
బాలీవుడ్ నటి, మాజీ మిస్ యూనివర్స్ సుష్మితా సేన్(Sushmita Sen) గురించి పరిచయం అక్కర్లేదు. ఆమె చివరిసారిగా తాలీ వెబ్ సిరీస్‌లో కనిపించింది. గౌరీ సావంత్ జీవితం ఆధారంగా నిర్మించారు. అంతకుముందు ఆర్య వెబ్ సిరీస్‌తో అభిమానులను అలరించింది ఈ 49 ఏళ్లు బాలీవుడ్ భామ. అయితే తాజాగా తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా మాట్లాడింది. ఈ సందర్భంగా ఆమెను పెళ్లి గురించి ప్రశ్నించగా దానిపై స్పందించింది. తాను కూడా పెళ్లి చేసుకునేందుకు ఆసక్తిగా ఉన్నానని తెలిపింది. అయితే సరైన భాగస్వామి దొరకాలి కదా? అని వెల్లడించింది.
తన అభిమాని ప్రశ్నకు స్పందిస్తూ.. "నేను కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నాకు సరైన వ్యక్తి దొరకాలి కదా. మనం అనుకున్న వెంటనే పెళ్లి జరిగదు కదా. ఎందుకంటే ఇది రెండు హృదయాలకు సంబంధించింది. అతనితో ప్రేమ, సంబంధం నా హృదయానికి నచ్చాలి. అప్పుడే నేను కూడా పెళ్లి చేసుకుంటా' అని తెలిపింది సుస్మితా సేన్. కాగా.. గతంలో నటుడు రోహ్మన్ షాల్‌తో ప్రేమాయణం కొనసాగించింది ముద్దుగుమ్మ.
(ఇది చదవండి: మూడేళ్లుగా సింగిల్‌గానే.. నా కూతురు పెళ్లి చేసుకోనివ్వట్లేదు)
దాదాపు మూడు సంవత్సరాలు డేటింగ్ తర్వాత 2021లో అతనితో బంధానికి గుడ్‌బై చెప్పేసింది. అంతకుముందు ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీతో రిలేషన్‌లో ఉన్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2022లో లలిత్ మోడీ సుష్మితా సేన్‌ను తన "బెటర్ హాఫ్"గా పరిచయం చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. ఆ తర్వాత సుస్మితా సేన్ మాట్లాడుతూ అదంతా గతమని కొట్టిపారేసింది. కాగా.. సుష్మితా సేన్.. 2000వ సంవత్సరంలో రెనీ అనే అమ్మాయిని దత్తత తీసుకుంది. 2010లో అలీసాను దత్త తీసుకుని పెంచుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment