Malaika Arora Breaks Down As She Recalls Divorce With Arbaaz Khan - Sakshi
Sakshi News home page

Malaika Arora: ఇంటి నుంచి వెళ్లి పోవాలని పెళ్లి చేసుకున్నా.. మలైకా అరోరా

Published Tue, Dec 6 2022 4:40 PM | Last Updated on Tue, Dec 6 2022 5:55 PM

Malaika Arora breaks down as she recalls divorce with Arbaaz Khan - Sakshi

బాలీవుడ్ నటి మలైకా అరోరా గురించి పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఆమె ఓటీటీలో పలు సిరీస్‌ల్లో నటిస్తోంది. ఇటీవల ఓ ఎపిసోడ్‌లో నటుడు అర్బాజ్‌ ఖాన్‌తో విడాకులపై ఆమె స్పందించారు. డిసెంబర్‌ 5న విడుదలైన సిరీస్‌లో ఆమె వ్యక్తిగత జీవిత విషయాలను పంచుకున్నారు. ఈ ఎపిసోడ్‌లో చిత్ర నిర్మాత, కొరియోగ్రాఫర్ ఫరా ఖాన్‌ ముఖ్యఅతిథిగా హాజరై మలైకాను ప్రశ్నించారు. 

జీవితంలో విభిన్నమైన విషయాలను కోరుకున్నట్లు మలైకా వెల్లడించింది. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలని భావించి పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు తెలిపింది. అయితే జీవితంలో భిన్నమైన అంశాలు కోరుకోవడం వల్లే తాము విడిపోయినట్లు మలైకా స్పష్టం చేసింది. ఈ సందర్భంగా మాజీ భర్త అర్బాజ్‌ ఖాన్‌ను ఆమె కొనియాడింది. 

మలైకా మాట్లాడుతూ.. 'అతను నన్ను ఓ వ్యక్తిగా మార్చాడు. అతని వల్లే నేను ఈ రోజు ఇలా ఉన్నానని నాకు  అనిపిస్తుంది. నేను కూడా విభిన్నమైన విషయాలను కోరుకున్నా. జీవితం ఎక్కడో గాడి తప్పినట్లు నేను భావించా.  అయినా నేను ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. నేను నిజంగా కొన్ని బంధాలను వదులుకోగలిగితే అలా చేయగలనని భావించా.' అంటూ వివరించింది.

మరోవైపు  బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ కపూర్‌, మలైకా అరోరా ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. వెకేషన్స్‌, పార్టీ, ఫంక్షన్స్‌ ఇలా ప్రతీ వేడుకకు కలిసే హాజరవుతుంటారు. బీటౌన్‌లో మలైకా-అర్జున్‌ల జోడికి ప్రత్యేక స్థానం ఉంది. ఇక సినిమాల కంటే డేటింగ్‌ వార్తలతో టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిన ఈ జంట త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతున్నారని టాక్. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement