Ishaq Dar
-
పాక్ ఆపద్ధర్మ ప్రధానిగా ఇషాఖ్ దార్!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా ఆర్థిక మంత్రి ఇషాఖ్ దార్ (73) పేరు తెరపైకి వచి్చంది. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వ పదవీ కాలం ఆగస్టు 14న ముగియనుంది. కానీ 8వ తేదీనే జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని ప్రధాని నిర్ణయించుకున్నట్లు పాక్ మీడియా ఆదివారం వెల్లడించింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేదాకా ఇషాఖ్ దార్ను ఆపద్ధర్మ ప్రధానమంత్రిగా కొనసాగిస్తారని తెలియజేసింది. ఆయన పేరును అధికార పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ పార్టీ ప్రతిపాదించింది. పాక్ ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. అంతర్జాతీయ సంస్థల నుంచి అప్పుల కోసం, విదేశాల నుంచి పెట్టుబడుల కోసం ప్రయతి్నస్తోంది. రుణాలు, పెట్టుబడులతో ఆర్థికంగా కుదురుకోవడానికి చాలా సమయం పట్టనుంది. ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించేందుకు షరీఫ్ ప్రభుత్వం ఇష్టపడడంలేదు. అందుకే ఆపద్ధర్మ ప్రభుత్వంతో నెట్టుకురావాలని భావిస్తోంది. పాకిస్తాన్ రాజ్యాంగం ప్రకారం.. జాతీయ అసెంబ్లీ పదవీ కాలం పూర్తయితే 60 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, జాతీయ అసెంబ్లీని పదవీ కాలం ముగియక ముందే రద్దు చేస్తే 90 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించవచ్చు. కొత్త ప్రభుత్వం కొలువుదీరే దాకా ఆపద్ధర్మ ప్రధానమంత్రి పరిపాలన సాగిస్తారు. ఆపద్ధర్మ ప్రధానిగా ఇషాఖ్ దార్ నియామకంపై పాకిస్తాన్ ప్రభుత్వం వచ్చేవారం తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. -
చేతులెత్తేసిన పాక్ సర్కార్.. దారుణంగా పాకిస్తానీల పరిస్థితి!
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. దాదాపు శ్రీలంకను మించిన పరిస్థితి దాయాది దేశంలో కనిపిస్తుంది. ఇప్పటికే తిండి దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకిస్తానీలపై ప్రభుత్వం మరో బాంబు వేసింది. ఇంధన ధరలను భారీగా పెంచేసింది. ఈ క్రమంలో పాక్ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. తాజాగా పాక్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై ఒకేసారి ఏకంగా 35 రూపాయలు పెంచింది. దీంతో, బంకుల వద్ద ప్రజలు బారులు తీరారు. పెట్రోల్ బంకుల వద్ద క్యూలు దర్శనమిస్తున్నాయని డాన్ పత్రిక పేర్కొంది. ఈ సందర్బంగా పాక్ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ మీడియాతో మాట్లాడుతూ ఆయిల్ అండ్ గ్యాస్ అధికారుల సిఫార్సుల మేరకే రేట్లను పెంచినట్టు చెప్పారు. గ్లోబల్ మార్కెట్ నుండి చమురు కొనుగోలు చేయడానికి అధిక ధర కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అంతకు ముందు, ఆర్థిక మంత్రి దార్.. పాకిస్తాన్ను అల్లా రక్షిస్తాడు అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. ఆర్థిక సంక్షోభం కారణంగా పాక్ కరెన్సీ ఇటీవలే భారీగా పతనమైన విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో పాకిస్తాన్ రూపాయి పతనమైంది. ఒకేరోజు ఏకంగా డాలర్కు 255 రూపాయలకు పడిపోయింది. ఇక, విదేశీ మారక ద్రవ్య నిల్వలు అడుగంటడంతో పాకిస్తాన్ కేవలం మూడు వారాలకు సరిపడా దిగుమతులకు మాత్రమే చెల్లింపులు జరిపే వెసులుబాటు ఉన్నట్టు సమాచారం. సంక్షోభం అధిగమించేందుకు ఐఎంఎఫ్ విడుదల చేసే తదుపరి 100 కోట్ల డాలర్ల బెయిల్ అవుట్ ప్రోగ్రాం కోసం పాకిస్తాన్ వేచిచూస్తోంది. మరోవైపు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9 వరకూ ఐఎంఎఫ్ ప్రతినిధి బృందం పాకిస్తాన్లో పర్యటించనుండగా నిధుల ప్రవాహం ప్రారంభమవుతుందని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
‘పప్పు ధరలు ఎక్కువైతే చికెన్ తినండి’
ఇస్లామాబాద్: పాకిస్థానీయులు పప్పుల ధరలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తే చికెన్ తినాలని ఆ దేశ ఆర్థిక మంత్రి ఇషాక్ దార్ సెలవిచ్చారు. పప్పుల ధరలు ఆకాశాన్నంటాయని విపక్షాలు చేస్తున్న ఆందోళనపై ఆయన స్పందించారు. 'ప్రస్తుతం పప్పుల ధరలు కేజీ రూ.260 ఉన్నాయని విపక్ష సభ్యులు ఆందోళన చేస్తున్నారు. చికెన్ కేజీ రూ.200కే దొరుకుతోందనీ, దాన్నే తినాలని ప్రజలకు చెప్పాల'ని ఇషాక్ ప్రతిపక్షానికి బదులిచ్చారు. తమ ప్రభుత్వం ద్రవ్యలోటును 8.8 నుంచి 4.3 శాతానికి తగ్గించిందనీ, అభివృద్ధిపై వ్యయాన్ని రెట్టింపు చేసిందని ఆయన చెప్పారు. అభివృద్ధికి రెండింతల నిధులు కేటాయించామన్నారు. ప్రజల సాధికారత కోసం పాటు పడుతున్నామని, రుణాలపై ఆధారపడడం తగ్గిస్తున్నామని చెప్పుకొచ్చారు.