కీర్తిపూర్ (నేపాల్): అంతర్జాతీయ వన్డేల్లో నేపాల్ స్పిన్నర్ సందీప్ లమిచానె అరుదైన ఘనత సాధించాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా సందీప్ లమిచానె ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రీమియర్ కప్ టోర్నీలో భాగంగా ఒమన్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సందీప్ మూడు వికెట్లు తీశాడు.
తద్వారా ఈ ఘనతను సందీప్ పేరిట లిఖించుకున్నాడు. 100 వికెట్ల మైలు రాయిని సందీప్ కేవలం 42 మ్యాచ్‌ల్లోనే అందుకున్నాడు. ఇప్పటి వరకు ఈ రికార్డు అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (44 మ్యాచ్‌లు) పేరిట ఉండేది. తాజా మ్యాచ్‌తో రషీద్ రికార్డును సందీప్ బ్రేక్ చేశాడు.
చదవండి: ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాళ్లకు ధోని సలహాలు.. జ్ఞానోదయం కలిగేనా!
Comments
Please login to add a commentAdd a comment