
ఖట్మాండు: భారత సైన్యం పొరుగు దేశం నేపాల్ సైన్యానికి అరుదైన బహుమతి ఇచ్చింది. అక్షరాలా లక్ష డోసుల కరోనా టీకాలను అందజేసింది. నేపాల్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంచుకొనే ప్రయత్నంలో భాగంగానే భారత సైన్యం ఔదార్యం ప్రదర్శించింది. నేపాల్ రాజధాని ఖాట్మాండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారత ఆర్మీ అధికారులు నేపాల్ సైనికాధికారులకు లక్ష డోసులను అందజేసినట్లు భారత రాయాబార కార్యలయం ట్వీట్ చేసింది. ఈ టీకా డోసులను ఇండియాలోనే తయారు చేశారు. భారత్ గతంలోనే నేపాల్‌కు 10 లక్షల డోసుల కరోనా టీకాలను ఇచ్చింది. చైనా తాజాగా 8 లక్షల డోసులను నేపాల్‌కు బహుమతిగా ఇచ్చింది.
చదవండి: మోదీకి లేఖ రాసిన ఇమ్రాన్ ఖాన్
Comments
Please login to add a commentAdd a comment