తెలుగు నిర్మాత.. హైదరాబాద్‌లోని చెరువులో దూకేశాడు: శ్రియ | Shriya Saran Comments On NTR Movie Producer Issue | Sakshi
Sakshi News home page

Shriya Saran: పాత ఇంటర్వ్యూ.. ఇప్పుడెందుకు వైరల్ చేస్తున్నారు?

Published Tue, Oct 29 2024 1:06 PM | Last Updated on Tue, Oct 29 2024 1:15 PM

Shriya Saran Comments On NTR Movie Producer Issue

తెలుగులో ఫ్యాన్ వార్స్ మరీ ఎక్కువైపోతున్నాయి. ఓ హీరోని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్న కొందరు.. కావాలని మరో హీరోలని ట్రోల్ చేస్తుంటారు. ఇప్పుడు అలానే ఎన్టీఆర్‌ని ట్రోల్ చేస్తున్నారు. ఎనిమిది నెలల క్రితం ఓ వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం హీరోయిన్ శ్రియ.. హిందీ ఇంటర్వ్యూలో పాల్గొంది. సినిమా పేరు చెప్పలేదు గానీ ఓ తెలుగు నిర్మాత.. షూటింగ్ చివరిరోజు డబ్బులివ్వలేక హుస్సేన్ సాగర్‌లో దూకేశాడన చెప్పింది. ఆ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

(ఇదీ చదవండి: జూనియర్ ఎన్టీఆర్ 'దేవర'.. ఆ సూపర్ హిట్ సాంగ్‌ వచ్చేసింది!)

శ్రియ ఏమందంటే?
'నేను, జెనీలియా, ఎన్టీఆర్ కలిసి ఓ పెద్ద సినిమా చేశాం. దీనికి నిర్మాత చేసిన ఆయన చాలా ఫన్నీ. చాలా మంచివాడు. అయితే షూటింగ్ చివరిరోజు మిగిలిన రెమ్యునరేషన్ గురించి అడిగేందుకు వెళ్లాం. కానీ అప్పటికే ఆయన (నిర్మాత) హైదరాబాద్‌లోని చెరువులో(హుస్సేన్ సాగర్) దూకేశాడు. అదృష్టవశాత్తూ ఆయనకు ఏం కాలేదు. అక్కడే ఉన్న ఎవరో ఇద్దరు ముగ్గురు ఆయన్ని కాపాడారు. ఆ తర్వాత మరి నేను పేమెంట్స్ గురించి అడగలేదు' అని శ్రియ చెప్పింది.

'నా అల్లుడు' సినిమా నిర్మాత గురించే శ్రియ చెప్పింది. చెరువులు దూకడం, ప్రాణాలతో బయటపడటం లాంటి విషయాల్ని ఈమె చెబుతూ నవ్వేసింది. సరే ఇదంతా పక్కనబెడితే ఇప్పుడెందుకు ఎన్టీఆర్ టార్గెట్ చేసేలా ఈ వీడియోని వైరల్ చేస్తున్నారనేది అర్థం కావట్లేదు. ఈ సందర్భంగా 'నరసింహుడు' మూవీ ప్రొడ్యూసర్ కూడా గతంలో చెరువులో దూకిన విషయమై తారక్‌ని పలువురు యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 15 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement