హవ్వా.. హీరోయిన్లకు సైనిక స్వాగతమా? | Nepal Army Under Fire After Generals Receive Sonakshi Sinha, Malaika Arora At Airport | Sakshi
Sakshi News home page

హవ్వా.. హీరోయిన్లకు సైనిక స్వాగతమా?

Published Mon, May 16 2016 4:09 PM | Last Updated on Mon, Sep 4 2017 12:14 AM

Nepal Army Under Fire After Generals Receive Sonakshi Sinha, Malaika Arora At Airport

ఖాట్మాండు: బాలీవుడ్ తారలకు స్వాగతం పలకడంతో నేపాల్ సైన్యాధికారులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై సైన్యాధికారుల వివరణ కోరాలని ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. ఆర్మీ చీఫ్ రాజేంద్ర చెత్రీ సతీమణి నేతృత్వంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద సేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు బాలీవుడ్ హీరోయిన్లు సొనాక్షి సిన్హా, మలైకా అరోరా శుక్రవారం నేపాల్ కు వచ్చారు. త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వీరికి సైనిక ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.

బాలీవుడ్ భామలకు ఆర్మీ అధికారులు ఆహ్వానం పలకడంపై విమర్శలు రేగాయి. సైన్యం పరువు తీశారని, ఆర్మీ ప్రతిష్ఠను మంటగలిపారని విమర్శనాస్త్రాలు సంధించారు. ఈ ఉదంతంపై నేపాల్ ప్రధాని కార్యాలయానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై వివరణ ఇవ్వాలని రక్షణ మంత్రిత్వ శాఖను పీఎంఓ ఆదేశించింది. అయితే ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి సమాచారం లేదని సైన్యాధికారులు తెలిపారు. హీరోయిన్లకు స్వాగతం పలకడంతో తప్పేంలేదని సమర్థించుకున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement