నేపాల్ స్టార్ క్రికెటర్ సందీప్ లమిచానే మైనర్ బాలికపై అత్యాచారం పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. విదేశాల్లో ఉన్న సందీప్ లమిచానేను ఇంటర్‌పోల్ సహాయంతో స్వదేశానికి రప్పించిన నేపాల్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి పోలీసుల అదుపులో ఉన్న సందీప్‌పై విచారణ కొనసాగుతుంది. తాజాగా కేసులో తుది తీర్పు వచ్చేవరకు లమిచానే జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతుందని ఖాట్మండు జిల్లా కోర్టు స్పష్టంచేసింది.
కాగా, సందీప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని గత ఆగస్టులో 17 ఏండ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు విచారణ చేపట్టిన న్యాయస్థానం సెప్టెంబర్ 8న సందీప్ లమిచానే అరెస్ట్ కోసం వారెంట్ జారీచేసింది. అయితే ఆ సమాయానికి సందీప్.. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతూ జమైకాలో ఉన్నాడు. దాంతో పోలీసులు లీగ్ నిర్వాహకులకు విషయం తెలియజేయడంతో అతడిని టోర్నీ నుంచి తప్పించారు. జాతీయ జట్టు కెప్టెన్‌గా ఉన్న సందీప్ లమిచానేను నేపాల్ క్రికెట్ బోర్డు కూడా జట్టులో నుంచి తొలగించింది.
Comments
Please login to add a commentAdd a comment