ఇంగ్లండ్ ప్రపంచ రికార్డు | Hales 171; England world record 444 for 3 | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్ ప్రపంచ రికార్డు

Published Wed, Aug 31 2016 6:58 AM | Last Updated on Sat, Mar 23 2019 7:58 PM

అలెక్స్ హేల్స్ - Sakshi

అలెక్స్ హేల్స్

- పాక్‌తో వన్డేలో 444 పరుగులు   

ట్రెంట్‌బ్రిడ్‌‌జ: వన్డే క్రికెట్‌లో ఇంగ్లండ్ జట్టు కొత్త చరిత్ర సృష్టించింది. ఒక ఇన్నింగ్‌‌సలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మంగళవారం ఇక్కడ పాకిస్తాన్‌తో జరిగిన మూడో వన్డేలో ఇంగ్లండ్ 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 444 పరుగులు చేసింది. ఫలితంగా 2006లో నెదర్లాండ్స్ పై శ్రీలంక సాధించిన 443 పరుగుల రికార్డు బద్దలైంది. అలెక్స్ హేల్స్ (122 బంతుల్లో 171; 22 ఫోర్లు, 4 సిక్సర్లు) భారీ సెంచరీతో విధ్వంసం సృష్టించగా... బట్లర్ (51 బంతుల్లో 90 నాటౌట్; 7 ఫోర్లు, 7 సిక్సర్లు), జో రూట్ (86 బంతుల్లో 85; 8 ఫోర్లు) అదే స్థాయిలో చెలరేగారు.

కెప్టెన్ మోర్గాన్ (27 బంతుల్లో 57 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) కూడా అర్ధసెంచరీతో అండగా నిలిచాడు. ఇంగ్లండ్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా హేల్స్ నిలిచాడు. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ధాటికి 10 ఓవర్లలో 110 పరుగులిచ్చిన వహాబ్ రియాజ్ వన్డేల్లో రెండో అతి చెత్త ప్రదర్శన నమోదు చేశాడు. కాగా దుస్సాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ 42.4 ఓవర్లలో 275 పరుగులు చేసి.. 169 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement