హాట్ బ్యూటీతో విడిపోవడంపై క్లారిటీ ఇచ్చిన హీరో | Arjun Kapoor Confirms Breakup With Malaika Arora At Latest Diwali Event, Post Viral | Sakshi
Sakshi News home page

Arjun Kapoor Breakup: ఔను.. ఆ హీరో-నటి నిజంగానే విడిపోయారు

Oct 29 2024 3:36 PM | Updated on Oct 29 2024 3:56 PM

Arjun Kapoor Confirms Breakup With Malaika Arora

ప్రేమలో పడటం, రిలేషన్‌షిప్‌లో ఉండటం, కొన్నాళ్లకు బ్రేకప్ చెప్పడం.. ఇలాంటివి బాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. కొన్ని బయటపడతాయి. కొన్ని బయటపడవ్ అంతే! తాజాగా హీరో అర్జున్ కపూర్ తన బ్రేకప్ గురించి క్లారిటీ ఇచ్చేశాడు. మలైకా అరోరాతో విడిపోవడం గురించి బయటపెట్టాడు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)

ఐటమ్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న మలైకా అరోరా.. సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్భాజ్ ఖాన్‌ని 1998లోనే పెళ్లి చేసుకుంది. కానీ మనస్పర్థల కారణంగా 2017లో విడాకులు తీసుకుంది. ఇది జరిగిన ఏడాదికే హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్ మొదలుపెట్టింది. వీళ్లిద్దరూ కలిసే ఉన్నారు. చాలా ఫారెన్ టూర్స్‌కి వెళ్లారు. ఆయా ఫొటోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి.

మరి ఏమైందో ఏమో గానీ కొన్నాళ్ల క్రితం ఇద్దరూ ఎవరికీ వాళ్లు దూరం పాటించారు. దీంతో బ్రేకప్ అనే రూమర్స్ వచ్చాయి. కొన్నిరోజుల క్రితం మలైకా తండ్రి చనిపోతే ఆమెకు అర్జున్ అండగా నిలిచాడు. ఈ క్రమంలోనే మళ్లీ కలిసిపోయారని అందరూ అనుకున్నారు. తాజాగా దీపావళి ఈవెంట్‌లో పాల్గొన్న అర్జున్ కపూర్.. మైక్‪‌లో మాట్లాడుతున్న టైంలో 'మలైకా ఎలా ఉంది?' అని ఒకరు అడిగారు. దీంతో తాను ప్రస్తుతం సింగిల్‌గానే ఉన్నానని బదులిచ్చాడు. అంటే బ్రేకప్‌ని కన్ఫర్మ్ చేసినట్లే.

(ఇదీ చదవండి: తెలుగు నిర్మాత.. హైదరాబాద్‌లోని చెరువులో దూకేశాడు: శ్రియ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement