
ఖాట్మండు : దక్షిణాసియాలో కరోనా వైరస్ కారణంగా చిన్నపిల్లలకు ఇచ్చే టీకాలకు అంతరాయం కలుగుతోంది. చిన్నారుల ప్రాణరక్షక టీకాలను అందించకపోతే దక్షిణాసియాలో మరో ఆరోగ్య అత్యవసర పరిస్థితికి దారి తీయవచ్చనని ‘యూనిసెఫ్’ హెచ్చరించింది. ప్రపంచవ్యాప్తంగా టీకాలు వేయించుకోని, లేదా అరకొరగా టీకాలు వేయించుకున్న చిన్నారుల్లో దాదాపు పావుభాగం అంటే 45 లక్షల మంది దక్షిణాసియాలోనే ఉన్నారనీ, వారిలో 97 శాతం మంది భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్‌లలో ఉన్నారని వెల్లడించింది. రవాణాపై ఆంక్షలు, విమానాల రద్దు కారణంగా కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ నిల్వలు అడుగంటిపోయాయని, వ్యాక్సిన్‌ల తయారీ కూడా తీవ్రంగా ప్రభావితమైందనీ యూనిసెఫ్ రీజనల్ హెల్త్ అడ్వైజర్ పాల్ రట్టర్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment