one day cricket
-
ఎల్రక్టానిక్స్, గృహోపకరణాలకు జోష్!
న్యూఢిల్లీ: గృహోపకరణాలు, కన్జ్యూమర్ ఎల్రక్టానిక్ పరిశ్రమ ఈ ఏడాది అమ్మకాలపై బలమైన అంచనాలను పెట్టుకుంది. పండుగల సీజన్‌కుతోడు, వన్డే ప్రపంచ క్రికెట్ కప్ పోటీలు ఉండడంతో అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయని, క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 20 శాతం వృద్ధి నమోదు అవుతుందని అంచనా వేస్తోంది. ఏటా పండుగల సీజన్లో అధిక విక్రయాలు నమోదవుతుండడం సాధారణమే. కాకపోతే ఈ ఏడాది క్రికెట్ పోటీలు కూడా రావడం అమ్మకాలకు కలిసొస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 1987 తర్వాత పండుగల సీజన్ సమయంలో క్రికెట్ ప్రపంచ కప్ టోర్నమెంట్ రావడం ఇదే మొదటిసారి కానుంది. దీంతో టీవీలు, ముఖ్యంగా పెద్ద తెరల సెట్లు, ఆడియో ఉత్పత్తులు, సౌండ్ బార్లు, హెడ్ఫోన్లు, ఇయర్‌బడ్స్ అధికంగా అమ్ముడుపోతాయనే అంచనాలు నెలకొన్నాయి. సంప్రదాయ, చిన్న తెరల టీవీల స్థానంలో 55 అంగుళాల పెద్ద టీవీలను వినియోగదారులు కొనుగోలు చేసే అవకాశాలు ఉంటాయని కంపెనీలు భావిస్తున్నాయి. ప్రీమియం, అల్ట్రా ప్రీమియం అయిన క్యూఎల్ఈడీ, ఓఎల్ఈడీ టీవీలకు సైతం డిమాండ్ ఉంటుందని అంచనాతో ఉన్నాయి. వన్డే వరల్డ్‌కప్ అక్టోబర్ 5న ప్రారంభం అవుతుండగా, నవంబర్ 9న ముగియనుంది. ఆకర్షణీయమైన ఆఫర్లు గత సీజన్ల మాదిరే ఈ ఏడాది కూడా వడ్డీ రహిత రుణ సదుపాయం, కొత్త మోడళ్ల ఆవిష్కరణ, విస్తృత ప్రచారంతో అమ్మకాలు పెంచుకోవాలని ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల కంపెనీలు యోచిస్తున్నాయి. ప్రస్తుత పండుగల సమయంలో అమ్మకాలు గతేడాది స్థాయిలోనే ఉండొచ్చు. కాకపోతే ఈ ఏడాది ప్రీమియం ఉత్పత్తుల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నాం. వీటి అమ్మకాలు 30% పెరగొచ్చు. కాకపోతే మాస్ విభాగం (తక్కువ ధరల ఉత్పత్తులు) ఒత్తిడిని ఎదుర్కొనవచ్చు. ఈ ఏడాది ఆరంభం నుంచి ద్రవ్యోల్బణ ప్రభావం కొనసాగుతోంది. దీంతో విచక్షణారహిత వినియోగంపై ఒత్తిడి నెలకొంది. రుతుపవనాల్లో వ్యత్యాసం, కొన్ని రాష్ట్రాల్లో సరైన వర్షాలు కురవకపోవడం వ్యవసాయ ఆదాయాన్ని ప్రభావితం చేస్తుంది. ఇవి మాస్ ఉత్పత్తుల అమ్మకాలపై ప్రభావం పడేలా చేస్తాయి. కనుక ఈ విభాగంలో అమ్మకాలు ఏమంత మెరుగ్గా ఉంటాయని భావించడం లేదు’’అని గోద్రేజ్ అప్లయెన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది వివరించారు. -
రాయల్ లండన్ వన్డే కప్-2023 విజేతగా లీసెస్టర్‌షైర్
ఇంగ్లండ్ దేశవాలీ వన్డే కప్ అయిన రాయల్ లండన్ వన్డే కప్-2023ను లీసెస్టర్‌షైర్ ఎగరేసుకుపోయింది. నిన్న (సెప్టెంబర్ 16) జరిగిన ఫైనల్లో ఆ జట్టు.. హ్యాంప్‌షైర్‌ను 2 పరుగుల స్వల్ప తేడాతో ఓడించి, తొలిసారి దేశవాలీ వన్డే ఛాంపియన్‌గా అవతరించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన లీసెస్టర్‌షైర్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్.. అజేయ శతకంతో విజృంభణ ఎనిమిదో నంబర్లో బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు వికెట్‌కీపర్ హ్యారీ స్విండెల్స్ లిస్ట్-ఏ కెరీర్లో తొలి శతకంతో విజృంభించాడు. 96 బంతులు ఎదుర్కొన్న స్విండెల్స్ 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 117 పరుగులు చేసి, తన జట్టు గౌరవప్రదమైన స్కోర్ సాధించేందుకు తోడ్పడ్డాడు. స్విండెల్స్కు శ్యామ్యూల్ ఈవాన్స్ (60), కెప్టెన్ లివిస్ హిల్ (42) సహకరించారు. హ్యాంప్‌షైర్ బౌలర్లలో బార్కర్, మేసన్ క్రేన్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. హోలండ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. అనంతరం 268 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన హ్యాంప్‌షైర్ గెలుపు కోసం కడదాకా పోరాడినప్పటికీ విజయం సాధించలేకపోయింది. ఆ జట్టు నిర్ణీత ఓవర్లు ఆడి లక్ష్యానికి 3 పరుగుల దూరంలో నిలిచిపోయింది. నిర్ణీత ఓవరల్లో ఆ జట్టు 8 వికెట్ల నష్టానికి 265 పరుగులకు పరిమితమైంది. టామ్ ప్రెస్ట్ (51), లియామ్ డాసన్ (57) అర్ధసెంచరీలతో రాణించి, హ్యాంప్‌షైర్‌ను గెలిపించే ప్రయత్నం చేశారు. వీరికి బెన్ బ్రౌన్ (33), జో వెదర్లీ (40) సహకరించినప్పటికీ ప్రయోజనం లేకుండా పోయింది. లీసెస్టర్‌షైర్ బౌలర్లలో ముల్దర్, క్రిస్ రైట్, జోష్ హల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. కొలిన్ అకెర్‌మ్యాన్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. -
వరల్డ్‌కప్‌కు జట్టు ప్రకటన.. ఇంతలోనే షాకింగ్ న్యూస్
వన్డే వరల్డ్‌కప్ కోసం జట్టును ప్రకటించిన నిమిషాల వ్యవధిలోనే క్రికెట్ సౌతాఫ్రికాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాడు క్వింటన్ డికాక్ వరల్డ్ కప్ తర్వాత వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలుకనున్నట్లు ప్రకటించాడు. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా (CSA).. జట్టు ప్రకటన సందర్భంగా ధృవీకరించింది. 2013 వన్డే క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన డికాక్.. సౌతాఫ్రికా తరఫున 140 మ్యాచ్‌లు ఆడి 44.85 సగటున 96.08 స్ట్రయిక్‌రేట్‌తో 5966 పరుగులు చేశాడు. ఇందులో 17 సెంచరీలు, 29 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2016లో సెంచూరియన్ వేదికగా ఆస్ట్రేలియాపై చేసిన 178 పరుగులు అతని అత్యుత్తమ వ్యక్తిగత స్కోర్‌గా ఉంది. వికెట్‌కీపర్‌గా డికాక్ 183 క్యాచ్‌లు, 14 స్టంపింగ్‌లు చేశాడు. 30 ఏళ్ల డికాక్ 8 వన్డేల్లో సౌతాఫ్రికా జట్టుకు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. ఇందులో 3 పరాజయాలు, 4 విజయాలు సాధించాడు. డికాక్.. సౌతాఫ్రికా తరఫున గత రెండు వన్డే వరల్డ్‌కప్‌ల్లో పాల్గొన్నాడు. 17 మ్యాచ్‌ల్లో 30 సగటున 450 పరుగులు సాధించాడు. డికాక్ వన్డే రిటైర్మెంట్ అంశంపై సౌతాఫ్రికా క్రికెట్ డైరెక్టర్ ఈనాక్ ఎన్క్వే స్పందిస్తూ.. సౌతాఫ్రికా టీమ్‌ను డికాక్ ఎనలేని సేవలు చేశాడని కొనియాడాడు. డికాక్ తన అటాకింగ్ బ్యాటింగ్ స్టయిల్‌తో సౌతాఫ్రికన్ క్రికెట్లో బెంచ్ మార్క్ సెట్ చేశాడని ప్రశంసించాడు. కాగా, డికాక్ ఇదివరకే టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డే క్రికెట్ నుంచి వైదొలిగాక అతను టీ20ల్లో కొనసాగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి ప్రారంభంకానున్న వన్డే వరల్డ్‌కప్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా తమ జట్టును ఇవాళ (సెప్టెంబర్ 5) ప్రకటించింది. ఈ జట్టులో డికాక్ సహా మొత్తం 15 మంది సభ్యులకు చోటు దక్కింది. టెంబా బవుమా ఈ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్ లాంటి యువ సంచలనాలకు ఈ జట్టులో చోటు దక్కలేదు. అనుభవజ్ఞులైన వారికే సౌతాఫ్రికన్ సెలెక్టర్లు పెద్ద పీట వేశారు. వన్డే వరల్డ్‌కప్‌కు దక్షిణాఫ్రికా జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్, రస్సీ వాన్ డర్ డస్సెన్, క్వింటన్ డికాక్, ఎయిడెన్ మార్క్రమ్, రీజా హెండ్రిక్స్, కగిసో రబాడ, అన్రిచ్ నోర్జే, లుంగి ఎంగిడి, సిసండ మగాలా, గెరాల్డ్ కొయెట్జీ, మార్కో జన్సెన్, తబ్రేజ్ షంషి, కేశవ్ మహారాజ్ -
వన్డే ఫార్మాట్లో పెను సంచలనం.. 515 పరుగుల రికార్డు స్కోర్, 450 పరుగుల తేడాతో విజయం
ఐసీసీ అండర్-19 పురుషుల వరల్డ్‌కప్ అమెరికా క్వాలిఫయర్ పోటీల్లో పెను సంచలనం నమోదైంది. యూఎస్ఏ అండర్-19 జట్టు అర్జెంటీనా యువ జట్టుపై 450 పరుగుల భారీ తేడాతో రికార్డు విజయం సాధించింది. టొరొంటో వేదికగా నిన్న (ఆగస్ట్ 14) జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూఎస్ఏ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 515 పరుగుల అతి భారీ స్కోర్ చేసింది. అండర్-19 క్రికెట్లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. 2002లో ఆస్ట్రేలియా అండర్-19 టీమ్.. కెన్యాపై చేసిన 480 పరుగులే ఈ మ్యాచ్‌కు ముందు వరకు అత్యధిక టీమ్ స్కోర్‌గా రికార్డుల్లో ఉండింది. అయితే తాజాగా జరిగిన మ్యాచ్‌లో యూఎస్ఏ.. ఆసీస్ రికార్డును బ్రేక్ చేసి, అండర్-19 వన్డే ఫార్మాట్లో 500 పరుగుల మార్కును దాటిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఓవరాల్‌గా లిస్ట్-ఏ క్రికెట్లోనూ (అంతర్జాతీయ వన్డేలు, దేశవాలీ వన్డేలు) అత్యధిక స్కోర్ చేసిన జట్టుగా యూఎస్ఏ రికార్డుల్లోకెక్కింది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు లిస్ట్-ఏ క్రికెట్లో అత్యధిక టీమ్ స్కోర్ రికార్డు తమిళనాడు పేరిట ఉంది. 2022లో అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు టీమ్ రికార్డు స్థాయిలో 506 పరుగులు చేసింది. వన్డే ఫార్మాట్లో అతి భారీ విజయం.. యూఎస్ఏ నిర్ధేశించిన 516 పరుగుల అతి భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన అర్జెంటీనా.. పేసర్ ఆరిన్ నాదకర్ణి (6-0-21-6) ధాటికి 65 పరుగులకే కుప్పకూలి, 450 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. అండర్-19 క్రికెట్ వన్డే ఫార్మాట్లో ఇదే అతి భారీ విజయం కావడం విశేషం. ఈ మ్యాచ్‌కు ముందు వరకు ఈ రికార్డు ఆసీస్ పేరిట ఉండింది. 2002లో కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 430 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓవరాల్‌గా (లిస్ట్-ఏ క్రికెట్) చూసినా యూఎస్ఏ సాధించిన విజయమే వన్డే ఫార్మాట్ మొత్తంలో అతి భారీ విజయంగా నమోదైంది. ఈ మ్యాచ్‌కు ముందు వరకు లిస్ట్-ఏ క్రికెట్లో అతి భారీ విజయం రికార్డు తమిళనాడు (అరుణాచల్‌పై 435 పరుగుల తేడాతో విజయం) పేరిట ఉండింది. మ్యాచ్ విషయానికొస్తే.. అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లో భవ్య మెహతా (136), రిషి రమేశ్ (100) సెంచరీలతో.. ప్రణవ్ చట్టిపలాయమ్ (61), అర్జున్ మహేశ్ (67) అర్ధసెంచరీలతో చెలరేగడంతో యూఎస్ఏ టీమ్ రికార్డు స్కోర్ చేసింది. యూఎస్ఏ టీమ్‌లో అమోఘ్ ఆరేపల్లి (48), ఉత్కర్ష్ శ్రీవత్సవ (45) కూడా రాణించారు. భారీ లక్ష్య ఛేదనలో చేతులెత్తేసిన అర్జెంటీనా 19.5 ఓవర్లలో 65 పరుగులకు ఆలౌటైంది. నాదకర్ణితో పాటు ఆర్యన్ సతీశ్ (2), పార్థ్ పటేల్ (1), ఆర్యన్ బత్రా (1) వికెట్లు పడగొట్టారు. అర్జెంటీనా ఇన్నింగ్స్‌లో థియో (18) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. -
చరిత్ర సృష్టించిన నేపాల్ క్రికెటర్.. ప్రపంచంలోనే తొలి బౌలర్‌గా
కీర్తిపూర్ (నేపాల్): అంతర్జాతీయ వన్డేల్లో నేపాల్ స్పిన్నర్ సందీప్ లమిచానె అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా సందీప్ లమిచానె ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రీమియర్ కప్ టోర్నీలో భాగంగా ఒమన్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సందీప్ మూడు వికెట్లు తీశాడు. తద్వారా ఈ ఘనతను సందీప్ పేరిట లిఖించుకున్నాడు. 100 వికెట్ల మైలు రాయిని సందీప్ కేవలం 42 మ్యాచ్‌ల్లోనే అందుకున్నాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (44 మ్యాచ్‌లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో రషీద్ రికార్డును సందీప్ బ్రేక్ చేశాడు. చదవండి: ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లకు ధోని సలహాలు.. జ్ఞానోదయం కలిగేనా! -
వన్డేల్లో శ్రీలంక అత్యంత చెత్త రికార్డు.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఈడెన్ గార్డెన్స్ వేదికగా టీమిండియాతో జరిన రెండో వన్డేలో నాలుగు వికెట్ల తేడాతో శ్రీలంక పరాజాయం పాలైంది. దీంతో అత్యంత చెత్త రికార్డును శ్రీలంక తమ పేరిట లిఖించుకుంది. అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ల్లో అత్యధిక పరాజయాలు చవిచూసిన జట్టుగా శ్రీలంక నిలిచింది. శ్రీలంక ఇప్పటివరకు 880 మ్యాచ్‌లు ఆడగా.. అందులో 437 వన్డేల్లో ఓటమిపాలైంది. తద్వారా ఈ చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. కాగా ఇప్పటివరకు ఈ చెత్త రికార్డు టీమిండియా పేరిట ఉండేది. భారత్ ఇప్పటి వరకు 436 వన్డేల్లో ఓటమి చవిచూసింది. తాజా ఓటమితో భారత్‌ను లంక జట్టు అధిగిమించింది. ఇక మూడో 419 ఓటములతో పాకిస్తాన్ మూడో స్థానంలో కొనసాగుతుంది. ఆస్ట్రేలియా రికార్డును సమం చేసిన భారత్ ఇక ఇదే మ్యాచ్‌లో టీమిండియా కూడా ఓ అరుదైన రికార్డు సాధించింది. లంకపై రెండో వన్డేలో గెలుపొందిన రోహిత్ సేన.. వన్డేల్లో ఒక ప్రత్యర్థి జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా ఆస్ట్రేలియాతో సంయుక్తంగా నిలిచింది. శ్రీలంకపై అత్యధికంగా 95 వన్డేల్లో భారత్ గెలవగా.. ఆస్ట్రేలియా కూడా న్యూజిలాండ్‌పై ఇప్పటివరకు 95 వన్డేల్లో విజయం సాధించింది. చదవండి: Virat Kohli: ఇషాన్‌తో కలిసి డాన్స్ అదరగొట్టిన కోహ్లి! వీడియో వైరల్ -
'అతడు చాలా కాలం టీమిండియాకు ఆడతాడు.. కెప్టెన్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు'
మంగళవారం(జనవరి 3) శ్రీలంకతో జరిగిన తొలి టీ20 టీమిండియా యువ ఆటగాడు శుబ్మాన్ గిల్ తన టీ20 అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అయితే తన డెబ్యూ మ్యాచ్‌లోనే గిల్ నిరాశ పరిచాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చిన అతడు కేవలం 7 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఈ నేపథ్యంలో గిల్‌పై భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కీలక వాఖ్యలు చేశాడు. గిల్ ఆటతీరు టీ20లకు కాకుండా లాంగ్ ఫార్మాట్(టెస్టులు, వన్డేలు)కు మాత్రమే సరిపోతుందని చోప్రా అభిప్రాయపడ్డాడు. "శుబ్మాన్ గిల్‌కు ఇది చాలా ముఖ్యమైన సిరీస్. అతడు తన అరంగేట్ర సిరీస్‌లో మెరుగ్గా రాణిస్తే.. రాబోయే మ్యాచ్‌ల్లో అవకాశం లభిస్తుంది. అయితే నా దృష్టిలో మాత్రం గిల్ ఎప్పటికీ లాంగ్ ఫార్మాట్ ఆటగాడే. ఎందుకంటే అతడు ఆడే విధానం టీ20 క్రికెట్‌కు సెట్‌కాదు. గిల్‌కు టెస్టులు, వన్డేల్లో అద్భుతమైన రికార్డు ఉంది. శుబ్మాన్ భవిష్యత్తులో టెస్టు క్రికెట్లో కెప్టెన్ కూడా కావచ్చు. అదే విధంగా అతడికి చాలా కాలం పాటు భారత్ తరఫున వన్డే క్రికెట్ ఆడే సత్తా ఉంది. కాబట్టి వన్డేల్లో గిల్ కెప్టెన్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు" అని ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. చదవండి: PAK vs NZ: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. పాక్ జట్టు ప్రకటన! స్టార్ పేసర్ వచ్చేశాడు -
ఇషాన్ కిషన్ విధ్వంసం.. డబుల్ సెంచరీతో చెలరేగిన జార్ఖండ్ డైన్‌మేట్
బంగ్లాదేశ్‌తో మూడో వన్డేలో టీమిండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ అద్భుతమైన డబుల్ సెంచరీతో మెరిశాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ స్థానంలో బరిలోకి దిగిన కిషన్.. బంగ్లాదేశ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ మ్యాచ్‌లో 131 బంతులు ఎదుర్కొన్న కిషన్ 23 ఫోర్లు, 10 సిక్స్‌లతో 210 పరుగులు చేశాడు. కాగా కిషన్ తన డబుల్ సెంచరీని కేవలం 126 బంతుల్లోనే పూర్తి చేశాడు. కిషన్ తన కెరీర్లో తొలి సెంచరీనే ద్విశతకంగా మలుచుకున్నాడు. ఇక వన్డేల్లో డబుల్ సెంచరీ చేసిన నాలుగో భారత క్రికెటర్‌గా కిషన్ రికార్డులకెక్కాడు. అంతకుముందు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్ శర్మ ఈ ఘనతను సాధించారు. ఇక ఓవరాల్‌గా ఈ రికార్డు సాధించిన జాబితాలో కిషాన్ ఏడో స్థానంలో నిలిచాడు. చదవండి: IND vs BAN: బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్.. 12 ఏళ్ల తర్వాత భారత బౌలర్ రీ ఎంట్రీ! -
మహ్మద్ సిరాజ్ అరుదైన రికార్డు.. తొలి భారత బౌలర్‌గా
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ అరుదైన రికార్డు సాధించాడు. 2022 ఏడాది వన్డేల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్‌గా సిరాజ్ నిలిచాడు. బంగ్లాదేశ్‌తో రెండో వన్డేలో అనముల్ హక్ ఔట్ చేసిన సిరాజ్.. ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది వన్డేల్లో ఇప్పటి వరకు 14 మ్యాచ్‌లు ఆడిన సిరాజ్ 23 వికెట్లు సాధించాడు. ఇక అంతకుముందు ఈ రికార్డు భారత స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో చాహల్ రికార్డును సిరాజ్ బ్రేక్ చేశాడు. ఈ ఏడాది వన్డేల్లో 14 మ్యాచ్‌లు ఆడిన చాహల్ 21 వికెట్లు పడగొట్టాడు. సెంచరీతో చెలరేగిన మెహాదీ హసన్ ఇక కీలకమైన రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 271 పరుగులు చేసింది. కేవలం 69 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్‌ను మహ్మదుల్లా, మెహాదీ హసన్ అదుకున్నారు. ఏడో వికెట్‌కు వీరిద్దరూ కలిసి 147 పరుగుల రికార్డు బాగస్వామ్యం నెలకొల్పారు. ఇక ఈ మ్యాచ్‌లో మెహాదీ హసన్ ఆజేయ శతకంతో చెలరేగాడు. 83 బంతులు ఎదుర్కొన్న మెహాదీ హసన్ 8 ఫోర్లు, 4 సిక్స్‌లతో 100 పరుగులు సాధించాడు. అదే విధంగా మెహాదీ హసన్ కూడా 77 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు, ఉమ్రాన్ మాలిక్, సిరాజ్ తలా రెండు వికెట్లు సాధించారు. చదవండి: Cristiano Ronaldo: రొనాల్డోకు ఘోర అవమానం? పాపం.. బెంచ్ మీద కూర్చుని నిర్లిప్తతతో.. సిగ్గుచేటు అంటూ.. -
వన్డే చరిత్రలో తొలి వికెట్ టేకర్.. ఆస్ట్రేలియా మాజీ బౌలర్ కన్ను మూత
వన్డే చరిత్రలో తొలి వికెట్ టేకర్.. ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ అలాన్ థామ్సన్ (76) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న థామ్సన్.. మంగళవారం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని అతని సోదరుడు ట్విటర్ వేదికగా ప్రకటించాడు. "మా అన్నయ్య, మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ అలాన్ థామ్సన్ మరణించారు. కొన్ని రోజులు కిందట అతనికి హిప్(తుంటి గాయం) సర్జరీ జరిగింది. కానీ అన్నయ్య ఆరోగ్య పరిస్థితి మెరుగపడలేదు. అఖరికి అలాన్ మమ్మల్ని విడిచి పెట్టి వెళ్లిపోయారు" అని అతడి సోదరుడు ట్విటర్లో పేర్కొన్నారు. కాగా విక్టోరియాకు చెందిన అలాన్ ఆస్ట్రేలియా తరపున ఒక వన్డే, నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడారు. నాలుగు టెస్టుల్లో 12 వికెట్లు అలాన్ సాధించారు. అదే విధంగా అతని బౌలింగ్ యాక్షన్ కూడా అందరికంటే భిన్నంగా ఉంటుంది. అందుకే అతనిని ముద్దుగా "ఫ్రాగీ" అని పిలుచుకోనేవారు. ఇక ఫస్ట్ క్లాస్ క్రికెట్లో విక్టోరియా తరపున 44 మ్యాచ్‌లు ఆడిన అలాన్.. 184 వికెట్లు పడగొట్టారు. వన్డే క్రికెట్ చరిత్రలో తొలి వికెట్ ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలో 1971 జనవరి 5న ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలి వికెట్ ఆసీస్‌కు ప్రాతినిద్యం వహించిన అలాన్ థామ్సన్ పడగొట్టారు. తద్వారా వన్డేల్లో తొలి వికెట్ సాధించిన బౌలర్‌గా అలాన్ నిలిచాడు. ఈ మ్యాచ్‌లో 8 ఓవర్లు బౌలింగ్ చేసిన అలాన్ 22 పరుగులిచ్చి ఒక్క వికెట్ సాధించారు. చదవండి: T20 WC 2022: బంగ్లాదేశ్‌తో కీలక మ్యాచ్.. టీమిండియా అభిమానులకు గుడ్ న్యూస్ -
వన్డేల్లో గిల్ అరుదైన రికార్డు.. తొలి భారత ఆటగాడిగా
టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ అంతర్జాతీయ వన్డేల్లో అరుదైన రికార్డు సాధించాడు. వన్డే క్రికెట్లో అత్యధిక వేగంగా 500 పరుగులు సాధించిన భారత ఆటగాడిగా గిల్ నిలిచాడు. లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో 3 పరుగుల చేసిన గిల్.. ఈ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. గిల్ 10 ఇన్నింగ్స్‌లో 500 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. కాగా ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ ఆటగాడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ పేరిట ఉండేది. సిద్దూ 11 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనతను సాధించాడు. తాజా మ్యాచ్‌తో సిద్దూ రికార్డును గిల్ బద్దలు కొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి వన్డేలో ప్రోటీస్ చేతిలో భారత్ 9 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. ప్రోటీస్ బ్యాటర్లలో మిల్లర్(74 నటౌట్), క్లాసెన్(74) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ నిర్ణీత ఓవర్లలో 8వికెట్లు కోల్పోయి 240 పరుగులకు పరిమితమైంది. టీమిండియా బ్యాటర్లలో సంజూ శాంసన్(86) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చదవండి: IND vs SA: 'మేము అలా చేయలేకపోయాం.. అందుకే ఓడిపోయాం! సంజూ గ్రేట్' -
గండం గట్టెక్కాడు! మూడేళ్ల నిరీక్షణకు తెర.. సెంచరీతో చెలరేగిన శుబ్‌మన్ గిల్
Ind Vs Zim 3rd ODI- Shubman Gill Century: హరారే వేదికగా జింబాబ్వేతో మూడో వన్డేలో టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ అద్భుతమైన సెంచరీతో చేలరేగాడు. తద్వారా గిల్ తన అంతర్జాతీయ కెరీర్లో తొలి సెంచరీని నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో అతడు 82 బంతుల్లో శతకాన్ని పూర్తి చేశాడు. ఇక ఓవరాల్‌గా 97 బంతుల్లో 130 పరుగులు సాధించిన గిల్.. భారత్ భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 15 ఫోర్లు, సిక్స్ ఉన్నాయి. ఇక టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో గిల్ సెంచరీతో మెరవగా.. ఇషాన్ కిషన్(50), ధావన్(40) పరుగులతో రాణించారు. జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఎవాన్స్ 5 వికెట్లు పడగొట్టగా.. న్యౌచీ, జోంగ్వే తలా వికెట్ సాధించారు. మూడేళ్ల నిరీక్షణకు తెర గిల్ తన తొలి అంతర్జాతీయ సెంచరీ కోసం గత మూడేళ్లుగా ఎదురు చూస్తున్నాడు. చాలా మ్యాచ్‌ల్లో ఆర్ధ శతకాలతో మెరిసిన గిల్ వాటిని సెంచరీలుగా మలచడంలో విఫలమయ్యాడు. అయితే కొన్ని మ్యాచ్‌ల్లో అతడిని దురదృష్టం కూడా వెంటాడింది. ముఖ్యంగా ఈ ఏడాది విండీస్‌తో జరిగిన మూడో వన్డేలో 98 పరుగులు చేసి సెంచరీకి చేరువైన క్రమంలో వరుణుడు అడ్డంకిగా మారాడు. దీంతో అతడు తన తొలి సెంచరీ నమోదు చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. అయితే ఈ సారి మాత్రం గిల్ తన కలను నెరవేర్చుకున్నాడు. అద్భుతమైన ఫామ్‌లో గిల్ కాగా ఇటీవల కాలంలో గిల్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. విండీస్‌తో వన్డే సిరీస్‌లో అదరగొట్టిన గిల్... ఇప్పుడు జింబాబ్వేపై కూడా అదే దూకుడు కొనసాగిస్తున్నాడు. జింబాబ్వేతో మూడు వన్డేల సిరీస్‌లో 245 పరుగులు సాధించిన గిల్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 2019లో న్యూజిలాండ్‌తో వన్డే మ్యాచ్‌తో గిల్ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా గడ్డ మీద 2020 నాటి సిరీస్‌తో టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఇక తన కెరీర్లో ఇప్పటి వరకు 9 వన్డేలో ఆడిన గిల్ 499 పరుగులు సాధించాడు. చదవండి: Ind Vs Zim 3rd ODI: అలాంటప్పుడు ఎందుకు ఎంపిక చేసినట్లు? ఇది నిజంగా అన్యాయం! కనీసం ఇప్పుడైనా.. -
వన్డే క్రికెట్‌కు స్టోక్స్ గుడ్‌బై.. కారణాలు ఇవేనా..?
ఇంగ్లండ్ వన్డే వరల్డ్‌కప్ హీరో, టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటన అభిమానులను విస్మయానికి గురిచేసింది. దక్షిణాఫ్రికాతో మంగళవారం జరగనున్న తొలి వన్డే తనకు ఆఖరి మ్యాచ్ అని స్టోక్స్ తెలిపాడు. ఈ మేరకు తన నిర్ణయాన్ని ట్విటర్ వేదికగా ప్రకటించాడు. "మూడు ఫార్మాట్లలో ఆడటం నాకు చాలా కష్టంగా ఉంది. తీరిక లేని షెడ్యూల్ కారణంగా మూడు ఫార్మాట్లలో ఆడటానికి నా శరీరం సహకరించడం లేదు. అదే విధంగా వన్డే ఫార్మాట్లో వంద శాతం న్యాయం చేయలేపోతున్నాను. కాబట్టి నా స్థానంలో మరో ఆటగాడికి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నాను. మరో ఆటగాడు నాలాగే ఇంగ్లండ్ క్రికెట్‌తో అపురూపమైన జ్ఞాపకాలను సృష్టించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి నా 11 ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలకాలి అని అనుకుంటునున్నాను. ఇకపై నా దృష్టింతా టెస్టు క్రికెట్‌పై పెట్టాలని భావిస్తున్నా" అని స్టోక్స్ తన రిటైర్మెంట్ నోట్లో రాసుకొచ్చాడు. కాగా స్టోక్స్ 31 ఏళ్ల వయస్సులోనే వన్డే క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంపై ప్రస్తుతం తెగ చర్చ నడుస్తోంది. మూడు ఫార్మాట్లలో ఆడటం వల్ల ప్లేయర్ శరీరంపై భారం పడుతుందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రానున్న రోజుల్లో చాలా మంది స్టార్ ఆటగాళ్లు వన్డే క్రికెట్ నుంచి తప్పుకుంటారని మాజీలు, క్రికెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐసీసీ, ఆయా దేశ క్రికెట్ బోర్డులకు స్టోక్స్ రిటైర్మెంట్ ఒక హెచ్చరిక వంటిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. స్టోక్స్ వన్డే క్రికెట్ నుంచి తప్పుకోవడానికి గల నాలుగు కారణాలను పరిశీలిద్దాం. బిజీ బిజీ షెడ్యూల్.. అధిక ఒత్తిడి రాబోయే రోజుల్లో ఐసీసీ అనేక టోర్నమెంట్లను నిర్వహించనుంది. ఫ్యూచర్ టూర్ పోగ్రామ్(2020-2023)లో భాగంగా క్యాలెండర్‌ను ముందుగానే సిద్దం చేస్తుంది. దీంతో ఆటగాళ్లపై ఒత్తిడి పెరిగి శారీరకంగా, మానసికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మరోవైపు అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు టీ 20 ఫ్రాంఛైజీ లీగ్‌లకు కూడా ప్రాధాన్యత పెరుగుతోంది. కాబట్టి ఆటగాళ్లకు విశ్రాంతి తీసుకునే సమయమే దొరకడం లేదు. చాలా మంది ఆటగాళ్ళు వన్డేలకు విడ్కోలు..! ప్రస్తుత బిజీ షెడ్యూల్ వల్ల రాబోయే రోజుల్లో మరింత మంది ఆటగాళ్లు వన్డేలకు గుడ్‌బై చెప్పే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇదే విషయాన్ని తాజాగా టీమిండియా స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా ప్రస్తావించాడు. ప్రస్తుత ఐసీసీ షెడ్యూల్‌ను సవరించకపోతే చాలా మంది ఆటగాళ్లు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని అశూ అన్నాడు. కాగా ఈ ఫిక్స్డ్ షెడ్యూల్ కారణంగా ఆటగాళ్లు ఒక ఫార్మాట్‌పై దృష్టి సారించడానికి మరో ఫార్మాట్‌కు దూరంగా ఉన్న ఉదాహరణలు గతంలో చాలానే ఉన్నాయి. టీ20 క్రికెట్ పెరగడం వల్ల వన్డేలకు గుడ్‌బై గత కొన్ని ఏళ్లుగా టీ20 క్రికెట్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరగడంతో వన్డే క్రికెట్ ఔచిత్యాన్ని కోల్పోతోంది. చాలా మంది ఆటగాళ్లు టీ20 కెరీర్‌పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. కాబట్టి వన్డే, టెస్టు ఫార్మాట్ల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారు. ఐపీఎల్, బీబీఎల్, సీపీఎల్ వంటి టీ20 ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌ల వల్ల కూడా ఆటగాళ్లకు వన్డే క్రికెట్‌పై మక్కువ పోతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. ఆటగాళ్లపై ఐసీసీ వన్డే సూపర్ లీగ్ ప్రభావం ప్రస్తుతం ప్రపంచ కప్ అర్హత ఐసీసీ వన్డే సూపర్ లీగ్‌పై ఆధారపడి ఉంది. వన్డే సూపర్ లీగ్‌లో ర్యాంకింగ్‌లు, అర్హతలను నిర్ణయించడానికి ఐసీసీ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ముందుగానే ప్రీ షెడ్యూల్ చేస్తుంది. మొదటి 8 స్థానాల్లో నిలిచిన జట్లు వన్డే ప్రపంచ కప్-2023కు నేరుగా అర్హత సాధిస్తాయి. కాబట్టి టాప్ 8లో నిలిచి వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించాలని అన్ని జట్లు భావిస్తున్నాయి. స్వదేశంలోనే కాకుండా విదేశీ పర్యటనలలో కూడా జట్లు బిజీ బిజీ గడుపుతున్నాయి. ఈ క్రమంలో ఆటగాళ్లు తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. దీంతో చాలా మంది ఆటగాళ్లు తమ ఆరోగ్యం దృష్ట్యా వన్డేలకు గుడ్‌బై చెప్పాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే స్టోక్స్ సైతం ఈ అనూహ్య నిర్ణయం తీసుకుని ఉంటాడనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చదవండి: Virat Kohli: ఒక్క 20 నిమిషాలు చాలు.. కోహ్లి సమస్యను పరిష్కరిస్తా! నేను కూడా ఆ ఇబ్బంది ఎదుర్కొన్నా! ❤️🏴 pic.twitter.com/xTS5oNfN2j — Ben Stokes (@benstokes38) July 18, 2022 -
వన్డేల్లో చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్.. 498 పరుగుల భారీ స్కోర్
వన్డేల్లో ఇంగ్లండ్ సరికొత్త చరిత్ర సృష్టించింది. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోర్‌ను ఇంగ్లండ్ నమోదు చేసింది. ఆమ్స్టెల్వీన్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరగిన తొలి వన్డేలో ఇంగ్లండ్ 4 వికెట్లు కోల్పోయి 498 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. తద్వారా వన్డే క్రికెట్ చరిత్రలో తన పేరిట ఉన్న అత్యధిక స్కోర్ రికార్డును ఇంగ్లండ్ అధిగమించింది. అంతకుముందు 2018లో ఆస్ట్రేలియాపై ఇంగ్లండ్‌పై 481 పరుగులు చేసింది. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ ఆదిలోనే ఓపెనర్ రాయ్(1) వికెట్ కోల్పోయింది. అనంతరం ఫిలిప్ సాల్ట్(122), డేవిడ్ మలాన్(125)తో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మలన్, సాల్ట్ రెండో వికెట్‌కు 170 బంతుల్లో 222 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. సాల్ట్ ఔటయ్యక క్రీజులోకి వచ్చిన బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్సర్లు, ఫోర్లతో ప్రత్యర్ధి బౌలర్లపై విరుచకుపడ్డాడు. ఈ క్రమంలోనే బట్లర్ కేవలం 47 బంతులలోనే సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో 70 బంతులలో 162 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడి ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు,14 సిక్స్‌లు ఉన్నాయి. అదే విధంగా విడ్ మలన్ (125) పరుగులతో రాణించాడు. ఇక అఖరిలో లివింగ్ స్టోన్(66 నాటౌట్; 22 బంతుల్లో 6x4, 6x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఈ మ్యాచ్‌లో మొత్తం 26 సిక్సర్లు, 36 బౌండరీలు నమోదయ్యాయి. చదవండి: Tim Paine Thanks Rahane: 'థాంక్యూ రహానే.. కోహ్లిని రనౌట్ చేయకుంటే గెలిచేవాళ్లం కాదు' -
PAK vs WI: వన్డేల్లో చరిత్ర సృష్టించిన పాక్ కెప్టెన్.. తొలి ఆటగాడిగా..!
పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం వన్డే క్రికెట్లో చరిత్ర సృష్టించాడు. ముల్తాన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో బాబర్ సెంచరీతో చెలరేగాడు. కాగా ఏడాదిలో వన్డేల్లో బాబర్‌కు ఇది వరుసగా మూడో సెంచరీ కావడం గమనార్హం. ఈ క్రమంలో బాబర్ అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్ చరిత్రలో రెండుసార్లు వరుసగా హ్యాట్రిక్ సెంచరీలు సాధించిన తొలి బ్యాటర్‌గా బాబర్ ఆజాం రికార్డులకెక్కాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్‌లో అఖరి రెండు మ్యాచ్‌ల్లో బాబర్ వరుసగా సెంచరీలు సాధించాడు. ఆసీస్‌తో వన్డే సిరీస్ తర్వాత స్వదేశంలో విండీస్‌తో పాక్ తలపడతోంది. విండీస్‌తో ఆడిన తొలి వన్డేలోనే బాబర్ సెంచరీ సాధించాడు. తద్వారా ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక 2016లో యూఏఈ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో తొలి సారిగా బాబర్ వరుసగా మూడు సెంచరీలు సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ముల్తాన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో విండీస్‌పై పాక్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. విండీస్ బ్యాటర్లలో షాయీ హోప్ 127,బ్రూక్స్ 70 పరుగులతో రాణించారు. అనంతరం 306 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాక్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ బాబర్ ఆజం(103) సెంచరీతో చెలరేగాడు. పాకిస్తాన్ వర్సెస్ వెస్టిండీస్ మొదటి వన్డే: ♦టాస్- వెస్టిండీస్- బ్యాటింగ్ ♦వెస్టిండీస్ స్కోరు: 305/8 (50) ♦పాకిస్తాన్ స్కోరు: 306/5 (49.2) చదవండి: SL Vs Aus: అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా! మా ఓటమికి కారణం అదే! The moment @babarazam258 etched his name in the record books 🙏#PAKvWI | #KhelAbhiBaqiHai pic.twitter.com/D7caU729F3 — Pakistan Cricket (@TheRealPCB) June 8, 2022 -
ఒక్కసారి కూడా డకౌట్ కాని ఏకైక భారత ఆటగాడు..
న్యూఢిల్లీ: వన్డే క్రికెట్లో డకౌట్ కాకుండా కెరీర్‌ను ముగించిన ఆటగాళ్లను క్రికెట్ చరిత్రలో చాలా అరుదుగా చూస్తాం. ఈ అరుదైన జాబితాలో భారత్ మాజీ క్రికెటర్, 1983 వన్డే ప్రపంచకప్‌లో కపిల్ డెవిల్స్ జట్టు సభ్యుడు దివంగత యశ్పాల్ శర్మ ఉండటం విశేషం. భారత్ తరఫున 42 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడిన యశ్పాల్.. 28.48 సగటుతో 4 అర్ధశతకాల సాయంతో 883 పరుగులు చేశాడు. అయితే ఈ క్రమంలో ఆయన ఒక్కటంటే ఒక్కసారి కూడా డకౌట్ కాలేదు. తన కెరీర్లో పాకిస్తాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియాకు చెందిన దిగ్గజ బౌలర్లను ఎదుర్కొన్న యశ్పాల్ ఒక్కసారి కూడా సున్నా పరుగులకు వెనుదిరగలేదు. ఇలా డకౌట్ కాకుండా కనీసం 40కిపైగా వన్డే మ్యాచ్‌లు ఆడి కెరీర్‌ను ముగించిన క్రికెటర్లు వన్డే క్రికెట్ చరిత్రలో మరో ఎనిమిది మంది మాత్రమే ఉన్నారు. వీరిలో దక్షిణాఫ్రికా, ఆసీస్ మాజీ ఆటగాడు కెప్లెర్ వెసెల్స్ 109 మ్యాచ్‌ల్లో ఒక్క డకౌట్ కూడా లేకుండా కెరీర్ ముగించగా, అతని తర్వాతి స్థానంలో స్కాట్లాండ్ ప్లేయర్ మాథ్యూ స్కాట్(54), ఆసీస్ ఆటగాడు నాథన్ హౌరిట్జ్(58 మ్యాచ్‌లు), పాక్ ఆటగాడు వసీం బారి(51), దక్షిణాఫ్రికాకు చెందిన జాక్ రుడాల్ఫ్(45), దక్షిణాఫ్రికా క్రిస్ మోరిస్(42), శ్రీలంక ప్లేయర్ డి డిసిల్వా(41), సౌతాఫ్రికా పీటర్ కిర్‌స్టెన్(40), ఇంగ్లండ్ రసెల్(40) వరుసగా ఉన్నారు. కాగా, ఈ అరుదైన ఘనత సాధించిన ఏకైక భారత ఆటగాడు కేవలం యశ్పాల్ శర్మనే కావడం మరో విశేషం. ఇదిలా ఉంటే, ఇవాళ ఉదయం గుండెపోటు రావడంతో యశ్పాల్ శర్మ ఇంట్లోనే తుదిశ్వాస విడిచారు. 1978లో పాకిస్తాన్‌తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన యశ్పాల్.. 1983 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టులో ముఖ్యుడు. ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లో ఆయన 61 పరగులు చేసి జట్టును ఫైనల్స్‌కు చేర్చాడు. యశ్పాల్ టీమిండియా తరపున 1978- 83 మధ్య కాలంలో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్‌గా కీలకపాత్ర పోషించాడు. అయితే, 1985లో తలకు గాయం కావడంతో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. -
రోహిత్, పంత్, సుందర్‌లకు విశ్రాంతి..!
న్యూఢిల్లీ: గతేడాది ఐపీఎల్ సీజన్ కోసం దుబాయ్ వెళ్లిన టీమిండియా ఆటగాళ్లు నిర్విరామంగా క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో కొందరు ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలని జట్టు యాజమాన్యం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లండ్‌తో జరుగబోయే మూడు వన్డేల సిరీస్ కోసం టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మతో పాటు రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్‌లతో సహా మొత్తం 8 మంది ఆటగాళ్లకు విశ్రాంతినివ్వనున్నట్లు సమాచారం. కరోనా బ్రేక్ అనంతరం క్రికెట్ రిస్టార్ట్ అయినప్పటి నుంచి టీమిండియా ఆటగాళ్లు బయో బబుల్‌కే పరిమితం కావడం వల్ల తీవ్రమైన మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదమున్నందున ఈమేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఐపీఎల్ 2020 సీజన్ కోసం దుబాయ్‌కు వెళ్లిన భారత ఆటగాళ్లు.. అక్కడి నుంచే నేరుగా ఆస్ట్రేలియాలో పర్యటించారు. అనంతరం స్వదేశానికి తిరిగి వచ్చాక స్వల్ప విరామం తీసుకున్నా.. ఆ వెంటనే ఇంగ్లండ్‌తో సిరీస్‌కు సన్నదమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఐపీఎల్ 2021 సీజన్‌కు ముందు స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలని భారత జట్టు యాజమాన్యం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. స్పెషల్ రిక్వెస్ట్ మీద పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ఇదివరకే జట్టు నుంచి తప్పుకోగా తాజాగా మరికొందరు స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించాలని టీం మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లు సమాచారం. బుమ్రా నాలుగో టెస్టు సహా వన్డే, టీ20 సిరీస్‌లకు సైతం దూరం కానున్నాడు. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ మార్చి 23, 26, 28 తేదీల్లో జరగనున్న సంగతి తెలిసిందే. -
ఏ స్థానంలోనైనా సిద్ధం: రహానే
న్యూఢిల్లీ: టెస్ట్ క్రికెట్లో టీమిండియా ఆటగాడు అజింక్యా రహానే తన అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. కానీ గత రెండేళ్లుగా వన్డే జట్టు తరుపున ఆడే అవకాశం రహానేకు రాలేదు. తన కెరీర్లో ఇప్పటివరకు మొత్తం 90 వన్డేలాడగా, రహానే(35.26) బ్యాటింగ్ సగటుతో 2962 పరుగులు సాధించాడు. 2018లో దక్షిణాఫ్రికాతో వన్డే మ్యాచ్ తర్వాత తిరిగి వన్డే జట్టులో ఆడలేదు. ఓ టీవీ చానెల్ ఇంటర్వ్యూలో రహానే స్పందిస్తు.. తాను వన్డే జట్టులో నెంబర్ 4లో కానీ ఏ స్థానంలోనైనా బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపాడు. కానీ తాను బ్యాటింగ్ చేయడానికి నెంబర్ 1లేదా నెంబర్ 4లో ఎంపిక చేసుకోమంటే.. నెంబర్ 1లోనే ఆడడానికి ఇష్టపడతానని అన్నాడు. తాను వన్డే జట్టులో తిరిగి ఆడతానని రహానే దీమా వ్యక్తం చేశాడు. వన్డే జట్టులో ఆడే అవకాశం ఎప్పుడు వస్తుందో ఎవరు చెప్పలేరని, కానీ మానసికంగా అన్ని ఫార్మాట్లలో రాణించడానికి సిద్ధమని అజింక్యా రహానే పేర్కొన్నాడు. (చదవండి: నెల రోజుల ప్రాక్టీస్ ఉండాల్సిందే!) -
రెండో వన్డే : విండీస్‌పై భారత్ విజయం
-
లంకదే సిరీస్
కొలంబో : రెండో వన్డేలో బంగ్లాను శ్రీలంక ఆల్‌రౌండ్ దెబ్బకొట్టింది. దీంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో లంక 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై జయభేరి మోగించింది. మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు వన్డేల సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. మొదట బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. ముష్ఫికర్ రహీమ్ (98 నాటౌట్; 6 ఫోర్లు, 1 సిక్స్) వీరోచిత పోరాటం చేశాడు. 117 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన బంగ్లాను మెహదీ హసన్ (43; 6 ఫోర్లు) కలిసి ఏడో వికెట్‌కు 84 పరుగులు జోడించాడు. తర్వాత లంక 44.4 ఓవర్లలో మూడే వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్ అవిష్క ఫెర్నాండో (75 బంతుల్లో 82; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), మాథ్యూస్ (57 బంతుల్లో 52 నాటౌట్; 7 ఫోర్లు) రాణించారు. కుశాల్ మెండిస్ (41 నాటౌట్; 4 ఫోర్లు) మెరుగ్గా ఆడాడు. ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే బుధవారం ఇక్కడే జరుగుతుంది. -
బెట్టింగ్ బంగార్రాజులు
సాక్షి, రాజాం(శ్రీకాకుళం) : బెట్టింగ్ మాఫియా కన్ను పట్టణాలు, పల్లెలపై పడింది. మెట్రో నగరాల్లో వీరి కార్యకలాపాలకు అక్కడ పోలీసు యంత్రాంగం చెక్ పెడుతుండటంతో ఇటువైపు దృష్టిసారించింది. ఇటీవల శ్రీకాకుళం, రాజాంలో బయటపడిన బెట్టింగ్ బాగోతాలే ఇందుకు బలం చేకూరుస్తున్నాయి. ఇక్కడ యువతలో క్రికెట్ మోజును బలహీనతగా చేసుకున్న ఓ ముఠా ప్రత్యేక యాప్ ద్వారా బెట్టింగ్ రొంపిలోకి దించుతోంది. దీంతో ఆర్థికంగా చితికిపోయి జీవితాలను నాశనం చేసుకునే స్థితికి దిగజార్చుతోంది. రాజాంలో గుట్టుగా సాగిస్తున్న బెట్టింగ్ వ్యవహారాన్ని ఇటీవల పోలీసులు రట్టు చేశారు. ప్రపంచకప్ సెమీఫైనల్ –2 మ్యాచ్ సందర్భంగా ఐదుగురు బెట్టింగ్ రాయుళ్లను ఈ నెల 11న అదుపులోకి తీసుకోగా, పరారైన మరో ఐదుగురిని ఈనెల 17న అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ. 5.05 లక్షలు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసిన విషయం విదితమే. యువతే టార్గెట్..... ప్రస్తుతం యువత ప్రపంచీకరణ మోజులోపడింది. డబ్బులు ఈజీగా సంపాదించే ఆలోచనలోనే బెట్టింగ్ ముఠా వలలో చిక్కుతోంది. ఇదే అదునుగా చేసుకుని వందకు వెయ్యి, వెయ్యికి పది వేలు, రూ. పది వేలకు రూ.లక్ష అంటూ పదింతలు సంపాదించవచ్చునని ఆశపెడుతోంది. మ్యాచ్ ఏదైనా బెట్టింగ్ మాత్రం ఒకటే. ముందుగానే ఇటువంటి బలహీనత యువతను గుర్తించి వారి ద్వారా బెట్టింగ్‌లకు పాల్పడడం వంటివి చేస్తుండడం గమనార్హం. ఒక్క రాజాంలోనే కాకుండా జిల్లా అంతటా ఇదే తంతు సాగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కొంతమంది యువత విలువైన వస్తువులతోపాటు బైక్‌లను, ల్యాప్‌టాప్‌లను కుదవపెట్టి బెట్టింగ్‌లకు పాల్పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఎక్కడో పెద్ద పట్టణాల్లో సాగిన బెట్టింగ్ చిన్న పట్టణాలకు పాకడంతో విజ్ఞులు నిట్టూరుస్తున్నారు. కాదేదీ బెట్టింగ్‌కు అనర్హం... బెట్టింగ్ రాయుళ్లు ఉచ్చులో చిక్కుకున్న యువత రంజీ, ఐపీఎల్, టీ20, వన్డే మ్యాచ్‌లతోపాటు టీవీల్లో వచ్చే లైవ్ మ్యాచ్‌లకు బెట్టింగ్‌కు పాల్పడుతోంది. ఈ బెట్టింగ్‌ల్లో బాల్ టూ బాల్, ఓవర్ టూ ఓవర్, బ్యాటింగ్, వికెట్లు, సిక్సర్స్, ఫోర్స్ వంటి వాటిపై కూడా ఉత్కంఠగా బెట్టింగ్ కాయడం. ఒకవేళ చేతిలో సొమ్ములు అయిపోతే వారి వద్ద ఉన్న గోల్డ్, ఇతర విలువైన వస్తువులు కూడా పద్దు రూపంలోను, అమ్మకం చేసో పోగొట్టుకున్న సొమ్మును రాబెట్టుకునేందుకు బెట్టింగ్లవైపు ఆకర్షితులవుతున్నారు. దీంతో ఆర్థికంగా చితికిపోయి ఎక్కువ వడ్డీకి అప్పులు చేయడం, పరారైపోవడంతో కుటుంబాలను ఛిద్రం చేసుకుంటున్నారు. ఒకవేళ బెట్టింగ్ స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించే సమయంలో కేవలం సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కొద్ది మొత్తంలో సొమ్ము మాత్రమే దొరుకుతోంది. కోట్లలో బెట్టింగ్‌లకు పాల్పడుతున్నప్పటికీ ఎవరికీ దొరకుండా జాగ్రత్త పడుతున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతా యాప్‌లోనే.... క్రికెట్ బెట్టింగ్‌కు సంబంధించి యాప్‌ల ద్వారా సాగిస్తున్నారు. యాప్ ద్వారా రేటింగ్స్ ముందుగానే లెక్కించి ఏ జట్టుకు బెట్టింగ్ కాస్తే లాభదాయకంగా ఉంటుందో తెలియజేసి, తదనుగుణంగా బెట్టింగ్‌లోకి దించుతున్నారు. దీనికి సంబంధించి లాగిన్ ఐడీ ఇచ్చి ముందుగానే డిపాజిట్ కూడా చేయిస్తున్నారనే విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదంతా విజయవాడ కేంద్రంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. దీనికి గాను బెట్టింగ్ నిర్వాహకులు భారీగానే ఆర్జిస్తున్నారు. బెట్టింగ్‌లో రెండు వైపుల నుంచి కూడా వీరికి భారీస్థాయిలో కమీషన్ అందుతున్నట్లు తెలుస్తోంది. అంతా గోప్యంగానే..... బెట్టింగ్ రాయుళ్లు ఎవరి కంటా పడకుండా అంతా గోప్యంగానే సాగిస్తున్నారు. నలుగురిలో తిరుగుతూ పక్కవాడికి కూడా అనుమానం రాకుండా జాగ్రత్త పడుతున్నారు. దీనికోసం శివార్లలో ఇళ్లను ఎంపిక చేసుకుంటున్నారు. అలాగే లాడ్జీల్లో రూమ్‌లు తీసుకుని బెట్టింగ్ గుట్టుగా సాగిస్తున్నారు. అంత వరకు సామాన్యుడిలా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా లైఫ్‌స్టైల్ మార్చడం, కొన్ని రోజులకే పూర్వ స్థితికిరావడం తర్వాత ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడం, పలుచోట్ల సంభవిస్తున్నాయి. అయితే రాజాంలో కలకలం రేపిన బెట్టింగ్ వ్యవహారంలో పది మంది మాత్రమే ఇప్పటివరకు పట్టుబడ్డారు. వీరు మాత్రమేనా ఇంకా ఎవరైనా ఉన్నారా అన్నది పట్టణంలో గుసగుసలాడుకుంటున్నారు. దీనిని మొగ్గలోనే తుంచి ఈ భూతాన్ని తరిమివేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. బెట్టింగ్‌లపై నిఘా పెట్టాం పట్టణాలతోపాటు పల్లెల్లో కూడా బెట్టింగ్‌ల వ్యవహారంపై ఇప్పటికే నిఘా పెట్టాం. ఇందులో భాగంగానే ఇటీవల పది మంది బెట్టింగ్ రాయుళ్లును అదుపులోకి తీసుకున్నాం. ఎవరైనా ఎక్కడైనా బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారనే సమాచారం అందిస్తే, వారి వివరాలు గోప్యంగా ఉంచడంతోపాటు బెట్టింగ్ రాయుళ్లును పట్టుకుంటాం. జి.సోమశేఖర్, సీఐ, రాజాం టౌన్ -
కోహ్లికి సముచిత గౌరవం!
క్రికెట్ ప్రపంచంలో ఎదురు లేకుండా దూసుకుపోతున్న భారత స్టార్ విరాట్ కోహ్లిని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కూడా సముచిత రీతిలో గౌరవించుకుంది. ఆటగాడిగా, కెప్టెన్‌గా తిరుగులేని రికార్డులు సాధిస్తున్న విరాట్‌ను మూడు ప్రధాన అవార్డులకు ఎంపిక చేసి అవార్డుల విలువను పెంచింది. టెస్టులు, వన్డేల్లో పరుగుల వరద పారించడంతో రెండు ఫార్మాట్లలోనూ ఉత్తమ క్రికెటర్‌గా నిలిచిన కోహ్లి సహజంగానే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. మరో సందేహం లేకుండా టెస్టు, వన్డే జట్లకు కూడా అతనే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. దుబాయ్: 13 టెస్టుల్లో 55.08 సగటుతో 5 సెంచరీలు సహా 1322 పరుగులు... 14 వన్డేల్లో ఏకంగా 133.55 సగటుతో 6 సెంచరీలు సహా 1202 పరుగులు... వీటికి అదనంగా 10 అంతర్జాతీయ టి20ల్లో కలిపి 211 పరుగులు... ఈ అద్భుత గణాంకాలు 2018ని కోహ్లినామ సంవత్సరంగా మార్చేశాయి. అతడిని ప్రతిష్టాత్మక అవార్డులకు అర్హుడిగా చేశాయి. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం ప్రకటించిన 2018 వార్షిక పురస్కారాల్లో విరాట్ కోహ్లి మూడు ప్రధాన అవార్డులకు ఎంపికయ్యాడు. అన్ని ఫార్మాట్లలో చెలరేగినందుకు ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ (సర్ గార్ఫీల్డ్ సోబర్స్ ట్రోఫీ) వరుసగా రెండో ఏడాది కోహ్లిని వరించింది. 2017లో కూడా అతను ఇదే అవార్డు సాధించాడు. ఇప్పుడు టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్, వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులనూ కోహ్లినే గెలుచుకున్నాడు. ఐసీసీ చరిత్రలో ఒకే ఏడాది మూడు ప్రధాన అవార్డులు సాధించిన తొలి ఆటగాడిగా కోహ్లి నిలవడం విశేషం. గత ఏడాది భారత జట్టు ఉపఖండం బయటే దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడటాన్ని బట్టి చూస్తే కోహ్లి సాధించిన ఘనత అసమానం. రెండు ఫార్మాట్ ర్యాంకింగ్స్‌లలో కూడా కోహ్లి నంబర్‌వన్‌గా 2018ని ముగించాడు. మాజీ క్రికెటర్లు, సీనియర్ జర్నలిస్ట్‌లు, విశ్లేషకులతో కూడిన 36 మంది సభ్యుల ఎంపిక ప్యానెల్ ఏకగ్రీవంగా కోహ్లికి ఓటు వేసింది. ఐసీసీ ప్రకటించిన టెస్టు టీమ్ ద ఇయర్, వన్డే టీమ్ ద ఇయర్లకు కూడా కోహ్లినే కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కోహ్లి నాయకత్వంలో 2018లో భారత్ 6 టెస్టుల్లో గెలిచింది. 7 టెస్టుల్లో ఓడింది. వన్డేల్లో 9 విజయాలు నమోదు చేసింది. 4 పరాజయాలు చవిచూసింది. మరో మ్యాచ్ ‘టై’గా ముగిసింది. పంత్ సూపర్... టెస్టులు, వన్డేల్లో 2018లో అరంగేట్రం చేసిన భారత వికెట్ కీపర్ రిషభ్ పంత్‌కు ‘ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు వరించింది. అతను 8 టెస్టుల్లో కలిపి 537 పరుగులు సాధించాడు. ఇందులో ఇంగ్లండ్‌పై ఓవల్‌లో చేసిన సెంచరీ సైతం ఉంది. అతను 40 క్యాచ్‌లు అందుకోవడం అవార్డు ఎంపికకు కారణమైంది. ఇదే ప్రదర్శనతో ఐసీసీ టెస్టు జట్టు కీపర్‌గానూ పంత్ ఎంపికయ్యాడు. ఈ టీమ్‌లో జస్ప్రీత్ బుమ్రాకు స్థానం లభించింది. వన్డే జట్టులో రోహిత్ శర్మ, బుమ్రా, కుల్దీప్లకు అవకాశం దక్కింది. ఫించ్ ఫటాఫట్... హరారేలో జింబాబ్వేపై ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా) చేసిన భారీ సెంచరీ టి20 అత్యుత్తమ ఇన్నింగ్స్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో 72 బంతుల్లోనే 16 ఫోర్లు, 10 సిక్సర్లతో 172 పరుగులు చేసిన ఫించ్ అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును నమోదు చేశాడు. స్కాట్లాండ్ ఆటగాడు కాలమ్ మెక్లాయిడ్ ‘అసోసియేట్ క్రికెటర్ ఆఫ్ ఇయర్’ అవార్డును గెలుచుకున్నాడు. వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో అఫ్గానిస్తాన్‌పై 157 పరుగులు చేసిన అతను... ఇంగ్లండ్‌పై 140 పరుగులు చేసి జట్టును గెలిపించాడు. ఇతర అవార్డుల్లో ‘స్పిరిట్ ఆఫ్ ద ఇయర్’ను విలియమ్సన్ (న్యూజి లాండ్) గెలుచుకోగా, కుమార ధర్మసేన (శ్రీలంక) ఉత్తమ అంపైర్‌గా నిలిచాడు. భారత యువ జట్టు అండర్–19 వరల్డ్ కప్ గెలుచుకోవడం ‘అభిమానుల అత్యుత్తమ క్షణం’గా ఎంపికైంది. ►1 ఐసీసీ ‘క్రికెటర్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారాన్ని రెండోసారి నెగ్గిన తొలి భారత క్రికెటర్‌గా కోహ్లి గుర్తింపు పొందాడు. గతేడాది కూడా కోహ్లికి ఈ అవార్డు లభించింది. గతంలో రాహుల్ ద్రవిడ్ (2004), సచిన్ (2010), అశ్విన్ (2016) ఒక్కోసారి ఈ అవార్డు అందుకున్నారు. ►1 ఐసీసీ ‘వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డుకు మూడుసార్లు (2012, 2017, 2018) ఎంపికైన తొలి భారత క్రికెటర్ కోహ్లినే. ధోనికి (2008, 2009) రెండుసార్లు ఈ అవార్డు వచ్చింది. ►5 ఐసీసీ ‘టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు పొందిన ఐదో భారత క్రికెటర్ కోహ్లి. గతంలో రాహుల్ ద్రవిడ్ (2004), గంభీర్ (2009), సెహ్వాగ్ (2010), అశ్విన్ (2016) ఈ ఘనత సాధించారు. చాలా అద్భుతంగా అనిపిస్తోంది. సంవత్సరం మొత్తం చేసిన కఠోర శ్రమకు దక్కిన గుర్తింపు ఇది. వ్యక్తిగతంగా చాలా గొప్పగా అనిపిస్తుండటమే కాదు... నేను బాగా ఆడుతున్న సమయంలోనే జట్టు కూడా మంచి ఫలితాలు సాధించడం పట్ల చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందరో ఆటగాళ్లు అంతర్జాతీయ వేదికపై ఆడుతున్నప్పుడు ఐసీసీ నుంచి గుర్తింపు లభించడం అంటే ఒక క్రికెటర్‌గా ఇది నేను గర్వపడే క్షణం. ఈ రకమైన ప్రోత్సాహం ఇదే ఘనతను పునరావృతం చేసేందుకు కావాల్సిన స్ఫూర్తినందిస్తుంది. క్రికెట్ ప్రమాణాలను నిలబెట్టేందుకు, మరింత నిలకడగా రాణించేందుకు ఇలాంటివి అవసరం. – కోహ్లి, భారత కెప్టెన్ -
ధోనినే ‘బెస్ట్ ఫినిషర్’
న్యూఢిల్లీ: వన్డే క్రికెట్లో మ్యాచ్‌ను విజయవంతంగా ముగించడంలో ధోని తర్వాతే ఎవరైనా అని ఆస్ట్రే లియా మాజీ కెప్టెన్ ఇయాన్ చాపెల్ అభిప్రాయ పడ్డారు. ఈ తరంలో అతడిని మించినవారు ఎవరూ లేరని, ఇప్పటికీ అతనే ‘బెస్ట్ ఫినిషర్’ అని చాపెల్ ప్రశంసించారు. ‘చివరి వరకు నిలిచి జట్టును గెలిపించడంలో ధోని అంత సమర్థంగా ఎవరూ ఒత్తిడిని జయించలేరు. ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది, ఇక కష్టం అనిపించినప్పుడల్లా కొన్ని అద్భుతమైన షాట్లు ఆడి అతను లెక్క సరి చేస్తాడు. ఉత్కంఠభరిత క్షణాల్లో తన వ్యూహానికి అనుగుణంగా ప్రశాంతంగా ఆడటం చూస్తే అతని బుర్ర ఎంత పక్కాగా పని చేస్తుందో అర్థం చేసుకోవచ్చు’ అని చాపెల్ విశ్లేషించారు. గతంలో మైకేల్ బెవాన్‌కు ఈ విషయంలో మంచి రికార్డు ఉన్నా...మారిన పరిస్థితులను పరిగణలోకి తీసుకున్నా కూడా బెవాన్కంటే ధోనినే అత్యుత్తమమని ఆసీస్ దిగ్గజం అభిప్రాయం వ్యక్తం చేశారు. కోహ్లి ఇలాగే ఆడితే... వన్డే క్రికెట్లో నలుగురు అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా రిచర్డ్స్, సచిన్, డివిలియర్స్, కోహ్లిలను చాపెల్ అభివర్ణించారు. వీరిలో కోహ్లి ఒక్కడే ఇప్పుడు ఆడుతున్నాడని...అతను ఇప్పటి జోరును కొనసాగిస్తే సచిన్‌కంటే 100 తక్కువ ఇన్నింగ్స్‌లలోనే అతని అన్ని రికార్డులు అధిగమిస్తాడని, మరో 20 సెంచరీలు ఎక్కువ చేస్తాడని కూడా ఇయాన్ అన్నారు. ఇదే జరిగితే విరాట్‌ను ‘వన్డే బ్రాడ్‌మన్’గా పిలవడంలో ఎలాంటి సందేహం ఉండనవసరం లేదని ఆయన వ్యాఖ్యానించారు. -
‘ఇంగ్లిష్’ క్రికెట్‌కు రెడీ!
ఇంగ్లండ్ గడ్డపై నాలుగేళ్ల తర్వాత కీలక టెస్టు సిరీస్‌కు ముందు టి20, వన్డేలలో సత్తా చాటి ఫామ్‌లోకి వచ్చేందుకు భారత్ సన్నద్ధమైంది. పర్యటనలో భాగంగా అసలు పరీక్షకు ముందు ఐర్లాండ్‌తో టి20ల్లో తలపడనుంది. 100వ అంతర్జాతీయ టి20 మ్యాచ్ బరిలోకి దిగుతున్న టీమిండియా తమ స్థాయికి తగినట్లుగా విజయంపై దృష్టి పెట్టగా... గతంలోనూ పలు సంచలనాలు నమోదు చేసిన ఐర్లాండ్ సొంతగడ్డపై మరోసారి అలాంటి ఆటతీరు కనబర్చాలని పట్టుదలగా ఉంది. డబ్లిన్: దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత భారత జట్టు తొలిసారి తమ పూర్తి స్థాయి జట్టుతో మరో అంతర్జాతీయ పోరుకు సిద్ధమైంది. ఐర్లాండ్‌తో రెండు టి20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు ఇక్కడ తొలి మ్యాచ్ జరుగనుంది. జట్టు బలాబలాలు, ఫామ్ దృష్ట్యా చూస్తే భారత్ ఎంతో పటిష్టంగా కనిపిస్తోంది. అయితే ఇటీవలే టెస్టు హోదా పొందిన ఐర్లాండ్‌కు టి20ల్లో కూడా మంచి రికార్డు ఉండటం, స్థానిక పరిస్థితుల అనుకూలత కారణంగా మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం ఉంది. తుది జట్టులో ఎవరు? భారత జట్టు తమ ఆఖరి టి20 అంతర్జాతీయ మ్యాచ్ గత మార్చిలో నిదహాస్ ట్రోఫీ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై ఆడింది. అయితే ఆ టోర్నీ నుంచి విశ్రాంతి తీసుకున్న కోహ్లి, ధోని, భువనేశ్వర్, బుమ్రా ఇప్పుడు తిరిగొచ్చారు. ఈ నలుగురు కూడా తుది జట్టులో ఖాయం. అయితే తాజా ఫామ్ ప్రకారం చూస్తే ధోని వచ్చినా దినేశ్ కార్తీక్‌కు బ్యాట్స్‌మన్‌గా స్థానం దక్కవచ్చు. లోకేశ్ రాహుల్ కూడా టీమ్‌లో ఉండే అవకా శం ఉంది. కాబట్టి మనీశ్ పాండేకు చోటు కష్టం. టి20ల్లో అద్భుత రికార్డు ఉన్నా... తాజా కూర్పులో రైనాకు కూడా స్థానం అనుమానంగా ఉంది. హార్దిక్ పాండ్యాతో కూడిన బ్యాటింగ్ లైనప్ మరింత బలంగా కనిపిస్తోంది. బౌలింగ్‌లో ఇక్కడ పరిస్థితులపై అవగాహన కల్పించేందుకు చహల్, కుల్దీప్లను కోహ్లి కచ్చితంగా తుది జట్టులో ఎంచుకోవచ్చు. ఇద్దరు పేసర్ల స్థానాల్లో భువీ, బుమ్రాలు తప్పనిసరి. అయితే ఇటీవల మంచి ఫామ్‌లో ఉండి పునరాగమనం చేసిన ఉమేశ్‌కు అవకాశం ఇవ్వాలనుకుంటే వీరిద్దరిలో ఒకరికి విశ్రాంతి తప్పదు. సిద్ధార్థ్ కౌల్ అవకాశం కోసం కొంత కాలం వేచి చూడక తప్పదు. సీనియర్లదే భారం... ముక్కోణపు టి20 టోర్నీలో భాగంగా పది రోజుల క్రితమే స్కాట్లాండ్, నెదర్లాండ్స్‌లతో ఆడిన ఐర్లాండ్ మంచి మ్యాచ్ ప్రాక్టీస్‌లో ఉంది. ఈ టోర్నమెంట్లో ఫైనల్ చేరిన ఐర్లాండ్ అదే జట్టును ఇక్కడా కొనసాగించే అవకాశం ఉంది. ముఖ్యంగా కెప్టెన్ గ్యారీ విల్సన్, వెటరన్లు పోర్టర్ ఫీల్డ్, కెవిన్ ఓబ్రైన్లపై ఆ జట్టు ఆధారపడుతోంది. ఓపెనర్ స్టిర్లింగ్‌కు కూడా దూకుడుగా ఆడగల సత్తా ఉంది. బౌలింగ్‌లో డాక్రెల్, థాంప్సన్ కీలకం. భారత్‌లో పుట్టి ఐర్లాండ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆఫ్ స్పిన్నర్ సిమి సింగ్ తొలిసారి తన సొంత దేశానికి ప్రత్యర్థిగా ఆడనుం డటం విశేషం. టి20ల్లో ఒక మ్యాచ్ లో విండీస్‌పై మినహా మిగతా అన్ని విజయాలు చిన్న జట్లపైనే సాధించిన ఐర్లాండ్ పటిష్ట టీమిండియాకు ఎంతవరకు పోటీనిస్తుందనేది ఆసక్తికరం. ఆహ్లాదకర వాతావరణంలో... ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టిన తర్వాత భారత జట్టు సోమవారం తొలిసారి ప్రాక్టీస్‌లో పాల్గొంది. లండన్ మహానగర శివార్లలో ఉన్న మర్చంట్ టేలర్స్ స్కూల్‌ను అందుకు వేదికగా ఎంచుకుంది. ఇంగ్లండ్‌లో అందుబాటులో ఉన్న ప్రధాన వేదికల్లోని శిక్షణా సౌకర్యాలకు దూరంగా కాస్త ప్రశాంతంగా సాధన చేసేందుకు కోహ్లి సేన ఇక్కడకు వచ్చింది. 800కు పైగా విద్యార్థులు ఉన్న ఈ స్కూల్లో ఎక్కువ మంది భారత ఉపఖండం నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన కుటుంబాలకు చెందిన వారే ఉన్నారు. 285 ఎకరాల విస్తీర్ణంలో అందమైన పచ్చిక బయళ్లు, రెండు వైపుల సరస్సులతో అద్భుతంగా ఉన్న ఈ స్కూల్ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేయడాన్ని ఆటగాళ్లు అమితంగా ఆస్వాదించారు. గతంలో ఈ స్కూల్లో కోచింగ్ ఇచ్చిన దిగ్గజ బ్యాట్స్‌మన్ గార్డన్ గ్రీనిడ్జ్ అక్కడే ఉండే భారత ఆటగాళ్లతో ముచ్చ టించాడు. సెలవులు గడిపేందుకు తన కొడుకుతో కలిసి వచ్చిన మాజీ పేసర్ నెహ్రా కూడా టీమిండియా బౌలర్లకు ప్రాక్టీస్‌లో సూచనలిచ్చాడు. ►100 భారత్‌కు ఇది 100వ అంతర్జాతీయ టి20 మ్యాచ్. ఇప్పటివరకు 62 మ్యాచ్‌లు గెలిచి, 35 ఓడింది. 2 మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు. తుది జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రాహుల్, కార్తీక్, పాండ్యా, ధోని, భువనేశ్వర్, చహల్, కుల్దీప్, బుమ్రా/ఉమేశ్. ఐర్లాండ్: విల్సన్ (కెప్టెన్), స్టిర్లింగ్, షెనాన్, బల్బిర్నీ, సిమిసింగ్, కెవిన్ ఓబ్రైన్, థాంప్సన్, పాయింటర్, డాక్రెల్, మెకార్తీ, ఛేజ్. -
వన్డే క్రికెట్లో ఇంగ్లండ్ కొత్త ప్రపంచ రికార్డు