Maxwell
-
రుతురాజ్ బాదాడు... మ్యాక్స్‌వెల్ గెలిపించాడు
రుతురాజ్ మెరుపు శతకాన్ని మ్యాక్స్‌వెల్ విధ్వంసం కమ్మేసింది. టీమిండియా ‘హ్యాట్రిక్’ను, సిరీస్ విజయాన్ని అడ్డుకుంది. ఇటీవలే ముగిసిన ప్రపంచకప్‌లో అఫ్గాన్‌పై అద్వితీయ డబుల్ సెంచరీని గుర్తుకు తెచ్చేలా మూడో టి20లో మ్యాక్సీ అజేయ శతకంతో ఆస్ట్రేలియాను గెలిపించాడు. బౌలింగ్‌లో ఆఖరి ఓవర్లో 30 పరుగులు సమర్పించుకున్న మ్యాక్సీ ఆ చేత్తోనే బ్యాటింగ్‌లో ఆఖరి బంతిదాకా పోరాడి మరీ జట్టును సిరీస్‌లో నిలిపాడు. గువాహటి: వరుస విజయాలతో సిరీస్‌ను గెలుచుకుందామనుకున్న టీమిండియా పట్టుదలకు ఒకే ఒక్కడు అడ్డుపడ్డాడు. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (48 బంతుల్లో 104 నాటౌట్; 8 ఫోర్లు, 8 సిక్సర్లు) ధనాధన్ ధాటికి మ్యాచ్ చేజారింది. మంగళవారం జరిగిన మూడో టి20లో భారత్ 5 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియా చేతిలో ఓడింది. సిరీస్ ఆధిక్యం 2–1కు తగ్గింది. మొదట భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఈ సిరీస్‌లో వరుసగా మూడో సారి టీమిండియా 200 పైచిలుకు స్కోరు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (57 బంతుల్లో 123 నాటౌట్; 13 ఫోర్లు, 7 సిక్స్‌లు) మెరుపు శతకాన్ని సాధించాడు. సూర్యకుమార్ (29 బంతుల్లో 39; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం ఆ్రస్టేలియా సరిగ్గా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసి గెలిచింది. ట్రవిస్ హెడ్ (18 బంతుల్లో 35; 8) వేగంగా ఆడాడు. మ్యాక్స్‌వెల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది. పేసర్ ముకేశ్ వివాహం కోసం సెలవు తీసుకోగా, అవేశ్ ఖాన్ భారత తుది జట్టులోకి వచ్చాడు. ఒడిదుడుకులతో మొదలై... పవర్‌ప్లేలో చెలరేగిపోయే ఓపెనర్ యశస్వి జైస్వాల్ (6) రెండో ఓవర్లోనే నిష్క్రమించడం, ఆ మరుసటి ఓవర్లోనే వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (0) డకౌట్ కావడంతో భారత్ పరుగుల పయనం నెమ్మదిగా మొదలైంది. 24/2 వద్ద కెప్టెన్ సూర్యకుమార్ క్రీజులోకి వచ్చాడు. నాథన్ ఎలిస్ ఐదో ఓవర్లో రెండు భారీ సిక్సర్లతో అతను భారత శిబిరంలో జోష్ తెచ్చాడు. పవర్‌ప్లేలో జట్టు 43/2 స్కోరు చేసింది. సూర్య తడాఖా చూపడంతో పరుగుల వేగం పుంజుకుంది. చూడచక్కని బౌండరీలతో సూర్యకుమార్ కాసేపు ఇన్నింగ్స్‌ను నడిపించాడు. రుతురాజ్ వీరవిహారం అప్పటి వరకు అడపాదడపా బౌండరీలతో సరిపెట్టుకుంటూ వచ్చిన రుతురాజ్ తొలి 10 ఓవర్లు ముగిసేసరికి 21 బంతుల్లో 21 పరుగులే చేశాడు. ఆ తర్వాత ‘పరుగుల మిషన్’లా చెలరేగిపోయాడు. గైక్వాడ్ తర్వాతి 10 ఓవర్లలో 36 బంతులాడి 102 పరుగులు చేశాడు. 13వ ఓవర్లో రెండు ఫోర్లు, 14వ ఓవర్లో గైక్వాడ్ మరో రెండు బౌండరీలు బాది 32 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. తిలక్ వర్మ కూడా ఓ ఫోర్ కొట్టడంతో ఆ ఓవర్లో 19 పరుగులు వచ్చాయి. సంఘా ఓవర్లో వరుసగా 4, 6 బాదిన గైక్వాడ్... హార్డి వేసిన 18వ ఓవర్లో 0, 6, 1వైడ్, 6, 4, 0, 6, 2లతో 25 పరుగులు పిండుకున్నాడు. మ్యాక్స్‌వెల్ వేసిన ఆఖరి ఓవర్లో రుతురాజ్ 3 సిక్స్‌లు, 2 ఫోర్లు బాదడంతో మొత్తం 30 పరుగులు వచ్చాయి. తొలి బంతికి బాదిన సిక్సర్‌తోనే 52 బంతుల్లో రుతురాజ్ సెంచరీ పూర్తయ్యింది. అబేధ్యమైన నాలుగో వికెట్‌కు రుతురాజ్, తిలక్ 9.4 ఓవర్లలో 141 పరుగులు జోడించారు. గెలిపించిన మ్యాక్స్‌వెల్ ఆస్ట్రేలియా ఛేజింగ్‌ను ఓపెనర్ హెడ్ ధాటిగా మొదలెట్టాడు. తొలి ఓవర్లో 2, రెండో ఓవర్లో 4 బౌండరీలు బాదాడు. హార్డి (16)ని అర్ష్‌దీప్ పెవిలియన్ చేర్చాడు. బౌండరీలతో చెలరేగిపోతున్న హెడ్‌ను అవేశ్‌ఖాన్ బోల్తా కొట్టించాడు. పవర్‌ప్లేలో ఆసీస్ స్కోరు 67/2. క్రీజులోకి వచ్చిన మ్యాక్స్‌వెల్ భారీషాట్లతో విరుచుకుపడ్డాడు. దీంతో ఆసీస్ ఓవర్‌కు 10పైచిలుకు రన్‌రేట్‌తో సాగిపోయింది. నాలుగో వికెట్‌కు 60 పరుగులు జోడించాక 128 పరుగుల వద్ద స్టోయినిస్ (17) నిష్క్రమించగా, స్వల్ప వ్యవధిలో టిమ్ డేవిడ్ (0) డకౌటయ్యాడు. భారత్ శిబిరం ఆనందంలో ఉండగా అప్పుడు ఆసీస్ స్కోరు 13.3 ఓవర్లలో 134/5. గెలుపు సమీకరణం 39 బంతుల్లో 85 పరుగులు భారత్‌కే అనుకూలంగా ఉంది. కానీ తర్వాత కెపె్టన్ వేడ్ (28 నాటౌట్) జతవ్వగా... మ్యాక్స్‌వెల్ యథేచ్ఛగా భా రీసిక్సర్లతో భారత్ శిబిరాన్ని వణికించాడు. 18 బంతుల్లో 49 పరుగులు చేయాల్సివుండగా 18వ ఓవర్ వేసిన ప్రసిధ్ కేవలం 6 పరుగులే ఇచ్చి భారత్‌కు ఊరటనిచ్చాడు. కానీ అదే ప్రసిధ్ ఆఖరి ఓవర్లో 6 బంతుల్లో 21 పరుగులు కావాల్సినపుడు 4, 1, 6, 4, 4, 4లతో 23 పరుగులిచ్చుకున్నాడు. ఇందులో ఆఖరి 4 బంతుల్ని బౌండరీలను దాటించిన మ్యాక్స్‌వెల్ 47 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. 4 అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక (4) సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్‌శర్మ రికార్డును మ్యాక్స్‌వెల్ సమం చేశాడు. 100 మ్యాక్స్‌వెల్‌కు ఇది 100వ అంతర్జాతీయ టి20 మ్యాచ్. వందో మ్యాచ్‌లో సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా అతను నిలిచాడు. 68 భారత్ తరఫున టి20ల్లో అత్యధిక పరుగులు (68) ఇచ్చిన ఆటగాడు ప్రసిధ్ కృష్ణ స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: యశస్వి (సి) వేడ్ (బి) బెహ్రెన్‌డార్ఫ్ 6; రుతురాజ్ నాటౌట్ 123; ఇషాన్ (సి) స్టోయినిస్ (బి) రిచర్డ్సన్ 0; సూర్యకుమార్ (సి) వేడ్ (బి) హార్డి 39; తిలక్ వర్మ నాటౌట్ 31; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 222. వికెట్ల పతనం: 1–14, 2–24, 3–81. బౌలింగ్: రిచర్డ్సన్ 3–0–34–1, బెహ్రెన్‌డార్ఫ్ 4–1– 12–1, ఎలిస్ 4–0–36–0, త న్వీర్ సంఘా 4–0–42–0, హార్డి 4–0–64–1, మ్యాక్స్‌వెల్ 1–0–30–0. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: హెడ్ (సి) బిష్ణోయ్ (బి) అవేశ్ 35; హార్ది (సి) ఇషాన్ (బి) అర్ష్‌దీప్ 16; ఇంగ్లిస్ (బి) బిష్ణోయ్ 10; మ్యాక్స్‌వెల్ నాటౌట్ 104; స్టోయినిస్ (సి) సూర్య (బి) అక్షర్ 17; టిమ్ డేవిడ్ (సి) సూర్య (బి) బిష్ణోయ్ 0; వేడ్ నాటౌట్ 28; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 225. వికెట్ల పతనం: 1–47, 2–66, 3–68, 4–128, 5–134. బౌలింగ్: అర్ష్‌దీప్ 4–0–44–1, ప్రసిధ్‌కృష్ణ 4–0–68–0, రవి బిష్ణోయ్ 4–0–32–2, అవేశ్‌ఖాన్ 4–0–37–1, అక్షర్ పటేల్ 4–0–37–1. -
డబుల్ సెంచరీతో ఆసీస్‌ను ఒంటిచేత్తో గెలిపించిన మ్యాక్స్‌వెల్
-
ఆసీస్ గెలిచినా... కంగారే!
అఫ్గాన్‌తో తలపడిన ‘కంగారూ’ను చూస్తే... మ్యాచ్ గెలిచినా సరే... ఇంతకి ఇది ఆస్ట్రేలియా జట్టేనా? సొంతగడ్డపై డిఫెండింగ్ చాంపియన్ ఆడాల్సిన ఆటేనా? నాణ్యమైన జట్టు ఇలా గెలవడమేంటి. ఆఖరి లీగ్ అయిపోయినా ముందుకెళ్లేందుకు అగచాట్లు పడటమేంటి అనే ప్రశ్నలు సగటు క్రికెట్ అభిమానిని పదేపదే తొలిచేస్తున్నాయి. నిజమే మరి... చివరి లీగ్‌లో... అదీ కీలకమైన దశలో... ఓ క్రికెట్ కూనతో చచ్చిచెడి గెలిచినా ఆసీస్‌కు సెమీస్ ఖాయం కాలేదు. తమ ఆటతీరుతో అఫ్గానిస్తాన్ ఆసీస్‌ను ఓడించినంత పనిచేసింది. సూపర్ ‘12’లో ఒక్క మ్యాచ్ కూడా గెల వని జట్టుగా అఫ్గానిస్తాన్ నిలిచింది. ఈ వైఫల్యానికి బాధ్యతగా జట్టు కెప్టెన్సీకి రాజీనామా చేస్తున్నట్లు మొహమ్మద్ నబీ ప్రకటించాడు. అడిలైడ్: ఒంటి చేత్తో మ్యాచ్‌ల్ని గెలిపించే వార్నర్, దంచేసే స్టొయినిస్, మెరిపించే మ్యాక్స్‌వెల్, నిలకడ చూపించే స్మిత్, నిప్పులు చెరిగే సీమర్లు ఇన్ని వనరులున్న ఆస్ట్రేలియా జట్టు అఫ్గానిస్తాన్‌పై గెలిచేందుకు ఆఖరి బంతి దాకా కష్టపడింది. గ్రూప్–1లో శుక్రవారం జరిగిన ‘సూపర్–12’ మ్యాచ్‌లో ఆసీస్ 4 పరుగులతో అఫ్గాన్‌ను అయితే ఓడించింది కానీ సెమీస్ కంగారూ మాత్రం అలాగే వుంది. ఇంగ్లండ్, లంక పోరు ముగిసేదాకా ఆసీస్ బిక్కుబిక్కుమని నిరీక్షించక తప్పదు. మొదట ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (32 బంతుల్లో 54 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), మిచెల్ మార్‡్ష (30 బంతుల్లో 45; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 164 పరుగులు చేసి పోరాడి ఓడింది. రెగ్యులర్‌గా ‘బిగ్‌బాష్ లీగ్’లో అడిలైడ్ స్ట్రైకర్స్ తరఫున ఆడే రషీద్‌ఖాన్ (23 బంతుల్లో 48 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) తన సొంతగడ్డపై రెచ్చిపోయాడు. మ్యాక్స్‌వెల్ ఫిఫ్టీ గత ప్రపంచకప్ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డీ వార్నర్ (18 బంతుల్లో 25; 5 ఫోర్లు) ఈ టోర్నీలో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో తన వ్యక్తిగత టాప్ స్కోరు చేశాడు. కామెరాన్ గ్రీన్ (3), స్మిత్ (4) నిరాశపరిచారు. పవర్‌ప్లేలో 52 పరుగులైతే చేసినా జట్టు 3 వికెట్లు కోల్పోయింది. మార్‡్ష, స్టొయినిస్ (21 బంతుల్లో 25; 2 సిక్సర్లు) మెరిపించినంత వరకు ఆస్ట్రేలియా స్కోరు జోరు మీదుంది. 15 ఓవర్లు ముగిసేసరికి 133/4 స్కోరుతో మెరుగ్గానే ఉన్న ఆసీస్‌ను ఆఖరి ఐదు ఓవర్లలో అఫ్గాన్ బౌలర్లు కట్టడి చేశారు. ఓ వైపు మ్యాక్స్‌వెల్ ధనాధన్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నప్పటికీ మరోవైపు మిగతా వికెట్లను పడగొట్టేశారు. 8 బంతుల వ్యవధిలో వేడ్ (6)ను ఫారుఖీ, కమిన్స్ (0), కేన్ రిచర్డ్సన్ (1)లను నవీనుల్ హక్ అవుట్ చేశాడు. రషీద్‌ఖాన్ వీరవిహారం ఆరంభంలోనే ఓపెనర్ ఘని (2) అవుటైనా... గుర్బాజ్ (17 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇబ్రహీం జద్రాన్ (33 బంతుల్లో 26; 2 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. ఓ దశలో 13 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లకు 99 స్కోరు చేసింది. విజయానికి 42 బంతుల్లో 70 పరుగుల సమీకరణం అఫ్గాన్ సంచలనానికి అనుకూలంగా కనిపించింది. అయితే జంపా వేసిన 14వ ఓవర్ అఫ్గాన్‌ను తలకిందులు చేసింది. 4 బంతుల వ్యవధిలో గుల్బదిన్ నైబ్ (23 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రనౌట్ కాగా, ఇబ్రహీం జద్రాన్, నజీబుల్లా జద్రాన్ (0)లను జంపా అవుట్ చేశాడు. కెప్టెన్ నబీ(1)ని హాజల్వుట్ పెవిలియన్ పంపాడు. 103/6 స్కోరువద్ద కష్టాల్లో పడింది. కానీ చివర్లో వీరవిహారం చేశాడు. 4.3 ఓవర్లలో 45 పరుగులు రావడంతో ఆస్ట్రేలియా శిబిరానికి ముచ్చెమటలు పట్టాయి. ఆఖరి ఓవర్లో 22 పరుగులు చేయాల్సివుండగా... స్టొయినిస్ బౌలింగ్‌లో వైడ్‌గా వెళ్లిన తొలిబంతికి రసూలి (15) రనౌటయ్యాడు. స్ట్రయిక్ తీసుకున్న రషీద్ 0, 4, 0, 6, 2, 4లతో విరుచుకుపడి 16 పరుగులు పిండుకున్నాడు. వైడ్‌తో మొత్తం 17 పరుగులు రాగా చివరకు 4 పరుగుల తేడాతో ఆసీస్ గట్టెక్కింది. ఆస్ట్రేలియా గెలవడంతోనే శ్రీలంక టోర్నీనుంచి నిష్క్రమించింది. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: వార్నర్ (బి) నవీన్ 25; గ్రీన్ (సి) నైబ్ (బి) ఫారుఖీ 3; మార్‡్ష (సి) గుర్బాజ్ (బి) ముజీబ్ 45; స్మిత్ (ఎల్బీ) (బి)నవీన్ 4; స్టొయినిస్ (సి) ఘని (బి) రషీద్ 25; మ్యాక్స్‌వెల్ (నాటౌట్) 54; వేడ్ (బి) ఫారుఖీ 6; కమిన్స్ (సి) రషీద్ (బి) నవీన్ 0; రిచర్డ్సన్ (రనౌట్) 1; జంపా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 168. వికెట్ల పతనం: 1–22, 2–48, 3–52, 4–86, 5–139, 6–155, 7–156, 8–159. బౌలింగ్: ఫారుఖీ 4–0–29–2, ముజీబ్ 4–0–42–1, నవీన్ ఉల్ హఖ్ 4–0–21–3, నైబ్ 3–0–31–0, రషీద్ 4–0–29–1, నబీ 1–0–14–0. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) వార్నర్ (బి) రిచర్డ్సన్ 30; ఘని (సి) కమిన్స్ (బి) హాజల్‌వుడ్ 2; ఇబ్రహీం జద్రాన్ (సి) మార్‡్ష (బి) జంపా 26; నైబ్ (రనౌట్) 39; నబీ (సి) వార్నర్ (బి) హాజల్‌వుడ్ 1; నజీబుల్లా జద్రాన్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) జంపా 0; రసూలీ (రనౌట్) 15; రషీద్ (నాటౌట్) 48; నవీన్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–15, 2–40, 3–99, 4–99, 5–99, 6–103, 7–148. బౌలింగ్: హాజల్‌వుడ్ 4–0–33–2, కమిన్స్ 4–0–22–0, స్టొయినిస్ 2–0–26–0, రిచర్డ్సన్ 4–0–48–1, జంపా 4–0–22–2, గ్రీన్ 2–0–13–0. టి20 ప్రపంచకప్‌లో నేడు ఇంగ్లండ్ vs శ్రీలంక (మ.గం. 1:30 నుంచి) స్టార్ స్పోర్ట్స్–1లో ప్రత్యక్ష ప్రసారం నేటి మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిస్తే సెమీస్ చేరుతుంది. అదే లంక గెలిస్తే ఆస్ట్రేలియా ముందంజ వేస్తుంది. -
కత్తి కార్తీక్
ముంబై: గత ఐదు మ్యాచ్‌లలో సహాయక పాత్రలో బెంగళూరుకు విజయాలు అందించిన దినేశ్ కార్తీక్ ఈసారి మరింత ఎక్కువ బాధ్యతతో తానే ముందుండి జట్టును గెలిపించాడు. శనివారం జరిగిన పోరులో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 16 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ దినేశ్ కార్తీక్ (34 బంతుల్లో 66 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్స్‌లు) తన సూపర్ ఫామ్‌ను కొనసాగించాడు. మ్యాక్స్‌వెల్ (34 బంతుల్లో 55; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించగా, షహబాజ్ (21 బంతుల్లో 32 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 7 వికెట్లకు 173 పరుగులు చేసి ఓడిపోయింది. వార్నర్ (38 బంతుల్లో 66; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), రిషభ్ పంత్ (17 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరిశారు. బెంగళూరు బౌలర్లు హేజల్‌వుడ్ (3/28), సిరాజ్ (2/31) రాణించారు. బెంగళూరు ఓపెనర్లు డుప్లెసిస్ (8), రావత్ (0) తక్కువ వ్యవధిలో పెవిలియన్ చేరగా, అనవసరపు సింగిల్‌కు ప్రయత్నించి కోహ్లి (12) రనౌట య్యాడు. ఈ దశలో మ్యాక్స్‌వెల్ దూకుడైన బ్యాటింగ్ జట్టును నిలబెట్టింది. తనదైన శైలిలో భారీ షాట్లు ఆడిన మ్యాక్స్‌వెల్... కుల్దీప్ ఓవర్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టి 23 పరుగులు రాబట్టాడు. మ్యాక్సీ వెనుదిరిగిన తర్వాత మెరుపు బ్యాటింగ్ బాధ్యతను దినేశ్ కార్తీక్ తీసుకున్నాడు. 5 పరుగుల వద్ద అతను ఇచ్చిన క్యాచ్‌ను పంత్ వదిలేయడం కూడా ఆర్సీబీకి కలిసొచ్చింది. ఆ తర్వాత కార్తీక్ చెలరేగిపోయాడు. ముఖ్యంగా ముస్తఫిజుర్ వేసిన 18వ ఓవర్లో అతని బ్యాటింగ్ హైలైట్‌గా నిలిచింది. ఈ ఓవర్లో కార్తీక్ వరుసగా 4, 4, 4, 6, 6, 4 (మొత్తం 28 పరుగులు) బాదడం విశేషం. 26 బంతుల్లోనే కార్తీక్ హాఫ్ సెంచరీ సాధించాడు. వార్నర్ బ్యాటింగ్ మినహా ఢిల్లీ ఇన్నింగ్స్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శన కనిపించలేదు. పృథ్వీ షా (16), మిచెల్ మార్‡్ష (14), పావెల్ (0), లలిత్ యాదవ్ (1) విఫలమయ్యారు. వార్నర్ క్రీజ్‌లో ఉన్నంత వరకు ఢిల్లీ గెలుపుపై నమ్మకంతో ఉన్నా... హసరంగ బౌలింగ్‌లో అతను ఎల్బీగా వెనుదిరగడంతో ఆశలు సన్నగిల్లాయి. -
ఇదేమి బౌలింగ్రా బాబు.. 4 ఓవర్లలో 70 పరుగులు!
Liam Guthrie BBL, 70 Runs In 4 Overs: బిగ్ బాష్ లీగ్-2021లో బ్రిస్బేన్ హీట్ బౌలర్ లియామ్ గుత్రీ ఓ చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు. మెల్బోర్న్ స్టార్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్ల కోటాలో గుత్రీ ఏకంగా 70 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో బిగ్ బాష్ లీగ్ చరిత్రలోనే అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన గుత్రీ 70 పరుగులతో పాటు రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు సిడ్నీ సిక్సర్స్ బౌలర్ బెన్ ద్వార్షుయిస్ 61 పరుగులు ఇచ్చాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న మెల్బోర్న్ స్టార్స్ ఆదిలోనే మూడు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ మ్యాక్స్‌వెల్ ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. అయితే ఓపెనర్ క్లార్క్, కార్ట్‌రైట్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. క్లార్క్ 44 బంతుల్లో 85 పరుగులు సాధించగా, కార్ట్‌రైట్ 44 బంతుల్లో 79 పరుగులు సాధించాడు. దీంతో మెల్బోర్న్ స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 207 పరుగులు సాధించింది. బ్రిస్బేన్ హీట్ బౌలర్లలో స్టీక్టీ మూడు వికెట్లు పడగొట్టగా,గుత్రీ, బ్లేజీ చెరో రెండు వికెట్లు సాధించారు. ఇక 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి బ్రిస్బేన్ హీట్ బ్యాటర్లలో క్రిస్ లిన్(57), బెన్ డకెట్(54) తప్ప మిగితా బ్యాటర్లు ఎవరూ రాణించలేదు. బ్రిస్బేన్ హీట్ నిర్ణీత 20 ఓవర్లలో187 పరుగులకు ఆలౌటైంది. దీంతో 20 పరుగుల తేడాతో బ్రిస్బేన్ ఓటమి చెందింది. మెల్బోర్న్ బౌలర్లలో బ్రాడీ కౌచ్, కైస్ అహ్మద్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. చదవండి: SA Vs IND: కోహ్లి.. ఎలా ఆడాలో రాహుల్‌ని చూసి నేర్చుకో: భారత మాజీ క్రికెటర్ The Bucket Ball free-hit is sent straight back over Liam Guthrie's head 😳 @KFCAustralia | #BBL11 pic.twitter.com/ua4VNZG0DS — KFC Big Bash League (@BBL) December 27, 2021 -
తెలుగు క్రికెటర్‌పై ప్రశంసల వర్షం కురిపించిన మ్యాక్స్‌వెల్, కోహ్లి
Maxwell And Kohli Praises Srikar Bharat: తెలుగు క్రికెటర్, విశాఖ కుర్రాడు కోన శ్రీకర్ భరత్‌పై ఆర్సీబీ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రస్తుత ఐపీఎల్లో ఆర్సీబీ వికెట్‌కీపర్‌గా రాణిస్తున్న భరత్.. నిన్న రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సంయమనంతో బ్యాటింగ్ చేసి 35 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్ సాయంతో 44 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చిన తీరును మ్యాక్సీతో పాటు ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లి సైతం కొనియాడారు. భరత్ అసలు సిసలైన టాప్ క్లాస్ బ్యాటర్ అని వీరు కితాబునిచ్చారు. భరత్ బ్యాటింగ్‌లో చాలా వేరియేషన్స్ ఉన్నాయని, అవి పొట్టి క్రికెట్లో చాలా ఉపయోగకరమని పేర్కొన్నారు. భరత్.. బ్యాటర్‌గానే కాకుండా వికెట్‌కీపర్‌గా కూడా అద్భుతంగా రాణిస్తున్నాడని, భవిష్యత్తులో టీమిండియాలో కచ్చితంగా చోటు దక్కించుకుంటాడని అశాభావాన్ని వ్యక్తం చేశారు. కాగా, నిన్న ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్‌లో భరత్ సహా మ్యాక్స్‌వెల్(30 బంతుల్లో 50 నాటౌట్; 6 ఫోర్లు, సిక్స్), పడిక్కల్(17 బంతుల్లో 22; 4 ఫోర్లు), కోహ్లి(20 బంతుల్లో 25; 4 ఫోర్లు) రాణించడంతో ఆర్సీబీ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కేఎస్ భరత్ బ్యాటింగ్‌తో పాటు కీపింగ్(క్యాచ్, స్టంప్ అవుట్) లోనూ రాణించాడు. భరత్‌ను ఈ ఏడాది ఐపీఎల్‌కు ముందే ఆర్సీబీ 20 లక్షల బేస్ ప్రైస్‌కు దక్కించుకుంది. చదవండి: Ashwin Vs Morgan: గొడవ పడ్డానా... ఎట్టకేలకు మౌనం వీడిన అశ్విన్! -
మెరిసిన మ్యాక్స్‌వెల్, అగర్
వెల్లింగ్టన్: బ్యాట్‌తో మ్యాక్స్‌వెల్ (31 బంతుల్లో 70; 8 ఫోర్లు, 5 సిక్స్‌లు) మెరుపులు... బంతితో యాష్టన్ అగర్ (6/30) మాయాజాలం... వెరసి న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టి20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 64 పరుగులతో తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 4 వికెట్లకు 208 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ (44 బంతుల్లో 69; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) కూడా అర్ధ సెంచరీ చేశాడు. 209 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ అగర్ స్పిన్ వలలో చిక్కుకొని 17.1 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. గప్టిల్ (43; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), కాన్వే (38; 5 ఫోర్లు, సిక్స్) మినహా మిగతా వారు విఫలమయ్యారు. అంతర్జాతీయ టి20ల్లో ఒకే ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా (అజంతా మెండిస్, యజువేంద్ర చహల్ రెండుసార్లు చొప్పున తీశారు), ఆసీస్ నుంచి తొలి బౌలర్‌గా అగర్ గుర్తింపు పొందాడు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో న్యూజిలాండ్ 2–1తో ఆధిక్యంలో ఉండగా... నాలుగో టి20 శుక్రవారం ఇదే వేదికపై జరుగుతుంది. -
ఫామ్‌లో లేని అతడినే ఆడిస్తామంటే కుదరదు
దుబాయ్: పేలవ ఫామ్‌లో ఉన్న షేన్ వాట్సన్‌ను చెన్నై తప్పిస్తుందా అని చాలా మంది అడుగుతున్నారు. కానీ ధోని గురించి తెలిసిన వారెవరైనా ‘లేదు’ అనే సమాధానం ఇస్తారు. ఎందుకంటే అది ధోని శైలి కాదు. అయితే తనకు ఇష్టం లేకపోయినా జట్టులో మార్పులు చేస్తాడని గత మ్యాచ్ చూపించింది. చహర్, కరన్, బ్రేవో ఉన్నా సరే తనకు ఐదుగురు బౌలర్ల అవసరం ఉంటుందని గుర్తించి శార్దూల్‌ను హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ధోని తీసుకున్నాడు. దీనివల్ల జడేజా రెండు ఓవర్లు వేసినా సరిపోయింది. మంచి కెపె్టన్ ఎవరైనా పరిస్థితులను బట్టి తన ఆలోచనలను మార్చుకుంటాడు. ఇందుకు టీమ్‌లో భారీ మార్పులు చేయాల్సిన అవసరం లేదు. తుది జట్టును పదే పదే మార్చే కోహ్లితో పోలిస్తే ధోని భిన్నమని మనకు అర్థమవుతుంది. (ఆటపై దృష్టిపెట్టు: ప్రియమ్ గార్గ్‌కు కేన్ సలహా) చెన్నై ఆడించిన 11 మంది సరిగ్గా సరిపోయేవారే. అందులో లోపమేమీ లేదు. అయితే శార్దూల్, చహర్ బాగా వేస్తున్నారు కాబట్టి బ్రేవో లేదా వాట్సన్లలో ఒకరిని తప్పించి స్పిన్నర్ తాహిర్‌ను తీసుకొని ఉంటే బాగుండేది. గత ఏడాది తాహిర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఇక్కడ ఉన్న పిచ్‌లను బట్టి చూస్తే బ్రేవోకంటే తాహిర్ ఎక్కువగా ఉపయోగపడేవాడు. ఇలాంటి ఎంపికలు అంత సులువు కాదని నాకు తెలుసు. అయితే టోర్నిలో ఇప్పటి వరకు చూస్తే చెన్నై సహా పలు జట్లు ఇన్నింగ్స్ దాదాపు చివరి దశ వరకు మోస్తరు వేగంతో ఆడి చివర్లో చెలరేగిపోవాలని భావిస్తున్నట్లున్నాయి. ఈ వ్యూహం వారిపై నిజానికి పెను భారంగా మారిపోతోంది. (వైరల్: ధోని వయసును విమర్శిస్తూ ఇర్ఫాన్ ట్వీట్) ఆఖర్లో కొందరు నాణ్యమైన బౌలర్లను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది కాబట్టి అది అంత సులువు కూడా కాదు. ఇక పంజాబ్ రెండు అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంది. మ్యాక్స్‌వెల్ విషయంలో వారు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఏమాత్రం ఫామ్‌లో లేని అతడిని ఎల్లకాలం ఆడిస్తామంటే కుదరదు. ఇది అర్థం లేనిది. పైగా మ్యాక్స్‌వెల్‌కు ఎక్కువ అవకాశం ఇవ్వాలనే భావనతో మరో ఇద్దరు హిట్టర్లు సర్ఫరాజ్, గౌతమ్‌లను సరైన విధంగా వాడుకోవడం లేదు. ఇక డెత్ బౌలింగ్‌ను కూడా సరిదిద్దుకోవాలి. నా అభిప్రాయం ప్రకారం కాట్రెల్ ఓవర్లలో ఆరంభంలోనే ముగించేసి...నీషమ్ స్థానంలో జోర్డాన్‌ను తెచ్చుకుంటే పరిస్థితి మారవచ్చు. -
పసందైన విందు
ఈ గడిచిన ఏడాదిలో క్రికెట్లో ఎన్నో జ్ఞాపకాలున్నాయి. చెలరేగిన ఆటగాళ్లు, పట్టాలెక్కిన పరుగు వీరులున్నారు. చెడుగుడు ఆడిన బౌలర్లున్నారు. చెరిగిన రికార్డులు కూడా ఉన్నాయి. ఎన్ని చెప్పుకున్నా...ఇందులో కొన్నయితే పదిలమైన ముద్ర వేసుకున్నాయి. వాటిని గుర్తుచేసుకుంటే మాత్రం... ప్రత్యేకించి క్రికెట్ ప్రియులకు కళ్లు మూసినా కనువిందే చేస్తాయి. మొత్తానికి 2019 సంవత్సరం క్రికెట్ ప్రేమికులకు పసందైన విందును అందించి వీడ్కోలు పలుకుతోంది. సాక్షి క్రీడావిభాగం: పుట్టింటికి వెళ్లిన ప్రపంచకప్... భారత్‌లో పింక్‌బాల్ టెస్టు... ఓపెనింగ్‌లో రో‘హిట్స్’... బౌలింగ్‌లో దీపక్ చాహర్ చెడుగుడు... టి20 మెరుపులు చూసినోళ్లకు చూసినంత వేడుక చేసింది... క్రికెట్లో ఈ ఏడాది ఇవన్నీ అద్భుతాలేం కావు! కానీ... కొన్ని కోట్ల కళ్లను కట్టిపడేశాయి. తప్పతాగి జీరోగా మారిన వ్యక్తిని ఒక్క మ్యాచ్‌తో హీరోగా మార్చేశాయి. క్రికెట్ లోకానికి పసందైన విందును అందించాయి. ఇంగ్లండ్‌దే వన్డే ప్రపంచం క్రికెట్ ఇంగ్లండ్‌లో పుట్టింది. కానీ పురుషుల జట్టు ఎప్పుడూ వన్డే ప్రపంచకప్‌ను మాత్రం ముద్దాడలేదు. ఆ లోటు తీరింది 2019లో అయితే తీర్చింది మాత్రం ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్! పురిటిగడ్డపై కొత్త చాంపియన్ కోసం జరిగిన పోరు ముందు ‘టై’ అయింది. తర్వాత ‘సూపర్ ఓవర్’ టై దాకా రసవత్తరం చేసింది. తద్వారా కనీవినీ ఎరుగని ఫైనల్‌గా నిలిచింది. ఇప్పటి వరకు ఏ ప్రపంచకప్ తుదిపోరు కూడా ఇలా ఇన్ని ‘టై’ మలుపులు తిరగలేదు. పరుగుల తేడాతోనూ, లేదంటే వికెట్ల తేడాతోనూ గెలిచిన విజేతలే ఉన్నాయి. కానీ మొట్టమొదటి సారిగా ఇటు వికెట్, అటు పరుగులు పైచేయి సాధించలేక... చివరకు ‘బౌండరీ కౌంట్’తో ఇంగ్లండ్ విజేత అయ్యింది. ఇవన్నీ ఈ ఒక్క మ్యాచ్‌లోనే జరిగాయి. ఇక్కడ స్టోక్స్ (84) చేసిన పోరాటం అంతాఇంతా కాదు. అంతక్రితం తప్పతాగి రోడ్డుమీద తగువులాడి ‘జీరో’ అయిన స్టోక్స్ ఈ వీరోచిత పోరాటంతో ‘హీరో’ అయ్యాడు. అనంతరం ఈ బౌండరీల లెక్క పెద్ద చర్చకే దారి తీసింది. అలనాటి స్టార్లు మొదలు దిగ్గజాల వరకు అంతా ‘లెక్క’పై శ్రుతి కలిపారు. ఇది కొన్ని రోజులు, నెలల దాకా సాగడంతో చివరకు ఐసీసీ నిబంధనలు మార్చాల్సి వచ్చింది. మెగా ఈవెంట్ టైటిల్ పోరులో సూపర్ ఓవర్ కూడా ‘టై’ అయితే బౌండరీలను లెక్కపెట్టకుండా... పరుగులు పైచేయి సాధించేదాకా ‘సూపర్’ ఓవర్‌ను కొనసాగించాలని ఐసీసీ నిర్ణయించింది. పొట్టి క్రికెట్లో 4 రికార్డులకు ‘చెక్’ ఐసీసీ పుణ్యమాని చెక్ రిపబ్లిక్ కూడా అంతర్జాతీయ రికార్డు పుటలకెక్కింది. క్రికెట్‌కు విశ్వవ్యాప్త ఆదరణ తెచ్చేందుకని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) పొట్టి ఫార్మాట్లో అసోసియేట్, అఫిలియేట్ దేశాల మధ్య జరిగే పోటీలకూ అంతర్జాతీయ హోదా ఇచ్చింది. దీంతో ఈ ఏడాది ఆగస్టు 30న చెక్ రిపబ్లిక్, టర్కీ జట్ల మధ్య జరిగిన ఒక్క టి20ల్లోనే నాలుగు రికార్డులు చెదిరిపోయాయి. 278/4 స్కోరు చేసిన చెక్ 257 పరుగుల తేడాతో టర్కీని కంగుతినిపించింది. టర్కీ 21 పరుగులకే ఆలౌట్ కావడంతో అత్యల్ప స్కోరుకే ఆలౌట్ (నెదర్లాండ్స్ 39 ఆలౌట్), అత్యధిక పరుగుల తేడా (కెన్యాపై శ్రీలంక 172), అత్యధిక జట్టు స్కోరు... 35 బంతుల్లోనే చెక్ ఆటగాడు సుదేశ్ విక్రమశేఖర ‘శత’క్కొట్టడంతో (రోహిత్ శర్మ, మిల్లర్) ఫాస్టెస్ట్ సెంచరీల రికార్డు కనుమరుగయ్యాయి. టెస్టు ‘క్లాసిక్స్’... సంప్రదాయ ఆటలో ఈ ఏడాది రెండు సార్లు ‘ఆఖరి వికెట్’ హంగామా చేయడం విశేషం. ఏ పదో... పాతిక... కాదు ఏకంగా 70 పరుగుల పైచిలుకు భాగస్వామ్యంతో ఆయా జట్లను గెలిపించింది. ఫిబ్రవరిలో డర్బన్‌లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో 304 లక్ష్యంతో దిగిన శ్రీలంక 226/9 స్కోరుతో ఓడేందుకు సిద్ధమైంది. కానీ ఓడలేదు. 11వ స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన విశ్వ ఫెర్నాండో (6 నాటౌట్)తో కలిసి కుశాల్ పెరీరా (153 నాటౌట్) అజేయమైన విజయ పోరాటం చేశాడు. ఆగస్టులో జరిగిన యాషెస్ సిరీస్‌లోనూ ఆసీస్‌పై ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ స్టోక్స్ (135 నాటౌట్) కూడా ఆఖరి వరుస బ్యాట్స్‌మన్ జాక్ లీచ్ (1 నాటౌట్)తో కలిసి అదే పోరాటం చేశాడు. చాహర్ చెడుగుడు... బంగ్లాదేశ్‌తో భారత్‌లో జరిగిన టి20 ద్వైపాక్షిక సిరీస్‌లో దీపక్ చాహర్ చెడుగుడు ఆడేశాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో చెరొటి నెగ్గడంతో ఆఖరి పోరు నిర్ణాయకమైంది. అంతకుముందెపుడు బంగ్లాతో పొట్టి సిరీస్ కోల్పోని రికార్డు భారత్‌ది. దీంతో కీలకమైన మ్యాచ్‌లో భారత్ 174/5 స్కోరు చేస్తే... లక్ష్యఛేదనలో బంగ్లా ఓ దశలో 110/2 స్కోరుతో పటిష్టంగా కనపడింది. కానీ చాహర్ 3.2–0–7–6 బౌలింగ్ రికార్డుతో బంగ్లా చెల్లాచెదురైంది. ఇందులో అతని ‘హ్యాట్రిక్’ కూడా ఉండటం విశేషం. దీంతో బంగ్లా 144 పరుగులకే ఆలౌటైంది. సిరీస్, సిరీస్ ఓడిపోని రికార్డు భారత్ ఖాతాలో పదిలంగా ఉండిపోయింది. ‘పేస్’ ఇయర్... ఈ సంవత్సరం ‘పేస్’ పదునెక్కింది. వన్డేల్లో వివిధ జట్లకు చెందిన 29 మంది బౌలర్లు 20కి పైగా వికెట్లు తీశారు. అయితే ఇందులో ఐదుగురే స్పిన్నర్లున్నారు. అంటే సింహాభాగం (75 శాతం) ఫాస్ట్ బౌలర్లే. ఓవరాల్‌గా టాప్–5 బౌలర్లలో నంబర్‌వన్ బౌలర్ షమీ. అతను ఈ ఏడాది వన్డే ఫార్మాట్లో 42 వికెట్లు తీశాడు. 38 వికెట్లతో బౌల్ట్ (కివీస్) రెండో స్థానంలో ఉండగా... తదుపరి స్థానాలు కూడా పేసర్లవే. ఫెర్గూసన్ (కివీస్), ముస్తఫిజుర్ (బంగ్లాదేశ్), భువనేశ్వర్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్ భరతం పట్టారు. ఆసీస్ బౌలర్ స్టార్క్ కూడా విశేషంగా ఆకట్టుకున్నాడు. ప్రత్యేకించి వన్డే ప్రపంచకప్‌లో అతను 10 మ్యాచ్‌ల్లోనే 27 వికెట్లు తీశాడు. పదేళ్ల తర్వాత... సాధారణంగా క్రికెట్లో గాయపడిన ఆటగాళ్లు పునరాగమనం చేస్తారు. పాకిస్తాన్లో మాత్రం మరుగునపడిన టెస్టు క్రికెట్ పదేళ్ల తర్వాత లేచి వచ్చింది. శ్రీలంక టెస్టు సిరీస్ ఆడేందుకు వెళ్లడంతో పాక్‌లో మళ్లీ అంతర్జాతీయ టెస్టు క్రికెట్ మొదలైంది. 2009లో లంకపైనే ఉగ్రవాదులు దాడి చేయడంతో ఆగిపోయిన ఆటకు దశాబ్దం తర్వాత లంకనే ఊపిరి పోసింది. టెస్టుల్లో లబ్‌షేన్ తన బ్యాటింగ్ ప్రదర్శనతో ‘టాప్’ లేపాడు. 11 మ్యాచ్‌లే ఆడిన ఈ ఆసీస్ బ్యాట్స్‌మన్ 17 ఇన్నింగ్స్‌ల్లో 1,104 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు వరుస టెస్టుల్లో చేశాడు. మరో 7 అర్ధ సెంచరీలు కూడా బాదాడు. టెస్టుల్లో ఈ ఏడాది వెయ్యి పరుగులు దాటిన ఏకైక బ్యాట్స్‌మన్ లబ్‌షేన్ కావడం విశేషం. స్టీవ్ స్మిత్ (8 మ్యాచ్‌ల్లో 965 పరుగులు) రెండో స్థానంలో నిలిచాడు. టెస్టుల్లో ఆసీస్ పేస్ బౌలర్ ప్యాట్ కమిన్స్ ఈ ఏడాది ‘టాపర్’గా నిలిచాడు. అతను 12 టెస్టులు ఆడి 59 వికెట్లు తీశాడు. నాథన్ లయన్ (ఆస్ట్రేలియా– 45 వికెట్లు), స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్–43 వికెట్లు) తర్వాతి స్థానాల్లో నిలిచారు. వన్డేల్లో ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ జోరుపెంచాడు. 28 మ్యాచ్‌లాడిన ఈ ఓపెనర్ 27 ఇన్నింగ్స్‌ల్లో 1490 పరుగులు చేశాడు. 7 శతకాలు, అరడజను అర్ధ శతకాలున్నాయి. ఏడు శతకాల్లో ఐదు సెంచరీలను ఒక్క ప్రపంచకప్‌లోనే చేయడం విశేషం. బెంగళూరులో జరిగిన టి20లో మ్యాక్స్‌వెల్ భారత శిబిరాన్ని వెలవెలబోయేలా చేశాడు. తొలుత కోహ్లి, ధోనిల స్ట్రోక్స్‌తో భారత్ 190/4 స్కోరు చేసింది. కష్టసాధ్యమైన లక్ష్యాన్ని మ్యాక్స్‌వెల్ (55 బంతుల్లో 113 నాటౌట్; 7 ఫోర్లు, 9 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆసీస్ 194/3 స్కోరు చేసి సులువుగా ఛేదించింది. భారత్‌లో ఎట్టకేలకు డేనైట్ టెస్టు జరిగింది. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ బాధ్యతలు చేపట్టిన రోజుల వ్యవధిలోనే కోల్‌కతా ఈడెన్‌గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో ఫ్లడ్‌లైట్ల టెస్టు జరిగింది. వీడ్కోలు వీరులు... ఈ ఏడాది పలువురు స్టార్ క్రికెటర్లు ఆటకు గుడ్‌బై చెప్పారు. దక్షిణాఫ్రికా నుంచి హషీమ్ ఆమ్లా, ఇమ్రాన్ తాహిర్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకోగా... డేల్ స్టెయిన్ టెస్టు ఫార్మాట్‌కు ‘టాటా’ చెప్పాడు. భారత స్టార్ యువరాజ్ సింగ్ జూన్ నెలలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. -
ధరలు పలికే ధీరులెవ్వరో!
కోల్‌కతా: ఐపీఎల్ 2020 సీజన్ ఆట కోసం నేడు ఆటగాళ్ల వేలం పాట జరగనుంది. భారత యువ క్రికెటర్లతో పాటు ప్రధానంగా ఆ్రస్టేలియా, వెస్టిండీస్ ఆటగాళ్లపైనే ఫ్రాంచైజీలు కన్నేశాయి. అయితే ఇందులో ధరలు పలికే ధీరులు ఎందరో తేలాలంటే వేలం ముగిసేదాకా ఎదురుచూడాలి. ఓవరాల్‌గా ఎనిమిది జట్లలో మొత్తం 73 ఖాళీలుండగా... వేలంలో 332 మంది ఆటగాళ్లు అందుబాటులో ఉన్నారు. ఆస్ట్రేలియా నుంచి ఐదుగురు ఆటగాళ్లపై కోట్లు కురిపించేందుకు ఫ్రాంచైజీలు సిద్ధంగా ఉన్నాయి. ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్, లిన్, మిచెల్ మాల్స్, కమిన్స్, హాజల్‌వుడ్‌లకు అత్యధిక మొత్తం లభించే అవకాశముంది. కరీబియన్ హిట్టర్ హెట్‌మైర్ ప్రధాన ఆకర్షణ కావొచ్చు. ప్రస్తుతం అతను అసాధారణ ఫామ్ కనబరుస్తుండటంతో ఎంతైనా వెచి్చంచేందుకు ఫ్రాంచైజీలు వెనుకాడకపోవచ్చు. టెస్టులకు పరిమితమైన తెలుగు క్రికెటర్ హనుమ విహారి, పుజారా రూ. 50 లక్షల ప్రాథమిక ధరతో ఉన్నారు. గత సీజన్లో ఢిల్లీకి ఆడిన విహారిని విడుదల చేయగా... పుజారాను ఎవరూ కొనలేదు. ఈసారి ఐపీఎల్ వేలంలో ఆంధ్ర నుంచి ఆరుగురు (విహారి, భరత్, రికీ భుయ్, స్టీఫెన్, పృథ్వీరాజ్, ఇస్మాయిల్), హైదరాబాద్ నుంచి నలుగురు (సందీప్, తిలక్ వర్మ, యు«ద్వీర్, మిలింద్) ఉన్నారు. -
కేదార్ మహిమ
237 పరుగుల సునాయాస లక్ష్యాన్ని ఛేదించడం అంటే భారత్‌లాంటి పటిష్టమైన జట్టుకు చిటికెలో పని. కానీ ఆసీస్‌పై విజయం అంత సులువుగా దక్కలేదు. ఒక్కో పరుగు కోసం తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఒక్కో బంతిని సమర్థంగా ఎదుర్కొనేందుకు పట్టుదలతో పోరాడాల్సి వచ్చింది. ఒక దశలో పరుగులు చేయడంకంటే పరిస్థితికి అనుగుణంగా ఓపిగ్గా నిలబడాల్సి వచ్చింది. సరిగ్గా ఇలాంటి స్థితిలో కేదార్ జాదవ్, ధోని ద్వయం దానినే చేసి చూపించారు. టాప్–4 బ్యాట్స్‌మెన్ వెనుదిరిగిన తర్వాత వీరిద్దరు తమ విలువను చాటారు. ఐదో వికెట్‌కు అభేద్యంగా 141 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. ముఖ్యంగా అసలైన మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ ఆటను చూపిస్తూ ఈ స్థానాలపై వస్తున్న సందేహాలను పటాపంచలు చేశారు. అంతకుముందు పేసర్ షమీతో పాటు స్పిన్నర్లు కుల్దీప్, జడేజా బౌలింగ్ ముందు ఆస్ట్రేలియా చేతులెత్తేసింది. స్వల్ప స్కోర్ల మ్యాచే అయినా... మొత్తంగా చూస్తే ఆసక్తికరంగా, పోటాపోటీగా సాగిన పోరులో గెలిచి భారత్ శుభారంభం చేసింది. సాక్షి, హైదరాబాద్: ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్‌ను టీమిండియా విజయంతో మొదలు పెట్టింది. శనివారం ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. ఉస్మాన్ ఖాజా (76 బంతుల్లో 50; 5 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేశాడు. మ్యాక్స్‌వెల్ (51 బంతుల్లో 40; 5 ఫోర్లు), స్టొయినిస్ (53 బంతుల్లో 37; 6 ఫోర్లు) రాణించారు. అనంతరం భారత్ 48.2 ఓవర్లలో 4 వికెట్లకు 240 పరుగులు చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కేదార్ జాదవ్ (87 బంతుల్లో 81 నాటౌట్; 9 ఫోర్లు, 1 సిక్స్), ఎమ్మెస్ ధోని (72 బంతుల్లో 59 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో చెలరేగారు. కెప్టెన్ కోహ్లి (45 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్), రోహిత్ శర్మ (66 బంతుల్లో 37; 5 ఫోర్లు) కీలక పరుగులు సాధించారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే మంగళవారం నాగపూర్‌లో జరుగుతుంది. రాణించిన కోహ్లి... స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్‌కు సరైన ఆరంభం లభించలేదు. రోహిత్ కొట్టిన ఫోర్‌తో ఇన్నింగ్స్ ప్రారంభమైనా... ధావన్ (0) తాను ఎదుర్కొన్న తొలి బంతికే ఔటయ్యాడు. ఈ దశలో రోహిత్, కోహ్లి కలిసి సమన్వయంతో ఇన్నింగ్స్‌ను నడిపించారు. వేగంగా పరుగులు సాధించకపోయినా, వీరిద్దరు జాగ్రత్తగా ఆడారు. ఆసీస్ పేసర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రావడం కష్టంగా మారిపోయింది. తన తొలి 9 బంతుల్లో ఒకే సింగిల్ తీసిన కోహ్లి కూల్టర్ నీల్ ఓవర్లో రెండు ఫోర్లతో జోరు పెంచే ప్రయత్నం చేశాడు. పవర్‌ప్లే ముగిసేసరికి భారత్ 42 పరుగులు చేసింది. ఆ తర్వాత బౌలింగ్‌కు దిగిన స్పిన్నర్ ఆడమ్ జంపా భారత్‌ను దెబ్బ తీశాడు. తన మూడో ఓవర్లో అతను కోహ్లిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అంపైర్ నాటౌట్‌గా ప్రకటించినా... రివ్యూలో ఆసీస్ ఫలితం సాధించింది. కొద్ది సేపటి తర్వాత రాయుడు (13)ని కూడా అతను ఔట్ చేశాడు. ఈ రెండు వికెట్ల మధ్య కూల్టర్ నీల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి రోహిత్ క్యాచ్ ఇచ్చాడు. కీలక భాగస్వామ్యం.. భారత్ పరిస్థితి ఇబ్బందికరంగా మారిన దశలో మళ్లీ గెలుపుపై ఆశలు పెంచింది ధోని, జాదవ్ ల భాగస్వామ్యమే. రాన్రానూ కఠినంగా మారుతున్న పిచ్‌పై వీరిద్దరు ఆరంభంలో చాలా జాగ్రత్తగా ఆడారు. అప్పుడప్పుడు అవకాశాన్ని బట్టి బౌండరీ కొడుతూ ఇన్నింగ్స్‌ను నడిపించారు. ప్రత్యర్థి బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా వీరిద్దరు ఆడగా... 24వ ఓవర్లో జత కట్టిన ఈ జోడీని విడదీసేందుకు ఆసీస్ అన్ని రకాల ప్రయత్నాలు చేసి విఫలమైంది. ఒకదశలో 46 బంతుల్లో 29 పరుగులే చేసిన ధోని... కూల్టర్ నీల్ ఓవర్లో సిక్స్, ఫోర్ బాదడంతో ఊపు వచ్చింది. ఇదే ఓవర్లో ధోని షాట్‌ను స్టొయినిస్ క్యాచ్ పట్టడంలో విఫల ప్రయత్నం చేశాడు. ఆసీస్ ఔట్ కోసం అప్పీల్ చేసినా, రీప్లేలో బంతి నేలకు తాకిందని తేలింది. మరోవైపు కొన్ని చక్కటి షాట్లు ఆడిన జాదవ్ ముందుగా 67 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత 68 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్న ధోని... 49వ ఓవర్లో తొలి రెండు బంతులను మెరుపు వేగంతో ఫోర్లుగా మలిచి మ్యాచ్‌ను ముగించాడు. తడబడుతూ... భారత పేస్, స్పిన్ బౌలర్లు సమష్టిగా చెలరేగి ఆస్ట్రేలియాను కట్టడి చేశారు. పడుతూ లేస్తూ సాగిన ఆ జట్టుకు రెండు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు కాస్త గౌరవప్రదమైన స్కోరును అందించాయి. రెండో వికెట్‌కు ఖాజా, స్టొయినిస్ 87 పరుగులు జోడించగా...ఏడో వికెట్‌కు క్యారీ, కూల్టర్ నీల్ 62 పరుగులు జత చేశారు. షమీ వేసిన మెయిడిన్ ఓవర్‌తో కంగారూల ఇన్నింగ్స్ ప్రారంభమైంది. తర్వాతి ఓవర్లోనే కెప్టెన్ ఫించ్ (0)ను ఔట్ చేసి బుమ్రా దెబ్బ కొట్టాడు. వరుసగా విఫలమవుతున్న ఆసీస్ కెప్టెన్ తన 100వ వన్డేలో కూడా డకౌట్గానే వెనుదిరిగాడు. ఈ స్థితిలో ఖాజా, స్టొయినిస్ కలిసి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే షమీ, బుమ్రా రెండు వైపుల నుంచి కట్టి పడేయడంతో పరుగులు రావడం కష్టంగా మారిపోయింది. ధోని బ్యాట్ లోగో మారింది... చాలా కాలం తర్వాత ధోని తన బ్యాట్‌పై కొత్త లోగోతో బరిలోకి దిగాడు. తొలి వన్డేలో అతను ఎస్ఎస్ (సన్రిడ్జెస్ బ్యాట్స్) స్టికర్‌తో ఆడాడు. ఇటీవలి వరకు అతనికి ఆస్ట్రేలియా కంపెనీ స్పార్టన్‌తో ఒప్పందం ఉండేది. అయితే అనూహ్యంగా మూతపడ్డ ఆ సంస్థ ధోని, గేల్, మోర్గాన్వంటి తదితర క్రికెటర్లకు భారీ మొత్తంలో డబ్బులు ఎగ్గొట్టింది. 2013 డిసెంబర్లో స్పార్టన్‌తో ధోని కాంట్రాక్ట్ కుదుర్చుకున్నాడు. దీని ప్రకారం అతనికి ఏడాదికి రూ. 20 కోట్లు ఇవ్వాల్సి ఉండగా... ఇప్పటి దాకా మొత్తం అన్నీ కలిపి స్పార్టన్ నాలుగు విడతలుగా కేవలం రూ. 20 కోట్లు మాత్రమే ఇచ్చింది. దాంతో బెంగళూరులో జరిగిన రెండో టి20లో స్పార్టన్ బ్యాట్‌ను ఆఖరిసారిగా వాడిన అనంతరం ధోని దానికి మంగళం పలికాడు. స్పార్టన్కు ముందు సుదీర్ఘ కాలం పాటు ధోని రీబాక్ లోగో బ్యాట్లు వాడాడు. మహి భాయ్ తోడుంటే... ఇటీవల ఆస్ట్రేలియాలో ఈ తరహాలోనే ఛేదించాం. అయినా, అవతలి ఎండ్‌లో మహి భాయ్ (ధోని) ఉంటే మనం పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు. మిడిలార్డర్లో ఎలా ఆడాలో అతడి నుంచి నేను చాలా నేర్చుకున్నా. ఈ విషయంలో ధోనిని మించినవారు లేరు. ఒక్కో మ్యాచ్‌పై మేం దృష్టిపెడుతున్నాం. మైదానంలో తీవ్రతతో ఎలా ఆడాలో మా కెప్టెన్‌ను చూసి తెలుసుకుంటున్నాం. బౌలింగ్ చేసేటప్పుడు నేను బౌలర్‌గా కాకుండా... వికెట్‌కు సూటిగా బంతులేస్తూ బ్యాట్స్‌మన్ ఏం చేయబోతున్నాడో ఆలోచిస్తా. – కేదార్ జాదవ్ బౌలర్ల కారణంగానే గెలిచాం బంతితో మేం బాగానే రాణించాం. ప్రత్యర్థిని కట్టిపడేస్తూ సాగిన జడేజా స్పెల్ ప్రశంసనీయం. ఫీల్డింగ్‌లోనూ అతడు జట్టుకు ఆస్తిలాంటివాడు. తెల్ల బంతితో షమీ ఇంత బాగా బౌలింగ్ చేయడం గతంలో ఎప్పుడూ చూడలేదు. మ్యాక్స్‌వెల్‌ను ఔట్ చేసిన తీరు ముచ్చట గొలిపింది. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పిచ్‌పై బ్యాటింగ్ కష్టంగా మారింది. ధోని, జాదవ్ బాధ్యత తీసుకుని నెలకొల్పిన భాగస్వామ్యం అద్భుతం. –విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ -
కప్పుకు ముందు కంగారూ సన్నాహం
టెస్టుల్లో మెడలు వంచగలిగినా... టి20ల్లో మొత్తమ్మీద పై చేయిగా ఉన్నా... వన్డేల్లో టీమిండియాకు ఆస్ట్రేలియా కఠినమైన ప్రత్యర్థే! ఈ ఫార్మాట్లో కంగారూలు వారి గడ్డపైనే కాదు... భారత్‌లోనూ కొరుకుడుపడని వారే! స్వదేశంలో 50 ఓవర్ల మ్యాచ్‌ల్లో సంపూర్ణ ఆధిపత్యం చూపే మనకు... ఆసీస్ మాత్రం తేలిగ్గా తలొగ్గడం లేదు. రెండు జట్ల మధ్య భారత్‌లో 56 వన్డేలు జరిగితే ప్రత్యర్థి 26 గెలిచింది. 8 సిరీస్‌లలో చెరో 4 (ఇందులో గత మూడు సిరీస్‌లు భారత్‌వే) పంచుకున్నాయి. దీనిని బట్టే వారెంత పోటాపోటీగా ఆడతారో తెలుస్తోంది. ఇప్పుడు ప్రపంచ కప్ ముంగిట ఐదు వన్డేల సిరీస్‌కు తెరలేవబోతోంది. ప్రతిష్ఠాత్మక టోర్నీకి సమాయత్తం అయ్యే క్రమంలో కోహ్లి సేనకిది చివరి అవకాశం. ఇక్కడ జయభేరి మోగిస్తే మంచి ఆత్మవిశ్వాసంతో సన్నాహాన్ని ప్రారంభించినట్లవుతుంది. సాక్షి క్రీడా విభాగం మన దేశంలో ఆడినా... వన్డేల్లో భారత్ కంటే ఆస్ట్రేలియా ఒక ఆకు ఎక్కువే చదివింది. కంగారూలు తమ పర్యటనల్లో ఇక్కడ 26 మ్యాచ్‌లు గెలిస్తే, భారత్ 25 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించగలిగింది. ఐదింట్లో ఫలితం తేలలేదు. పటిష్టంగా కనిపించిన టీమిండియాకు పలుసార్లు షాక్‌లిస్తూ ఆసీస్ సిరీస్‌లు ఎగరేసుకుపోయింది. అయితే, ఇదంతా గతం. ఇటీవల 50 ఓవర్ల ఫార్మాట్లో భారత్ రాటుదేలగా, అదే సమయంలో ఆస్ట్రేలియా బలహీనపడింది. సొంతగడ్డ పైనే సిరీస్ కోల్పోయింది. దీంతో రెండు జట్ల మధ్య అంతరం పెరిగింది. పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేని టి20ల ఫలితాన్ని వదిలేస్తే... దాదాపు ప్రపంచ కప్‌లో పాల్గొనే ఆటగాళ్లందరితో బరిలో దిగుతున్నందున కోహ్లి సేననే రానున్న వన్డే సిరీస్‌లో ఫేవరెట్. మిగిలిందిక... ఇంగ్లండ్ బయల్దేరేందుకు సిద్ధం కావాల్సిన ఆ ఒకరిద్దరు ఎవరనేది తేల్చడమే. వారెవరో ఇక్కడే స్పష్టమవుతుందా? లేక మరింత కాలం ఆగాల్సి ఉంటుందా? తేలిపోయినట్టే(నా) పైకి చెప్పకున్నా, ఆసీస్‌తో వన్డే సిరీస్ ద్వారా ప్రపంచ కప్‌నకు మన జట్టేమిటో అందరికీ స్పష్టంగా తెలిసిపోతూనే ఉంది. ఓపెనింగ్‌లో రోహిత్, ధావన్‌లకు బ్యాకప్‌గా రాహుల్, మిడిలార్డర్లో కెప్టెన్ విరాట్ కోహ్లి, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, కీపింగ్‌లో ధోనికి తోడుగా పంత్, పేస్ ఆల్‌రౌండర్ కోటాలో హార్దిక్ పాండ్యా, విజయ్ శంకర్, భువనేశ్వర్, బుమ్రా, షమీలతో పేస్ త్రయం, చహల్, కుల్దీప్ల స్పిన్ ద్వయంతో 15 స్థానాలూ భర్తీ అయినట్లే. వీరు కాక కప్ కోసం కొత్తగా చర్చకు వస్తున్న ఆటగాళ్ల పేర్లేవీ కూడా లేవు. ఈ ఐదు వన్డేల్లో వీరందరినీ పరీక్షించే అవకాశం కనిపిస్తోంది. ఎవరైనా దారుణంగా విఫలమైతేనో, దురదృష్టవశాత్తూ గాయపడితేనో తప్ప వేరొకరి ఎంపిక గురించి ఆలోచన రాకపోవచ్చు. అతడి గాయం... ఇతడికి వరం ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం తీవ్రత ఏమిటో త్వరలో తేలనుంది. బ్యాటింగ్‌లో, పేస్ బౌలింగ్‌లో ఇంగ్లండ్‌లో బాగా పనికొస్తాడనుకున్న అతడు ఆసీస్‌తో సిరీస్‌కు దూరమవడం విజయ్ శంకర్‌కు ఓ విధంగా మరింత మేలు చేసింది. న్యూజిలాండ్‌లో టి20ల్లో నిరూపించుకున్న శంకర్... కంగారూలపై వన్డేల్లోనూ రాణిస్తే వ్యక్తిగతంగా అతడికి భారీ ఉపయోగం. జట్టుకూ ఊరట దక్కుతుంది. హార్దిక్ ఫిట్నెస్ అటుఇటుగా ఉన్నందున శంకర్‌పై అంచనాలు పెరుగుతున్నాయి. రెండు చేతులా అందిపుచ్చుకోవాల్సిన ఈ అవకాశాన్ని తమిళనాడు ఆల్‌రౌండర్ ఎంతవరకు సద్వినియోగం చేసుకుంటాడో చూడాలి. వీరు ఆటలో అరటిపండ్లే... హార్దిక్ స్థానంలో రవీంద్ర జడేజాను వన్డేలకు ఎంపిక చేసినా, భువనేశ్వర్ బదులుగా తొలి రెండు మ్యాచ్‌లకు సిద్ధార్థ్ కౌల్‌ను తీసుకున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో వీరి ప్రపంచ కప్ ఊహలు ఊహలుగానే భావించాలి. పాండ్యా పూర్తిగా కోలుకోకపోయినా జడేజాకు మాత్రం ఇంగ్లండ్ అవకాశాలు దాదాపుగా లేవు. ఇక ముందునుంచే రేసులో లేని కౌల్... రెండో టి20లో తేలిపోయి మరింత వెనుకబడ్డాడు. మొదటి రెండు వన్డేలకు జట్టులో ఉన్నా, మైదానంలోకి దిగుతాడని కూడా చెప్పలేం. ఆడుకో రాహుల్... అందుకో భువీ ప్రపంచ కప్ జట్టులో ఉంటారని భావిస్తున్న ఇద్దరు ఆటగాళ్లు ఈ సిరీస్‌ను మరింత బాగా ఉపయోగించుకోవాల్సి ఉంది. అందులో మొదటివాడు రాహుల్. నిషేధం ప్రభావం, ఫామ్ లేమి నుంచి ఒకేసారి బయటపడిన అతడు టి20ల్లో అదరగొట్టాడు. వన్డేల్లోనూ ఆ జోరు కొనసాగిస్తే రాహుల్ ఆత్మవిశ్వాసం రెట్టింపవడం ఖాయం. ఇక రెండో ఆటగాడు భువనేశ్వర్. తనదైన స్వింగ్‌తో బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టే భువీ... ఆసీస్, న్యూజిలాండ్ పర్యటనల్లో పెద్దగా ఆకట్టుకోలేదు. కావాల్సినంత విశ్రాంతితో మూడో వన్డే నుంచి బరిలో దిగుతున్నందున ఈ మీరట్ పేసర్ తన పదును చూపాలి. పనిలో పనిగా... టి20ల్లో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టలేక పోయిన స్పిన్నర్ చహల్ సైతం తన బౌలింగ్ లోపాలను సరిచేసుకోవాలి. -
మ్యాక్స్‌వెల్ బౌండరీ లైన్లో కళ్లు చెదిరే క్యాచ్
-
మూడు డాట్ బాల్స్ వేస్తే మాక్స్వెల్ అంతే..
బెంగళూరు: ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ మాక్స్‌వెల్‌ను అవుట్ చేయాలంటే మూడు డాట్ బంతులు చాలని టీమిండియా యువ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ అభిప్రాయపడ్డాడు. మాక్స్‌వెల్‌ను వరుస మూడు వన్డేల్లో పెవిలియన్‌కు పంపించిన ఈ హరియాణ బౌలర్ వీటిలో రెండు స్టంప్ అవుట్లు చేయడం విశేషం. దీనిపై స్పందించిన చాహల్ ‘మాక్స్‌వెల్‌కు బౌలింగ్ చేసేటప్పుడు బంతిని స్టంప్స్ వైపు వేయకుండా అవుట్ సైడ్ స్టంప్స్‌కు వేస్తాను. నేను వేసే ఓవర్లో ఖచ్చితంగా రెండు నుంచి మూడు బంతులు డాట్ అవుతాయి. దీంతో మాక్స్వెల్ ఒత్తిడికి లోనై క్రీజు వదలి భారీ షాట్‌కు ప్రయత్నిస్తాడు. ఇదే స్టంప్ అవుట్ల వెనుక ఉన్న రహస్యమని’ ఈ యువ బౌలర్ చెప్పుకొచ్చాడు. ఆసీస్ కీలక ఆటగాడైన వార్నర్ క్రీజులో కుదురుకుంటే విధ్వంసం సృష్టిస్తాడని ఈ యువ స్పిన్నర్ పేర్కొన్నాడు. దీంతో వార్నర్ ఎంత త్వరగా అవుట్ చేస్తే మాకు మిడిల్ ఓవర్లలో అంత ఒత్తిడి తగ్గుందోని చాహాల్ పేర్కొన్నాడు. ఇక్కడి పరిస్థితులను ఆసీస్ స్పిన్నర్ల కన్నా భారత స్పిన్నర్లే ఎక్కవ సద్వినియోగం చేసుకున్నారని, భారత స్పిన్నర్లు మొత్తం 13 వికెట్లు పడగొట్టారని చాహల్ పేర్కొన్నాడు. ఇక బ్యాట్స్‌మెన్ భారీ స్కోరు చేస్తే బౌలర్లు ఎలాంటి ఒత్తిడిలేకుండా బౌలింగ్ చేయగలరని చాహల్ వ్యాఖ్యానించాడు. -
చివరి ఓవర్లో గట్టెక్కిన కింగ్స్ ఎలెవన్
-
సాహోరే... పంజాబ్
-
సాహోరే... పంజాబ్
►చివరి ఓవర్లో గట్టెక్కిన కింగ్స్ ఎలెవన్ ►ప్లే ఆఫ్ ఆశలు సజీవం ►పోరాడి ఓడిన ముంబై ఇండియన్స్ ►సాహా మెరుపు ఇన్నింగ్స్ ప్లే ఆఫ్ రేసులో నిలిచేందుకు వరుసగా మూడు మ్యాచ్‌లను నెగ్గాల్సిన ఒత్తిడిలో ఉన్న పంజాబ్ ‘కింగ్స్’లా చెలరేగింది. వృద్ధిమాన్ సాహా (93 నాటౌట్) తుదికంటా క్రీజులో నిలిచి భారీ స్కోరు సాధించి పెట్టగా.. ఆ తర్వాత బౌలర్లు పట్టు విడవకుండా ప్రయత్నించి లీగ్‌లో టాప్ పొజిషన్లో ఉన్న ముంబై ఇండియన్స్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించారు. అయితే పొలార్డ్ చివరి బంతి వరకు విజయం కోసం ప్రయత్నించి పంజాబ్‌ను వణికించాడు. మ్యాక్స్‌వెల్ సేన ఇక తమ చివరి మ్యాచ్‌లో పుణేపై కచ్చితంగా నెగ్గి ఇతర జట్ల ఫలితాల కోసం వేచి చూడాల్సి ఉంటుంది. ముంబై: వాంఖెడే మైదానం పరుగుల వర్షంతో తడిసి ముద్దయ్యింది. 231 పరుగుల లక్ష్యం.. టి20ల్లో ఇది కష్టసాధ్యమైనదే అయినా ముంబై ఇండియన్స్ మాత్రం చివరి బంతి వరకు పోరాడింది. అయితే ఆఖరి ఓవర్లో 16 పరుగులు కావాల్సిన దశలో పొలార్డ్ ఓ భారీ సిక్స్ బాదినా మోహిత్ అద్భుతంగా బంతులేసి తమ జట్టుకు కీలక విజయాన్ని అందించాడు. దీంతో గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ 7 పరుగుల తేడాతో నెగ్గి ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా నిలబెట్టుకుంది. అంతకుముందు వృద్ధిమాన్ సాహా (55 బంతుల్లో 93 నాటౌట్; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) సీజన్లో తొలిసారి తమ కీలక మ్యాచ్‌లో చెలరేగడంతో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 3 వికెట్లకు 230 పరుగుల భారీ స్కోరు చేసింది. మ్యాక్స్‌వెల్ (21 బంతుల్లో 47; 2 ఫోర్లు, 5 సిక్సర్లు), గప్టిల్ (18 బంతుల్లో 36; 5 ఫోర్లు, 1 సిక్స్) వేగంగా ఆడారు. ఆ తర్వాత 231 లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్లకు 223 పరుగులు చేసి ఓడింది. సిమన్స్ (32 బంతుల్లో 59; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), పార్థివ్ (23 బంతుల్లో 38; 7 ఫోర్లు), పొలార్డ్ (24 బంతుల్లో 50 నాటౌట్; 1 ఫోర్, 5 సిక్సర్లు), హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 30; 4 సిక్సర్లు) చెలరేగారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ సాహాకు దక్కింది. సాహా, మ్యాక్స్ దూకుడు... ఫామ్‌లో ఉన్న ఆమ్లా లేకుండానే బరిలోకి దిగిన పంజాబ్‌కు ఆ లోటు లేకుండా ఓపెనర్లు గప్టిల్, సాహా అద్భుత ఆరంభాన్నిచ్చారు. తొలి ఓవర్లోనే గప్టిల్ రెండు, సాహా ఓ ఫోర్‌తో జట్టు 13 పరుగులు సాధించింది. ఆ తర్వాత ఓవర్లో సాహా రెచ్చిపోయి మూడు ఫోర్లు బాదడంతో స్కోరు దూసుకెళ్లింది. ఈ దూకుడుకు పంజాబ్ 3.4 ఓవర్లలోనే 50 పరుగులు చేసింది. అయితే ఆరో ఓవర్లో తొలి రెండు బంతులను ఫోర్లుగా మలిచిన గప్టిల్ మూడో బంతికి వెనుదిరిగాడు. ఇక మ్యాక్స్‌వెల్ రాకతో రన్‌రేట్ రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. కరణ్ శర్మ ఓవర్లో రెండు సిక్సర్లు, ఆ తర్వాత హర్భజన్ బౌలింగ్‌లో మూడు సిక్సర్లు బాదిన తను అర్ధ సెంచరీ వైపు దూసుకెళుతున్న దశలో బుమ్రా బోల్తా కొట్టించాడు. అప్పటికే జట్టు స్కోరు 11 ఓవర్లలో రెండు వికెట్లకు 131 పరుగులకు చేరింది. ఓవర్ మిడ్‌వికెట్ మీదుగా సిక్స్ కొట్టిన సాహా 31 బంతుల్లో తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 16వ ఓవర్లో మార్‡్ష (16 బంతుల్లో 25; 2 సిక్సర్లు) అవుటైన అనంతరం స్కోరులో కాస్త వేగం తగ్గింది. శుభారంభం అందినా.. లక్ష్యం భారీగా ఉండటంతో ప్రారంభంలో ముంబై ఇన్నింగ్స్ కూడా దానికి తగ్గట్టుగానే సాగింది. ఓపెనర్లు పార్థివ్, సిమన్స్ ధాటిగా ఆడి శుభారంభాన్ని అందించారు. రెండో ఓవర్లో పార్థివ్ మూడు ఫోర్లు బాదాడు. ఆరో ఓవర్లో సిమన్స్ రెండు సిక్సర్లు కొట్టడంతో పవర్‌ప్లేలో జట్టు 68 పరుగులు చేసింది. ఆ తర్వాత ఓవర్లోనే సిమన్స్ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. అయితే తొమ్మిదో ఓవర్ నుంచి ముంబై పతనం ప్రారంభమైంది. మోహిత్ శర్మ వేసిన ఆ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లతో చెలరేగిన పార్థివ్ నాలుగో బంతికి అవుటయ్యాడు. దీంతో తొలి వికెట్‌కు 8.4 ఓవర్లలో 99 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఇక పదో ఓవర్లో సిమన్స్ లాంగ్ ఆన్‌లో ఆడిన భారీ షాట్‌ను బౌండరీ లైన్ దగ్గర గప్టిల్ అమాంతం పైకి ఎగిరి ఒంటి చేత్తో అద్భుత క్యాచ్ తీసుకోవడంతో ముంబై షాక్‌కు గురైంది. ఆ తర్వాత కెప్టెన్ రోహిత్ (5), నితీశ్ రాణా (12) వరుసగా అవుట్ కావడంతో 22 పరుగుల వ్యవధిలోనే నాలుగు వికెట్లను కోల్పోయింది. అయితే పొలార్డ్, హార్దిక్ పాండ్యా ఒక్కసారిగా గేరు మార్చారు. హెన్రీ వేసిన 16వ ఓవర్లో వీరిద్దరు రెండేసి సిక్సర్లు బాదడంతో మొత్తంగా 27 పరుగులు వచ్చాయి. కానీ మరుసటి ఓవర్లో సందీప్.. పాండ్యా వికెట్ తీయడంతో ఐదో వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయినా కరణ్ శర్మ ఆడిన ఆరు బంతుల్లోనే మూడు ఫోర్లు, ఓ సిక్స్ బాది 19 పరుగులు చేశాడు. ఇక ఆఖరి ఓవర్లో 16 పరుగులు కావాల్సిన దశలో ముంబై తడబడి విజయానికి దూరమైంది. ఆదివారం వరకు వేచి చూడాలేమో! ►ముంబై ఇండియన్స్‌పై పంజాబ్ గెలవడంతో ప్లే ఆఫ్ రేసు రసవత్తరంగా మారింది. ఇప్పటికే ముంబై ప్లే ఆఫ్‌కు చేరుకోగా... మిగతా మూడు బెర్త్‌ల కోసం నాలుగు జట్లు బరిలో ఉన్నాయి. ►నేడు (శుక్రవారం) జరిగే మ్యాచ్‌లో ఢిల్లీపై రైజింగ్ పుణే గెలిస్తే ఆ జట్టు ప్లే ఆఫ్‌కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఈ మ్యాచ్‌లో పుణే ఓడినా ఆ జట్టు ఆదివారం పంజాబ్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్‌కు చేరుకుంటుంది. ►శనివారం గుజరాత్ లయన్స్‌తో జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్ సన్‌రైజర్స్ నెగ్గితే ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా ప్లే ఆఫ్ బెర్త్ దక్కించుకుంటుంది. ఒకవేళ సన్‌రైజర్స్ ఓడితే ఆ జట్టు ప్లే ఆఫ్ చేరాలంటే పుణేతో జరిగే మ్యాచ్‌లో పంజాబ్ జట్టు ఓడిపోవాలి. ►శనివారం ముంబై ఇండియన్స్‌తో జరిగే మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ గెలిస్తే ప్లే ఆఫ్‌కు చేరుతుంది. ఒకవేళ కోల్‌కతా ఓడితే మాత్రం ఆ జట్టు భవితవ్యం గుజరాత్, హైదరాబాద్... పుణే, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్‌ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా ప్లే ఆఫ్‌కు చేరే అన్ని జట్లు ఏవో తేలాలంటే ఆదివారం వరకు వేచి చూడక తప్పదేమో! -
ఫలించిన పంజాబ్ వ్యూహం
► సాహా విజృంభణ.. ముంబైకి భారీ లక్ష్యం ► రాణించిన మాక్స్ వెల్, గప్టిల్, షాన్ మార్ష్ ముంబై: కింగ్స్ పంజాబ్, ముంబై ఇండియన్స్ మధ్య వాంఖేడ్ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ లో కింగ్స్ పంజాబ్ బ్యాట్స్ మెన్ వృద్దిమాన్ సాహా 93 పరుగులతో విజృంభించడంతో పంజాబ్ ముంబైకి 231 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. మరో వైపు ఓపెనర్ ఆమ్లా అందుబాటులో లేకపోవడంతో అతని స్థానంలో సాహాను ఓపెనర్ గా ప్రయత్నించిన పంజాబ్ వ్యూహం ఫలించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ ఓపెనర్లు గప్టిల్, సాహా మంచి శుభారంబాన్ని అందించారు. ఇక మలింగ వేసిన మూడో ఓవర్లో గప్టిల్, సాహా లు బౌండరీలతో విరుచుకపడి 19 పరుగులు పిండుకున్నారు. ఈ దూకుడుతో పంజాబ్ ఐదు ఓవర్లలోనే 60 పరుగులు చేయగలిగింది. వేగంగా ఆడుతున్న మార్టిన్ గప్టిల్ (37) కరణ్ శర్మ బౌలింగ్ లో భారీ షాట్ కు ప్రయత్నించి హార్థిక్ పాండ్యా కు చిక్కాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన మాక్స్ వెల్, సాహా తో కలిసి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. మాక్స్ వెల్ హార్భజన్ వేసిన 9 ఓవర్లో మూడు సిక్స్ లు బాదడంతో జట్టుకు 21 పరుగులు చేరాయి. 5 సిక్సర్లు, 2 ఫోర్లతో 47 పరుగులు చేసిన మాక్స్ వెల్ బూమ్రా బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత బ్యాటింగ్ కు వచ్చిన షాన్ మార్ష్ తో సాహా ఇన్నింగ్స్ కొనసాగించాడు. హార్భజన్ వేసిన బంతిని సిక్సర్ గా మలిచిన సాహా 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. సాహా కి తోడుగా మార్ష్ కూడా చెలరేగడంతో 15 ఓవర్లకే పంజాబ్ 173 పరుగులు చేయగలిగింది.ఈ తరుణంలో భారీ షాట్ కుప్రయత్నించిన షాన్ మార్ష్ (25) క్యాచ్ అవుటయ్యాడు. ముంబై బౌలర్లలో బుమ్రా మినహా మిగిలిన వారంతా పోటా పోటిగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో పంజాబ్ 18 ఓవర్లోనే 200 పరుగులకు చేరుకొంది. చివర్లో సాహా, అక్సర్ దాటిగా ఆడటంతో పంజాబ్ మూడు వికెట్లు కోల్పోయి ఈ సీజన్లోనే అత్యధికంగా 230 పరుగులు చేయగలిగింది. ముంబై బౌలర్లలో బుమ్రా, కరణ్ శర్మ, మెక్లిన్ గన్ లకు తలో వికెట్ దక్కింది. -
ఢిల్లీ ఘనవిజయం
-
ఢిల్లీ ధమాకా...
-
ఢిల్లీ ధమాకా...
♦ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై ఘనవిజయం ♦ రాణించిన బిల్లింగ్స్, మోరిస్ మ్యాక్స్‌వెల్, మిల్లర్, మోర్గాన్ ఇలా మ్యాచ్‌ను మలుపుతిప్పే సూపర్ బ్యాట్స్‌మెన్ ఉన్న కింగ్స్ ఎలెవన్... ఢిల్లీ బౌలర్ల ధాటికి తల్లడిల్లింది. అతి పేలవమైన ప్రదర్శనతో పరాభవాన్ని మూటగట్టుకుంది. న్యూఢిల్లీ: ఐపీఎల్–10లో ఢిల్లీ డేర్డెవిల్స్మళ్లీ ఫామ్‌లోకి వచ్చింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఘనవిజయం సాధించింది. సొంతగడ్డపై శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 51 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై గెలుపొందింది. ఫిరోజ్‌షా కోట్లా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. బిల్లింగ్స్ (40 బంతుల్లో 55; 9 ఫోర్లు) ధాటిగా ఆడగా... చివర్లో ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కోరె అండర్సన్ (22 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. వరుణ్ అరోన్‌కు 2 వికెట్లు దక్కగా, సందీప్, మోహిత్, అక్షర్ పటేల్‌లు తలా ఒక వికెట్ తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. అక్షర్ పటేల్ (29 బంతుల్లో 44; 1 ఫోర్, 3 సిక్సర్లు) మినహా ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేకపోయారు. మిల్లర్ (24), మోర్గాన్ (22) ఢిల్లీ బౌలర్లకు తలవంచారు. మోరిస్ 3, నదీమ్, కమిన్స్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. స్కోరు వివరాలు ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: సంజూ సామ్సన్ (సి) మోర్గాన్ (బి) కరియప్ప 19; బిల్లింగ్స్ (సి) మిల్లర్ (బి) అక్షర్ 55; కరుణ్ (సి) సాహా (బి) అరోన్ 0; శ్రేయస్ (సి) మోర్గాన్ (బి) మోహిత్ 22; రిషభ్ పంత్ (సి) మోర్గాన్ (బి) ఆరోన్ 15; అండర్సన్ నాటౌట్ 39; మోరిస్ (సి) మోహిత్ (బి) సందీప్ 16; కమిన్స్ నాటౌట్ 12; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 188. వికెట్ల పతనం: 1–53, 2–55, 3–96, 4–103, 5–120, 6–151. బౌలింగ్: సందీప్ శర్మ 4–0–41–1, మోహిత్ శర్మ 4–0–37–1, అక్షర్ 4–0–33–1, వరుణ్ ఆరోన్ 4–0–45–2, కరియప్ప 3–0–23–1, మ్యాక్స్‌వెల్ 1–0–7–0. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: వోహ్రా (ఎల్బీడబ్ల్యూ) నదీమ్ 3; ఆమ్లా (సి) బిల్లింగ్స్ (బి) మోరిస్ 19; సాహా (సి) జహీర్ (బి) నదీమ్ 7; మోర్గాన్ (సి) నాయర్ (బి) కమిన్స్ 22; మిల్లర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అండర్సన్ 24; మ్యాక్స్‌వెల్ (సి) బిల్లింగ్స్ (బి) అమిత్ మిశ్రా 0; అక్షర్ పటేల్ (బి) మోరిస్ 44; మోహిత్ శర్మ (బి) కమిన్స్ 13; కేసీ కరియప్ప (బి) మోరిస్ 1; సందీప్ శర్మ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 137. వికెట్ల పతనం: 1–5, 2–21, 3–31, 4–64, 5–65, 6–88, 7–133, 8–134, 9–137. బౌలింగ్: జహీర్ 4–0–38–0, నదీమ్ 2–0–13–2, మోరిస్ 4–0–23–3, కమిన్స్ 4–0–23–2, అమిత్ మిశ్రా 3–0–16–1, అండర్సన్ 3–0–23–1. -
మ్యాక్స్ వెల్ మెరుపులు
-
పంజాబ్ కింగ్స్ బోణీ
-
పంజాబ్ కింగ్స్ బోణీ
► రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌పై విజయం ► రాణించిన మ్యాక్స్‌వెల్, మిల్లర్ ఇండోర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ జట్టు బోణీ చేసింది. కీలక సమయంలో కొత్త కెప్టెన్ మ్యాక్స్‌వెల్ (20 బంతుల్లో 44 నాటౌట్; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవిడ్ మిల్లర్ (27 బంతుల్లో 30 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్సర్లు) సమయోచితంగా రాణించారు. దాంతో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో రైజింగ్ పుణే సూపర్ జెయింట్‌పై పంజాబ్ ఆరు వికెట్ల తేడాతో నెగ్గింది. లీగ్‌లో ఇప్పటిదాకా ఎనిమిది సార్లు ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పుణే అన్నింటిలోనూ పరాజయం పాలైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పుణే 20 ఓవర్లలో 6 వికెట్లకు 163 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ (32 బంతుల్లో 50; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా, మనోజ్ తివారి (23 బంతుల్లో 40 నాటౌట్; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుగ్గా ఆడాడు. సందీప్ శర్మకు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ జట్టు 19 ఓవర్లలో నాలుగు వికెట్లకు 164 పరుగులు చేసింది. ఆమ్లా (27 బంతుల్లో 28; 2 ఫోర్లు, 1 సిక్స్), అక్షర్ పటేల్ (22 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్స్) పర్వాలేదనిపించారు. మ్యాక్స్‌వెల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఆదుకున్న స్టోక్స్, తివారి: పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించకపోవడంతో పుణే బ్యాట్స్‌మెన్ ఆచితూచి ఆడారు. తొలి ఓవర్లోనే మయాంక్ పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. నాలుగో ఓవర్లో రహానే (15 బంతుల్లో 19; 1 ఫోర్, 1 సిక్స్) ఇచ్చిన క్యాచ్‌ను వోహ్రా వదిలేయగా... అదే ఓవర్లో అతను వరుసగా 6,4 బాది స్కోరులో వేగం తెచ్చాడు. ఆ తర్వాత ఓవర్లో కెప్టెన్ స్మిత్ (27 బంతుల్లో 26; 3 ఫోర్లు) వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. కానీ తొలి ఐపీఎల్ మ్యాచ్ ఆడుతున్న నటరాజన్ తన తొలి ఓవర్లోనే రహానే వికెట్ తీసి పంజాబ్ జట్టులో సంతోషం నింపాడు. మరో ఓవర్ వ్యవధిలో స్మిత్ వికెట్‌ను స్టొయినిస్ తీయడంతో పుణే 49 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అటు ధోని (5) కూడా విఫలం కావడంతో భారమంతా స్టోక్స్, తివారిలపై పడింది. వీరిద్దరి జోరుకు తోడు చివర్లో క్రిస్టియాన్ 4,4,6 బాదడంతో జట్టు మంచి స్కోరు సాధించగలిగింది. మ్యాక్స్‌వెల్ బాదుడు: లక్ష్యం కోసం బరిలోకి దిగిన పంజాబ్ ఇన్నింగ్స్ ధాటిగా ప్రారంభించింది. క్రీజులో ఉన్నంతసేపు స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపించిన వోహ్రా (9 బంతుల్లో 14; 1 ఫోర్, 1 సిక్స్) మూడో ఓవర్లో వెనుదిరిగాడు. ఆ తర్వాత వరుస ఫోర్లతో జోరు చూపించిన సాహా (14; 3 ఫోర్లు)ను తాహిర్ తన తొలి ఓవర్లోనే బౌల్డ్ చేశాడు. పవర్‌ప్లేలో పంజాబ్ 56 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత 4 ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా ఇవ్వకుండా పుణే బౌలర్లు కట్టడి చేయగలిగారు. దీంతో ఒత్తిడికి లోనైన అక్షర్, ఆమ్లా వరుస ఓవర్లలో వికెట్లను చేజార్చుకున్నారు. అయితే మ్యాక్స్‌వెల్, మిల్లర్ ధాటిగా ఆడి పంజాబ్‌కు విజయాన్ని అందించారు. స్కోరు వివరాలు రైజింగ్ పుణే సూపర్ జెయింట్ ఇన్నింగ్స్: రహానే (సి) స్టొయినిస్ (బి) నటరాజన్ 19; మయాంక్ అగర్వాల్ (బి) సందీప్ శర్మ 0; స్మిత్ (సి) వోహ్రా (బి) స్టొయినిస్ 26; స్టోక్స్ (సి అండ్ బి) అక్షర్ 50; ధోని (సి అండ్ బి) స్వప్నిల్ సింగ్ 5; మనోజ్ తివారి నాటౌట్ 40; క్రిస్టియాన్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) సందీప్ శర్మ 17; రజత్ భాటియా నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో ఆరు వికెట్లకు) 163. వికెట్ల పతనం: 1–1, 2–36, 3–49, 4–71, 5–132, 6–162. బౌలింగ్: సందీప్ 4–0–33–2; మోహిత్ 4–0–34–0; అక్షర్ 4–0–27–1; నటరాజన్ 3–0–26–1; స్టొయినిస్ 3–0–28–1; స్వప్నిల్ సింగ్ 2–0–14–1. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: ఆమ్లా (సి) స్టోక్స్ (బి) చహర్ 28; వోహ్రా (సి) తివారి (బి) దిండా 14; సాహా (బి) తాహిర్ 14; అక్షర్ (సి అండ్ బి) తాహిర్ 24; మ్యాక్స్‌వెల్ నాటౌట్ 44; మిల్లర్ నాటౌట్ 30; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (19 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1–27, 2–49, 3–83, 4–85. బౌలింగ్: దిండా 3–0–26–1; క్రిస్టియాన్ 2–0–24–0; స్టోక్స్ 4–0–32–0; తాహిర్ 4–0–29–2; చహర్ 4–0–32–1; భాటియా 2–0–20–0. -
మ్యాక్స్ వెల్ మెరుపులు
-
మ్యాక్స్ వెల్ మెరుపులు
ఇండోర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో కింగ్స్ పంజాబ్ కెప్టెన్ మ్యాక్స్ వెల్ మెరుపులు మెరిపించాడు. శనివారం రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో జరిగిన మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ తనదైన శైలిలో బ్యాట్ ఝుళిపించాడు. 20 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచిన మ్యాక్స్ వెల్ కింగ్స్ పంజాబ్ కు ఘన విజయాన్ని అందించాడు. కింగ్స్ పంజాబ్ 85 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన తరుణంలో మ్యాక్స్ వెల్ ఆదుకున్నాడు. తొలుత నిలకడను ప్రదర్శించిన మ్యాక్స్ వెల్ క్రీజ్ లో కుదురుకున్న తరువాత చెలరేగి ఆడాడు. అక్షర్ పటేల్(24), డేవిడ్ మిల్లర్(30 నాటౌట్;1 ఫోర్ 2 సిక్సర్లు)లతో కలిసి విలువైన భాగస్వామ్యాలను నమోదు చేశాడు. దాంతో పుణె విసిరిన 164 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్ పంజాబ్ ఇంకా ఓవర్ మిగిలి ఉండగానే అందుకుని టోర్నీలో బోణి కొట్టింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన పుణె ఆది నుంచి తడబడుతూనే బ్యాటింగ్ చేసింది. తొలి ఓవర్ లోనే మయాంక్ అగర్వాల్(0) వికెట్ ను పుణె కోల్పోగా, ఆ తరువాత అజింక్యా రహానే(19), కెప్టెన్ స్టీవ్ స్మిత్(26), ఎంఎస్ ధోని(5)లు కూడా నిరాశపరిచారు. పుణె ఆటగాళ్లలో ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్(50;32 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) కాసేపు మెరుపులు మెరిపించాడు. అయితే స్టోక్స్ హాఫ్ సెంచరీ సాధించిన వెంటనే అక్షర్ పటేల్ బౌలింగ్ లో అవుటయ్యాడు. అక్షర్ బౌలింగ్ లో అతనికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. చివర్లోమనోజ్ తివారీ(40 నాటౌట్;23 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో పుణె నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 163 పరుగుల గౌరవప్రదమైన స్కోరు సాధించకల్గింది. -
ఓడిపోయాక డిన్నర్ చేద్దాం లే..
-
ఓడిపోయాక డిన్నర్ చేద్దాం లే..
రెండో రోజు మ్యాచ్ సజావుగానే సాగినా సోమవారం ఆట మాత్రం వాడివేడిగా సాగింది. జడేజా అర్ధ సెంచరీ చేసిన అనంతరం అలవాటులో భాగంగా తన బ్యాట్‌ను కత్తిసాము చేసినట్టుగా తిప్పడాన్ని వేడ్ అవహేళన చేశాడు. ‘ఎందుకు ఇలా చేస్తుంటావు? నీ ఇన్‌స్టాగ్రామ్‌లో అంతా ఇలాంటి చెత్తే ఉంటుంది’ అని రెచ్చగొట్టాడు. జడేజా అంపైర్ దగ్గరికి వెళ్లి ‘తను ఆపకపోతే నేను ప్రారంభించాల్సి ఉంటుంది’ అని చెప్పడంతో అంపైర్ జోక్యం చేసుకుని ఆటపై దృష్టి పెట్టండి అని హితవు పలికారు. ఇక ఆసీస్ రెండో ఇన్నింగ్స్ 33వ ఓవర్లో మ్యాక్స్‌వెల్ అవుట్ కాగా తను రివ్యూ కోరాడు. రీప్లేలో తను అవుట్ అయినట్టు తేలగా మైదానం వీడుతున్నప్పుడు వేడ్... జడేజాతో మరోసారి వాగ్వాదానికి దిగాడు. మధ్యలో అశ్విన్ కల్పించుకుని సముదాయించగా క్రీజులోకి వెళ్లిన వేడ్.. అక్కడ విజయ్‌తోనూ వాదనకు దిగాడు. అంపైర్లు పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. ఆ తర్వాత తమ మధ్య జరిగిన సంభాషణను జడేజా బయటపెట్టాడు. ‘ఏమీ జరగలేదు. మీరు ఓడిపోయాక అంతా కలిసి డిన్నర్ చేద్దాం’ అని వేడ్‌తో అన్నట్టు తెలిపాడు. -
ఇప్పుడు మ్యాక్స్‌వెల్ వంతు..!
కోహ్లిని అనుకరించిన బ్యాట్స్‌మన్ రాంచీ: భారత్, ఆస్ట్రేలియా ఆటగాళ్లు వివాదాన్ని పక్కనబెట్టి ఆటపై దృష్టిపెడతారని ఇరు బోర్డుల ఉన్నతాధికారులు గొప్పగా పేర్కొన్నారు. కానీ పెద్దల రాజీకి విరుద్ధంగా వివాదం రేపడం మాకు వెన్నతో పెట్టిన విద్య అన్నట్లు ఆసీస్ ఆటగాళ్లు ప్రవర్తిస్తున్నారు. దీంతో బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో ఈ ఆన్‌ఫీల్డ్ ‘చిటపటల’కు ఫుల్స్టాప్ పడేలా లేదు. తాజాగా మూడో టెస్టు మూడో రోజు ఆటలో మ్యాక్స్‌వెల్ వెక్కిరింత కాస్త శ్రుతిమించింది. కోహ్లి తొలి రోజు డైవ్ చేస్తూ గాయంతో విలవిలలాడిన వైనాన్ని మ్యాక్స్‌వెల్ మూడో రోజు ఆటలో విపరీత పోకడతో అనుకరించడం భారత వర్గాల్ని ఆగ్రహానికి గురిచేసింది. కమిన్స్ వేసిన ఇన్నింగ్స్ 81వ ఓవర్లో చతేశ్వర్ పుజారా మిడాన్‌లో షాట్ కొట్టగా మ్యాక్స్‌వెల్ డైవ్ చేసి బౌండరీ వెళ్లకుండా చక్కగా ఆపేశాడు. కానీ అంతటితో ఆగకుండా కోహ్లి తొలి రోజు డైవ్‌తో అయిన గాయాన్ని మ్యాక్స్‌వెల్ వెకిలిగా అచ్చు అలాగే అనుకరించాడు. గత టెస్టులో కెప్టెన్ స్మిత్ డీఆర్ఎస్ అప్పీలుపై డ్రెస్సింగ్ రూమ్ సంకేతాల కోసం చూడటాన్ని భారత కెప్టెన్ కోహ్లి తీవ్రంగా పరిగణించిన సంగతి తెలిసిందే. స్మిత్ అంపైర్ నిర్ణయ సమీక్ష పద్ధతిని డ్రెస్సింగ్ రూమ్ సమీక్షగా మార్చేశాడని కోహ్లి విమర్శించాడు. ఇప్పుడు తమ కెప్టెన్ (స్మిత్) మెప్పుపొందేందుకో మరి వివాదం రేపేందుకో కానీ మ్యాక్స్‌వెల్ అనుకరణ మళ్లీ చర్చనీయాంశమైంది. కోహ్లి చప్పట్లు! అంతకుముందు ఒకీఫ్ వేసిన ఇన్నింగ్స్ 58వ ఓవర్ చివరి బంతి పుజారా (21 పరుగుల వద్ద) ప్యాడ్లకు తగిలింది. ఎల్బీడబ్ల్యూ కోసం అప్పీలు చేయగా ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు. తిరిగి డీఆర్ఎస్ కోసం అప్పీలు చేసినప్పటికీ ఆసీస్‌కు చుక్కెదురైంది. దీంతో ఆసీస్ రెండో రివ్యూ కూడా వృథాగా పోయింది. డీఆర్ఎస్లో రెండు సార్లూ ఆసీస్ కెప్టెన్ స్మిత్ విఫలమవ్వడంతో పెవిలియన్‌లో ప్యాడ్లు కట్టుకొని కూర్చున్న కోహ్లి ఒక్కసారిగా లేచి బిగ్గరగా చప్పట్లు కొట్టడం గమనార్హం. -
కోహ్లీని కవ్విస్తున్న మాక్స్వెల్
రాంచీ: బెంగళూరు టెస్టులో తమ కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చేసిన తీవ్ర వ్యాఖ్యలను ఆస్ట్రేలియా ఆటగాళ్లు తేలికగా తీసుకున్నట్లు కనిపించడం లేదు. తొలిరోజు గాయపడ్డ సందర్భంగా కోహ్లీ బాధపడ్డట్లుగా మూడోరోజు ఏ గాయం అవకుండా అదే రీతిన భుజాన్ని పట్టుకుని మాక్స్వెల్ కనిపించాడు. దీంతో స్డేడియంలో ఒక్కసారిగా అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. విషయం ఏంటంటే.. మూడో టెస్టు రాంచీలో తొలిరోజు ఆటలో రవీంద్ర జడేజా వేసిన బాల్‌ను పీటర్ హాండ్స్కూంబ్ వైడ్ మిడాన్వైపు పుష్ చేయగా, కోహ్లీ దాన్ని వెంబడించాడు. బంతిని ఆపేందుకు డైవ్ చేయగా, ఆ సమయంలో కోహ్లీ కుడివైపు భుజం నేలకు తాకింది. దాంతో బాధతో విలవిల్లాడిపోయాడు. కొంత సమయం భుజాన్ని అలాగే పట్టుకుని మైదానంలో ఉండిపోయాడు. ఆపై ఫీల్డ్ నుంచి విశ్రాంతి కోసం వెళ్లిపోయాడు. సరిగ్గా మూడో రోజు ఆటలో ఆసీస్ ప్లేయర్ గ్లెన్ మాక్స్వెల్ విరాట్ కోహ్లీని అనుకరిస్తూ ఎగతాళి చేశాడు. పుజారా ఆడిన బంతిని ఆపే ప్రయత్నంలో మాక్స్వెల్.. కోహ్లీ డైవ్ చేసిన ప్రదేశంలోనే డైవ్ చేసి బంతిని ఆపాడు. లేచిన తర్వాత ఈ టెస్టు తొలిరోజు కోహ్లీ పట్టుకున్నట్లుగా భుజాన్ని పట్టుకుని కవ్వింపు చర్యలకు పాల్పడ్డాడు. దీంతో ప్రేక్షకులు 'మాక్స్వెల్ దిస్ ఈజ్ నాట్ వెల్' అంటూ గట్టిగా అరవడం గమనార్హం. -
సమం... సమం...
⇒ దీటుగా బదులిస్తున్న భారత్ ⇒ తొలి ఇన్నింగ్స్‌లో 120/1 ⇒ ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 451 ⇒ ఐదు వికెట్లతో చెలరేగిన జడేజా రెండో రోజు ఆటలో భారత్, ఆస్ట్రేలియా జట్లు సమ ఉజ్జీ ఆటతీరును ప్రదర్శించాయి. పిచ్ కాస్త టర్న్ అయినప్పటికీ ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అదే నిలకడ.. అదే ఏకాగ్రతను ప్రదర్శించాడు. భారత బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం చూపుతూ అజేయంగా నిలిచాడు. స్మిత్, మ్యాక్స్‌వెల్ కలిసి ఐదో వికెట్‌కు191 పరుగులు జోడించడంతో ఇక భారీ స్కోరు ఖాయమే అనుకున్న తరుణంలో జడేజా జట్టుకు ఆపద్బాంధవుడిలా మారాడు. తన స్పిన్ మ్యాజిక్‌తో ఆసీస్ భరతం పట్టగా... అటు పేసర్ ఉమేశ్ యాదవ్ కూడా తన పదునైన బంతులతో ప్రత్యర్థిపై ఉచ్చు బిగించడంతో 152 పరుగులు జోడించి ఆసీస్ తమ చివరి ఆరు వికెట్లను కోల్పోయింది. ఇక ఆసీస్‌కు దీటుగా భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించడంతో జట్టుకు శుభారంభం అందింది. చక్కటి స్ట్రోక్‌ప్లేతో ఆకట్టుకున్న ఓపెనర్ కేఎల్ రాహుల్ సిరీస్‌లో తన నాలుగో అర్ధ సెంచరీని సాధించగా మురళీ విజయ్, పుజారా క్రీజులో పాతుకుపోయి మ్యాచ్‌పై పట్టు బిగించే అవకాశాన్ని కల్పించారు. మూడో రోజు ఆటలో టీమిండియా బ్యాట్స్‌మెన్ ఏ స్థాయిలో ఆసీస్ బౌలర్లకు బదులిస్తారనేది ఇప్పుడు కీలకంగా మారనుంది. రాంచీ: కెప్టెన్ విరాట్ కోహ్లి గాయం కారణంగా రెండో రోజు కూడా మైదానంలో దిగకపోయినా భారత జట్టు స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబర్చింది. రహానే నాయకత్వంలో తొందరగానే ఆసీస్ ఇన్నింగ్స్‌ను ముగించిన జట్టు, ఆ తర్వాత బ్యాటింగ్‌లో దీటుగా బదులిచ్చింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ కేఎల్ రాహుల్ (102 బంతుల్లో 67; 9 ఫోర్లు) ఈ సిరీస్‌లో ఆడిన ఐదు ఇన్నింగ్స్‌లో నాలుగో అర్ధ సెంచరీ సాధించడంతో శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 120 పరుగులు చేసి మంచి స్థితిలో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో మురళీ విజయ్ (112 బంతుల్లో 42 బ్యాటింగ్; 6 ఫోర్లు), చతేశ్వర్ పుజారా (10 బ్యాటింగ్) ఉన్నారు. ఆసీస్‌కన్నా భారత్ మరో 331 పరుగులు వెనకబడి ఉంది. అంతకుముందు రవీంద్ర జడేజా (5/124) ధాటికి ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్‌లో 137.3 ఓవర్లలో 451 పరుగులకు ఆలౌట్ అయ్యింది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (361 బంతుల్లో 178 నాటౌట్; 17 ఫోర్లు) చివరి వరకు అజేయంగా నిలవగా మ్యాక్స్‌వెల్ (185 బంతుల్లో 104; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ పూర్తి చేసుకున్నాడు. పేసర్ ఉమేశ్ యాదవ్‌కు మూడు వికెట్లు దక్కాయి. తొలి సెషన్: జడేజా జోరు 299/4 ఓవర్‌నైట్ స్కోరుతో ఆసీస్ ఆట ప్రారంభించగా.. తొలి బంతికే బ్యాట్ విరగ్గొట్టుకున్న మ్యాక్స్‌వెల్ చివరి బంతిని బౌండరీగా మలిచి రెండో రోజు పరుగుల ఖాతా తెరిచాడు. కొద్దిసేపటికే మరో బౌండరీతో మ్యాక్స్ కెరీర్లో తొలి సెంచరీని అందుకున్నాడు. అయితే ఈ సంతోషం ఎంతోసేపు నిలవకుండానే జడేజా వేసిన ఓ అద్భుత బంతికి తను సాహాకు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. దీంతో ఐదో వికెట్‌కు 191 పరుగుల భారీ భాగస్వామ్యం ముగిసింది. మరోవైపు స్మిత్ మాత్రం ఫోర్లతో స్కోరును పెంచే ప్రయత్నం చేశాడు. వేడ్ (50 బంతుల్లో 37; 6 ఫోర్లు) కూడా నిలకడగా ఆడుతుండడంతో మరో మంచి భాగస్వామ్యం వైపు ఆసీస్ వెళ్లింది. అయితే జడేజా మరోసారి తన స్పిన్ సత్తాను ప్రదర్శించి మూడు బంతుల వ్యవధిలో వేడ్, కమ్మిన్స్ వికెట్లు తీసి ఆసీస్‌ను దెబ్బతీశాడు. వేడ్‌తో కలిసి స్మిత్ ఆరో వికెట్‌కు 64 పరుగులు జత చేశాడు. లంచ్ విరామానికి ముందు ఓవర్లో స్మిత్ 315 బంతుల్లో 150 పరుగులు పూర్తి చేశాడు. ఓవర్లు: 28, పరుగులు: 102, వికెట్లు: 3. రెండో సెషన్: వికెట్లు టపటపా బ్రేక్ తర్వాత కాసేపు స్మిత్, ఒకీఫ్ జోడి భారత బౌలర్ల సహనాన్ని పరీక్షించింది. ముఖ్యంగా ఒకీఫ్ చక్కటి డిఫెన్స్‌తో స్మిత్‌కు సహకారం అందించాడు. అయితే ఐదు ఫోర్లు బాదిన తను ఉమేశ్ బౌలింగ్‌లో ఫైన్ లెగ్‌లో విజయ్‌కు క్యాచ్ ఇచ్చాడు. తర్వాతి ఓవర్లోనే జడేజా.. లయన్‌ను అవుట్ చేసి ఐదు వికెట్లను పూర్తి చేశాడు. మరో రెండు ఓవర్ల అనంతరం హాజల్‌వుడ్‌ను జడేజా వికెట్ల వైపు చూడకుండానే మెరుపు వేగంతో రనౌట్ చేయడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత భారత్ తొలి ఇన్నింగ్స్ ఆరంభించగా వికెట్ నష్టపోకుండా 20 పరుగులతో టీ విరామానికి వెళ్లింది. ఆసీస్ ఆడిన ఓవర్లు: 18.4, పరుగులు: 49, వికెట్లు: 3 భారత్ ఆడిన ఓవర్లు: 8, పరుగులు: 20, వికెట్: 0. చివరి సెషన్: రాహుల్ దూకుడు బ్రేక్ తర్వాత ఫామ్‌లో ఉన్న రాహుల్ చక్కటి కవర్ డ్రైవ్‌లతో బౌండరీలు బాదుతూ స్కోరును పెంచాడు. ఇదే జోరుతో 69 బంతుల్లోనే స్వీప్ షాట్‌తో ఫోర్ బాది అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మంచి ఆత్మవిశ్వాసాన్ని కనబరుస్తూ సాగుతున్న రాహుల్ జోరును కమ్మిన్స్ అడ్డుకున్నాడు. 31.2 ఓవర్లో తను విసిరిన స్లో బౌన్సర్‌ను ఆడటంలో విఫలమైన రాహుల్, కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో తొలి వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత ఓవర్లోనే కెరీర్లో 50వ టెస్టు ఆడుతున్న మురళీ విజయ్ నాలుగు బంతుల వ్యవధిలో మూడు ఫోర్లు బాది ఒత్తిడి పెంచాడు. 39వ ఓవర్లో విజయ్ ఎల్బీ కోసం ఆసీస్ రివ్యూకు వెళ్లినా నిరాశే ఎదురైంది. అయితే భారత్ ఆడిన 40 ఓవర్లలో ఆసీస్ ఒక్క ఎక్స్ట్రా పరుగే ఇవ్వడం విశేషం. ఓవర్లు: 32, పరుగులు: 100, వికెట్: 1. ఉమేశ్ దెబ్బకు బ్యాట్ ముక్కలు! రెండో రోజు ఆటలో మొదటి బంతికే మైదానంలో నవ్వులు పూశాయి. 137కి.మీ వేగంతో ఉమేశ్ సంధించిన బంతిని మ్యాక్స్‌వెల్ డిఫెన్స్ ఆడాడు. వెంటనే పరుగు కోసం ప్రయత్నించి ముందుకు చూడగా మ్యాక్సీ చేతిలో బ్యాట్ హ్యాండిల్ మాత్రమే ఉంది. ఉమేశ్ వేగానికి బ్యాట్ రెండు ముక్కలైంది. ఈ ఘటనతో మ్యాక్సీ కన్ఫ్యూజ్ అయ్యాడు. దీన్ని గమనించిన ఉమేశ్ వెంటనే సరదాగా నవ్వుతూ తన కండలు ప్రదర్శించాడు. దాంతో మ్యాక్స్‌వెల్ కూడా నవ్వాపుకోలేకపోయాడు. విరాట్ కోలుకుంటున్నాడు తొలిరోజు ఆటలో మైదానంలో గాయపడిన భారత కెప్టెన్ కోహ్లి వేగంగా కోలుకుంటున్నాడు. అతను రెండోరోజు ఆటలో ఫీల్డ్‌లో కనిపించకపోయినా... మ్యాచ్‌కు ముందు జరిగిన వార్మప్‌లో టీమ్ తో ఉత్సాహంగా పాల్గొన్నాడు. కోచ్ కుంబ్లేతో పాటు ఆటగాళ్లతో సరదాగా ముచ్చటించాడు. మరోవైపు పేసర్ ఉమేశ్‌యాదవ్ ఈ మ్యాచ్‌లో విరాట్ బ్యాటింగ్ చేస్తాడని వెల్లడించాడు. ‘కోహ్లి ఫిట్‌గా ఉన్నాడు. నెట్స్‌లో అతను ప్రాక్టీస్ చేశాడు కూడా. మ్యాచ్‌లో అ తను బ్యాటింగ్‌కు దిగుతాడు’ అని ఉమేశ్ అన్నాడు. ► 3 ఓ టెస్టు సిరీస్‌లో సెంచరీ లేకుండా నాలుగు అర్ధ సెంచరీలు చేసిన మూడో భారత ఓపెనర్ రాహుల్. ఇంతకుముందు చేతన్ చౌహాన్, సిద్ధూ ఈ జాబితాలో ఉన్నారు. ► 1 భారత గడ్డపై అత్యధి క వ్యక్తిగత స్కోరు చేసిన ఆసీస్ కెప్టెన్‌గా క్లార్క్ (130)ను అధిగమించిన స్మిత్ (178). ► 8 జడేజా ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టడం ఇది 8వ సారి. ► 2 మూడు ఫార్మాట్లలో సెంచరీ సాధించిన రెండో ఆసీస్ ఆటగాడిగా (వాట్సన్ తర్వాత) మ్యాక్స్‌వెల్ నిలిచాడు. -
అప్పుడు అరంగేట్రం.. ఇప్పుడు తొలి శతకం
రాంచీ: ఒక క్రికెటర్ గా అరంగేట్రం చేసిన దేశంపైనే తొలి శతకం చేస్తే ఎలా ఉంటుంది. ఆ మజానే వేరుగా ఉంటుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు మ్యాక్స్ వెల్ విషయంలో అదే జరిగింది. రెండో టెస్టులో మిచెల్ మార్ష్ అర్ధాంతరంగా గాయపడటంతో మూడో టెస్టు తుది జట్టులో స్థానం దక్కించుకున్న మ్యాక్స్ వెల్ తనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో శతకంతో రాణించి ఆసీస్ యాజమాన్యం పెట్టుకున్న ఆశల్ని నిజం చేశాడు. గతంలో టెస్టు అరంగేట్రం చేసిన జట్టుపైనే మ్యాక్స్ వెల్ తాజాగా తొలి శతకం సాధించడం విశేషం. 2013లో భారత్ పై హైదరాబాద్ లో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా ఈ ఫార్మాట్ లో మ్యాక్స్ వెల్ అరంగేట్రం చేశాడు. ఆ తరువాత ఇంతకాలానికి అదే జట్టుపై తొలి శతకం సాధించాడు. అటు మ్యాక్స్ వెల్ టెస్టు అరంగేట్రం..ఇటు ఆ ఫార్మాట్ లో తొలి శతకం భారత్ లోనే రావడం ఇక్కడ మరో విశేషం. ఇది మ్యాక్స్ వెల్ కెరీర్ లో నాల్గో టెస్టు మ్యాచ్. దీనికి ముందు టెస్టుల్లో మ్యాక్స్ వెల్ అత్యధిక స్కోరు 37. మూడో టెస్టు ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో స్టీవ్ స్మిత్ తో కలిసి 191 పరుగుల భాగస్వామ్యాన్ని మ్యాక్ప్ వెల్ జత చేశాడు. ఈ క్రమంలోనే 185 బంతుల్లో 9 ఫోర్లు, 2సిక్సర్లతో 104 పరుగులు చేశాడు. అనంతంర జడేజా బౌలింగ్ లో మ్యాక్స్ వెల్ పెవిలియన్ చేరాడు. -
తొలిరోజు ఆసీస్‌దే
⇒స్మిత్ సెంచరీ, మ్యాక్స్‌వెల్ అర్ధశతకం ⇒ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 299/4 ⇒ఆకట్టుకున్న ఉమేశ్ భారత్‌తో మూడో టెస్టు రెండోటెస్టులో ఎదురైన ఘోర పరాజయానికి ఆస్ట్రేలియా దీటుగా బదులిచ్చింది. రాంచీలో భారత్‌తో ప్రారంభమైన మూడోటెస్టులో శుభారంభం చేసింది. డీఆర్ఎస్ వివాదంతో ఏమాత్రం ఏకాగ్రత చెదిరిపోని కెప్టెన్ స్మిత్ సిరీస్‌లో రెండో సెంచరీతో సత్తాచాటాడు. మరోవైపు మూడేళ్ల తర్వాత టెస్టు ఆడుతున్న మ్యాక్స్‌వెల్ కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో రాంచీ టెస్టులో ఆసీస్ భారీ స్కోరు వైపు దూసుకెళ్తోంది. మరోవైపు భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ ‘రివర్స్ స్వింగ్’తో ఆకట్టుకున్నాడు. అయితే ఈ ట్రాక్‌పై స్పిన్ మంత్రం పారలేదు. భారత స్పిన్నర్లు అశ్విన్, జడేజా అంతంతమాత్రంగానే చెరో వికెట్‌తో రాణించారు. మరోవైపు ‘పులి మీద పుట్ర’లా భుజం గాయంతో భారత కెప్టెన్ కోహ్లి మైదానాన్ని వీడడం జట్టు యాజమానాన్ని కలవరపెడుతోంది. ఏదేమెనా ఈ టెస్టులో భారత్ పుంజుకోవాలంటే రెండోరోజు వీలైనంత త్వరగా ఆసీస్‌ను ఆలౌట్ చేసి భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించాల్సి ఉంటుంది. రాంచీ: భారత్–ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న నాలుగు టెస్టుల బోర్డర్ గావస్కర్ సిరీస్‌లో భాగంగా రాంచీలో ప్రారంభమైన మూడోటెస్టులో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. తొలిసారి టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తోన్న రాంచీ వికెట్‌పై కంగారూ జట్టు అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన చేసింది. గురువారం తొలిరోజు టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 90 ఓవర్లలో నాలుగు వికెట్లకు 299 పరుగులు చేసింది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్ అజేయ సెంచరీ (244 బంతుల్లో 117 బ్యాటింగ్, 13 ఫోర్లు), ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ అర్ధ శతకం (82 బ్యాటింగ్)తో ఆకట్టుకున్నారు. ఓపెనర్ మ్యాట్ రెన్షా (44) ఫర్వాలేదనిపించాడు. ఓ దశలో 140/4తో కష్టాల్లో పడిన జట్టును స్మిత్–మ్యాక్స్‌వెల్ జోడీ ఆదుకుంది. సుదీర్ఘంగా 47.4 ఓవర్లపాటు బ్యాటింగ్ చేసిన వీరిద్దరూ అభేద్యమైన ఐదో వికెట్‌కు 159 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో ఉమేశ్ యాదవ్ (2/63) ఆకట్టుకున్నాడు. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్ (1/78), రవీంద్ర జడేజా (1/80) ప్రభావం చూపించలేకపోయారు. సెషన్ 1: సమం సమం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తుది జట్టులోకి కమిన్స్, మ్యాక్స్‌వెల్‌లను తీసుకోగా, గాయంనుంచి కోలుకున్న భారత ఓపెనర్ విజయ్ మళ్లీ జట్టులోకి వచ్చాడు. ఆసీస్ ఓపెనర్లలో వార్నర్ (19) జాగ్రత్తగా ఆడే ప్రయత్నం చేయగా, రెన్షా మాత్రం దూకుడు ప్రదర్శించాడు. రెన్షా తన తొలి 24 పరుగులను 17 బంతుల వ్యవధిలో ఆరు బౌండరీలతోనే సాధించడం విశేషం. అయితే ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న వార్నర్, ఈ సారి జడేజాకు చిక్కాడు. ఫుల్‌టాస్‌ను వార్నర్ బలంగా బాదగా, రాకెట్ వేగంతో దూసుకొచ్చిన బంతిని జడేజా అద్భుత రిటర్న్ క్యాచ్‌తో అందుకున్నాడు. ఆ తర్వాత కొద్ది సేపటికే స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి రెన్షా వెనుదిరిగాడు. ఆ వెంటనే షాన్ మార్‡్ష (2)ను అశ్విన్ పెవిలియన్ పంపించాడు. పుజారా క్యాచ్ పట్టిన అనంతరం అంపైర్ తిరస్కరించగా... రివ్యూ కోరిన భారత్ ఫలితం సాధించింది. మరో ఎండ్‌లో స్మిత్ మాత్రం తనదైన శైలిలో క్రీజ్‌లో పాతుకుపోయే ప్రయత్నం చేశాడు. ఓవర్లు: 30, పరుగులు: 109, వికెట్లు: 3 సెషన్ 2: స్మిత్ జోరు లంచ్ తర్వాత కొద్ది సేపటికే బౌండరీ వద్ద బంతిని ఆపబోయి కోహ్లి గాయపడటంతో 40వ ఓవర్‌నుంచి రహానే కెప్టెన్సీ బాధ్యతలు నిర్వర్తించాడు. మరో వైపు ఆసీస్ కెప్టెన్ చక్కటి షాట్లతో దూసుకుపోయాడు. 104 బంతుల్లో స్మిత్ అర్ధ సెంచరీ పూర్తయింది. అయితే తర్వాతి బంతికే హ్యాండ్స్కోంబ్ (19)ను ఉమేశ్ చక్కటి బంతితో అవుట్ చేశాడు. ఈ దశలో జత కలిసిన స్మిత్, మ్యాక్స్‌వెల్ మళ్లీ ఆసీస్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టే పనిలో పడ్డారు. దాదాపు రెండున్నరేళ్ల తర్వాత టెస్టు మ్యాచ్ ఆడుతున్న మ్యాక్స్‌వెల్ తన సహజసిద్ధమైన దూకుడును కట్టిపెట్టి స్మిత్ అండతో చక్కటి బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చాడు. తాను ఎదుర్కొన్న 57వ బంతికి గానీ అతను తొలి ఫోర్ కొట్టలేదు. ఓవర్లు: 30, పరుగులు: 85, వికెట్లు: 1 సెషన్ 3: ఆసీస్ హవా విరామం అనంతరం ఆస్ట్రేలియా దూసుకుపోయింది. భారత బౌలర్లు కొన్నిసార్లు చక్కటి బంతులు వేసి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా కంగారూలకు అది పెద్ద సమస్య కాలేదు. జడేజా బౌలింగ్‌లో మిడ్‌వికెట్ మీదుగా సిక్సర్ బాదిన మ్యాక్స్‌వెల్ 95 బంతుల్లో కెరీర్లో తొలి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో వైపు 90ల్లోకి వచ్చిన తర్వాత చాలా సేపు ఉత్కంఠక్షణాలు ఎదుర్కొన్న స్మిత్ ఎట్టకేలకు విజయ్ బౌలింగ్‌లో మిడాన్ మీదుగా ఫోర్ కొట్టి 227 బంతుల్లో సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఒకే సిరీస్‌లో కనీసం రెండు శతకాలు బాదిన తొలి ఆసీస్ కెప్టెన్‌గా, ఓవరాల్‌గా మూడో విదేశీ కెప్టెన్‌గా నిలిచాడు. 86 ఓవర్ల తర్వాత భారత్ కొద్ది బంతిని తీసుకున్నా... ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఎలాంటి ప్రమాదం లేకుండా రోజును ముగించారు. ఓవర్లు: 30, పరుగులు: 105, వికెట్లు: 0 కోహ్లికి గాయం మూడో టెస్టు మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ భారత కెప్టెన్ విరాట్ కోహ్లి గాయపడ్డాడు. లంచ్ బ్రేక్ ముందు ఫీల్డింగ్ చేస్తుండగా కుడి భజానికి గాయమవడంతో మైదానాన్ని వీడాడు. మిడ్వికెట్లో బౌండరీ దిశగా దూసుకెళ్తున్న బంతిని ఆపడానికి ప్రయత్నించి గాయపడ్డాడు. వెంటనే భారత ఫిజియో పాట్రిక్ ఫర్హాత్.. కోహ్లికి తక్షణ వైద్య సేవలు అందించాడు. కోహ్లి గాయడడంతో భారత జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానే కెప్టెన్‌గా వ్యవహరించాడు. నోబాల్‌కు రివ్యూ! షాన్ మార్ష్ విషయంలో విజయవంతంగా అప్పీల్ చేసిన భారత్ మరో రెండు సందర్భాల్లో మాత్రం రివ్యూ విషయంలో తడబడింది. ఇషాంత్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్ (17 పరుగుల వద్ద) ఎల్బీ కోసం చేసిన అప్పీల్‌ను అంపైర్ తిరస్కరించగా, వెంటనే రివ్యూ కోరింది. అయితే రివ్యూలో అది నోబాల్‌గా తేలింది. దాంతో అవుట్‌కు ఎలాంటి అవకాశం లేకుండా పోయింది. అయితే 67 పరుగుల వద్ద అదే మ్యాక్స్‌వెల్ రివ్యూ విషయంలో భారత్ తప్పు చేసింది. జడేజా బౌలింగ్‌లో బంతి మ్యాక్సీ గ్లవ్‌కు తగిలి స్లిప్‌లో పడినా భారత్ దానిని గుర్తించలేదు. దాంతో రివ్యూ కోరలేదు. రీప్లేలు చూస్తే మ్యాక్స్‌వెల్ అవుటయ్యేవాడని తేలింది. -
మార్ష్ స్థానంలో మాక్స్వెల్..
రాంచీ: ఆస్ట్రేలియా జట్టులో భుజం గాయం కారణంగా దూరమైన మిచెల్ మార్ష్ స్థానానికి ఇద్దరు ఆటగాళ్లు పోటిపడుతున్నారు. ఆసీస్ డొమెస్టిక్ క్రికెట్లో విక్టోరియా జట్టుకు చెందిన మార్కస్ స్టోయినిస్, గ్లేన్ మాక్స్వెల్ల్లో ఒకరు ఎంపిక అవనున్నారు. ఈ స్థానం కోసం ఈ ఇద్దరు ఆటగాళ్ల మధ్య గట్టిపోటి నెలకొంది. వీరిద్దరిలో ఒకరు రాంచీలో గురువారం నుంచి జరిగే టెస్టులో పాల్గొనే అవకాశం ఉంది. నాలుగు మ్యాచ్‌ల బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో ఇరుజట్ల మద్య పోటి రసవత్తరంగా మారడంతో ఈ ఎంపికకు ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే జట్టులో స్టార్ ఆటగాళ్లు స్టార్క్, మార్ష్ దూరమవడంతో జట్టు బలహీనమైంది. పుణేలో ఓడిన భారత్, బెంగళూరులో ప్రతీకారం తీసుకోని దూకుడుగా ఉంది. సిరీస్‌లో ఇరుజట్లు 1-1 తో సమంగా ఉన్నాయి. అయితే మాక్స్వెల్ చేరికతో జట్టుకు లాభం చేకూరనుంది. మార్కస్ కూడా మార్ష్ లేని లోటు తీర్చుతూ బ్యాటింగ్, బౌలింగ్‌తో ఆల్‌రౌండర్ ప్రతిభ కనబర్చగలడు. అయితే కొద్ది రోజులుగా మాక్స్వెల్ ఫాంలో లేకపోవడం ఆసీస్‌ను కలవరపెడుతుంది. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కే పరిమితమైన మార్కస్ ఇప్పటి వరకు టెస్టులు ఆడలేదు. 3 వన్డేలు, ఒక టీ20 మినహా అంతర్జాతీయ క్రికెట్లో ఆడిన అనుభవం లేదు. దీంతో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో ఆసీస్ బోర్డు తర్జన భర్జన పడుతుంది. -
వార్నర్ సెంచరీ, మాక్స్ వెల్ మెరుపులు
సిడ్నీ: పాకిస్తాన్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ సెంచరీ(119 బంతుల్లో 130: 11 ఫోర్లు, 2 సిక్సర్లు), మాక్స్ వెల్(44 బంతుల్లో 78 పరుగులు: 10 ఫోర్లు, 1 సిక్సర్) మెరుపు ఇన్నింగ్స్ తో చెలరేగడంతో జట్టు భారీ స్కోరు సాధించింది. వన్డే సిరీస్‌లో భాగంగా ఇక్కడ వన్డేలో ఆసీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 353 పరుగులు చేసి, ప్రత్యర్థి పాకిస్తాన్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ కు ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా(49 బంతుల్లో 30: 2 ఫోర్లు), వార్నర్ శుభారంభాన్నిచ్చారు. 17.2 ఓవర్లలో 92 పరుగల వద్ద హసన్ అలీ బౌలింగ్‌లో కీపర్ మహమ్మద్ రిజ్వాన్‌కు క్యాచిచ్చి ఖవాజా ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకొచ్చిన కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో కలిసి వార్నర్ పరుగుల వరద పారించాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు సెంచరీ భాగస్వామ్యాన్ని(120 రన్స్) నెలకొల్పారు. 212 స్కోరు వద్ద వార్నర్ వెనుదిరిగాడు. హెడ్ హాఫ్ సెంచరీ (36 బంతుల్లో 51: 2 ఫోర్లు, 4 సిక్సర్లు) చేయగా, స్మిత్(48 బంతుల్లో 149: 5 ఫోర్లు) తృటిలో అర్థ శతకాన్ని చేజార్చుకున్నాడు. మాక్స్ వెల్ 34 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ చేరుకున్నాడు. చివరి రెండు ఓవర్లలో ఓవర్‌కు మూడు చొప్పున ఫోర్లు బాదిన మాక్స్ వెల్ ఇన్నింగ్ చివరి బంతికి ఔటయ్యాడు. పాక్ బౌలర్ హసన్ అలీ 5 వికెట్లు సాధించగా, ఆమిర్ ఒక వికెట్ తీశాడు. సిరీస్‌లో 2-1తో ఆసీస్ ఇప్పటికే ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే. -
టి20 ప్రపంచ రికార్డూ బద్దలు
-
టి20 ప్రపంచ రికార్డూ బద్దలు
20 ఓవర్లలో ఆస్ట్రేలియా 263 శ్రీలంకపై మ్యాక్స్‌వెల్ మెరుపు సెంచరీ 20 ఓవర్లలో 3 వికెట్లకు 263 పరుగులు... అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా సృష్టించిన పరుగుల సునామీ ఇది. వీర విధ్వంసకారుడు మ్యాక్స్‌వెల్ మెరుపు సెంచరీతో ముందుండి నడిపించగా... కంగారూలు కొత్త ప్రపంచ రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. వన్డేల్లో అత్యధిక స్కోరు రికార్డు బద్దలైన వారం రోజులకే అంతర్జాతీయ టి20ల్లోనూ కొత్త రికార్డు నమోదు కాగా, రెండు సార్లూ శ్రీలంక పేరిట ఉన్న రికార్డు బద్దలు కావడం విశేషం. పల్లెకెలె: పేలవమైన ఫామ్‌తో వన్డేల్లో స్థానం కోల్పోరుు తీవ్ర విమర్శలపాలైన హిట్టర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ తన విలువేమిటో టి20ల్లో చూపించాడు. అద్భుత బ్యాటింగ్‌తో జట్టులో తన పునరాగమనాన్ని ఘనంగా చాటాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన మ్యాక్స్‌వెల్ (65 బంతుల్లో 145 నాటౌట్; 14 ఫోర్లు, 9 సిక్సర్లు) దూకుడుతో శ్రీలంకతో జరిగిన తొలి టి20 మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 263 పరుగులు సాధించింది. అంతర్జాతీయ టి20ల్లో ఒక జట్టుకు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. మ్యాక్స్‌వెల్‌కు హెడ్ (18 బంతుల్లో 45; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ఖాజా (22 బంతుల్లో 36; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), వార్నర్ (16 బంతుల్లో 28; 5 ఫోర్లు) అండగా నిలిచారు. అనంతరం 20 ఓవర్లలో 9 వికెట్లకు 178 పరుగులు చేసిన శ్రీలంక 85 పరుగుల తేడాతో చిత్తరుుంది. బౌండరీల వర్షం... ఆసీస్ ఇన్నింగ్స తొలి ఓవర్లో 3 పరుగులే వచ్చారుు. మధ్యలో మరో రెండు ఓవర్లు మినహా మిగతా 17 ఓవర్లలో విధ్వంసం కొనసాగింది. ఆరంభంలో రజిత ఓవర్లో నాలుగు ఫోర్లు బాది వార్నర్ ధాటిని ప్రదర్శించగా ఆ తర్వాత ఖాజా, హెడ్ దానిని కొనసాగించారు. అరుుతే ఆటను శాసించింది మాత్రం మ్యాక్స్‌వెలే. తొలిసారి ఓపెనర్‌గా బరిలోకి దిగిన అతను ఏ లంక బౌలర్‌ను కూడా వదిలి పెట్టలేదు. 49 బంతుల్లోనే అతను సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సేనానాయకే వేసిన ఒక ఓవర్లో 3 సిక్సర్లు, ఫోర్లతో 23 పరుగులు రాబట్టిన మ్యాక్సీ చివరకు అజేయంగా నిలిచాడు. భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక పోటీనిచ్చే ప్రయత్నం చేసినా విజయానికి చాలా దూరంలో నిలిచిపోరుుంది. చండీమల్ (43 బం తుల్లో 58; 6 ఫోర్లు, 1 సిక్స్), కపుగెదెర (25 బం తుల్లో 43; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. ⇒అంతర్జాతీయ టి20ల్లో ఇదే అత్యధిక స్కోరు. 2007లో కెన్యాపై శ్రీలంక (260) సాధించిన రికార్డు తెరమరుగైంది. ⇒అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాళ్లలో ఆరోన్ ఫించ్ (156) తర్వాత మ్యాక్స్‌వెల్ రెండో స్థానంలో నిలిచాడు. ⇒ఓవరాల్‌గా అంతర్జాతీయ, దేశవాళీ టి20ల్లో కలిపి అత్యధిక స్కోరు రికార్డు కూడా ఇప్పుడు సమమైంది. 2013 ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కూడా 263 పరుగులు చేసింది. -
మొదటి ఎలక్ట్రిక్ విమానానికి నాసా శ్రీకారం
వాషింగ్టన్ : ఇప్పుడున్నవిమానాలకు వినూత్నంగా, ఎక్కువ సామర్థ్యంతో, పర్యావరణ అనుకూల ఎయిర్ క్రాప్ట్ ను తయారుచేసేందుకు అమెరికా స్పేస్ ఏజెన్సీ నాసా సిద్ధమైంది. మొదటి ఎలక్ట్రిక్ పవర్డ్ ఎయిర్ ప్లేన్ ఎక్స్-57 ను తయారుచేసే ప్రణాళికను విడుదల చేసింది. వాషింగ్టన్ లోని అమెరికన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాట్స్ కాన్ఫరెన్స్ లో నాసా అడ్మినిస్ట్రేటర్ చార్లెస్ ఎఫ్ బోల్టెన్ ఎక్స్-57 మ్యాక్స్ వెల్ ప్లాన్ గురించి వివరించారు. ఏవియేషన్ లో నూతన యుగ ఆరంభానికి ఎక్స్-57 శ్రీకారం చుట్టుతుందని బోల్టెన్ పేర్కొన్నారు. వెంటనే ఈ టెక్నాలజీతో అమెరికన్ జెట్ లైనర్స్ రాకపోయినా... కొన్నేళ్ల తర్వాత మాత్రం చిన్న, సాధారణ ఏవియేన్లకు, ప్రయాణికుల విమానాలకు ఈ టెక్నాలజీ వాడతారని విశ్వసిస్తున్నట్టు పేర్కొన్నారు. ఒక్క గంటకు 175 మైల్స్ వేగంతో ఈ విమానం ప్రయాణించగదని చెప్పారు. మొత్తం 14 ఎలక్ట్రిక్ మోటార్స్ లను దీనిలో పొందుపరిచారు. ప్రస్తుతమున్న రెక్కలకంటే భిన్నంగా, చాలా స్కిన్నియర్ గా, ప్రత్యేకంగా ఈ కొత్త విమాన రెక్కలు ఉండబోతున్నాయి. ఎలక్ట్రిక్ టెక్నాలజీతో రూపొందించే ఎక్స్-57 ఎయిర్ క్ట్రాప్ట్ శబ్దాన్నిగణనీయంగా తగ్గిస్తుంది. ప్రజలను శబ్ద అవాంతరాల నుంచి బయటపడేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ ఎయిర్ క్రాప్ట్ ల రూపకల్పనతో గ్యాస్అలైన్ మోటార్స్ లన్నింటినీ , నాసా ఎలక్ట్రిక్ లోకి మార్చనుంది. నాసా తీసుకొచ్చే ఈ విమానంతో నిర్వహణ ఖర్చులు 40 శాతం తగ్గిపోవడంతో పాటు ప్రయాణికులు తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేరిపోవచ్చు. ఇంధన వాడకం కూడా ఐదు రెట్లు తగ్గిపోనుంది. ఈ కొత్త విమానానికి "మ్యాక్స్ వెల్" గా నాసా నామకరణం చేసింది. 19శతాబ్దంలో క్లాసికల్ సిద్ధాంతంలో ఎలక్ట్రోమ్యాగ్నటిజమ్ రేడియేషన్స్ ను తీసుకొచ్చిన స్కాటిస్ శాస్త్రవేత్త పేరు జేమ్స్ క్లార్క్ మ్యాక్స్ వెల్. అతనే పేరునే ఈ విమానానికి పెట్టింది.1947లో మొదట ఎక్స్ ఎయిర్ ప్లేన్లను నాసా ప్రపంచానికి పరిచయం చేసింది. ఇప్పటివరకూ వచ్చిన ఎక్స్ ప్లేన్స్ అన్నీ ప్రపంచ ఏవియేషన్, స్నేష్ టెక్నాలజీలో ఇవి ప్రముఖ స్థానాన్ని సంపాదించుకున్నాయి. చివరి ఎయిర్ క్రాప్ట్ ఎక్స్-43ఏ ను నాసా దశాబ్దం కిందట తయారుచేసింది. -
కోల్‌కతా ‘టాప్’ క్లాస్
► పంజాబ్‌పై ఏడు పరుగులతో నైట్ రైడర్స్విజయం ► ఉతప్ప, గంభీర్ అర్ధసెంచరీలు ► బంతితో మెరిసిన రసెల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్న గంభీర్, ఉతప్పల క్లాసికల్ అర్ధసెంచరీలు... ఆండ్రీ రసెల్ సంచలన బౌలింగ్‌తో సొంతగడ్డపై కోల్‌కతా నైట్‌రైడర్స్ మరో విజయం సాధించింది. సీజన్లో తొలిసారి మ్యాక్స్‌వెల్ మెరిసినా పంజాబ్ రాత మారలేదు. ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో ఆరింటిలో గెలిచిన నైట్‌రైడర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. కోల్‌కతా: ‘సూపర్ మ్యాన్’ ఆండ్రీ రసెల్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఖాతాలో మరో విజయాన్ని చేర్చాడు. ఈసారి అద్భుతమైన బౌలింగ్‌తో పాటు మైదానం అంతా పాదరసంలా క దిలి ఫీల్డింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు. రసెల్ (4/ 20) సంచలన బౌలింగ్ ప్రదర్శనతో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఏడు పరుగులతో పంజాబ్ కింగ్స్ ఎలెవన్‌పై విజయం సాధించింది. ఈడెన్ గార్డెన్స్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ ఫీల్డింగ్ ఎంచుకోగా... కోల్‌కతా నైట్‌రైడర్స్ 20 ఓవర్లలో మూడు వికెట్లకు 164 పరుగులు చేసింది. ఓపెనర్లు ఉతప్ప (49 బంతుల్లో 70; 6 ఫోర్లు, 2 సిక్సర్లు), గంభీర్ (45 బంతుల్లో 54; 6 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధ సెంచరీలు సాధించి... తొలి వికెట్‌కు 81 బంతుల్లో 101 పరుగులు జోడించారు. యూసుఫ్ పఠాన్ (16 బంతుల్లో 19 నాటౌట్; 1 సిక్సర్), రసెల్ (10 బంతుల్లో 16; 1 ఫోర్, 1 సిక్సర్) స్లాగ్ ఓవర్లలో ఆశించిన స్థాయిలో ఆడలేకపోయారు. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 157 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. మ్యాక్స్‌వెల్ (42 బంతుల్లో 68; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), అక్షర్ పటేల్ (7 బంతుల్లో 21; 1 ఫోర్, 2 సిక్సర్లు) మినహా అందరూ విఫలమయ్యారు. తన నాలుగు ఓవర్లలో 15 డాట్ బాల్స్ వేసిన రసెల్ నాలుగు వికెట్లు తీయగా... పీయూష్ చావ్లా రెండు వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్ల జోరు ఈ సీజన్లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న కోల్‌కతా ఓపెనర్లు గంభీర్, ఉతప్ప మరోసారి రాణించారు. ఇద్దరూ తమ సహజశైలిలోనే ఆడటంతో అడపాదడపా బౌండరీలు వచ్చినా పవర్‌ప్లేలో 40 పరుగులు మాత్రమే వచ్చాయి. కుదురుకున్నాక ఇద్దరూ చెరో సిక్సర్ కొట్టినా ఎక్కువగా సింగిల్స్‌కే పరిమితమయ్యారు. పది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 74 పరుగులతో కోల్‌కతా పటిష్ట స్థితికి చేరింది. 42 బంతుల్లో అర్ధసెంచరీ సాధించిన గంభీర్... ఆ తర్వాతి ఓవర్లోనే రనౌట్‌గా వెనుదిరిగాడు. గత మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్ ఆడిన యూసుఫ్ పఠాన్‌తో కలిసి ఉతప్ప ఇన్నింగ్స్‌లో వేగం పెంచే ప్రయత్నం చేశాడు. 38 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన ఉతప్ప... జోరు పెంచి ఓ సిక్సర్, ఫోర్ కొట్టినా రనౌట్‌గా వెనుదిరిగాడు. ఆ తర్వాత రసెల్ క్రీజులోకి వచ్చినా... పఠాన్, రసెల్ జోడీని పంజాబ్ బౌలర్లు నియంత్రించారు. స్లాగ్ ఓవర్లలో సందీప్ శర్మ, మోహిత్ శర్మ అద్భుతంగా యార్కర్లు సంధించడంతో భారీగా పరుగులు రాలేదు. ఇన్నింగ్స్ చివరి బంతికి రసెల్ రనౌట్ అయ్యాడు. మ్యాక్స్‌వెల్ పోరాడినా... పంజాబ్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే స్టోయినిస్ అవుటయ్యాడు. వోహ్రా, కెప్టెన్ విజయ్ కూడా వరుస బంతుల్లో అవుట్ కావడంతో పంజాబ్ 13 పరుగులకే టాపార్డర్ మూడు వికెట్లు కోల్పోయింది. సాహా, మ్యాక్స్‌వెల్ చెరో రెండు ఫోర్లు కొట్టడంతో పవర్‌ప్లేలో పంజాబ్ 37 పరుగులు చేసింది. సాహా కూడా విఫలం కావడంతో పది ఓవర్లలో 4 వికెట్లకు 64 పరుగులు మాత్రమే చేసింది.ఈ దశలో మ్యాక్స్‌వెల్ బ్యాట్ ఝళిపించాడు. చావ్లా బౌలింగ్‌లో సిక్సర్, ఫోర్... హాగ్ బౌలింగ్‌లో సిక్సర్, రెండు ఫోర్లతో 29 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అదే జోరులో మరో ఫోర్, సిక్సర్ కొట్టాక చావ్లా బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడబోయి ఎల్బీగా వెనుదిరిగాడు. అప్పటికి పంజాబ్ విజయానికి 26 బంతుల్లో 45 పరుగులు చేయాలి. ఫామ్‌లో లేని మిల్లర్ మరోసారి నిరాశపరిచినా... రసెల్ బౌలింగ్‌లో రెండు వరుస సిక్సర్లతో అక్షర్ పటేల్ పంజాబ్ ఆశలు సజీవంగా నిలిపాడు. చివరి రెండు ఓవర్లలో విజయానికి 22 పరుగులు అవసరం కాగా... మోర్కెల్ వేసిన 19వ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. ఆఖరి ఓవర్లో రసెల్... అక్షర్‌ను రనౌట్ చేయడంతో పాటు స్వప్నిల్ వికెట్ తీసి కేవలం నాలుగు పరుగులే ఇచ్చి కోల్‌కతా విజయాన్ని పూర్తి చేశాడు. స్కోరు వివరాలు కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప రనౌట్ 70; గంభీర్ రనౌట్ 54; యూసుఫ్ పఠాన్ నాటౌట్ 19; రసెల్ రనౌట్ 16; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 164. వికెట్ల పతనం: 1-101; 2-137; 3-164. బౌలింగ్: సందీప్ శర్మ 4-0-25-0; మోహిత్ శర్మ 4-0-39-0; స్టోయినిస్ 3-0-26-0; అక్షర్ పటేల్ 4-0-24-0; స్వప్నిల్ సింగ్ 3-0-29-0; గురుకీరత్ 1-0-8-0; మ్యాక్స్‌వెల్ 1-0-11-0. పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఇన్నింగ్స్: మురళీ విజయ్ (సి) షకీబ్ (బి) మోర్కెల్ 6; స్టోయినిస్ (సి) చావ్లా (బి) రసెల్ 0; వోహ్రా (సి) షకీబ్ (బి) రసెల్ 0; సాహా (బి) చావ్లా 24; మ్యాక్స్‌వెల్ ఎల్బీడబ్ల్యు (బి) చావ్లా 68; మిల్లర్ (సి) సతీశ్ (సబ్) (బి) రసెల్ 13; గురుకీరత్ రనౌట్ 11; అక్షర్ పటేల్ రనౌట్ 21; స్వప్నిల్ సింగ్ ఎల్బీడబ్ల్యు (బి) రసెల్ 0; మోహిత్ శర్మ నాటౌట్ 1; సందీప్ శర్మ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1-1; 2-13; 3-13; 4-53; 5-120; 6-130; 7-154; 8-155; 9-156. బౌలింగ్: రసెల్ 4-0-20-4; మోర్నీ మోర్కెల్ 4-0-27-1; ఉమేశ్ యాదవ్ 3-0-26-0; షకీబ్ 3-0-21-0; పీయూష్ చావ్లా 4-0-27-2; హాగ్ 2-0-28-0. -
మ్యాక్స్‌వెల్‌కు మందలింపు
ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసినందుకు పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఆటగాడు మ్యాక్స్‌వెల్‌ను మ్యాచ్ రిఫరీ రోషన్ మహానామా హెచ్చరించారు. -
‘కంగారు’ పడ్డా కొట్టేశారు
► బంగ్లాదేశ్‌పై మూడు వికెట్లతో ఆసీస్ విజయం ► సెమీస్ అవకాశాలు సజీవం బెంగళూరు: టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా ఆశలు సజీవంగా నిలిచాయి. చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిచి టోర్నీలో తొలి విజయం సాధించింది. అటు బంగ్లాదేశ్ వరుసగా రెండో ఓటమితో దాదాపుగా సెమీస్ అవకాశాలు కోల్పోయింది. చిన్నస్వామి స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించింది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ఫీల్డింగ్ ఎంచుకోగా... బంగ్లాదేశ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 156 పరుగులు చేసింది. ఆరంభంలోనే సర్కార్, షబ్బీర్ల వికెట్లు కోల్పోయినా.... మిథున్ (22 బంతుల్లో 23; 1 ఫోర్, 1 సిక్సర్), షకీబ్ (25 బంతుల్లో 33; 3 ఫోర్లు, 1 సిక్సర్) కలిసి పరిస్థితిని చక్కదిద్దారు. చివర్లో మహ్మదుల్లా (29 బంతుల్లో 49 నాటౌట్; 7 ఫోర్లు, 1 సిక్సర్) సంచలన షాట్లతో చెలరేగడంతో బంగ్లాదేశ్‌కు గౌరవప్రదమైన స్కోరు లభించింది. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా మూడు వికెట్లు తీయగా, వాట్సన్ రెండు వికెట్లు సాధించాడు. ఆస్ట్రేలియా జట్టు 18.3 ఓవర్లలో ఏడు వికెట్లకు 157 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు ఉస్మాన్ ఖవాజా (45 బంతుల్లో 58; 7 ఫోర్లు, 1 సిక్సర్), వాట్సన్ (15 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్సర్) తొలి వికెట్‌కు 44 బంతుల్లోనే 62 పరుగులు జోడించి శుభారంభాన్ని ఇచ్చారు. స్మిత్ (13 బంతుల్లో 14; 1 సిక్సర్), వార్నర్ (9 బంతుల్లో 17; 1 ఫోర్, 1 సిక్సర్) ఎక్కువసేపు నిలబడలేదు. మధ్య ఓవర్లలో బంగ్లాదేశ్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీసి ఒత్తిడి పెంచినా... మ్యాక్స్‌వెల్ (15 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) చకచకా పరుగులు చేశాడు. రెండు సులభమైన క్యాచ్‌లను వదిలేయడం బంగ్లాదేశ్‌ను దారుణంగా దెబ్బతీసింది. షకీబ్ మూడు, ముస్తాఫిజుర్ రెండు వికెట్లు తీసుకున్నారు. జంపాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. స్కోరు వివరాలు బంగ్లాదేశ్ ఇన్నింగ్స్: మిథున్ (సి) వాట్సన్ (బి) జంపా 23; సౌమ్య సర్కార్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) వాట్సన్ 1; షబ్బీర్ (సి) ఫాల్క్‌నర్ (బి) వాట్సన్ 12; షకీబ్ (సి) కౌల్టర్ నైల్ (బి) జంపా 33; షువగత ఎల్బీడబ్ల్యు (బి) జంపా 13; మహ్మదుల్లా నాటౌట్ 49; ముష్ఫికర్ నాటౌట్ 15; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో ఐదు వికెట్లకు) 156. వికెట్ల పతనం: 1-2; 2-25; 3-62; 4-78; 5-105. బౌలింగ్: కౌల్టర్ నైల్ 4-0-21-0; వాట్సన్ 4-0-31-2; హేస్టింగ్స్ 3-0-24-0; మిషెల్ మార్ష్ 1-0-12-0; మ్యాక్స్‌వెల్ 1-0-12-0; ఆడమ్ జంపా 4-0-23-3; ఫాల్క్‌నర్ 3-0-26-0. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఖవాజా (బి) అల్ అమిన్ 58; వాట్సన్ రనౌట్ 21; స్టీవ్ స్మిత్ (బి) ముస్తాఫిజుర్ 14; వార్నర్ (సి) అండ్ (బి) షకీబ్ 17; మ్యాక్స్‌వెల్ (స్టంప్డ్) ముష్ఫికర్ (బి) షకీబ్ 26; మిషెల్ మార్ష్ (సి) షకీబ్ (బి) ముస్తాఫిజుర్ 6; ఫాల్క్‌నర్ నాటౌట్ 5; హేస్టింగ్స్ (సి) సర్కార్ (బి) షకీబ్ 3; నెవిల్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (18.3 ఓవర్లలో ఏడు వికెట్లకు) 157. వికెట్ల పతనం: 1-62; 2-95; 3-115; 4-119; 5-135; 6-148; 7-152. బౌలింగ్: మొర్తజా 1-0-9-0; మహ్మదుల్లా 2-0-22-0; అల్ అమిన్ 2-0-14-1; ముస్తాఫిజుర్ 4-0-30-2; షకీబ్ 4-0-27-3; సాజిబ్ 3.3-0-40-0; షువగత 2-0-13-0. -
‘కంగారు’పడ్డారు!
► లక్ష్య ఛేదనలో తడబడ్డ ఆస్ట్రేలియా ► 8 పరుగులతో నెగ్గిన న్యూజిలాండ్ ► రాణించిన కివీస్ బౌలర్లు ధర్మశాల: ఆస్ట్రేలియా లక్ష్యం 20 ఓవర్లలో 143 పరుగులు... ఓ దశలో జట్టు స్కోరు 121/5... ఇక గెలవాలంటే 12 బంతుల్లో 22 పరుగులు చేయాలి. మామూలుగా ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌ను బట్టి చూస్తే విజయం నల్లేరు మీద నడకే. కానీ న్యూజిలాండ్ పేసర్లు మెక్లీంగన్ (3/17), అండర్సన్ (2/29) సూపర్ బౌలింగ్‌తో కంగారూలను అద్భుతంగా కట్టడి చేశారు. 12 బంతుల వ్యవధిలో నాలుగు వికెట్లు తీసి స్మిత్‌సేన విజయాన్ని అడ్డుకున్నారు. ఫలితంగా టి20 ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం జరిగిన గ్రూప్-2 లీగ్ మ్యాచ్‌లో కివీస్ 8 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై నెగ్గి వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 142 పరుగులు చేసింది. గప్టిల్ (27 బంతుల్లో 39; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇలియట్ (20 బంతుల్లో 27; 3 ఫోర్లు), విలియమ్సన్ (20 బంతుల్లో 24; 4 ఫోర్లు), మున్రో (26 బంతుల్లో 23; 2 ఫోర్లు)లు రాణించారు. అనంతరం ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 9 వికెట్లకు 134 పరుగులకే పరిమితమైంది. ఖవాజ (27 బంతుల్లో 38; 6 ఫోర్లు) టాప్ స్కోరర్. చివర్లో 12 బంతుల వ్యవధిలో మార్ష్(24), అగర్(9), ఫాల్క్‌నర్ (2), కోల్టర్‌నీల్ (1)లు అవుట్ కావడంతో కివీస్ చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. మెక్లీంగన్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) ఫాల్క్‌నర్ 39; విలియమ్సన్ (సి) అగర్ (బి) మ్యాక్స్‌వెల్ 24; మున్రో (సి) ఫాల్క్‌నర్ (బి) మార్ష్ 23; అండర్సన్ (సి) అగర్ (బి) మ్యాక్స్‌వెల్ 3; టేలర్ (సి) మార్ష్ (బి) వాట్సన్ 11; ఇలియట్ రనౌట్ 27; రోంచి (సి) మ్యాక్స్‌వెల్ (బి) ఫాల్క్‌నర్ 6; సాంట్నెర్ రనౌట్ 1; మిల్నె నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 142. వికెట్ల పతనం: 1-61; 2-66; 3-76; 4-97; 5-117; 6-133; 7-140; 8-142. బౌలింగ్: కోల్టర్‌నీల్ 4-0-33-0; వాట్సన్ 4-0-22-1; అగర్ 1-0-18-0; ఫాల్క్‌నర్ 3-0-18-2; జంపా 1-0-3-0; మ్యాక్స్‌వెల్ 3-0-18-2; మిచెల్ మార్ష్ 4-0-26-1. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్: ఖవాజ రనౌట్ 38; వాట్సన్ (సి) విలియమ్సన్ (బి) మెక్లీంగన్ 13; స్మిత్ (స్టంప్డ్) రోంచి (బి) సాంట్నెర్ 6; వార్నర్ (సి) గప్టిల్ (బి) సాంట్నెర్ 6; మ్యాక్స్‌వెల్ (సి) విలియమ్సన్ (బి) సోధి 22; మార్ష్ (సి) మిల్నె (బి) మెక్లీంగన్ 24; అగర్ (సి) టేలర్ (బి) మెక్లీంగన్ 9; ఫాల్క్‌నర్ (సి) గప్టిల్ (బి) అండర్సన్ 2; కోల్టర్‌నీల్ (బి) అండర్సన్ 1; నెవిల్ నాటౌట్ 7; జంపా నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 134. వికెట్ల పతనం: 1-44; 2-51; 3-62; 4-66; 5-100; 6-121; 7-123; 8-124; 9-132. బౌలింగ్: అండర్సన్ 4-0-29-2; మిల్నె 2-0-22-0; ఇలియట్ 2-0-17-0; మెక్లీంగన్ 3-0-17-3; సాంట్నెర్ 4-0-30-2; విలియమ్సన్ 1-0-3-0; సోధి 4-0-14-1. కివీస్ మహిళలు కూడా... మరోవైపు న్యూజిలాండ్ మహిళల జట్టు కూడా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో కివీస్ 93 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత కివీస్ మూడు వికెట్లకు 177 పరుగులు చేయగా... ఐర్లాండ్ 83 పరుగులు మాత్రమే సాధించింది. మరో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆరు వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. 103 పరుగుల విజయలక్ష్యాన్ని ఆస్ట్రేలియా నాలుగు వికెట్లు కోల్పోయి అధిగమించింది. -
ఆసీస్ సూపర్ షో
వార్నర్, మ్యాక్స్‌వెల్ మెరుపులు దక్షిణాఫ్రికాపై రెండో టి20లో విజయం జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా జరిగిన రెండో టి20లో ఆస్ట్రేలియా ఐదు వికెట్ల తేడాతో నెగ్గింది. 205 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ చివరి బంతికి గెలిచింది. దీంతో మూడు టి20ల సిరీస్‌లో 1-1తో పోటీలో నిలిచింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ప్రొటీస్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 204 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (41 బంతుల్లో 79; 5 ఫోర్లు; 5 సిక్సర్లు), డి కాక్ (28 బంతుల్లో 44; 8 ఫోర్లు; 1 సిక్స్), మిల్లర్ (18 బంతుల్లో 33; 2 ఫోర్లు; 2 సిక్సర్లు) వేగంగా ఆడి భారీ స్కోరుకు సహాయపడ్డారు. ఫాల్క్‌నర్‌కు మూడు, హేస్టింగ్స్‌కు రెండు వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత లక్ష్య చేధనకు బరిలోకి దిగిన ఆసీస్ 20 ఓవర్లలో ఐదు వికెట్లకు 205 పరుగులు చేసి గెలిచింది. అయితే 32 పరుగులకే మూడు వికెట్లు కోల్పోగా డేవిడ్ వార్నర్ (40 బంతుల్లో 77; 6 ఫోర్లు; 5 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (43 బంతుల్లో 75; 7 ఫోర్లు; 3 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్‌తో ప్రొటీస్‌ను వణికించారు. వీరిద్దరి జోరుతో నాలుగో వికెట్‌కు రికార్డు స్థాయిలో 161 పరుగులు వచ్చాయి. దీంతో ఆసియా కప్ టి20లో ఇదే వికెట్‌కు ఉమర్ అక్మల్, షోయబ్ మధ్య నెలకొన్న ప్రపంచ రికార్డు కనుమరుగైంది. మ్యాక్స్ 19వ ఓవర్ తొలి బంతికి, వార్నర్ చివరి ఓవర్ తొలి బంతికి అవుటైనా ఆసీస్ ఇబ్బంది పడకుండా నెగ్గింది. రబడా, స్టెయిన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. -
మమ్మల్నికోహ్లి భయపెట్టాడు!
సిడ్నీ: నాల్గో వన్డేలో టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లి తన ఆట తీరుతో భయపెట్టాడని ఆస్ట్రేలియా ఆటగాడు మ్యాక్స్ వెల్ స్పష్టం చేశాడు. తాము తొలుత బ్యాటింగ్ చేసి భారీ పరుగులను స్కోరు బోర్డుపై ఉంచినా.. విరాట్ ఆటతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయిందన్నాడు. ఒకానొక దశలో తమ నుంచి మ్యాచ్ ను పూర్తిగా తన చేతుల్లోకి లాగేసుకుని తమ గుండెల్లో రైళ్లు పరుగెత్తించాడని మ్యాక్స్ వెల్ పేర్కొన్నాడు. తాను విరాట్ ను విమర్శించానని వచ్చిన వార్తల్లో ఎటువంటి నిజం లేదన్నాడు. నాలుగో వన్డేకు సంబంధించి పలు విషయాలను ట్విట్టర్ ద్వారా పంచుకున్న మ్యాక్స్ వెల్.. విరాట్ ను పొగడ్తలతో ముంచెత్తాడు. ఆ మ్యాచ్ లో కోహ్లి ఆడిన తీరు నిజంగా అద్భుతమన్నాడు. తీవ్రమైన ఒత్తిడిలో విరాట్ పోరాటం అద్వితీయమన్నాడు. ఆ సమయంలో విరాట్ మాదిరిగా ఆడటం ప్రపంచంలో ఏ ఒక్క ఆటగాడికి సాధ్యం కాకపోవచ్చని మ్యాక్స్ వెల్ అభిప్రాయపడ్డాడు. ఒకవేళ విరాట్ ఇంకా కాసేపు క్రీజ్ లో ఉంటే ఆ మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించేదన్నాడు. విరాట్ ఫీల్డ్‌లో ఉన్నంత సేపు టీమిండియాను కట్టడి చేయడం తమ వల్ల కాలేదని మ్యాక్స్ వెల్ తెలిపాడు. నాల్గో వన్డేలో గాయపడ్డ మ్యాక్స్ వెల్ ఆఖరి వన్డేలో ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇషాంత్ శర్మ బౌలింగ్ లో గాయపడ్డ మ్యాక్ప్ వెల్ కుడి మోకాలి వాపు పూర్తిగా తగ్గక పోవడంతో అతని విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. ఈ సిరీస్ లో కీలకమైన మూడు, నాలుగు వన్డేల్లో మ్యాక్స్ వెల్ రాణించి ఆసీస్ సిరీస్ విజయంలో ముఖ్య భూమిక పోషించాడు. -
చివరి వన్డేకు అనుమానం
భారత్‌తో నాలుగో వన్డేలో బ్యాటింగ్ చేస్తుండగా మోకాలికి దెబ్బ తగలడంతో ఆఖరి వన్డేలో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ మ్యాక్స్‌వెల్ ఆడకపోవచ్చు. ఇషాంత్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్‌కు దెబ్బతగలడం వల్ల మోకాలు వాచిందని జట్టు తెలిపింది. -
చివరి వన్డేకు మ్యాక్స్ వెల్ అనుమానం
కాన్బెర్రా: టీమిండియాతో ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా శనివారం జరుగనున్న చివరి వన్డేలో ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ ఆటగాడు మ్యాక్స్ వెల్ ఆడే అవకాశాలు తక్కువగా కనబడుతున్నాయి. బుధవారం జరిగిన నాల్గో వన్డే లో ఇషాంత్ బౌలింగ్ వేస్తున్న సమయంలో ఓ బంతి మ్యాక్స్ వెల్ కుడి మోకాలను బలంగా తాకింది. ఇషాంత్ లెగ్ సైడ్ వేసిన బంతిని అందుకునే క్రమంలో దాటిగా ఆడబోయిన మ్యాక్స్ వెల్ ముందుకు వంగబోయి గాయపడ్డాడు. దీంతో మ్యాక్స్ వెల్ చివరి వన్డే తుది జట్టులో ఆడే అవకాశాలు కనబడుట లేదు. దీనిపై క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) ఓ ప్రకటన విడుదల చేసింది. ఇంకా మ్యాక్స్ వెల్ కాలి గాయం వాపు తగ్గలేదని స్పష్టం చేసింది. అతనికి మరికొన్ని రోజులు విశ్రాంతి అవసరం కావొచ్చని తెలిపింది. ఆ మ్యాచ్ లో మ్యాక్స్ వెల్ 13 పరుగుల వద్ద ఉండగా గాయపడ్డాడు. ఆ తరువాత గాయాన్ని లెక్కచేయకుండా దూకుడుగా ఆడిన మ్యాక్స్ వెల్ 20 బంతుల్లో 41 పరుగులు నమోదు చేశాడు. -
ఇంగ్లండ్ సిరీస్ ఆశలు సజీవం
నాలుగో వన్డేలో ఆసీస్‌పై గెలుపు లీడ్స్: ఇయాన్ మోర్గాన్ (92 బంతుల్లో 92England team; 8 ఫోర్లు; 2 సిక్సర్లు) అద్భుత బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ జట్టు సిరీస్ ఆశలను నిలుపుకుంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 3 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో సిరీస్ 2-2తో సమమైంది. చివరి వన్డే రేపు (ఆదివారం) మాంచెస్టర్‌లో జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 299 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ (64 బంతుల్లో 85; 10 ఫోర్లు; 2 సిక్సర్లు), బెయిలీ (110 బంతుల్లో 75; 6 ఫోర్లు; 1 సిక్స్), మాథ్యూ వేడ్ (26 బంతుల్లో 50; 3 ఫోర్లు; 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలు చేశారు. విల్లీకి మూడు, ప్లం కెట్, అలీలకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 48.2 ఓవర్లలో ఏడు వికెట్లకు 304 పరుగులు చేసి గెలిచింది. టేలర్ (42 బంతుల్లో 41; 8 ఫోర్లు), స్టోక్స్ (54 బంతుల్లో 41; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. కమ్మిన్స్‌కు నాలుగు వికెట్లు దక్కాయి. -
మూడో వన్డేలో ఇంగ్లండ్ విజయం
మాంచెస్టర్ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ఇంగ్లండ్ కోలుకుంది. మంగళవారం రాత్రి ఇక్కడ జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ 93 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను చిత్తు చేసింది. ఫలితంగా ఐదు వన్డేల సిరీస్‌లో కంగారూల ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా 50 ఓవర్లలో 8 వికెట్లకు 300 పరుగులు చేసింది. జేమ్స్ టేలర్ (114 బంతుల్లో 101; 5 ఫోర్లు) వన్డేల్లో తొలి సెంచరీ సాధించగా, రాయ్ (45 బంతుల్లో 63; 9 ఫోర్లు), మోర్గాన్ (56 బంతుల్లో 62; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలతో రాణించారు. కమిన్స్, మ్యాక్స్‌వెల్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ఆస్ట్రేలియా 44 ఓవర్లలో 207 పరుగులకే కుప్పకూలింది. ఫించ్ (60 బంతుల్లో 53; 8 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా, వేడ్ (41 బంతుల్లో 42; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. స్పిన్నర్లు మొయిన్ అలీ (3/32), ఆదిల్ రషీద్ (2/41) కీలక వికెట్లు తీశారు. నాలుగో వన్డే శుక్రవారం లీడ్స్‌లో జరుగుతుంది. -
నిరాశపరిచిన మ్యాక్స్ వెల్: బెయిలీ
బెంగళూరు: విధ్వంసకర ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ పై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ కెప్టెన్ జార్జి బెయిలీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ సీజన్ అతడు నిరాశపరిచాడని పేర్కొన్నాడు. ఇప్పటివరకు 5 మ్యాచ్ లు ఆడిన మ్యాక్స్ వెల్ కేవలం 62 పరుగులే చేశాడు. వన్డే వరల్డ్ కప్ లో రాణించిన అతడు ఐపీఎల్ లో చతికిలపడడాన్ని బెయిలీ జీర్ణించుకోలేకపోతున్నాడు. మ్యాక్స్ వెల్ ఆటతీరు అతడికే అసంతృప్తి కలింగించేలా ఉందని వెల్లడించాడు. తనదైన శైలిలో అతడు ఆడలేకపోతున్నాడని తెలిపాడు. ఆస్ట్రేలియాలో వరల్డ్ కప్ ఆడి వచ్చిన మ్యాక్స్ వెల్ భారత్ లో పరిస్థితులకు అలవాటు పడడానికి సమయం పడుతుందని అన్నాడు. పంజాబ్ కు ప్లేఆప్ అవకాశాలు సజీవంగా ఉన్నాయని తెలిపాడు. తాము పుంజుకుంటామన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ఇప్పటివరకు 9 మ్యాచ్ లు ఆడిన పంజాబ్ ఏడింట్లో ఓడింది. కేవలం 2 విజయాలు మాత్రమే దక్కించుకుంది. -
వీరూతో ఆడటం అదృష్టం
సెహ్వాగ్‌లాంటి దిగ్గజ క్రికెటర్‌తో కలిసి ఆడే అవకాశం రావడం తన అదృష్టమని పంజాబ్ కింగ్స్ ఎలెవన్ స్టార్ మ్యాక్స్‌వెల్ అన్నాడు. ఐపీఎల్ పుణ్యమాని గతంలో సచిన్తోనూ ఆడానని ఈ ఆస్ట్రేలియన్ సంబరపడ్డాడు. -
అజేయ ఆసీస్
బెయిలీ జట్టుకే ముక్కోణపు టోర్నీ టైటిల్ * ఫైనల్లో ఇంగ్లండ్‌పై ఘనవిజయం * మ్యాక్స్‌వెల్ ఆల్‌రౌండ్ షో * రాణించిన మార్ష్, ఫాల్క్‌నర్ పెర్త్: ప్రపంచకప్‌కు సన్నాహకంగా భావించిన ముక్కోణపు టోర్నమెంట్‌ను ఆస్ట్రేలియా ఘనంగా ముగించింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (98 బంతుల్లో 95; 15 ఫోర్లు; 4/46) ఆల్‌రౌండ్ షోకు తోడు... మిచెల్ మార్ష్ (68 బంతుల్లో 60; 7 ఫోర్లు, 1 సిక్స్), ఫాల్క్‌నర్ (24 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) సమయోచితంగా స్పందించడంతో ముక్కోణపు సిరీస్‌లో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. ఈ టోర్నీ లో ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన బెయిలీ బృందం అజేయంగా నిలువడంతోపాటు టైటిల్‌ను దక్కించుకుంది. ‘వాకా’ మైదానంలో ఆదివారం జరిగిన ఫైన ల్లో ఆస్ట్రేలియా 112 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 8 వికెట్లకు 278 పరుగులు చేసింది. స్మిత్ (50 బంతుల్లో 40; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించినా... ఫించ్ (0), వార్నర్ (12), బెయిలీ (2) నిరాశపర్చారు. దీంతో ఆసీస్ 60 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన మ్యాక్స్‌వెల్, మార్ష్‌లు ఆచితూచి ఆడుతూనే భారీ స్కోరుకు బాటలు వేశారు. 25వ ఓవర్లో జట్టు స్కోరును 100 పరుగులను దాటించిన ఈ జోడి క్రమంగా బ్యాట్ ఝుళిపించింది. బ్యాటింగ్ పవర్‌ప్లేలో వీరిద్దరు 46 పరుగులు రాబట్టడంతో 41వ ఓవర్లో ఆసీస్ స్కోరు 200లకు చేరుకుంది. కానీ దూకుడుగా ఆడిన మ్యాక్స్‌వెల్ త్రుటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు 141 పరుగులు జతచేశారు. ఓ ఎండ్‌లో సహచరులు వెనుదిరుగుతున్నా... రెండో ఎండ్‌లో ఫాల్క్‌నర్ వీరవిహారం చేశాడు. ఇంగ్లిష్ బౌలర్లను హడలెత్తిస్తూ చివరి 8 ఓవర్లలో 78 పరుగులు జత చేశాడు. 24 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్న ఫాల్క్‌నర్ ఇన్నింగ్స్ ఆఖరి బంతిని అద్భుతమైన సిక్సర్‌గా మలిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రాడ్ 3, అండర్సన్ 2 వికెట్లు తీశారు. తర్వాత ఇంగ్లండ్ 39.1 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. రవి బొపారా (59 బంతుల్లో 33; 1 ఫోర్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మొయిన్ అలీ (26), రూట్ (25), బ్రాడ్ (24) ఓ మోస్తరుగా ఆడారు. నాలుగో ఓవర్లో బెల్ (8) అవుటైన తర్వాత జాన్సన్ 10 బంతుల వ్యవధిలో మూడు కీలక వికెట్లు తీశాడు. టేలర్‌తో పాటు వరుస బంతుల్లో అలీ, మోర్గాన్ (0)లను పెవిలియన్‌కు పంపాడు. తర్వాత బొపారా నిలకడగా ఆడినా... 25వ ఓవర్లో మ్యాక్స్‌వెల్ వరుస బంతుల్లో బట్లర్ (17), వోక్స్ (0)లను అవుట్ చేశాడు. బ్రాడ్‌తో ఎని మిదో వికెట్‌కు 32; ఫిన్ (6)తో తొమ్మిదో వికెట్‌కు 30 పరుగులు జోడించి బొపారా అవుటయ్యాడు. తర్వాతి ఓవర్లోనే ఫిన్ కూడా వెనుదిరగడంతో ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. మ్యాక్స్‌వెల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’; స్టార్క్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. సంక్షిప్త స్కోర్లు: ఆస్ట్రేలియా: 278/8 (50 ఓవర్లలో) (మ్యాక్స్‌వెల్ 95, మార్ష్ 60, ఫాల్క్‌నర్ 50 నాటౌట్; బ్రాడ్ 3/55); ఇంగ్లండ్: 166 ఆలౌట్ (39.1 ఓవర్లలో) (బొపారా 33, జాన్సన్ 3/27). -
ఆసీస్‌దే టి20 సిరీస్
ఆఖరి మ్యాచ్‌లో ఓడిన దక్షిణాఫ్రికా సిడ్నీ: ఆల్‌రౌండ్ నైపుణ్యంతో ఆకట్టుకున్న ఆస్ట్రేలియా... దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టి20లో 2 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను కంగారూ జట్టు 2-1తో కైవసం చేసుకుంది. స్టేడియం ఆస్ట్రేలియాలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఫించ్‌సేన టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా.... బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లకు 145 పరుగులు చేసింది. డి కాక్ (27 బంతుల్లో 48; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), హెండ్రిక్స్ (48 బంతుల్లో 49; 5 ఫోర్లు); మిల్లర్ (26 బంతుల్లో 34 నాటౌట్; 3 ఫోర్లు) రాణించారు. ఫాల్క్‌నర్‌కు 3 వికెట్లు దక్కాయి. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 19.5 ఓవర్లలో 8 వికెట్లకు 146 పరుగులు చేసి నెగ్గింది. వైట్ (31 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. ఫించ్ (25 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), మాక్స్వెల్ (15 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. డేవిడ్ వైస్, పీటర్సన్ చెరో మూడు వికెట్లు తీశారు. వైట్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’; ఫాల్క్‌నర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. -
మాక్స్ వెల్ మెరుపులు, పంజాబ్ విజయం!
ఛాంపియన్స్ లీగ్ ట్రోఫి లోభాగంగా మొహాలీలో జరిగిన మ్యాచ్ లో హోబర్ట్ హరికేన్ జట్టుపై కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. హోబర్ట్ నిర్ధేశించిన 145 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు 5 వికెట్లు కోల్పోయి ఇంకా 14 బంతులుండగానే గెలిచింది. 145 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కింగ్స్ ఎలెవన్ జట్టు మ్యాచ్ తొలి బంతికే సెహ్వాగ్ వికెట్ ను కోల్పోయింది. అయితే పంజాబ్ విజయంలో మాక్స్ వెల్, బెయిలీ, ఫెరీరాలు కీలక పాత్ర వహించారు. మాక్స్ వెల్ 25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్ల సహాయంతో 43 పరుగులు, బెయిలీ 27 బంతుల్లో 5 ఫోర్లతో 34, ఫెరీరా 20 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్ సహాయంతో 35 పరుగులు చేశారు. హోబర్ట్ జట్టులో బొలింగర్ 2, హిల్ ఫెన్ హస్, లాలీన్, గుల్బీస్ చెరో వికెట్ పడగొట్టారు. పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ దిగిన హోబర్ట్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. హోబార్ట్ హరికేన్ జట్టులో డంక్ 26, బ్లిజార్డ్ 27, బిర్ట్ 28, వెల్స్ 28 పరుగులు చేశారు. పంజాబ్ జట్టులో అవానా, పటేల్ చెరో వికెట్ కరణ్ వీర్ సింగ్ చెరో వికెట్, పెరీరాకు రెండు వికెట్లు లభించాయి. -
ఆసీస్ చేతిలో జింబాబ్వే చిత్తు
చెలరేగిన మ్యాక్స్‌వెల్, మార్ష్ హరారే: ముక్కోణపు వన్డే సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు శుభారంభం చేసింది. ఇక్కడి హరారే స్పోర్ట్స్ క్లబ్లో సోమవారం ఏకపక్షంగా జరిగిన టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆసీస్ 198 పరుగుల తేడాతో జింబాబ్వేను చిత్తు చేసింది. గ్లెన్ మ్యాక్స్‌వెల్ (46 బంతుల్లో 93; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), మిషెల్ మార్ష్ (83 బంతుల్లో 89; 7 ఫోర్లు, 4 సిక్సర్లు)ల విధ్వంసకర బ్యాటింగ్‌తో ముందుగా ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 350 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆరోన్ ఫించ్ (79 బంతుల్లో 67; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీ చేయగా, బ్రాడ్ హాడిన్ (58 బంతుల్లో 46; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. మ్యాక్స్‌వెల్, మార్ష్ నాలుగో వికెట్‌కు 9 ఓవర్లలోనే 109 పరుగులు జోడించడం విశేషం. అనంతరం జింబాబ్వే 39.3 ఓవర్లలో 152 పరుగులకే కుప్పకూలింది. హామిల్టన్ మసకద్జా (91 బంతుల్లో 70; 6 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. ఆసీస్ బౌలర్లలో స్మిత్ 3 వికెట్లు పడగొట్టగా... స్టార్క్, లియోన్ చెరో 2 వికెట్లు తీశారు. మెరుపు ఇన్నింగ్స్‌తో పాటు ఒక వికెట్ కూడా తీసిన మార్ష్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. టోర్నీ తదుపరి మ్యాచ్‌లో బుధవారం ఇదే మైదానంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా తలపడతాయి. -
ఆకాశమే హద్దుగా...
మళ్లీ చెలరేగిన మ్యాక్స్‌వెల్ బెయిలీ మెరుపు ఇన్నింగ్స్ చెన్నైపై పంజాబ్ ఘన విజయం డు ప్లెసిస్ శ్రమ వృథా మ్యాక్స్‌వెల్ 38 బంతుల్లో 90 6 ఫోర్లు, 8 సిక్స్‌లు మ్యాక్స్‌వెల్ సునామీకి... బెయిలీ తుపాన్‌కు మధ్య మిల్లర్ మెరుపులు మెరిపించడంతో బారాబతి స్టేడియం పరుగుల వర్షంతో తడిసి ముద్దయింది. ఈ ముగ్గుర్ని అడ్డుకోలేక చెన్నై బౌలర్లు చేష్టలుడిగిపోతే... భారీ లక్ష్యం ముందు బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఫలితంగా ఐపీఎల్లో పంజాబ్ ఆరో విజయాన్ని నమోదు చేసింది. కటక్: ఐపీఎల్లో చెన్నై సూపర్‌కింగ్స్‌ను చూస్తే మిగతా జట్లకు ముచ్చెమటలు పడతాయి. పటిష్టమైన బ్యాటింగ్, బౌలింగ్‌తో పాటు ఆల్‌రౌండర్లకూ జట్టులో కొదువలేదు. అలాంటి ధోనిగ్యాంగ్కు పంజాబ్ బ్యాట్స్‌మన్ మ్యాక్స్‌వెల్ (38 బంతుల్లో 90; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) వెన్నులో వణుకు పుట్టించాడు. తనకే సాధ్యమైన ఆటతీరుతో ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగుల సునామీ సృష్టించాడు. ఫలితంగా బారాబతి స్టేడియంలో బుధవారం జరిగిన ఐపీఎల్-7 లీగ్ మ్యాచ్‌లో పంజాబ్ 44 పరుగుల తేడాతో చెన్నైపై ఘన విజయం సాధించింది. ధోనిసేన టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 231 పరుగులు చేసింది. ఐపీఎల్లో ఇది నాలుగో అత్యధిక స్కోరు. మ్యాక్స్‌వెల్‌తో పాటు బెయిలీ (13 బంతుల్లో 40 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మిల్లర్ (32 బంతుల్లో 47; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), సెహ్వాగ్ (23 బంతుల్లో 30; 5 ఫోర్లు, 1 సిక్సర్) రాణించారు. మోహిత్ 2, హిల్ఫెన్హాస్, స్మిత్ తలా ఓ వికెట్ పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. డు ప్లెసిస్ (25 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్సర్), బి. మెకల్లమ్ (29 బంతుల్లో 33; 3 ఫోర్లు), రైనా (27 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్సర్), ధోని (20 బంతుల్లో 23; 1 సిక్సర్) పోరాడారు. జాన్సన్‌కు 2 వికెట్లు దక్కాయి. మ్యాక్స్‌వెల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. పరుగుల వరద పంజాబ్ ఇన్నింగ్స్‌లో తొలి బంతినే బౌండరీకి తరలించిన సెహ్వాగ్ తన మునుపటి ఆటతీరును ప్రదర్శించాడు. నాలుగు ఫోర్లు, ఓ సిక్స్‌తో రెచ్చిపోయాడు. కానీ ఆరు బంతుల వ్యవధిలో మన్దీప్ (3), వీరూ అవుటయ్యారు. దీంతో పవర్‌ప్లేలో పంజాబ్ రెండు వికెట్లకు 38 పరుగులు మాత్రమే చేయగలిగింది. మొదట మ్యాక్స్‌వెల్, మిల్లర్ క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రాధాన్యమిచ్చారు. దీంతో ఏడు నుంచి 10వ ఓవర్ వరకు కేవలం 31 పరుగులు మాత్రమే వచ్చాయి. అప్పటికి మ్యాక్స్‌వెల్ స్కోరు 11 బంతుల్లో 12 పరుగులు మాత్రమే. 11వ ఓవర్ నుంచి మ్యాక్స్‌వెల్ విశ్వరూపం మొదలైంది. అశ్విన్ వేసిన రెండు ఓవర్లలో నాలుగు సిక్స్‌లు, రెండు ఫోర్లు బాదాడు. తర్వాత జడేజా రెండు ఓవర్లలో ఒక ఫోర్ మాత్రమే కొట్టినా... మిల్లర్ రెండు సిక్స్‌లు, ఓ ఫోర్‌తో చెలరేగాడు. పాండే ఓవర్లో ఓ సిక్స్, రెండు ఫోర్లు కొట్టిన మ్యాక్స్‌వెల్... స్మిత్ బౌలింగ్‌లో వరుసగా మరో మూడు సిక్సర్లు సంధించాడు. దీంతో ఓవరాల్‌గా 36 బంతుల్లో 104 పరుగులు వచ్చాయి. మిల్లర్ అవుటైన కొద్దిసేపటికి మ్యాక్స్‌వెల్ మరో ఫోర్ కొట్టి వెనుదిరిగాడు. ఈ ఆసీస్ బ్యాట్స్‌మన్ చివరి 26 బంతుల్లో 78 పరుగులు చేయడం విశేషం. ఈ ద్వయం 64 బంతుల్లో 135 పరుగులు జోడించింది. ఆఖర్లో బెయిలీ మెరుపు షాట్లతో సూపర్ ఫినిషింగ్ ఇచ్చాడు. వరుస బౌండరీలతో పాటు ఇన్నింగ్స్ చివరి రెండు బంతులను భారీ సిక్సర్లుగా మల్చాడు. బెయిలీ, జాన్సన్ ఐదో వికెట్‌కు 16 బంతుల్లో అజేయంగా 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆరంభంలోనే తడబాటు... చెన్నై ఇన్నింగ్స్‌లో స్మిత్ తొలి ఓవర్లోనే అవుట్‌కావడంతో మెకల్లమ్ నెమ్మదించాడు. కానీ రైనా మాత్రం వరుస బౌండరీలతో ధాటిగా ఆడేందుకు ప్రయత్నించాడు. ఓ భారీ సిక్సర్‌తో ఊపు తెచ్చినా ఎక్కువసేపు నిలువలేకపోయాడు. మెకల్లమ్, రైనా రెండో వికెట్‌కు 51 పరుగులు జోడించారు. తర్వాత మెకల్లమ్, జడేజా ఇన్నింగ్స్‌ను కుదుటపర్చే ప్రయత్నం చేసినా వీరిద్దరు అవుట్ కావడంతో చెన్నై మళ్లీ తడబడింది. అప్పటికి జట్టు స్కోరు 98/4. డు ప్లెసిస్, ధోని భారీ షాట్లకు పోకుండా ఇన్నింగ్స్‌ను నడిపించారు. ఫలితంగా చేయాల్సిన రన్‌రేట్ పెరిగిపోయింది. దీంతో ఓటమి తప్పలేదు. స్కోరు వివరాలు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఇన్నింగ్స్: సెహ్వాగ్ (బి) హిల్ఫెన్హాస్ 30; మన్దీప్ (సి) పాండే (బి) మోహిత్ 3; మ్యాక్స్‌వెల్ (సి) జడేజా (బి) మోహిత్ 90; మిల్లర్ (బి) స్మిత్ 47; బెయిలీ నాటౌట్ 40; జాన్సన్ నాటౌట్ 11; ఎక్స్‌ట్రాలు: 10; మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 231. వికెట్ల పతనం: 1-33; 2-38; 3-173; 4-182 బౌలింగ్: హిల్ఫెన్హాస్ 4-0-36-1; ఈశ్వర్ పాండే 4-0-41-0; మోహిత్ శర్మ 4-0-38-2; స్మిత్ 3-0-36-1; జడేజా 3-0-37-0; అశ్విన్ 2-0-38-0 చెన్నై సూపర్‌కింగ్స్ ఇన్నింగ్స్: స్మిత్ (సి) జాన్సన్ (బి) సందీప్ 4; బి. మెకల్లమ్ రనౌట్ 33; రైనా (సి) మిల్లర్ (బి) మ్యాక్స్‌వెల్ 35; జడేజా (బి) ధావన్ 17; డు ప్లెసిస్ (సి) కార్తీక్ (బి) జాన్సన్ 52; ధోని (సి) బెయిలీ (బి) జాన్సన్ 23; మన్హాస్ నాటౌట్ 8; అశ్విన్ నాటౌట్ 11; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 187. వికెట్ల పతనం: 1-5; 2-56; 3-88; 4-98; 5-159; 6-167 బౌలింగ్: సందీప్ 4-0-37-1; జాన్సన్ 4-0-37-2; కార్తీక్ 4-0-40-0; అక్షర్ పటేల్ 4-0-28-0; మ్యాక్స్‌వెల్ 2-0-21-1; రిషి ధావన్ 2-0-23-1. మ్యాక్స్‌వెల్ విధ్వంసం సాగిందిలా... 1-10 బంతులు: 11 పరుగులు 11-20 బంతులు: 34 పరుగులు 21-30 బంతులు: 33 పరుగులు 31-38 బంతులు: 12 పరుగులు -
షార్జాలో లైట్ల బాధ!
షార్జా: సన్‌రైజర్స్, పంజాబ్ మధ్య మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఫీల్డర్ల తడబాటును గమనించే ఉంటారు. 11 పరుగుల వద్ద మ్యాక్స్‌వెల్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ను వార్నర్ వదిలేశాడు. అదే ఓవర్లో పుజారా కొట్టిన బంతిని అందుకునేందుకు వచ్చిన స్యామీ అకస్మాత్తుగా వెనక్కు తిరిగాడు. నిజానికి ఈ ఇద్దరూ మంచి ఫీల్డర్లు మరి ఎందుకు ఇలా? ఈ ప్రశ్నకు సమాధానం సన్‌రైజర్స్ కోచ్ టామ్ మూడీ చెప్పారు. ‘షార్జా స్టేడియం పక్కనే ఉన్న ఫుట్‌బాల్ స్టేడియంలో లైట్లు ఇక్కడ ఫీల్డర్ల మీద పడుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బంతిని చూడటం ఇబ్బంది అవుతోంది. స్యామీ బంతిని వదిలేసి వెనక్కి తిరగడానికి కారణం కూడా అదే’ అని చెప్పారు. కానీ దీనికి చెన్నై జట్టు చాలా సింపుల్‌గా పరిష్కారం కనుక్కుంది. అదేంటంటే... మ్యాచ్ ముందు రోజు రాత్రి అదే మైదానానికి వెళ్లి ఫీల్డింగ్ ప్రాక్టీస్ చేయడం. మిగిలిన జట్లు ఇది తెలుసుకునే సరికే ఆలస్యం అయిపోయింది. ఇక ఈ స్టేడియంలో మూడు మ్యాచ్‌లు మాత్రమే మిగిలున్నాయి. -
చెలరేగిన చెన్నై
ఢిల్లీపై 93 పరుగుల ఘనవిజయం 84 పరుగులకే కుప్పకూలిన డేర్‌డెవిల్స్ తమ తొలి మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ దాడికి చిన్నబోయిన చెన్నై.. ఢిల్లీపై జూలు విదిల్చింది. బ్యాట్స్‌మెన్, బౌలర్లు, ఫీల్డర్లు... అందరూ తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించారు. దీంతో ధోనిసేన లీగ్‌లో తొలి విజయాన్ని నమోదు చేసింది. అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-7లో మాజీ చాంపియన్ చెన్నై సూసర్ కింగ్స్ ఖాతా తెరిచింది. పంజాబ్ జట్టు చేతిలో ఊహించని పరాజయాన్ని ఎదుర్కొన్న ఈ జట్టు... సమష్టి ఆటతీరుతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను చిత్తు చేసింది. సోమవారం షేక్ జయేద్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో 93 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 177 పరుగులు సాధించింది. సురేశ్ రైనా (41 బంతుల్లో 56; 5 ఫోర్లు; 1 సిక్స్) సమయోచిత ఆటతీరుతో అర్ధ సెంచరీ చేశాడు. చివర్లో కెప్టెన్ ఎంఎస్ ధోని (15 బంతుల్లో 32; 2 ఫోర్లు; 2 సిక్స్‌లు) వేగంగా ఆడి జట్టు భారీ స్కోరు సాధించేలా చూశాడు. ఓపెనర్ డ్వేన్ స్మిత్ (28 బంతుల్లో 29; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. ఉనాద్కట్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ 15.4 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 84 పరుగులు మాత్రమే చేసింది. కార్తీక్ (22 బంతుల్లో 21; 2 ఫోర్లు), నీషమ్ (15 బంతుల్లో 22; 2 ఫోర్లు) ఓ మోస్తరుగా రాణించారు. ఈశ్వర్ పాండే, జడేజా, అశ్విన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రైనాకి దక్కింది. నిదానంగా ఆరంభించినా... టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న చెన్నై జట్టు తమ ఇన్నింగ్స్‌ను నిదానంగా ఆరంభించింది. మెకల్లమ్ (9) అవుట్‌కావడంతో... పవర్‌ప్లే ఆరు ఓవర్లలో జట్టు 34 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత కూడా పరిస్థితి పెద్దగా మారలేదు. అడపాదడపా బౌండరీలు వెళ్లినా ఎక్కువగా సింగిల్స్‌పైనే దృష్టి పెట్టారు. రెండో వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యం తర్వాత... 11వ ఓవర్లో డ్వేన్ స్మిత్ (28 బంతుల్లో 29; 3 ఫోర్లు)ను నదీమ్ బౌల్డ్ చేశాడు.ఆ తర్వాతి ఓవర్లో రైనా మూడు ఫోర్లు బాది టచ్‌లోకొచ్చాడు. 36 బంతుల్లో అర్ధ సెంచరీ సాధించాడు. కొద్దిసేపటికే భారీ షాట్‌కు యత్నించి బౌండరీ దగ్గర విజయ్‌కు చిక్కాడు. దోని రాకతో ఇన్నింగ్స్‌లో వేగం పెరిగింది. ఉనాద్కట్ బౌలింగ్‌లో వరుసగా 6, 4 బాదాడు. అటు డు ప్లెసిస్ (17 బంతుల్లో 24; 1 ఫోర్; 1 సిక్స్) కూడా ఉన్నంత సేపు బ్యాట్‌ను ఝుళిపించాడు. వీరిద్దరు వరుస ఓవర్లలో వెనుదిరిగారు. చివర్లో మిథున్ మిన్హాస్ (5 బంతుల్లో 13 నాటౌట్; 2 ఫోర్లు) వేగంగా ఆడాడు. టపటపా వికెట్లు భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఏమాత్రం పోరాడకుండా చేతులెత్తేసింది. ప్రారంభంలోనే చెన్నై ఫీల్డర్లు అద్భుత క్యాచ్‌లతో అదరగొట్టారు. మయాంక్ అగర్వాల్ (2) క్యాచ్‌ను... రైనా పరిగెత్తుతూ ఎడమ వైపు డైవ్ చేస్తూ అందుకున్నాడు. ఆ తర్వాత డుప్లెసిస్.. .విజయ్, తివారీ క్యాచ్‌లను కళ్లు చెదిరే రీతిలో అందుకున్నాడు. దీంతో ఢిల్లీ 17 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ దినేశ్ కార్తీక్, డుమిని కొద్దిసేపు పోరాడారు. వీరిద్దరి మధ్య నాలుగో వికెట్‌కు 25 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత ఏ దశలోనూ ఢిల్లీ ఆటగాళ్లు క్రీజులో ఉండాలనే ఆసక్తి కనబర్చలేదు. 10 పరుగుల వ్యవధిలో ఢిల్లీ చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. గాయం కారణంగా కౌల్టర్ నైల్ బ్యాటింగ్‌కు రాలేదు. స్కోరు వివరాలు: చెన్నై సూపర్ కింగ్స్ ఇన్నింగ్స్: డ్వేన్ స్మిత్ (బి) నదీమ్ 29; మెకల్లమ్ (సి) సబ్ పార్నెల్ (బి) ఉనాద్కట్ 9; రైనా (సి) విజయ్ (బి) నీషమ్ 56; డు ప్లెసిస్ (సి) విజయ్ (బి) షమీ 24; ధోని (సి) అగర్వాల్ (బి) ఉనాద్కట్ 32; జడేజా (సి) కార్తీక్ (బి) ఉనాద్కట్ 7; మన్హాస్ నాటౌట్ 13; అశ్విన్ (రనౌట్) 1; హిల్ఫెన్హాస్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు (లెగ్ బైస్ 3, వైడ్లు 3) 6; మొత్తం (20 ఓవర్లలో ఏడు వికెట్లకు) 177. వికెట్ల పతనం: 1-23; 2-77; 3-108; 4-141; 5-156; 6-162; 7-173. బౌలింగ్: డుమిని 4-0-26-0; షమీ 4-0-45-1; నదీమ్ 3-0-29-1; ఉనాద్కట్ 4-0-32-3; నీశమ్ 4-0-29-1; విజయ్ 1-0-13-0. ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: అగర్వాల్ (సి) రైనా (బి) పాండే 2; విజయ్ (సి) డు ప్లెసిస్ (బి) మోహిత్ శర్మ 11; దినేశ్ కార్తీక్ (బి) అశ్విన్ 21; తివారి (సి) డు ప్లెసిస్ (బి) పాండే 0; డుమిని ఎల్బీడబ్ల్యు (బి) స్మిత్ 15; టేలర్ (సి) ధోని (బి) హిల్ఫెన్హాస్ 6; నీషమ్ (సి) రైనా (బి) జడేజా 22; నదీమ్ (సి)రైనా (బి) జడేజా 3; షమీ (సి) మెకల్లమ్ (బి) అశ్విన్ 1; ఉనాద్కట్ నాటౌట్ 1; కౌల్టర్ నైల్ (ఆబ్సెంట్ హర్ట్); ఎక్స్‌ట్రాలు (వైడ్లు 2) 2; మొత్తం (15.4 ఓవర్లలో ఆలౌట్) 84. వికెట్ల పతనం: 1-8; 2-15; 3-17; 4-42; 5-50; 6-74; 7-80; 8-82; 9-84. బౌలింగ్: పాండే 4-0-23-2; హిల్ఫెన్హాస్ 2-0-9-1; మోహిత్ శర్మ 3-0-17-1; స్మిత్ 2-0-14-1; జడేజా 2.4-0-18-2; అశ్విన్ 2-0-3-2. -
మళ్లీ ఓడిన భారత్ ‘ఎ’
ప్రిటోరియా: ఆస్ట్రేలియా ‘ఎ’ బ్యాట్స్‌మన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (56 బంతుల్లో 93; 12 ఫోర్లు; 3 సిక్స్) మరోసారి విధ్వంసకర ఆటతీరును ప్రదర్శించాడు. ఓపెనర్ షాన్ మార్ష్ (107 బంతుల్లో 96; 9 ఫోర్లు; 3 సిక్స్) కూడా సహకారం అందించడంతో ఆదివారం భారత్ ‘ఎ’తో జరిగిన వన్డేలో ఆసీస్ ‘ఎ’ జట్టు 25 పరుగుల తేడాతో నెగ్గింది. ఈనెల 14న జరిగే ఫైనల్‌కు అర్హత సాధించింది. దక్షిణాఫ్రికా కూడా పాల్గొంటున్న ఈ ముక్కోణపు సిరీస్‌లో ఆసీస్‌పై భారత్‌కు ఇది వరుసగా రెండో పరాజయం. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 310 పరుగుల భారీ స్కోరు సాధించింది. 30 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసిన మ్యాక్ ్సవెల్ ఏ బౌలర్‌ను వదిలిపెట్టలేదు. చివర్లో కౌల్టర్ నైల్ (20 బంతుల్లో 37 నాటౌట్; 5 ఫోర్లు; 1 సిక్స్) చెలరేగడంతో జట్టు భారీ స్కోరు సాధించింది. స్టువర్ట్ బిన్నీకి నాలుగు వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 48.3 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (57 బంతుల్లో 61; 7 ఫోర్లు; 2 సిక్స్), మురళీ విజయ్ (77 బంతుల్లో 60; 7 ఫోర్లు; 1 సిక్స్), పుజారా (64 బంతుల్లో 51; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. మిడిలార్డర్లో అంబటి తిరుపతి రాయుడు (24 బంతుల్లో 32; 4 ఫోర్లు; 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. ఆఖర్లో రసూల్ (23 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు) పోరాడినా చివరి వరుస నుంచి సహకారం కరువయ్యింది. హాజెల్‌వుడ్, హెన్రిక్స్‌కు చెరి మూడు వికెట్లు దక్కాయి. ప్రస్తుతం భారత్, దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్లు నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాయి. సోమవారం ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో నెగ్గిన జట్టు ఫైనల్‌కు అర్హత పొందుతుంది.