సంజయ్ మంజ్రేకర్
భారత్, ఆస్ట్రేలియాల మధ్య ఈ రోజు ఉత్కంఠభరిత మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. గెలిచిన జట్టు సెమీస్‌కు చేరుతుంది. ఓడిన జట్టు ఇంటికి వెళుతుంది. ఈ నేపథ్యంలో భారత జట్టుపై ఉన్న ఒత్తిడిని ఒక్కసారి ఊహించుకోండి. సొంత గడ్డపై ప్రతిష్టాత్మక టోర్నీని ఆడుతున్న ధోనిసేన నుంచి దేశంలోని అభిమానులు టైటిల్ మాత్రమే ఆశిస్తున్నారు. ఇప్పుడు జట్టుకు ధోని అత్యంత విలువైన నాయకుడయ్యాడు. కానీ అతడు కూడా మనలాంటి మనిషే. ఒత్తిడిని కూడా అలాగే అనుభవించినా కూడా మనకన్నా ఉత్తమంగా దాన్ని అధిగమించగల నేర్పు ఉంది. అందుకే తోటి ఆటగాళ్లు, ప్రత్యర్థులు అతడిని మిస్టర్ కూల్‌గా పేర్కొంటారు.
అయితే అవతలి జట్టుకు మాత్రం ఈ లక్షణమే వణుకుపుట్టిస్తుంది. ఈ మ్యాచ్ జరిగే మొహాలీలో మంచి బ్యాటింగ్ పిచ్ ఎదురుకానుంది. ఇక్కడే జరిగిన ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య కూడా భారీ స్కోరు నమోదైంది. అయితే ఇలాంటి పిచ్‌పై ఆసీస్ అత్యంత ప్రమాదకరంగా మారుతుందేమోనని అనిపిస్తోంది. ఎందుకంటే వాట్సన్, మ్యాక్స్‌వెల్, వార్నర్, స్మిత్‌లతో కూడిన లైనప్ 150కి పైగా పరుగులను సునాయాసంగా ఛేదించగలరు. అయితే భారత్‌కు కూడా ధావన్, రోహిత్ రూపంలో మంచి ఓపెనర్లు ఉన్నారు. ఫ్లాట్ పిచ్‌లపై ఆసీస్‌కన్నా భారత జట్టు బౌలింగ్ దాడి సమర్థవంతంగా ఉంటుంది. బ్యాటింగ్ పరంగా చూసుకుంటే మాత్రం ప్రత్యర్థిది కాస్త పైచేయిగా కనిపించినా... బౌలింగ్ బలం కారణంగా భారత్‌దే పైచేయి అనిపిస్తోంది.
బౌలింగ్‌తో భారత్‌ది పైచేయి
Published Sun, Mar 27 2016 12:53 AM | Last Updated on Sun, Sep 3 2017 8:38 PM
Advertisement