katmandu
-
బిస్కెట్ జాత్రా..!: ఇదేం జాతర రా నాయనా..!
నేపాలీల కొత్త సంవత్సరం మేష సంక్రమణం రోజున జరుగుతుంది. ఇదేరోజు కఠ్మాండు సమీపంలోని భక్తపూర్లో ‘బిస్కెట్ జాత్రా’ వేడుకలు జరుగుతాయి. నిజానికి ఈ జాతర పేరు ‘బిస్కా జాత్రా’ అయినా, కాలక్రమంలో ‘బిస్కెట్ జాత్రా’గా జనాల్లో స్థిరపడింది. భక్తపూర్లో ఏటా ఈ జాతర జరుపుకోవడం వెనుక ఒక స్థలపురాణగాథ ప్రచారంలో ఉంది. ఒకానొక కాలంలో భక్తపూర్ ప్రాంతాన్ని లిచ్చవి వంశానికి చెందిన శివదేవ మహారాజు పరిపాలించేవాడు. ఆయన రాజ్యంపై చుట్టుపక్కల అడవుల్లో ఉండే కిరాతులు తరచు దాడులు చేస్తుండేవారు. తన రాజ్యానికి కిరాతుల బెడద లేకుండా చేయాలని కోరుతూ శివదేవ మహారాజు వజ్రయోగినిని ప్రార్థించాడు. కిరాతుల పీడను శేఖర్ ఆచాజు అనే తాంత్రికుడు విరగడ చేయగలడని, అతడి సహాయం తీసుకోమని వజ్రయోగిని సలహా ఇచ్చింది. శివదేవ మహారాజు తన పరివారాన్ని వెంటతీసుకుని శేఖర్ ఆచాజును కలుసుకుని, తన సమస్యను వివరించాడు. శేఖర్ ఆచాజు తన తాంత్రిక శక్తితో పులిగా మారిపోయాడు. తన శిష్యగణాన్ని కూడా పులులుగా మార్చాడు. పులుల గుంపు ఒక్కసారిగా మెరుపుదాడి చేయడంతో కిరాతుల దండు పటాపంచలై, పలాయనం చిత్తగించింది. శివదేవ మహారాజుకు కిరాతుల బెడద విరగడైంది. కిరాతులను తరిమికొట్టిన శేఖర్ ఆచాజును శివదేవ మహారాజు తన రాజ్యంలోని తిమి పట్టణానికి ఆహ్వానించి, సిందూరపు జల్లులతో ఘనస్వాగతం పలికాడు. ఈ సంఘటన తర్వాత శేఖర్ ఆచాజు శక్తి అతడి భార్య నరరూపకు తెలిసింది. తన ఎదుట ఒకసారి పాముగా మారి చూపించాలని కోరింది. శేఖర్ ఆచాజు ఆమె చేతికి కొన్ని వడ్లగింజలు ఇచ్చి, వాటిని తిరిగి తనపై చల్లితే యథారూపానికి వస్తానని చెప్పాడు. తన మంత్రశక్తితో కొండచిలువగా మారిపోయాడు. కొండచిలువను చూసి నరరూప భయంతో పరుగు తీసింది. తన నడుముకు ఉన్న దట్టీ బిగుతుగా ఉండి అడ్డుపడటంతో దాన్ని వదులు చేసుకోవడానికి భర్త తన చేతికి ఇచ్చిన వడ్ల గింజలను నోట్లో వేసుకుంది. వెంటనే ఆమె కూడా కొండచిలువగా మారిపోయింది. తిరిగి మానవ రూపంలోకి రావాలంటే, ఆ రహస్యం శివదేవ మహారాజుకు మాత్రమే తెలుసు. కొండ చిలువలుగా ఉన్న భార్యా భర్తలిద్దరూ పాకుతూ రాజు అంతఃపురంలోకి వెళ్లారు. ఆచాజు దంపతులే అలా వచ్చారని పోల్చుకోలేని రాజు కొండచిలువలను చంపేయమని భటులను ఆజ్ఞాపించాడు. భటులు వాటిని చంపేశారు. ఇది జరిగిన కొంతకాలానికి శివదేవ మహారాజుకు తన పొరపాటు తెలిసివచ్చింది. అప్పటి నుంచి పాముల రూపంలో మరణించిన ఆచాజు దంపతుల గౌరవార్థం ఏటా మేషసంక్రమణం రోజున ‘బిస్కా జాత్రా’ నిర్వహించడం ఆనవాయితీగా మారింది. ఈ జాతరలో భక్తపూర్ ప్రధాన వీథుల్లో భైరవుడిని, భద్రకాళిని రథాలపై ఊరేగిస్తారు. ఈ సందర్భంగా పట్టణంలోని ‘థానే’ (ఎగువభాగం), ‘కోనే’ దిగువభాగం ప్రజల నడుమ పొడవాటి తాడును గుంజే ‘టగ్ ఆఫ్ వార్’ పోటీ జరుగుతుంది. మరుసటి రోజున ‘సిందూర్ జాత్రా’ జరుగుతుంది. జనాలు ఒకరిపై ఒకరు సిందూరం పూసుకుని, వీథుల్లోకి వచ్చి నృత్యగానాలతో సందడి చేస్తారు. (చదవండి: పిల్లులంటే ఇష్టమా? ఐతే తప్పకుండా ఈ మ్యూజియంకి వెళ్లాల్సిందే..!) -
అత్యాచారం కేసు: నేపాల్ క్రికెటర్‌కు ఎనిమిదేళ్ల జైలు శిక్ష
Sandeep Lamichhane sentenced: నేపాల్ క్రికెటర్ సందీప్ లమిచానే జైలు పాలయ్యాడు. అత్యాచారానికి పాల్పడిన కేసులో అతడికి ఎనిమిదేళ్ల శిక్షను ఖరారు చేస్తూ స్థానిక కోర్టు బుధవారం తీర్పునిచ్చింది. అదే విధంగా.. రూ. 3 లక్షల జరిమానా విధించడంతో పాటు.. బాధితురాలికి పరిహారం కింద రూ. 2 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. ఒకప్పటి కెప్టెన్ కాగా 2018లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సందీప్ లమిచానే కెప్టెన్ స్థాయికి ఎదిగాడు. పొట్టి ఫార్మాట్లో అద్భుతంగా రాణించిన ఈ లెగ్ స్పిన్ బౌలర్.. నేపాల్ తరఫున ఇప్పటి వరకు మొత్తంగా 52 టీ20లు ఆడి 98 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లోనూ సత్తా చాటాడు ఓవరాల్‌గా ఈ ఫార్మాట్లో 75 మ్యాచ్‌లలో కలిపి 158 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు సందీప్. ఇందులో మూడు ఫైవ్ వికెట్స్ హాల్స్ ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడిన తొలి నేపాలీ క్రికెటర్‌గా ప్రసిద్ధి పొందిన సందీప్ లమిచానే.. 2018-20 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో మొత్తంగా తొమ్మిది మ్యాచ్‌లు ఆడిన ఈ 23 ఏళ్ల స్పిన్నర్ 13 వికెట్లు తీశాడు. అప్పట్లోనే అరెస్ట్ ఆటగాడిగా కెరీర్లో ఉన్నత శిఖరాలకు చేరుకునే సమయంలో అత్యాచార ఆరోపణలతో సెప్టెంబరు, 2022లో అరెస్టయ్యాడు. మూడు నెలల తర్వాత కోర్టు అతడికి షరతులతో కూడిన బెయిలు మంజూరు చేయడంతో తిరిగి క్రికెట్ మైదానంలో అడుగుపెట్టాడు. శిక్షను తాజాగా ఖరారు చేసిన కోర్టు అయితే, తాజాగా ఈ కేసు విచారణకు రాగా కాఠ్మండు జిల్లా కోర్టు సందీప్ లమిచానేకు ఎనిమిదేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. కాగా డిసెంబరు 29నాటి విచారణలో భాగంగా జస్టిస్ శిశిర్ రాజ్ ధాకల్ నేతృత్వంలోని ధర్మాసనం అతడిని దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్‌తో పాటు బీబీఎల్, పీఎస్ఎల్, బీపీఎల్, సీపీఎల్ వంటి టీ20 లీగ్‌లలో సందీప్ లమిచానే పాల్గొన్నాడు. చదవండి: Ind vs Afg T20Is: గిల్‌కు నో ఛాన్స్! రోహిత్‌తో ఓపెనింగ్ చేసేది అతడే: ద్రవిడ్ -
తీర్పు వచ్చేవరకు జ్యుడీషియల్ కస్టడీలో నేపాల్ క్రికెటర్
నేపాల్ స్టార్ క్రికెటర్ సందీప్ లమిచానే మైనర్ బాలికపై అత్యాచారం పాల్పడ్డాడని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. విదేశాల్లో ఉన్న సందీప్ లమిచానేను ఇంటర్‌పోల్ సహాయంతో స్వదేశానికి రప్పించిన నేపాల్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అప్పటినుంచి పోలీసుల అదుపులో ఉన్న సందీప్‌పై విచారణ కొనసాగుతుంది. తాజాగా కేసులో తుది తీర్పు వచ్చేవరకు లమిచానే జ్యుడీషియల్ కస్టడీ కొనసాగుతుందని ఖాట్మండు జిల్లా కోర్టు స్పష్టంచేసింది. కాగా, సందీప్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని గత ఆగస్టులో 17 ఏండ్ల బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు విచారణ చేపట్టిన న్యాయస్థానం సెప్టెంబర్ 8న సందీప్ లమిచానే అరెస్ట్ కోసం వారెంట్ జారీచేసింది. అయితే ఆ సమాయానికి సందీప్.. కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతూ జమైకాలో ఉన్నాడు. దాంతో పోలీసులు లీగ్ నిర్వాహకులకు విషయం తెలియజేయడంతో అతడిని టోర్నీ నుంచి తప్పించారు. జాతీయ జట్టు కెప్టెన్‌గా ఉన్న సందీప్ లమిచానేను నేపాల్ క్రికెట్ బోర్డు కూడా జట్టులో నుంచి తొలగించింది. చదవండి: డిఫెండింగ్ చాంపియన్‌కు కష్టమే.. ఇంగ్లండ్ ఓడితేనే రషీద్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఆసీస్‌కు ముచ్చెమటలు -
నేపాల్ సైన్యానికి భారత్ అరుదైన బహుమతి
ఖట్మాండు: భారత సైన్యం పొరుగు దేశం నేపాల్ సైన్యానికి అరుదైన బహుమతి ఇచ్చింది. అక్షరాలా లక్ష డోసుల కరోనా టీకాలను అందజేసింది. నేపాల్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంచుకొనే ప్రయత్నంలో భాగంగానే భారత సైన్యం ఔదార్యం ప్రదర్శించింది. నేపాల్ రాజధాని ఖాట్మాండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారత ఆర్మీ అధికారులు నేపాల్ సైనికాధికారులకు లక్ష డోసులను అందజేసినట్లు భారత రాయాబార కార్యలయం ట్వీట్ చేసింది. ఈ టీకా డోసులను ఇండియాలోనే తయారు చేశారు. భారత్ గతంలోనే నేపాల్‌కు 10 లక్షల డోసుల కరోనా టీకాలను ఇచ్చింది. చైనా తాజాగా 8 లక్షల డోసులను నేపాల్‌కు బహుమతిగా ఇచ్చింది. చదవండి: మోదీకి లేఖ రాసిన ఇమ్రాన్ ఖాన్ -
నేపాల్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం
ఖట్మండ్: నేపాల్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొంది. గత కొన్ని నెలలుగా సొంత పార్టీ నుంచి తీవ్రమైన విమర్శలను ఎదుర్కొంటున్న ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలి ఆదివారం నేపాల్ పార్లమెంట్ రద్దును ప్రతిపాదించారు. ఆయన తీసుకున్న పార్లమెంట్ రద్దు నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన ప్రతులను కేబినెట్ నేపాల్ ప్రెసిడెంట్‌కు పంపించింది. ప్రధాని నిర్ణయాన్ని అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ(ఎన్సీపీ) నేతలు తప్పబడుతున్నారు. ప్రధాని అనూహ్య నిర్ణయం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. చదవండి: నేపాల్ సంక్షోభం.. -
ఆరోగ్య సంక్షోభంలో దక్షిణాసియా చిన్నారులు!
ఖాట్మండు : దక్షిణాసియాలో కరోనా వైరస్ కారణంగా చిన్నపిల్లలకు ఇచ్చే టీకాలకు అంతరాయం కలుగుతోంది. చిన్నారుల ప్రాణరక్షక టీకాలను అందించకపోతే దక్షిణాసియాలో మరో ఆరోగ్య అత్యవసర పరిస్థితికి దారి తీయవచ్చనని ‘యూనిసెఫ్’ హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా టీకాలు వేయించుకోని, లేదా అరకొరగా టీకాలు వేయించుకున్న చిన్నారుల్లో దాదాపు పావుభాగం అంటే 45 లక్షల మంది దక్షిణాసియాలోనే ఉన్నారనీ, వారిలో 97 శాతం మంది భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌లలో ఉన్నారని వెల్లడించింది. రవాణాపై ఆంక్షలు, విమానాల రద్దు కారణంగా కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ నిల్వలు అడుగంటిపోయాయని, వ్యాక్సిన్ల తయారీ కూడా తీవ్రంగా ప్రభావితమైందనీ యూనిసెఫ్ రీజనల్ హెల్త్ అడ్వైజర్ పాల్ రట్టర్ అన్నారు. -
నేపాల్‌లో కూలిన విమానం
కఠ్మాండు: నేపాల్‌లో వాతావరణం అనుకూలించక 18 మందితో వెళుతున్న ఓ చిన్న విమానం కూలిపోయింది. నేపాల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఈ విమానం ఆదివారం పొఖారా విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 12.40కి బయలు దేరిందని తర్వాత 15 నిమిషాలకు దాని నుంచి సిగ్నల్స్ ఆగిపోయాయని అధికారులు తెలిపారు. విమానంలో ఓ విదేశీయుడు సహా 15 మంది ప్రయాణికులు, ముగ్గురు సిబ్బంది ఉన్నట్టు అధికారులు తెలిపారు. అర్గాకంచి జిల్లాలోని ఖిదిమ్ అటవీ ప్రాంతంలో విమానం శకలాలు కని పించాయని, అందులో ఉన్న 18 మందీ మృతిచెంది ఉంటారని భావిస్తున్నామని అధికారులు చెప్పారు. పీవీ, సోనియాల మధ్య విభేదాలు! తన తాజా పుస్తకంలో కేంద్ర మంత్రి థామస్ న్యూఢిల్లీ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీల మధ్య రాజీవ్‌గాంధీ హత్యకేసు దర్యాప్తు విషయంలో అప్పట్లో తీవ్ర మనస్పర్ధలు చోటు చేసుకున్నాయట. సొంత పార్టీకి చెంది న పీవీ ప్రధానిగా ఉన్నా.. రాజీవ్ హత్యకేసు దర్యాప్తు నత్తనడకన నడుస్తోందని సోనియా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా.. తరచూ తనకు అవమానం జరుగుతోందంటూ పీవీ ఆవేదన చెందారట. దీంతో ఇరువురి మధ్య సత్సంబంధాలు ఉండేవికావని కేంద్ర ఆహార మంత్రి కేవీ థామస్ వెల్లడించారు. ‘సోనియా- ద బిలవ్డ్ ఆఫ్ ద మాసెస్ (సోనియా-జన ప్రియతమ నేత)’ పేరుతో రాసిన తన తాజా పుస్తకంలో థామస్ పలు విషయాలు పేర్కొన్నారు.