జూనియర్ ఎన్టీఆర్ 'దేవర'.. ఆ సూపర్ హిట్ సాంగ్‌ వచ్చేసింది! | Daavudi Full Video Song Out Now From Jr. NTR Movie Devara: Part 1 | Sakshi
Sakshi News home page

Devara Movie: జూనియర్ ఎన్టీఆర్ 'దేవర'.. దావూదీ సాంగ్ వచ్చేసింది!

Oct 28 2024 7:08 PM | Updated on Oct 28 2024 7:26 PM

Jt NTR Devara Movie Hit Song Davudi Full Song Out Now

జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో వచ్చి యాక్షన్‌ చిత్రం 'దేవర'. ఈ మాస్ యాక్షన్‌ మూవీ సెప్టెంబర్ 27న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్‌ హిట్‌గా నిలిచింది. విడుదలైన కొద్ది రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. ఈ మూవీ రిలీజై నెల రోజులైనప్పటికీ థియేటర్లలో దూసుకెళ్తోంది.

తాజాగా ఈ మూవీ నుంచి ఫేవరేట్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. దావూదీ అంటూ సాగే మాస్‌ సాంగ్‌ ఫుల్ వీడియోను ఫ్యాన్స్‌కు అందుబాటులోకి వచ్చేసింది. ఈ పాటలో హీరో ఎన్టీఆర్, జాన్వీ కపూర్‌తన డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. ఇప్పటికే విడుదలైన పాటలకు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. మీరు కూడా దావూదీ ఫుల్ సాంగ్‌ను చూసి ఎంజాయ్ చేయండి. 
 

Advertisement
 
Advertisement
Advertisement