పహల్గాం ఉగ్రదాడిపై పాక్‌ ఉప ప్రధాని సంచలన వ్యాఖ్యలు | Pakistan Deputy PM Calls Pahalgam Terrorists Freedom Fighters And Hold On Indus Treaty Act Of War, Watch Video Inside | Sakshi
Sakshi News home page

వాళ్లు స్వాతంత్ర్య సమరయోధులు.. పహల్గాం ఉగ్రదాడిపై పాక్‌ ఉప ప్రధాని సంచలన వ్యాఖ్యలు

Published Fri, Apr 25 2025 10:04 AM | Last Updated on Fri, Apr 25 2025 12:40 PM

Pak Deputy PM calls Pahalgam terrorists freedom fighters

ఇస్లామాబాద్‌: జమ్మూకశ్మీర్‌ పహల్గాంలో ఉగ్రదాడి వేళ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, ఉప ప్రధాని ఇషాక్ దార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కాశ్మీర్‌ పహల్గంలో దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల్నిస్వాంతంత్ర్య సమరయోధులని అభివర్ణించారు. 

పహల్గాంలో ఉగ్రమూఖల దుశ్చర్యను ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. పాకిస్తాన్‌ తీరుపై పరోక్షంగా దుమ్మెత్తి పోస్తున్నాయి. ఉగ్రదాడిని ఖండిస్తూ భారత్‌కు సంఘీభావం తెలుపుతున్నాయి. అదే సమయంలో పాకిస్తాన్‌ సైతం పహల్గాంలో జరిగిన దాడిని ఖండించినప్పటికీ, తామే ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం ఇస్తున్నారనే ఆరోపణలను కొట్టిపారేసింది.  

అయితే, ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ ఏప్రిల్‌ 22న పహల్గాంలో దాడి చేసిన వారు స్వాంతత్య్ర సమరయోధులని వ్యాఖ్యానించారు. ఇస్లామాబాద్‌లో నిర్వహించిన అధికారిక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాం జిల్లాలో దాడులు చేసిన ఉగ్రవాదులు స్వాతంత్య్ర సమరయోధులై ఉండవచ్చు’ అని అన్నారు. 

భారత్‌కు గట్టి బదులిస్తాం
ప్రధాని మోదీ పహల్గాం ఉగ్రవాదులకు బహిరంగంగా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కడ దాక్కున్నా ప్రపంచపు అంచుల దాకా వెంటాడి మరీ వాళ్లను మట్టిలో కలిపేస్తాం. వారిని ప్రోత్సహిస్తున్న దుష్టశక్తినీ కఠినంగా శిక్షిస్తాం. కలలోనైనా ఉహించలేని స్థాయిలో ప్రతీకారం తీర్చుకుని తీరుతాం’ అని పునరుద్ఘాటించారు. ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలకు ఇషాక్‌ దార్‌ పరోక్షంగా స్పందించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్‌ తీసుకున్న చర్యలకు ప్రతిస్పందనగా పాక్‌ సైన్యం ఎలాంటి సవాళ్లకైనా సిద్ధంగా ఉందన్నారు. 

భారత పౌరులు సురక్షితంగా ఉండరు
భారతదేశం ఏదైనా దుస్సాహసానికి ప్రయత్నిస్తే గతంలో కంటే దారుణమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పాకిస్తాన్ పౌరులను లక్ష్యంగా చేసుకుంటే భారత పౌరులు సురక్షితంగా ఉండరని రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అన్నారు.

మీ వ్యాఖ్యలు దేశానికే అవమానం
పహల్గాం ఉగ్రదాడిపై పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ డానిష్‌ కనేరియా ఆదేశ ప్రభుత్వ పెద్దల తీరును వరుస ట్వీట్లతో ఎండగడుతున్నారు. తాజాగా పహల్గాం దాడికి పాల్పడ్డవారు స్వాంతత్య్ర సమరయోధులంటూ పాకిస్తాన్‌ విదేశాంగ మంత్రి,ఉప ప్రధాని ఇషాక్‌ దార్‌ చేసిన సంచలన వ్యాఖ్యలపై  కనేరియా ఎక్స్‌ వేదికగా స్పందించారు. పాకిస్తాన్ ఉప ప్రధాన మంత్రి ఉగ్రవాదులను స్వాతంత్ర్య సమరయోధులు’ అని పిలవడం దేశానికి అవమానకరమే కాదు. తాము ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్నామని బహిరంగంగా అంగీకరించడమే అవుతుందని’ అన్నారు.  

 అలా అయితే ఉగ్రవాదాన్ని పెంచిపోషించేది ప్రభుత్వమే 
అంతకు ముందు పహల్గాం ముష్కరుల దాడిలో తమదేశ ప్రమేయం లేదంటే పాక్‌ ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ప్రకటనలపై ప్రశ్నల వర్షం కురిపించారు. పహల్గాం దాడిలో పాత్ర లేకపోతే.. ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ ఎందుకు ఖండించలేదు. దాడి తర్వాత పాక్‌ దళాలు అకస్మాత్తుగా ఎందుకు అప్రమత్తమయ్యాయి’ అని నిలదీశాడు. ప్రభుత్వం ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తుందని ఆరోపించారు. ఉగ్రవాదం విషయంలో ప్రభుత్వ చర్యలకు సిగ్గుపడాల్సిన విషయమని ట్విటర్‌ వేదికగా అసహనం వ్యక్తం చేశారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement