breaking news
LoC in Kashmir
-
LoC వెంబడి పాక్ కవ్వింపు చర్యలు.. దీటుగా బదులిచ్చిన భారత్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో పాక్ కవ్వింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎల్వోసీ వెంబడి పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. కుప్వారా, పూంచ్‌లో భారత భద్రతా బలగాలపై కాల్పులకు దిగింది. దీంతో అప్రమత్తమైన భారత సైన్యం పాక్‌పై అంతే దీటుగా బదులిచ్చింది. మరోవైపు, పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంపై భారత్ స్పందించింది. భారత్ - పాకిస్తాన్ మధ్య జమ్మూకశ్మీర్ ప్రాంతంలోని సరిహద్దును వేరు చేసే సైనిక నియంత్రణ రేఖ లైన్ ఆఫ్ కంట్రోల్ (LoC) వద్ద పాక్ వరుసగా నాలుగు రోజుల నుంచి సీజ్ ఫైర్ నిబంధల్ని ఉల్లంఘించి కాల్పులు జరుపుతోంది. ఏప్రిల్ 27,28వ తేదీలలో కుప్వారా,పూంచ్ జిల్లాలో ఎల్వోసీ వద్ద పాక్ సైన్యం భారత సైన్యంపై కాల్పులకు తెగబడింది. భారత సైన్యం అదే రీతిలో వేగంగా బదులిచ్చింది’ అని భారత సైన్యం అధికారికంగా ప్రకటించింది.ఏప్రిల్ 22న పహల్గాంలో పాక్ ఉగ్రవాదులు 26మంది టూరిస్టులపై కాల్పులు జరిపి అత్యంత కిరాతకంగా ప్రాణాలు తీశారు. ఈ దాడి జరిపింది పాక్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థకు లష్కరే తోయిబా ఉగ్రవాదులేనని తేలింది. అందుకు తగ్గ ఆధారాల్ని సైతం భారత దర్యాప్తు సంస్థలు సేకరించాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఎలోవోసీ వెంబడి పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని భారత సైన్యం వెల్లడించింది. -
వారు సరిహద్దు దాటాలని చూస్తున్నారు : ఆర్మీ అధికారి
జమ్ము కశ్మీర్ : ఎల్వోసీ వెంబడి ఉన్న పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని వేర్వేరు శిబిరాల్లో దాదాపు 500 వందల మంది ఉగ్రవాదులు కశ్మీర్లోకి చొరబడేందుకు అవకాశం కోసం వేచి చూస్తున్నారని నార్తర్న్ కమాండ్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రణ్‌బీర్ సింగ్ తెలిపారు. అంతేకాక, ఆంక్షలు సడలిస్తే అశాంతి రేపడానికి రెండు నుంచి మూడొందల మంది తీవ్రవాదులు కశ్మీర్‌లోనే ఉన్నారని వెల్లడించారు. శుక్రవారం మీడియాతోమాట్లాడుతూ ఆయన ఈ విషయాలు ధృవపరిచారు. సరిహద్దు అవతల ఉన్నవారికి పాక్ సైన్యమే ఆయుధాలను, నిధులను సమకూర్చుతూ లాంచ్పాడ్ శిక్షణను కూడా ఇస్తున్నట్టు తమకు గట్టి సమాచారం ఉందని రణబీర్ సింగ్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఇటీవల పాక్ నుంచి పంజాబ్‌లోకి డ్రోన్లు రావడంపైనా ఆయన స్పందించారు. ఎలాగైనా జమ్ము కశ్మీర్లో అలజడులు సృష్టించాలనే లక్ష్యంతో దాయాది దేశం వేస్తున్న కొత్త తరహా ఎత్తుగడలని ఆయన పేర్కొన్నారు. డ్రోన్లను ధ్వంసం చేసే శక్తితో పాటు ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనే సామర్ధ్యం మన సైన్యానికుందని వెల్లడించారు. పాకిస్తాన్ ఎలాంటి కుట్ర పన్నినా, ఎంతగా ప్రయత్నించినా వారి ఆటలు సాగనివ్వమని సింగ్ స్పష్టం చేశారు. -
పాక్ కాల్పుల్లో ఆర్మీ అధికారుల మృత్యువాత
శ్రీనగర్: కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడింది. సరిహద్దుకు అవతలి వైపు నుంచి పాక్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత్ సైనికాధికారులు మృతి చెందారు. కుప్వారా జిల్లాలోని నియంత్రణ రేఖ వెంబడి(ఎల్వోసీ) శుక్రవారం పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో జూనియర్ కమిషన్డ్ అధికారులు(జేసీవోలు) ఇద్దరు నేలకొరిగారని సైన్యం తెలిపింది. పాక్ దుశ్చర్యను భారత్ బలగాలు సమర్ధంగా తిప్పికొట్టాయని పేర్కొంది. -
పాక్ కాల్పుల్లో 7 నెలల్లో 52 మంది మృతి
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ(ఎల్వోసీ), అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంబడి ఈ ఏడాది జూలై చివరి వరకు శత్రుసైన్యం జరిపిన కాల్పుల్లో 52 మంది ప్రాణాలు కోల్పోయారు. సమాచార హక్కు చట్టం కింద కార్యకర్త రమణ్ సింగ్ అడిగిన ప్రశ్నకు హోం శాఖ ఈ మేరకు సమాధానమిచ్చింది. జనవరి నుంచి జూలై చివరి వరకు జరిగిన మొత్తం 1,435 కాల్పుల ఘటనల్లో 28 మంది పౌరులు, 12 మంది సైనిక సిబ్బంది, 12 బీఎస్ఎఫ్ జవాన్లు నేలకొరిగారని పేర్కొంది. దీంతోపాటు 140 మంది పౌరులు, 45 మంది సైనిక సిబ్బంది, 47 మంది బీఎస్ఎఫ్ జవాన్లు గాయపడ్డారని తెలిపింది. మొత్తం 1,435 కాల్పుల విరమణ ఉల్లంఘనల్లో ఎల్వోసీ వెంట 945, ఐబీ వెంట 490 ఘటనలు చోటుచేసుకున్నట్లు వివరించింది. -
‘ఎల్వోసీలో సైనికులు మీ ఆదేశాలు పాటించడం లేదు’
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయానికి, నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట విధుల్లో ఉన్న ఆ దేశ సైనికుల ఉద్దేశాలు, చర్యల్లో చాలా అంతరం ఉందని భారత్ స్పష్టం చేసింది. ఈ మేరకు భారత్ సైనిక ఆపరేషన్ల డైరెక్టర్ జనరల్(డీజీఎంవో) లెఫ్టినెంట్ జనరల్ ఏకే భట్ పాక్ డీజీఎంవో మిర్జాకు తెలిపారు. ఎటువంటి హెచ్చరిక, దాడులు జరగకుండానే భారత బలగాలు సరిహద్దులోని ప్రజలపై కాల్పులు జరుపుతున్నాయని మిర్జా ఆరోపించడంపై భట్ స్పందించారు. పాక్ సైనిక ప్రధాన కార్యాలయం శాంతిని కోరుకుంటుంటే సరిహద్దులోని ఆ దేశ బలగాలు విచక్షణారహితంగా కాల్పులకు దిగుతున్నాయన్నారు. -
మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్
శ్రీనగర్ : పాకిస్థాన్ ఆర్మీ తరచు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ తన తెంపరితనాన్ని చాటుకుంటుంది. తాజాగా గురువారం ఉత్తర కాశ్మీర్ కుప్వారా జిల్లాలోని సరిహద్దు నియంత్రణ రేఖ సమీపంలోని నౌగమ్ సెక్టర్పైకి కాల్పులు జరిపాయి. సెక్టర్లోని దనిష్, లక్ష్మీ పోస్టులనే లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరిపాయి. అయితే వెంటనే స్పందించిన... భారత ఆర్మీ కూడా ఎదురు కాల్పులకు దిగింది. ఇరువైపులా కాల్పులు హోరా హోరీగా సాగుతున్నాయని పోలీసులు తెలిపారు.