హీరోయిన్‌పై బ్రేకప్ రూమర్స్.. ఆ ఒక్క వీడియోతో ! | Malaika Arora and Arjun Kapoor go on lunch date Amid breakup rumours | Sakshi
Sakshi News home page

Malaika Arora: లవర్‌తో బ్రేకప్ రూమర్స్.. ఆ వీడియోతో గట్టిగా ఇచ్చిపడేసింది!

Published Sun, Aug 27 2023 5:10 PM | Last Updated on Sun, Aug 27 2023 6:39 PM

Malaika Arora and Arjun Kapoor go on lunch date Amid breakup rumours - Sakshi

బాలీవుడ్ భామ మలైకా అరోరా ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఆమె తన ప్రియుడు అర్జున్ కపూర్‌తో బ్రేకప్ చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైన సంగతి తెలిసిందే. బ్రేకప్ రూమర్స్ వస్తున్న నేపథ్యంలో మలైకా ఆరోరా గట్టి సమాధానం ఇచ్చారు.  ఆదివారం అర్జున్‌ కపూర్‌తో లంచ్ డేట్‌కు వెళ్లి మలైకా ఆరోరా రూమర్స్‌కు చెక్ పెట్టారు. తాజాగా ముంబయిలోని ఓ రెస్టారెంట్‌ నుంచి ఈ జంట బయటకు వస్తూ కనిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.  

(ఇది చదవండి: 'పుష్ప' లాంటి స్టోరీతో మరో సినిమా)

కాగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో సోదరీమణులు అన్షులా కపూర్, జాన్వీ కపూర్‌లతో సహా అర్జున్ కుటుంబాన్ని మలైకా అన్‌ఫాలో చేయడంతో వీరిద్దరి రిలేషన్‌పై రూమర్స్ వచ్చాయి. కాగా.. ఇటీవలే తన భర్త జోరావర్ సింగ్ అహ్లువాలియాతో విడాకులు తీసుకున్న నటి కుషా కపిలాతో అర్జున్‌కి రిలేషన్ ఉందన్న వార్తల నేపథ్యంలో ఈ గాసిప్స్ వినిపించాయి. అయితే ఈ విషయాన్ని కుషా కపిలా తీవ్రంగా ఖండించింది. కాగా.. గతంలో తామిద్దరం కలిసి జీవించాలనుకుంటున్నామని.. తమ బంధాన్ని భవిష్యత్తులోనూ కొనసాగించాలని భావిస్తున్నట్లు మలైకా వెల్లడించింది. 
 

మలైకా అరోరా బాలీవుడ్‌లో స్టార్ హీరోలందరితో సినిమాల్లో నటించింది. అయితే  2008లో ఈమె మాజీ భర్త అర్బాజ్ ఖాన్ తో కలిసి అర్బాజ్ ఖాన్ ప్రొడక్షన్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను కూడా స్థాపించింది. ఈ సంస్థ దబాంగ్ పేరుతో సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో వరస చిత్రాలని నిర్మించింది. ఆ తర్వాత 2017తో తన భర్తతో విడాకులు తీసుకున్న మలైకా.. ప్రస్తుతం అర్జున్ కపూర్‌తో రిలేషన్‌లో ఉంది. 

(ఇది చదవండి: అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన కిచ్చా.. ఆ లుక్‌తో కనిపించి! )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement