
న్యూఢిల్లీ: ప్రస్తుత భారత క్రికెట్ జట్టులో మ్యాచ్ ను మలుపుతిప్పగల బూమ్రా, భువనేశ్వర్ కుమార్ వంటి బౌలర్లు ఉన్నా ఇంకా సూపర్ స్టార్లు బౌలింగ్ లో రావాల్సిన అవసరముందని ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.గతంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టును శాసించిన ఇమ్రాన ఖాన్, వసీం అక్రమ్ తరహాలో బౌలింగ్ సూపర్ స్టార్ల అవసరం భారత జట్టుకు చాలా ఉందన్నాడు.
'భారత క్రికెట్ జట్టులో అందరి దృష్టి బ్యాటింగ్ మీదే ఉంటుంది. పాకిస్థాన్ సంగతి అలా కాదు. ఎప్పుడు ఆ జట్టును చూసినా సూపర్ స్టార్లందరూ బౌలర్లే. ఇమ్రాన్ ఖాన్, వసీమ్, వకార్.. ఇలా బౌలర్లే ఆ దేశంలో హీరోలు. బ్యాటింగ్‌లో భారత్ గొప్ప ఆటగాళ్లను అందించింది. కానీ బౌలింగ్‌లో మాత్రం లేదు. ప్రస్తుతం బుమ్రా, భువనేశ్వర్ లాంటి ఆటను మలుపు తిప్పే ఆటగాళ్లను చూస్తున్నాం. ఈ పరిణామం మంచిది. ఐతే బ్యాట్స్‌మెన్‌ను ఆరాధించినట్లు బౌలర్లనూ ఆరాధించి వారిని హీరోలుగా చేయాల్సింది అభిమానులే. భారత్‌కు బౌలింగ్ సూపర్‌స్టార్లు రావాలి. అలా వస్తే తర్వాతి తరాలపై సానుకూల ప్రభావం ఉంటుంది'అని మంజ్రేకర్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment