england team
-
పాక్‌తో తొలి టెస్టు.. ఇంగ్లండ్ 823
ముల్తాన్: టెస్టు ఫార్మాట్లో వన్డే తరహా ఆటతీరుతో విజృంభించిన ఇంగ్లండ్ జట్టు పలు రికార్డులను బద్దలు కొట్టింది. పాకిస్తాన్ బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ... హ్యారీ బ్రూక్ (322 బంతుల్లో 317; 29 ఫోర్లు, 3 సిక్సర్లు) ట్రిపుల్ సెంచరీ, జో రూట్ (375 బంతుల్లో 262; 17 ఫోర్లు) డబుల్ సెంచరీతో చెలరేగారు. ఫలితంగా ముల్తాన్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 823/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. టెస్టు క్రికెట్ చరిత్రలో నాలుగో అత్యధిక స్కోరును తమ పేరిట లిఖించుకున్న ఇంగ్లండ్ జట్టు... పలు రికార్డులు ఖాతాలో వేసుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 492/3తో గురువారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ జట్టు... నాలుగో రోజు 49 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి 331 పరుగులు రాబట్టింది. ఈ క్రమంలో రూట్, బ్రూక్ నాలుగో వికెట్‌కు 454 పరుగులు జోడించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. అంతేకాకుండా ఇంగ్లండ్ తరఫున ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం నమోదు చేశారు. మొదట రూట్ డబుల్ సెంచరీ పూర్తి చేసుకోగా... కాసేపటికే బ్రూక్ ద్విశతకం ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత మరింత ధాటిగా ఆడిన బ్రూక్ వరుస బౌండరీలతో రెచ్చిపోయాడు. పాక్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఈ జోడీని విడదీయలేకపోగా... బ్రూక్ 310 బంతుల్లో టెస్టు కెరీర్లో తొలి ట్రిపుల్ సెంచరీ అందుకున్నాడు. గ్రాహం గూచ్ తర్వాత (1990లో; భారత్‌పై) ట్రిపుల్ సెంచరీ బాదిన ఇంగ్లండ్ క్రికెటర్‌గా బ్రూక్ నిలిచాడు. ఓవరాల్‌గా టెస్టు క్రికెట్లో ఇది 20వ అత్యధిక వ్యక్తిగత స్కోరు. పాకిస్తాన్ బౌలర్లలో ఆరుగురు 100 కంటే ఎక్కువ పరుగులు సమర్పించుకోవడం గమనార్హం. నసీమ్ షా, ఆయూబ్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం 267 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన పాకిస్తాన్ గురువారం ఆట ముగిసే సమయానికి 37 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. సల్మాన్ (49 బంతుల్లో 41 బ్యాటింగ్; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... షఫీఖ్ (0), షాన్ మసూద్ (11), బాబర్ ఆజమ్ (5), రిజ్వాన్ (10), ఆయూబ్ (25), షకీల్ (29) విఫలమయ్యారు. నేడు ఆటకు ఆఖరి రోజు. చేతిలో నాలుగు వికెట్లు ఉన్న పాకిస్తాన్... ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 115 పరుగులు వెనుకబడి ఉంది. సల్మాన్‌తో పాటు ఆమేర్ జమాల్ (27 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఇవీ రికార్డులు4 టెస్టు క్రికెట్ చరిత్రలో ఇది (823/7 డిక్లేర్డ్) నాలుగో అత్యధిక టీమ్ స్కోరు. గతంలో శ్రీలంక (1997లో భారత్‌పై 952/6 డిక్లేర్డ్), ఇంగ్లండ్ (1938లో ఆ్రస్టేలియాపై 903/7 డిక్లేర్డ్; 1930లో వెస్టిండీస్‌పై 849) ఎనిమిది వందల పైచిలుకు పరుగులు చేశాయి. 1 పాకిస్తాన్‌పై ఒక జట్టు చేసిన అత్యధిక పరుగులు ఇవే (823/7 డిక్లేర్డ్). 1958లో వెస్టిండీస్ చేసిన 790/3 డిక్లేర్డ్ రెండో స్థానంలో ఉంది. పాకిస్తాన్ గడ్డపై నమోదైన అత్యధిక స్కోరు కూడా ఇదే.454 టెస్టు క్రికెట్లో నాలుగో వికెట్‌కు నమోదైన అత్యధిక భాగస్వామ్యం. 449 పరుగులతో ఆడమ్ వోజెస్, షాన్ మార్‡్ష (ఆస్ట్రేలియా; 2015లో వెస్టిండీస్‌పై) పేరిట ఉన్న రికార్డును రూట్, బ్రూక్ బద్దలు కొట్టారు.2 టెస్టు క్రికెట్ చరిత్రలో బ్రూక్‌ది రెండో వేగ వంతమైన ట్రిపుల్ సెంచరీ. 2008లో దక్షిణాఫ్రికాపై వీరేంద్ర సెహా్వగ్ 278 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ బాదగా... ఇప్పుడు బ్రూక్ 310 బంతుల్లో ట్రిపుల్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. -
T20 WC 2024: ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. సీనియర్లపై వేటు
మహిళల టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ కోసం ఇంగ్లండ్ బోర్డు తమ జట్టును ప్రకటించింది. యూఏఈ వేదికగా జరిగిన ఈ ఐసీసీ ఈవెంట్ కోసం ఎంపిక చేసిన పదిహేను మంది సభ్యుల వివరాలను మంగళవారం వెల్లడించింది. వరల్డ్‌కప్‌లో పాల్గొనబోయే జట్టులో ముగ్గురు ప్లేయర్లకు తొలిసారిగా చోటిచ్చింది.సీనియర్లపై వేటుహీథర్ నైట్ కెప్టెన్సీలోని ఈ టీమ్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ బెస్ హీత్, ఆల్‌రౌండర్ ఫ్రేయా కెంప్, రైటార్మ్ పేసర్ డేనియెల్ గిబ్సన్లకు జట్టులో స్థానం కల్పించింది. గత ఎడిషన్‌లో ట్రావెలింగ్ రిజర్వు ప్లేయర్లుగా ఉన్న వీరు ఈసారి ప్రధాన జట్టులోకి రావడం విశేషం. అయితే, అనూహ్యంగా సీనియర్లు కేట్ క్రాస్, టామీ బీమౌంట్లపై వేటు పడింది. కాగా ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ మహిళా టీ20 జట్టు సూపర్ ఫామ్ కొనసాగిస్తోంది. గత నాలుగు ద్వైపాక్షిక సిరీస్‌లలోనూ అద్భుత విజయాలు సాధించింది.సూపర్ ఫామ్‌లో ఇంగ్లండ్ఆఖరిగా.. న్యూజిలాండ్‌తో రెండు, ఇండియా, పాకిస్తాన్‌తో ఒక్కో మ్యాచ్‌లో గెలుపు బావుటా ఎగురవేసింది. ఈ క్రమంలో వరల్డ్‌కప్ టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా ఇంగ్లండ్ ఈసారి బరిలోకి దిగనుంది. ఇక జట్టు ప్రకటన సందర్భంగా హెడ్‌కోచ్ జాన్ లూయీస్ మాట్లాడుతూ.. అనుభవజ్ఞులైన, యువ ఆటగాళ్లతో తమ జట్టు సమతూకంగా ఉందని పేర్కొన్నాడు.ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకే పెద్దపీట వేశామని.. ఈ క్రమంలో దురదృష్టవశాత్తూ కొందరిపై వేటు పడిందన్న లూయీస్.. యూఏఈ పరిస్థితులకు తగ్గట్లుగా రాణించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని తెలిపాడు. వరల్డ్‌కప్ అంటేనే ప్రత్యేకమైన ఈవెంట్ అని.. ఇందుకు తాము సన్నద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నాడు. కాగా గత ఎడిషన్‌లో ఇంగ్లండ్ మహిళా జట్టు గ్రూప్ స్టేజ్‌లో అజేయంగా నిలిచింది.ముందుగానే అబుదాబికి హీథర్ బృందంఅయితే, ఆతిథ్య సౌతాఫ్రికాతో సెమీ ఫైనల్లో ఆరు పరుగుల స్వల్ప తేడాతో ఓడి ఇంటిబాట పట్టింది. ఈసారి ఆ తప్పులను పునరావృతం చేయకుండా ముందడుగు వేయాలని పట్టుదలగా ఉంది. కాగా మహిళా టీ20 ప్రపంచకప్-2024 టోర్నీని బంగ్లాదేశ్‌లో నిర్వహించాల్సి ఉండగా.. అక్కడ అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో వేదికను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు మార్చారు.అక్టోబరు 3 నుంచి ఈ ఈవెంట్ ఆరంభం కానుండగా.. ఇంగ్లండ్ సెప్టెంబరు 13- 14 వరకు అబుదాబిలో వార్మప్ మ్యాచ్‌లు ఆడనుంది. షార్జా వేదికగా అక్టోబరు 5న బంగ్లాదేశ్‌తో మ్యాచ్ ద్వారా ప్రపంచకప్-2024 ప్రయాణం మొదలుపెట్టనుంది.టీ20 ప్రపంచకప్-2024 కోసం ఇంగ్లండ్ మహిళా జట్టుహీథర్ నైట్ (కెప్టెన్), లారెన్ బెల్, మాయా బౌచియర్, ఆలిస్ క్యాప్సే, చార్లీ డీన్, సోఫియా డంక్లే, సోఫీ ఎక్లెస్టోన్, డేనియల్ గిబ్సన్, సారా గ్లెన్, బెస్ హీత్, అమీ జోన్స్, ఫ్రేయా కెంప్, నాట్ స్కివర్-బ్రంట్, లిన్సే స్మిత్, డానీ వ్యాట్.చదవండి: యూఏఈలో అక్టోబర్ 3 నుంచి 20 వరకు టోర్నీ టీ20 వరల్డ్‌కప్ కోసం భారత జట్టు ప్రకటన -
టీ20 వరల్డ్‌కప్ కోసం ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. స్టార్ బౌలర్ రీఎంట్రీ
టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం ఢిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ జట్టును ఇవాళ (ఏప్రిల్ 30) ప్రకటించారు. 15 మంది సభ్యుల ఈ జట్టుకు జోస్ బట్లర్ నాయకత్వం వహించనున్నాడు. ఈ జట్టులో ఆసక్తికర ఎంపికలేమీ జరుగలేదు. మోచేతి గాయం కారణంగా ఏడాదికాలంగా ఆటకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ రీఎంట్రీ ఇచ్చాడు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ క్రిస్ జోర్డన్‌ను అనూహ్యంగా ఎంపిక చేశారు. జట్టులో స్పెషలిస్ట్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ లేకపోవడంతో ఆ కోటాలో బెన్ డకెట్‌కు అవకాశం దక్కింది. వెటరన్ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ రైట్ హ్యాండ్‌తో బౌలింగ్ చేసినా బ్యాటింగ్ లెఫ్ట్ హ్యాండ్‌తో చేస్తాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్ల కోటాలో ఆదిల్ రషీద్, టామ్ హార్ట్లీ ఎంపికయ్యారు. స్పెషలిస్ట్ బ్యాటర్లుగా బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, ఫిలిప్ సాల్ట్.. ఆల్‌రౌండర్ల కోటాలో విల్ జాక్స్, లివింగ్‌స్టోన్, సామ్ కర్రన్.. పేసర్ల విభాగంలో రీస్ టాప్లే, మార్క్ వుడ్ వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకున్నారు.టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం ఇంగ్లండ్ జట్టు: జోస్ బట్లర్ (సి), మోయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జోనాథన్ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, సామ్ కర్రాన్, బెన్ డకెట్, టామ్ హార్ట్లీ, విల్ జాక్స్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, రీస్ టోప్లీ, మార్క్ వుడ్ -
ఇంగ్లండ్‌కు ఘోర అవమానం.. 90 ఏళ్ల తర్వాత!?
రాజ్‌కోట్ వేదికగా టీమిండియాతో జరిగిన మూడో టెస్టులో ఇంగ్లండ్‌కు ఘోర పరాభావం ఎదురైంది. భారత్ చేతిలో ఏకంగా 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఓటమి పాలైంది. 557 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్.. భారత బౌలర్ల దాటికి 122 పరుగులకే కుప్పకూలింది. రవీంద్ర జడేజా 5 వికెట్లతో ఇంగ్లండ్‌ను దెబ్బతీశాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బౌలింగ్, బ్యాటింగ్ పరంగా దారుణంగా విఫలమైంది. కనీసం పోటీ ఇవ్వకుండానే ఇంగ్లీష్ జట్టు చేతులేత్తేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో లోయార్డర్ ఆటగాడు మార్క్ వుడ్(33) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఘోర ఓటమిని చవిచూసిన ఇంగ్లండ్ అత్యంత చెత్త రికార్డును నెలకొల్పింది. టెస్టులలో ఇంగ్లండ్ జట్టుకు పరుగుల పరంగా ఇది రెండో అతిపెద్ద ఓటమి. ఇంతకుముందు ఆ జట్టు 1934లో ఆస్ట్రేలియా చేతిలో 562 రన్స్ తేడాతో ఓడింది. అయితే 21వ శతాబ్దంలో మాత్రం ఇంగ్లండ్ ఇదే అతి పెద్ద ఓటమి. మరోవైపు భారత్ మాత్రం టెస్టు క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా అతి పెద్ద విజయం సాధించింది. ఈ మ్యాచ్ కంటే ముందు 2021లో న్యూజిలాండ్‌పై సాధించిన 372 పరుగుల విజయమే అత్యధికం. ఇక ఫిబ్రవరి 23 నుంచి రాంఛీ వేదికగా నాలుగో టెస్టు ఆరంభం కానుంది. చదవండి: అతడొక సంచలనం.. ఎంత చెప్పుకున్నా తక్కువే: రోహిత్ శర్మ -
India v England: ముగ్గురు కొత్తవారికి చోటు
లండన్: వచ్చే నెలలో భారత్‌లో ఐదు టెస్టుల సిరీస్ కోసం పర్యటించే ఇంగ్లండ్ జట్టును సోమవారం ప్రకటించారు. 16 మంది సభ్యులతో కూడిన ఇంగ్లండ్ టెస్ట్ జట్టులో ముగ్గురు కొత్త ప్లేయర్లు గుస్ అట్కిన్సన్, టామ్ హార్ట్లే, షోయబ్ బషీర్‌లకు తొలిసారి చోటు లభించింది. కౌంటీ క్రికెట్లో సర్రే క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించే 25 ఏళ్ల పేస్ బౌలర్ అట్కిన్సన్ ఇప్పటికే ఇంగ్లండ్ తరఫున తొమ్మిది వన్డేలు, రెండు టి20 మ్యాచ్‌లు ఆడాడు. ఇంగ్లండ్ బృందంలో నలుగురు స్పెషలి‹Ù్ట స్పిన్నర్లు రేహన్ అహ్మద్, జాక్ లీచ్, హార్ట్లే, షోయబ్ బషీర్ ఉండటం విశేషం. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జనవరి 25 నుంచి 29 వరకు హైదరాబాద్‌లో జరిగే తొలి మ్యాచ్‌తో మొదలవుతుంది. రెండో టెస్ట్ (ఫిబ్రవరి 2–6) విశాఖపట్నంలో, మూడో టెస్ట్ (ఫిబ్రవరి 15–19) రాజ్‌కోట్‌లో, నాలుగో టెస్ట్ (ఫిబ్రవరి 23–27) రాంచీలో, ఐదో టెస్ట్ (మార్చి 7–11) ధర్మశాలలో జరుగుతాయి. ఇంగ్లండ్ టెస్ట్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జో రూట్, బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలీ, ఒలీ పోప్, జేమ్స్ అండర్సన్, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, జాక్ లీచ్, ఒలీ రాబిన్సన్, మార్క్ వుడ్, రేహన్ అహ్మద్, షోయబ్ బషీర్, టామ్ హార్ట్లే, జాక్ లీచ్, అట్కిన్సన్. -
గెలిస్తేనే... సిరీస్‌లో నిలిచేది
ముంబై: మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ గెలవాలన్నా... రేసులో నిలవాలన్నా భారత మహిళల జట్టు ఈ రెండో మ్యాచ్ కచ్చితంగా గెలవాల్సిందే. లేదంటే ఇంకో మ్యాచ్ ఉండగానే సిరీస్‌ను ఇంగ్లండ్ సొంతం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో హర్మన్‌ప్రీత్ బృందం కీలకమైన మ్యాచ్‌లో సర్వశక్తులు ఒడ్డేందుకు సిద్ధమైంది. గతితప్పిన బౌలింగ్‌ను, నిలకడ లోపించిన టాపార్డర్‌ను మెరుగుపర్చుకొని ఇంగ్లండ్‌ను ఓడించాలనే లక్ష్యంతో భారత జట్టు బరిలోకి దిగుతోంది. తొలి టి20లో ఓపెనర్ షఫాలీ వర్మ తప్ప ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోరే చేయలేదు. హిట్టర్లు స్మృతి మంధాన, వన్‌డౌన్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ గత మ్యాచ్ వైఫల్యాన్ని అధిగమించి తాజాగా ఈ మ్యాచ్‌లో చెలరేగితే భారత బ్యాటింగ్ కష్టాలు తీరతాయి. ఎందుకంటే మిడిలార్డర్‌ను కెపె్టన్ హర్మన్‌ప్రీత్ ఆదుకోగలదు. జట్టు మేనేజ్మెంట్ బెంగ ఏదైనా ఉందంటే అది బౌలింగే! సీమర్ రేణుక సింగ్ మినహా మొత్తం బౌలింగ్ విభాగం చేతులెత్తేసింది. దీప్తి శర్మ, పూజ ఒక్క వికెట్ తీయకపోగా... పరుగుల్ని అతిగా సమర్పించుకున్నారు. వికెట్లు తీసిన శ్రేయాంక పాటిల్, సైకా ఇషాక్‌లు కూడా పరుగుల వేగాన్ని అడ్డుకోలేకపోయారు. మరోవైపు తొలిమ్యాచ్‌లో శుభారంభం చేసిన ఇంగ్లండ్ అమ్మాయిల బృందం వరుస విజయంతో ఏకంగా సిరీస్‌పైనే కన్నేసింది. బ్యాటర్లు, బౌలర్లు ఫామ్‌లో ఉండటంతో ఇంగ్లండ్ ఆత్మ విశ్వాసంతో ఉంది. ఇక వేదిక (వాంఖెడె) ఒక్కటే కావడంతో పిచ్ గత మ్యాచ్‌కు భిన్నంగా ఉండదు. బ్యాటింగ్‌కు కలిసొచ్చే వికెట్ కావడంతో బౌలర్లకు కఠిన పరీక్ష తప్పదు. -
స్లో ఓవర్ రేట్ దెబ్బ.. ఇంగ్లండ్, ఆసీస్‌లకు భారీ షాక్
ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన యాషెస్ సిరీస్ 2-2తో డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. తొలి రెండు టెస్టులు ఆసీస్ నెగ్గితే.. మూడు, ఐదో టెస్టు ఇంగ్లండ్ నెగ్గింది. ఇక నాలుగో టెస్టు డ్రాగా ముగిసింది. ఈ నేపథ్యంలో ఐదోటెస్టు గెలిచిన ఇంగ్లండ్ డబ్ల్యూటీసీ పట్టికలో పాయింట్ల పరంగా ఆస్ట్రేలియాతో సమానంగా నిలిచింది. ఇరుజట్లు ఐదు టెస్టుల్లో రెండు విజయాలు, రెండు ఓటములు, ఒక డ్రాతో నిలిచాయి. ఈ లెక్కన ఇరుజట్లు 26 పాయింట్లు(43.33 పర్సంటేజీ పాయింట్స్)తో పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఇంగ్లండ్‌కు ఈ మురిపెం ఒక్కరోజుకే పరిమితమైంది. తాజాగా బుధవారం ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలకు ఐసీసీ షాక్ ఇచ్చింది. యాషెస్ సిరీస్‌లో భాగంగా ఐదుటెస్టుల్లో స్లో ఓవర్ రేట్ నమోదైన కారణంగా ఇంగ్లండ్, ఆసీస్ ఆటగాళ్లకు మ్యాచ్ ఫీజులో జరిమానా విధించడంతో పాటు ఇరుజట్లకు డబ్ల్యూటీసీ పాయింట్లలోనూ భారీ కోత పడింది. ఆస్ట్రేలియా ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జరిగిన నాలుగో టెస్టులో స్లో ఓవర్ రేట్ నమోదు చేసింది. టెస్టుల్లో ఒకరోజుకు ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లు వేయాల్సి ఉంటుంది(ఇరుజట్లు లేదా ఒకే జట్టు). అయితే ఆసీస్ నాలుగో టెస్టులో నిర్ణీత సమయంలోగా 10 ఓవర్లు తక్కువగా వేసినందుకు గానూ ఒక్క షార్ట్ ఓవర్ కింద ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో ఓవర్‌కు 5శాతం చొప్పున జరిమానాతో పాటు ఒక డబ్ల్యూటీసీ పాయింట్ కోత విధిస్తారు. ఈ లెక్కన ఆసీస్ 10 ఓవర్లు చొప్పున 10 డబ్ల్యూటీసీ పాయింట్లను కోల్పోయింది. ఇక మ్యాచ్‌లో ఆటగాళ్లకు 50శాతం జరిమానా విధించారు. ఇక ఇంగ్లండ్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. యాషెస్‌లో జరిగిన ఐదు టెస్టుల్లో ఏకంగా నాలుగు టెస్టుల్లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసిన ఇంగ్లండ్‌కు గట్టి దెబ్బపడింది. తొలి టెస్టుల్లో రెండు ఓవర్లు, రెండో టెస్టులో తొమ్మిది ఓవర్లు, నాలుగో టెస్టులో మూడు ఓవర్లు, ఇక చివరి టెస్టులో ఐదు ఓవర్లు.. మొత్తంగా 19 ఓవర్లు తక్కువ వేసింది. దీంతో ఒక ఓవర్ చొప్పున ఇంగ్లండ్‌కు 19 ఓవర్లకు 19 డబ్ల్యూటీసీ పాయింట్లు కోత పడ్డాయి. దీంతో ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులోనూ జరిమానా పడింది. తొలి టెస్టులో 10 శాతం, రెండో టెస్టులో 45 శాతం, నాలుగో టెస్టులో 15శాతం, చివరి టెస్టులో 25శాతం జరిమానా విధించారు. దీంతో ఒక్కరోజు వ్యవధిలోనే డబ్ల్యూటీసీ పట్టికలో భారీ మార్పులు చోటుచేసుకోవడం విశేషం. 19 పాయింట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ప్రస్తుతం 13 పాయింట్లు(15 పర్సంటేజీ పాయింట్స్)తో ఐదో స్థానానికి పడిపోయింది. ఇక 10 పాయింట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా 30 పర్సంటేజీ పాయింట్స్‌తో మూడో స్థానంలో ఉన్నప్పటికి భారీగా పాయింట్లు కోల్పోవడం ఆ జట్టుకు దెబ్బ అని చెప్పొచ్చు. ఇక టీమిండియాతో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఓటమి పాలైన విండీస్ 16.67 పర్సంటేజీ పాయింట్స్‌తో నాలుగో స్థానంలో నిలిచింది. The latest points table of WTC 2023-25: 1. Pakistan - 100% 2. India - 66.67% 3. Australia - 30% 4. West Indies - 16.67% 5. England - 15% pic.twitter.com/gaoojRbIUi — CricketMAN2 (@ImTanujSingh) August 2, 2023 🚨 Points Deduction 🚨 Due to slow over-rates during the Ashes series, England lost 19 points and Australia lost 10 points in the WTC points table. 🏴🇦🇺#WTC #Ashes #ENGvAUS pic.twitter.com/wdFXbSgDhu — Sportskeeda (@Sportskeeda) August 2, 2023 చదవండి: R Ashwin: 'టీమిండియా బజ్‌బాల్ ఆడితే జట్టులో ఎవరు మిగలరండి' -
ఆసీస్ దిగ్గజం చురకలు.. 'బజ్‌బాల్ కాదది కజ్బాల్'
ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా గురువారం ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ బౌలింగ్ ఎంచుకుంది. అయితే యాషెస్ సిరీస్‌కు ముందు బజ్‌బాల్ ఆటతో ఆసీస్‌కు ముకుతాడు వేస్తామని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ప్రగల్బాలు పలికాడు. తీరా అసలు ఆట మొదలయ్యాకా సీన్ మొత్తం రివర్స్ అయింది. ఎడ్జ్‌బాస్టన్, లార్డ్స్ వేదికగా జరిగిన తొలి రెండు టెస్టుల్లో ఇంగ్లండ్ అనూహ్యంగా ఓటమిపాలైంది. ఇప్పటికే 0-2తో వెనుకబడిన ఆ జట్టు కనీసం మూడో టెస్టులోనైనా గెలిచి సిరీస్‌ను కాపాడుకోవాలని చూస్తోంది. తాజాగా మూడో టెస్టు మొదలైన నేపథ్యంలో ఆసీస్ దిగ్గజ బౌలర్ గ్లెన్ మెక్‌గ్రాత్ ఇంగ్లండ్ జట్టుకు పరోక్షంగా చురకలు అంటించాడు.'' ఇంగ్లండ్ ఆడుతుంది బజ్‌బాల్ కాదని.. అది కజ్బాల్ అని దుయ్యబట్టాడు. బీబీసీ కాలమ్‌కు రాసిన మెక్‌గ్రాత్ పలు ఆసక్తికర విషయాలు పేర్కొన్నాడు. ముందు జానీ బెయిర్ స్టో ఔట్ వివాదంతో మొదలుపెడతా. ఇక్కడ రెండు అంశాలు నా మదిలోకి వచ్చాయి. మొదట చూసినప్పుడు పాట్ కమిన్స్ అప్పీల్‌ను విత్‌డ్రా చేసుకుంటే బాగుంటుందనిపించింది. కానీ నిశితంగా పరిశీలించాకా ఆసీస్ కెప్టెన్ నిర్ణయం సరైందే అనిపించింది. ఇంగ్లండ్ ప్రవర్తించిన తీరు హాస్యాస్పదం అనిపించింది. ఇంగ్లండ్ బజ్‌బాల్ ఆటకు నేను అభిమానిని. ప్రత్యర్థి జట్లకు ఏ మాత్రం భయపడకుండా వారిపైనే ఒత్తిడి తెచ్చేలా ఇన్నింగ్స్‌ను ఆడడం అనే బజ్‌బాల్ కాన్సెప్ట్‌ను స్వాగతిస్తున్నా. కానీ బెయిర్ స్టో ఔట్ వివాదం కారణంగా ఇంగ్లండ్ బజ్‌బాల్ కాస్త నాకు కజ్బాల్(Casual Bowling)లా కనిపించింది.'' అంటూ చెప్పుకొచ్చాడు. ఇక లార్డ్స్ టెస్టులో బెయిర్ స్టో ఔట్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. బంతి డెడ్ కాకముందే బెయిర్ స్టో క్రీజును విడవడంతో అలెక్స్ కేరీ బంతిని వికెట్లకు గిరాటేశాడు. రూల్ ప్రకారం థర్డ్ అంపైర్ బెయిర్ స్టో ఔట్ అని ప్రకటించాడు. ఇక్కడ రాజుకున్న మంట టెస్టు ముగిసినా చల్లారలేదు. ఆసీస్ జట్టు చీటింగ్ చేసి గెలిచిదంటూ ఇంగ్లండ్ అభిమానులు సహా స్థానిక మీడియా ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఆస్ట్రేలియా మీడియా కూడా ధీటుగానే బదులిచ్చింది. ఇక బెయిర్ స్టో వివాదం ఇరుదేశాల ప్రధానులు మాట మాట అనుకునే వరకు వెళ్లడం ఆసక్తి కలిగించింది. Glenn Mcgrath said "Bairstow's dismissal epitomizes what we have seen from England in this series, it has been Casual ball - CazBall if you will, not Bazball". [BBC] pic.twitter.com/bKAdHQbgJ1 — Johns. (@CricCrazyJohns) July 5, 2023 చదవండి: Ashes 2023: మూడో టెస్టు.. టాస్ గెలిచిన ఇంగ్లండ్.. బజ్‌బాల్‌ను పక్కనబెడుతుందా? -
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్: సామ్రాజ్య భారతి
ఘట్టాలు: భారత పర్యటనలో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు వాళ్ల టీమ్ పేరు లార్డ్ హాక్స్ లెవన్. హాక్స్ ఇంగ్లండ్ టీమ్ కెప్టెన్. నాటి మన టీమ్ ‘ఆలిండియా లెవన్’. చట్టాలు: కలోనియల్ ప్రొబేట్స్ యాక్ట్, ఫారిన్ మ్యారేజ్ యాక్ట్, సూపరాన్యుయేషన్ యాక్ట్ జననాలు: జె.సి.కుమారప్ప : ఆర్థికవేత్త (తమిళనాడు); మణిలాల్ గాంధీ : సామాజిక కార్యకర్త (గుజరాత్); హుసేన్ షహీద్ సుహ్రావర్థి : న్యాయవాది, రాజకీయవేత్త (పాకిస్థాన్); ఆర్.కె.షణ్ముఖం చెట్టియార్ : న్యాయవాది (తమిళనాడు); సయ్యద్ అతావుల్లా షా బుఖారి : జీవిత చరిత్రల రచయిత (బిహార్); సురశ్రీ కేసర్‌బాయ్ రేర్కర్ : శాస్త్రీయ సంగీతకారులు, గాయకులు (గోవా); రోషన్ సింగ్ : విప్లవకారుడు (ఉత్తరప్రదేశ్); కె.ఎ.నీలకంఠ శాస్త్రి : చరిత్రకారులు (తమిళనాడు); హెచ్.ఎం.రెడ్డి : తెలుగు సినిమా దర్శకులు, నిర్మాత (కర్ణాటక); రవిశంకర్ రావల్ : పెయింటర్ (గుజరాత్); గోమర్ గోహో : పూర్తి పేరు జతీంద్ర చరణ్ గోహో. ప్రసిద్ధ రెజ్లర్ (కలకత్తా); పంచానన్ మిత్ర : పురావస్తు పరిశోధకులు (కలకత్తా); తారాబాయ్ మోదక్ : సమాజ సేవకురాలు (బాంబే); డి.బి.దేవదార్ : ఇండియన్ క్రికెటర్ (బాంబే); రుస్తోంజీ జంషెడ్జీ : ఇండియన్ క్రికెటర్ (బాంబే); ఖాజీ జైనల్ అబెదిన్: ఉర్దూ కవి, హైదరాబాద్ నిజాం కార్యాలయ ఉద్యోగి (మహారాష్ట్ర); అజీజ్ ఉల్హక్ : న్యాయవాది (కలకత్తా). -
టీమిండియాతో ఐదో టెస్ట్: జట్టును ప్రకటించిన ఇంగ్లండ్.. స్టార్ పేసర్ రీ ఎంట్రీ
England Squad For Test VS India: టీమిండియాతో రేపటి (జులై 1) నుంచి ప్రారంభంకానున్న ఐదో టెస్ట్‌కు ఇంగ్లండ్ తుది జట్టు ఖరారైంది. ఒక్క మార్పు మినహా తాజాగా న్యూజిలాండ్‌పై బరిలోకి దిగిన జట్టునే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) రంగంలోకి దించుతుంది. జేమీ ఓవర్టన్ స్థానంలో వెటరన్ పేసర్ జిమ్మీ ఆండర్సన్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. Our XI for the fifth LV= Insurance Test with @BCCI 🏏 More here: https://t.co/uXHG3iOVCA 🏴 #ENGvIND 🇮🇳 pic.twitter.com/xZlULGsNiB — England Cricket (@englandcricket) June 30, 2022 ఓపెనర్లుగా అలెక్స్ లీస్, జాక్ క్రాలే.. వన్‌డౌన్‌లో ఓలీ పోప్.. జో రూట్, జానీ బెయిర్‌స్టో, బెన్ స్టోక్స్ వరుసగా 4, 5, 6 స్థానాల్లో బరిలోకి దిగనున్నారు. మూడో టెస్ట్ సందర్భంగా కరోనా బారిన పడిన బెన్ ఫోక్స్ స్థానంలో సామ్ బిల్లింగ్స్ వికెట్‌కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. పేసర్లుగా మ్యాథ్యూ పాట్స్, స్టువర్ట్ బ్రాడ్, ఆండర్సన్.. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా జాక్ లీచ్ తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. మరోవైపు టీమిండియా ప్లేయింగ్ ఎలెవెన్‌పై సందిగ్ధత కొనసాగుతుంది. కరోనా బారిన పడిన కెప్టెన్ రోహిత్ శర్మ హెల్త్‌పై ఇంతవరకు అధికారిక అప్డేట్ లేదు. దీంతో ఈ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ ఎవరనే విషయంపై గందరగోళం నెలకొంది. తుది జట్టు విషయంలో టీమిండియా గోప్యత పాటిస్తుంది. కాగా, కరోనా కారణంగా గతేడాది అర్థాంతరంగా నిలిచిపోయిన చివరి టెస్ట్ మ్యాచ్ రేపటి నుంచి ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలో కొనసాగుతుంది. చదవండి: ఇంగ్లండ్‌తో ఇప్పుడు కష్టం.. టీమిండియాను హెచ్చరిస్తున్న మొయిన్ అలీ -
ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్ జట్టు.. ఆ ఇద్దరికి మొండిచెయ్యి
లండన్: అక్టోబర్ 17 నుంచి ప్రారంభంకానున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యుల జట్టును ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు గురువారం ప్రకటించింది. జట్టులో స్థానం ఆశించిన స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ సహా టెస్ట్ కెప్టెన్ జో రూట్లకు సెలెక్షన్ కమిటీ మొండిచెయ్యి చూపింది. ఇటీవలి కాలంలో సూపర్ ఫామ్‌లో ఉన్న రూట్ ఎలాగైనా పొట్టి ఫార్మాట్లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని భావించాడు. ఇక మానసిక సమస్యలతో బాధపడుతున్న స్టోక్స్.. క్రికెట్ నుంచి నిరవధిక విరామం తీసుకుని ఇటీవలే జట్టుకు అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. అయితే ఇంగ్లండ్ సెలెక్షన్ కమిటీ వీరిద్దరిని పరిగణలోకి తీసుకోలేదు. మరోవైపు స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడంతో టైమల్ మిల్స్, ఆల్‌రౌండర్ కోటాలో క్రిస్ వోక్స్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చారు. ఇంగ్లండ్ టీ20 ప్రపంచకప్ జట్టు: ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, సామ్ కర్రన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలాన్, టైమల్ మిల్స్, ఆదిల్ రషీద్, జేసన్ రాయ్, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్. చదవండి: టీమిండియా మెంటర్‌గా ధోని నియామకంపై వివాదం.. -
ఇంగ్లండ్ జట్టులో రెండు మార్పులు.. బట్లర్ సహా మరో బౌలర్ ఔట్
ఓవల్: టీమిండియాతో నాలుగో టెస్ట్‌కు ముందు ఇంగ్లండ్ జట్టులో రెండు మార్పులు చోటు చేసుకున్నాయి. వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ వ్యక్తిగత కారణాల(తన భార్య రెండో బిడ్డను జన్మనివ్వనున్నందున) చేత ఓవల్ టెస్ట్ నుంచి తప్పుకోనుండగా, ఫాస్ట్ బౌలర్ సకీబ్ మహమూద్‌పై వేటు పడింది. బట్లర్ స్థానాన్ని సామ్ బిల్లింగ్స్ భర్తీ చేయనుండగా, సకీబ్ ప్లేస్‌లో క్రిస్ వోక్స్ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ఇంగ్లండ్ జట్టులో మార్పులపై కోచ్ క్రిస్ సిల్వర్‌వుడ్ మాట్లాడుతూ.. నాలుగో టెస్ట్‌లో వికెట్‌కీపింగ్ బాధ్యతలను జానీ బెయిర్‌స్టో నిర్వహిస్తాడని, దీని వల్ల అదనపు బ్యాట్స్‌మెన్‌ను తీసుకునే అవకాశం ఉంటుందని తెలిపాడు. కీపింగ్ బాధ్యతలకు బెయిర్‌స్టో ఓకే చెబితే.. ఓలీ పోప్ లేదా డానియల్ లారెన్స్‌లలో ఒకరికి తుది జట్టులో అవకాశం లభిస్తుందని పేర్కొన్నాడు. నాలుగో టెస్టు సెప్టెంబర్ 2 నుంచి ఓవల్‌లో ప్రారంభం కానుంది. నాలుగో టెస్ట్ కోసం ఇంగ్లండ్ జట్టు: జో రూట్ (కెప్టెన్), మొయిన్ అలీ, జేమ్స్ ఆండర్సన్, జానీ బెయిర్‌స్టో (కీపర్), సామ్ బిల్లింగ్స్ (కీపర్), రోరీ బర్న్స్, సామ్ కర్రన్, హసీబ్ హమీద్, డాన్ లారెన్స్, డేవిడ్ మలాన్, క్రెయిగ్ ఓవర్టన్, ఓలీ పోప్, ఓలీ రాబిన్సన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్. చదవండి: IPL 2021: ఆర్సీబీకి షాక్.. గాయంతో స్టార్ ఆల్‌రౌండర్ ఔట్ -
Euro 2020: ఇంగ్లండ్‌కు తగిన శాస్తే జరిగిందా?
55 ఏళ్ల తర్వాత దక్కిన ఛాన్స్, ఐదేళ్ల క్రితం ప్రపంచ కప్ క్వాలిఫై కాకుండా పోయిన అవమానానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం.. ఈ రెండింటికీ ఒకేసారి సమాధానం, అదీ సొంతగడ్డపై చెప్పే వీలు దొరికింది ఇంగ్లండ్ ఫుట్‌బాల్ జట్టుకి. అలాంటిది కాలిదాకా వచ్చిన అవకాశాన్ని.. చేజేతులారా పొగొట్టుకుంది ఇంగ్లండ్ ఫుట్‌బాల్ టీం. యూరో 2020 ఫైనల్లో ఇటలీ చేతిలో అదీ షూట్అవుట్(మ్యాచ్ 1-1 డ్రా అయ్యింది) ఓటమి ద్వారా బాధాకరమైన నిట్టూర్పును విడిచింది. వెబ్‌డెస్క్: ఇంగ్లండ్ వేదికగా జరిగిన Euro 2020 కప్ సందర్భంగా చర్చించుకోదగ్గ పరిణామాలెన్నో చోటు చేసుకున్నాయి. ఐదు దశాబ్ధాల తర్వాత గెలుపు అంచుదాకా చేరిన సొంత జట్టును ప్రోత్సహించేందుకు రాజకుటుంబం సైతం వెంబ్లేకి కదిలింది. సెలబ్రిటీలు, సగటు సాకర్ అభిమానులంతా స్టేడియం బయట, లండన్ వీధుల్లో గుంపులుగా చేరారు. భారీ అంచనాల నడుమ జరిగిన మ్యాచ్ డ్రా కావడం, పెనాల్టీ షూట్అవుట్ వీరుడిగా పేరున్న బుకాయ సకా అతితెలివి ప్రదర్శించి చేయాలనుకున్న గోల్ సైతం మిస్ కావడం, వెరసి.. ఇంగ్లండ్ ఓటమి పాలవ్వడాన్ని ఇంగ్లీష్ సాకర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓవర్ కాన్ఫిడెన్స్ 1996 వరల్డ్ కప్ తర్వాత ఒక మేజర్ టైటిల్ ఇంత చేరువలో రావడం ఇంగ్లండ్‌కు ఇదే మొదటిసారి. అయితే అతి ఆత్మవిశ్వాసం దెబ్బతీసిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సాకర్ నిపుణులు. 2018 ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో సెమీఫైనల్‌కు చేరడం నుంచి ఇంగ్లండ్ ఆటగాళ్లు తమ ఫర్ఫార్మెన్స్ మెరుగైందనే అంచనాకి వచ్చేశారు. ఇక ఈ ఏడాది సొంతగడ్డ మీద వరుస విజయాలు.. యూరో 2020 ఫైనల్ దాకా చేరుకోవడంతో అభిమానుల్లోనే కాదు.. ఆటగాళ్లలోనూ ఆత్మ విశ్వాసం నింపింది. ఈ క్రమంలో ఇటలీని చాలా చిన్నచూపు చూసింది ఇంగ్లండ్. రాబర్టో మన్సినీ ఆధ్వర్యంలో వరుసగా 33 మ్యాచ్‌లు గెలిచి యూరప్‌లోనే బెస్ట్ టీంగా ఉన్న ఇటలీ బలాబలాలను తక్కువ అంచనా వేసి ఘోర తప్పిదం చేసింది. వెరసి బెస్ట్ ప్లేయర్లు ఉండి కూడా కప్ కొట్టలేకపోయింది ఇంగ్లండ్. అచ్చీరాని షూట్అవుట్లు ఇంగ్లండ్‌కు ఇలా షూట్అవుట్లతో ఝలక్‌లు తగలడం కొత్తేంకాదు. 1990, 1996, 1998, 2004, 2006, 2012లలో మెగా టోర్నీలలో ఇంగ్లండ్ షూట్అవుట్ పెనాల్టీల ద్వారానే నిష్క్రమించాల్సి వచ్చింది. అభిమానుల అతి.. వ్యతిరేకత ఇంగ్లండ్ ఓటమికి ఇది ఒక కారణం కాకపోవచ్చు. కానీ, ఇటలీని ఎంకరేజ్ చేయడానికి మాత్రం ఇవే కారణాలు అయ్యాయి. ఇంగ్లండ్ ఫ్యాన్స్ అత్యుత్సాహం, మద్దతు ఇంగ్లండ్ ఆటగాళ్లలో ఓవర్ కాన్ఫిడెన్స్ నింపింది. ప్రత్యర్థుల బలాబలాలను అంచనా వేసుకునే అవకాశం ఇవ్వలేకపోయింది. పైగా సెమీ ఫైనల్లో డెన్మార్క్ గోల్ కీపర్ కాస్పర్ కళ్లలో అభిమానులు లేజర్ లైట్లు కొట్టడం, అభిమానులపై దాడులు చేయడం ఘటనలు విపరీతమైన చర్చకు దారితీసింది. ఇక ఫైనల్‌కు ముందు ఇటలీ పట్ల ప్రదర్శించిన వివక్ష కూడా ఓ కారణంగా మారింది. అంతెందుకు ఫైనల్లో షూట్అవుట్ పెనాల్టీ మిస్ చేసినందుకు బుకాయో సకాపై సోషల్ మీడియాలో జాతి వివక్ష వ్యాఖ్యలు, మిగతా ఇద్దరిపై వ్యతిరేక కామెంట్లు చేస్తున్నారంటే.. అక్కడి అభిమానుల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రియల్ విన్నర్ జార్జియో చియెల్లిని సారథ్యంలోని ఇటలీ ఫుట్‌బాల్ టీం 2020 యూరో టోర్నీ విజేతగా ఆవిర్భవించింది. సుమారు మూడువందల కోట్ల రూపాయల ప్రైజ్‌మనీ గెల్చుకుంది. ఇటలీకి ఇది రెండో యూరోపియన్ ఛాంపియన్షిప్ టైటిల్. 2006 ఫిఫా వరల్డ్ కప్ విజయం తర్వాత గెలిచిన మేజర్ టోర్నీ. కానీ, 2018లో ఫుట్‌బాల్ వరల్డ్ కప్(ఫిఫా)కు కనీసం అర్హత సాధించలేకపోయింది. దీంతో అరవై ఏళ్ల ఇటలీ ఫుట్‌బాల్ చరిత్ర ఒక్కసారిగా మసకబారింది. అయితే ఆ అవమానం నుంచి కోలుకోవడానికి ఇటలీకి ఎంతో టైం పట్టలేదు. ఆరు నెలల తర్వాత రాబర్టో మన్సినీ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించాడు. అప్పటి నుంచి మొదలైన వరుస క్లీన్ విక్టరీలు, హుందాగా వ్యవహరించే జట్టు, వాళ్ల ఫ్యాన్స్.. ఇదీ ఇటలీ టీం పట్ల ఫాలోయింగ్ పెరగడానికి కారణం అయ్యాయి. ఇక ఇంగ్లండ్ ఆటగాళ్ల రెండు పెనాల్టీ షూట్ అవుట్లను అడ్డుకోవడంతో(మూడోది గోల్ రాడ్‌కి తగిలి మిస్ అయ్యింది) రియల్‌హీరోగా మారిపోయాడు గియాన్లుయిగి డొన్నారుమ్మ. Euro 2020 Final లో ఇంగ్లండ్ ఓటమిపై స్పందిస్తూ.. ‘ఇటలీ మిమ్మల్ని ఓడించలేదు. కానీ, మీరే వాళ్లకు తలొగ్గారు’ అంటూ డచ్ సాకర్ దిగ్గజం జోహన్ క్రుయఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇటలీది భయంకరమైన డిఫెన్స్ ఆట, ఆ మంత్రం సింపుల్ది. అది అందరికీ తెలుసు. అయినా ఇంగ్లండ్ ఓడిందంటే అది వాళ్ల నిర్లక్క్ష్యమేనని పేర్కొన్నాడు ఆయన. ఇక యూరో 2020 రన్నర్‌గా నిలిచిన ఇంగ్లండ్ జట్టు 267 కోట్ల ప్రైజ్ మనీతో సరిపెట్టుకుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
స్టోక్స్ సారధ్యంలో కొత్త జట్టును ప్రకటించిన ఈసీబీ
లండన్: ఇంగ్లండ్ క్యాంపులో ఏడుగురు సభ్యులు కరోనా బారినపడ్డ నేపథ్యంలో పాకిస్తాన్‌తో సిరీస్ నిమిత్తం 18 మంది సభ్యులతో కూడిన నూతన జట్టును ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) ప్రకటించింది. కోవిడ్ బారిన పడ్డ ఆటగాళ్లతో సన్నిహితంగా ఉన్న జట్టు సభ్యులందరినీ ఐసోలేషన్‌కు తరలించిన ఈసీబీ.. పూర్తిగా కొత్త జట్టును ప్రకటించింది. ఇందులో ఏకంగా తొమ్మిది మంది అన్ క్యాప్డ్ ప్లేయర్లను ఎంపిక చేసింది. శ్రీలంకతో పరిమిత ఓవర్ల సిరీస్‌కు దూరమైన బెన్ స్టోక్స్‌కు యువ జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించింది. కాగా, ముందుగా ప్రకటించిన ఇంగ్లండ్ జట్టు సభ్యులకు సోమవారం బ్రిస్టల్‌లో ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించింది. ఇందులో ముగ్గురు ఆటగాళ్లు, నలుగురు మేనేజ్మెంట్ సిబ్బందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో జట్టు మొత్తాం ఐసోలేషన్‌లో ఉండాలని ఈసీబీ ఆదేశించింది. మరోవైపు కొత్తగా ఎంపికైన యువకులకు ఇది సువర్ణావకాశమని, తమ ప్రతిభను నిరూపించుకునేందుకు వారికి సరైన ప్లాట్‌ఫామ్ దొరికిందని ఇంగ్లండ్ మాజీ స్పిన్నర్, ప్రస్తుత బోర్డు మేనేజింగ్ డైరెక్టర్ ఆష్లే గిల్స్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే, ఇంగ్లండ్-పాకిస్థాన్ మధ్య మూడు వన్డేల సిరీస్ ఈ నెల 8 నుంచి ప్రారంభం కానుంది. ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్(కెప్టెన్), జేక్ బాల్, డానీ బ్రిగ్స్, బ్రైడాన్ కార్స్, జాక్ క్రాలీ, బెన్ డక్కెట్, లూయిస్ గ్రెగరి, టామ్ హెల్మ్, విల్ జాక్స్, డేనియల్ లారెన్స్, సకీబ్ మహమూద్, డేవిడ్ మలాన్, క్రెయిగ్ ఒవర్టన్, మాట్ పార్కిన్సన్, డేవిడ్ పెయిన్, ఫిల్ సాల్ట్, జాన్ సింప్సన్, జేమ్స్ విన్స్ -
చాంపియన్స్ లీగ్ విజేత జట్టుకు కోటీ 90 లక్షల యూరోలు
పోర్టో (పోర్చుగల్): ప్రతిష్టాత్మక యూరోపియన్ చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో చెల్సీ క్లబ్ (ఇంగ్లండ్) జట్టు విజేతగా నిలిచింది. ఫైనల్లో సెసర్ అప్లిక్వెటా కెప్టెన్సీలోని చెల్సీ క్లబ్ జట్టు 1–0తో మాంచెస్టర్ సిటీ (ఇంగ్లండ్) జట్టుపై గెలిచింది. ఆట 42వ నిమిషంలో కాయ్ హావెర్ట్జ్ ఏకైక గోల్ చేసి చెల్సీ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. విజేత చెల్సీ జట్టుకు కోటీ 90 లక్షల యూరోలు (రూ. 167 కోట్లు)... రన్నరప్ మాంచెస్టర్ సిటీ జట్టుకు కోటీ 50 లక్షల యూరోలు (రూ. 132 కోట్లు) ప్రైజ్‌మనీగా లభించాయి. -
'వచ్చే టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌కు భయపడాల్సిందే'
అహ్మదాబాద్: ఇంగ్లండ్ మాజీ ఆటగాడు.. అసిస్టెంట్ కోచ్ పాల్ కొలింగ్‌వుడ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఉన్న ఇంగ్లండ్ జట్టు అద్భుతంగా ఆడుతుందని.. రానున్న టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌ను చూసి ప్రత్యర్థులు భయపడే అవకాశముందని తెలిపాడు. 2010లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ సాధించిన ఇంగ్లండ్‌కు కెప్టెన్‌గా కొలింగ్‌వుడ్ ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా టీమిండియాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా.. ఇరు జట్లు 2-2తో సమానంగా ఉన్నాయి. కాగా నేడు కీలకమైన ఐదో టీ20 జరగనుంది. ఈ నేపథ్యంలో కొలింగ్‌వుడ్ స్పందించాడు. 'గత నాలుగేళ్లుగా చూసుకుంటే పొట్టి ఫార్మాట్లో మా జట్టు ప్రదర్శన అద్బుతంగా సాగుతుంది. ఇప్పుడు జట్టులో ఒకటి నుంచి మొదలుకొని 11వ స్థానం వరకు మ్యాచ్ విన్నర్లు ఉండడం విశేషం. 2010 సమయంలో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచినప్పటికి.. ఇప్పటి జట్టుతో పోలిస్తే మేము అంత బలంగా లేము. కానీ అప్పట్లో జట్టు సమిష్టి ప్రదర్శనతో కప్ సాధించాం. ఆ తర్వాత మా జట్టు ప్రదర్శన దిగజారింది. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి... జట్టులో ఒకరిని మించి ఒకరు మ్యాచ్ విన్నర్లు ఉండడం కలిసొచ్చే అంశం. ఇప్పుడు టీ20ల్లో ఇంగ్లండ్ జట్టు నెంబర్‌వన్ స్థానంలో ఉండడం.. రానున్న టీ20 ప్రపంచకప్‌లో ప్రత్యర్థులకు భయం కలిగించే అంశంగా చెప్పవచ్చు. తాజాగా టీమిండియాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను కోల్పోయినా.. పొట్టి ఫార్మాట్‌కు వచ్చేసరికి మాత్రం నెంబర్‌వన్ జట్టు ఆటతీరు ఎలా ఉంటుందనేది ఇంగ్లండ్ చూపించింది. సిరీస్‌లో ఇరు జట్లు 2-2తో సమంగా నిలవడంతో ఆఖరి టీ20 కీలకంగా మారింది. ఈ మ్యాచ్ గెలిచి టెస్టు సిరీస్ ఓటమికి బదులు తీర్చుకుంటాం'అని చెప్పుకొచ్చాడు. కాగా బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపుపొందిన పాల్ కొలింగ్‌వుడ్ ఇంగ్లండ్ తరపున 68 టెస్టుల్లో 4,259 పరుగులు.. 17 వికెట్లు, 197 వన్డేల్లో 5078 పరుగులు.. 117 వికెట్లు, 36 టీ20ల్లో 583 పరుగులు సాధించాడు. 2007-08 మధ్య కాలంలో ఇంగ్లండ్ వన్డే జట్టుకు కెప్టెన్‌గా సేవలందించిన కొలింగ్‌వుడ్ 2010లో టీ20 కెప్టెన్‌గా వ్యవహరించి.. ఆ జట్టు ఒక మేజర్ టోర్నీ(ఐసీసీ 2010 టీ20 ప్రపంచకప్)ని కొల్లగొట్టడంలో కీలకపాత్ర పోషించాడు. కాగా 2021 ఐసీసీ టీ20 ప్రపంచకప్ భారత్ వేదికగా అక్టోబర్‌లో జరగనుంది. చదవండి: నా లిస్ట్‌లో సూర్య పేరు కచ్చితంగా ఉంటుంది: యువీ అదొక చెత్త నిర్ణయం: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ -
భారత్‌తో టీ20 సిరీస్‌కు ఇంగ్లండ్ జట్టు ప్రకటన
లండన్: భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఇయాన్ మోర్గాన్ నేతృత్వంలోని 16 మంది ఆటగాళ్లతో కూడిన ఇంగ్లండ్ జట్టును ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) గురువారం ప్రకటించింది. మార్చి 12 నుంచి 20 మధ్య అహ్మదాబాద్‌లోని సర్దార్ పటేల్ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫిబ్రవరి 26న ఇంగ్లండ్ జట్టు భారత్‌కు బయలుదేరుతుందని ఈసీబీ తమ అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. ఇంగ్లీష్ జట్టు మోర్గాన్, బెన్‌స్టోక్స్, జోస్ బట్లర్, జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్ లాంటి టీ20 స్పెషలిస్టులతో బలంగా ఉంది. ఇరు జట్ల మధ్య మార్చి 12, 14, 16,18, 20 తేదీల్లో భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7గంటలకు మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. ఇంగ్లండ్ టీ20 జట్టు: ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), మొయిన్ అలీ, జోఫ్రా ఆర్చర్, జానీ బెయిర్‌స్టో, సామ్ బిల్లింగ్స్, జోస్ బట్లర్, శామ్ కర్రన్, టామ్ కర్రన్, క్రిస్ జోర్డాన్, లియామ్ లివింగ్‌స్టోన్, డేవిడ్ మలన్, అదిల్ రషీద్, జేసన్ రాయ్, బెన్ స్టోక్స్, టాప్లే, మార్క్ వుడ్. -
వీరాభిమాని నం.1
గాలే: ‘మరి కొద్ది రోజుల్లో కరోనా ముగిసిపోతుంది... వచ్చే నెల రోజుల్లో అంతా సర్దుకుంటుంది... ఇంగ్లండ్ జట్టు వచ్చి సిరీస్ ఆడుతుంది...’ ఇలా ఆశపడుతూనే అతను ఏకంగా పది నెలలు శ్రీలంకలోనే గడిపేశాడు. ఎట్టకేలకు ఆ వీరాభిమాని కోరిక తీరింది. ఆ అభిమాని పేరు రాబ్ లూయిస్. ఇంగ్లండ్ క్రికెట్ జట్టంటే పడి చస్తాడు. ఇదే ఉత్సాహంతో అతను గత ఏడాది మార్చిలో శ్రీలంకలో జరిగే ఇంగ్లండ్ సిరీస్‌ను ప్రత్యక్షంగా చూడాలనుకొని సిద్ధమైపోయాడు. ఆటగాళ్లు వెళ్లక ముందే అక్కడికి చేరుకొని ఎపుడెపుడా అని ఆట కోసం ఎదురు చూడసాగాడు. ఇంతలో కరోనా వచ్చేసింది... ప్రపంచమంతా మారిపోయింది. ఇంగ్లండ్ పర్యటన కూడా వాయిదా పడింది. ఇటు శ్రీలంక నుంచి బయటకు వెళ్లేందుకు ఆంక్షలు, అటు ఇంగ్లండ్‌లో పరిస్థితి తీవ్రం. దాంతో 37 ఏళ్ల లూయిస్ లంకలోనే ఆగిపోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే పరిస్థితి రోజురోజుకూ దిగజారుతుందని అతను ఊహించలేదు. త్వరలోనే సిరీస్ జరుగుతుందనే లూయిస్ కూడా ఆశిస్తూ వచ్చాడు. వృత్తిరీత్యా వెబ్ డిజైనర్ అయిన అతను ఆన్లైన్లోనే కొంత మొత్తం సంపాదించడం, లంక కరెన్సీ విలువ చాలా తక్కువ కావడంతో అదృష్టవశాత్తూ అతనికి ఆర్థికపరంగా ఇబ్బంది ఎదురు కాలేదు. చివరకు గురువారం ఇంగ్లండ్–శ్రీలంక మధ్య తొలి టెస్టు ప్రారంభం కావడంతో అతని కోరిక నెరవేరింది. అయితే ఇదీ అంత సులువుగా దక్కలేదు. బయో బబుల్ కారణంగా ప్రేక్షకులకు అనుమతి లేకపోవడంతో గాలే స్టేడియం చుట్టుపక్కల నుంచి ఎక్కడ అవకాశం ఉన్నా అక్కడి నుంచే చూసేందుకు ప్రయత్నించాడు. చివరకు మైదానం పక్కనే ఉన్న ప్రఖ్యాత ‘డచ్ ఫోర్ట్’ ఎక్కి అతను వీక్షించాడు. అన్నింటికి మించి శనివారం డబుల్ సెంచరీ పూర్తి చేసిన అనంతరం రూట్ ప్రత్యేకంగా రాబ్ లూయిస్ వైపు తిరిగి తన బ్యాట్ చూపించడంతో అతని ఇన్నాళ్ల బాధ ఒక్కసారిగా దూరమైంది! తన గురించి తెలుసుకొని ఇంగ్లండ్ క్రికెటర్లు ఫోన్లో మాట్లాడారని చెప్పిన లూయిస్ ... సిరీస్ ముగిసిన తర్వాత వారితో కలిసి బీర్ తాగాలని కోరుకుంటున్నాడు! -
ప్రధానితో ప్రపంచకప్ విజేత
లండన్ : సొంతగడ్డపై వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకున్న ఇంగ్లండ్ విజయ సంబరాలు కొనసాగుతూనే ఉన్నాయి. తొలిసారి తమ దేశానికి టైటిల్ గెలిచిన మోర్గాన్ సేన మంగళవారం దేశ ప్రధాని థెరెసా మే ను మర్యాదపూర్వకంగా కలిశారు. 10 డౌనింగ్ స్ట్రీట్‌లోని ప్రధాని అధికారిక కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆటగాళ్లంతా పాల్గొన్నారు. ‘ఇంగ్లండ్ ప్రజలు క్రికెట్‌పై మళ్లీ ప్రేమను పెంచుకునేలా మీరు చేశారు. ఫైనల్ మ్యాచ్‌ను అత్యుత్తమ క్రీడా ఘట్టాల్లో ఒకటిగా చెప్పగలను. ఇరు జట్ల అద్భుతమైన ఆటతో పాటు కొంత అదృష్టం కూడా కలగలిసి ఒక థ్రిల్లర్‌ను మనకు అందించాయి. ఇంత గొప్ప టోర్నీకి ఇది సరైన ముగింపు. మన దేశాన్ని క్రీడల్లో ప్రముఖంగా నిలిపిన అందరికీ అభినందనలు’ అని ఈ సందర్భంగా ప్రధాని థెరెసా వ్యాఖ్యానించారు. కార్యాలయ గార్డెన్స్‌లో జరిగిన ‘షాంపేన్ రిసెప్షన్’లో క్రికెటర్లు ప్రధానితో సరదాగా కబుర్లు చెబుతూ తమ గెలుపును ఆస్వాదించడం విశేషం. -
ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడకుండా.. ఇదేంది?!
చెస్టర్ లీ స్ట్రీట్: వన్డే వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్‌పై 119 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఇంగ్లండ్ సెమీస్ చేరింది. 27 ఏళ్ల అనంతరం ఇంగ్లండ్ వరల్డ్‌కప్ సెమీస్ చేరడం విశేషం. ఇక ఈ ఫలితంతో పాకిస్తాన్ సెమీస్ చేరడం కష్టసాధ్యమైన పని. ఒకవేళ నిన్నటి మ్యాచ్‌లో ఇంగ్లండ్గనుక ఓడిపోయుంటే... 9 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్న పాకిస్తాన్ శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో విజయం సాధిస్తే నేరుగా సెమీస్‌కు వెళ్లేది. 10 పాయింట్లతో ఇంగ్లండ్ ఐదో స్థానానికి పరిమితమయ్యేది. అందుకనే బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడిపోవాలని యావత్ పాకిస్తాన్ కోరుకుంది. అయితే, అద్భుత ఫామ్‌లో ఉన్న ఇంగ్లండ్ అటు బ్యాట్‌తోనూ.. ఇటు బంతితోనూ రాణించి ఘన విజయం సాధించింది. తాజా సమీకరణం ప్రకారం బంగ్లాతో జరిగే మ్యాచ్‌లో పాక్ 316 పరుగుల భారీ తేడాతో విజయం సాధించాలి. కానీ, వన్డే చరిత్రలో ఇప్పటివరకు ఇంత భారీ తేడాతో ఏ జట్టూ గెలిచిన దాఖలాలు లేవు. ఒకవేళ బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేస్తే మాత్రం ఎలాంటి సమీకరణాలతో పని లేకుండా పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఇక జట్టు పేలవ ప్రదర్శనపై సగటు పాక్ క్రికెట్ అభిమాని దుమ్మెత్తి పోస్తున్నాడు. ముందునుంచీ ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడకుండా.. ఇతర జట్ల జయాపజయాలపై ఆధారపడటం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. పాక్ మాజీ ఆటగాళ్లు ‘అల్లాకి దువా’ చేస్తున్న ఫొటో షేర్ చేసి.. మా ఆటగాళ్లు దేవునిదే భారం అనే ధోరణిలో ఉన్నారని.. కష్టపడి ఆడడం రాదని చురకలంటిస్తున్నారు. ఇక 1992 ప్రపంచకప్ ఫలితాన్ని పాక్ రిపీట్ చేస్తుందని.. ట్రోఫీని ఎగరేసుకుపోతుందని ఎన్నో అంచనాలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. Our only realistic chance at the moment 😓#NzvEng #ENGvNZ pic.twitter.com/6jvGbpAKep — Saqib Ali Shah (@Saqibca) July 3, 2019 It was a journey full of surprises, fun and betrayals. See you after 4 years. Sincerely, Pakistan.#ENGvNZ pic.twitter.com/Uzn7T8MH82 — abaid (@KhawajaAbaid) July 3, 2019 -
భారత్ ‘ఎ’ 219/1
వాయనాడ్ (కేరళ): ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో భారత్ ‘ఎ’ దీటైన జవాబు ఇచ్చింది. రెండో రోజు శుక్రవారం ఆట ముగిసే సమయానికి భారత్ ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 219 పరుగులు సాధించింది. లోకేశ్ రాహుల్ (88 బ్యాటింగ్; 11 ఫోర్లు), ప్రియాంక్ పాంచల్ (89 బ్యాటింగ్; 16 ఫోర్లు) రెండో వికెట్‌కు అజేయంగా 171 పరుగులు జోడించారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 303/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ లయన్స్ 340 పరుగుల వద్ద ఆలౌటైంది. నవదీప్ సైనికి ఐదు వికెట్లు లభించాయి. -
మార్పుల్లేకుండానే ఇంగ్లండ్ జట్టు
లండన్: భారత్‌తో శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న చివరి, ఐదో టెస్టులో ఇంగ్లండ్ జట్టు మార్పుల్లేకుండానే బరిలో దిగనుంది. ఈ మేరకు సెలెక్టర్లు 13 మంది సభ్యులతో జట్టును ప్రకటించారు. వేలి గాయం నుంచి వికెట్ కీపర్ బెయిర్‌స్టో కోలుకోవడంతో బ్యాట్స్‌మన్ జేమ్స్ విన్స్‌ను తప్పించారు. సర్రే తరఫున కౌంటీ మ్యాచ్ ఆడుతున్న ఒలివర్ పోప్ గురువారం జట్టుతో కలుస్తాడు. -
1993 తర్వాత ఆసీస్‌పై ఇంగ్లండ్ గెలుపు
మహిళల క్రికెట్ వన్డే వరల్డ్ కప్ చరిత్రలో ఇంగ్లండ్ జట్టు 1993 తర్వాత ఆస్ట్రేలియా జట్టుపై గెలిచింది. ఈ టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో బ్రిస్టల్‌లో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ 3 పరుగుల తేడాతో నెగ్గింది. తొలుత ఇంగ్లండ్ 50 ఓవర్లలో 8 వికెట్లకు 259 పరుగులు చేయగా... అనంతరం ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 8 వికెట్లకు 256 పరుగులు చేసి ఓటమి పాలైంది. మరో మ్యాచ్‌లో విండీస్ 47 పరుగుల తేడాతో శ్రీలంకపై గెలిచింది. -
ఇంగ్లండ్‌ను ఆపతరమా!
►అద్భుత ఫామ్‌లో మోర్గాన్ సేన ►సొంతగడ్డపై టైటిల్ సాధించడమే లక్ష్యం ►చాంపియన్స్ ట్రోఫీలో రెండు సార్లు ఫైనల్‌కు 339, 328, 328, 296, 321, 350, 309, 302, 444, 324... ముందుగా బ్యాటింగ్ చేసిన గత పది వన్డేల్లో ఇంగ్లండ్ జట్టు సాధించిన స్కోర్లు ఇవి. అంటే సగటున ప్రతీ మ్యాచ్‌కు ఆ జట్టు 334 పరుగులు చేసింది. వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డు కూడా ఇంగ్లండ్ పేరిటే ఉంది. కొన్నాళ్ల క్రితం వరకు సాంప్రదాయ టెస్టులు మినహా వన్డేల్లో ఈ టీమ్ అసలు ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయింది. అయితే గత రెండేళ్లలో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. స్పెషలిస్ట్ ఆటగాళ్లతో ప్రపంచంలో ఏ వేదికలోనైనా వన్డేల్లో భారీ స్కోర్లు సాధిస్తున్న ఇంగ్లండ్ బలమైన జట్టుగా ఎదిగింది. తమ వన్డే చరిత్రలో అత్యుత్తమ దశలో ఉన్న ఇంగ్లండ్... సొంతగడ్డపై చాంపియన్స్ ట్రోఫీలో ఫేవరెట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. గతంలో ఇంగ్లండ్‌లోనే జరిగిన రెండు చాంపియన్స్ ట్రోఫీల్లోనూ ఫైనల్లో ఓడిన ఆ జట్టు ఈసారి మాత్రం చరిత్ర తిరగరాయాలని పట్టుదలగా ఉంది. సాక్షి క్రీడా విభాగం ఇయాన్ మోర్గాన్ నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టు తాజా ఫామ్ ఏ ప్రత్యర్థికైనా దడ పుట్టించేలా ఉంది. దక్షిణాఫ్రికాలాంటి బలమైన ప్రత్యర్థితో బుధవారం జరిగిన తొలి వన్డేలో ఆ జట్టు సాధించిన అలవోక విజయం దానిని మళ్లీ నిరూపించింది. ఆల్‌రౌండ్ నైపుణ్యం గల ఆటగాళ్లతో పాటు సొంతగడ్డపై చాంపియన్స్ ట్రోఫీ జరుగుతుండటం ఆ జట్టుకు అదనంగా అనుకూలించే అంశం. ముఖ్యంగా మోర్గాన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాక వన్డే టీమ్‌లో ఒక్కసారిగా మార్పు వచ్చేసింది. ఏకంగా తొమ్మిదో స్థానం వరకు ఎలాంటి తత్తరపాటు లేకుండా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేయగల లైనప్ ఇంగ్లండ్ సొంతం. తమకు అనుకూలించే వాతావరణ పరిస్థితుల్లో స్వింగ్‌తో చెలరేగిపోగల బౌలర్లు కూడా ఆ జట్టులో ఉన్నారు. ఇవన్నీ ఇతర జట్లకంటే ఆతిథ్య జట్టును అందరికంటే ముందు నిలబెడుతున్నాయి. గత రికార్డు... చాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లండ్ రెండు సార్లు ఫైనల్ చేరింది. 2004లో వెస్టిండీస్ చేతిలో ఆ జట్టుకు అనూహ్య పరాజయం ఎదురైంది. 217 పరుగులు చేసిన ఇంగ్లండ్.. విండీస్‌ను 147/8 వద్ద కట్టడి చేసి విజయాన్ని ఆశించింది. కానీ విండీస్ బ్యాట్స్‌మెన్ బ్రౌన్, బ్రాడ్షా 71 పరుగులు జోడించి ఇంగ్లండ్ కథ ముగించారు. గత టోర్నీలో భారత్ చేతిలోనే ఇంగ్లండ్‌కు ఓటమి ఎదురైంది. ఈ 20 ఓవర్ల మ్యాచ్‌లో కూడా ఆ జట్టు విజయానికి చేరువగా వచ్చింది. చేతిలో ఆరు వికెట్లతో 16 బంతుల్లో 20 పరుగులు చేయాల్సిన స్థితి నుంచి ఇంగ్లండ్ ఓటమి దిశగా నడిచింది. ఓవరాల్‌గా చాంపియన్స్ ట్రోఫీలో 21 మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్ టీమ్ 11 గెలిచి, 10 మ్యాచ్‌లలో ఓడింది. అంతా స్టార్లే... ఓపెనర్లు జేసన్ రాయ్, హేల్స్ జోడి ప్రత్యర్థి ఎవరైనా పరుగుల వరద పారిస్తోంది. ప్రతీసారి వీరు అందిస్తున్న శుభారంభమే ఇంగ్లండ్ భారీ స్కోరుకు బాటలు వేస్తోంది. నిలకడకు మారు పేరైన జో రూట్‌తో పాటు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, బెన్ స్టోక్స్‌లతో జట్టు మిడిలార్డర్ కూడా పటిష్టంగా ఉంది. ముఖ్యంగా స్టోక్స్ ఆల్‌రౌండ్ నైపుణ్యం ఇంగ్లండ్ జట్టుకు వరంలా మారింది. ప్రపంచంలోనే ఇప్పుడు మేటి ఆల్‌రౌండర్‌గా ఉన్న స్టోక్స్, ఇటీవల ఐపీఎల్లో ప్రదర్శించిన ఫామ్‌ను కొనసాగిస్తే ఇతర జట్లకు కష్టాలు తప్పవు. మోకాలి గాయం నుంచి కోలుకొని అతను పూర్తి ఫిట్‌గా మారడం ఆ జట్టు ఆందోళనను దూరం చేసింది. మొయిన్ అలీ కూడా ఆల్‌రౌండర్‌గా చెలరేగిపోతున్నాడు. ఇంగ్లండ్ పిచ్‌లపై వోక్స్, వుడ్, ప్లంకెట్లాంటి పేసర్లు సరిగ్గా సరిపోతారు. అంతా అనుకూలం... లీగ్ దశలో జూన్ 1న జరిగే టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో ఇంగ్లండ్ తలపడుతుంది. ఈ మ్యాచ్‌తో పాటు న్యూజిలాండ్‌తో జరిగే తర్వాతి మ్యాచ్‌లో కూడా ఇంగ్లండ్‌కు మంచి విజయావకాశాలు ఉన్నాయి. చివరి మ్యాచ్‌లో ఆసీస్‌తో తలపడాల్సి ఉన్నా... ఇంగ్లండ్ గడ్డపై ఇటీవల ఆస్ట్రేలియాకు రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు కాబట్టి మోర్గాన్ సేన సెమీస్ అడుగు ఖాయంగా వేసినట్లే. ఇంగ్లండ్ జట్టు వివరాలు: మోర్గాన్ (కెప్టెన్), బెయిర్‌స్టో, బిల్లింగ్స్, హేల్స్, రషీద్, జేసన్ రాయ్, విల్లీ, మార్క్ వుడ్, మొయిన్ అలీ, జేక్ బాల్, బట్లర్ (వికెట్ కీపర్), ప్లంకెట్, రూట్, స్టోక్స్, వోక్స్. ఇంగ్లండ్ జట్టు మంచి సమతూకంతో ఉంది. 9–10 స్థానాల వరకు బ్యాటింగ్ చేయగలవారు ఆ జట్టులో ఉన్నారు. కనీసం ఐదుగురు అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ చేయగల సమర్థులు. వారిపై గెలవడం అంత సులువు కాదని మాకు భారత్‌లోనే అర్థమైంది. ఇంగ్లండ్‌ను ఓడించడం ప్రతీ జట్టుకు సవాలే. గత రెండేళ్లలో వారి క్రికెట్ చాలా మారిపోయింది. కొడితే కనీసం 330 పరుగులు కొడుతున్నారు. జట్టుగా మెరుగు కావడంలో వారి పట్టుదలను అభినందించక తప్పదు. ఏ దశలోనూ ఓటమిని అంగీకరించని విధంగామానసికంగా కూడా జట్టు చాలా ఎదిగింది. దూకుడైన ఆటతో ఇంగ్లండ్ అద్భుత ప్రదర్శన ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక సొంతగడ్డపై వారిని ఎదుర్కోవడం చాలా కష్టం. – ఇంగ్లండ్ జట్టు గురించి భారత కెప్టెన్ విరాట్ కోహ్లి వ్యాఖ్య -
మోర్గాన్‌కే కెప్టెన్సీ బాధ్యతలు
లండన్: భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌లో తలపడే ఇంగ్లండ్ జట్టును సెలక్టర్లు ప్రకటించారు. బంగ్లాదేశ్‌తో జరిగిన గత వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్న ఇయాన్ మోర్గాన్ మళ్లీ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోనున్నాడు. ఆ సిరీస్‌లో పాల్గొనని అలెక్స్ హేల్స్, జో రూట్ కూడా భారత్‌తో పోరుకు ఎంపికయ్యారు. పరిమిత ఓవర్ల సిరీస్‌లలో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య 3 వన్డేలు, 3 టి20 మ్యాచ్‌లు జరుగుతాయి. జనవరి 15న పుణేలో జరిగే తొలి వన్డేకు ముందు జనవరి 10,12 తేదీల్లో భారత్ ‘ఎ’తో ఇంగ్లండ్ ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడుతుంది. మరోవైపు టెస్టుల కోసం స్పిన్ కన్సల్టెంట్‌గా పని చేస్తున్న సక్లాయిన్ ముస్తాక్ కాంట్రాక్ట్‌ను ఇంగ్లండ్ బోర్డు పొడిగించింది. అతను వన్డే సిరీస్ వరకు కూడా జట్టుతో కొనసాగుతాడు. ఇంగ్లండ్ జట్టు: మోర్గాన్ (కెప్టెన్), మొయిన్ అలీ, జేక్ బాల్, బిల్లింగ్స, బట్లర్, డాసన్, హేల్స్, ప్లంకెట్, రషీద్, రూట్, జేసన్ రాయ్, స్టోక్స్, విల్లీ (వన్డేలు, టి20లకు), బెయిర్‌స్టో, వోక్స్ (వన్డేలకు మాత్రమే), జోర్డాన్, టైమల్ మిల్స్ (టి20లకు మాత్రమే).