
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో పాక్ కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎల్‌వోసీ వెంబడి పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. కుప్వారా, పూంచ్‌లో భారత భద్రతా బలగాలపై కాల్పులకు దిగింది. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం పాక్‌పై అంతే దీటుగా బదులిచ్చింది.
మరోవైపు, పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై భారత్ స్పందించింది. భారత్ - పాకిస్తాన్ మధ్య జమ్మూకశ్మీర్ ప్రాంతంలోని సరిహద్దును వేరు చేసే సైనిక నియంత్రణ రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) వద్ద పాక్ వరుసగా నాలుగు రోజుల నుంచి సీజ్ ఫైర్ నిబంధల్ని ఉల్లంఘించి కాల్పులు జరుపుతోంది.
ఏప్రిల్ 27,28వ తేదీలలో కుప్వారా,పూంచ్ జిల్లాలో ఎల్‌వోసీ వద్ద పాక్ సైన్యం భారత సైన్యంపై కాల్పులకు తెగబడింది. భారత సైన్యం అదే రీతిలో వేగంగా బదులిచ్చింది’ అని భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది.
ఏప్రిల్ 22న పహల్గాంలో పాక్ ఉగ్రవాదులు 26మంది టూరిస్టులపై కాల్పులు జరిపి అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీశారు. ఈ దాడి జరిపింది పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థకు లష్కరే తోయిబా ఉగ్రవాదులేనని తేలింది. అందుకు తగ్గ ఆధారాల్ని సైతం భారత దర్యాప్తు సంస్థలు సేకరించాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఎలోవోసీ వెంబడి పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని భారత సైన్యం వెల్లడించింది.
