ఇంగ్లండ్ సిరీస్ ఆశలు సజీవం | England's hopes of a series of inanimate | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్ సిరీస్ ఆశలు సజీవం

Published Sat, Sep 12 2015 1:53 AM | Last Updated on Sun, Sep 3 2017 9:12 AM

ఇంగ్లండ్ సిరీస్ ఆశలు సజీవం

ఇంగ్లండ్ సిరీస్ ఆశలు సజీవం

నాలుగో వన్డేలో ఆసీస్‌పై గెలుపు
 
 లీడ్స్: ఇయాన్ మోర్గాన్ (92 బంతుల్లో 92England team; 8 ఫోర్లు; 2 సిక్సర్లు) అద్భుత బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ జట్టు సిరీస్ ఆశలను నిలుపుకుంది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన నాలుగో మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు 3 వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో సిరీస్ 2-2తో సమమైంది. చివరి వన్డే రేపు (ఆదివారం) మాంచెస్టర్‌లో జరుగుతుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆసీస్ 50 ఓవర్లలో ఏడు వికెట్లకు 299 పరుగులు చేసింది. మ్యాక్స్‌వెల్ (64 బంతుల్లో 85; 10 ఫోర్లు; 2 సిక్సర్లు), బెయిలీ (110 బంతుల్లో 75; 6 ఫోర్లు; 1 సిక్స్), మాథ్యూ వేడ్ (26 బంతుల్లో 50; 3 ఫోర్లు; 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలు చేశారు.

విల్లీకి మూడు, ప్లం కెట్, అలీలకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 48.2 ఓవర్లలో ఏడు వికెట్లకు 304 పరుగులు చేసి గెలిచింది. టేలర్ (42 బంతుల్లో 41; 8 ఫోర్లు), స్టోక్స్ (54 బంతుల్లో 41; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. కమ్మిన్స్‌కు నాలుగు వికెట్లు దక్కాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement