నటి మలైకా అరోరా జీవన శైలి ఫ్యాషన్ తీరు తెన్నుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తన ఆశించదగిన వార్డ్‌రోబ్ కలెక్షన్, ఫ్యాషన్ స్టైల్‌కు ఫిదా కాని ఫాలోయర్లు, అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. తాజాగా గోవాలో హాలిడే ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. దీంతో ఇవి నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి
మలైకా అరోరా గోవాలో సేదతీరుతోంది. ఆల్-వైట్ కో-ఆర్డ్ సెట్‌లో సన్‌సెట్ టైంలో ఎరుపు పసుపు కలగలిసిన సూర్యాస్తమయ ఛాయలో అందంగా మెరిసింది. నడుము చుట్టూ సెమీ-షీర్ ఆఫ్-షోల్డర్ బ్లౌజ్ ,మెర్మైడ్-ఫిట్ స్కర్ట్‌తో, బీచ్‌సైడ్ స్టైల్‌లో కనిపించింది. ఈ దృశ్యాలు ఫ్యాన్స్‌ను మెస్మరైజ్ చేస్తున్నాయి. అంతకుముందు కూడా ఇటీవల సుప్రియా ముంజా డిజైన్ చేసిన ఐవరీ గౌనును ధరించి ఆకట్టుకుంది.
మలైకా అరోరా అన్ని సీజన్లలోనూ వైట్ కలర్‌కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. మరో సందర్బంలో వన్‌షోల్డర్‌లో గౌన్‌లో కనిపించి ఫ్యాన్స్ కళ్లను తనవైపు తిప్పుకుంది. వన్ సైడ్ కటౌట్ డిజైన్ ఈ డ్రెస్ హైలైట్.
అంతేకాదు మలైకాఅరోరా ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యత ఇస్తుంది. యోగాసనాలు, జిమ్‌లో వర్కౌట్లతో తన బాడీని ఫిట్‌గా ఉంచుకుంటుంది. ముఖ్యంగా సన్‌బాత్ తన ఫిట్‌నెస్ అండ్ సీక్రెట్ అని కూడా చెప్పవచ్చు.
సన్‌బాత్
లేలేత సూర‍్యకిరణాలతో డి విటమిన్ లభిస్తుంది. మితంగా సూర్యరశ్మి మన శరీరానికి తాకేలాగా సూర్యరశ్మి కాంతికి పడుకొని దానిని ఆస్వాదించడాన్ని సన్ బాత్ అంటారు. దీని వల్ల శరీరం చురుగ్గా ఉండేలా చేస్తుంది. సన్ బాత్ రెగ్యులర్‌గా చేస్తే వృద్ధాప్య ఛాయలు తొందరగా రావు. చర్మంపై ముడతలు మచ్చలు తగ్గిపోతాయి. దీనివల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. ఒత్తిడి తొలగి, మంచి నిద్ర పడుతుంది. మంచి శక్తి వస్తుంది. ఉదయం వేళల్లోగానీ, సాయం సంధ్యవేళ గానీ సూర్యునికి ఎదురుగా నిలబడి వ్యాయమాలు చేయడం, ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
మరోవైపు దాదాపు అయిదేళ్ల పాటు చెట్టాపట్టాలేసుకున్న లవ్‌బర్డ్స్ అర్జున్ కపూర్, మలైకా ఇటీవలే బ్రేకప్ చెప్పున్నట్టు ప్రకటించారు. అయితే వీరిద్దరూ ఒకే చోట కనిపించారు. దీంతో ఈ జంట మళ్లీ కలిసిపోయిందా అని పుకార్ల తెర లేచింది. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ దుండగుల కత్తిపోట్లకు గురై, ఆస్పత్రిలో చేరాడు. ఈ సమయంలో సైఫ్‌ను పరామర్శించేందుకు అర్జున్ కపూర్, మలైకా అరోరా కలిసి రావడం బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి విదితమే.
చదవండి: తేగలతో ఎన్ని ప్రయోజనాలో! ఇన్ని రకాలు ఎపుడైనా ట్రైచేశారా?
గొంతులో గర గర వేధిస్తోందా? ఈ చిట్కాలతో ఉపశమనం
Comments
Please login to add a commentAdd a comment