దుబాయ్: పేలవ ఫామ్‌లో ఉన్న షేన్ వాట్సన్‌ను చెన్నై తప్పిస్తుందా అని చాలా మంది అడుగుతున్నారు. కానీ ధోని గురించి తెలిసిన వారెవరైనా ‘లేదు’ అనే సమాధానం ఇస్తారు. ఎందుకంటే అది ధోని శైలి కాదు. అయితే తనకు ఇష్టం లేకపోయినా జట్టులో మార్పులు చేస్తాడని గత మ్యాచ్ చూపించింది. చహర్, కరన్, బ్రేవో ఉన్నా సరే తనకు ఐదుగురు బౌలర్ల అవసరం ఉంటుందని గుర్తించి శార్దూల్‌ను హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ధోని తీసుకున్నాడు. దీనివల్ల జడేజా రెండు ఓవర్లు వేసినా సరిపోయింది. మంచి కెపె్టన్ ఎవరైనా పరిస్థితులను బట్టి తన ఆలోచనలను మార్చుకుంటాడు. ఇందుకు టీమ్‌లో భారీ మార్పులు చేయాల్సిన అవసరం లేదు. తుది జట్టును పదే పదే మార్చే కోహ్లితో పోలిస్తే ధోని భిన్నమని మనకు అర్థమవుతుంది. (ఆటపై దృష్టిపెట్టు: ప్రియమ్ గార్గ్‌కు కేన్ సలహా)
చెన్నై ఆడించిన 11 మంది సరిగ్గా సరిపోయేవారే. అందులో లోపమేమీ లేదు. అయితే శార్దూల్, చహర్ బాగా వేస్తున్నారు కాబట్టి బ్రేవో లేదా వాట్సన్‌లలో ఒకరిని తప్పించి స్పిన్నర్ తాహిర్‌ను తీసుకొని ఉంటే బాగుండేది. గత ఏడాది తాహిర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇక్కడ ఉన్న పిచ్‌లను బట్టి చూస్తే బ్రేవోకంటే తాహిర్ ఎక్కువగా ఉపయోగపడేవాడు. ఇలాంటి ఎంపికలు అంత సులువు కాదని నాకు తెలుసు. అయితే టోర్నిలో ఇప్పటి వరకు చూస్తే చెన్నై సహా పలు జట్లు ఇన్నింగ్స్ దాదాపు చివరి దశ వరకు మోస్తరు వేగంతో ఆడి చివర్లో చెలరేగిపోవాలని భావిస్తున్నట్లున్నాయి. ఈ వ్యూహం వారిపై నిజానికి పెను భారంగా మారిపోతోంది. (వైరల్: ధోని వయసును విమర్శిస్తూ ఇర్ఫాన్ ట్వీట్)
ఆఖర్లో కొందరు నాణ్యమైన బౌలర్లను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి అది అంత సులువు కూడా కాదు. ఇక పంజాబ్ రెండు అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంది. మ్యాక్స్‌వెల్ విషయంలో వారు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏమాత్రం ఫామ్‌లో లేని అతడిని ఎల్లకాలం ఆడిస్తామంటే కుదరదు. ఇది అర్థం లేనిది. పైగా మ్యాక్స్‌వెల్‌కు ఎక్కువ అవకాశం ఇవ్వాలనే భావనతో మరో ఇద్దరు హిట్టర్లు సర్ఫరాజ్, గౌతమ్‌లను సరైన విధంగా వాడుకోవడం లేదు. ఇక డెత్ బౌలింగ్‌ను కూడా సరిదిద్దుకోవాలి. నా అభిప్రాయం ప్రకారం కాట్రెల్ ఓవర్లలో ఆరంభంలోనే ముగించేసి...నీషమ్ స్థానంలో జోర్డాన్‌ను తెచ్చుకుంటే పరిస్థితి మారవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment