బెంగళూరు: కర్ణాటకలోని బెంగళూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) సైంటిస్టులు వినూత్నమైన కోవిడ్–19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారు. సార్స్–కోవ్–2కు చెందిన అన్ని రకాల సబ్ వేరియంట్లను ఇది సమర్థంగా ఎదుర్కొంటోందని చెబుతున్నారు. భవిష్యత్తులో పుట్టుకొచ్చే వేరియంట్లపైనా పోరాడగలదని అంటున్నారు.
కాగా, ప్రొఫెసర్ రాఘవన్ వరదరాజన్ నేతృత్వంలో ఐఐఎస్సీ మాలిక్యులర్ బయోఫిజిక్స్ యూనిట్ బృందం తయారు చేసిన ఈ టీకాకు ఆర్‌ఎస్2 అని పేరుపెట్టారు. కోవిడ్–19పై జరుగుతున్న పోరాటంలో ఈ వ్యాక్సిన్ ఒక విప్లవాత్మకమైన ముందడుగు అని సైంటిస్టులు అభివర్ణించారు. ఇది వేడిని తట్టుకోగలదని, చల్లని ప్రదేశంలో నిల్వ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు.
కరోనా వైరస్‌కు చెందిన స్పైక్ ప్రొటీన్లలోని రెండు కాంపోనెంట్ల సమ్మేళంతో ఆర్‌ఎస్2 టీకాను అభివృద్ధి చేశారు. ఇదొక సింథటిక్ యాంటీజెన్. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కరోనా టీకాలతో పోలిస్తే ఆర్‌ఎస్‌ఈ టీకా మరింత ఎక్కువ రక్షణ ఇస్తుందని ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఇందులోని ఎస్2 అని సబ్ యూనిట్ వైరస్ మ్యుటేషన్లను సమర్థంగా తట్టుకుంటుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment