Nepal Army
-
నేపాల్ సైన్యానికి భారత్ అరుదైన బహుమతి
ఖట్మాండు: భారత సైన్యం పొరుగు దేశం నేపాల్ సైన్యానికి అరుదైన బహుమతి ఇచ్చింది. అక్షరాలా లక్ష డోసుల కరోనా టీకాలను అందజేసింది. నేపాల్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మరింత పెంచుకొనే ప్రయత్నంలో భాగంగానే భారత సైన్యం ఔదార్యం ప్రదర్శించింది. నేపాల్ రాజధాని ఖాట్మాండులోని త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో భారత ఆర్మీ అధికారులు నేపాల్ సైనికాధికారులకు లక్ష డోసులను అందజేసినట్లు భారత రాయాబార కార్యలయం ట్వీట్ చేసింది. ఈ టీకా డోసులను ఇండియాలోనే తయారు చేశారు. భారత్ గతంలోనే నేపాల్‌కు 10 లక్షల డోసుల కరోనా టీకాలను ఇచ్చింది. చైనా తాజాగా 8 లక్షల డోసులను నేపాల్‌కు బహుమతిగా ఇచ్చింది. చదవండి: మోదీకి లేఖ రాసిన ఇమ్రాన్ ఖాన్ -
నేపాల్ కాల్పులు: భారత పౌరుడు మృతి
సీతామర్హి: భారత సరిహద్దులో నేపాల్ ఆర్మీ దుందుడుకు చర్యకు పాల్పడింది. ఇప్పటికే భారత్, నేపాల్ మధ్య సరిహద్దు వివాదం నడుస్తున్న వేళ.. నేపాల్ సైన్యం(ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్) సరిహద్దు దాటేందుకు ప్రయత్నించిన భారత పౌరులపై కాల్పులకు పాల్పడింది. ఈ కాల్పుల్లో ఓ యువకుడు మరణించగా ఇద్దరు వ్యక్తులు గాయాలపాలయ్యారు. ఈ ఘటన శుక్రవారం నేపాల్ సరిహద్దు ప్రాంతమైన బిహార్‌లోని సీతామర్హి జిల్లాలో చోటు చేసుకుంది. మరణించిన వ్యక్తిని బిహార్‌కు చెందిన రైతు వికేశ్ యాదవ్(22)గా గుర్తించారు. గాయాలపాలైన మరో ఇద్దరిని ఠాకూర్, ఉమేశ్ రామ్‌గా గుర్తించారు. (ఎవరెస్ట్ ఎత్తుపై చైనా అభ్యంతరం) వీరినీ సితామర్హిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం సరిహద్దులో పరిస్థితి అదుపులోకి వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా ఇక్కడ ఇరు దేశాల ప్రజజలు తమ బంధువులను కలిసేందుకు తరచూ సరిహద్దులు దాటుతూ ఉంటారు. కాగా ఉత్తరాఖండ్‌కు చెందిన మూడు ప్రాంతాలు లిపులేఖ్, కాలాపానీ, లింపియాధురాలను నేపాల్ వ్యూహాత్మకంగా తమ దేశ భూభాగంగా పేర్కొంటూ కొత్త మ్యాప్‌ను విడుదల చేసిన వివాదానికి తెర లేపిన విషయం తెలిసిందే. (సరిహద్దు వివాదం.. నేపాల్ మరింత ముందుకు) -
హవ్వా.. హీరోయిన్లకు సైనిక స్వాగతమా?
ఖాట్మాండు: బాలీవుడ్ తారలకు స్వాగతం పలకడంతో నేపాల్ సైన్యాధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై సైన్యాధికారుల వివరణ కోరాలని ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఆర్మీ చీఫ్ రాజేంద్ర చెత్రీ సతీమణి నేతృత్వంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు బాలీవుడ్ హీరోయిన్లు సొనాక్షి సిన్హా, మలైకా అరోరా శుక్రవారం నేపాల్ కు వచ్చారు. త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వీరికి సైనిక ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. బాలీవుడ్ భామలకు ఆర్మీ అధికారులు ఆహ్వానం పలకడంపై విమర్శలు రేగాయి. సైన్యం పరువు తీశారని, ఆర్మీ ప్రతిష్ఠను మంటగలిపారని విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ ఉదంతంపై నేపాల్ ప్రధాని కార్యాలయానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై వివరణ ఇవ్వాలని రక్షణ మంత్రిత్వ శాఖను పీఎంఓ ఆదేశించింది. అయితే ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి సమాచారం లేదని సైన్యాధికారులు తెలిపారు. హీరోయిన్లకు స్వాగతం పలకడంతో తప్పేంలేదని సమర్థించుకున్నారు.