Arjun Kapoor Reacts on Rumours Over Marriage With Malaika Arora - Sakshi
Sakshi News home page

Arjun Kapoor: మలైకాతో పెళ్లిపై ఆసక్తిగా స్పందించిన అర్జున్‌ కపూర్‌!

Published Fri, May 20 2022 11:54 AM | Last Updated on Fri, May 20 2022 1:29 PM

Arjun Kapoor Respond On Rumours Over Marriage With Malaika Arora - Sakshi

బాలీవుడ్‌ నటి మలైకా అరోరా, హీరో అర్జున్‌ కపూర్‌ లవ్‌లో ఉన్నారన్న విషయం మనందరికీ తెలిసిందే! త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటిదాకా ప్రేమలో మునిగి తేలిన ఈ జంట త్వరలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకన్నారంటు బి-టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మలైకా మాట్లాడుతూ..  తామిద్దరం కలిసి నడవాల్సిన భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నామని, ఇది తనకు చాలా ముఖ్యమైనదంటూ చెప్పడంతో ఈ రూమర్స్‌కు మరింత బలం చేకూరింది.

చదవండి: చేసిన తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకున్నా: తమన్నా

దీంతో ఈ ఏడాది నవంబర్‌లో మలైకా-అర్జున్‌ పెళ్లి చేసుకోబోతున్నారంటూ బి-టౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా మలైకతో పెళ్లి వార్తలపై స్పందించాడు అర్జున్‌ కపూర్‌. ఈ మేరకు అతడు తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఆసక్తికర పోస్ట్‌ షేర్‌ చేశాడు. ‘లవ్‌.. నా జీవితం గురించి నాకంటే ఎక్కువ ప్రతి ఒక్కరికి తెలుసని ఎలా అనిపిస్తుందో’ అంటూ నవ్వుతున్న ఎమోజీని జత చేశాడు. ఇది చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

చదవండి: త్రివిక్రమ్‌, మహేశ్‌ సినిమాలో మరో స్టార్‌ హీరో!

దీని అర్థం ఏంటని.. అంటే మలైకా, అర్జున్‌ పెళ్లి చేసుకోవడం లేదా? అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. కాగా సోషల్‌ మీడియాలో, ఇంటర్య్వూల్లో అర్జున్‌, మలైకాలు ఒకరిపై ఒకరు తరచూ ప్రేమను వ్యక్త పరుచుకుంటూ ఉంటారు. ఇద్దరి సన్నిహితంగా ఉన్న ఫొటోలను ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తుంటారనే విషయం తెలిసిందే. ఇక అర్జున్‌తో పెళ్లిపై మలైకా స్పందిస్తూ.. మా ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి. అందుకే కలిసి జీవితాన్ని కొనసాగించచాలని అనుకుంటున్నాం. ఆ క్షణంగా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం’ అని మలైకా చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement