంచి వైదొలిగిన జడేజా ఎన్సీఏలో ఫిట్నెస్ సాధించి ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాడు. చదవండి: కోపం వస్తే మాములుగా ఉండదు.. మరోసారి నిరూపితం -
అతడి ఎంపిక సరైంది.. భారత్‌కు ఇప్పుడు అలాంటి ఆటగాడు అవసరం!
India Vs Ireland T20I Series: ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టులో దీపక్ హుడాను ఎంపిక చేయడం మంచి నిర్ణయమని టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. లోయర్ ఆర్డర్లో భారత్‌కు ఇప్పుడు హుడా వంటి ఆటగాడి అవసరం ఎంతగానో ఉందని పేర్కొన్నాడు. ఐపీఎల్-2022లో అద్భుతంగా ఆకట్టుకున్న అతడు.. టీమిండియా తరఫున ఏ మేరకు రాణిస్తాడో చూడాలని ఉందన్నాడు. అద్భుతంగా రాణించినా! కాగా సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో భారత్ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేశాడు దీపక్ హుడా. అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో మ్యాచ్‌లో ఆడాడు. ఇక ఐపీఎల్-2022లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఈ బ్యాటింగ్ ఆల్‌రౌండర్ 14 ఇన్నింగ్స్‌లో కలిపి 451 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు అర్థ శతకాలు ఉన్నాయి. మిడిలార్డర్లో కీలకంగా వ్యవహరించి లక్నో ప్లే ఆఫ్స్ చేరడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో హుడాకు జాతీయ జట్టులో చోటు దక్కుతుందని భావించినా మొండిచేయి ఎదురైంది. అయితే, కీలక ఆటగాళ్లు లేకుండా ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని టీమ్‌లో అతడు స్థానం సంపాదించుకున్నాడు. భారత్‌కు ఇలాంటి ఆటగాడి అవసరం ఉంది! ఈ నేపథ్యంలో సంజయ్ మంజ్రేకర్ సోనీ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘ఐర్లాండ్‌తో సిరీస్‌లో హుడా రాణిస్తాడనే అనుకుంటున్నా. ఐపీఎల్లో దీపక్ హుడా తన అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు. నిజానికి లోయర్ ఆర్డర్లో వచ్చి ఆకట్టుకునే ప్రదర్శన చేయడం కష్టం. అయితే, హుడా ఐపీఎల్లో ఈ కఠినతరమైన పనిని ఎంతో సులువుగా చేశాడు. టీమిండియాకు ఇప్పుడు ఇలాంటి ఆటగాడి అవసరం ఎంతగానో ఉంది. ఐపీఎల్‌లోనే కాదు భారత్ తరఫున కూడా అతడు అత్యుత్తమంగా రాణిస్తాడు’’ అని చెప్పుకొచ్చాడు. కాగా జూన్ 26, 28 తేదీల్లో భారత్- ఐర్లాండ్ మధ్య రెండు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. చదవండి: ఒకప్పుడు ఐసీసీ ఎలైట్ ప్యానెల్ అంపైర్.. ఇప్పుడు పాకిస్తాన్లో సెకండ్ హ్యాండ్ దుస్తులు అమ్ముతూ! డబ్బు మీద ఆశలేదు కానీ! India Vs Ireland T20I Series Details: ఐర్లాండ్‌తో భారత్ టీ 20 సిరీస్.. ఇరు జట్లు, షెడ్యూల్.. పూర్తి వివరాలు! -
Ind Vs SA: ద్రవిడ్ బలం అదే.. అన్నింటిలోనూ తనదైన ముద్ర!
Ind Vs SA T20 Series: భారత అండర్-19 జట్టు కోచ్‌గా.. ఇషాన్ కిషన్, రిషభ్ పంత్, పృథ్వీ షా, శుభ్‌మన్ గిల్ వంటి ఎంతో మంది యువ ఆటగాళ్లను మెరికల్లా తీర్చిదిద్దిన ఘనత రాహుల్ ద్రవిడ్ సొంతం. అతడి మార్గదర్శనంలోనే భారత యువ జట్టు 2018లో అండర్-19 ప్రపంచకప్ విజేతగా నిలిచింది. పృథ్వీ షా సారథ్యంలో న్యూజిలాండ్‌ను ఓడించి ఐసీసీ ట్రోఫీ గెలిచింది. ఇక రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్వదేశంలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో వరుస టీ20 సిరీస్‌లు గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు భారత్ సన్నద్ధమవుతోంది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రా వంటి సీనియర్లకు రెస్ట్ ఇవ్వగా.. మొదటి మ్యాచ్ ఆరంభానికి ముందు కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. దీంతో రిషభ్ పంత్‌కు సారథ్య బాధ్యతలు అప్పగించారు. కాగా పంత్ కెప్టెన్సీలోని ఈ జట్టులో ఎక్కువ మంది యువ ఆటగాళ్లే ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ ద్రవిడ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లతో సమన్వయం చేసుకుంటూ జట్టును విజయపథంలో నడిపించడం అతడికి వెన్నతో పెట్టిన విద్య అని కొనియాడాడు. ఈ మేరకు..‘‘అత్యంత తెలివైన క్రికెటర్లలో ద్రవిడ్ ఒకడు. చాలా స్మార్ట్. జూనియర్ లెవల్లో ఎంతో మంది ఆటగాళ్లను గొప్పగా తీర్చిదిద్దిన ఘనత అతడిది. ముఖ్యంగా యువ క్రికెటర్లలోని నైపుణ్యాలు వెలికితీసి.. రాణించేలా ప్రోత్సహించాడు. ఈ గుణమే అతడి బలం. తన పరిధిలో ఉన్న ప్రతి అంశం మీద పూర్తి పట్టు సాధించి.. మెరుగైన ఫలితాలు రాబడతాడు’’ అని న్యూస్ 18తో మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. ఇక మైదానం వెలుపల తన ప్రణాళికలు ముఖ్యంగా ఐసీసీ ఈవెంట్లు ముందున్న నేపథ్యంలో తుది జట్టు ఎంపికలో అతడి పాత్ర మరింత ఎక్కువగా ఉండబోతుందని అభిప్రాయపడ్డాడు. కాగా జూన్ 9 నుంచి భారత్- దక్షిణాఫ్రికా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆరంభం కానుంది. చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. ఉమ్రాన్ మాలిక్, ఆర్ష్‌దీప్ సింగ్‌కు నో ఛాన్స్..! We have a challenge ahead of us against a strong South African side: #TeamIndia Head Coach Rahul Dravid 💪#INDvSA | @Paytm pic.twitter.com/AFaZ2XTuNn — BCCI (@BCCI) June 7, 2022 .@RishabhPant17 takes us through his emotions on leading #TeamIndia. 👍 👍#INDvSA | @Paytm pic.twitter.com/EVS59jHtMw — BCCI (@BCCI) June 8, 2022 -
'విరాట్ కోహ్లి కంటే డుప్లెసిస్ అత్యుత్తమ కెప్టెన్'
ఐపీఎల్-2022లో భాగంగా శుక్రవారం జరిగిన క్వాలిఫైయర్-2లో రాజస్తాన్ రాయల్స్ చేతిలో ఓటమి చెందిన ఆర్సీబీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. కాగా ఈ సీజన్లోనైనా కప్ సాధిస్తుందని భావించిన ఆర్సీబీ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. ఇది ఇలా ఉండగా.. గతేడాది సీజన్ కంటే ఈ ఏడాది సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుతమైన ప్రదర్శన కనబరిచిందని భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా కెప్టెన్‌గా విరాట్ కోహ్లి కంటే ఫాఫ్ డుప్లెసిస్ అత్యుత్తమంగా రాణించాడని మంజ్రేకర్ తెలిపాడు. "ఆర్సీబీ గత సీజన్ కంటే ప్రస్తుత సీజన్లో మెరుగ్గా రాణించింది. విరాట్ కోహ్లి కంటే డుప్లెసిస్ అత్యత్తుమ సారథిగా కన్పిస్తున్నాడు. కాగా వారిద్దరి నుంచి మరింత మంచి ఇన్నింగ్స్‌లు ఆశించాం. అయితే ప్లే ఆఫ్స్‌కు వచ్చారు కాబట్టి ఖచ్చితంగా టైటిల్ సాధిస్తారని భావించాను. అయితే క్వాలిఫైయర్-2లో ఓటమి గల కారణాలు వాళ్లకు బాగా తెలుసు. ఇక ఈ ఏడాది సీజన్లో ఆర్సీబీ బౌలర్లు అద్బుతంగా రాణించారు. అయితే బౌలర్లను సరైన సమయాల్లో డుప్లెసిస్ ఉపయోగించాడు. ఇక అతడు బ్యాటింగ్ పరంగా టోర్నీ ఆరంభంలో అద్భుతంగా రాణించనప్పటికీ.. అందరూ బ్యాటర్ల మాదిరిగానే సెకెండ్ హాఫ్‌లో కాస్త తడబడ్డాడు. అయినప్పటికీ కెప్టెన్‌గా మాత్రం డుప్లెసిస్ సరైన ఎంపిక" అని మంజ్రేకర్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: 'ఓవైపు తల్లికి సీరియస్.. అయినా మ్యాచ్‌లో అదరగొట్టాడు' -
'కోచ్‌గా ఉండుంటే కేఎల్ రాహుల్‌ను కచ్చితంగా తిట్టేవాడిని'
ఐపీఎల్ 2022 సీజన్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్ తమ తొలి సీజన్లోనే అదరగొట్టే ప్రదర్శన నమోదు చేసింది. కేఎల్ రాహుల్ కెప్టెన్సీలోని జట్టు లీగ్ దశలో మంచి విజయాలు అందుకొని ఓవరాల్‌గా 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు.. ఐదు పరాజయాలతో మూడో స్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఒత్తిడిని అదిగమించలేక.. ఆర్సీబీ చేతిలో కేఎల్ రాహుల్ సేన ఓటమి చవిచూసి ఇంటిబాట పట్టింది. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లోనూ సహచరులు విఫలమైనప్పటికి తాను మాత్రం 79 పరుగుల కీలక ఇన్నింగ్స్‌తో మెరిశాడు. అంతేకాదు వరుసగా నాలుగు సీజన్ల పాటు 600 పైచిలుకు పరుగులు సాధించిన తొలి బ్యాటర్‌గా లక్నో కెప్టెన్ చరిత్ర సృష్టించాడు. ఇలా అటు కెప్టెన్‌గా.. ఇటు బ్యాటర్‌గా సూపర్ సక్సెస్ అయిన కేఎల్ రాహుల్‌పై ప్రశంసల జల్లు కురుస్తున్న వేళ టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ మాత్రం కేఎల్ రాహుల్ ఆటతీరును విమర్శించడం ఆసక్తి కలిగించింది. ''కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ప్రదర్శన మెచ్చుకోదగినదే. కానీ ఓపెనర్‌గా వచ్చిన అతను.. చివరిదాకా నిలబడినప్పటికి బ్యాటింగ్‌లో వేగం తగ్గినట్లు అనిపించింది. హాజిల్‌వుడ్ బౌలింగ్‌ళో మంచి బౌండరీలు బాదిన రాహుల్ ఆఖర్లో అదే టెంపోను కంటిన్యూ చేయలేకపోయాడు. చివరి దాకా నిలబడాలనేది మంచిదే.. కానీ అదే సమయంలో వేగంగా ఆడడం కూడా ముఖ్యమే. కానీ నిన్నటి మ్యాచ్‌లో రాహుల్‌లో అది లోపించింది. తొలి పవర్ ప్లే ముగిసేసరికి 17 బంతుల్లో 26 పరుగులు చేశాడు. ఆ తర్వాత లక్నో విజయానికి ఏడు ఓవర్లలో 99 పరుగులు అవసరమైన దశలోనూ రాహుల్ 42 బంతుల్లో 48 పరుగులతో ఆడుతున్నాడు. ఆ తర్వాతే బ్యాట్ ఝులిపించిన రాహుల్ మిగతా 16 బంతుల్లో 31 పరుగులు చేశాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అలా కాకుండా మొదటి నుంచి రాహుల్ కాస్త దూకుడు ప్రదర్శించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. ఒకవేళ నేను రాహుల్‌కు కోచ్‌గా ఉంటే మాత్రం అతని ఆటతీరుపై కచ్చితంగా తిట్టేవాడిని. అతను కెప్టెన్‌గా ఉన్నప్పటికి నిర్ణయాన్ని రాహుల్ చేతుల్లో నుంచి నేను తీసుకునేవాడిని. అయితే ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి లాగా రాహుల్ కెప్టెన్సీకి అంతగా సూట్ కాలేడు. టెంపరరీగా అయితే మాత్రం అతను బెస్ట్ అని చెప్పొచ్చు.'' అని చెప్పుకొచ్చాడు. చదవండి: IPL 2022 Eliminator Match: లక్నో, ఆర్సీబీ ఎలిమినేటర్ మ్యాచ్.. ఈడెన్ గార్డెన్ స్టేడియంలో ఐదుగురు అరెస్ట్ లక్నో చేసిన తప్పులు ఇవే.. అందుకే ఓడిపోయింది! ఒకవేళ అలా కాకపోయి ఉంటే! Grateful for the game, grateful for the support! Check out Skipper's thoughts on today's eliminator🤝 See you next season! 👊#AbApniBaariHai💪 #IPL2022 🏆 #bhaukaalmachadenge #lsg #LucknowSuperGiants #T20 #TataIPL #Lucknow #UttarPradesh #LSG2022 pic.twitter.com/hyqA7tnXm8 — Lucknow Super Giants (@LucknowIPL) May 25, 2022 -
IPL 2022: ఎలిమినేటర్ మ్యాచ్‌లో విజయం వాళ్లదే.. కారణం ఏమిటంటే!
IPL 2022 Eliminator LSG Vs RCB Winner Prediction: ఐపీఎల్-2022లో మరో ఆసక్తికరపోరుకు రంగం సిద్ధమైంది. ఈ సీజన్‌తో క్యాష్ రిచ్ లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బుధవారం(25) నాటి పోరుకు ఇరు జట్లు సన్నద్ధమవుతున్నాయి. ఇక ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు క్వాలిఫైయర్-1లో ఓడిన రాజస్తాన్ రాయల్స్‌తో తలపడుతుంది. క్వాలిఫైయర్-2లో గనుక గెలుపొందితే గుజరాత్ టైటాన్స్‌తో పాటు ఫైనల్లో అడుగుపెట్టి టైటిల్ రేసులో నిలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మూడుసార్లు వరుసగా ప్లే ఆఫ్స్ చేరిన ఆర్సీబీ, అరంగేట్రంలోనే అదరగొట్టిన లక్నో విజయంపై కన్నేశాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్, వివాదాస్పద వ్యాఖ్యాతగా పేరొందిన సంజయ్ మంజ్రేకర్ ఎలిమినేటర్ మ్యాచ్ విజేతను అంచనా వేశాడు. లక్నో మీద ఆర్సీబీ గెలుస్తుందని జోస్యం చెప్పాడు. ఈ మేరకు ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో అతడు మాట్లాడుతూ.. ‘‘బెంగళూరుకు విజయావకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాళ్లకు స్టార్ ప్లేయర్లు ఉన్నారు. ఫాఫ్ డుప్లెసిస్ ఐపీఎల్ రికార్డు ఓసారి చూడండి. ప్లే ఆఫ్స్‌లో అతడు మరింతగా రెచ్చిపోతాడు. ఇక విరాట్ కోహ్లి కూడా గేరు మార్చాడు. అనుభవం కలిగిన ఆర్సీబీ జట్టు ఇలాంటి కీలక మ్యాచ్‌లలో ఒత్తిడిని అధిగమించి మంచి ప్రదర్శన నమోదు చేయగలదు. కాబట్టి వాళ్లు గెలుస్తారు’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా గత సీజన్లో చెన్నై సూపర్‌కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ఫాఫ్.. ఫైనల్లో కేకేఆర్‌పై 59 బంతుల్లో 86 పరుగులు చేసి తమ జట్టును చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఇక గుజరాత్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఫామ్‌లోకి వచ్చాడు. 54 బంతుల్లో 73 పరుగులు సాధించాడు. చదవండి👉🏾IPL 2022 Eliminator LSG Vs RCB: లక్నో 5 ఓటములు ఆ 3 జట్ల చేతిలోనే.. కీలక మ్యాచ్ తుదిజట్ల అంచనా చదవండి👉🏾Hardik Pandya: దీనంతటికీ కారణం వాళ్లే.. ఉప్పొంగిపోను! అతడిని చూసి గర్వపడుతున్నా! Josh ke saath, aa rahe hain humaare #SuperGiants kal ke eliminator mein bhaukaal machane! ❤️🔥 Tune in at 7:30 pm tomorrow to watch our #SuperGiants in action 🍿📺#IPL2022 🏆 #bhaukaalmachadenge #lsg #LucknowSuperGiants #T20 #TataIPL #Lucknow #UttarPradesh #LSG2022 pic.twitter.com/OjGFSIMd0g — Lucknow Super Giants (@LucknowIPL) May 24, 2022 Pumped up and ready to take on LSG in the #IPL2022 playoffs, RCB had two intense practice sessions in the lead up to the game. Hear about our preparations form our players and coaches on @kreditbee presents Game Day.#PlayBold #Mission2022 #RCB #ನಮ್ಮRCB #PlayOffs #LSGvRCB pic.twitter.com/8UW60sDnW3 — Royal Challengers Bangalore (@RCBTweets) May 25, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
'మయాంక్ అగర్వాల్ నిజమైన కెప్టెన్.. తన స్థానాన్ని త్యాగం చేశాడు'
పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్‌పై భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ ప్రశంసల వర్షం కురిపించాడు. తన జట్టు ప్రయోజనాల కోసం మయాంక్ తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేశాడని మయాంక్ తెలిపాడు. కాగా ఐపీఎల్-2022లో శిఖర్ ధావన్‌తో కలిసి అగర్వాల్ పంజాబ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించాడు. అయితే మయాంక్ తన ఓపెనింగ్ స్థానాన్ని ఆ జట్టు హార్డ్ హిట్టర్ జానీ బెయిర్‌స్టో కోసం త్యాగం చేశాడు. అయితే ఓపెనర్‌గా వచ్చిన బెయిర్‌స్టో అదరగొడుతున్నాడు. రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై బెయిర్‌స్టో అర్ధసెంచరీలు సాధించాడు."మయాంక్ అగర్వాల్ నిజమైన కెప్టెన్. బెయిర్‌స్టోకు అవకాశాన్ని ఇవ్వడం కోసం తన ఓపెనింగ్ స్థానాన్ని త్యాగం చేశాడు. అయితే బెయిర్ స్టో కూడా తనకు వచ్చిన అవకాశాన్ని ఊపయోగించుకున్నాడు. కాబట్టి మయాంక్ తీసుకున్న నిర్ణయం సరైనది" అని మంజ్రేకర్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: 'లివింగ్‌స్టోన్ కంటే దినేష్ కార్తీక్ బెస్ట్ ఫినిషర్' -
కొందరు పగబట్టారు.. అందుకే టీమిండియా కెప్టెన్ కాలేకపోయా!
టీమిండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ డాషింగ్ ఆల్‌రౌండర్‌గా అందరికి సుపరిచితమే. టీమిండియా సాధించిన రెండు మేజర్ వరల్డ్‌కప్స్(2007 టి20, 2011 వన్డే) జట్టులో యువీ సభ్యుడిగా ఉన్నాడు. దీంతోపాటు మరెన్నో ఘనతలు సాధించిన యువరాజ్ టీమిండియాకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా పనిచేయలేదు. మధ్యలో కొన్నిరోజులు జట్టుకు వైస్‌కెప్టెన్‌గా మాత్రమే ఉన్నాడు. తాజాగా కెప్టెన్‌గా అవకాశం రాకపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కొందరు తనపై పగబట్టారని.. అందుకే టీమిండియాకు కెప్టెన్ కాలేకపోయానని యువీ పేర్కొన్నాడు. మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో యువరాజ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ''గ్రెగ్ చాపెల్ ఉదంతం నన్ను టీమిండియా కెప్టెన్సీ నుంచి దూరం చేసింది. చాపెల్ 2005 నుంచి 2007 మధ్య కాలంలో టీమిండియా హెడ్‌కోచ్‌గా ఉన్నాడు. ఈ సమయంలో అతను తీసుకున్న కొన్న నిర్ణయాలపై జట్టులో అప్పటికే సీనియర్లు అయిన సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలు తప్పుబట్టారు. ముఖ్యంగా 2007 వరల్డ్‌కప్‌కు ముందు బ్యాటింగ్ ఆర్డ్ర్ను మార్చేయడం జట్టు సమతుల్యాన్ని దెబ్బతీసింది. ఓపెనర్‌గా సూపర్ సక్సెస్ అయిన సచిన్‌ను మిడిలార్డర్లో ఆడించడం.. గంగూలీతో చాపెల్‌కు పొసగకపోవడం.. దాదా రిటైర్ అవ్వడానికి.. 2007 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఘోర వైఫల్యం వెనుక చాపెల్ పాత్ర చాలా ఉందని సచిన్: బిలియన్ డ్రీమ్స పుస్తకంలో రాసి ఉంటుంది. ఇదే చాపెల్ ఉదంతం నన్ను కెప్టెన్సీకి దూరం చేసింది. 2007లో ఇంగ్లండ్ టూర్‌కు సెహ్వాగ్ అందుబాటులో లేడు. దీంతో ద్రవిడ్ కెప్టెన్‌గా.. నేను వైస్ కెప్టెన్‌గా ఉన్నాం. ఆ తర్వాత జట్టులోని సీనియర్లకు, చాపెల్‌కు విబేధాలు రావడం.. నేను మా టీమ్‌ను సపోర్ట్ చేయడం కొంతమంది బీసీసీఐ పెద్దలకు నచ్చలేదు. ఒక దశలో నేను తప్ప ఎవరు కెప్టెన్‌గా ఉన్నా మాకు అభ్యంతరం లేదని కొందరు అధికారులు పేర్కొన్నట్లు సమాచారం. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికి పరోక్షంగా కొందరు నాపై పగబట్టారు.. అందుకే కెప్టెన్ కాలేకపోయా. వాస్తవానికి 2007 టి20 ప్రపంచకప్‌కు నేను కెప్టెన్ అవ్వాల్సింది. అయితే మేనేజ్మెంట్ నుంచి సపోర్ట్ లేకపోవడం వల్ల మహీ భాయ్ కెప్టెన్ కావడం.. తొలిసారే టైటిల్ గెలవడం జరిగిపోయాయి. ఇందులో ధోని భయ్యాను నేను తప్పుబట్టలేను. మేనేజ్మెంట్ నిర్ణయం ప్రకారం ధోని కెప్టెన్ అయ్యాడు.. మంచి నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు.. టీమిండియాకు మూడు మేజర్ ట్రోపీలను అందించాడు. అతని కెప్టెన్సీలో ఆడడం నేను చేసుకున్న అదృష్టం'' అని చెప్పుకొచ్చాడు. ఇక యువరాజ్ తన 17 ఏళ్ల కెరీర్లో 40 టెస్టుల్లో 1900 పరుగులు, 304 వన్డేల్లో 8,701 పరుగులు, 58 టి20ల్లో 1177 పరుగులు సాధించాడు. వన్డేల్లో 14 సెంచరీలు అందుకున్న యువరాజ్ టెస్టుల్లో మూడు సెంచరీలు సాధించాడు. చదవండి: Chris Gayle: 'సరైన గౌరవం దక్కలేదు'.. యునివర్సల్ బాస్ సంచలన వ్యాఖ్యలు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
"అది ఒక చెత్త నిర్ణయం.. అశ్విన్ ఆ స్థానంలో బ్యాటింగ్‌కు అవసరమా"
ఐపీఎల్-2022లో నాలుగో విజయాన్ని గుజరాత్ టైటాన్స్ నమోదు చేసింది. గురువారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 37 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఇక 193 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ ఆదిలోనే పడక్కల్ వికెట్ కోల్పోయింది. అయితే రవిచంద్రన్ అశ్విన్ ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్‌కు వచ్చి అందరిని ఆశ్చర్యపరిచాడు. 8 బంతులు ఎదుర్కొన్న అశ్విన్ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. అయితే ఫస్ట్ డౌన్లో అశ్విన్ బ్యాటింగ్‌కు పంపడాన్ని భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తప్పుబట్టాడు. రాజస్తాన్ రాయల్స్ ఇటువంటి ప్రయోగాలు ఎందుకు చేస్తోందో అర్ధంకావడం లేదని అతడు విమర్శించాడు. "సంజూ శాంసన్ మూడో స్ధానంలో బ్యాటింగ్‌కు సిద్దంగా ఉన్నాడు. అటువంటి అప్పుడు అశ్విన్‌కు పంపాల్సిన అవసరం ఏముంది. బట్లర్ దూకుడుగా ఆడుతున్నప్పడు.. అతడి జోడిగా మూడో స్థానంలో శాంసన్ వచ్చే ఉంటే బాగుండేది. అశ్విన్‌ను ఆ స్థానంలో హిట్టింగ్ కోసం పంపారని నేను అనుకుంటున్నాను. కానీ అది అవసరం లేదు. లక్ష్యం 215 పరుగులు పైగా ఉంటే ఇటువంటి ప్రయోగాలు చేసినా పర్వాలేదు. కాగా ఒకరిని బ్యాటింగ్ పంపేటప్పుడు అతడికి హిట్టింగ్ చేయగల సామర్థ్యం ఉందా లేదా అన్న విషయాన్ని ముందే తెలుసుకోవాలి. బట్లర్ ఇన్నింగ్స్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. అటువంటి సమయంలో రాజస్తాన్ ఇటువంటి నిర్ణయం ఎందకు తీసుకుందో నాకు అర్ధం కావడం లేదు. ఇది ఒక చెత్త నిర్ణయం" అని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: 'రాజస్థాన్ రాయల్స్‌కే కాదు.. భారత్‌కు అత్యత్తుమ ఫినిషర్ అవుతా' -
శివమ్ దూబే.. మరో యువరాజ్ దొరికేసినట్లే!
శివమ్ దూబే.. ఐపీఎల్ 2022లో సంచలనం. సీఎస్కే తరపున ఆడుతున్న దూబే ఒక్క మ్యాచ్‌తో అభిమానులందరిని తనవైపు తిప్పుకున్నాడు. వాస్తవానికి దూబే ఈ సీజన్ ఆరంభం నుంచి మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఐదు మ్యాచ్‌లు కలిపి 207 పరుగులు చేసిన దూబే ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు. అయితే ఆర్సీబీపై ఆడిన 96 పరుగుల నాకౌట్ ఇన్నింగ్స్ దూబేను ఇవాళ ప్రత్యేకంగా నిలిపింది. అతని ఇన్నింగ్స్ చూసిన ఫ్యాన్స్.. మరో యువరాజ్ సింగ్ దొరికేశాడని అభిప్రాయపడుతున్నారు. సరిగ్గా గమనిస్తే.. దూబే కొట్టిన చాలా సిక్సర్లు డాషింగ్ ఆల్‌రౌండర్ షాట్లను గుర్తుచేశాయి. ఇదే విషయాన్ని టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. ''ఆర్సీబీతో మ్యాచ్‌లో శివమ్ దూబే ఆడిన ఇన్నింగ్స్‌కు ఒక ప్రత్యేకత ఉంది. అతను ఆడిన షాట్లు యువీని గుర్తుకుతెచ్చేలా ఉన్నాయి. రెండు షాట్లు మాత్రం కచ్చితంగా చెప్పుకోవాలి. హాజిల్‌వుడ్ వేసిన ఫుల్‌టాస్ బంతిని దూబే క్రీజులోనే ఉండి సిక్సర్ బాదాడు. ఇది మ్యాచ్‌కు హైలైట్ అని చెప్పొచ్చు. ఇలాంటి షాట్ చూసి చాన్నాళ్లయింది. గతంలో యువరాజ్ మాత్రమే ఇలాంటి షాట్స్ ఎక్కువగా ఆడేవాడు. ఆ తర్వాత వనిందు హసరంగా బౌలింగ్‌లో షార్ట్‌పిచ్ బంతిని బ్యాక్‌ఫుట్ తీసుకొని బౌండరీ తరలించాడు. ఈ రెండు షాట్లు చాలు.. అతను కేవలం హిట్టర్ మాత్రమే కాదు.. బాధ్యతతో ఆడగల బ్యాట్స్‌మన్ దాగున్నాడని చెప్పడానికి... ఇకపై దూబే ఇలాగే ఆడితే మాత్రం కచ్చితంగా మరో యువరాజ్ దొరికేసినట్లే'' అని చెప్పుకొచ్చాడు. ఎవరీ శివమ్ దూబే..? శివమ్ దూబే.. 1993 జూన్ 26న ముంబైలో పుట్టాడు. చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్నాడు. కానీ 14 ఏళ్ల వయసులో దూబే అనూహ్యంగా క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. అధిక బరువు, ఫిట్‌నెస్‌పై శ్రద్ద పెట్టకపోవడం.. ఆర్థిక సమస్యల కారణంగా క్రికెట్‌కు కొన్నాళ్ల పాటు దూరమయ్యాడు. ఆ తర్వాత 19 ఏళ్ల వయసులో రీ ఎంట్రీ ఇచ్చిన దూబే అప్పటినుంచి వెనుదిరిగి చూసుకోలేదు. 2019లో బంగ్లాదేశ్‌తో జరిగిన టి20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత అదే ఏడాది వెస్టిండీస్ సిరీస్ ద్వారా వన్డేల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇక 2020 ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో జరిగిన టి20 మ్యాచ్‌లో దూబే ఒక ఓవర్లో 34 పరుగులిచ్చి.. టి20 క్రికెట్ చరిత్రలో ఒక్క ఓవర్లో అత్యధిక పరుగులు ఇచ్చిన రెండో బౌలర్‌గా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఇప్పటివరకు టీమిండియా తరపున 13 టి20లు, ఒక వన్డే మ్యాచ్ ఆడాడు. ఇక 29 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 606 పరుగులు సాధించాడు. చదవండి: IPL 2022: రోహిత్ కెప్టెన్సీ వదిలేస్తాడనుకున్నా..! Shivam Dube: 11 ఏళ్ల రికార్డు సమం చేసిన శివమ్ దూబే View this post on Instagram A post shared by @11g.ub -
'అది కోహ్లి బ్యాటింగ్ కాదు.. అతడిలో పవర్ తగ్గింది'
ఐపీఎల్ 2022లో ఇప్పటి వరకు ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి భారీ ఇన్నింగ్స్ ఆడకపోయినప్పటకీ.. జట్టు విజయంలో తన వంతు పాత్ర మాత్రం పోషిస్తున్నాడు. ఇప్పటి వరకు ఈ సీజన్లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 106 పరుగులు సాధించాడు. కాగా ఏప్రిల్ 9 న ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లి 48 పరుగులు సాధించి ఆర్సీబీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు ఐపీఎల్లో విరాట్ కోహ్లి ప్రదర్శనపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. కోహ్లి ఇంకా పూర్తి స్థాయిలో ఫామ్‌లోకి రాలేదని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. అదే విధంగా కోహ్లి బ్యాటింగ్‌లో కాస్త దూకుడు తగ్గిందని మంజ్రేకర్ తెలిపాడు. "ఈ సీజన్లో కోహ్లి పరుగులు సాధిస్తున్నాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ కోహ్లి నుంచి ఎప్పడూ ఇటువంటి ఇన్నింగ్స్ నేను ఊహించను. అతడు గతంలో సిక్సర్ బాదితే బంతి స్టాండ్స్‌లో పడేది. ఇప్పుడు మాత్రం అతడు కేవలం బౌండరీ రోప్‌ను మాత్రమే క్లియర్ చేస్తున్నాడు. అతడు బ్యాటింగ్‌లో పవర్ గేమ్ కాస్త తగ్గింది. ఐదు-ఆరేళ్ల క్రితం అతడు భారీ సిక్సర్లు కొట్టేవాడు. నేను కేవలం అతడు హిట్టింగ్పైన మాత్రమే దృష్టి సారిస్తాను. అంతే తప్ప అతడు 50 లేదా 60 పరుగలు సాధించాడన్నది నాకు ముఖ్యం కాదు" అని సంజయ్ మంజ్రేకర్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: కేకేఆర్‌తో మ్యాచ్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్ న్యూస్! -
విరాట్ కోహ్లి దిగ్గజ కెప్టెన్ ఎలా అవుతాడు.. ?
Sanjay Manjrekar Comments On Virat Kohli Captaincy: టీమిండియా స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లిపై వివాదాస్పద వ్యాఖ్యాత, భారత మాజీ ప్లేయర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. కోహ్లిని భారత ఆల్‌టైమ్ దిగ్గజ కెప్టెన్ల జాబితాలో చేర్చలేమని, ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా అందించలేని వ్యక్తిని అలా ఎలా పరిగణిస్తారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. గతంలో టీమిండియాకు కెప్టెన్లుగా వ్యవహరించిన వారితో పోలిస్తే కోహ్లి చేసిందేమీ లేదని, కేవలం మీడియా హైప్ మూలంగానే అతనికి అర్హతకు మించి క్రెడిట్ దక్కిందని కోహ్లిపై అక్కసును వెల్లగక్కాడు. అయితే, ఆటగాడిగా తన పాత్రకు న్యాయం చేశాడని కోహ్లి అభిమానులకు ఊరట కలిగించే కామెంట్స్ చేశాడు. భారత క్రికెట్ జట్టు దిగ్గజ కెప్టెన్లలో ధోని ముఖ్యుడని, అతని సారధ్యంలో టీమిండియా అంతర్జాతీయ వేదికలపై మరపురాని విజయాలు నమోదు చేసిందని, ఈ క్రమంలో భారత్ ఎన్నో ఐసీసీ ట్రోఫీలను సాధించిందని, కెప్టెన్ సక్సెస్‌కు ఐసీసీ టోర్నీల్లో గెలుపే కొలమానమని, ఈ విషయంలో ధోని దరిదాపుల్లో కూడా కోహ్లి ఉండడని తన స్టైల్లో లాజిక్‌ను వివరించాడు. స్వదేశంలో విజయాలు, ద్వైపాక్షిక సిరీస్‌ల్లో విజయాలను ఐసీసీ ఈవెంట్లలో గెలుపుతో పోల్చలేమని ఆయన అభిప్రాయపడ్డాడు. దిగ్గజ కెప్టెన్ల విషయానికొస్తే.. తన దృష్టిలో టీ20, వన్డే ప్రపంచప్లతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీని అందించిన ధోని, 1983 ప్రపంచకప్‌ను అందించిన కపిల్ ముఖ్యులని పేర్కొన్న మంజ్రేకర్.. టీమిండియాకు దూకుడు నేర్పిన గంగూలీ, సునీల్ గవాస్కర్లను కూడా దిగ్గజ కెప్టెన్లతో పోల్చకుండా ఉండలేమని తెలిపాడు. అయితే, కెప్టెన్సీ విషయంలో కోహ్లికి తనదైన స్టైల్ ఉందని, ఓటమిని అంత ఈజీగా అంగీకరించడని, ఇటీవలి దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్ట్ సిరీస్‌లో అది మరోసారి నిరూపితమైందని గుర్తు చేశాడు. కోహ్లి ఎంతటి పోరాటపటిమ కనబర్చినప్పటివకీ, దురదృష్టం అతన్ని వెంటాడిందని అన్నాడు. 7 ఏళ్ల కెప్టెన్సీ కెరీర్లో కేవలం రెండు పర్యాయాలు మాత్రమే ఐసీసీ టోర్నీల్లో కోహ్లి టీమిండియాను ఫైనల్‌కు చేర్చిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించాడు. కాగా, దక్షిణాఫ్రికా చేతిలో టెస్ట్ సిరీస్ ఓటమి అనంతరం కోహ్లి సంపూర్ణంగా టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. చదవండి: IPL: విరాట్ కోహ్లి సహచరుడిపై పోలీసుల దాడి..! -
Ind Vs Sa: ధావన్‌కు రెస్ట్.. వెంకటేశ్‌తో ఓపెనింగ్.. భువీ వద్దు.. అతడే కరెక్ట్!
Ind Vs Sa 3rd Final ODI: చరిత్ర సృష్టించాలన్న పట్టుదలతో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన టీమిండియాకు టెస్టు సిరీస్ ఘోర పరాభవమే మిగిల్చింది. కనీసం వన్డే సిరీస్ సొంతం చేసుకుని ఆ లోటు తీర్చుకుందామని భావిస్తే అందులోనూ భంగపాటే. దీంతో ప్రొటిస్ జట్టుతో జరుగనున్న నామమాత్రపు మూడో వన్డేకు రాహుల్ సేన సిద్ధమవుతోంది. ఆదివారం నాటి ఆఖరి మ్యాచ్ అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత్ భారీ మార్పులతో బరిలోకి దిగితేనే ఫలితం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. సూర్యకుమార్ యాదవ్‌ను జట్టులోకి తీసుకోవాలని సూచించాడు. అలాగే భవిష్యత్తు ప్రణాళికలో భాగంగా మరికొన్ని ప్రయోగాలు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. ఈ మేరకు సంజయ్ ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడుతూ... ‘‘శిఖర్ ధావన్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. తను రెడీమేడ్ ఆప్షన్. ఎప్పుడు కావాలంటే అప్పుడు సిద్ధంగా ఉంటాడు. అయితే, తన స్థానంలో అలాంటి మరో ఆటగాడిని తయారుచేసుకోవాలి కదా. కాబట్టి ధావన్‌కు విశ్రాంతినిచ్చి వెంకటేశ్ అయ్యర్‌ను ఓపెనర్‌గా దింపితే బాగుంటుంది. కాబట్టి మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్‌ను చేర్చుకోవచ్చు. ఇక బౌలర్ల విషయానికొస్తే.... భువనేశ్వర్ కుమార్ స్థానంలో దీపక్ చహర్‌ను తీసుకోవాలి. శ్రీలంకలో అతడి బౌలింగ్‌ను చూశాం. మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. ఇక జస్ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలని భావిస్తే... సిరాజ్ లేదంటే ప్రసిద్‌కృష్ణను ఎంపిక చేసుకోవాలి. అశ్విన్‌ను పక్కనపెట్టి జయంత్ యాదవ్‌ను తీసుకోవాలి. తను 10 ఓవర్లు బౌల్ చేయగలడు. బ్యాటింగ్ కూడా చేస్తాడు’’ అని చెప్పుకొచ్చాడు. చదవండి: SA vs IND: దక్షిణాఫ్రికాతో మూడో వన్డే.. విరాట్ కోహ్లి దూరం! -
'భారత్ గెలవాలంటే అతడు జట్టులోకి రావాలి'
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో భారత్ ఓటమి చెందిన సంగతి తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో ప్రొటిస్ జట్టు కైవసం చేసుకుంది. అయితే రెండో వన్డేలో కూడా భారత బౌలర్లు పూర్తి స్ధాయిలో విఫలమయ్యారు. ఫాస్ట్ బౌలర్లతో పాటు స్పిన్నర్లు కూడా రాణించ లేకపోయారు. ఈ క్రమంలో భారత స్పిన్ విభాగంపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కీలక వాఖ్యలు చేశాడు. పరిమిత ఓవర్ల జట్టులోకి రవిచంద్రన్ అశ్విన్ ప్రత్యేక కారణం లేకుండానే తిరిగి వచ్చాడనీ, ప్రస్తుతం భారత జట్టుకు అతడు అవసరమైన స్పిన్నర్ కాదని మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. "అశ్విన్ ఎటువంటి కారణం లేకుండానే భారత వైట్-బాల్ జట్టులోకి తిరిగి వచ్చాడు. దక్షిణాఫ్రికాతో సిరీస్ ప్రారంభం నుంచి నేను చెప్పుతున్నాను. తిరిగి పరిమిత ఓవర్ల జట్టులోకి వస్తానాని అతడు కూడా ఊహించలేదు. కానీ సెలెక్టర్లు ఎందుకు ఎంపిక చేశారో నాకు అర్ధంకావడం లేదు. అతడు భారత్‌కు అవసరమైన స్పిన్నర్ కాదని ఇప్పుడు భారత్ గ్రహిస్తుంది. మ్యాచ్ మిడిల్ ఓవర్లలో వికెట్లు పడగొట్టే స్పిన్నర్లు భారత్‌కు కావాలి. స్పిన్నర్‌గా యుజ్వేంద్ర చాహల్ కూడా అంతగా రాణించలేకపోతున్నాడు. భారత జట్టు కుల్దీప్ యాదవ్ సేవలను కచ్చితంగా కోల్పోతోంది. అతడికి మిడిల్ ఓవర్లలో వికెట్లు పడగొట్టే సత్తా ఉంది" అని మంజ్రేకర్ పేర్కొన్నాడు. చదవండి: SA vs IND: వన్డేల్లో దక్షిణాఫ్రికా ఓపెనర్ ప్రపంచ రికార్డు.. తొలి ఆటగాడిగా -
ధావన్‌కు షాక్... ఓపెనర్‌గా వెంకటేశ్ అయ్యర్!
Ind Vs Sa 1st ODI: సఫారీ గడ్డపై వన్డే పోరుకు టీమిండియా సిద్ధమవుతోంది. గత పర్యటన తాలూకు ఫలితాలు పునరావృతం చేసి దక్షిణాఫ్రికాపై విజయం సాధించాలనే ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఇక రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గాయం కారణంగా సిరీస్‌కు దూరం కావడంతో కేఎల్ రాహుల్ పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. సారథిగా రాహుల్‌కు ఇదే తొలి వన్డే. మరోవైపు సుదీర్ఘ కాలం తర్వాత కెప్టెన్ అన్న ట్యాగ్ లేకుండా విరాట్ కోహ్లి బరిలోకి దిగడం ఇదే తొలిసారి. దీంతో పర్ల్ వేదికగా జరుగనున్న మొదటి వన్డే మరింత ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో క్రీడా విశ్లేషకులు తుది జట్టు కూర్పుపై అంచనాలు వేస్తున్నారు. ముఖ్యంగా ఓపెనింగ్ జోడీ ఎవరన్న అంశంపై చర్చిస్తున్నారు. ఇక మీడియాతో మాట్లాడిన రాహుల్.. రోహిత్ గైర్హాజరీలో తాను ఓపెనింగ్ చేయడం ఖాయమని స్పష్టం చేశాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ వసీం జాఫర్... రాహుల్‌కు జోడీగా శిఖర్ ధావన్‌ను ఎంచుకున్నాడు. అయితే, వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ మాత్రం వెంకటేశ్ అయ్యర్‌కు అవకాశం ఇచ్చాడు. జట్టులో ఆరుగురు బౌలర్లు ఉంటే బాగుంటుందని సూచించాడు. ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫోతో మాట్లాడిన అతడు... ‘‘శిఖర్ ధావన్‌కు ఈ మ్యాచ్‌లో విశ్రాంతి ఇవ్వాలి. కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్‌తో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. ఏడోస్థానంలో జయంత్ యాదవ్ రావాలి. అశ్విన్ జట్టులోకి రావాలి’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా 2018 పర్యటనలో భాగంగా భారత్ 4-1 తేడాతో వన్డే సిరీస్ గెలిచిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాతో టీమిండియా తొలి వన్డే- సంజయ్ మంజ్రేకర్ ఎంచుకున్న జట్టు: కేఎల్ రాహుల్(కెప్టెన్), వెంకటేశ్ అయ్యర్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, జయంత్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చహర్, యజువేంద్ర చాహల్, జస్ప్రీత్ బుమ్రా(వైస్ కెప్టెన్). చదవండి: Ind Vs Sa 1st ODI: భారీ స్కోరుకు అవకాశం.. టాస్ గెలిస్తే... -
పుజారా పర్వాలేదు.. రహానేకైతే మరో అవకాశం ఇవ్వను..!
దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌లో దారుణంగా విఫలమైన టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్, మాజీ వైస్ కెప్టెన్ అజింక్య రహానేపై భారత మాజీ క్రికెటర్, వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యాలు చేశాడు. పేలవ ఫామ్‌లో ఉన్న రహానే తప్పనిసరిగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడాలని ఆయన సూచించాడు. కేప్‌టౌన్ టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి కేవలం 10 పరుగులు మాత్రమే చేసిన రహానేకు తానైతే మరో అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ ఆడే అవకాశం ఇవ్వనని సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2020-21 ఆసీస్ పర్యటనలో రహానే చివరిసారిగా రాణించడం చూసామని, గతేడాది అతనాడిన 15 మ్యాచ్‌ల్లో 20.25 సగటున కేవలం 547 పరుగులు మాత్రమే చేశాడని, ఇక అతను తిరిగి ఫామ్‌లోకి వస్తాడన్న ఆశలు తనకు లేవని అన్నాడు. రహానేతో పోలిస్తే పుజారా కాస్త బెటర్ అని, అతనికైతే మరో అవకాశం ఇచ్చినా తప్పులేదని అభిప్రాయడ్డాడు. కాగా, దక్షిణాఫ్రికాతో మూడు టెస్ట్‌ల సిరీస్‌లో రహానే 6 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 136 పరుగులు చేయగా, పూజారా 124 పరుగులు మాత్రమే చేశాడు. ఇదిలా ఉంటే, మూడో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా 7 వికెట్ల తేడాతో టీమిండియాపై ఘన విజయం సాధించి, 3 టెస్ట్‌ల సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా నిర్ధేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి సునాయాసంగా ఛేదించింది. కీగన్ పీటర్సన్(82) సమయోచితమైన బ్యాటింగ్‌తో దక్షిణాఫ్రికాను విజయపు అంచులదాకా తీసుకెళ్లగా.. డస్సెన్(41 నాటౌట్), బవుమా(32 నాటౌట్) జట్టును విజయతీరాలకు చేర్చారు. చదవండి: Virat Kohli: 'ఆ ఇద్దరి' భవిష్యత్తు నిర్ణయించడం నా పని కాదు.. -
ఆ ముగ్గురు భారత పేసర్లు పాక్ దిగ్గజాలతో సమానం..
Sanjay Manjrekar: ఇటీవలి కాలంలో టీమిండియా విదేశాల్లో అద్భుతంగా రాణించడానికి బుమ్రా, షమీ, సిరాజ్‌లే ప్రధాన కారణమని మాజీ ఆటగాడు, వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. గత రెండు, మూడేళ్లలో ఓవర్సీస్లో టీమిండియా ప్రదర్శన చూస్తే అది ఇట్టే స్పష్టమవుతుందన్న ఆయన.. గతేడాది ఆసీస్‌ను వారి సొంతగడ్డపై మట్టికరిపించడాన్ని, ఇటీవల ఇంగ్లండ్‌కు వారి అడ్డాలోనే షాకివ్వడాన్ని ఉదహరించాడు. అలాగే, దక్షిణాఫ్రికాను ఇటీవల జరిగిన టెస్ట్‌లో రఫ్ఫాడించడంలో కూడా ఆ ముగ్గురు సీమర్లదే కీలకపాత్ర అని మంజ్రేకర్ కొనియాడాడు. తాజాగా ఓ ప్రముఖ క్రీడా మాధ్యమంతో ఆయన మాట్లాడుతూ.. టీమిండియా బౌలింగ్ త్రయాన్ని పాక్ దిగ్గజ బౌలర్లతో పోల్చాడు. బుమ్రా, షమీ, సిరాజ్‌లను చూస్తే 90లలో ప్రపంచ క్రికెట్‌ను శాసించిన పాక్ దిగ్గజ బౌలర్లు గుర్తుకొస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో విదేశీ పిచ్‌లపై పాక్ బౌలర్లు వసీం అక్రమ్, వకార్ యూనిస్, షోయబ్ అక్తర్ అరివీర భయంకరంగా చెలరేగేవారని, ప్రస్తుతం టీమిండియా పేస్ త్రయం కూడా వారిలాగే విజృంభిస్తుందని వ్యాఖ్యానించాడు. కాగా, సఫారీలతో ముగిసిన తొలి టెస్ట్‌లో ఈ టీమిండియా బౌలింగ్ త్రయం ఏకంగా 16 వికెట్లు పడగొట్టిన సంగతి తెలిసిందే. చదవండి: నా వల్ల కాదు బాబోయ్..! పాక్ హెడ్ కోచ్ పదవికి సక్లయిన్ గుడ్‌బై -
T20 WC: ‘ఆఖరి మ్యాచ్‌లో కోహ్లి... రోహిత్ శర్మకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పాలి’
T20 WC Kohli To Offer Leadership Rohit Sharma Final Game Sanjay Manjrekar: టీ20 వరల్డ్‌కప్ గెలిచి ఘనంగా కెప్టెన్సీకి వీడ్కోలు పలకాలన్న టీమిండియా సారథి విరాట్ కోహ్లిని దురదృష్టం వెక్కిరించింది. అఫ్గనిస్తాన్‌పై న్యూజిలాండ్ విజయం సాధించడంతో టీమిండియా సెమీస్ ఆశలు గల్లంతైన నేపథ్యంలో రిక్తహస్తాలతోనే వెనుదిరగాల్సిన పరిస్థితి. టోర్నీ ఆరంభంలో చేసిన భారత జట్టు చేసిన తప్పిదాల కారణంగా ఈవిధంగా భారీ మూల్యమే చెల్లించాల్సి వచ్చింది. నాకౌట్ దశలోనే వెనుదిరగాల్సి వచ్చింది. ఈ క్రమంలో నవంబరు 8న టీమిండియా.. పసికూన నమీబియాతో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. కాగా, టీ20 వరల్డ్‌కప్-2021 ముగియగానే టీ20 సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొంటానని కోహ్లి ప్రకటించిన నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈవెంట్ చివరి మ్యాచ్‌లో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు పగ్గాలు అప్పజెప్పాలని సూచించాడు. టీమిండియా- నమీబియా మ్యాచ్ నేపథ్యంలో మంజ్రేకర్ మాట్లాడుతూ.. ‘‘టీ20 క్రికెట్లో భారత్‌కు మెరుగైన భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్న కోహ్లి గనుక సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టాలని భావిస్తే.. ఫైనల్ మ్యాచ్‌లోనే తనంతట తానుగా రోహిత్ శర్మకు సారథ్య బాధ్యతలు అప్పగించాలి. అలా అయితే తనను విశ్రాంతి పేరిట పక్కకు పెట్టరు. కెప్టెన్‌గా తను ముందుకు సాగుతాడు’’ అని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు డఫా న్యూస్‌తో తన సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా ముచ్చటించాడు. కాగా టీ20 తదుపరి కెప్టెన్‌గా హిట్‌మాన్ నియామకం లాంఛనమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా.. వయసు రీత్యా 34 ఏళ్ల రోహిత్ కంటే కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ వంటి యువ ఆటగాళ్లకు అవకాశం ఇస్తే బాగుంటుందని కొంత మంది మాజీలు అంటున్నారు. ఈ నేపథ్యంలో మంజ్రేకర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇక 2017లో టీమిండియా టీ20 కెప్టెన్‌గా తొలి మ్యాచ్ ఆడిన కోహ్లి.. ఇప్పటి వరకు 49 మ్యాచ్‌లకు సారథ్యం వహించాడు. అందులో 29 మ్యాచ్‌ల(గెలుపు శాతం 63.82)లో విజయాలు అందించాడు. చదవండి: T20 WC: అఫ్గన్ తమ స్థాయికి తగ్గట్లు ఆడలేదు: టీమిండియా మాజీ క్రికెటర్లు India will be aiming to end their #T20WorldCup campaign with a win over Namibia while also testing its bench strength. #INDvNAM #T20WorldCup Presented by @DafanewsIndia Check out #DafaNewsIndia here: https://t.co/9dACPD5ATd pic.twitter.com/doLo5xv7My — Sanjay Manjrekar (@sanjaymanjrekar) November 8, 2021 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1981407197.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆ భారత బౌలర్ టీ20లకు పనికిరాడు.. పక్కన పెట్టండి
Sanajay Manjrekar commnets On Mohammed Shami: టీ20 ప్రపంచకప్-2021లో భాగంగా శుక్రవారం (నవంబర్5) టీమిండియా కీలక మ్యాచ్‌లో స్కాట్లాండ్తో తలపడనుంది. ఈ సందర్బంగా భారత బౌలర్లపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. టీమిండియా టీ20 జట్టులో చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉందని అతడు అభిప్రాయపడ్డాడు. టీ20లకు కాకుండా ఇతర ఫార్మాట్లకు సరిపోయే ఆటగాళ్లను తొలగించి వారి స్థానంలో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి అతడు సూచించాడు. దీనికి ఉదాహరణగా మహ్మద్ షమీని అతడు పేర్కొన్నాడు. టెస్ట్ క్రికెట్లో షమీ ఒక ఆద్బుతమైన పేసర్, అయితే పొట్టి ఫార్మాట్లో అతని కంటే మెరుగైన ఆటగాళ్ళు ఉన్నారని మంజ్రేకర్ చేప్పాడు. "భారత్ టీ20 జట్టులో మార్పులు చేయవలిసిన సమయం ఆసన్నమైందని నేను భావిస్తున్నాను. ప్రస్తుత జట్టులో కొంతమంది ఆటగాళ్లు టీ20 ఫార్మాట్లో కాకుండా, ఇతర ఫార్మాట్లో ఆడేందుకు బాగా సరిపోతారు. వారి స్థానంలో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి. నేను మహ్మద్ షమీ గురించి మాట్లాడుతున్నాను. నా దృష్టిలో షమీ భారత క్రికెట్ కు గొప్ప ఆస్తి. మంచి నాణ్యమైన బౌలర్ కూడా. అయితే అది టెస్టు మ్యాచ్ ల వరకే పరిమితం. టీ20లలో అతడి ఎకానమీ 9 కి చేరింది. అతడు ఆఫ్ఘనిస్తాన్పై బాగా బౌలింగ్ చేశాడని నాకు తెలుసు. అయితే టీ20 క్రికెట్లో మహ్మద్ షమీ కంటే మెరుగైన బౌలర్లు భారత్‌లో ఉన్నారు అని అతడు పేర్కొన్నాడు. చదవండి: Virat Kohli- Anushka Sharma: గట్టిగా అరిచి ఈ ప్రపంచానికి చెప్పాలని ఉంది.. అనుష్క భావోద్వేగం var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1981407197.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
టీ20 క్రికెట్‌కు అశ్విన్ అనర్హుడు.. నేనైతే అతన్ని జట్టులోకి తీసుకోను
Ashwin Is Not A Wicket Taker In T20 Format Says Sanjay Manjrekar : టీమిండియా టీ20 ప్రపంచకప్ జట్టు సభ్యుడు, ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ కీలక ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్‌పై వివాదాస్పద వ్యాఖ్యాత, టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అశ్విన్ టీ20 క్రికెట్‌కు అనర్హుడని, ఈ ఫార్మాట్లో అతనికి వికెట్లు తీసే సామర్ధ్యమే లేదని పేర్కొన్నాడు. గత కొన్నేళ్లుగా ఐపీఎల్లో అశ్విన్‌ను ఎందుకు ఆడిస్తున్నారో అర్ధం కావడం లేదని, నేనైతే అశ్విన్‌ను అసలు జట్టులోకే తీసుకోనని వ్యాఖ్యానించాడు. అశ్విన్ గురించి మాట్లాడుతూ ఇప్పటికే చాలా సమయాన్ని వృధా చేశామని, టీ20 బౌలర్‌గా అతను ఏ జట్టుకు కూడా ఉపయోగపడింది లేదని అభిప్రాయపడ్డాడు. పొట్టి ఫార్మాట్లో అశ్విన్ బౌలింగ్ శైలి మారాలనుకుంటే అది జరిగేది కాదని, గత ఐదారేళ్లుగా అతను ప్రాతినిధ్యం వహించిన ప్రతి జట్టుకు భారంగానే ఉన్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టర్నింగ్ వికెట్లపై తాను వికెట్ టేకింగ్ బౌలర్లవైపే మొగ్గుచూపుతానని.. వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, చహల్ లాంటి వారు తన బెస్ట్ ఛాయిస్ బౌలర్లని వెల్లడించాడు. సాంప్రదాయ టెస్ట్ ఫార్మాట్లో అశ్విన్ అద్భుతమైన బౌలరే అయినప్పటికీ.. పొట్టి ఫార్మాట్‌కు మాత్రం అస్సలు పనికిరాడని తెలిపాడు. ఓ ప్రముఖ క్రీడా ఛానల్ లైవ్ షోలో మాట్లాడుతూ.. మంజ్రేకర్ ఈ మేరకు వ్యాఖ్యానించాడు. కాగా, ఐపీఎల్-2021లో భాగంగా బుధవారం జరిగిన క్వాలిఫయర్-2 పోటీలో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్లు నువ్వా నేనా అన్న రీతిలో తలపడిన సంగతి తెలిసిందే. చివరి నిమిషం వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోరులో చివరి ఓవర్ వేసిన అశ్విన్ తొలుత వరుస బంతుల్లో వికెట్లు తీసి ఢిల్లీ శిబిరంలో ఆశలు రేకెత్తించినప్పటికీ.. ఐదో బంతికి కేకేఆర్ బ్యాటర్ రాహుల్ త్రిపాఠి సిక్సర్ బాది తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. చదవండి: ప్రపంచ ప్రఖ్యాత కట్టడంపై టీమిండియా జెర్సీ.. చరిత్రలో తొలిసారి -
వార్నర్‌ను పక్కకు పెట్టడానికి క్రికెటేతర కారణాలు ఉన్నాయి..!
Dropping David Warner Has Non Cricketing Reasons Says Sanjay Manjrekar: సన్‌రైజర్స్ యాజమాన్యం డేవిడ్ వార్నర్‌ను పక్కకు పెట్టడంపై వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ సంచలన కామెంట్స్ చేశాడు. వార్నర్‌ను జట్టు నుంచి తప్పించడానికి ఎస్ఆర్హెచ్ యాజమాన్యం వద్ద క్రికెటేతర కారణాలు ఉన్నాయని ఆరోపించాడు. వార్నర్‌పై వేటు వేయడానికి ఫామ్ లేమి ఒక్కటే కారణం కాదని.. ఒకవేళ అదే కారణంగా చూపడానికి ఎస్ఆర్హెచ్ యాజమాన్యం వద్ద సరైన ఆధారాల్లేవని అన్నాడు. వార్నర్ పేలవమైన ఫామ్ చాలాకాలంగా కొనసాగలేదన్న విషయాన్ని గట్టిగా ప్రస్తావించిన ఆయన.. వేటుకు కారణాలు అంతుచిక్కడంలేదని అన్నాడు. కానీ ఎక్కడో ఏదో తప్పు జరుగుతుందని చెప్పుకొచ్చాడు. కాగా, సెప్టెంబర్ 27న రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌కు ముందు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం వార్నర్‌ను జట్టు నుంచి తప్పించిన విషయం తెలిసిందే. ఆ తరువాత వార్నర్ కనీసం డగౌట్లో కూడా కనిపించలేదు. హోటల్ రూమ్‌కు మాత్రమే పరిమితమయ్యాడు. ఈ మధ్యలో అతను ఇన్‌స్టా వేదికగా సంచలన మెసేజ్‌ను షేర్ చేశాడు. తాను ఎస్ఆర్హెచ్ తరఫున మరో మ్యాచ్‌ను ఆడలేనని, తన చివరి మ్యాచ్‌ను ఆడేశానని పెద్ద బాంబు పేల్చాడు. అయితే అనూహ్యంగా నిన్న కేకేఆర్‌తో మ్యాచ్ సందర్భంగా ప్రేక్షకుల గ్యాలరీలో కనిపించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఇదిలా ఉంటే, 2013 సీజన్ నుంచి వరుసగా ప్రతి సీజన్లో 500 పరుగుల మార్కును క్రాస్ చేస్తూ వస్తున్న వార్నర్.. ప్రస్తుత సీజన్లో పేలవ ప్రదర్శనను కనబర్చాడు. 8 మ్యాచ్‌ల్లో కేవలం 195 పరుగులు మాత్రమే సాధించి తీవ్రంగా నిరుత్సాహపరిచాడు. 2016లో సన్‌రైజర్స్‌ను ఛాంపియన్‌గా నిలిపిన ఈ ఆసీస్ స్టార్ ఆటగాడు.. ప్రస్తుత సీజన్ తొలి దశలో ఎస్ఆర్హెచ్ సారధ్య బాధ్యతల నుంచి తప్పించబడ్డాడు. ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ వార్నర్ పట్ల అమర్యాదగా వ్యవహరించి.. కేన్ విలియమ్సన్‌ను కెప్టెన్సీ పగ్గాలు అప్పజెప్పింది. చదవండి: టీ20ల్లో చరిత్ర సృష్టించిన బాబర్ ఆజమ్.. గేల్, కోహ్లి రికార్డులు బద్దలు -
వచ్చే ఏడాది ఆ కేకేఆర్ ఆటగాడు 12-14 కోట్ల ధర పలుకుతాడు..!
Venkatesh Iyer Will Fetch 12 To 14 Crores In Next Year IPL Auction: వచ్చే ఏడాది ఐపీఎల్ వేలంలో కోల్‌కతా నైట్ రైడర్స్ యువ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్ భారీ ధర పలికే అవకాశం ఉందని వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ జోస్యం చెప్పాడు. ప్రస్తుత సీజన్లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొడుతున్న అయ్యర్.. మరుసటి సీజన్ మెగా ఆక్షన్‌లో 12 నుంచి 14 కోట్ల ధర పలుకుతాడని అంచనా వేశాడు. తాజాగా ఓ ప్రముఖ క్రీడా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. వెంకటేశ్ అయ్యర్ ఆటతీరుపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇటీవలే వెంకటేశ్ అయ్యర్ దేశవాళీ గణాంకాలు చూశానని.. ఫస్ట్‌క్లాస్, లిస్ట్ ఏ క్రికెట్లో అతని రికార్డు అద్భుతంగా ఉందని.. 47 సగటు, 92 స్ట్రైక్‌రేట్‌తో అత్యుత్తమంగా రాణించాడని కొనియాడాడు. ఈ గణాంకాలను కొలమానంగా తీసుకుంటే అతని ఏ స్థాయి ఆటగాడో స్పష్టమవుతుందని పేర్కొన్నాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగుతున్న అయ్యర్.. సుడిగాలి ఇన్నింగ్స్‌లతో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేయగల సమర్ధుడని, కీలక సమయాల్లో బంతితోనూ మ్యాజిక్ చేయగల సామర్ధ్యం అతని సొంతమని ఆకాశానికెత్తాడు. బ్యాక్ ఫుట్‌పై అతను ఆడే పుల్ షాట్లు, కట్ షాట్లు అత్యద్భుతమని.. ఈ నైపుణ్యం అతన్ని ప్రపంచ స్థాయి బ్యాటర్ల జాబితాలో చేరుస్తుందని పేర్కొన్నాడు. మొత్తంగా అయ్యర్ తన ఆల్‌రౌండ్ సామర్ధ్యంతో కేకేఆర్‌కు తరుపు ముక్కలా మారాడని పొగడ్తలతో ముంచెత్తాడు. కాగా, యూఏఈ వేదికగా జరుగుతున్న ఐపీఎల్-2021 రెండో దశలో కేకేఆర్ జట్టులోకి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన అయ్యర్.. అరంగేట్రం మ్యాచ్(27 బంతుల్లో 41 నాటౌట్; 7 ఫోర్లు, సిక్స్)లోనే అద్భుత ప్రదర్శనతో అబ్బురపరిచాడు. ఆ తర్వాత ముంబై(30 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), పంజాబ్(49 బంతుల్లో 67; 9 ఫోర్లు, సిక్స్) జట్లపై హాఫ్ సెంచరీలు సాధించి ఔరా అనిపించాడు. బ్యాట్‌తోనే కాకుండా బంతితోనూ మాయ చేసిన అతను.. ఢిల్లీ(2/29), పంజాబ్(1/30) జట్లపై వికెట్లు సాధించాడు. చదవండి: వార్నర్‌కు పట్టిన గతే ఆ సీఎస్కే ఆటగాడికి కూడా పడుతుంది..! -
వార్నర్‌కు పట్టిన గతే ఆ సీఎస్కే ఆటగాడికి కూడా పడుతుంది..!
Dale Steyn And Manjrekar Comments On Suresh Raina: ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఫామ్ లేమితో సతమతమవుతున్న స్టార్ ఆటగాళ్లను ఉద్దేశించి దిగ్గజ ఫాస్ట్ బౌలర్, సఫారీ మాజీ ఆటగాడు డేల్ స్టెయిన్, వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫామ్ కోల్పోతే ఎంతటి స్టార్ ఆటగాళ్లపై అయినా సరే వేటు తప్పదని.. ఇది డేవిడ్ వార్నర్ విషయంలో నిరూపితమైందని పేర్కొన్నారు. ఈ ఇద్దరు మాజీలు ముఖ్యంగా సీఎస్కే మిడిలార్డర్ బ్యాటర్ సురేశ్ రైనాను కార్నర్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధోని అండ చూసుకుని రైనా ఎన్ని రోజులు నెట్టుకొస్తాడని, అతన్ని జట్టులో నుంచి తప్పించే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. "I want MS Dhoni to play couple of more years for CSK" - Suresh Raina #WhistlePodu 📸- BCCI pic.twitter.com/LRnC36QDlJ — Chennai Super Kings Fans (@CskIPLTeam) September 29, 2021 ఇటీవలి కాలంలో రైనా స్కూల్ పిల్లాడిలా ఆడుతున్నాడని, అతని ఫామ్ ఇలాగే కొనసాగితే బహుశా ఇదే ఆఖరి ఐపీఎల్ కావచ్చని అన్నారు. సన్‌రైజర్స్‌కు అపురూప విజయాలు అందించిన వార్నర్‌ను ఆ ఫ్రాంచైజీ ఎలా అమర్యాదగా పక్కకు పెట్టిందో.. రైనాకు కూడా అదే గతి పట్టవచ్చని అభిప్రాయపడ్డారు. ధోనిని సీఎస్కే కెప్టెన్‌గా కొనసాగించాలని ఎన్ని సన్నాయి నొక్కులు నొక్కినా.. ఈ సీజనే రైనాకు ఆఖరిది అవుతుందని పేర్కొన్నారు. కాగా, ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో రైనా 11 మ్యాచ్‌ల్లో కేవలం 157 పరుగులు మాత్రమే చేసి సీఎస్కే అభిమానులను దారుణంగా నిరాశపరిచాడు. అయితే ధోని నేతృత్వంలో సీఎస్కే జట్టు మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతూ తొలి ప్లే ఆఫ్ బెర్తు ఖరారు చేసుకుంది. చదవండి: ఆ మ్యాచ్‌లు ఫిక్స్ అయ్యాయట..! -
డివిలియర్స్ కెప్టెన్ కాలేడు.. ఆ ముగ్గురికే చాన్స్
RCB New Captain After Virat Kohli.. ఐపీఎల్ 2021 తర్వాత విరాట్ కోహ్లి ఆర్సీబీ కెప్టెన్సీ పదవి నుంచి పక్కకు తప్పుకోనున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే కోహ్లి కెప్టెన్సీ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలిపాడు. అయితే కోహ్లి తర్వాత ఆర్సీబీకి కెప్టెన్ ఎవరు వ్యవహరిస్తే బాగుంటుందనే దానిపై టీమిండియా మాజీ క్రికెటర్.. క్రికెట్ ఎక్స్పర్ట్ సంజయ్ మంజ్రేకర్ స్పందించాడు. ''కోహ్లి పక్కకు తప్పుకున్న తర్వాత ప్రస్తుతం వైస్‌కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఏబీ డివిలియర్స్‌కు కెప్టెన్ అయ్యే అవకాశాలు లేవు. అతను జట్టును సరైన రీతిలో నడిపించలేడు. అంతేగాక వచ్చే ఐపీఎల్లో అతను ఆడే చాన్సులు కూడా చాలా తక్కువ. నా దృష్టిలో పొలార్డ్ ఆర్సీబీ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వచ్చే వేలంలో అతను ముంబై ఇండియన్స్‌ను నుంచి రిలీవ్ అయితే మాత్రం ఆర్సీబీ అతని కొనుగోలుపై ఆసక్తి చూపుతుంది. అంతేగాక ఐపీఎల్లో రోహిత్ శర్మ గైర్హాజరీలో పలుమార్లు కెప్టెన్‌గా వ్యవహరించిన పొలార్డ్ ముంబైకి మంచి విజయాలు అందించాడు. అతని అనుభవం ఎంతగానే ఉపయోగపడే అవకాశం ఉంది. చదవండి: Gautam Gambhir: చెన్నై ప్లేఆఫ్స్ చేరాక ధోని ఆ స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి! ఒకవేళ అతను కాదంటే తర్వాత కెప్టెన్ అయ్యే అవకాశాలు సూర్యకుమార్ లేదా డేవిడ్ వార్నర్‌లకు ఉంది. వచ్చే వేలంలో సూర్యకుమార్.. వార్నర్‌ల కోసం కచ్చితంగా పోటీ ఉండే అవకాశం ఉంది.'' అంటూ పేర్కొన్నాడు. మరోవైపు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ డేల్ స్టెయిన్ మాత్రం కేఎల్ రాహుల్‌కు ఆర్సీబీ కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. దీంతోపాటు డివిలియర్స్ కెప్టెన్ కాలేడని మంజ్రేకర్ చేసిన వ్యాఖ్యలను స్టెయిన్ సమర్థించడం విశేషం. చదవండి: Kohli Big Six: కోహ్లి కొడితే మాములుగా ఉంటుందా.. స్టేడియం అవతలే -
ఢిల్లీ ఫ్రాంఛైజీది గొప్ప నిర్ణయం.. అతడిపై ఒత్తిడి సహజం: మంజ్రేకర్
Sanjay Manjrekar Comments On Rishabh Pant: టీమిండియా యువ కెరటం రిషభ్ పంత్‌ను ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కెప్టెన్‌గా కొనసాగించాలన్న ఫ్రాంఛైజీ నిర్ణయాన్ని భారత మాజీ ఆటగాడు సంజయ్ మంజ్రేకర్ సమర్థించాడు. ఇదొక ఒక గొప్ప నిర్ణయమని కొనియాడాడు. పంత్‌లో నాయకత్వ లక్షణాలు మెండుగా ఉన్నాయని, అతడిని ఎంపిక చేసి మంచి పనిచేశారంటూ ప్రశంసించాడు. కాగా ఐపీఎల్-2021 సీజన్ ఆరంభంలో శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా దూరం కావడంతో, అతడి స్థానంలో రిషభ్ పంత్ సారథ్య బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అతడి కెప్టెన్సీలో ఢిల్లీ మంచి విజయాలు నమోదు చేసింది. కరోనా కారణంగా లీగ్ వాయిదా పడే నాటికి 8 మ్యాచ్‌లు ఆడి.. ఆరింటిలో గెలిచి 12 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఇక బుధవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగే మ్యాచ్‌తో రెండో అంచెలో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. ఇదిలా ఉండగా.. గాయం నుంచి కోలుకున్న శ్రేయస్ అయ్యర్ జట్టుతో చేరిన సంగతి తెలిసిందే. ఫొటో: IPL ఈ నేపథ్యంలో అతడికే పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు మొదట్లో వార్తలు వినిపించాయి. అయితే, ఆ అంచనాలను తలకిందులు చేస్తూ ఫ్రాంఛైజీ పంత్ వైపే మొగ్గు చూపింది. ఈ పరిణామాల నేపథ్యంలో కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ.. ‘‘రిషభ్ పంత్‌ను కెప్టెన్‌గా కొనసాగించాలన్న ఢిల్లీ మేనేజ్మెంట్ నిర్ణయం అద్భుతం. అతడిలో నాయకత్వ లక్షణాలు పుష్కలం. గల్లీ క్రికెట్ నుంచి కెప్టెన్ వరకు ఎదిగిన అతడి ప్రయాణం అమోఘం. ఇక శ్రేయస్ విషయానికొస్తే.. బ్యాటర్‌గా తనను నిరూపించుకోవాల్సి ఉంటుంది. అతడిపై ఒత్తిడి పెరగటం సహజం’’ అని పేర్కొన్నాడు. ఇక పవర్ హిట్టర్లతో ఢిల్లీ క్యాపిటల్స్ లైనప్ పటిష్టంగా ఉందన్న సంజయ్ మంజ్రేకర్... ఒక్కోసారి నిలకడలేమి వల్ల ఓటమి చవిచూడాల్సిన పరిస్థితులు ఎదురవుతాయని అన్నాడు. ధవన్, పృథ్వీ షా, రిషభ్ పంత్, హెట్మెయిర్, స్టొయినిస్.. వంటి కీలక ఆటగాళ్లు విఫలమైతే మాత్రం పరిస్థితులు తారుమారవుతాయని చెప్పుకొచ్చాడు. చదవండి: Sanju Samson: గెలుపుతో జోరు మీదున్న రాజస్తాన్‌కు ఎదురుదెబ్బ! Sun Risers Hyderabad: కేన్ మామ అదరగొట్టాడు.. అయినా అర్ధ సెంచరీ వృథా! View this post on Instagram A post shared by Sanjay Manjrekar (@sanjaysphotos) -
ఐపీఎల్ ప్యానెల్లో వివాదాస్పద వ్యాఖ్యాతకు నో ప్లేస్..
దుబాయ్: ఐపీఎల్ 2021 రెండో దశలో వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్న వారి పేర్లను స్టార్ స్పోర్ట్స్ ఆదివారం ప్రకటించింది. ఈ జాబితాలో స్థానం ఆశించిన టీమిండియా మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2021 రెండో దశ మ్యాచ్‌లకు ప్రసారదారు స్టార్ స్పోర్ట్స్ ఎంపిక చేసిన వ్యాఖ్యాతల బృందంలో మంజ్రేకర్‌కు చోటు దక్కలేదు. దీంతో యూఏఈ వేదికగా జరగనున్న కాష్ రిష్ లీగ్‌లో పాల్గొనే అవకాశాన్ని అతను మరోసారి కోల్పోయాడు. కాగా, మంజ్రేకర్ తన నోటి దురుసు కారణంగా 2019లో బీసీసీఐ కామెంట్రీ ప్యానెల్ నుంచి తప్పించబడ్డాడు. మంచి క్రికెట్ పరిజ్ఞానం.. అంతకుమించి ఇంగ్లీష్, హిందీ భాషలు అనర్గలంగా మాట్లాడగల సత్తా ఉన్న మంజ్రేకర్.. చాలా సందర్భాల్లో ఆటగాళ్లు, సహచర వ్యాఖ్యాతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిక్కుల్లో చిక్కుకున్నాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ ఆల్‌రౌండర్ పొలార్డ్‌ని 'మతిలేని క్రికెటర్' అంటూ, 2019 వన్డే ప్రపంచకప్‌లో రవీంద్ర జడేజాను 'బిట్స్ అండ్ పీసెస్ క్రికెటర్' అంటూ సంబోధించి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యాడు. ఒకానొక సందర్భంలో సహచర కామెంటేటర్ హర్షా భోగ్లేని హేళన చేస్తూ మాట్లాడినప్పుడు పెద్ద దుమారమే రేగింది. అతనికున్న నోటి దురుసు కారణంగా బీసీసీఐ వేటు వేసింది. తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరినప్పటికీ బీసీసీఐ అతడిని పరిగణలోకి తీసుకోలేదు. ఇదిలా ఉంటే, స్టార్ స్పోర్ట్స్ తాజాగా ప్రకటించిన ఐపీఎల్ వ్యాఖ్యాతల ప్యానెల్లో హర్షా భోగ్లే, సునీల్ గవాస్కర్, నిక్ నైట్, లక్ష్మణ్ శివరామకృష్ణన్, ఇయాన్ బిషప్(ఇంగ్లీష్) ఉన్నారు. ఇక హిందీ కామెంటేటర్స్ ప్యానెల్లో గౌతమ్ గంభీర్, పార్థివ్ పటేల్, ఇర్ఫాన్ పఠాన్, ఆకాశ్ చోప్రాలకు చోటు దక్కింది. ఇక ఇటీవల వ్యాఖ్యాతగా మారిన దినేష్ కార్తీక్ మ్యాచ్‌లు ఆడనుండడంతో అతడికి ఈ జాబితాలో చోటు దక్కలేదు. ఇంగ్లీష్ కామెంటేటర్స్ ప్యానెల్: హర్షా భోగ్లే, సునీల్ గావాస్కర్, లక్ష్మణ్ శివరామకృష్ణన్, మురళీ కార్తిక్, దీప్ దాస్‌గుప్తా, అంజుమ్ చోప్రా, ఇయాన్ బిషప్, అలన్ విల్కిన్స్, ఎంపుమలెలో ఎంబాంగ్వా, నిక్ నైట్, డానీ మోరిసన్, సైమన్ డౌల్, మ్యాథ్యూ హేడెన్, కెవిన్ పీటర్సన్. హిందీ కామెంటేటర్స్ ప్యానెల్: జతిన్ సప్రు, సురెన్ సుందరమ్, ఆకాశ్ చోప్రా, నిఖిల్ చోప్రా, తన్యా పురోహిత్, ఇర్ఫాన్ పఠాన్, గౌతమ్ గంభీర్, పార్థివ్ పటేల్, కిరణ్ మోరే. చదవండి: సిరీస్ ఇలా ముగియడం సిగ్గుచేటు.. ఆఖరి టెస్ట్ రద్దుపై ఆండర్సన్ భావోద్వేగం -
అప్పుడు నన్ను డ్రాప్ చేస్తేనే ద్రవిడ్ వచ్చాడు కదా..
న్యూఢిల్లీ: టీమిండియా టెస్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానేను పక్కన పెట్టి, అతడి స్థానంలో ఇతర ఆటగాళ్లకు చోటు ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైందని భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అన్నాడు. ఫాంలో లేని వాళ్లు తప్పుకొంటేనే కొత్త వాళ్లకు అవకాశాలు వస్తాయని పేర్కొన్నాడు. రహానేకు ఉద్వాసన పలకడం ద్వారా హనుమ విహారి, సూర్యకుమార్ యాదవ్ వంటి వాళ్లకు జట్టులో చోటు దక్కుతుందని అభిప్రాయపడ్డాడు. కాగా ఓవల్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో అజింక్య రహానే పేలవమైన ప్రదర్శనతో తేలిపోయిన సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 14 పరుగులు చేసిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక ఈ సిరీస్(లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో అర్థశతకం చేసినప్పటికీ ఫాం కొనసాగించలేకపోయాడు)లో మాత్రమే కాదు.. గతేడాది మెల్బోర్న్ టెస్టులో చివరిసారి సెంచరీ చేసిన రహానే ఆ తర్వాత ఆడిన 11 టెస్టుల్లో కనీస స్థాయి ప్రదర్శన కనబరచలేకపోయాడు. దీంతో రహానే ఆటతీరుపై విమర్శలు వస్తున్నాయి. టీమిండియా టెస్టు దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్ సైతం రహానేను పక్కన పెట్టాల్సిన సమయం వచ్చేసిందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా.. మంజ్రేకర్ స్పందిస్తూ.. ‘‘జట్టులో చోటు కోసం ఎదురుచూసే వారి గురించి కూడా ఆలోచించాలి. నన్నే ఉదాహరణగా తీసుకోండి. అప్పట్లో నన్ను డ్రాప్ చేస్తేనే కదా.. రాహుల్ ద్రవిడ్ వంటి ఆటగాళ్లు టీంలోకి వచ్చారు. ఇప్పుడు హనుమ విహారి, సూర్యకుమార్ యాదవ్ పరిస్థితి కూడా అంతే. రహానేలో మునుపటి కాన్ఫిడెన్స్ కనిపించడం లేదు. రిజర్వు బెంచ్‌లో ఉన్నవాళ్లకు అవకాశం ఇవ్వాలి’’ అని అభిప్రాయపడ్డాడు. ఇక రహానేకు ఇప్పటికే ఎన్నో అవకాశాలు వచ్చాయని.. మరో మ్యాచ్‌లో ఆడే అవకాశం గనుక వస్తే అతడు నిజంగా అదృష్టవంతుడేనని మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. చదవండి: కోహ్లి విషయంలో మొయిన్ అలీ చరిత్ర; డకౌట్లలో రహానే చెత్త రికార్డు -
Anderson-Bumrah: అతనే అండర్సన్‌పైకి బుమ్రాను ఉసిగొల్పి ఉంటాడు..
లండన్: లార్డ్స్ టెస్ట్‌లో అండర్సన్, బుమ్రాల మధ్య జరిగిన ఆసక్తికర ఎపిసోడ్‌పై టీమిండియా మాజీ క్రికెటర్, వివాదాస్పద వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈ మొత్తం వ్యవహారంలో బుమ్రా పాత్ర నామమాత్రమేనని, అతను చాలా అమాయకుడని, అసలు ఈ వివాదానికి తెరలేపింది టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లినేనని మంజ్రేకర్ ఆరోపించాడు. ఇంగ్లండ్ పేసర్ అండర్సన్‌ను రెచ్చగొట్టాలన్నది కోహ్లి ప్రణాళికలో భాగం అయ్యుండొచ్చని వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ప్రత్యర్థి జట్టులో ప్రధాన ఆటగాడిని కవ్వించాలన్నది కోహ్లి ఉద్దేశం అయ్యుండొచ్చని, అందులో భాగంగానే అండర్సన్‌పైకి బుమ్రాను ఉసిగొల్పి ఉంటాడని పేర్కొన్నాడు. According to few reports, Anderson asked Bumrah to bowl slow during this (watch video) famous 15-minute long over 😂 What we heard via stump mic- Bumrah to Buttler: I wasn't the one who asked to bowl slow. This means we're in for some aggressive cricket.#ENGvsIND pic.twitter.com/8F4TaKDRUK — Rushil Patale (@rushilpatale) August 18, 2021 లార్డ్స్ టెస్ట్‌లో అండర్సన్, బుమ్రాల ఎపిసోడ్‌పై మంజ్రేకర్ స్పందిస్తూ.. అండర్సన్‌కు బుమ్రా 90 మైళ్ల వేగంతో బంతులు వేశాడని.. పుల్ లెంగ్త్, షార్ట్ పిచ్ బంతులతో అతని దేహాన్ని టర్గెట్ చేశాడని, అప్పటివరకు 80-85 మైళ్ల వేగంతో బంతులు సంధించిన భారత పేసు గుర్రం ఒక్కసారిగా వేగం పెంచాడని పేర్కొన్నాడు. సాధారణంగా ఇది బుమ్రా స్వభావం కాదని, అతడు వేగంగా బంతులేస్తూ వికెట్లకు గురిపెడతాడని అన్నాడు. షార్ట్ పిచ్ బంతులు వేయాలన్నది బహుశా టీమిండియా కెప్టెన్ ప్రణాళిక అయ్యుంటుందని, దానిని బుమ్రా అమలు చేశాడని వ్యాఖ్యానించాడు. కాగా, లార్డ్స్ టెస్టులో భారత్, ఇంగ్లండ్ జట్ల ఆటగాళ్లు పరస్పరం కవ్వించుకున్న సంగతి తెలిసిందే. మూడో రోజు బ్యాటింగ్‌కు వచ్చిన జేమ్స్ అండర్సన్‌కు బుమ్రా షార్ట్ పిచ్ బంతులు వేయడంతో వివాదం మొదలైంది. కొన్ని బంతులు దేహానికి తగలడంతో అండర్సన్ ఆవేశపడ్డాడు. అతడికి సారీ చెబుదామని వెళ్లిన బుమ్రాను తోసేసి బూతులు తిట్టాడు. ఇది చీటింగ్ అని, ఉద్దేశపూర్వకంగా బంతితో భౌతిక దాడికి దిగావని ఆరోపించాడు. ఆ తర్వాతి రోజు బ్యాటింగ్‌కు వచ్చిన బుమ్రాకు ఇంగ్లండ్ పేసర్లు కూడా అదే తరహాలో షార్ట్ పిచ్ బంతులను విసిరి గాయపర్చాలని భావించారు. కానీ అది కాస్తా బెడిసికొట్టింది. బుమ్రా, షమీ జోడీ తొమ్మిదో వికెట్‌కు 89 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి టీమిండియాను పటిష్ట స్థితికి చేర్చారు. రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా పేసర్లు కూడా చెలరేగడంతో లార్డ్స్ టెస్టులో భారత్ 151 పరుగుల తేడాతో గెలుపొంది.. ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఇరు జట్ల మధ్య లీడ్స్ వేదికగా మూడో టెస్ట్ ఈనెల 25 నుంచి ప్రారంభం కానుంది. చదవండి: చెన్నై జట్టులో 'జోష్'.. మరింత పదునెక్కిన సీఎస్కే పేస్ దళం -
'నీకు ఎంపిక చేయడం రాదు.. ఇలాంటివి మానేస్తే మంచిది'
లార్డ్స్: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో వరుణుడు అడ్డు పడడంతో చేతిదాకా వచ్చిన విజయాన్ని టీమిండియా అందుకోలేకపోయింది. చేతిలో తొమ్మిది వికెట్లు.. చేయాల్సిన పరుగులు 157 కావడంతో టీమిండియా సులువుగా విజయం సాధిస్తుందని అంతా భావించారు. అయితే వర్షం రూపంలో చివరిరోజు ఆటకు పూర్తిగా అంతరాయం ఏర్పడడంతో డ్రాగా ముగిసింది. అయినప్పటికి టీమిండియా మొదటి టెస్టులో అద్భుత ప్రదర్శనను నమోదు చేసింది. ముఖ్యంగా బౌలింగ్‌లో మంచి ప్రతిభ కనబరిచిన భారత్ ఆతిధ్య జట్టును తక్కువ స్కోర్లకే కట్టడి చేయడంలో సఫలమైంది. అదే ఆత్మవిశ్వాసంతో ఆగస్టు 12 నుంచి లార్డ్స్ వేదికగా జరగనున్న రెండో టెస్టుకు టీమిండియా సమాయత్తమవుతుంది. ఈ నేపథ్యంలో మాజీ ఆటగాడు.. కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ రెండో టెస్టుకు టీమిండియా ఎలెవన్ జట్టును ప్రకటించాడు. అతను ఎంపిక చేసిన 11 మందిలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు చోటు దక్కలేదు. జడేజాతో పాటు శార్దూల్ ఠాకూర్ స్థానంలో సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, హనుమ విహారిలను ఎంపిక చేశాడు. వాస్తవానికి తొలి టెస్టులో జడేజా, శార్దూలిద్దరు మంచి ప్రదర్శన కనబరిచారు. బ్యాటింగ్‌లో జడేజా అర్థ సెంచరీతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం రావడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో నాలుగు వికెట్లతో రాణించాడు. ఈ ఇద్దరికి మంజ్రేకర్ తన జట్టులో అవకాశం కల్పించకపోవడంతో ట్విటర వేదికగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ విమర్శలు చేశారు. '' ఫాంలో ఉన్న ఇద్దరు ఆటగాళ్లను ఎంపిక చేయకపోవడం ఏంటి... నీకు ఎంపిక చేయడం రాదు.. ఇటువంటి మానేస్తే మంచిది.. కామెంటేరీ చేసుకో.. ఇలాంటివి నీకెందుకు.. ఆ పని టీమిండియా మేనేజ్మెంట్ చూసుకుంటుంది'' అంటూ ఘాటైన విమర్శలు చేశారు. -
బౌలింగ్ చేస్తున్నావా లేక అడుక్కుంటున్నావా..? అక్తర్ స్లెడ్జింగ్‌కు సెహ్వాగ్ కౌంటర్
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌కు దాయాది పాక్‌తో ముల్తాన్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ ఎంత ప్రత్యేకమైందో వివరించి చెప్పాల్సిన పని లేదు. నాటి మ్యాచ్‌లో సెహ్వాగ్ (375 బంతుల్లో 309; 39 ఫోర్లు, 6 సిక్సర్లు) ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. అయితే ఆ మ్యాచ్‌లో పాక్ ప్రధాన పేసర్ షోయబ్ అక్తర్ సెహ్వాగ్‌ను పదేపదే విసిగించాడు. వారి మధ్య జరిగిన నాటి సంభాషణను మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ తాజాగా పంచుకున్నాడు. ఓ ప్రముఖ స్పోర్ట్స్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఆ టెస్ట్‌లో సెహ్వాగ్ డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత అక్తర్ అతనిపైకి షార్ట్ పిచ్ బంతులతో దాడి చేశాడు. పదే పదే బౌన్సర్లు సంధించాడు. ఇక సెహ్వాగ్ ప్రతి షార్ట్ బాల్‌ను డకింగ్( బంతిని వదిలేసి కిందికి వంగడం) చేశాడు. సెహ్వాగ్ తెలివైన వ్యూహానికి చిర్రెత్తుకుపోయిన అక్తర్ అతని దగ్గరకు వెళ్లి.. ఒక్క పుల్ షాట్ ఆడే ప్రయత్నమైనా చేయొచ్చుగా అని కోరాడు. దానికి సెహ్వాగ్.. అరే అక్తర్.. నువ్వు బౌలింగ్ చేస్తున్నావా లేక అడుక్కుంటున్నావా అని దిమ్మతిరిగే బదులిచ్చాడని నాటి మ్యాచ్ విశేషాలను మంజ్రేకర్ గుర్తు చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా, సెహ్వాగ్ మెరుపు ఇన్నింగ్స్‌తో ముల్తాన్ టెస్ట్‌లో భారత్ రెండే రోజుల్లోనే 650 పరుగులు చేసింది. మిగతా రెండు రోజుల్లో పాక్‌ను రెండు సార్లు ఆలౌట్ చేసి ఇన్నింగ్స్ 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ అత్యంత దుమారానికి కూడా కారణమైంది. సచిన్ టెండూల్కర్ (194 ) డబుల్ సెంచరీకి దగ్గర్లో ఉండగా అప్పటి కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ మ్యాచ్‌ను డిక్లేర్ చేశాడు. ఇది పెద్ద వివాదం అయ్యింది. సచిన్ తన కన్న ముందు 5 డబుల్ సెంచరీలు చేస్తాడన్న అక్కసుతోనే ద్రవిడ్ మ్యాచ్‌ను డిక్లర్ చేశాడని ఆరోపణలు వచ్చాయి. కానీ మ్యాచ్ గెలవడం కోసమే అలా చేశానని, సచిన్‌కు ముందే చెప్పానని ద్రవిడ్ వివరణ ఇచ్చాడు. ఇదే విషయాన్ని సచిన్ తన బయోగ్రఫీ 'ప్లేయింగ్ ఇట్ మై వే' లో ప్రస్తావించాడు. -
‘జడ్డూను అలా ఎలా తీసుకుంటారు’.. మంజ్రేకర్ వ్యంగ్యాస్త్రాలు
ముంబై: టీమిండియా టాప్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ మరోసారి తన అక్కసును వెళ్లగక్కాడు. తాజాగా ముగిసిన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో జడేజా దారుణంగా విఫలం కావడంతో అతనిపై విమర్శనాస్త్రాలు సంధించాడు. మ్యాచ్‌కు ముందు పరిస్థితుల దృష్ట్యా జడేజాను ఆల్‌రౌండర్ కోటాలో కాకుండా బ్యాట్స్‌మెన్ స్థానం కోసం ఎంపిక చేశారని, కానీ టీమిండియా యాజమాన్యం చేసిన ఆ ప్రయోగంతో టీమిండియా నిండా మునిగిందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. ప్రపంచ నంబర్ వన్ ఆల్‌రౌండర్‌ను బ్యాట్స్‌మెన్ కోటాలో ఎలా తీసుకుంటారని జడేజాను ఉద్దేశించి విమర్శించాడు. తుది జట్టు ఎంపిక సమయానికి వాతావరణ పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, అటువంటి పరిస్థితుల్లో పేస్ బౌలర్‌ను కాకుండా జడేజాను ఆడించడం ఆశ్చర్యం కలిగించిందన్నాడు. ఆకాశం మేఘావృతమై, వర్షం వల్ల మ్యాచ్ ఒక రోజు ఆలస్యంగా ప్రారంభమైనా ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగడం చర్చనీయాంశమని పేర్కొన్నాడు. పిచ్ పొడిగా ఉండి, స్పిన్ అయ్యే ఛాన్స్ ఉంటే అశ్విన్‌తో పాటు జడేజాను తీసుకోవడంలో అర్థం ఉందని, కానీ ఆ పరిస్థితులు ఏకోశానా లేనప్పటికీ జడేజాను ఎంపిక చేయడం అర్ధరహితమని వెల్లడించాడు. ఈ విషయంలో టీమిండియా యాజమాన్యం వ్యవహరించిన తీరు పలు అనుమానాలకు తావిస్తుందని అన్నాడు. జడేజాను బ్యాట్స్‌మెన్ కోటాలో జట్టులోకి తీసుకోవాల్సి వస్తే.. అతని కంటే మెరుగైన, స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ హనుమ విహారి వైపు మొగ్గు చూపాల్సిందని అభిప్రాయపడ్డాడు. జడేజా స్థానంలో విహరిని తీసుకుని ఉంటే పరిస్థితి మెరుగ్గా ఉండేదని, ఒత్తిడి సమయాల్లో జడేజా కంటే విహారి చాలా బెటర్ అని, ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు రుజువైందని పేర్కొన్నాడు. జడేజా బ్యాట్స్‌మెనా.. లేక బౌలరా అన్న విషయం జట్టు యాజామన్యమే తేల్చుకోలేని పరిస్థితిలో ఉందని ఆరోపించాడు. ఈ విషయంలో టీమిండియా వ్యవహరిస్తున్న తీరుకు తాను వ్యతిరేకమని తెలిపాడు. కాగా, డబ్ల్యూటీసీ ఫైనల్లో జడేజా.. కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసి.. తొలి ఇన్నింగ్స్‌లో 15, రెండో ఇన్నింగ్స్‌లో 16 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు. ఇదిలా ఉంటే ఐసీసీ ఇటీవల విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్‌లో జడ్డూ.. ఆల్‌రౌండర్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. చదవండి: WTC Final: సోనూ భాయ్.. విలియమ్సన్‌ను పెవిలియన్‌కు పంపండి ప్లీజ్..! -
జడేజాపై మరోసారి అక్కసు వెళ్లగక్కిన ప్రముఖ వ్యాఖ్యాత..
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్.. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాపై మరోసారి తన అక్కసు వెల్లగక్కాడు. భారత్, న్యూజిలాండ్ మధ్య మరో 3 రోజుల్లో ప్రారంభంకానున్న మెగా పోరును దృష్టిలో ఉంచుకుని తన డ్రీమ్ జట్టును(ఇండియా) ప్రకటించాడు. ఈ జట్టులో దాదాపు అందరూ ఊహించినట్లుగానే ఆటగాళ్ల ఎంపిక జరిగినప్పటికీ.. ఆల్‌రౌండర్ల కోటాలో జడేజాకు బదులు హనుమ విహారిని ఎంపిక చేసి, జడేజాపై తన కోపాన్ని మరోసారి బహిర్గతం చేశాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా అశ్విన్‌కు ఓటేసిన ఆయన.. పార్ట్ టైమ్ స్పిన్నర్‌గా విహారిని పరిగణలోకి తీసుకున్నాడు. ఇందుకు ఆయన వివరణ కూడా ఇచ్చాడు. ఇంగ్లండ్‌లోని పరిస్థితుల దృష్ట్యా ఒకే స్పిన్నర్ అవసరం ఉంటుందని, అందుకే సీనియర్ అయిన అశ్విన్‌ను తీసుకుకున్నానని చెప్పాడు. మరోవైపు పేసర్ల కోటాలో సీనియర్ బౌలర్ ఇషాంత్‌ను కాదన్న ఆయన.. సిరాజ్ వైపు మొగ్గుచూపాడు. పేసర్ల కోటాలో షమీ, బుమ్రా, సిరాజ్‌లకు అవకాశమిచ్చాడు. ఆస్ట్రేలియాలో సిరాజ్ బంతిని బాగా స్వింగ్ చేశాడు కాబట్టే ఇషాంత్ స్థానంలో అతనికి అవకాశమిచ్చానని వివరణ ఇచ్చాడు. కాగా, ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మలను ఎన్నుకున్న మంజ్రేకర్.. పుజారా, విరాట్ కోహ్లీ, రహానేలకు వరుసగా అవకాశం ఇచ్చాడు. విహారి రూపంలో అదనపు బ్యాట్స్‌మెన్‌ని జట్టులోకి తీసుకున్న ఆయన.. ఏడవ స్థానం కోసం రిషబ్ పంత్‌ను ఎంపిక చేశాడు. ఆల్‌రౌండర్ కోటాలో విహారి, జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్ధూల్ ఠాకూర్‌ని పరిగణలోకి తీసుకున్న ఆయన.. చివరకు విహారికే ఓటేశాడు. మంజ్రేకర్ డ్రీమ్ ఎలెవెన్: శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), రహానే, హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), అశ్విన్, షమీ, బుమ్రా, మహ్మద్ సిరాజ్. చదవండి: నాటి ప్రపంచ ఛాంపియన్.. నేడు ఛాయ్ అమ్ముకుంటున్నాడు -
జడేజాకు ఇంగ్లీష్ రాదు.. తిట్టినా అర్ధం కాదు
ముంబై: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకి ఇంగ్లీష్ రాదని, అందువల్లే తాను బిట్స్ అండ్ పీసెస్ అంటూ చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకున్నాడని భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యానించాడు. బిట్స్ అండ్ పీసెస్ వ్యవహారంపై ఓ నెటిజన్‌తో జరిపిన చాట్‌లో ఆయన ఈ మేరకు కామెంట్ చేశాడు. అయితే, తాజాగా ఈ చాట్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్స్ వెలుగులోకి రావడంతో జడేజా, మంజ్రేకర్ మధ్య వార్ మళ్లీ మొదలైనట్లైంది. వివరాల్లోకి వెళితే.. సూర్య నారాయణ్ అనే ట్విటర్ యూజర్, తాను మంజ్రేకర్‌తో జరిపిన ట్విటర్ సంభాషణను లీక్ చేశాడు. అందులో మంజ్రేకర్.. జడేజాకు ఇంగ్లీష్ రాదని, అసలు తాను ఏం చెబుతున్నానో కూడా అతనికి అర్థం కాదని హేళన చేస్తాడు. బిట్స్ అండ్ పీసెస్ అసలు అర్థం జడేజాకు ఇప్పటికీ తెలీదని, కనీసం దాని అర్ధం తెలుసుకునే ప్రయత్నం కూడా అతను చేయడని పేర్కొన్నాడు. అలాగే 'వెర్బల్ డయేరియా(నోటి విరేచనాలు)' అంటూ జడేజా తననుద్ధేశించి సంబోధించిన పదాన్ని కూడా ఎవరైనా అతనికి చెప్పి ఉంటారని ఎగతాలి చేశాడు. అంతటితో ఆగని మంజ్రేకర్.. సదరు అభిమానిపై కూడా ఫైరయ్యాడు. నీలాగా ప్లేయర్స్‌ను పొగడటానికి నేను అభిమానిని కాదు.. ఓ విశ్లేషకుడినంటూ తన అహంకారాన్ని ప్రదర్శించాడు. కాగా, 2019 వన్డే ప్రపంచకప్ సమయంలో రవీంద్ర జడేజాని బిట్స్ అండ్ పీసెస్ క్రికెటర్ అని సంబోధిస్తూ సంజయ్ మంజ్రేకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై జడ్డూ కూడా ఘాటుగానే స్పందించాడు. మంజ్రేకర్.. నీ కెరీర్లో నువ్వు ఆడిన మ్యాచ్‌ల కంటే నేను రెట్టింపు మ్యాచ్‌లను ఆడాను, ఇప్పటికీ ఆడుతున్నాను. ఏదైనా సాధించిన వారిని గౌరవించడం నేర్చుకో. ఇప్పటికే చాలా విన్నాను.. ఇకనైనా నీ నోటి విరోచనాలు ఆపు’’ అంటూ కౌంటరిచ్చాడు. అయితే ఈ వివాదం అంతటితో సద్దుమణిగిందనుకుంటే, తాజాగా లీకైన ట్విటర్ చాట్ మళ్లీ వివాదాన్ని తెరపైకి తెచ్చింది. దీనిపై జడేజా ఎలా స్పందిస్తాడో చూడాలి. చదవండి: వాళ్లు నిజంగా జాత్యాహంకారులే.. ఇప్పటికీ మన యాసను ఎగతాలి చేస్తారు -
'అలా అనకు చారీ.. నా మనసు బాధపడుతుంది'
లండన్: రవిచంద్రన్ అశ్విన్.. ఈ తరం అగ్రశ్రేణి స్పిన్నర్లలో ఒకడిగా పేరు సంపాదించాడు. టీమిండియా తరపున ఆడుతున్న అశ్విన్ జట్టుకు ఎన్నో కీలక విజయాలు సాధించిపెట్టాడు. ఇటీవలే ఆసీస్‌తో జరిగిన టెస్టు సిరీస్.. అనంతరం స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో అశ్విన్ దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకూ 78 టెస్టుల్లో 409 వికెట్లు తీసిన అశ్విన్ కెరీర్లో మొత్తం 30సార్లు ఒక ఇన్నింగ్స్‌లో 5 కంటే ఎక్కువ వికెట్లు తీసి అత్యుత్తమ స్పిన్నర్‌గా నిలిచాడు. అయితే అశ్విన్ మంచి స్పిన్నరే కావచ్చు కానీ.. ఆల్‌టైమ్ గ్రేట్‌లో ఒకడు మాత్రం కాదని కామెంటేటర్ మంజ్రేకర్ ఒక ఇంటర్య్వూలో అభిప్రాయపడ్డాడు. స్వదేశంలో రాణిస్తాడనే పేరున్న అశ్విన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికాలో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడని పేర్కొన్నాడు. అందువల్ల అశ్విన్ ఆల్‌టైమ్ గ్రేట్ ప్లేయర్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని తెలిపాడు. దీనికి సంబంధించి మంజ్రేకర్ ఆదివారం ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలిపాడు. మంజ్రేకర్ కామెంట్స్‌పై రవిచంద్రన్ అశ్విన్ తనదైన శైలిలో పంచ్ ఇచ్చాడు. తమిళ బ్లాక్బాస్టర్ సినిమా అన్నియన్ (అపరిచితుడు)లోని ఓ డైలాగ్ మీమ్‌ను పోస్ట్ చేశాడు. 'అప్డి సొల్లాదా చారీ.. మనసెల్లమ్ వలికిర్దు (అలా అనకు చారీ.. నా మనసు బాధపడుతుంది) అనే డైలాగ్‌ను షేర్ చేశాడు. అశ్విన్ పెట్టిన ఈ పోస్టు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.కాగా అశ్విన్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడేందుకు ఇప్పటికే టీమిండియాతో కలిసి ఇంగ్లండ్‌కు చేరుకొని క్వారంటైన్లో ఉన్నాడు. జూన్ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్ వేదికగా న్యూజిలాండ్, భారత్‌ల మధ్య చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. చదవండి: జాతి వివక్ష: మరో ఇంగ్లండ్ క్రికెటర్‌పై వేటు పడనుందా! అశ్విన్ ఆల్‌టైమ్ గ్రేట్ స్పిన్నర్ అంటే ఒప్పుకోను.. 😂😂😂🤩🤩 https://t.co/PFJavMfdIE pic.twitter.com/RbWnO9wYti — Mask up and take your vaccine🙏🙏🇮🇳 (@ashwinravi99) June 7, 2021 -
అశ్విన్ ఆల్‌టైమ్ గ్రేట్ స్పిన్నర్ అంటే ఒప్పుకోను..
ముంబై: భారత అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా పరిగణించబడే స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌పై టీమిండియా మాజీ ఆటగాడు, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 2019 వన్డే ప్రపంచకప్ సందర్భంగా టీమిండియా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ రవీంద్ర జడేజాపై కూడా ఇలాంటి వాఖ్యలే చేసిన ఆయన.. తాజాగా అశ్విన్‌ను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారంది. కుంబ్లే, హర్భజన్ తర్వాత భారత క్రికెట్‌పై ఆ స్థాయి ముద్ర వేసిన స్పిన్నర్‌గా పేరు తెచ్చుకున్న అశ్విన్‌ను ఆల్‌టైమ్ గ్రేట్ స్పిన్నర్ అంటే ఒప్పుకోనని, ఎవరైనా అతన్ని అలా పరిగణిస్తే తనకు చాలా ఇబ్బందిగా ఉంటుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే, తాను చేసిన ఈ వ్యాఖ్యల వెనుక బలమైన కారణం ఉందంటున్నాడు మంజ్రేకర్. SENA దేశాలైన దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా పిచ్‌లపై అశ్విన్ పెద్దగా ప్రభావం చూపలేదని, ఆ దేశాల్లో అశ్విన్ ఒక్కసారి కూడా ఐదు వికెట్ల ప్రదర్శన చేయలేదని, అలాంటప్పుడు అతన్ని ఆల్‌టైమ్ గ్రేట్‌గా ఎలా పరిగణిస్తారని ప్రశ్నించాడు. అశ్విన్ మంచి ప్లేయరే అయ్యుండొచ్చు కానీ, ఆల్‌టైమ్ గ్రేట్స్ మాత్రం కాదని, అతన్ని దిగ్గజాల జాబితాలో కలపడం తనకు ఎంత మాత్రం నచ్చదని వ్యాఖ్యానించాడు. భారత్‌లో అశ్విన్‌కు తిరుగులేదని అంటారు. కానీ, గడిచిన కొన్నేళ్లేగా జడేజా కూడా అశ్విన్‌తో పోటీ పడి మరీ వికెట్లు తీశాడు, ఇంగ్లండ్‌తో సిరీస్‌లో అయితే అశ్విన్ కంటే అక్షర్ పటేల్ ఎక్కువ వికెట్లు సాధించాడని గుర్తు చేశాడు. అలాంటప్పుడు అశ్విన్‌ను దిగ్గజ స్పిన్నర్‌గా పరిగణించడం ఏమాత్రం సరికాదని ఆయన అభిప్రాయపడ్డాడు. ఓ యూట్యూబ్ ఛానెల్లో ఇంటర్వ్యూ సందర్భంగా మంజ్రేకర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కాగా, 34 ఏళ్ల అశ్విన్.. ప్రస్తుతం 78 టెస్ట్‌ల్లో 409 వికెట్లతో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న నాలుగో బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఇందులో 30 ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అనిల్ కుంబ్లే అగ్రస్థానంలో ఉండగా, కపిల్, హర్భజన్లు రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. అశ్విన్ బౌలర్ల విభాగంలో ప్రస్తుతం టెస్ట్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో, ఆల్‌రౌండర్ల లిస్ట్‌లో నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. చదవండి: క్వారంటైన్ కంప్లీట్.. ప్రాక్టీస్ షురూ -
మంజ్రేకర్ కోసం వెతికాను.. అతని కోసమే అలా చేశాను
ముంబై: 2019 వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సందర్భంగా బ్యాట్ తిప్పుతూ చేసుకున్న సంబురాలపై టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా తాజా స్పందించాడు. ప్రముఖ వ్యాఖ్యాత టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్.. అదే వరల్డ్ కప్‌లో ఓ మ్యాచ్ సందర్భంగా తనను ఉద్దేశిస్తూ 'బిట్స్ అండ్ పీసెస్' లాంటి క్రికెటర్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడని, అందుకు బదులుగా తాను అలా సంబురాలు చేసుకున్నాని జడ్డూ చెప్పుకొచ్చాడు. ఆ మ్యాచ్‌లో అర్ధశతకం సాధించిన అనంతరం కామెంట్రీ బాక్స్ ఎక్కడుందా అని వెతికానని, అది అక్కడే ఎక్కడో ఉంటుందని భావించానని, మంజ్రేకర్ కోసమే అప్పుడలా చేశానని వివరించాడు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి జడేజా సైతం అప్పుడే ట్విటర్ వేదికగా తనదైన శైలిలో మంజ్రేకర్‌కు చురకలంటించాడు. నీ నోటి విరేచనాలను ఆపుకోవాలంటూ ఘాటుగా బదులిచ్చాడు. ఇదిలా ఉంటే, ఆ మ్యాచ్‌లో జడేజా 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 77 పరుగులు సాధించి టీమిండియాను గెలిపించినంత పనిచేశాడు. అతను ధోనీ (72 బంతుల్లో ఫోర్, సిక్స్‌తో 50)తో కలిసి ఏడో వికెట్‌కు 116 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఈ క్రమంలోనే అర్ధశతకం పూర్తి చేసుకుని, బ్యాట్‌ను పైకెత్తి కత్తి తిప్పినట్లు తిప్పి సంబరాలు చేసుకున్నాడు. కాగా, ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 239/8 స్కోర్ చేసి టీమిండియాకు స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే, ఛేదనలో భారత టాప్ ఆర్డర్ పేకమేడలా కూలడంతో ఓ దశలో 92 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిలుచుంది. అయితే, జడేజా, ధోనీ శతక భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. చివర్లో కివీస్ ఆటగాళ్లు అనూహ్యంగా పుంజుకున్న ధోని, జడేజాను స్వల్ప వ్యవధిలో ఔట్ చేయడంతో భారత్ 49.3 ఓవర్లలో 221 పరుగులకు ఆలౌటై 18 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. చదవండి: ఖరీదైన ఇంటిని సొంతం చేసుకున్న టీమిండియా మాజీ సారధి -
ఆ జట్టుకు గెలిచే అర్హతే లేదు: మంజ్రేకర్
చెన్నై: ముంబైతో శనివారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ తుది జట్టు ఎంపికపై టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు. తుది జట్టులో ముగ్గురు అన్క్యాప్డ్ ఆటగాళ్లకు(అభిషేక్ శర్మ, విరాట్ సింగ్, అబ్దుల్ సమద్) ఒకేసారి అవకాశం కల్పించడంపై జట్టు యాజమాన్యానికి చురకలంటించాడు. ప్రత్యర్ధిని తక్కువ స్కోర్‌కే(150 పరుగులు) కట్టడి చేయగలిగినా బలహీనమైన మిడిలార్డర్ కారణంగా మ్యాచ్ చేజార్చుకున్న వైనంపై అసహనాన్ని వ్యక్తం చేశాడు. అసలు సన్‌రైజర్స్‌కు గెలిచే అర్హతే లేదని మండిపడ్డాడు. కష్టసాధ్యం కాని లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెనర్లు వార్నర్(34 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), బెయిర్‌స్టో(22 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) శుభారంభాన్ని అందించినా సన్‌రైజర్స్ మిడిలార్డర్ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిందని ధ్వజమెత్తాడు. Sorry to say, but anyone that picks Abhishek Sharma, Virat Singh and Abdul Samad all together in one playing XI does not deserve to win. — Sanjay Manjrekar (@sanjaymanjrekar) April 17, 2021 కొత్త కుర్రాళ్లు విరాట్ సింగ్(12 బంతుల్లో 11; ఫోర్), అభిషేక్ శర్మ(4 బంతుల్లో 2), అబ్దుల్ సమద్(8 బంతుల్లో 7; ఫోర్) అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని, దాని ప్రభావం జట్టుపై పడందని అభిప్రాయపడ్డాడు. మొత్తంగా ముంబైతో మ్యాచ్‌ను చేజార్చుకోవడానికి ఎస్ఆర్హెచ్ యాజమాన్యమే ప్రధాన కారణమని, తుది జట్టు ఎంపిక విషయంలో యాజమాన్యం అనుసరిస్తున్న విధానాన్ని పునఃసమీక్షించుకోవాలని, లేకపోతే ఆ జట్టు బోణీ కొట్టడానికి కూడా తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని హెచ్చరించాడు. 2016 సీజన్ ఛాంపియన్స్‌గా నిలిచిన ఎస్ఆర్హెచ్.. 3 మ్యాచ్‌ల తర్వాత కూడా గెలుపు పట్టాలెక్కలేకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే నిన్న చెన్నై వేదికగా ముంబైతో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ జట్టు 13 పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ముంబై నిర్ధేశించిన 151 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఎస్ఆర్హెచ్ 19.4 ఓవర్లలో 137 పరగులకే చాపచుట్టేసింది. ఓపెనర్లు వార్నర్(36), బెయిర్‌స్టో(43), విరాట్ సింగ్(11), విజయ్ శంకర్(28) మినహా మిగిలిన ఆటగాళ్లెవ్వరూ కనీసం రెండంకెల స్కోర్‌ను కూడా చేరుకోలేకపోయారు. కాగా, ఎస్ఆర్హెచ్ సీజన్లో ఆడిన మూడు మ్యాచ్‌లో ఓటమిపాలవ్వగా, తొలి మ్యాచ్‌లో తగిలిన ఎదరుదెబ్బ నుంచి కోలుకున్న ముంబై వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. చదవండి: ఆ కారణంగానే విలియమ్సన్‌ను ఆడించట్లేదు: ఎస్ఆర్హెచ్ కోచ్ -
తుదిజట్టులో అతడికి స్థానం ఉంటేనే హైదరాబాద్ గెలుపు!
-
ఎవరి కోసం ఎదురుచూస్తున్నారు.. నేనున్నా కదా!
చెన్నై: ఐపీఎల్-2021 సీజన్లో తొలి రెండు మ్యాచ్‌లలోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు నిరాశే ఎదురైంది. విజయం అంచుల వరకు వెళ్లి ఓటమి పాలైంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఏప్రిల్ 11న జరిగిన మ్యాచ్‌లో బెయిర్‌స్టో, మనీశ్ పాండే మినహా మిగతా వారు విఫలం అయ్యారు. దీంతో 10 పరుగుల తేడాతో హైదరాబాద్ పరాజయం పాలైంది. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన గురువారం నాటి మ్యాచ్‌లోనూ సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ వైఫల్యం మరోసారి స్పష్టంగా కనబడింది. వార్నర్ కూడా ఈ విషయాన్ని అంగీకరించాడు. బౌలర్లు ఆర్సీబీ బ్యాట్‌మెన్‌ను కట్టడి చేసినా... బ్యాటర్లు రాణించకపోవడంతో నిరాశ తప్పలేదు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 6 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. దీంతో సన్‌రైజర్స్ స్టార్ బ్యాట్స్‌మెన్ కేన్ విలియమ్సన్ జట్టులో లేని లోటు స్పష్టంగా కనబడిందని, తను ఉండి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సైతం ట్విటర్ వేదికగా తన అభిప్రాయం పంచుకున్నాడు. ‘‘ఈనాటి మ్యాచ్ ఫలితం తర్వాత నేనిలా మాట్లాడటం లేదు. ఎస్ఆర్హెచ్కు ఎల్లప్పుడూ కేన్ విలియమ్సన్ సేవలు అత్యవసరం. ఏం జరిగినా సరే తుదిజట్టులో అతడికి స్థానం ఉండాల్సిందే’’ అని పేర్కొన్నాడు. సన్‌రైజర్స్ ఫ్యాన్స్ సైతం అతడితో ఏకీభవిస్తున్నారు. ఇక టీమిండియా దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ కూడా బాలీవుడ్‌లోని ఓ పాటను ప్రస్తావిస్తూ.. ‘‘ఎవరి కోసం నిరీక్షణ.. నేను ఉన్నా కదా’’ అని అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు. కాగా ఫిట్నెస్ సాధించని కారణంగా విలియమ్సన్ జట్టుకు దూరమైనట్లు కోచ్ బేలిస్ తెలియజేసిన విషయం తెలిసిందే. ఇక కివీస్ సారథి కేన్ విలియమ్సన్కు మంచి ఐపీఎల్ రికార్డు ఉంది. ఇప్పటి వరకు మొత్తంగా 53 మ్యాచ్‌లు ఆడిన అతడు, 1619 పరుగులు చేశాడు. ఇక 2018 ఎడిషన్‌లో అత్యధిక పరుగులు(735) చేసి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. చదవండి: బాధిస్తోంది.. మాకు కూడా అదే జరిగింది: వార్నర్ This view is not after tonight’s result but I have always maintained this SRH team needs Kane Williamson in their playing XI no matter what. #SRHvRCB — Sanjay Manjrekar (@sanjaymanjrekar) April 14, 2021 -
ఆఫ్ స్పిన్ టెస్టుల్లో మాత్రమే వేస్తావా.. టీ20ల్లో వేయవా!
ముంబై: టీమిండియా ఆఫ్‌స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐపీఎల్ 14వ సీజన్‌ను ఫేలవ ప్రదర్శనతో ఆరంభించాడు. శనివారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన అశ్విన్ 11ఎకానమీతో 47 పరుగులిచ్చి ఒక వికెట్ మాత్రమే తీశాడు. అయితే అశ్విన్ ఐపీఎల్‌కు ముందు ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో దుమ్మురేపాడు. తన ఆఫ్‌స్పిన్ మాయజాలంతో ఏకంగా ఆ సిరీస్‌లో 32 వికెట్లు పడగొట్టి సరికొత్త రికార్డు సృష్టించాడు. అయితే ఐపీఎల్లో మాత్రం అశ్విన్ తొలి మ్యాచ్‌లోనే తేలిపోవడంపై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ తప్పుబట్టాడు. ''అశ్విన్ టెస్టులో మాత్రమే ఆఫ్‌స్పిన్ బౌలింగ్ వేయగలడా అన్న అనుమానం కలుగుతుంది. టీమిండియా తరపున పరిమిత ఓవర్ల క్రికెట్‌కు దూరమైన అశ్విన్ ఐపీఎల్ ద్వారా టీ20 మ్యాచ్‌లు ఆడుతున్నాడు. టెస్టుల్లో ఎక్కువ ఓవర్లు వేసే అవకాశం ఉండడంతో తన ఆఫ్‌స్పిన్ మ్యాజిక్ చూపించగలడు. అదే టీ20 మ్యాచ్‌కు వచ్చేసరికి తెల్లబంతితో నాలుగు ఓవర్లు మాత్రమే వేసే అవకాశం ఉంటుంది. అందుకే అశ్విన్ ఈ ఫార్మాట్లో ఆఫ్‌స్పిన్ కన్నా పరుగులు ఇవ్వకూడదనే ఉద్దేశంతో బౌలింగ్ చేస్తున్నాడు. అందుకే నిన్నటి మ్యాచ్‌లో రైనా, మొయిన్ అలీలు అశ్విన్ బౌలింగ్‌ను ఉతికారేశారు. దీని బట్టి చూస్తే టీ20ల్లో అశ్విన్ ఆఫ్ స్పిన్ వేయడం కంటే పరుగులు ఇవ్వకూడదనే దానికే స్టిక్ అయినట్లు అనిపిస్తుంది. ఈ అలవాటును అశ్విన్ కాస్త తొందరగా మార్చుకుంటే ఫలితం వేరే విధంగా ఉంటుందనేది నా అభిప్రాయం'' అని చెప్పుకొచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఢిల్లీ క్యాపిటల్స్ సీఎస్కేపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. రైనా 54, అలీ 36, సామ్ కరన్ 34 పరుగులతో రాణించారు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ మరో 8 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. ఓపెనర్లు ధావన్ 85, పృథ్వీ షా 72 పరుగులతో చెలరేగడంతో ఢిల్లీ సునాయస విజయాన్ని నమోదు చేసింది. చదవండి: సన్‌రైజర్స్‌తో ఆనాటి మ్యాచ్ గుర్తుకో తెచ్చుకో రసెల్..! మరోసారి తన విలువేంటో చూపించిన రైనా