బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ ప్రస్తుతం 'మేరే హస్బెండ్ కీ బీవీ' మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్, భూమి పెడ్నేకర్ హీరోయిన్లుగా నటించారు. ఇటీవల విడుదలైన పోస్టర్లు చూస్తే ఫుల్ లవ్ అండ్ రొమాంటిక్ కామెడీ చిత్రంగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ నెలలోనే థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రచార కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు అర్జున్ కపూర్. తాజాగా ఓ ఈవెంట్‌కు హాజరయ్యారు. ఇందులో అర్జున్ కపూర్‌కు పెళ్లి గురించి ప్రశ్న ఎదురైంది. దీంతో తన వివాహం ప్రణాళికల గురించి నోరు మాట్లాడారు.
అర్జున్ కపూర్ మాట్లాడుతూ.."నా పెళ్లి ఎప్పుడు జరుగుతుందో అప్పుడు మీ అందరికీ తెలియజేస్తా. ఈ రోజు, సినిమా గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది సినిమా గురించి మాట్లాడుకునే సమయం. నా వ్యక్తిగత జీవితం గురించి కబుర్లు చెప్పుకోవడానికి తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. సమయం వచ్చినప్పుడు మీ అందరితో చెప్పడానికి వెనుకాడను. ఒక వ్యక్తిగా ఎలా ఉన్నానో మీ అందరికీ తెలుసు" అని అన్నారు.
కాగా.. కొద్ది నెలల క్రితమే బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరాతో బ్రేకప్ చేసుకున్నారు. దాదాపు కొన్నేళ్ల పాటు రిలేషన్‌లో వీరిద్దరు గతేడాది విడిపోతున్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. తాను సింగిల్‌గానే ఉన్నానని గతేడాది దీపావళి పార్టీలో అర్జున్ కపూర్ వెల్లడించాడు. ప్రస్తుతం అర్జున్ నటించిన మేరే హస్బెండ్ కీ బీవీ ఫిబ్రవరి 21న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రానికి ముదస్సర్ అజీజ్ దర్శకత్వం వహించారు. మేరే హస్బెండ్ కి బీవీ చిత్రంలో శక్తి కపూర్, అనితా రాజ్, డినో మోరియా, ఆదిత్య సీల్ కీలక పాత్రల్లో నటించారు.
Comments
Please login to add a commentAdd a comment